Special Gift
-
సీఎం వైఎస్ జగన్‌కు వికలాంగుడు ప్రత్యేక బహుమతి
-
భారత ప్రధానికి అమెరికా అధ్యక్షుడి అపురూప కానుక
వాషింగ్టన్: అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అపురూపమైన బహుమతినిచ్చారు. వైట్ హౌస్ లో జరిగిన ఇరుదేశాల పారిశ్రామికవేత్తల సమావేశంలో ఒక టీషర్టును మోదీకి కానుకగా ఇచ్చారు. దాని మీద AI అంటే అమెరికా ఇండియా భవిష్యత్తు అని మోదీ సరికొత్తగా నిర్వచించిన మాటలను ముద్రించారు. అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు యూఎస్ కాంగ్రెస్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. AI అంటే అది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధస్సు) కానివ్వండి అమెరికా ఇండియా కానివ్వండి. భవిష్యత్తు అంతా AI నే.. అని అన్నారు. అనంతరం ఇరుదేశాలకు చెందిన బడా పారిశ్రామికవేత్తలు పాల్గొన్న సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ఒక టీషర్ట్ మీద మోదీ చెప్పిన ఆ మాటలనే ముద్రించి కానుకగా ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు కానుక ఇచ్చిన ఆ ఫోటోను ప్రధాని తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసి ఐక్యంగా పని చేస్తే ఈ భూమి కంటే గొప్ప ప్రదేశం మరొకటి ఉండదని, అమెరికా భారత్ రెండు AI మాదిరిగానే శక్తివంతంగా తయారవుతున్నాయని రాశారు. ఈ సమావేశంలో అమెరికా పారిశ్రామికవేత్తలు మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల, గూగుల్ అధినేత సుందర్ పిచ్చై, ఆపిల్ సీఈవో టిమ్ కుక్, ఒపెన్ AI సీఈవో సామ్ ఆల్ట్ మాన్,ఏఎండి సీఈవో లిసా సు, నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ లతో పటు భారత పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, ఆనంద్ మహీంద్రా, నిఖిల్ కామత్, వృందా కపూర్ లు కూడా పాల్గొన్నారు. AI is the future, be it Artificial Intelligence or America-India! Our nations are stronger together, our planet is better when we work in collaboration. pic.twitter.com/wTEPJ5mcbo — Narendra Modi (@narendramodi) June 23, 2023 ఇది కూడా చదవండి: వైట్‌హౌస్ డిన్నర్‌కోసం కడుపు మాడ్చుకున్నా..ఆసాంతం అద్భుతం: ఆనంద్ మహీంద్ర -
సీఎం జగన్ కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన వైఎస్ఆర్ సీపీ నేతలు
-
ప్రెగ్నెంట్ కావడంతో ఉపాసనకి అలాంటి గిఫ్ట్ పంపిన ఆలియా భట్
రామ్‌చరణ్-ఉపాసన త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. పెళ్లైన 11 ఏళ్లకు ఉపాసన తొలిసారి గర్బం దాల్చింది. దీంతో పుట్టబోయే బిడ్డ కోసం మెగా ఫ్యామిలీ సహా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఐదు నెలల గర్భవతిగా ఉన్న ఉపాసన ఎక్కువగా భర్తతో వెకేషన్‌కు వెళ్తూ సమయం గడుపుతుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన పలు విషయాలను షేర్ చేస్తుంటుంది. ఇటీవలె బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ ఉపాసన కోసం ఓ క్యూట్ బహుమతిని పంపించింది. ప్రస్తుతం ఆలియా Ed-a-Mamma నుంచి అనే క్లోతింగ్ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గానే ఆమె ఎన్టీఆర్ పిల్లలకు దుస్తులు పంపించింది. తాజాగా ఉపాసనకు, పుట్టబోయే బేబీకి సంబంధించిన దుస్తులను పంపించింది. ఈ విషయాన్ని స్వయంగా ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఆలియాకు థ్యాంక్స్ చెప్పింది. కాగా ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఆలియా భట్ రామ్‌చరణ్ సరసన నటించిన సంగతి తెలిసిందే. -
సమంతకు క్రిస్మస్ స్పెషల్ గిఫ్ట్ పంపిన హీరో.. ఎమోషనల్ అయిన సామ్
సమంత ప్రస్తుతం మయోసైటిస్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్స్‌కి బ్రేక్ ఇచ్చిన సామ్ ప్రస్తుతం చికిత్స తీసుకుంటుంది. ఇప్పుడైతే కొత్త సినిమాలేవీ సైన్ చేయట్లేదట. కానీ వీలైనంత త్వరగా ఖుషీ సినిమా మాత్రం పూర్తి చేయాలని భావిస్తుందట. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత మాత్రం కొద్దిరోజులు సినిమాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే సమంతకు హీరో, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఓ పవర్ఫుల్ మెసేజ్ ఉన్న ఓ స్పెషల్ గిఫ్ట్‌ను పంపాడు. అందులో ఏముందంటే.. ''చీకటితో కూడిన సొరంగం..వెలుతురు ఆనవాళ్లు కూడా లేవు. అడుగులు భారంగా మారినా శక్తినంతా కూడదీసుకుని ముందుకు సాగుతావు. భయాలు, సందేహాలు పక్కనపెట్టి సోల్జర్లా మారతావు. ఎందుకంటే నువ్వొక ఉక్కు మనిషివి. ఈ విజయం నీ జన్మహక్కు. ప్రస్తుతం నీ దారి చీకటిగా ఉండొచ్చు కానీ, త్వరలోనే అది ప్రకాశిస్తుంది. నువ్వొక యోధురాలివి, నిన్ను ఏదీ ఓడించలేదు. ఇలాంటివి నిన్ను ఇంకా బలపడేలా చేస్తాయని, ఎప్పటికీ బలంగా ఉండేలా చేస్తాయి'' అంటూ స్ట్రాంగ్ మెసేజ్‌తో కూడిన ఫలకాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఇది చూసి ఎమోషనల్ అయిన సమంత థ్యాంక్యూ అంటూ ఈ ఫోటోను షేర్చేసింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
కాబోయే భార్యకు రణ్‌బీర్ కాస్ట్లీ గిఫ్ట్! అదేంటో తెలుసా?
Ranbir Kapoor Costly Gift To Alia Bhatt On Wedding: బాలీవుడ్ ప్రేమ జంట రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ పెళ్లి వేడుకలు షురూ అయ్యాయి. ముంబై బాంద్రాలోని రణ్‌బీర్ ఇంటిలో నేడు (గురువారం) వీరిద్దరి వివాహం జరగనుంది. పెళ్లి వేడుకల్లో భాగంగా బుధవారం ఉదయం రణ్‌బీర్–ఆలియా ముందుగా పితృపూజ చేశారు. ఆ తర్వాత మెహందీ ఫంక్షన్ మొదలుపెట్టారు. బుధవారం రాత్రి సంగీత్ ఫంక్షన్ జరిగింది. ఇప్పటికే రణ్‌బీర్, ఆలియా కుటుంబాలకు చెందిన కీలక సభ్యులంతా రణ్‌బీర్ ఇంటికి చేరుకున్నారు. దాదాపు 50 మంది ఇరు కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహం జరగనుంది. చదవండి: స్పెషల్ హీరోయిన్.. సో స్సెషల్ కాబోయే భార్యకు రణ్‌బీర్ స్పెషల్ గిఫ్ట్ వజ్రాల బ్యాండ్... ఆలియా కోసం రణబీర్ ప్రత్యేకంగా ఓ బహుమతి తయారు చేయించారట. 8 వజ్రాలు పొదిగిన ఖరీదైన వెడ్డింగ్ బ్యాండ్ అది. పెళ్లిలో ఆలియా తన చేతికి ఆ బ్యాండ్ ధరించనున్నారు. కాగా కపూర్ ఇంటి కుటుంబానికి 8 లక్కీ నంబర్ అట. అందుకే కాబోయే శ్రీమతికి ఎనిమిది వ్రజాలు పొదిగిన బ్యాండ్‌ని రణ్‌బీర్ బహూకరించి ఉంటారు. రొమాంటిక్ సాంగ్... రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘బ్రహ్మాస్త్ర’. ఇందులో అమితాబ్ బచ్చన్, నాగార్జున, డింపుల్ కపాడియా కీలక పాత్రలు పోషించారు. మూడు భాగాలుగా ఈ చిత్రం విడుదల కానుంది. రణ్‌బీర్, ఆలియా వివాహం సందర్భంగా ‘బ్రహ్మాస్త్ర’ తొలి భాగం నుంచి ‘కేసరియా...’ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్‌ను విడుదల చేసి, కాబోయే దంపతులకు చిత్రబృందం శుభాకాంక్షలు తెలియజేసింది. చదవండి: అందుకే మీకు చరణ్ డామినేషన్ ఎక్కువ ఉందనిపిస్తుంది -
కప్ గెలుస్తారో లేదో తెలీదు.. మా మనసులు దోచుకున్నారు
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరు పొందిన ముంబై ఇండియన్స్ తాజా చర్యతో అభిమానుల మనసులు గెలుచుకుంది. కరోనా కారణంగా ఈసారి సీజన్‌ను ముంబై, పూణే వేదికగా నిర్వహించనున్న సంగతి తెలిసిందే. వాంఖడే, డీవై పాటిల్, సీసీఐ బ్రబౌర్న్ స్టేడియాల్లోనే ఈసారి మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభానికి మరో 8 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో హోలీ పండుగ పురస్కరించుకొని ముంబై ఇండియన్స్.. ఐపీఎల్లో ఉన్న మిగతా 9 జట్లకు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపింది. రోహిత్ శర్మ సారధ్యంలోని ముంబై ఇండియన్స్.. ముంబై రోడ్లలో బిల్‌బోర్డులను ఏర్పాటు చేసి ఆయా ప్రాంచైజీలకు స్వాగతం పలికింది. 9 జట్లకు తొమ్మిది రకాల స్లోగన్స్ ఇచ్చి వారిని ఉత్సాహపరుస్తూ వచ్చింది. మరి ముంబై ఇండియన్స్ ఇచ్చిన 9 స్లోగన్స్‌ను ఇప్పుడు చూద్దాం. రాజస్తాన్ రాయల్స్- వెల్కమ్.. హల్లా బోల్.. దిల్ కోల్ కే ఎస్ఆర్హెచ్- వెల్కమ్.. షైన్ కరో.. దిల్ కోల్ కే.. దిల్ కోల్ కే కేకేఆర్- వెల్కమ్.. కోర్బో..లోర్బో.. జీత్బో.. దిల్ కోల్ కే లక్నో సూపర్ జెయింట్స్- వెల్కమ్.. కేల్ నవాబీ.. దిల్ కోల్ కే ఢిల్లీ క్యాపిటల్స్- వెల్కమ్.. కేలో ధిల్లీ..దిల్ కోల్ కే పంజాబ్ కింగ్స్- వెల్కమ్.. చక్ దే పత్తే.. దిల్ కోల్ కే గుజరాత్ టైటాన్స్- వెల్కమ్.. మజా థీ రామ్‌జో.. దిల్ కోల్ కే సీఎస్కే- వెల్కమ్.. విజిల్ పోడూ.. దిల్ కోల్ కే ఆర్సీబీ- వెల్కమ్.. ప్లే బోల్డ్.. దిల్ కోల్ కే ముంబై ఇండియన్స్ చేసిన పనిని క్రికెట్ ఫ్యాన్స్ తెగమెచ్చుకుంటున్నారు. మీరు కప్ గెలుస్తారో లేదో తెలియదు కానీ మా మనసులు మాత్రం గెలిచేశారు.. లవ్ యూ ముంబై అంటూ కామెంట్ చేశారు. ఇక గత సీజన్లో అంతగా ఆకట్టుకోని ముంబై ఇండియన్స్ ఈసారి సరికొత్త ప్రణాళికతో బరిలోకి దిగనుంది. ఇక మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్‌ను మార్చి 27న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది. చదవండి: PAK vs AUS: 24 ఏళ్ల క్రితం రాళ్లు రువ్వారు.. కట్‌చేస్తే IPL 2022: 'దీపక్ చాహర్ స్ధానాన్ని భర్తీ చేసే సత్తా అతడికే ఉంది' Ravichanran Ashwin: ‘రెండో ఆలోచన వద్దు.. రనౌట్ చేసేయండి’ -
ప్రధాని మోదీకి చిన్న జీయర్ స్వామి ప్రత్యేక బహుమతి
-
అల్లు అర్జున్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన రష్మిక
Rashmika Gives Surprise To Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ మొదటి పార్ట్ షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతోంది. దీంతో కాస్తా పుష్ప షూటింగ్‌కు బ్రేక్ పడగా ప్రమోషన్ కార్యక్రమాల్లో మూవీ టీం బిజీగా ఉంది. త్వరలో టీజర్, డిసెంబర్ 17న ‘పుష్ప.. ది రైజ్’ పార్ట్ 1 విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో రష్మిక అల్లు అర్జున్‌కు సర్ప్రైజ్ ఇచ్చింది. త్వరలో పుష్ప మూవీ విడుదల కాబోతోన్న నేపథ్యంలో బన్నీకి స్పెషల్ గిఫ్ట్ పంపింది. చదవండి: వైరల్ అవుతోన్న కమెడియన్ రఘు షాకింగ్ వీడియో! ‘మూవీ త్వరలో విడుదల కాబోతోంది కదా సార్.. స్పెషల్‌గా ఏదైన పంపించాలనిపించింది. అందుకే ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ మీ కోసం’ అంటూ చేతితో రాసి నోట్‌తో పాటు కొన్ని వస్తువులను బాక్స్‌లో పెట్టి పంపించింది. దీనిని అల్లు అర్జున్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ రష్మికకు ధన్యవాదాలు తెలిపాడు. అవి చూస్తుంటే పుష్ప షూటింగ్లో ఉపయోగించిన చిన్న చిన్న వస్తువులను అందంగా అలంకరించి రష్మిక గిఫ్ట్ పంపినట్లు ఉందంటూ నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. మరి ఆ స్పేషల్ గిఫ్ట్ ఏంటో మీరు కూడా ఓసారి చూసేయండి.. చదవండి: పుష్ప ట్రైలర్ టీజ్ అవుట్, మామూలుగా లేదుగా.. చదవండి: రాజ‘శేఖర్’ మూవీకి ఓటీటీ షాకింగ్ రేట్స్! మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్, ముత్తమ్ శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో సునీల్ మంగళం శ్రీనుగా కనిపించబోతుండగా..ఇప్పటికే విడుదలైన లుక్ స్టన్నింగ్‌గా ఉంది. మరోవైపు యాంకర్ , నటి అనసూయ దాక్షాయణి పాత్రలో నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. -
చిరు గిఫ్ట్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.. బాబీ ఎమోషనల్ ట్వీట్
పవర్ సినిమాతో దర్శకుడిగా పరిచియమైన కె ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ తన ఫస్ట్ సినిమాతోనే పవర్ఫుల్ సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత కూడా స్టార్ హీరోలతోనే సాలిడ్ సినిమాలు చేస్తూ సక్సెస్ఫుల్ జర్నీ చేస్తున్నాడు.. తాజాగా తన అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ పట్టేశాడు...ఈరోజు(ఆగస్ట్ 1) బాబీ బర్త్ డే. ఈ సందర్భంగా చిరంజీవిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నాడు బాబీ. ఇక పుట్టిన రోజు సందర్భంగా తన దగ్గరకు వచ్చిన బాబీకి ఓ ప్రత్యేకమైన కలాన్ని బహుమతిగా ఇచ్చాడు చిరంజీవి. అయితే ఇలా ఓ అభిమాని స్థాయి నుంచి దర్శకుడిగా చిరంజీవి చేతుల మీదుగా గిఫ్ట్ తీసుకోవడంతో బాబీ భావోద్వేగానికి గురైయ్యాడు. ఈ బహుమతి ఎప్పటికీ గుర్తుండిపోతుందంటూ చిరు గిఫ్ట్ వీడియోని ట్వీటర్లో పోస్ట్ చేశాడు. Thank you so much our dearest Megastar! A memorable birthday with the blessings from my idol himself @KChiruTweets garu, A fan in the millions to the man to direct you. It's truly a dream come true moment to me and I'm very thankful for this! Special thanks for the gift, sir!❤️ pic.twitter.com/eEqcmX1wcI — Bobby (@dirbobby) August 1, 2021 -
అత్తింటి సారె: వామ్మో.. అల్లుడి కళ్లు బైర్లు కమ్మేలా..
యానాం: నవ వధువు ఇంటి నుంచి అత్తారింటికి ఆదివారం పంపిన ఆషాఢ కావిడి ఇది. స్థానిక వ్యాపారవేత్త తోట రాజు కుమారుడు పవన్‌కుమార్‌కు రాజమహేంద్రవరానికి చెందిన బత్తుల బలరామకృష్ణ కుమార్తె ప్రత్యూషాదేవికి గత నెల 21న వివాహమైంది. ఆషాఢ కావిళ్లుగా 100 రకాల స్వీట్లు, వెయ్యి కిలోల చొప్పున పండుగొప్ప చేపలు, కొరమేనులు, కూరగాయలు, 250 కిరాణా సరకులు, 1500 కిలోల చెరువు చేపలు, 350 కిలోల రొయ్యలు, 250 కిలోల బొమ్మిడాయిలు, 10 మేకపోతులు, 50 పందెం పుంజులు ఊరేగింపుగా తీసుకురావడం స్థానికంగా ఆశ్చర్యానికి గురిచేసింది. బిందెలతో తీసుకు వచ్చిన తినుబండారాలు -
దేవీశ్రీకి బన్నీ స్పెషల్ గిఫ్ట్.. అస్సలు ఊహించలేదని రాక్‌స్టార్ ట్వీట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్,రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ మంచి స్నేహితులన్న సంగతి అందరికి తెలిసిందే. బన్నీ నటించిన ‘ఆర్య’ మొదలు బన్నీ, ఆర్య 2, జులాయి, ఇద్దరమ్మాయిలతో, సన్నాఫ్ సత్యమూర్తి, డి.జె. దువ్వాడ జగన్నాథం’ చిత్రాలకు డీఎస్పీ సంగీతం అందించారు. తాజాగా అల్లు అర్జున్ క్రేజీ ప్రాజెక్ట్ 'పుష్ప'కు మ్యూజిక్ అందిస్తున్నాడు వీరి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో బన్నీ, డెస్పీల మధ్య స్నేహం మరింత బలపడింది. తన సన్నిహితులకు, స్నేహితులకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేయడం అల్లు అర్జున్ కు అలవాటు. తాజాగా అలాంటి స్వీట్ సర్ప్రైజ్ను డీఎస్పీకి ఇచ్చాడు. బన్నీ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ను ఎంతో ఆనందంగా దేవిశ్రీ ప్రసాద్ తన ట్విటర్ ఖాతా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. అంతేకాదు... బన్నీకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి సర్ప్రైజ్ ‘రాక్‌స్టార్’ గిఫ్ట్ . థాంక్యూ సో మచ్ మై డియరెస్ట్ బ్రదర్ బన్నీ బాయ్... లవ్లీ గిఫ్ట్... అస్సలు ఊహించలేదు. నువ్వు చాలా స్వీట్’అంటూ దేవిశ్రీ ప్రసాద్ ఆ గిఫ్ట్ కు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. A SURPRISE “ROCKSTAR” Gift from the “ICON STAR” @alluarjun 😍 Thank you so much my dearest Brother Bunny boy..🤗.. What a Lovely Surprise!!🕺 Totally unexpected !!😁 Daaaamn Sweet of U 😁🎶🤗😍#PUSHPA pic.twitter.com/xkn8TLKKW5 — DEVI SRI PRASAD (@ThisIsDSP) July 8, 2021 -
Harish Rao Birthday: వినూత్న బహుమతి
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావును ఎస్బీఐ అధికారులు వినూత్న రీతిలో సన్మానించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన హరీశ్‌రావుకు బ్యాంకు అధికారులు.. ఆయన పుట్టిన రోజు అంకెలైన 030672.. సీరియల్ నంబర్‌తో ఉన్న మూడు కరెన్సీ నోట్లను మెమెంటోగా అమర్చి బహూకరించారు. రూ.100, రూ.50, రూ.20 నోట్లు ఇందులో ఉన్నాయి. అలాగే మంత్రి గురువారం పుట్టిన రోజు జరుపుకున్న నేపథ్యంలో ఆయన ఫొటోతో కూడిన పోస్టల్ స్టాంపులను కూడా అందించి సత్కరించారు. చదవండి: కరోనాతో ప్రాణం పోయింది.. అప్పు మిగిలింది -
బర్త్‌డేకి బహుమతి
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ అభిమానులకు ఈ నెల 9 ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఆ రోజు విజయ్ దేవరకొండ బర్త్‌డే. ఈ సందర్భంగా అభిమానులకు ఓ ప్రత్యేకమైన బహుమతిని సిద్ధం చేయిస్తున్నారట విజయ్. ఆ రోజున విజయ్ హీరోగా చేస్తున్న తాజా చిత్రం ‘లైగర్’కి చెందిన ఓ స్పెషల్ వీడియో విడుదల కానుందనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ వీడియో కుదరకపోతే ‘లైగర్’కి సంబంధించి ఏదొ ఒక అప్డేట్ అయినా వస్తుందనే ప్రచారం జరుగుతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని చార్మి నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్గా నటిస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ‘లైగర్’ చిత్రీకరణ వాయిదా పడింది. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 9న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వాయిదా పడే అవకాశం ఉంది. -
భార్యకు కానుక చంద్రుడిపై స్థలం కొనిచ్చాడు
చంద్ర మండలంపై కాలు మోపిన తొలి మానవుడు నీల్ ఆర్మ్‌స్రాంగ్ అయితే, చంద్ర మండలంపై ప్లాటు కొన్న తొలి రాజస్థానీ.. బహుశా ధర్మేంద్ర అనీజా కావచ్చు. ధర్మేంద్రా? ఎవరాయన? ఒక భర్త! ఈ భూగోళంపై ఆయన ఉండేది రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో. ఆయన భార్య స్వప్న ఉండేది మాత్రం చల్లని జాబిల్లి వంటి ఆయన హృదయంలో. అందుకే కావచ్చు, తమ పెళ్లి కానుకగా చంద్రుడిపై మూడెకరాల స్థలం కొని ఆమెకు కానుకగా ఇచ్చాడు! అయితే ఆ మూడెకరాలూ స్వప్న తలవాల్చే ధర్మేంద్ర ఛాతీ కన్నా విశాలమైనదేమీ కాబోదు. ఆయన ఆమెను ఎంతలా ప్రేమిస్తాడో పైకి చెప్పుకుంటే ఆయన ప్రేమను చిన్నబుచ్చినట్లే. అందుకే ఎవరికీ అందనంత ఎత్తులో తన ప్రేమ కానుకను ఉంచుకున్నాడు. కానుకను ఉంచాడంటే భార్య కోసం తన హృదయ పీఠాన్ని ఉంచాడనే. డిసెంబర్ 14 న ఈ దంపతుల 8 వ పెళ్లి రోజు. ఆ రోజు కోసం ఏడాది ముందే నెలరాజుకు నిచ్చెన వేశాడు ధర్మేంద్ర. అంత పెద్ద ప్రాసెస్ అది. న్యూయార్క్ సిటీలోని ‘లూనా సొసైటీ ఇంటర్నేషనల్’ కు మెయిళ్లు పెట్టి, కొన్ని వందల డాలర్లు పంపి ప్లాట్‌ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ‘ఎంతయ్యింది ధర్మేంద్రా’ అని లోకల్‌గా ఉండే భర్తలు అడుగుతుంటే.. ‘అమూల్యం’ అంటున్నాడు. స్వప్నదీ అదే మాట. ‘‘ఆయన ఏం ఇచ్చారని, ఎంతకు కొన్నారని నేను చూడటం లేదు. స్పెషల్‌గా ఏదైనా ఇవ్వాలన్న ఆయన మనసులోని ప్రేమ అనే వెన్నెలలో తడిసి ముద్ద అవుతున్నాను’’ అంటోంది ధర్మేంద్ర భుజంపై వాలిపోతూ. తగిన భార్యే. -
భార్యకు చిరకాలం గుర్తుండిపోయే గిఫ్ట్
జైపూర్: పెళ్లి కుదిరితే చాలు.. అమ్మాయిలు, అబ్బాయిలు బోలెడు గిఫ్టులు ఇచ్చిపుచ్చుకుంటూ ఒకరిమీద ఒకరు ఎనలేని ప్రేమ చూపించుకుంటారు. పెళ్లైన కొత్తలో అయితే భార్యను విహార యాత్రలకు, సినిమాలకు, షాపింగ్‌లకు తీసుకెళ్తూ మా ఆయన బంగారం అనిపించుకునేందుకు తెగ తాపత్రయ పడతారు. కానీ రోజులు నెలలు, నెలలు సంవత్సరాలు అయ్యే కొద్దీ పరిస్థితులు తలకిందులుగా మారుతుంటాయి. ఇల్లాలు ఏదైనా కావాలని నోరు తెరిచి అడిగితే భర్త ఒంటికాలిపై లేస్తారు. గిఫ్టులు కాదు కదా కనీసం ఓ మంచి చీర కూడా కొనివ్వడానికి ఆసక్తి చూపరు. కానీ ఇక్కడ చెప్పుకునే ఓ వ్యక్తి మాత్రం తన భార్యకు చిరకాలం గుర్తుండిపోయే బహుమతినిచ్చాడు. (చదవండి: ఇలా ప్రపోజ్ చేస్తే ఎవరైనా పడిపోవాల్సిందే) రాజస్థాన్‌లోని అజ్మర్ ప్రాంతానికి చెందిన ధర్మేంద్ర అనీజాకు భార్య అంటే చెప్పలేనంత ప్రేమ. వారి ఎనిమదో వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య సాప్నా అనీజాకు ఏదైనా స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. అందుకోసం ఏకంగా చంద్రమండలంలో మూడు ఎకరాలను కొనేసి ఆమెకు బహుమతిగా ఇవ్వడంతో ఆమె సంతోషంలో మునిగి తేలుతోంది. ఈ గిఫ్ట్ గురించి ధర్మేంద్ర మాట్లాడుతూ.. 'డిసెంబర్ 24న మా పెళ్లి రోజు. అందరిలా కార్లు, నగలు కాకుండా నా భార్యకు ఏదైనా స్పెషల్ బహుమతి ఇద్దామనుకున్నా. అలా చంద్రుడి మీద ప్లాట్ కొనిచ్చాను. బహుశా చంద్రమండలం మీద స్థలాన్ని కొన్న మొదటి రాజస్థాన్ వ్యక్తిని నేనే అనుకుంటా' అని చెప్పుకొచ్చాడు. 'ప్రపంచం అవతల నుంచి బహుమతి అందుకున్నందుకు సంతోషంగా ఉంది. కొనుగోలు సర్టిఫికెట్ చూస్తుంటే నాకిప్పుడు చంద్రుడి మీదే ఉన్నట్లుగా అనిపిస్తోంది' అని అతని భార్య సాప్నా ఆనందంతో గాల్లో తేలుతోంది. అమెరికాలోని లూనా సొసైటీ ఇంటర్నేషనల్ కంపెనీ ద్వారా అనీజా.. చందమామ మీద స్థలాన్ని కొనుగోలు చేశాడు. (చదవండి: అదృష్టం: చెత్త కుప్పనుంచి మంత్రి ఆఫీసుకు..) -
సల్మాన్‌కు ప్రేమతో...
ప్రేమను కొన్నిసార్లు సందర్భానుసారం బహుమతుల రూపంలో వ్యక్తపరచాల్సి ఉంటుంది. లూలియా వంటూర్కి కూడా అలాంటి సందర్భం మొన్నొచ్చింది. ఇంతకీ లూలియా వంటూర్ ఎవరబ్బా? అనుకోకండి. సల్మాన్ ఖాన్ (భాయ్) ఫ్యాన్స్ అంతా ప్రస్తుతం బాబీ బాబీ (వదిన) అని పిలుచుకుంటున్న భామ లూలియా వంటూర్. ఈ రొమేనియన్ బ్యూటీ కోసం భాయ్ రోమియో అయిపోయారని బాలీవుడ్ టాక్. గురువారం సల్మాన్ ఖాన్ బర్త్‌డే. ఈ బర్త్‌డేకు గిఫ్ట్‌గా క్రాస్లాకెట్ (ఏసు క్రీస్తు బొమ్మ ఉన్న శిలువ) ఉన్న గోల్డ్ చైన్‌ను ప్రజెంట్ చేశారు లూలియా. అంతేకాదు ఫామ్‌హౌస్‌లో సల్మాన్ హోస్ట్ చేసిన పార్టీలో ఆయన పక్కనే ఉంటూ గెస్ట్‌లను రిసీవ్ చేసుకున్నారట. ఇప్పుడైతే ప్రియ నేస్తానికి లాకెట్ ఇచ్చారు. మరి.. పెళ్లితో ఈ ఇద్దరూ ఎప్పుడు లాక్ అవుతారో చూడాలి. -
దీదీకి స్పెషల్ గిప్ట్ పంపిన మెస్సీ
కోల్‌కతా : లెజండరి ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియెనాల్ మెస్సీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అర్జెంటీనా ఆటగాడికి మన దేశంలో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇంతటి క్రేజ్ ఉన్న ఈ ఫుట్‌బాల్ ప్లేయర్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఒక ప్రత్యేక బహుమతిని పంపారు. మెస్సీ, ‘దీదీ నం 10’ అనే జెర్సీని మమతా బెనర్జీకి స్పెషల్ గిఫ్ట్‌గా పంపించారు. దాంతో పాటు ‘నా స్నేహితురాలికి శుభాకాంక్షలు మీ మెస్సీ’ అనే సందేశాన్ని జెర్సీ మీద ప్రింట్ చేయించారు. ఇంతకు దీదీకి ఈ ప్రత్యేక బహుమానం పంపాడానికి కారణం ఏంటంటే గతేడాది ఫిఫా యూ - 17(ఫిఫా అండర్ సెవంటీన్ వరల్డ్ కప్)ని భారతదేశంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశంలోని మొత్తం 6 స్టేడియాల్లో ఈ మ్యాచ్‌లు నిర్వహించగా.. ఫైనల్ మ్యాచ్ కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగింది. ఈ సందర్భంగా ఫైనల్ మ్యాచ్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు దీదీని అభినందిస్తూ.. మెస్సీ ఈ జెర్సీని ప్రత్యేక బహుమతిగా అందజేశారు. గతంలో డియాగో మారడోనా, రొమారియో, రోనాల్డో వంటి దిగ్గజ క్రీడాకారులు ధరించిన ఈ జెర్సీని మెస్సీ, దీదీ గౌరవార్థం ఆమెకి బహుకరించారు. బార్సిలోనా లెజెండ్స్ ద్వారా మెస్సీ ఈ జెర్సీని నెక్స్ట్ ఫౌండేషన్ నిర్వాహకులకు అందజేశారు. ఈ విషయం గురించి ఫౌండేషన్ స్థాపకుడు కౌషిక్ మౌలిక్ ‘ఈ జెర్సీని వారు దీదీకి స్వయంగా అప్పగించడానికి కుదరక పోవడంతో మాకు అందచేశారు. దీన్ని సీఎమ్‌కు అందిచడం మా బాధ్యత. ఇందుకు గాను మేము సీఎమ్వోను కలవాల్సి ఉంది. ముఖ్యమంత్రి మాకు అపాయింట్మెంట్ ఇచ్చిన రోజున మేము ఆమెని కలిసి ఈ జెర్సీని అందజేస్తాం’ అని తెలిపారు. లియోనాల్ మెస్పి 2011లో అర్జెంటీనా, వెనిజులాల మధ్య జరిగిన ఫ్రేండ్లీ మ్యాచ్ కోసం తొలిసారి కోల్‌కతా సాల్ట్ లేక్ స్టేడియానికి వచ్చారు. -
సర్ప్రైజ్ గిఫ్ట్
బీటౌన్‌లో ప్రియాంకా చోప్రా పేరు ప్రస్తావనకు వస్తే చాలు. ఆమె చేయనున్న సినిమా విషయాలు పక్కనపెట్టి ప్రేమ గురించే ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. అంతలా అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌తో కలిసి ప్రియాంక చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. న్యూయార్క్ వెకేషన్లో వీరిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇవ్వడమే వీరి ప్రేమకు నిదర్శనం అనొచ్చు. రీసెంట్గా ముంబైలో జరిగిన ఓ వెడ్డింగ్ ఫంక్షన్‌కు కూడా నిక్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 18న ప్రియాంక బర్త్ డే. 36వ వసంతంలోకి అడుగుపెడతారట ఈ బ్యూటీ. ఈ బర్త్ డే స్పెషల్‌గా ప్రియాంకా చోప్రాకి నిక్ ఏదో స్పెషల్ గిఫ్ట్ ప్లాన్ చేశారట. ఆ సర్ప్రైజ్ ఏంటీ అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. బర్త్‌డే సెలబ్రేషన్స్ తర్వాత ప్రియాంకాకు ఇష్టమైన బీచ్‌కు నిక్ ఆమెను తీసుకెళ్తార ట. అసలు ఈ బర్త్‌డే స్పెషల్ ఎంటీ? అనేది తెలియాలంటే ఈ నెల 18 వరకు వెయిట్ చేయాల్సిందే. రెండేళ్ల గ్యాప్ తర్వాత ప్రియాంక బాలీవుడ్లో ‘భారత్, ది స్కై ఈజ్ పింక్’ చిత్రాల్లో నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
ధోని బర్త్‌డే : పాండ్యా స్పెషల్ గిఫ్ట్ !
కార్డిఫ్ : టీమిండియా మాజీ సారథి, సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని శనివారం 37వ పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాజీ క్రికెటర్లు, అభిమానులు, సహచర ఆటగాళ్ల నుంచి ధోనికి విషేస్ పోటెత్తాయి. ఇక భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), జట్టు ఆటగాళ్లు, ధోని కూతురు జీవాతో కలిపి రూపోందించిన ఓ వీడియోతో సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇచ్చింది. అయితే అందరూ ధోనితో ఉన్న మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ విషెస్ తెలియజేస్తే.. టీమిండియా యువ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా మాత్రం తన రూటే సపరేట్ అంటూ ధోని ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. ధోని హెయిర్ కట్ చేస్తున్న ఫొటోను జత చేసి దానికి క్యాప్షన్‌గా..‘ఈ ప్రత్యేకమైన రోజు నాడు ధోనికి నా ప్రత్యేకమైన హెయిర్ కట్ గిఫ్ట్.. ఇది నిపుణుల పర్యవేక్షణలో చేసిన పని.. ఇంట్లో ఎవరూ ప్రయత్నించకూడదు’ అంటూ ఫన్నీగా పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20తో ధోని 500 అంతర్జాతీయ మ్యాచ్‌లు పూర్తిచేసుకుని రికార్డును సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో ఈఘనత సాధించిన మూడో భారత్ క్రికెటర్‌గా.. ఓవరల్‌గా 9వ ఆటగాడిగా ఈ జార్ఖండ్ డైనమైట్ గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో సచిన్ 664, ద్రవిడ్ 509 మ్యాచ్‌లతో ధోని కన్నా ముందు వరుసలో ఉన్నారు. రెండో టీ20లో పరాజయం పాలైన కోహ్లిసేన నేడు సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌కు సిద్దమవుతోంది. Special day calls for a special haircut. Here’s my birthday gift for the one and only @msdhoni . 💇♂✌ 😘 ⚠ This stunts is performed by experts, don't try this at home ⚠😉😂 pic.twitter.com/F1TTwYlvoa — hardik pandya (@hardikpandya7) July 7, 2018 -
జాకీ పంపిన జాకెట్
బహుమతులు ఎవరికైనా ప్రత్యేకమే. అసలు కానుకలు ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి. ఇప్పుడు బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌కి కూడా ఒక స్పెషల్ గిఫ్ట్ వచ్చింది. దాంతో చెప్పలేనంత సంతోషంలో మునిగి తేలుతున్నాడు. ఏంటా గిఫ్ట్? ఎవరు పంపిందంటే.. స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ జాకెట్. ఇంటర్నేషనల్ యాక్షన్ హీరో జాకీ చాన్ పంపించారు. వీళ్లిద్దరికీ స్నేహం ఎలా కుదిరిందబ్బా? అంటే గతేడాది వచ్చిన ‘కుంగ్‌ఫూ యోగా’ సినిమాలో వీళ్లిద్దరూ కలిసి యాక్ట్ చేశారు. అప్పటి నుంచి వీళ్ల ఇండో– చైనీస్ మైత్రీ కుదిరింది. గిఫ్ట్‌తో పాటు సోనూసూద్‌కు ఒక లెటర్ కుడా రాశారు జాకీ చాన్. ఆ లేఖ సారాంశం ఏంటంటే... ‘‘మై డియర్ సోనూ..., ఈ జాకెట్ ‘జేసి స్టంట్ టీమ్’ 40వ వార్షికోత్సవం సందర్భంగా తయారు చేసిన స్పెషల్ ఎడిషన్ లిమిటెడ్ జాకెట్. ఈ జాకెట్ కోసం వాడిన లెదర్‌ని స్వయంగా సెలెక్ట్ చేసి, బెస్ట్ తయారీదారుడి దగ్గర నా అభిరుచికి తగ్గటు డిజైన్ చేయించాను. ఈ జాకెట్‌ని నువ్వు తీక్షణంగా పరిశీలిస్తే అందులో కనిపించే ప్రతీ డీటైల్లోనూ, డిజైనింగ్‌లోనూ నేనే స్వయంగా కనిపిస్తాను. ఈ జాకెట్ వెల ఎంతో చెప్పలేను కానీ విలువ మాత్రం నిజాయితీగా చెప్పాలంటే అందులో నా ఆలో^è నలు ప్రతిబింబిస్తాయి. నాతో పాటు నా జర్నీలో కష్ట సుఖాల్లో నడిచిన నా సోదరులకు మాత్రమే కాకుండా నీలాంటి ఆప్తులకు ఇవ్వాలనుకున్నాను. ఈ చిరు కానుక నీకు చలికాలంలో వెచ్చదనాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే దాన్ని చూసినప్పుడల్లా నా గురించి ఆలోచిస్తావు, దాన్ని ధరించినప్పుడల్లా నన్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నట్టు ఉంటుంది’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. ∙సోనూకి జాకీ పంపించిన జాకెట్ -
ప్రేమతో నీ ప్రియ.. సుదీప్‌కు స్పెషల్ గిఫ్ట్..!
సాక్షి, బొమ్మనహళ్లి : ప్రేమికుల దినోత్సవం రోజు ప్రేమ పక్షులు బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం సహజమే. అయితే సినిమా యాక్టర్లు ఎటువంటి బహుమతులు ఇస్తారనే దానిపై అందరికి కొంత ఉత్సకత ఉంటుంది. ప్రముఖ కోలీవుడ్ హీరో కిచ్చ సుదీప్, ప్రియ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. సుదీప్‌కు కాఫీ తాగడం అంటే మహా ఇష్టం. ఆయన ఇష్టాఇష్టాలు తెలిసిన భార్య ప్రియ కాఫీ కప్‌ను బహుమతిగా అందించింది. ఈ ప్రత్యేక కానుకలను ట్విటర్లో పెట్టడంతో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఒక కప్‌పై సుదీప్, మరో కప్‌పై ప్రియ అంటూ రాసి ఉంది. అందులో మరో సందేశం ఉంది. ప్రస్తుతం కిచ్చ సుదీప్ అంబి నినగే వయస్సాయ్తో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. -
తన ఫ్రెండ్ మోదీకి స్పెషల్ గిఫ్ట్
జెరూసలేం : తన స్నేహితుడు ప్రధాని నరేంద్రమోదీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒక ప్రత్యేకమైన బహుమతి ఇవ్వనున్నారు. త్వరలో ఆయన భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఆ విలువైన గిఫ్ట్‌ను మోదీకి అందించనున్నారు. అధికార వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల (జనవరి) 14న నెతన్యాహు పర్యటన ప్రారంభం కానుంది. ఆ రోజే మోదీకి గాల్ మొబైల్ వాటర్ డిసాలినైజేషన్-ప్యూరిపైడ్ జీప్‌ను అందిస్తారు. ఈ జీప్‌నకు ఓ ప్రత్యేకత ఉంది. గత ఏడాది (2017) జులై నెలలో మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లినప్పుడు వారిద్దరు కలిసి ఈ జీపులోనే సముద్రపు తీరంలో షికారు చేశారు. దీంతో వారి స్నేహానికి గుర్తుగా ఆయన మోదీకి ఆ జీపునే బహుమతిగా ఇవ్వనున్నారు. ఈ జీపు ఖరీదు దాదాపు లక్షా పదకొండువేల డాలర్లు ఉంటుందని అంచనా. సముద్రపు నీటిని శుద్ధిపరిచే సాంకేతిక పరిజ్ఞానం భారత్‌కు ఇజ్రాయెల్ అందించేలా ఒప్పందం అయిన విషయం తెలిసిందే. దీనికి గుర్తుగానే ఓల్గా బీచ్‌లో మోదీ, నెతన్యాహు కలిసి సముద్రపు నీటిని శుద్ధి పరిచే జీపులో కాసేపు సరదాగా గడిపారు. -
వైఎస్ జగన్‌కు అరుదైన కానుక
-
ఇవాంక కోసం మోదీ స్పెషల్ గిఫ్ట్
సాక్షి, హైదరాబాద్ : గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ 2017 కోసం నగరానికి వచ్చిన అతిథి ఇవాంక ట్రంప్ కోసం దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఓ ప్రత్యేక బహుమతిని అందించారు. ఓ చెక్క పెట్టెను ఇవాంకకు బహుకరించారు. అది సాదాసీదా పెట్టె కాదు.. సూరత్ కళ సడేలీ హస్తకళతో కూడింది. వివిధ ఆకృతులతో పెట్టెపై అల్లికలు ఉండటమే ఈ కళ ప్రత్యేకం. ఈ బహుమతి పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఇవాంక మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. మరికాసేపట్లో ఫలక్‌నూమ ప్యాలెస్‌లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే విందులో ఆమె పాల్గొనబోతున్నారు. -
థ్యాంక్యూ కోహ్లీ: పాక్ ఆల్‌రౌండర్
న్యూఢిల్లీ: భారత్ పాకిస్థాన్ క్రికెట్ ఆటగాళ్ల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ మాజీ స్టార్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రీది, భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీనే ఇందుకు ఉదాహరణ. వీరు ఇద్దరు మంచి స్నేహితులు. గతంలో టెస్టులు, వన్డేల నుంచి అఫ్రీది రిటైర్మెంట్ సందర్భంగా కోహ్లీ తనతో పాటు పలువురు భారత ఆటగాళ్లు సంతకం చేసిన తన జెర్సీని అతనికి కానుకగా అందించాడు. అప్పుడు అఫ్రీది భారత జట్టుకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇప్పుడు తాజాగా విరాట్ చేసిన మరో సాయానికి అఫ్రీది కృతజ్ఞలు తెలిపాడు. అది ఏంటంటే క్రికెట్ నుంచి రిటైర్డ్ అనంతరం అఫ్రీది క్రికెట్ ఫౌండేషన్ నెలకొల్పి స్థానిక యువతకు క్రికెట్ పాఠాలు చెప్తున్నాడు. ఈ ఫౌండేషన్‌కు విరాట్ తను సంతకం చేసిన బ్యాట్‌ను విరాళంగా ఇచ్చాడు. దీంతో ఆఫ్రీది కోహ్లీకి థ్యాంక్యూ కోహ్లీ అంటూ సోషల్ మీడియా ట్వట్టర్లో పోస్టు చేశాడు. గతంలో భారత ఆటగాళ్లు సంతకం చేసిన టీషర్ట్‌ను లండన్‌లో వేలం వేయగా రూ.3లక్షలు పలికింది. Thank you @imVkohli for your kind gesture in support of @SAFoundationN. Friends & supporters like you ensure #HopeNotOut for everyone pic.twitter.com/T6z7F2OYLb — Shahid Afridi (@SAfridiOfficial) August 1, 2017 -
శ్రీవారికి అరుదైన కానుక
తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి శుక్రవారం అరుదైన కానుక అందింది. సిరిసిల్లకు చెందిన విజయ్ అనే చేనేత కార్మికుడు తాను స్వయంగా తయారుచేసిన అగ్గిపెట్టెలో పట్టే పట్టు వస్ర్తాన్ని శ్రీవారికి సమర్పించుకున్నాడు. గతంలో కూడా విజయ్ అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర తయారు చేసిన విషయం తెలిసిందే. -
భార్యకు కర్ణాటక సీఎం స్పెషల్ గిఫ్ట్
-
అనుష్కకు గుణశేఖర్ స్పెషల్ గిఫ్ట్!
చెన్నై: దక్షిణాది నటి అనుష్క శెట్టికి 'రుద్రమదేవి' చిత్ర నిర్మాతలు ఓ ప్రత్యేక వీడియోను పుట్టిన రోజు కానుకగా ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. ప్రత్యేక వీడియోలో ఏముంటుందనే విషయాన్ని దర్శకుడు గుణశేఖర్ సీక్రెట్ గా ఉంచారు. నవంబర్ 7 తేదిన అనుష్క 33వ జన్మదినం జరుపుకోనున్నారు. అనుష్క పుట్టిన రోజున ఓ ప్రత్యేక గిఫ్ట్ ను ప్లాన్ చేశారు. ఓ స్పెషల్ వీడియో లేదా సినిమా టీజర్ కావోచ్చు. పుట్టిన రోజున అనుష్కకు సర్ ప్రైజ్ చేయాలని గుణశేఖర్ ప్లాన్ చేశారు.. కానుక ఏమిటనే విషయాన్ని గుణశేఖర్ చాలా సీక్రెట్ గా ఉంచారు అని చిత్ర నిర్వహకులు వెల్లడించారు. కాకతీయుల వంశానికి చెందిన కథానేపథ్యంతో రుద్రమదేవి చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. Follow @sakshinews