
ప్రేమను కొన్నిసార్లు సందర్భానుసారం బహుమతుల రూపంలో వ్యక్తపరచాల్సి ఉంటుంది. లూలియా వంటూర్‌కి కూడా అలాంటి సందర్భం మొన్నొచ్చింది. ఇంతకీ లూలియా వంటూర్ ఎవరబ్బా? అనుకోకండి. సల్మాన్ ఖాన్ (భాయ్) ఫ్యాన్స్ అంతా ప్రస్తుతం బాబీ బాబీ (వదిన) అని పిలుచుకుంటున్న భామ లూలియా వంటూర్.
ఈ రొమేనియన్ బ్యూటీ కోసం భాయ్ రోమియో అయిపోయారని బాలీవుడ్ టాక్. గురువారం సల్మాన్ ఖాన్ బర్త్‌డే. ఈ బర్త్‌డేకు గిఫ్ట్‌గా క్రాస్‌లాకెట్ (ఏసు క్రీస్తు బొమ్మ ఉన్న శిలువ) ఉన్న గోల్డ్ చైన్‌ను ప్రజెంట్ చేశారు లూలియా. అంతేకాదు ఫామ్‌హౌస్‌లో సల్మాన్ హోస్ట్ చేసిన పార్టీలో ఆయన పక్కనే ఉంటూ గెస్ట్‌లను రిసీవ్ చేసుకున్నారట. ఇప్పుడైతే ప్రియ నేస్తానికి లాకెట్ ఇచ్చారు. మరి.. పెళ్లితో ఈ ఇద్దరూ ఎప్పుడు లాక్ అవుతారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment