Ashadha Masam
-
కొత్త అల్లుడికి ‘శత’ పిండి వంటల భోజనం
కిర్లంపూడి: ఆషాఢ మాసం పూర్తయి శ్రావణ మాసం రానేవచ్చింది.. ఎక్కడ చూసినా కొత్త అల్లుళ్ల సందడే సందడి. అల్లుడికి మర్యాదలు చేయడంలో గోదారోళ్ల (గోదావరి జిల్లాలు) తర్వాతే ఎవరైనా అంటారు పెద్దలు. ఈ నానుడికి అద్దం పట్టేలా కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడ గ్రామానికి చెందిన ఉద్దగిరి వెంకట రామారావు, రమణి దంపతులు కొత్త అల్లుడికి శనివారం ‘శత’ పిండి వంటల భోజనం స్వయంగా వడ్డించి తమ ప్రేమను చాటుకు న్నా రు. అత్తారింట్లో తమ కుమారుడికి లభించిన మర్యాదలను చూసి కాకినాడకు చెందిన బాదం సతీష్, కుమారి దంపతులు మురిసిపోయారు. -
మది నిండుగా.. శ్రావణ బోనం!
ఆషాఢం వచ్చిందంటే తెలంగాణలో బోనాల పండుగ ్రపారంభం అవుతుంది. గోల్కొండ జగదాంబికకు తొలిబోనం సమర్పణతో మొదలై, సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాకాళి, లాల్ దర్వాజ బోనాలతో నగరం పల్లె రూపం నింపుకుంటుంది. ఆషాఢమాసంలో బోనాలు హైదరాబాద్‌లో ముగుస్తాయి. శ్రావణమాసం ్రపారంభం అవుతూనే అమావాస్య ఆదివారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా గ్రామ గ్రామాన బోనాల పండుగ ప్రతి ఇంట సంబరమవుతుంది. మన సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలూ బోనాల పండగను జరుపుకోవడం విశేషం.సామూహిక చైతన్యం..గ్రామదేవతలకు వండి పెట్టే భోజనమే బోనం అంటారు. బోనాన్ని గుడిలో అమ్మవారికి సమర్పించడంతో నైవేద్యం అవుతుంది. బోనాన్ని జేజ బువ్వ అని కూడా (తెలంగాణలోని కొన్నిప్రాంతాల్లో్ల) అంటారు. వర్షాలు బాగా పడాలని, పంటలు బాగా పండాలని, రుతుమార్పుల వల్ల వచ్చే అంటురోగాలు, ఆనారోగ్యాల పాలు కాకుండా ఉండాలని అమ్మ దేవతలకు మొక్కుకుంటారు. ్రపాచీన కాలం నుంచి ఒక ఆచారాన్ని తీసుకువచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి కూడా ఈ బోనం సంప్రదాయాన్ని కొనసాగిస్తుంటారు.గిరులలో సిరులు కురవాలని..గిరిజనులు సంవత్సరానికి ఒకసారిపోడు వ్యవసాయం ద్వారా పంట పండిస్తారు. దున్నే సమయంలో ముందు కొట్టే చెట్టుకు మొక్కుతారు.‘నేను వ్యవసాయం కోసమే నిన్ను కొడుతున్నాను. నీమీద నాకేం కోపం లేదు క్షమించమ్మా! రెండు రోజుల తర్వాత వస్తాన’ని చెప్పి మూడోరోజు దుక్కి దున్ని గింజలు నాటుతారు. చిక్కుడుపంట పండితే చిక్కుళ్ల పండుగ చేసుకుంటారు. ఇంటిపాదుల్లో పెట్టిన విత్తనాలు మొలకలే, తీగలై పారితే ఎంతో సంతోషిస్తారు. ఆ పాదుల్లో మొదటగా పూసిన బీరపువ్వుకు బొట్లు పెడతారు. ఏడుగురు అక్క చెల్లెళ్లు..పూర్వకాలంలో నిరక్షరాస్యులైన ప్రజలు, గిరిజనులు రాయిని కడిగి పసుపు కుంకుమతో బొట్లుపెట్టి దేవత అని మొక్కేవారు. ప్రపంచమంతటా ఈ అమ్మ దేవతల పూజ ఉంది. రూపాలు లేవు కాని వివిధ పేర్లతో అమ్మవార్లను పూజించుకుంటారు. దేవతల్లో ప్రధానంగా ఏడుగురు అక్కా చెల్లెళ్లు. సప్తమాతృకల్లో ఉండే చాముండి దేవతను సౌమ్య రూపంగా గుళ్లల్లో ప్రతిష్టించుకుని పూజలు చేస్తారు.పోషణ ఇచ్చేదిపోచమ్మ తల్లి అని తెలంగాణలో కొలుస్తారు. గ్రామాల్లో ..పోచమ్మ, మైసమ్మ, ఊరమ్మ, ఊరడమ్మ, కట్ట మైసమ్మ, సరిహద్దులపోచమ్మ, వనంపోచమ్మ, దుర్గమ్మ, మహంకాళమ్మ, బద్ది΄ోచమ్మ, పెద్దమ్మ,పోలేరమ్మ, ఎల్లమ్మ, మాతమ్మ.. ఇలా రక రకాల పేర్లతో ఉన్న ఎందరో అమ్మ తల్లులకు బోనాలు సమర్పిస్తారు. కాటమరాజు, బీరప్ప, మల్లన్న.. తొట్టెలు,పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు ప్రజల విశ్వాసాలకు అద్దం పడతాయి. బోనాల పండుగకు అత్తగారింటినుంచి తల్లిగారింటికి వచ్చిన ఆడపిల్లలు బోనం ఎత్తుకోవడం అంటే ఆ ఇంటికి లక్ష్మీదేవే వచ్చినట్టుగా భావిస్తారు. – యంబ నర్సింహులు, సాక్షి, యాదాద్రి -
ఆషాఢంలో అల్ల నేరేడు
ఆషాఢమాసంలో నేరేడు పండు తినాలని పెద్దలు చెబుతారు. ఎందుకంటే, ఆషాఢంలో ఎండ వేడిమి తగ్గి, శరీరం నుంచి చెమట రూపంలోనూ, మూత్రం రూపంలోనూ నీరు అధికంగా విడుదల అవుతుంది. వాతావరణంలోని మార్పు జీర్ణకోశాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అందువల్ల ఈ సీజన్లో నేరేడు పండు తినడం చాలా మంచిదని పెద్దలు చెబుతారు.అతి మూత్రవ్యాధికి నేరేడు మంచి మందనీ, వెంట్రుకలను కూడా కరిగించి అరగించే శక్తి దానికి ఉందనీ జీవశాస్త్రంలో పాఠాలుగా చదువుకుంటాం. దీనిని బట్టి అర్థం చేసుకోవలసింది ఏమిటంటే, వాతావరణంలోని మార్పులకు దేహం సరయ్యే విధంగా, ఆ కాలంలో ప్రకృతి అందించే నేరేడుని ఔషధంలా ఉపయోగించాలని, శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ అనే విషపదార్థాలను బయటకు పంపించడానికి నేరేడు మంచి మందనీ. దానిని తీసుకోవడం వల్ల శారీరక ఆరోగ్యం బాగుంటుందనీ గ్రహించాలి. నేరేడు మనకు ఇంకా ఏవిధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. ⇒ చాలా కాలంగా కడుపులో పేరుకుపోయిన మలినాలను బయటకు పంపటానికి నేరేడు పండ్లను తినటం మంచిది.⇒పేగుల్లో చుట్టుకుపోయిన వెంట్రుకలకు కోసేసి బయటికి పంపే శక్తి నేరేడు పళ్ళకు ఉంది.⇒రోగ నిరోదకశక్తి పెరుగుతుంది. వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది.⇒మూత్ర సంబంధ సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.⇒నీరసం, నిస్సత్తువ ఉన్న వారు నేరేడు పండును తింటే తక్షణ శక్తి వస్తుంది.⇒వెన్నునొప్పి, నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులు, నయం అవుతాయి.⇒జిగట విరేచనాలతో బాధపడే వారు నేరేడు పండ్ల రసాన్ని రెండు నుంచి మూడు చెంచాల చొప్పున తాగితే రోగికి శక్తి రావడంతో΄ాటు పేగుల కదలికలు నియంత్రణలో ఉంటాయి.⇒కాలేయం పనితీరును క్రమబద్ధీకరించడానికి లేదా శుభ్రపరచడానికి నేరేడు దివ్యౌషధంలా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి.⇒ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి.⇒జ్వరంగా ఉన్నపుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే.. శరీర తాపం తగ్గుతుంది.⇒మూత్రం మంట తగ్గడానికి నిమ్మరసం, నేరేడు రసం రెండు చెంచాల చొప్పున నీళ్లలో కలిపి తీసుకోవాలి.⇒పిండి పదార్థాలు, కొవ్వు భయం ఉండదు కనుక నేరేడు పండ్లను అధిక బరువు ఉన్నవారు.. మధుమేహం రోగులు సైతం వీటిని రోజుకు ఆరు నుంచి ఎనిమిది దాకా తినవచ్చు.వీరు తినకూడదు..అయితే నేరేడు పండ్లను గర్భిణీలు ఎటువంటి పరిస్థితులలో తినకూడదు.నేరేడు అరగడానికి ఎక్కువసమయం పడుతుంది కాబట్టి.. ఉప్పు వేసి అప్పుడప్పుడు తీసుకోవాలి. భోజనమైన గంట తరువాత ఈ పండ్లు తీసుకుంటే.. ఆహారం జీర్ణమవుతుంది. అధికంగా తీసుకుంటే.. మలబద్ధకం సమస్యతో΄ాటు.. నోట్లో వెగటుగా ఉంటుంది. -
ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఆషాఢ మాసోత్సవాలు (ఫొటోలు
-
Ashada Masam: గోరింట పండింది..
సప్తగిరికాలనీ(కరీంనగర్): గోరింట పూసింది కొమ్మా లేకుండా.. మురిపాల అరచేత మొగ్గా తొడిగింది.. అన్నాడో సినీ కవి. ఆషాఢం వచి్చందంటే చాలు.. గోరింటాకు గుర్తుకొస్తుంది. ఈ మాసం గడిచేలోపు ఒకరోజు గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు చెబుతారు. అతివలు అరచేతులకు పెట్టుకొని మురిసిపోతుంటారు. శుభకార్యాలు, పండుగలు, ఆషాఢ మాసంలో మైదాకు పెట్టింది పేరు. అంతేకాదు.. ఔషధ గుణాలు గోరింటాకులో మెండు.ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో సంబరంగా చేసుకొనే పండుగ. ఇటీవల కాలంలో మహిళలందరూ ఒకచోట చేరి మెహందీ పండుగను చేసుకోవడం, కిట్టీ పార్టీల్లో కూడా ఆషాఢ మెహందీ పేరిట కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కరీంనగర్‌లోని మగువ కిట్టీ పార్టీ ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలను నగరంలోని మున్సిపల్ పార్క్‌లో ఘ నంగా చేసుకున్నారు. అందరూ ఒకచోట చేరి గోరింటాకును తయారు చేసి చేతులకు పెట్టుకుంటూ సందడి చేశారు. ఆషాఢ మాసం ఆరంభమైన సందర్భంగా ఆషాఢ మెహందీపై సాక్షి స్పెషల్ స్టోరీ. చర్మవ్యాధులు రాకుండా.. వర్షాకాలంలో గోరింటాకు పెట్టుకుంటే చర్మవ్యాధు ల బారి నుంచి రక్షించుకోవచ్చనేది ఆరోగ్య రహస్య ం. ఆషాఢంలో వర్షాలు ఎక్కువగా కురవడంతో పంట పొలాలు బురదమయమై క్రిమికీటకాలు పె రుగుతాయి. మహిళలు పొలంలో వరినాట్లు వేయ డం వల్ల చేతులు, కాళ్లకు బురద అంటుకుంటుంది. ఈ మాసంలో మైదాకు పెట్టకుంటే చర్మవ్యాధులు రా కుండా కాపాడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఆషాఢ ప్రత్యేకత.. ఆషాఢంలో ఏదో ఒకరోజు గోరింటాకు పెట్టుకోవాలన్నారు మన పూర్వీకులు. ఆనాటి సంప్రదాయాలు నేటికీ కొనసాగుతున్నాయి. గోళ్లకు రంగునిచ్చే గోరింటాకుకు సఖరంజని అని కూడా పేరుంది. నేటి ఆధునిక కాలంలో గోరింటాకు పేరుతో కోన్లు, పేస్టులు వస్తున్నాయి. అవి రంగును, అందాన్ని ఇస్తాయి తప్పా.. ఔషధ గుణాలుండవు. ప్రయోజనాలు.. మైదాకు వేళ్లకు పెట్టుకోవడం వల్ల గోళ్లు పెలుసుబారి పోకుండా కాపాడుతుంది. ఆకులే కాకుండా పూలు, వేర్లు, బెరడు, విత్తనాలు కూడా ఔషధ యుక్తాలే. వీటితో శరీరంలో అలర్జీలను దూరం చేసుకోవచ్చు. బోధకాల వ్యాధి, ఏనుగు కాలు(లింపాటిక్ పైలేరియాసిస్) దరి చేరదు. ఆటలమ్మ మచ్చలు పోగొట్టాలంటే గోరింటాకును బాగా నూరి పూస్తే మంచి ఫలితాన్నిస్తుంది. నెలకోసారి గోరింటాకు ముద్దను తలకు ప్యాక్ వేసుకుంటే జట్టు బలపడి రాలదు. గోరింటాకు పాడి కాచిన నూనెను వాడడం చిట్కా వైద్యంలో ఒకటి. గోరింటాకు ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. ఇది శరీరాన్ని తాకటం వల్ల అందులోని లాసోన్ అనే సహజమైన రసాయనంతో ఎరుపు రంగు ఏర్పడుతుంది. కోన్లలో కృత్రిమంగా ఎరుపు రంగు కలిగించే రసాయనాలు కలపడం వల్ల ఆరోగ్యం మాటెలా ఉన్నా.. కొన్ని అలర్జీలు ఏర్పడే ప్రమాదం లేకపోలేదు. తయారు చేసే విధానం మైదాకులో చింతపండు వేసి మధ్యలో నాలుగు బొట్లు మజ్జిగ వేస్తూ రోట్లో రుబ్బాలి. నాణ్యమైన గోరింటాకు ఎంచుకొని ఆకులు లేదా పొడిని వేడి నీళ్లలో కలిపి రాత్రంతా నానబెడితే మంచి రంగులో పండుతుంది. మెహందీ, హెన్నాకు కాఫీ పొడిని కలిపి రాత్రంతా నానబెట్టాలి. తర్వాత రోజు పెట్టుకోవాలి. దీంతో కాఫీ బ్రౌన్ కలర్లో పండుతుంది. నిమ్మ రసంలో పంచదార వేసి చిక్కటి సిరప్ తయారు చేసుకోవాలి. మెహందీ చేతులకు పెట్టుకున్నాక తడారే సమయంలో లెమన్ షుగర్ సిరప్‌ను చేతులకు పెట్టుకోవాలి.మైదాకుతో ఆరోగ్యం పొలాల్లో పని చేసే మహిళలకు గోరింటాకు మంచి ఆరోగ్యాన్నిస్తుంది. ఇ ప్పుడు రెడీమెడ్ రావడం, రసాయనిక పేస్టులు వాడటంతో చర్మవ్యాధు లు వస్తున్నాయి. కొత్తగా పెళ్లయిన యువతులు ఆషాఢంలో తల్లిగారింటికి వచ్చి గోరింటాకు పెట్టుకొని మురిసిపోవడం ఆనవాయితీ. పట్టణాల్లో చాలామంది కోన్లను ఉపయోగిస్తున్నారు. – శ్వేతమగువ కిట్టీ పార్టీ ఆధ్వర్యంలో.. మా మగువ కిట్టీ పార్టీ ఆ« ద్వర్యంలో ప్రతి సంవత్స రం ఒక పెద్ద పండుగ లా గా నిర్వహించుకుంటాం. అందరం ఒకచోట కలు సుకొని పూజలు నిర్వహిస్తాం. అనంతరం మెహందీని చేతులనిండా పె ట్టుకుంటాం. రోజంతా సంబరంగా గడుపుతాం. – చకిలం స్వప్నసంప్రదాయం.. ఔషధం మైదాకు చేతులకు పెట్టుకోవడం సంప్రదాయంతోపాటు మంచి ఔషధం. ఇది పూర్వం నుంచి వస్తు న్న ఆచారం. నేడు కోన్లు వచ్చాయి. యువతులు కావాలంటే కోన్లను వాడాల్సి వస్తుంది. మంచి కంపెనీలకు చెందిన గోరింటాకు కోన్లలో ఎలాంటి సైడ్ ఎఫెక్టులుండవు. శుభకార్యాలకు మహి ళలు తప్పక మైదాకు పెట్టుకుంటున్నారు. – ఉమ అనాదిగా వస్తున్న ఆచారం గోరింటాకులో మంచి ఔష ధ గుణాలున్నాయి. ఇది పూర్వం నుంచి వస్తున్న సంప్రదాయం మాత్రమే కాకుండా.. వాతావరణంలో జరుగుతున్న మార్పుల వల్ల సంభవించే శరీర రుగ్మతలను తొలగించే చక్కటి ఔషధం కూడా. అందుకే ఆషాఢంలో గోరింటాకును తప్పకుండా పెట్టుకుంటా. – సాహితి ఇష్టమైన పండుగ మెహందీ అంటే ఇష్టపడని మహిళలుండరు. పసి పిల్లల నుంచి మొదలుకొని పండు ముసలివారి వరకు ప్రతిఒక్కరూ మైదాకును ఇష్టపడతారు. ప్రస్తత కాలంలో కోన్లు వచ్చినా ఆషాఢంలో మాత్రం గోరింటాకును నూరి చేతులకు పెట్టుకుంటారు. – ప్రవళిక ఆషాఢ మాసంలో.. ఊహ తెలిసిన నుంచి ప్రతీ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటున్నా. ఆ షాఢం వచి్చందంటే మా ఇంట్లో మైదాకు పండగ వాతావరణం అలుముకుంటుంది. ఆషాఢ మాసంలో మా చేతులన్నీ మెహందీలమయమవుతాయి. నెల మొత్తం పెట్టుకుంటాం. – లక్ష్మి -
ఆషాఢం ఆరంభం
నేటినుంచి ఆషాఢమాసం ఆరంభం అవుతోంది. ΄పార్ణమినాడు చంద్రుడు ఉత్తరాషాఢ/పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోనికి వచ్చే నెలకే ఆషాఢమాసం అని పేరు. ఇది సంవత్సరంలో నాలుగవ మాసం. దీనిని శూన్యమాసమని కూడా అంటారు. ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి దక్షిణాయనం మొదలయేది ఈ మాసంలోనే. పేరుకు శూన్యమాసమే అయినా పూరీ జగన్నాథ రథయాత్ర నుంచి తొలి ఏకాదశి, గురు పూర్ణిమ, గ్రామ దేవతలకు సమర్పించే బోనాలు ఈ మాసంలోనే. ఆషాఢ మాసంలో చేసే స్నానం, దానం, జపం, పారాయణలు, విశేష ఫలితాన్నిస్తాయి. ఆషాడంలో చేసే సముద్ర, నదీ స్నానాలు ఎంతో ముక్తిదాయకాలు. ;పాదరక్షలు, గొడుగు, ఉప్పు దానం చేయడం శుభకరం. -
బంగారు బోనం కోసం ఏర్పాట్లు షురూ
చార్మినార్: రానున్న ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని ఏటా మాదిరిగానే సప్త మాతృకలకు సప్త బంగారు బోనం సమర్పించేందుకు భాగ్యనగర్ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా బంగారు పాత్రలోని నైవేద్యాన్ని ఏడు అమ్మవారి ఆలయాలకు తీసుకెళ్లి సమర్పించేందుకు జోగిని నిషా క్రాంతికి సోమవారం మీరాలంమండిలో ఉమ్మడి ఆలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ గాజుల అంజయ్య, చంద్రకళ దంపతులు వాయినాన్ని అందజేశారు. జులై 7న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమరి్పంచే బంగారు బో నంతో బంగారు బోనం కార్యక్రమాలు ప్రారంభమవుతాయని గాజుల అంజయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ మాజీ చైర్మన్ పొటేల్ సదానంద్ యాదవ్, మధుసూదన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆషాఢం... అత్తారింటి నుంచి పుట్టింటికి..
శూన్యమాసం... తెలుగు సంవత్సరాల్లో నాలుగో నెల ఆషాఢం. పూర్వాషాఢ నక్షత్రంలో కూడిన పౌర్ణమి ఉన్న నెలయే ఆషాఢ మాసం. ఈ మాసంలోనే వర్షఋతువు ప్రారంభమవుతుంది. పౌర్ణమి రోజున చంద్రుడు ఉత్తరాషాఢ/పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోనికి వచ్చే నెలగా తెలియజేస్తారు. ఉత్తరాయన పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయనం ప్రారంభమైన మాసం కనుక ఆషాఢ మాసం శూన్యమాసం. ఈమాసంలో గృహప్రవేశం వివాహం వంటి శుభకార్యాలు చేయకూడదని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అయి తే దేవతారాధనలకు, శక్తి ఆరాధనలకు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. పర్వదినాలు ప్రారంభం ఆషాఢం అనే పదం ‘ఆది’ అనే సంస్కృత పదం నుంచి ఉద్భవించింది. ఆది అనగా శక్తి అనే అర్థాన్ని తెలియజేస్తుంది. కావున ఆషాఢ మాసంలో దేవతల ను పూజించడం అనేది పరమ పవిత్ర కార్యమని భ క్తులు విశ్వసిస్తారు. అందుకే ఈ మాసంలో పవిత్రమై న పూజలు, వ్రతాలు, రథయాత్రలు, పల్లకీసేవలు అధికంగా జరుగుతుంటాయి. దేశంలోని ప్రముఖ మైన పూరి జగన్నాథుని రథయాత్ర సైతం ఆషాఢమాసంలోనే జరగడం విశేషం. అందుకే ఈ నెలలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. పండితులు పూజా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటా రు. తొలి ఏకాదశి నుంచి పండుగలు ప్రారంభమవుతాయి. ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున మహావిష్ణువు పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా వ్యవహరిస్తారు. ఆషాఢ శుద్ధపౌర్ణమి రో జున గురుపౌర్ణమిగా పరిగణిస్తారు. ఈ మాసంలో స్కంద పంచమి, ‘దక్షిణాయన పుణ్యకాలం’ కూడా ప్రారంభమవుతుంది. అంతేకాకుండా రాష్ట్రంలో ప్ర తిష్టాత్మకంగా నిర్వహించే బోనాల ఉత్సవాలు ఆ షాఢంలోనే అంగరంగ వైభవంగా ఆరంభమవుతా యి. వర్షాకాలం రాకతో ఈ ఉత్సవాలు ప్రారంభం కావడం కొంత శాసీ్త్రయతను సైతం కలిగి ఉంటాయి. అత్తారింటి నుంచి పుట్టింటికి.. కొత్తగా పెళ్లయిన అమ్మాయిలు ఆషాఢమాసంలో అత్తారింటి నుంచి పుట్టింటికి వెళ్తారు. ఆషాఢంలో అత్తాకోడళ్లు ఒకరినొకరు చూసుకోకూడదని సంప్రదాయబద్ధంగా వస్తోంది. కొత్తగా పైళ్లె అత్తారింట్లో అడుగిడిన అమ్మాయిలు తల్లిదండ్రులపై బెంగతో ఉంటారు. వీరు ఆషాఢమాసంలో పుట్టింటికి వెళ్లి తోబుట్టువులు, స్నేహితురాళ్లతో కలిసి వేడుకలు జరుపుకుంటారని ప్రతీతి. గోరింట మెరుపులు గోరింటాకును అతివలు అమితంగా ఇష్టపడతారు. వాటిని తమ అరచేతుల్లో వేసుకుని ఎర్రగా పండితే మురిసిపోతారు. ఏ పర్వదినాలకై నా శుభకార్యానికై నా గోరింటాకు ఉండాల్సిందే. ముఖ్యంగా ఆషాఢ మాసంలో గోరింటాకు ధరించడం అనేది ఆనవాయితీగా వస్తోంది. గ్రీష్మ రుతువు అనంతరం వర్ష రుతువులో ఆషాఢ మాసం వస్తుంది. ఈ సమయంలో గ్రీష్మ రుతువులో మన శరీరం వేడితో కూడుకుని ఉంటుంది. ఆషాఢంలో బయటి వాతావరణం చల్లబడిపోతుంది. ఈ కారణంగా గోరింటను అరచేతుల్లో ధరిస్తే శరీరంలోని వేడి బయట చల్లబడిన వాతావరణానికి విరుద్ధంగా తయారవుతుంది. చర్మ సమస్యలు కూడా దరి చేరవు. గోరింటాకు శరీరంలో ఉండే వేడిని తగ్గించే శక్తిని కలిగి ఉండడంతో పాటు రోగనిరోధక శక్తిని సైతం పెంచుతుంది. ఆషాఢంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం వలన సౌభాగ్యాన్ని పొందిన వారవుతారని జ్యోతిష్యులు తెలియజేస్తున్నారు. -
Ashada Masam 2022: ముగిసిన ఆషాఢ మాసం ఉత్సవాలు
-
సీత్ల పండుగ; ఆటా, పాటా సంబురం
గిరిజనులైన లంబాడీలు (బంజారాలు) ఎంతో పవిత్రతో జరుపుకునే మొదటి పండుగ సీత్ల పండుగ. ఆ రోజు సీత్లా భవానీని పూజిస్తారు. కలరా వంటి మహమ్మారులు ప్రబలకుండా భవానీ కాపాడుతుందని బంజారాల నమ్మకం. తండాలో ఉన్న పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు వంటివి పెరగాలనీ, దూడలకు పాలు సరిపోను ఉండాలనీ, గడ్డి బాగా దొరకాలనీ, క్రూర మృగాల బారిన పడకుండా ఉండాలనీ, అటవీ సంపద తరగకూడదనీ, సీత్ల తల్లికి మొక్కులు తీర్చు కుంటారు. వివిధ తండాల్లో ఆయా తండాల పెద్ద మనుషు లంతా కలిసి ఆషాఢమాసంలో ఒక మంగళవారాన్ని ఎంచుకొని సీత్ల పండుగను జరుపుతారు. ఇలా ప్రతి సంవత్సరం మంగళవారం రోజు మాత్రమే జరపడం ఆనవాయితీగా వస్తోంది. తండాల సరిహద్దుల్లోని పొలి మేరల కూడలి వద్ద సీత్ల భవానీని ప్రతిష్టిస్తారు. పురుషులంతా డప్పు వాయిద్యాలు వాయిస్తూ కోళ్లు, మేకలతో; మహిళలు బోనాలు ఎత్తుకుని నృత్యాలు చేసుకుంటూ అమ్మవారు ఉన్న ప్రదేశానికి వెళ్తారు. ఈ క్రమంలో అందరూ కలిసి పాటలు పాడుతారు. ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవారికి నైవేద్యంగా గుగ్గిళ్లు, లాప్సి పాయసం సమర్పిస్తారు. కోళ్లు మేకలను బలి ఇచ్చి వాటి పైనుంచి పశువులను దాటిస్తారు. ఓ బంజారా పెద్ద మనిషిని పూజారిగా ఉంచి ఆయన చేతుల మీదుగా దేవత పూజా కార్యక్రమం నిర్వహిం చడం బంజారాల ఆచారం. పూజా కార్యక్రమం అంతా గిరిజన సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. – నరేష్ జాటోత్, నల్లగొండ -
ఆషాడంలో కొత్త జంట కలిసి ఉంటె ఏం అవుతుంది ?
విద్యానగర్(కరీంనగర్) పెళ్లయిన కొత్త దంపతులు ఆషాడంలో నెల రోజుల పాటు విడిగా ఉండాలనే నిబంధన వెనుక శాస్త్రీయ కారణాలున్నాయి. తొలకరి వర్షాల అనంతరం వ్యవసాయ పనులు ఊపందుకుంటాయి. సాగు పనుల్లో కుటుంబ సభ్యులందరూ భాగస్తులయ్యేవారు. కొత్త అల్లుడు ఇంటికి వస్తే మర్యాదలు చేసే అవకాశం ఉండదనేది ఒక కారణం. మరో కోణంలో... ఆషాడ∙మాసంలో గ ర్భం దాల్చితే ప్రసవ సమయానికి ఏప్రిల్ నెల (ఛెత్రమాసం) వస్తుంది. ఎండలు మండే ఈ కాలంలో ప్రసవం జరిగితే లేత శిశువు తట్టుకోలేదని, తల్లీ బిడ్డల ఆరోగ్యం ప్రభావితమవుతుందని ఈ నియమాన్ని విధించారు. పైగా నెల రోజుల ఎడబాటు భా ర్యభర్తల మధ్య అనురాగబంధాన్ని మరింత పెంచుతుందనేది కూడా మరో కారణం. అయితే వివాహమైన తొలి ఏడాదిలో వచ్చే ఆషాడంలో కొత్త జంట కలిసి ఉండకూడదనే నియమం అనాది నుంచి ఆచరణలో ఉంది. అత్తా, కోడళ్లు ఒకే గడప దాటరాదని, ఒకరినొక్కరు చూసుకోరాదనే నిబంధనను ఇప్పటికీ అనుసరిస్తుండగా.. ఆషాడంలో ఎడబాటుపై కొత్త దంపతుల అభిప్రాయాలు వారి మాటల్లోనే.. ఆచారాలు మంచివే.. మన ఆచారాలు, సంప్రదాయాలు మంచివే. వాటిని ఆచరించడం కూడా మంచిదే. శాస్త్రీయతతో కూడిన మన ఆచారాలు పాటించాలి. అప్పుడే అందరికీ మంచి జరుగుతుంది. – నాగుల అనిల్‌కుమార్–శ్రీజ, మంకమ్మతోట, కరీంనగర్ ఉద్యోగాలరీత్యా సాధ్యం కాదు ప్రస్తుతం భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగాలరీత్యా దూరంగా ఉండడం కొంచం కష్టమే. నెలరోజుల సెలవులంటే సాధ్యం కాదు. మెట్టింటి వారికి దూరమే కనుక ఆషాడ సంప్రదాయం పాటిస్తున్నట్లే కదా. – తాల్లం సతీశ్–రవళి, భగత్‌నగర్, కరీంనగర్ ప్రేమ పెరుగుతుంది దూరం ఇద్దరి మధ్య ప్రేమను పెంచుతుంది. అనుబంధాలు మరింత గట్టిపడుతాయి. ఒక్కరి గురించి ఒక్కరు ఆ లోచించే సమయం లభిస్తుంది. దీంతో ఇద్దరి మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. – సంగోజు మనీశ్–మౌనిక, జ్యోతినగర్, కరీంనగర్ ఎడబాటు మంచిదే.. పెళ్లి తర్వాత కొంత ఎడబాటు మంచిదే. మాములుగా అంతే ఎడబాటు ఎవరు ఆచరించరని ఆషాఢం మంచిది కాదనే వాడుకలోకి పూర్వీకులు తీసుకొచ్చారు. ఏదైనప్పటికీ దూరం అనుబంధాన్ని పెంచుతుంది.– పీసర మహేందర్–దీపిక, చింతకుంట, కరీంనగర్ శాశ్వత బంధానికి పునాది అవుతుంది శాస్త్రీయ నియమాలతో రూపొంది, అనాదిగా ఆచరణలో ఉన్న సంప్రదాయాలను అందరూ గౌరవించాలి. ఆషాడ మాసం నవ దంపతులకు జీవన మాధుర్యాన్ని రెట్టింపు చేస్తుంది. విరహంతో అనురాగబంధం ద్విగుణీకృతమవుతుంది. వివాహమనే శాశ్వత బంధానికి ఆషాఢంలో ఎడబాటు మంచి పునాది అవుతుంది. – పవనకృష్ణ శర్మ, ప్రధానార్చకులు, దుర్గాభవానీ ఆలయం, నగునూర్, కరీంనగర్ -
అత్తింటి సారె: వామ్మో.. అల్లుడి కళ్లు బైర్లు కమ్మేలా..
యానాం: నవ వధువు ఇంటి నుంచి అత్తారింటికి ఆదివారం పంపిన ఆషాఢ కావిడి ఇది. స్థానిక వ్యాపారవేత్త తోట రాజు కుమారుడు పవన్‌కుమార్‌కు రాజమహేంద్రవరానికి చెందిన బత్తుల బలరామకృష్ణ కుమార్తె ప్రత్యూషాదేవికి గత నెల 21న వివాహమైంది. ఆషాఢ కావిళ్లుగా 100 రకాల స్వీట్లు, వెయ్యి కిలోల చొప్పున పండుగొప్ప చేపలు, కొరమేనులు, కూరగాయలు, 250 కిరాణా సరకులు, 1500 కిలోల చెరువు చేపలు, 350 కిలోల రొయ్యలు, 250 కిలోల బొమ్మిడాయిలు, 10 మేకపోతులు, 50 పందెం పుంజులు ఊరేగింపుగా తీసుకురావడం స్థానికంగా ఆశ్చర్యానికి గురిచేసింది. బిందెలతో తీసుకు వచ్చిన తినుబండారాలు -
ఆషాఢం వచ్చిందంటే గోరింటాకు.. ఎందుకంటారు!
జనగామ: ఆషాఢమాసాన్ని శూన్య మాసమంటారు. ఈ మాసంలో వివాహాది శుభకార్యాలకు దూరంగా ఉంటారు. కానీ ఈ మాసం అనేక పర్వదినాలకు పెట్టింది పేరుగా నిలుస్తుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి విష్ణు ఆరాధనకు అత్యంత ముఖ్యమైన తిథి. దీనికి తొలి ఏకాదశి అని పేరు. ఇక్కడి నుంచి ప్రతి వారం, పదిహేను రోజులకోసారి ఏదో ఒక పండగ, వ్రతం, పూజ చేసుకుంటారు. తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస్య వ్రతం ప్రారంభిస్తారు. క్షణాయనం ప్రారంభమయ్యేది ఈ మాసంలోనే. ఆషాఢమాసం అందరూ గోరింటాకు తప్పక పెట్టుకోవాలని ఆయుర్వేద శాస్త్రజ్ఞులు చెబుతుంటారు. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు గోరింటాకు గుర్తుకు వస్తుంది. ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజు గోరింటాకు పెట్టుకోవాలని పూర్వీకుల నుంచి వస్తుంది. గోరింటాకు ఎరుపు రంగును ఇస్తుంది. ఎరుపు సూర్యునికి ప్రతీక. అరచేతిలో సూర్యుడిలా గుండ్రంగా పెడతారు. నెలవంక పైన చుక్క గోరింటాకు శరీరపు ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేస్తుంది. ఈ సీజన్లో తొలకరి మొదలై వర్ష రుతువుగా మారి జోరుగా వర్షాలు కురుస్తాయి. వర్షం నీటిలోనే పనులు చేసుకునే సీజన్ ఇది. శాస్త్రీయ ప్రయోజనాలు కూడా.. ముఖ్యంగా పొలం పనులు చేసుకునే రైతు కుటుంబాలు గంటల తరబడి నీటిలోనే పనిచేయాల్సి ఉంటుంది. దీంతో చర్యవ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుంది. గోరింటాకు యాంటీ బ్యాక్టీరియా గుణాలు కలిగి ఉంటుంది. ఇది పెట్టుకుని పనులు చేసిన వారికి వర్షంలో తడిసిపోయినా చర్యవ్యాధులు దరిచేరవు. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో కఫసంబంధమైన దోషాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. వేడిని తగ్గించే గుణం ఉన్న గోరింటాకు బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇక ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక పలు శాస్త్రీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అందం, ఆనందం కోసం గోరింటాకు పెట్టుకోవడం మొదలైంది. కాలక్రమేణ పట్టణ ప్రాంతాల్లో వేడుకలు చేసుకోవడం ఆచారంగా మారింది. పెళ్లయిన వారైతే వారి కడుపు, కాపురం కూడా చక్కగా పండుతాయని పెద్దలు అంటుంటారు. కొత్త పెళ్లి కూతురుకు అందం.. ఆషాఢంలో కొత్త పెళ్లి కూతురు తమ పుట్టింటికి చేరుకోవడం అనాధి నుంచి వస్తుంది. గోరింటతో చేతులను పండించుకునే వారి సౌభాగ్యాన్ని కాంక్షిస్తుందని నమ్ముతారు. కేవలం ఆషాఢ మాసంలోనే గోరింటాకు దొరుకుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడపడితే అక్కడ కోన్లు అందుబాటులోకి వచ్చాయి. గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. కానీ చాలా రకాల కోన్లలో కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు మిక్సింగ్ చేస్తున్నారు. వీటి వల్ల ఆరోగ్యం మాట అటుంచితే చర్మవ్యాధులు ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. మహిళలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకును మాత్రమే వాడుకునేలా ప్రాధాన్యతను ఇవ్వాలి. గోరింటాకు అందం ఆరోగ్య, సౌభాగ్యానికి చిహ్నంగా నిలుస్తుంది. అమ్మవారికి ప్రతీకగా.. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం అనాదిగా వస్తుంది. గోరింటాకు అమ్మవారికి ప్రతీకగా భావిస్తారు. ఈ మాసంలో అమ్మవారిని శాకంబరీ మాతగా అలంకరిస్తారు. మైదాకులో లక్ష్మిదేవి రూపాన్ని చూసుకుంటారు. ఆషాఢంలో శుభగడియలు లేకున్నా వ్రతాలు, పూజలు చేసుకుంటారు. – ఆరాధ్యశర్మ, వేదపండితులు, జనగామ -
కనక దుర్గమ్మకు ఆషాఢ సారె..
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు ఆలయ వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు పవిత్ర సారెను సమర్పించారు. వైదిక కమిటీ కమిటీ సభ్యులు,అర్చకులకు ఆలయ మర్యాదలతో ఈవో ఎంవీ సురేష్‌బాబు స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సారె సమర్పించారు. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను తమ ఆడపడుచుగా భావించి భక్తులు సారె సమర్పించుకుంటారు. ఆషాఢంలో ప్రతి ఏడాది పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అమ్మవారికి సారె సమర్పిస్తారన్నారు. ఈ నెల 20వ తేదీ వరకు ఆషాఢ సారె మహోత్సవం కొనసాగుతుంది. -
అందుకే అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి!
సాక్షి, విశాఖపట్టణం : ఆషాఢమాసం ప్రారంభమైంది. కొత్తగా వివాహమైన కోడలు అత్తారింటిలో ఈ మాసంలో ఉండకూడదన్న విశ్వాసం ఉంది. ఈ మాసమంతా ఎలాంటి శుభ కార్యాలు కూడా చేయరు. ఏటా చిన్నా, పెద్ద ముహుర్తాలు తొమ్మిది నెలల పాటు ఉంటాయి. కేవలం ఆషాఢం, పుష్యం, భాద్రపదం మాసాలలో మాత్రమే శుభముహూర్తాలు ఉండవు. మిగతా తొమ్మిది మాసాలు ముహూర్తాలు వరసగా ఉంటాయి. ఈసారి ఆషాఢం, భాద్రపదానికి తోడు శుక్రమౌఢ్యంతో శ్రావణమాసం రావడంతో మంచి ముహూర్తాలకు విరామం ఏర్పడింది. శుక్రమౌఢ్యం ఉన్న రోజుల్లో పెద్ద శుభ కార్యాలు చేయరు. కేవలం నామకరణాలు, జన్మదినోత్సవాల లాంటివి మాత్రమే చేసుకోవచ్చునని పండితులు పేర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో మౌఢ్యం నియమం పాటించని వారు మాత్రం శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆషాఢం ఆఫర్ల వరద ఈ మాసం వస్తుందంటే వ్యాపారులు ఆఫర్లతో ఊదరగొట్టేస్తారు. వస్త్రాల నుంచి నగల వరకు మార్కెట్లో ప్రత్యేక బహుమతులతో, ధరలతో అలంకార ప్రియు లను ఆకర్షిస్తారు. తూకాల్లో వస్త్రాల విక్రయాలు, ఒకటి కొంటే ఒకటి ఉచితం, లక్కీ డ్రాలు తదితర ఆకర్షణీయ ప్రకటనలతో కొనుగోలుదారులను వ్యాపారులు ‘రారండి’అంటూ ఆహ్వానించేలా ఆఫర్లు ఇస్తారు. అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి కొత్తగా పెళ్లయిన జంట ఒకరిని విడిచి ఒకరు ఉండి తీరాలన్న కఠిన నిబంధనను ఆషాఢ మాసమంతా అనుసరిస్తారు. ఎందుకంటే సాగు పనులు పుష్కలంగా ఉండే ఈ సీజన్లో కొత్త అల్లుడికి మర్యాదలు సరిగా చేయలేమనే భావన, సాగు పనులు స్తంభించిపోతాయనే ఆలోచన ఈ నిబంధనకు కారణంగా చెప్తారు. పైగా ఈ సమయంలో గర్భధారణ అంత ఆరోగ్యకరం కాదు. పరిసరాల్లోని నీళ్లు కలుషితం అయి ఉంటాయి. ఈ నీరు తాగడం వల్ల చలిజ్వరాలు, విరోచనాలు, తలనొప్పి మొదలైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. వ్యాధులు విస్తరించే కాలంలో అశుభ సమయాల్లో గర్భధారణ జరిగితే అది పుట్టే శిశువుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోంది. దీంతో పాటు ఈ కాలంలో గర్భధారణ జరిగితే ప్రసవం వచ్చే ఎండాకాలంలో జరిగే అవకాశం ఉంటుంది. తీవ్ర మైన ఎండలు కాచే సమయం ఉదయించే శిశువుకు మంచిది కాదు. ఈ నెల వియోగం పాటిస్తే జూలై, ఆగస్టుల్లో ప్రసవం జరుగుతుంది. ఇన్ని కారణాలున్నాయి కాబట్టి ఎడబాటు మంచిదే. మూడు నెలలు ఖాళీనే.. శుభ ముహూర్తాలు లేకపోవడంతో ముఖ్యంగా వివాహాలకు అనువైన రోజులు లేకపోవడంతో.. ఫంక్షన్ హాళ్లు, సంబంధిత వ్యాపారాలు కళ తప్పనున్నాయి. శూన్యమాసాలాకు తోడు మౌడ్యమి రావడంతో పెళ్లిళ్లు చేసుకునే అవకాశాలు తక్కువ. శుభ కార్యాలపై ఆధారపడి జీవించే వేలాదిమందికి ఈ విరామం కాలం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. టైలర్లు, బాణాసంచా, భాజాభజంత్రీలు, వంట మాస్టర్లు, కూలీలు, పారిశుద్ధ్య ›పనులు చేసేవారికి రోజు వారీ కూలీ లభించే అవకాశం ఉండదు. పందిళ్లు, షామియానాలకు కూడా గిరాకీ తగ్గనుంది. ఫంక్షన్ హాళ్లు, ప్రింటింగ్ ప్రెస్‌లు, పురోహితులకు కూడా చేతినిండా పని ఉండదు. అక్టోబర్ నుంచి మంచి రోజులు ‘అక్టోబరు 2 నుంచి మళ్లీ శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఈ శుభ ముహూర్తాలు డిసెంబర్ 12 వరకు కొనసాగుతాయి. డిసెంబర్ 14 నుంచి గురు మౌఢ్యమి కారణంగా మార్గశిర మాసంలో శుభ కార్యాలకు కాస్త విరామం ఏర్పడుతుంది. గురుమౌఢ్యమి జనవరి 10తో ముగియనున్నప్పటికీ పుష్య మాసం ఉండడంతో వివాహాలు, తదితర శుభ కార్యాల కోసం మంచి ముహూర్తాలు లేవు. శుభ ముహూర్తాలు తిరిగి మాఘమాసం అంటే జనవరి 26 నుంచి మాత్రమే ప్రారంభం కానున్నాయి’ అని వేద పండితులు చెబుతున్నారు. శుభకార్యాలకు విరామం మనదేశం వ్యవసాయ ప్రధానమైంది. ప్రతీ పల్లెలో వ్యవసాయాధారిత కుటుంబాలు ఉంటాయి. చినుకులు కురిసి ఖరీఫ్ పంటలకు అనుకూలంగా ఉండేది ఇదే నెలలో. సాగు పనులు, దుక్కి దున్నడం, నాట్లు వేయడం తదితర కార్యక్రమాలన్నీ చేస్తారు. సేద్యపు పనులకు ఆటంకాలు ఉండకూడదు కాబట్టి శుభకార్యాలు జరిపే వీలు ఉండదు. భానుసప్తమి ఆషాఢమాసంలో వచ్చే ఏడో రోజు అనగా సప్తమి తిథిని భాను సప్తమి,రథ సప్తమిగా భావిస్తారు. ప్రకృతికంతటికీ వెలుగు ప్రసాదించి సూర్యున్ని దైవంగా భావించడం ఈ తిథి ప్రత్యేకం. ఏడు గుర్రాల రేడు అనగా ఏడు వర్ణాల మేళవింపు అయిన సూర్యకాంతి కారణంగానే ప్రకృతి పచ్చటి శోభను సంతరించుకుంటుంది కాబట్టి సనాతన ధర్మం ప్రకారం సూర్యుడు సైతం దైవ సమానుడయ్యాడు. ఉత్తరం నుంచి దక్షిణం వరకు పయనిస్తున్న సూర్యుడు మూడునెలల తర్వాత మధ్యకు చేరుకుంటాడు. ఆ రోజున రాత్రి, పగలు, క్షణం కూడా తేడా లేకుండా సమానంగా ఉంటాయి. తొలిపండుగ ఏకాదశి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజునే తొలి ఏకాదశి అంటారు. త్రిలోక పరిపాలకుడు విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకునేందుకు ఎంచుకున్న రోజిది కాబట్టి ఇది శయన ఏకాదశి. తిరిగి నాలుగు నెలల తర్వాత ఉత్థాన ఏకాదశి రోజున మేలుకుని ఉత్తరద్వార దర్శనం ఇస్తాడు. అందుకే ఈ నాలుగునెలల పాటు ఆధ్యాత్మిక సంప్రదాయ వాదులు చాతుర్మాస దీక్షలు ఆచరిస్తారు. క్రిమి కీటకాదులు అతిగా సంచరించే అవకాశం ఉన్నందును ముని దీక్షలు ఆచరించే వారు బయట తిరగకుండా ఆశ్రమాల్లోనే ఈ దీక్షలను ఆచరించేవారు. వ్యాస పూర్ణిమ తల్లిదండ్రుల తర్వాత దైవ సమానంగా భావించే గురు పౌర్ణమి ఇదే మాసంలో వస్తుంది. త్రిమూర్తి స్వరూపుడైన గురువును ఆరాధించే పర్వదినం గురుపూర్ణిమ. వేదాలను సృష్టించిన వ్యాస మహర్షినే ఆదిగురువుగా భావించి వ్యాస పౌర్ణమిని గురు పూజోత్సవంగా జరుపుకుంటారు. పంచమ వేదం మహాభారతం, శ్రీమద్భాగవతం లాంటి పరమోన్నత సంపద అందించిన వేద వ్యాసుడుని తొలి గురు వుగా భావించి ఆరాధించడం సంప్రదాయంగా వస్తోంది. మగువలు ఇష్టపడే గోరింటాకు ఆషాఢం వచ్చేసింది. అర చేతిలో గోరింటాకు పండుతోంది. మగువల అలంకరణలో గోరింటాకు అగ్రస్థానంలో ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో విచ్చలవిడిగా మెహిందీలు, కోన్లు దొరుకుతున్నా గోరింటకున్న ప్రాధాన్యం దానిదే. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో తప్ప పట్టణ ప్రాంతాల్లో గోరింట మొక్కలు దాదాపు కనుమరుగయ్యాయి. ఆషాఢమాసం వచ్చిందంటే చాలు పల్లెల్లో గోరింటాకు పెట్టుకోవడం మహిళలకు సంప్రదాయంగా వస్తోంది. ఈ మాసంలోనే లేతాకు లభ్యం వాస్తవానికి ఆషాఢ మాసంలోనే లేత గోరింటాకు దొరుకుతుంది. లేతాకైతేనే బాగా పండుతుందని మహిళల నమ్మకం. వర్షాలు పడిన తరువాత చిగురించిన లేత గోరింటాకును నూరి చేతులు, కాళ్లకు పెట్టుకుంటే ఎర్రగా పండుతుంది. ఇంట్లో పనులన్నీ అయిపోయాక పడుకునే ముందు కుటుంబమంతా ఓ చోట చేరి గోరింటాకు ముద్దను మహిళల చేతులు, కాళ్లకు నచ్చిన డిజైన్లతో అలంకరించి రాత్రంతా ఉంచుకుంటారు. తెల్లవారు జామున పండిన గోరింటాకును చూసుకుంటూ మురిసిపోతారు. నీదెలా పండిందో.. నాదెలా పండిందో చూపించంటూ చిన్నా, పెద్దా తేడా లేకుండా మురిసి పోతుంటారు. కమ్మరేకుకు కూడా ప్రాధాన్యమే.. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో గోరింటాకు నూరేటప్పుడు కమ్మరేకులకు కూడా అధిక ప్రాధాన్యమిచ్చేవారు. సిద్ధం చేసుకున్న గోరింట మిశ్రమాన్ని బట్టి మూడిళ్లు లేదా ఆరిళ్ల తాలూకా కమ్మ రేకుల ముక్కలను సేకరించి గోరింటాకులో కలిపి మెత్తగా నూరేవారు. ఇలా చేస్తే బాగా పండటమే కాకుండా ఎక్కువ రోజులు చేతులు, కాళ్లకు పట్టి ఉంటుందని ఉంటుందని మహిళల నమ్మకం. మారుతున్న పరిస్థితుల బట్టి గ్రామాల్లో గోరింటాకును నూరడానికి ఉపయోగించే రోళ్లు కూడా కనుమరుగయ్యాయి. వాటి స్థానంలో మిక్సీలు వచ్చి పడ్డాయి. శ్రమతో కూడుకున్న పని కావడంతో కాస్తా ఓపికున్న వారు గోరింటాకును మిక్సీలో తయారు చేసుకుంటుంటే, మరికొందరు మెహిందీ, కోన్లను ఉపయోగిస్తూ ఆధునిక పోకడలకు పోతున్నారు. సైన్స్ ఇలా చెబుతుంది గోరింటాకు మంచి యాంటీ బయాటిక్‌గా పని చేస్తుందని సైన్స్ చెబుతుంది. ఒకప్పుడు మన జీవనం పూర్తి వ్యవసాయాధారితం. మృగశిరలో నారుమళ్లు వేయడం, ఆషాఢంలో నాట్లు వేయడమనేది సంప్రదాయంగా వస్తోంది. గతంలో రైతులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా పొలం పనుల్లో ఎక్కువగా పాల్గొనేవారు. దీనివల్ల మట్టి, మురుగునీరు కాళ్లు చేతులు ద్వారా శరీరంలోకి ప్రవేశించి జ్వరాలు, చర్మవ్యాధులు వంటి రోగాల బారిన పడటం జరిగేది. ఇప్పటికీ అదే సమస్యను చూస్తూ ఉన్నాం. గోరింటాకు పెట్టుకుంటే యాంటీ బయాటిక్‌గా పనిచేసి వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది. ఆయుర్వేద వైద్యంలో కూడా గోరింటాకుకు ప్రముఖ స్థానముంది. రాన్రానూ దానిస్థానంలో కోన్లు రావడం, మెహిందీలంటూ కొత్త కొత్త డిజైన్లు రావడంతో గోరింటాకు ప్రాధాన్యం తగ్గుతూ వస్తుంది. రసాయనాలు కలిగి ఉండే కోన్ల వల్ల చర్మవ్యాధులు వస్తుండటం గమనర్హం. -
డిస్కౌంట్ల ఆషాఢం
విజయనగరం టౌన్ : ఆషాఢమాసం పూర్తి కావస్తోంది. శ్రావణ మాసాన్ని దృష్టిలో పెట్టుకుని మహిళలు దుస్తుల కొనుగోళ్లపై ఆసక్తి చూపిస్తున్నారు. వారిని దృష్టిలో పెట్టుకుని వస్త్ర దుకాణాల వారు స్పెషల్ డిస్కౌంట్ల పేరుతో పలు రకాల వస్త్రాలను మహిళలకు అందుబాటులోకి తెస్తున్నారు. అతివలు ఎక్కువ మక్కువ చూపే చీరలు, బంగారు ఆభరణాలపై వ్యాపారులు పెద్ద ఎత్తున డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు. ఆషాఢం సేల్ పేరుతో మహిళలను దుకాణదారులు ఆకర్షిస్తున్నారు. పట్టుచీరలకు డిస్కౌంటే.. వ్యాపారులు ప్రధానంగా ధర్మవరం, బెనారస్, ఉప్పాడ, కంచి, పోచంపల్లి తదితర పట్టుచీరలకు, వీటితో పాటు టిష్యూ శారీస్, కళంకారీ ప్రింట్స్, కాటన్ శారీస్, గద్వాల్, లెనిన్ కాటన్, చేనేత వస్త్రాలు, వెంకటగిరి తదితర చీరలకు గిరాకీని దృష్టిలో ఉంచుకుని డిస్కౌంట్లను పెడుతున్నారు. రూ.500 నుంచి రూ.50 వేల వరకు పట్టు, ఫ్యాన్సీ, కాటన్ చీరలు అందుబాటులోఉన్నాయి. ఇక బంగారం విషయానికి వస్తే ఆషాఢంలో దాని ధర తక్కువగా ఉంటుంది. రాబోయే శ్రావణ మాసాన్ని దృష్టిలో పెట్టుకుని లక్ష్మీ దేవీకి స్వాగతం పలికేందుకు కాసుల దగ్గర నుంచి ఆభరణాల వరకు ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేసేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. దాని కోసం ముందుగానే వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. పట్టణాల్లోని మాల్స్, బంగారు దుకాణాలకు వెళ్లి ప్రత్యేకంగా ఆర్డర్లు ఇచ్చుకుంటున్నారు. దీంతో ఎక్కడ చూసినా మార్కెట్లు కళకళలాడుతున్నాయి. చిన్నపాటి చిరుజల్లులను కూడా లెక్క చేయకుండా మహిళలు కొనుగోళ్లు చేస్తుండడం విశేషం. నవ వధువులకు వరం.. ఆషాఢ మాసంలో కన్నవారింటికి నవ వధువులు వెళ్తారు. మళ్లీ అత్తింటి వారింటికి వెళ్లే సమయంలో బంగారం, వస్త్రాలను కన్నవారు పెట్టడం ఆనవాయితీ. దానికోసం ఆషాడంలోనే ముందుగా బంగారం, వస్త్రాలను కొనుగోలు చేసుకుంటున్నారు. ఆషాఢం నుంచి శ్రావణంలోకి అడుగు పెట్టేందుకు నవ వధువులు వేచి చూస్తుంటారు. ధరలు తక్కువ.. ఆషాఢంలో ధరలు తక్కువగా ఉంటాయి. దుస్తులు కొనుగోలు చేసేందుకు మహిళలు ఎక్కువ ఉత్సాహం చూపుతారు. శ్రావణ మాసం ముందు ఉండడంతో డిస్కౌంట్లు ఉండడంతో మహిళలు ఎక్కువ మక్కువ చూపుతారు. బంగారం కూడా ఈ మాసంలోనే కొనుగోలు చేస్తారు. – భోగరాజు సూర్యలక్ష్మి, ఉద్యోగిని. ఆషాడం ఓ వరం.. మహిళలకు ఆషాఢ మాసం ఓ వరమని చెప్పొచ్చు. ఏడాదిలో ఈ నెలలోనే తక్కువ ధరలకు దుస్తులు, బంగారం కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ మాసం చివరి రోజుల్లో ధరలు మరీ తగ్గించి అమ్మకాలు జరుగుతుంటాయి. అందుకోసం ప్రత్యేక బోర్డులు కూడా మార్కెట్లో వెలుస్తాయి. ఉన్నంతలో వస్తువులను కొనుగోలు చేస్తున్నాం. – జయలక్ష్మి, గృహిణి. -
పది రూపాయల చీర పచ్చిమోసం
-
కూకట్‌పల్లిలో చీరలపై బంపర్ ఆఫర్
-
గురుపూర్ణిమ
గురువును దైవ సమానంగా ఆరాధించడం మన దేశంలో తరతరాల నాటి సంప్రదాయం. ప్రాచీన గురుకుల సంప్రదాయం శతాబ్దాల తరబడి కొనసాగింది. మన పురాణాల ప్రకారం పరమ శివుడిని ఆదిగురువుగా పరిగణిస్తారు. భగవద్గీతను బోధించిన శ్రీకృష్ణ పరమాత్ముడిని జగద్గురువుగా ఆరాధిస్తారు. కొన్ని అవతారాల్లో శ్రీమహావిష్ణువు సైతం గురువుల వద్దనే విద్యాభ్యాసం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆషాఢ శుద్ధ పూర్ణిమ నాడు పరమ శివుడు ఆదిగురువుగా ఆవిర్భవించినందున ఈ రోజును గురుపూర్ణిమగా పాటించడం యోగ సంప్రదాయంలో అనాదిగా వస్తోంది. జూలై 27న గురుపూర్ణిమ సందర్భంగా... యోగ సంప్రదాయంలో శివుడిని ఆదియోగిగా కూడా పరిగణిస్తారు. గురుపూర్ణిమ రోజుకు మరికొన్ని పౌరాణిక విశిష్టతలు కూడా ఉన్నాయి. పరాశర మహర్షికి, సత్యవతికి వ్యాస మహర్షి ఇదే రోజున జన్మించినందున గురుపూర్ణిమను వ్యాసపూర్ణిమ అని కూడా అంటారు. వ్యాసుడు మహాభారతంతో పాటు అష్టాదశ పురాణాలను రచించాడు. అపౌరుషేయాలైన వేద శ్లోకాలను సేకరించి, వాటిని రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అనే నాలుగు వేదాలుగా విభజించాడు. అందుకే వ్యాసుడికి వేదవ్యాసుడనే పేరు వచ్చింది. గురు పూర్ణిమను హిందువులు మాత్రమే కాదు, బౌద్ధులు, జైనులు కూడా పర్వదినంగా పాటిస్తారు. గురుశిష్య పరంపర గురుశిష్య పరంపర వేదకాలం నుంచే ఉండేది. నాటి గురువులు శిష్యులకు వేద విద్యను మౌఖికంగా చెప్పేవారు. వేదాలు, ఉపనిషత్తులు, ఆధ్యాత్మిక, యోగ విద్యలు మాత్రమే కాకుండా ఆనాటి గురువులు అస్త్ర శస్త్ర విద్యలు, ఆయుర్వేద, గణిత జ్యోతిష వాస్తు శాస్త్రాలు, శిల్పం, సంగీతం వంటి లౌకిక విద్యలను కూడా నేర్పేవారు. గురువుల ఆధ్వర్యంలో నడిచే గురుకులాల్లో రాజు పేద అనే తేడా లేకుండా అన్ని వర్గాలకు చెందిన పిల్లలకూ ఒకే రీతిలో విద్యలు నేర్పించేవారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత శిష్యులు గురువులకు గురుదక్షిణ సమర్పించుకునేవారు. గురుకులాల నిర్వహణ కోసం కావలసిన వనరులను రాజులు సమకూర్చేవారు. విద్యాభ్యాసానికి తగిన వయసు వచ్చిన పిల్లలను తల్లిదండ్రులు గురుకులాల్లో చేర్చేవారు. విద్యాభ్యాసం పూర్తయ్యేంత వరకు వారు గురుకులాల్లోనే నివాసం ఉండేవారు. శిష్యుల యోగక్షేమాలను గురువులే చూసుకునేవారు. గురువులకు శుశ్రూషలు చేస్తూ శిష్యులు విద్యలను నేర్చకునేవారు. యోగ వంటి ఆధ్యాత్మిక విద్యలను నేర్చుకునే వారైతే గురువును అవతారమూర్తిగా ఆరాధించేవారు. ఆధ్యాత్మిక విద్యలను నేర్చుకునే శిష్యులు మోక్షమే లక్ష్యంగా గురువుల వద్ద ఉంటూ యోగ సాధన కొనసాగించేవారు. లౌకిక విద్యలు నేర్చుకునే శిష్యులు తమ తమ విద్యల్లో తగిన ప్రావీణ్యం సాధించిన తర్వాత గురువులు వారిని ఆశీర్వదించి సమాజంలోకి పంపేవారు. వారు వివిధ వృత్తుల్లో స్థిరపడేవారు. హిందూ మతంలోని అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత సంప్రదాయాల్లోను, బౌద్ధ, జైన మతాల్లోని వివిధ శాఖల్లోనూ గురుశిష్య పరంపరకు విశిష్ట స్థానం ఉంది. గురుశిష్యుల అనుబంధానికి సంబంధించిన పలు గాథలు మన పురాణాల్లోను, ఆధ్యాత్మిక గురువుల చరిత్రల్లోనూ కనిపిస్తాయి. గురువు ఎలా ఉండాలంటే..? అద్వైత ఆచార్యుడు ఆదిశంకరాచార్యులు గురువు విశిష్టతను తన ‘ఉపదేశ సాహస్రి’లో వివరించారు. జ్ఞానసాగరంలో పయనించే శిష్యులకు గురువు నావలాంటివాడని ఆయన అభివర్ణించారు. శిష్యులకు శ్రుతులు, స్మృతులు నేర్పడమే కాకుండా, వారి నియమ నియమాలను పాటించడంలో నిష్ణాతులుగా తయారు చేయాలని, వారికి రాగద్వేషాలను అదుపు చేసుకోగల ఇంద్రియ నిగ్రహాన్ని అలవరచాలని, అరిషడ్వర్గాలకు దూరంగా వారిని సన్మార్గంలో ముందుకు నడిపించడం గురువు బాధ్యత అని విశదీకరించారు. వేద వేదాంతాల్లో నిపుణుడు, జ్ఞానసంపన్నుడు, ఈర్షా్యద్వేషాలు లేశమైనా లేనివాడు, నిస్వార్థపరుడు, యోగ సాధనాపరుడు, నిరాడంబరుడు అయిన వ్యక్తి మాత్రమే గురువు కాగలడని, అలాంటి ఉన్నత లక్షణాలు ఉన్న గురువు మాత్రమే తన శిష్యులలో అంధకార తిమిరాన్ని పారద్రోలి వారిని జ్ఞానమార్గంలో ముందుకు నడిపించగలడని ఉపనిషత్తులు చెబుతున్నాయి. తత్వం ఎరిగిన వాడు, ధర్మాన్ని బోధించేవాడు, దైవత్వంగలవాడు మాత్రమే గురువు కాగలడని జైనమతం చెబుతోంది. గురువు మాత్రమే కైవల్యప్రాప్తిని కలిగించగలడని జైనుల విశ్వాసం. దైవత్వాన్ని తెలుసుకునే జ్ఞానమార్గానికి ఆలంబన గురువు అని సిక్కులు విశ్వసిస్తారు. గురువే ‘ధమ్మం’, గురువే ‘సంఘం’ అని బౌద్ధులు నమ్ముతారు. బుద్ధత్వాన్ని పొందిన గురువును అత్యుత్తమ గురువుగా వారు పరిగణిస్తారు. దత్త సంప్రదాయంలో గురుపూజ దత్త సంప్రదాయంలో గురుపూజకు చాలా విశిష్టత ఉంది. అత్రి అనసూయల తనయుడు, త్రిమూర్తి స్వరూపుడైన శ్రీదత్తాత్రేయుడిని గురుదత్తునిగా కొలుస్తారు. దత్తాత్రేయుని అవతారాలుగా పరిగణించే శ్రీపాద శ్రీవల్లభుని, శ్రీ నృసింహ సరస్వతి స్వామిని, శ్రీ షిరిడీ సాయిబాబాను గురుపూర్ణిమ రోజున ప్రత్యేక పూజలతో ఆరాధిస్తారు. దత్త క్షేత్రాలలోను, దత్త పీఠాల్లోను, షిరిడీలోని ప్రధాన ఆలయం సహా దేశవ్యాప్తంగా గల సాయిబాబా ఆలయాల్లో గురుపూర్ణిమ వేడుకలు ఏటా మూడు రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. దత్త భక్తులు, షిరిడీ సాయి భక్తులు ఈ రోజుల్లో గురు చరిత్ర, గురుగీత పారాయణం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. తమ తమ గురువులకు ఇతోధికంగా దక్షిణలు సమర్పించి, సత్కారాలు చేస్తారు. గురుపూర్ణిమ నాడు గురుపూజ వల్ల జ్ఞాన వృద్ధి, మోక్ష సిద్ధి కలుగుతాయని నమ్ముతారు. చరిత్రలో మన ఆధ్యాత్మిక గురువులు భారతదేశ చరిత్రలో ఆధ్యాత్మిక గురువులు చాలామందే ఉన్నారు. వారిలో కొందరు తమ తమ ఆధ్యాత్మిక సిద్ధాంతాలను ప్రబోధించి, భిన్న మతాలను స్థాపించారు. వర్ధమాన మహావీరుడు జైన మతాన్ని, గౌతమ బుద్ధుడు బౌద్ధమతాన్ని క్రీస్తుపూర్వమే స్థాపించారు. ఇవి విదేశాలకూ వ్యాపించాయి. అద్వైతాన్ని బోధించిన ఆదిశంకరాచార్యులు, విశిష్టాద్వైతాన్ని బోధించిన రామానుజాచార్యులు, ద్వైతాన్ని బోధించిన మధ్వాచార్యులు త్రిమతాచార్యులుగా ప్రసిద్ధికెక్కారు. ఆదిశంకరులు జీవించిన కాలం కేవలం 32 సంవత్సరాలు మాత్రమే అయినా, ఆ స్వల్పకాలంలోనే ఆయన ఆధ్యాత్మిక రంగంలో అసాధారణమైన పురోగతిని తీసుకొచ్చారు. వివేకచూడామణి, సౌందర్యలహరి వంటి గొప్ప రచనలు చేశారు. బ్రహ్మసూత్రాలపైన, భగవద్గీతపైన వ్యాఖ్యానాలు రాశారు. రామానుజాచార్యులు 120 ఏళ్ల పరిపూర్ణ జీవితం గడిపారు. దళితులకు ఆలయ ప్రవేశం వంటి సంస్కరణలకు తెరలేపిన తొలి ఆధ్యాత్మిక విప్లవకారుడు ఆయన. ద్వైత మార్గాన్ని బోధించిన మధ్వాచార్యులు ఆదిశంకరులు, రామానుజులు చేసిన రచనలపై విమర్శనాత్మక విశ్లేషణలు చేశారు. గురు రాఘవేంద్రులు మధ్వ మార్గానికి మరింత ప్రాచుర్యం కల్పించారు. నింబకారాచార్యులు ద్వైతాద్వైత సిద్ధాంతాన్ని బోధించారు. గౌడీయ వైష్ణవ గురువు, కృష్ణభక్తుడు అయిన శ్రీ చైతన్య మహాప్రభువు భక్తి మార్గానికి ప్రాచుర్యం కల్పించారు. ఆధునిక యుగంలో మన గురువులు ఆధునిక యుగంలో కూడా పలువురు గురువులు యోగ, ఆధ్యాత్మిక మార్గాల్లో తమ తమ శిష్యులకు వెలుగు బాట చూపారు. బెంగాల్లో కాళికాదేవి భక్తుడైన రామకృష్ణ పరమహంస భగవంతుడు ఒక్కడేనని, అయితే ఆయనను చేరుకునే మార్గాలు అనేకం ఉన్నాయని బోధించాడు. రామకృష్ణ పరమహంస వద్ద ఆధ్యాత్మిక విద్య పొందిన స్వామీ వివేకానంద పాశ్చాత్య ప్రపంచంలో సైతం భారతీయ ఆధ్యాత్మిక తత్వజ్ఞానానికి ప్రాచుర్యం కల్పించారు. స్వామీ వివేకానంద ఆధ్వర్యంలో రామకృష్ణ భక్తి ఉద్యమం దేశ విదేశాలకు విస్తరించింది. మహావతార్ బాబా పరంపరకు చెందిన పరమహంస యోగానంద సైతం భారతీయ యోగ ఆధ్యాత్మిక విద్యలకు విదేశాల్లో ప్రాచుర్యం కల్పించారు. లాహిరి మహాశయుని శిష్యుడైన యుక్తేశ్వర గిరి వద్ద పరమహంస యోగానంద యోగ విద్యాభ్యాసం చేశారు. తమిళనాడుకు చెందిన స్వామీ శివానంద కొంత కాలం దేశ విదేశాల్లో వైద్యునిగా పనిచేసి, తర్వాత ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లారు. దివ్యజీవన సంఘాన్ని నెలకొల్పి ఆధ్యాత్మిక జ్ఞానానికి బోధించారు. స్వామీ శివానంద శిష్యుడైన స్వామీ కృష్ణానంద దివ్యజీవన సంఘం ద్వారా తన గురువు బోధనలకు మరింత ప్రాచుర్యం కల్పించారు. స్వామీ రామతీర్థ కొంతకాలం గణిత ఆచార్యునిగా పనిచేసి, తర్వాత ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లారు. ప్రాక్ పశ్చిమ దేశాల్లో విస్తృతంగా పర్యటించి భారతీయ వైదిక జ్ఞానాన్ని, తత్వాన్ని బోధించారు. గౌడీయ వైష్ణవ కుటుంబానికి చెందిన స్వామీ ప్రభుపాద ‘ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్నెస్’ (ఇస్కాన్) ఉద్యమాన్ని దేశ విదేశాలకు విస్తరించారు. ఆయన ఇంగ్లిష్‌లోకి అనువదించిన భాగవతం విదేశాల్లో పాఠకాదరణ పొందింది. అరుణాచల స్వామిగా పేరుపొందిన రమణ మహర్షి భక్తిమార్గాన్ని బోధించారు. ఇలాంటి ఎందరో గురువులు భారతీయ వైదిక తత్వానికి, భక్తి మార్గానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారు. గురువు ప్రాముఖ్యత మన సనాతన సంప్రదాయంలో ఎనలేని ప్రాముఖ్యత ఉంది. గురువును త్రిమూర్తి స్వరూపంగా, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా పరిగణించి, పూజించడం మన సంప్రదాయం. గురువు రూపమే ధ్యానానికి మూలమని, గురు పాదాలే పూజకు మూలమని, గురు వాక్యమే మంత్రానికి మూలమని, గురు అనుగ్రహమే మోక్షానికి మూలమని ‘గురు గీత’ చెబుతోంది. విశాల విశ్వమే గురుస్వరూపమని సనాతన గురువులు చెప్పిన మాట. గురువులకే గురువుగా పరిగణించే దత్తాత్రేయుడు ఇరవై నాలుగు ప్రకృతి శక్తులనే గురువులుగా తలచి లోకానికి భక్తి జ్ఞానమార్గాన్ని బోధించాడు. గురు పూర్ణిమ రోజున వ్యాసుని మొదలుకొని గురు పరంపరను స్మరించుకుని పూజించడం ఆచారంగా వస్తోంది. మన దేశంలోని దేవాలయాలు, ఆశ్రమాలు, పీఠాలు, మఠాలలో గురుపూజ వేడుకలు ఘనంగా జరుగుతాయి. నేపాల్‌లోనైతే దేవాలయాలే కాకుండా విద్యాసంస్థల్లో కూడా గురుపూర్ణిమ వేడుకలు జరుగుతాయి. గురుపూర్ణిమ నాడు విద్యార్థులందరూ గురువులను సంప్రదాయబద్ధంగా టోపీలతో అలంకరించి, కానుకలతో సత్కరించి, వారి ఆశీస్సులు అందుకుంటారు. పురాణాల్లో ప్రసిద్ధ గురువులు మన పురాణాల్లో ప్రసిద్ధులైన గురువులు చాలామందే ఉన్నారు. దేవతల గురువు బృహస్పతి సకల శాస్త్ర కోవిదుడుగా పురాణాల్లో కనిపిస్తాడు. పలు ధర్మశాస్త్రాలు బృహస్పతి పేరుతో ప్రసిద్ధి పొందాయి. బృహస్పతి ప్రస్తావన రుగ్వేదం మొదలుకొని అనేక పురాణాల్లో కనిపిస్తుంది. రాక్షసుల గురువు శుక్రాచార్యుడు కూడా బృహస్పతికి దీటైన శాస్త్ర కోవిదుడు. శుక్రాచార్యుడు చెప్పిన నీతి సూత్రాలు ‘శుక్రనీతి’గా ప్రసిద్ధి పొందాయి. మరణించిన వారిని తిరిగి బతికించగల మృతసంజీవని విద్యకు శుక్రాచార్యుడే ఆద్యుడని, దేవతలతో జరిగిన యుద్ధాల్లో మరణించిన రాక్షసులను శుక్రాచార్యుడు తన విద్యతోనే తిరిగి బతికించేవాడని పురాణాలు చెబుతాయి. రామ లక్ష్మణులకు గురువైన విశ్వామిత్రుడు గాయత్రి మంత్రాన్ని లోకానికి చాటాడు. వశిష్టుడితో స్పర్థపూని అనేక కష్టనష్టాలను, అగ్నిపరీక్షలను ఎదుర్కొని మరీ బ్రహ్మర్షి పదవిని సాధించాడు. తాను బొందితో స్వర్గానికి పంపిన త్రిశంకుడిని దేవతలు కిందకు తోసేస్తే, అతడి కోసం దేవతల స్వర్గాన్ని తలదన్నే త్రిశంకు స్వర్గాన్ని నిర్మించాడు. సప్తర్షులలో ప్రసిద్ధుడైన వశిష్టుడు రఘు వంశానికి కులగురువు. బాల్యంలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వశిష్టుడి వద్దనే విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. రామాయణాన్ని రచించిన ఆదికవి వాల్మీకి ఆశ్రమంలో లవకుశులు జన్మించారు. ఆయనే వారికి గురువుగా విద్యాబుద్ధులు నేర్పించాడు. కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు కౌరవ పాండవులకు సకల శాస్త్రాలతో పాటు అస్త్రశస్త్ర విద్యలనూ నేర్పించారు. కురువృద్ధుడు భీష్ముడు, ద్రోణాచార్యుడు పరశురాముడి వద్ద అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకున్నారు. జగద్గురువుగా పూజలు పొందే శ్రీకృష్ణుడు బాల్యంలో సాందీపని మహర్షి వద్ద విద్యాభ్యాసం చేశాడు. మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు గురువులకే గురువుగా ప్రసిద్ధి పొందాడు. ఆయన గౌరవార్థమే గురుపూర్ణిమను వ్యాసపూర్ణిమగా పరిగణిస్తారు. గురుపూర్ణిమ నాడే చంద్రగ్రహణం ఈసారి గురుపూర్ణిమ నాడే చంద్రగ్రహణం సంభవిస్తోంది. ఇది సుదీర్ఘ చంద్రగ్రహణం. యోగ సాధకులు, మంత్రవేత్తలు గ్రహణాలు చాలా విశిష్టమైనవిగా పరిగణిస్తారు. పర్వదినాల్లో గ్రహణాలు వచ్చినట్లయితే, అవి మరింత విశిష్టమైనవిగా భావిస్తారు. గ్రహణ సమయంలో చేసే మంత్రజపం అనంత ఫలితాన్ని ఇస్తుందని విశ్వసిస్తారు. మంత్రోపదేశం పొందిన వారు గ్రహణకాలం ప్రారంభానికి ముందు స్నానం ఆచరించి, ఎలాంటి ఆహారం తీసుకోకుండా గ్రహణం పూర్తిగా విడిచిపెట్టే వరకు మంత్రజపం, ధ్యానం చేస్తారు. మంత్రోపదేశం లేని వారు నవ గ్రహశ్లోకాలలోని చంద్ర శ్లోకాన్ని ఈ సమయంలో పఠించుకోవచ్చు. గ్రహణం పూర్తిగా విడిచిన తర్వాత తిరిగి స్నానం ఆచరించి, ఇంట్లోని పూజా మందిరంలో ఉన్న దేవతామూర్తులకు సంప్రోక్షణ జరిపి ఆ తర్వాతే నిత్యపూజ చేస్తారు. గ్రహణం విడిచిన తర్వాత యథాశక్తి దానాలు చేస్తారు. జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నట్లయితే గ్రహణ సందర్భంగా బియ్యం, పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, కర్పూరం, చందనం, శంఖం, వెండి వస్తువులు, తెల్లని పువ్వులు, ముత్యాలు, తెల్లని వస్త్రాలు శక్తిమేరకు దానం చేస్తే దోష నివారణ జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. గురుపూర్ణిమ గురించి కొన్ని విశేషాలు గురు పూర్ణిమ రోజునే వర్ధమాన మహావీరుడు గౌతమస్వామిని తన తొలి శిష్యునిగా స్వీకరించాడు. ఇదే రోజున గౌతమ బుద్ధుడు సారనాథ్‌లో తన శిష్యులను ఉద్దేశించి తొలి బోధ చేశాడు. ఆదిగురువు అయిన పరమశివుడు ఇదే రోజున సప్తర్షులకు యోగ రహస్యాలను బోధించాడు. వేదవ్యాసుడు తన జన్మదినమైన ఆషాఢ పూర్ణిమ రోజునే బ్రహ్మసూత్రాల రచన ప్రారంభించాడు గురుపూర్ణిమ రోజు నుంచి చాతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది. సన్యాసాశ్రమంలోని గురువులు ఆషాఢ శుద్ధ పూర్ణిమ నాటి నుంచి నాలుగు నెలల పాటు బస చేసిన చోటే ఉంటూ శిష్యులకు బోధన చేస్తారు. ఆధ్యాత్మిక సాధన ప్రారంభించదలచిన వారు గురుపూర్ణిమ రోజున గురువుల సమక్షంలో సాధన ప్రారంభించడాన్ని శ్రేష్టంగా భావిస్తారు. -
ఆషాడ మాసం...ప్రత్యేకతల సమాహారం
విజయనగరం : ఆచార వ్యవహారాలకు పెద్దపీటవేసే సంప్రదాయంలో ప్రతీనెలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. తొలకరి జల్లులతో ప్రకృతి శోభనందించే వేళ వచ్చేదే ఆషాడమాసం. చంద్రగమనంలో పూర్వాషాడ నక్షత్ర సమీపంలో సంచరించే సమయం కాబట్టి ఆషాడ మాసంగా పిలుచుకుంటాం. శుభకర్యాలకు అవకాశం లేకపోయినా... ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉన్న నెల ఆషాడం. జగన్నాథుని రథయాత్ర ఉత్సవాలు, తెలంగాణాలో బోనాలు పండగ, చాతుర్మాస వ్రతాలు.. ఇలా ఎన్నో స్థానిక పండగలతో నెలంతా సందడిగా సాగుతుంది. ఆషాడంలో చేసే దానం, స్నానం, జపం, పారాయణం విశేష ఫలితాన్ని ఇస్తాయని భావిస్తారు. ఆషాడంలో చేసే సముద్ర, నదీ స్నానాలు ముక్తిదాయకమని పెద్దలు చెబుతుంటారు. ఈ మాసంలో పాదరక్షలు, గొడుగు, ఉప్పు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారని ప్రజల విశ్వాసం. అతివల అరచేతుల్లో అందాలు.. ఆషాడ మాసం వస్తే చాలు .. ఆడవారి అర చేతుల్లో గోరింటాకు మెరిసిపోతూ ఉంటుంది. చక్కని లేత గోరింటాకు రుబ్బి, తమ అరచేతిని ఆకాశాన్ని చేసి అందులో చందమామని, చుక్కల్ని అందంగా తీర్చిదిద్దుతారు. మెహందీ కోన్లు తెచ్చి జిగిబిగి అల్లికలా ముచ్చటైన ఆకృతుల్ని వేసుకుంటారు. పెళ్లికాని అమ్మాయిలు తమ చేతులు ఎర్రగా పండితే అందాల రాకుమారుడు భర్తగా వస్తాడని విశ్వసిస్తారు. ఎర్రగా పండితే చాలు తమ చేతుల్ని అందరికీ చూపిస్తున్నప్పుడు ఆ సమయంలో వారి చేతుల కంటే సిగ్గుతో వారి బుగ్గలే ఎర్రబడతాయి. ఇక శాస్త్రీయ పరంగా గోరింటాకు గురించి మాట్లాడుకుంటే.. ఆషాడంలో గీష్మరుతువు గడిచిపోతోంది. వర్ష రుతువు ఆరంభమవుతుంది. గ్రీష్మంలో శరీరంలో వేడి బాగా పెరుగుతుంది. ఆషాడంలో మాత్రం వాతావరణం చల్లబడిపోతుంది. ఇలాంటి సమయాల్లో అనారోగ్యాలు తప్పవు. అంతే కాకుండా నిత్యం పనుల్లో ఉండే మహిళల చేతులు, పాదాలు పగిలిపోతూ ఉంటాయి. ప్రధానంగా వర్షాకాలంలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. అందుకే ఆషాడంలో గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తీసేశక్తి ఉంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే, గోరింటాకు రసంలో యాంటీ బ్యాక్టీరీయా లక్షణాలు ఉంటాయి. గోరింటాకు పెట్టుకున్న చేతులతో తినే టప్పుడు నోటి ద్వారా క్రిములు వెల్లకుండా కాపాడుతుందని చెబుతుంటారు. అంతేకాదు... గోరింటాకు ఒత్తిడిని తగ్గించే లక్షణాలు కూడా ఉన్నాయంట. నవ దంపతులకు కష్టకాలం ఆషాడమంటే అందరికీ ఇష్టమైనా.. కొత్తగా పెళ్లైన దంపతులకు మాత్రం ఈ మాసం వస్తుందంటే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంటారు. వివాహం అయిన తర్వాత వచ్చే తొలి ఆషాడంలో కొత్తగా అత్తారింటికి వచ్చే కోడలు, అత్తగారు ఒకే చోట ఉండకూడదని, ఒకరికొకరు ఎదురు పడకూడదని చెబుతుంటారు. అంతే కాకుండా సాగు పనుల్లో క్షణం తీరికలేకుండా ఉంటారు. కాబట్టి కొత్త అల్లుడికి మర్యాదల విషయంలో లోటు వస్తుందనే ఉద్దేశంతో ఎడబాటుగా ఉంచుతారు. ఇదిలా ఉండగా శాస్త్రీయ పరమైన కారణమేమిటంటే ఆషాడంలో కొత్త దంపతుల కలయిక వల్ల గర్భం ధరిస్తే... చైత్ర, వైశాఖ మాసంలో పిల్లలు పుడతారు. అంటే ఏప్రిల్, మే నెలల్లో నవజాత శిశువులు, బాలింతలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కనే అవకాశాలున్నాయి. ఈ కారణంగానే ఆషాడంలో కొత్త జంటకు నెలరోజుల పాటు ఎడబాటు తప్పదు. విభిన్న మార్పుల వాతావరణం ఆషాడాన్ని అనారోగ్యా మాసంగా కూడా పిలుస్తుంటారు. విపరీతమైన ఈదురుగాలులతో చినుకులు పడే సమయమిది. కాలువలు, నదుల్లో ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండదు. చెరువుల్లోకి వచ్చి చేరే నీరు మలినంగా ఉండి మనుషులు అనారోగ్యానికి కారణమవుతుంది. కొత్తనీరు తాగడం, వర్షంలో తడవడం వల్ల చలిజ్వరం, విరేచనాలు, తలనొప్పి మొదలైన వ్యాధులు ప్రబలుతుంటాయి. గర్భం దాల్చిన స్త్రీలు తగు ఆహార నియమాలు పాటించాల్సిన సమయమిది.శుభకార్యాలకు సెలవుఆషాడ మాసంలో సాధారణంగా శుభకార్యాలు నిర్వహించరు. పూర్వీకులు దీన్ని శూన్యమాసంగా భావిస్తారు. రుతువులు ఈ మాసంతోనే ప్రారంభమవుతాయి కాబట్టి శుభకార్యాలకు మంచిది కాదంటారు. అంతే కాకుండా వర్షాలు ఈ కాలంలోనే ప్రారంభమవుతాయి కాబట్టి వ్యవసాయ పనులు జోరందుకోవడం వల్ల వేరే వ్యాపకంలో ఉండరు. అందుకే గృహప్రవేశం, నిశ్చితార్థం, వివాహం, ఉపనయనం, తదితర కార్యాలు ఆషాడంలో నిర్వహించరు. శ్రావణమాసం వచ్చే వరకూ శుభకార్యాలు ఎక్కడా నిర్వహించకపోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆరోగ్యదాయకం.. గోరింటాకు గోర్లకు పెట్టుకునే ఆకుగా గోరింటాకును వర్ణిస్తారు. రైతులు వ్యవసాయం చేసే సమయమిది. మహిళలు నీటిలో చేతులు పెట్టి వ్యవసాయపనులు చేస్తుంటారు. గోళ్ల ద్వారా వ్యాధులు సంక్రమించకుండా ఉండేందుకు గోరింటాకును రాత్రివేళ గోళ్లకు పెట్టుకుంటారు. ప్రస్తుత రోజుల్లో మహిళలు గోళ్లను వదిలేసి, మిగతా చోట మాత్రమే పెట్టుకుంటున్నారు. ఆషాడ మాసంలో గోరింట పెట్టుకోవడం ప్రతి మహిళ అపురూపంగా భావిస్తుంది. ఈ మాసంలో గోరింట పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఆరోగ్యపరంగా కూడా మంచిది. అందుకే పెళ్లికి ముందు... పెళ్లి తర్వాత కూడా ఆషాడ మాసంలో కచ్చితంగా గోరింట పెట్టుకునే అలవాటు ఉంది. –పి. మానస, బ్యూటీషీయన్, విజయనగరం -
ఆషాఢంలో ఇంటికి వస్తున్నాడని అల్లుడి హత్య
సాక్షి, అమలాపురం టౌన్: ఆషాఢ మాసంలో తరచుగా తమ ఇంటికి వస్తున్నాడన్న కోపంతో అల్లుడిని హత్య చేసిన మామకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అల్లుడిని హత్య చేశాడన్న నేరం రుజువు కావడంతో తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం భీమనపల్లికి చెందిన లోకినెడి అక్కిరాజు(మామ)కు జీవిత ఖైదు, రూ.రెండు వేలు జరిమానా విధిస్తూ అమలాపురం రెండో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి బీఎస్వీ హిమబిందు బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. భీమనపల్లి శివారు సంత మార్కెట్ ప్రాంతానికి చెందిన అక్కిరాజు, తన అల్లుడైన ముమ్మిడివరం మండలం క్రాప చింతలపూడికి చెందిన అమలదాసు సత్తి బాబును హత్య చేశాడు. ఆషాఢ మాసంలో అత్తవారింటికి తరచూ రావద్దని పదేపదే చెప్పినా వినకపోవడంతో కోపంతో 2015 జూలై 8న అల్లుడిని కోళ్లను కోసే కత్తితో నరికాడు. అప్పటికి అతడి భార్య దుర్గాభవాని 9వ నెల గర్భిణి. ఈ కేసును అప్పటి ఉప్పలగుప్తం ఏఎస్ఐ బి.జనార్దన్ నమోదు చేయగా రూరల్ సీఐ జి. దేవకుమార్ దర్యాప్తు చేశారని ఉప్పలగుప్తం ఎస్సై బి.రామకృష్ణ తెలిపారు. పీపీ అజయ్‌కుమార్ ప్రాసిక్యూషన్ తరపున వాదనలు వినిపించారు. -
చల్లనమ్మపై సప్తనదుల ధార
-తలుపులమ్మకు వైభవంగా సహస్ర ఘటాభిషేకం –లోవలో ముగిసిన ఆషాఢ మాసోత్సవాలు తుని రూరల్ : ఆషాఢమాసోత్సవాల ముగింపు సందర్భంగా లోవ దేవస్థానంలో తలుపులమ్మతల్లికి వైభవంగా సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. ఆదివారం, అమావాస్య, ఆషాఢమాసం చివరిరోజును పురస్కరించుకుని వేదపండితులు ముష్టి వెంకటపురుషోత్తమ శర్మ, రాణి సుబ్రహ్మణ్యశర్మ, శశాంక్ త్రిపాఠి, అర్చకులు 1008 కలశాలలో సప్తనదీ జలాలు, సుగంధ ద్రవ్యాలను ఆవాహనం చేశారు. భక్తులు, ధర్మకర్తల సమక్షంలో వేదమంత్రోచ్చరణలతో సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహించారు. ప్రధాన గర్భాలయంలో తలుపులమతల్లికి, పంచలోహ విగ్రహాలకు, అద్దాలమండపంలో అమ్మవారికి విశేషాలంకరణ చేసి భక్తులకు దర్శనాలను కల్పించారు. ఆలయంలో అన్నివిభాగాలనూ వివిధ రకాల పూలతో శోభాయమానంగా అలంకరించారు. ధర్మకర్తల చైర్మన్ కరపా అప్పారావు, అసిస్టెంట్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్, ఆలయ ఇన్స్పెక్టర్లు నాయుడు, గుబ్బల రామకృష్ణ, ధర్మకర్తలు నారాయణాచార్యులు, అత్తి అచ్చుతరావు, కిల్లి శ్రీను, యాదాల లోవకృష్ణ, పలువురు భక్తులు పాల్గొన్నారు. 60 వేల మంది భక్తుల రాక ఆషాఢమాసం, ఆఖరి ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో తలుపులమ్మ అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. కోస్తాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల నుంచి భక్తులు ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చారు. కాటేజీలు నిండుకోవడంతో భక్తులు చెట్ల కింద, ప్రైవేట్ పాకల్లో వంటలు, భోజనాలు చేశారు. 60 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టు అసిస్టెంట్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. వివిధ విభాగాల నుంచి రూ.5,27,705 ఆదాయం లభించిందన్నారు. తాడేపల్లిగూడెంకు చెందిన కళాకారిణి ‘గౌరికల్యాణం’ హరికథను గానం చేశారు. -
పరవశం
-
భక్తజన సంద్రం.. కొమురెల్లి తీర్థం
ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఈ మేరకు హైదరాబాద్, సికింద్రాబాద్, మెదక్, వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో మల్లన్న ఆలయం రద్దీగా మారింది. తొలు త భక్తులు మల్లన్నకు బోనాలు సమర్పించారు. అనంతరం గంగిరేగు చెట్టు వద్ద పట్నాలు వేసి మెుక్కులు చెల్లించారు. అలాగే మల్లన్నకు కల్యాణం జరి పించి కోరిన కోర్కెలు తీర్చాలని భక్తి శ్రద్ధలతో వేడుకున్నారు. – చేర్యాల -
నాలుగో బెటాలియన్‌లో ఘనంగా లష్కర్ బోనాలు
మామునూరు : ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని హన్మకొండ మండలం మామునూరు టీఎస్ఎస్పీ నాలుగో బెటాలియన్ ముత్యాలమ్మ దేవాలయంలో ఆదివారం సాయంత్రం లష్కర్ బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి నారాయణమూర్తి, బెటాలియన్ ఇన్చార్జి కమాండెంట్ పి. శ్రీనివాస్‌కుమార్, గుడినిర్మాణ కమిటీ బాధ్యుడు గంగునాయక్ పర్యవేక్షణలో పోలీసు కుటుంబాలు, లక్ష్మీపురం కాలనీ మహిళలు బోనాలతో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. తొలుత ముత్యాలమ్మకు కల్లుశాకం ఆరబోసి, కోళ్లు, మేకలు బలిచ్చి కొబ్బరికాయలు కొట్టి భక్తి శ్రద్ధలతో పూజించారు. కాగా, వేడుకల్లో చిన్నారులు, పోలీసు సిబ్బంది పోతరాజుల వేషధారణలతో అలరించారు. కార్యక్రమంలో బీజే వైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి జలగం రంజిత్, టీఎస్ఎస్పీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మొగిలిచర్లలో మారెమ్మ బోనాలు వరంగల్ : నగరంలోని రెండో డివిజన్ మొగిలిచర్ల గ్రామంలో ఆదివారం మారెమ్మ బోనాలను గంగపుత్రులు వైభవంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో గంగపుత్ర సంఘం అధ్యక్షుడు వడ్డెబోయిన రవీందర్, నాయకులు గబ్బెట సురేష్, స్వామి, రామస్వామి, పరుశరాములు, శ్రీనివాస్, రాజ్‌కుమార్, లక్ష్మీ, సరళ, విజయ పాల్గొన్నారు. -
మిఠాయిలతో అమ్మవారికి అలంకరణ
ఘట్కేసర్: ఆషాడమాసంలో అమ్మవారికి జరుగు ఉత్సవాల్లో భాగంగా మండలంలోని పోచారంలోని సర్వమంగళ స్పటికలింగేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారిని శనివారం అన్ని రకాల మిఠాయిలతో అలంకరించి పూజలు చేశారు. అలకరణ కోసం పలురకాల మిఠాయిలు ఉపయోగించినట్లు తెలిపారు. ఆషాడమాసోత్సవాల్లో అమ్మవారిని వివిధ రకాల పదార్థాలతో అలంకరిస్తున్నట్లు దేవాలయ నిర్వహకకమిటి చైర్మన్ చెరకు సరితా భద్రీనారాయణగౌడ్ తెలిపారు.అధిక సంఖ్యలోభక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు. -
ఏకాదశి ఉత్సవాల్లో సీఎం దంపతులు
ముంబైః ఆషాఢ ఏకాదశి ఉత్సవాలు మహరాష్ట్రలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్పవాల సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, అయన భార్య అమృతా లు పండరపుర విఠల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏకాదశి సందర్భంగా ఆలయంలో నిర్వహించిన మహా పూజకు భక్తులు లక్షల్లో హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మహరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఆయన భార్య అమృతాలు పండరపుర విఠల్ దేవాలయాన్ని దర్శించారు. ఆషాఢ ఏకాదశి సందర్భంగా ప్రారంభమైన ఉత్సవాల్లో తెల్లవారుజామున మహాపూజ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి దంపతులు విఠలేశ్వరుని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పశ్చిమ మహారాష్ట్ర షోలాపూర్ జిల్లాలో కొలువైన పండరపుర విఠలుని ఏకాదశి దర్శనానికి లక్షల్లో భక్తులు క్యూ కట్టారు. ఆ విఠలేశ్వరుడు భక్తులందరినీ చల్లగా కాపాడాలని, ఆయన ఆశీస్సులు అందరికీ లభించాలని కోరుకున్నట్లు ఫడ్నవిస్ తెలిపారు. ఆషాఢ ఏకాదశి సందర్భంగా పండరపుర ఆలయంలో నిర్వహించే 'వారి' ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలలనుంచీ భక్తులు కాలినడకన వచ్చి స్వామిని దర్శించుకుంటారు. ఏకాదశి సందర్భంగా ముంబై 'వడాలా' లోని విఠల్ ఆలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర ఉత్సవాల సందర్భంగా స్వామిని దర్శించేందుకు వేలల్లో భక్తులు తరలివస్తారన్నఉద్దేశ్యంతో ముందుగానే ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ను మళ్ళించి, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
ఆషాఢ బోనాలకు అంకురార్పణ
