ట్విట్టర్‌లో ప్రియమణి టాప్ | priyamani top in twitter | Sakshi
Sakshi News home page

ట్విట్టర్‌లో ప్రియమణి టాప్

Published Wed, May 18 2016 6:20 PM | Last Updated on Mon, Sep 4 2017 12:23 AM

ట్విట్టర్‌లో ప్రియమణి టాప్

ట్విట్టర్‌లో ప్రియమణి టాప్

బెంగళూరు : కన్నడ నటుడు కిచ్చ సదీప్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ట్విట్టర్ తదితర  సామాజిక వెబ్‌సైట్లలో కూడా కన్నడ సినీరంగంలోని మిగిలిన అందరి నటుల కంటే ఎక్కవ ఫ్యాన్‌ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. ట్విట్టర్‌లో ఈ హీరోను ఫాలో అయ్యేవారి సంఖ్య సుమారు 4లక్షల మంది ఉన్నారు.

కానీ ట్విట్టర్ ఫ్యాన్‌ఫాలోయింగ్‌లో హీరోయిన్ ప్రియమణి  సుదీప్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోని సైతం పక్కకు నెట్టేసి ప్రథమ స్థానంలో నిలిచి కన్నడ సినీరంగ జనాలకు షాక్ ఇచ్చింది. ఈ హీరోయిన్ ట్విట్టర్‌లో ఫాలో అయ్యేవారి సంఖ్య సుమారు 9లక్షల మంది ఉండగా, మాజీ హీరోయిన్ రమ్యా 4లక్షల 20వేల ఫ్యాలోయర్లతో రెండవ స్థానంలో నిలిచింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement