
సాక్షి, బొమ్మనహళ్లి : ప్రేమికుల దినోత్సవం రోజు ప్రేమ పక్షులు బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం సహజమే. అయితే సినిమా యాక్టర్లు ఎటువంటి బహుమతులు ఇస్తారనే దానిపై అందరికి కొంత ఉత్సకత ఉంటుంది. ప్రముఖ కోలీవుడ్ హీరో కిచ్చ సుదీప్, ప్రియ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. సుదీప్‌కు కాఫీ తాగడం అంటే మహా ఇష్టం. ఆయన ఇష్టాఇష్టాలు తెలిసిన భార్య ప్రియ కాఫీ కప్‌ను బహుమతిగా అందించింది.
ఈ ప్రత్యేక కానుకలను ట్విటర్‌లో పెట్టడంతో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఒక కప్‌పై సుదీప్, మరో కప్‌పై ప్రియ అంటూ రాసి ఉంది. అందులో మరో సందేశం ఉంది. ప్రస్తుతం కిచ్చ సుదీప్ అంబి నినగే వయస్సాయ్తో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment