
వినూత మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ ట్విట్ చేసిన దృశ్యం, వినూతతో నటుడు సుదీప్ (ఫైల్)
బొమ్మనహళ్లి: తనను అభిమానించే అభిమాని ఇక లేరని తెలసుకొని కన్నట నటుడు కిచ్చ సుదీప్ కంటతడి పెట్టారు. వివరాలు.. బెంగళూరుకు చెందిన వినూత అనే యువతి సుదీప్ అభిమాని. ఆమె కొంత కాలంగా కేన్సర్‌తో బాధపడుతోంది. ఓ వైపు వ్యాధి తీవ్రంగా ఉన్నా ఎలాగైనా తన అభిమాన నటుడు సుదీప్‌ను కలవాలని తపించేది. అభిమాన సంఘం సభ్యుల ద్వారా విషయం తెలుసుకున్న నటుడు సుదీప్ వినూతను జేపీ నగరలో ఉన్న తమ నివాసానికి పిలిపించి ఆమె క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.
వ్యాధితో కుంగిపోవద్దని, ధైర్యంగా ఉండాలని చెప్పాడు. అంతేగాకుండా ఆమెతో కలిసి సెల్ఫీ కూడా తీసుకున్నారు. అయితే కేన్సర్ చివరి దశకు చేరడంతో మంగళవారం సాయంత్రం వినూత మృతి చెందింది. ఈ విషయాన్ని అభిమాన సంఘం సభ్యులు సుదీప్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సుదీప్ కంటతడి పెట్టారు. తన చిన్నారి చిన్నారి చెల్లెలు వినూత ఆత్మకు శాంతి కలగాలని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. గతంలో వినూతతో దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment