
మినీ వ్యానుల్లో తీసుకొచ్చిన ఆషాఢ కావిడి
యానాం: నవ వధువు ఇంటి నుంచి అత్తారింటికి ఆదివారం పంపిన ఆషాఢ కావిడి ఇది. స్థానిక వ్యాపారవేత్త తోట రాజు కుమారుడు పవన్‌కుమార్‌కు రాజమహేంద్రవరానికి చెందిన బత్తుల బలరామకృష్ణ కుమార్తె ప్రత్యూషాదేవికి గత నెల 21న వివాహమైంది. ఆషాఢ కావిళ్లుగా 100 రకాల స్వీట్లు, వెయ్యి కిలోల చొప్పున పండుగొప్ప చేపలు, కొరమేనులు, కూరగాయలు, 250 కిరాణా సరకులు, 1500 కిలోల చెరువు చేపలు, 350 కిలోల రొయ్యలు, 250 కిలోల బొమ్మిడాయిలు, 10 మేకపోతులు, 50 పందెం పుంజులు ఊరేగింపుగా తీసుకురావడం స్థానికంగా ఆశ్చర్యానికి గురిచేసింది.
బిందెలతో తీసుకు వచ్చిన తినుబండారాలు
Comments
Please login to add a commentAdd a comment