* ఘనంగా గోల్కొండ బోనాలు * అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంస్కృతీ సంరంభం ఆషాఢ బోనాలకు అంకురార్పణ జరిగింది. అశేష భక్తజనం మధ్య... మంగళ వాయిద్యాలతో గోల్కొండ కోటపై జగదాంబిక అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన గురువారం వైభవంగా సాగింది. ఉదయం 8 గంటలకు చార్మినార్ సమీపంలోని మురిగీచౌక్ నుంచి బయలుదేరిన తొట్టెల ఊరేగింపుతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పోతురాజుల నృత్యాలు, డప్పు వాయిద్యాలు, సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసిన గ్రామ దేవతల ప్రదర్శన లంగర్‌హౌస్ వరకు సాగింది. ఉదయం 11 గంటలకు కోటపై అమ్మవారికి నజర్ బోనం సమర్పించారు. రంజాన్ పండుగ కూడా కావడంతో మతసామరస్యం వెల్లివిరిసింది. ఊరేగింపులో ఐక్యతను చాటేలా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫతేదర్వాజా వద్ద మైత్రీసంఘం సభ్యులు, ముస్లింలు అమ్మవారికి పూజలు చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావుగౌడ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి బోనాలతో పాటు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, ఒడిబియ్యం సమర్పించారు. వచ్చే నెల 4 వరకు ప్రతి గురు, ఆదివారాల్లో ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. గతేడాది కంటే ఈసారి మరింత ఘనంగా, ఉత్సాహంగా బోనాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తలసాని చెప్పారు. రంజాన్, బోనాలు ఒకేసారి రావడం సంతోషంగా ఉందన్నారు. ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ... దేవాదాయ శాఖ పరిధిలో లేని ఆలయాలకు సైతం నిధులను కేటాయిస్తున్నామని, గోల్కొండలో ప్రారంభమైన ఆషాఢ బోనాలు తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు నిదర్శనమన్నారు. -
రాజన్నకు అమావాస్య ఎఫెక్టు
ప్రతి రోజూ రద్దీగా కనిపించే ఎములాడ రాజన్న ఆలయం అమావాస్య కారణంగా సోమవారం బోసిపోయింది. దీనికి తోడు ఆషాఢమాసం ప్రారంభం కావడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా తగ్గింది. జనం ఎక్కువగా లేకపోవడంతో ఆలయ సిబ్బంది, అధికారులు, అర్చకులు ఖాళీగా కనిపించారు. - వేములవాడ -
సింహాచలంలో పోటెత్తిన భక్తులు
విశాఖపట్నం : సింహాచలంలో కోలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం కోసం శుక్రవారం భక్తులు పోటెత్తారు. స్వామి వారికి ఆలయ అర్చకులు ఆఖరి విడత చందనం సమర్పణ చేశారు. అదికాక ఆషాడ పౌర్ణమి సందర్భంగా సింహగిరి చుట్టూ 32 కిలోమీటర్ల మేర ప్రదక్షణ (గిరి ప్రదక్షణ) పూర్తి చేసుకున్న భక్తులు అప్పన్న దర్శనం కోసం బారులు తీరారు. స్వామి వారి దర్శనం కోసం సుమారు 3 లక్షల మంది భక్తులు బారులు తీరారు. దాంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భక్తులకు పంపిణీ చేస్తున్న లడ్డూలలో పురుగులు ఉండటం చూసి భక్తులు ఆందోళనకు దిగారు. ఆలయ అధికారుల తీవ్ర నిర్లక్ష్యంపై భక్తులు మండిపడుతున్నారు. -
నేడు భద్రాచలంలో ప్రత్యేక పూజలు
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు జరగున్నాయి. అధిక ఆషాడమాసోత్సవాల్లో భాగంగాశుక్రవారం చిత్త నక్షత్రం సందర్భంగా యాగశాలలో స్వామి వారికి సుదర్శన స్నపనం, సుదర్శన జపం, సుదర్శన అష్టోత్తర శతనామార్చన, మహా పూర్ణాహుతి, నివేదన చేయనున్నట్టు దేవస్థానం ఈవో జ్యోతి తెలిపారు. అలాగే, శుక్రవారం ఉదయం లక్ష్మీ తాయారు అమ్మవారికి అభిషేకం, సాయంత్రం అద్దాల మంటపంలో సీతారాములకు బంతులాట నిర్వహించనున్నట్టు చెప్పారు. -
అరచేతుల్లో ఆషాఢం
పెళ్లికాని అమ్మాయిల ఊహలకు గోరింట అందాలు అద్దడానికే ఆషాడం వచ్చి ఉంటుంది. ఎర్రగా పండిన అతివ అరచేతులను కళ్లింతలు చేసుకొని చూడటానికే ఆషాఢం పుట్టి ఉంటుంది. చినుకు తడిని చిద్విలాసంగా తట్టుకునేలా తరుణులకు అండగా ఉండటానికే ఆషాఢం సిద్ధపడి ఉంటుంది. ఆషాఢమాసాన అరచేతుల్లో అందంగా మెరిసిపోయే గోరింట ఆధునిక జీవనంలో ఎన్ని పుంతలు తొక్కిందో తెలుసుకుందాం... కోమలమైన చేతుల కోసం ఎర్రన్ని గోరింట మోసుకువచ్చే ఊసులేమిటో కనుక్కుందాం... గోరింట చెట్టు వర్షాకాలంలో కొత్త చిగుళ్లు తొడుక్కుంటుంది. ఈ చెట్టు లేత ఆకులను ముద్దగా నూరి, చేతులకు పెట్టి, రెండు నుంచి ఆరు గంటల సేపు ఉంచితే ఎరుపు రంగులో మారుతుంది. ఔషధ గుణాలు మెండుగా ఉండే గోరింటాకును చేతులు, పాదాలకు అలంకరించుకోవడం వల్ల వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలు దరిచేరవని చెబుతుంటారు పెద్దలు. ప్రాచీన కాలం నుంచి సౌందర్య సాధనాలలో గోరింటాకు ప్రధాన భూమిక పోషిస్తూ వస్తోంది. చర్మసంరక్షణలో మరొకటి సాటిలేదనిపించే ఈ ఆకు నుంచి అందమైన డిజెన్లైన్నో సృష్టించారు సృజనకారులు. వేదాలలో... గోరింట రంగును సూర్యునికి ప్రతీకగా చెప్పారు. అందుకే అరచేతుల్లో సూర్యుని ఆకారాన్ని పోలి ఉండే గుండ్రటి డిజైన్ వేసేవారు. జ్ఞాన కాంతిని గోరింట ద్వారా మేలుకొలపడంగా భావించేవారు. అరబిక్ భాషలో... ‘హిన్నా’ అనే పదం నుంచి ‘హెన్నా’ వచ్చింది. గోరింటాకు పొడిని హెన్నాగా పేర్కొంటుంటారు. సంస్కృతంలో గోరింట చెట్టును ‘మేంధికా’ అంటారు. ఆ పదం నుంచే మెహిందీ వచ్చింది. ఐదు వేల ఏళ్ల వయసు... అదృష్టానికి, ఆరోగ్యానికి గోరింటను ప్రతీకగా అరబ్దేశాలలో ఐదు వేల ఏళ్ల క్రితమే వాడినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. గోరింట చెట్లు ఇంట్లో ఉంటే ఆత్మలు దరిచేరవని, మంచి భావాలను కలిగిస్తుందని నమ్మేవారు. కొన్ని తరాల తర్వాత గోరింట ఆకులను ఎండబెట్టి, పొడి చేసి చేతులు, పాదాలపై రేఖాగణిత నమూనాలలో డిజైన్లు వేసుకునేవారు. వీటి వల్ల సంతానోత్పత్తి పెరుగుతుందని, అండాశయాల పనితీరు సక్రమంగా ఉంటుందని భావించేవారు. ఈజిప్ట్ నుంచి...ఈజిప్ట్ ‘మమ్మీ’ల జుట్టు, గోళ్లు ముదురు గోధుమ రంగులోకి రావడానికి గోరింటాకును వాడేవారని వార్త ఉంది. క్రీ.పూ 700 కాలంలో గోరింట మొక్క ఈజిప్ట్ నుంచి భారతదేశంలో అడుగుపెట్టిందని వృక్షశాస్త్రజ్ఞులు చెబుతున్నారు. మతాలకు అతీతం... క్రిస్టియన్, హిందూ, ముస్లిమ్.. ఇలా ఏ మతం వారికైనా మెహెందీ విషయంలో భేద భావం లేదు. మనసుకు నచ్చిన డిజైన్ అయితే చాలు. క్రిస్టియన్ పెళ్లివేడుకలలో వెలిగిపోతుంది. తెలుగింటి పల్లెపడుచు చేతుల్లో ఒదిగిపోతుంది. ముస్లిమ్ మగువ ముంజేతులను చక్కగా అలంకరిస్తుంది. ఇంట్లోనే కోన్ తయారి... ► గోరింటాకు ఆకులను తెచ్చి, శుభ్రపరిచి, ఎండబెట్టాలి. తర్వాత పొడి చేయాలి. (పొడి మెత్తగా రావాలని మిక్సర్‌లో గ్రైండ్ చేయకూడదు. రోట్లో దంచి, పొడి చేసుకుంటే మేలు) ► 100 గ్రాముల గోరింటాకు (మెహెందీ) పొడి (4 కోన్స్ తయారుచేసుకోవచ్చు)ని, నైలాన్ వస్త్రంపై వేసి, కనీసం రెండు మూడు సార్లు జల్లెడ పట్టాలి. ► అర కప్పు నీటిలో టీ స్పూన్ తేయాకును కలిపి ఆ నీళ్లను మరిగించాలి. ► నాలుగు రేకల చింతపండు, టీ స్పూన్ పంచదార కప్పు నీటిలో వేసి 10 నిమిషాలు ఉంచాలి. ► మూడు వంతుల నీటికి, ఒక వంతు నిమ్మరసం, మూడు చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేసి కలపాలి. దీంట్లో గోరింటాకు పొడి వేసి, మృదువుగా అయ్యేంతవరకు కలపాలి. ► దాదాపు 6 గంటలు అలాగే ఉంచి, ఆ తర్వాత మెహెందీ కోన్‌లో నింపి, నచ్చిన డిజైన్‌తో చేతులను, పాదాలను అలంకరించుకోవచ్చు. ► మరిగించిన కాఫీ నీళ్లు, లవంగాలు మరిగించిన నీళ్లు, నిమ్మరసం, ఎండబెట్టిన నిమ్మముక్కలను మరిగించిన నీరు, వెనిగర్/ఆమ్ల రసం (అసిడిక్ లిక్విడ్).. అన్నింటినీ కలిపి 10 నిమిషాలు ఉంచి, వడకట్టాలి. ఈ నీటిలో 100 గ్రా॥గోరింటాకు పొడి కలిపి, పది చుక్కల యూకలిప్టస్ ఆయిల్, అంతే మోతాదులో మోహిందీ ఆయిల్ కలపాలి. బాగా కలిపి ఈ మిశ్రమాన్ని గంటసేపు ఆలాగే ఉంచాలి. 24 గంటలలోపు ఈ మిశ్రమాన్ని వాడాలి. మెహెందీ డిజైన్స్ సింధూరం రంగులో .. చమెహెందీ పొడిలో బెల్లం నీళ్లు, సిందూర్ వేసి, కలిపి, డిజైన్లకు ఉపయోగించాలి. 30 నిమిషాల్లో సహజసిద్ధమైన రంగుతో డిజైన్ ఆకట్టుకుంటుంది. చర్మ సమస్యలూ దరిచేరవు. మరింత ఎర్రగా... ► నిమ్మరసంలో తగినంత పంచదార కలిపి, ఆ చిక్కటి మిశ్రమం లో దూది ఉండను ముంచి, ఎండిన డిజైన్‌పై అద్దాలి. దీని వల్ల డిజైన్ మరింత ఎరుపురంగులోకి మారుతుంది. ► మెహెందీని తొలగించడానికి సబ్బు నీటిని ఉపయోగించకూడదు. అలాగే వెంటనే నీళ్లతో కడిగేయకుండా, మెహిందీని టూత్‌బ్రష్‌తో తొలగింయాలి. ► పాన్‌లో లవంగాల పొడిని వేసి, వేడి చేయాలి. ఆ పొగకు డిజైన్ చేతులను ఉంచాలి. ► ఆలివ్/కొబ్బరి/నువ్వుల నూనెను రంగుపై అద్ది, మృదువుగా రాయాలి. మెహెందీ డిజైన్లలో వైవిధ్యం... ► సంప్రదాయ డిజైన్లంటే విసుగు చెందినవారు కొత్త డిజైన్లను సృష్టిస్తూనే ఉన్నారు. వాటిలో సాధారణ, బ్రైడల్, ఇండియన్, అరబిక్... డిజైన్లు పోటీ పడుతున్నాయి. ► షేడెడ్, బ్యాంగిల్, ఫ్లోరల్, మోటిఫ్స్... ఇలా తీర్చిన డిజైన్లలో రంగురంగుల రాళ్లు, పూసలు, గ్లిట్టర్ (మెరుపుతో ఉండే పచ్చని రంగు)ను కూడా ఉపయోగిస్తున్నారు. ► డిజైన్‌ను వేయించుకోవాలంటే చాలా సమయం పడుతుంది. అలాగే ఖర్చుతో కూడుకున్నపని కూడా. మార్కెట్లో మెహెందీ స్టిక్కర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని కావల్సిన పరిమాణంలో ఒంటిమీద అతికించుకొని, ఖాళీలలో మెహెందీని నింపాలి. డిజైన్ ఆరిన తర్వాత స్టిక్కర్‌ను తొలగించాలి. ► మెహెందీ అవసరం లేకుండానే డిజైన్లను వేసుకోవచ్చు. డిజైనర్ స్టిక్కర్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని తెచ్చి, అతికించుకోవడమే. పరీక్షించుకోవాలి... మెహెందీ డిజైన్ బాగా ముదురు రంగులోకి రావడానికి మిశ్రమంలో సింథటిక్ రసాయనాలను కలుపుతారు. ఇవి అలెర్జిక్ రియాక్షన్లకు కారణం అవుతుంది. డిజైన్ వేయించుకోవడానికి ముందు ఆ మెహెందీ చర్మానికి సరిపడుతుందా అనేది పరీక్షించుకోవాలి. చెవి వెనుక భాగంలో లేదా మోచేతి దగ్గర మెహెందీ రాసుకొని, 3-4 రోజుల తర్వాత కూడా ఎలాంటి రియాక్షన్ లేదంటే అప్పుడు డిజైన్ వేయించుకోవాలి. కోన్‌కు- కోన్‌కు మధ్య తయారీలో, నాణ్యతలో తేడా ఉంటుంది. అందుకని ప్రతీసారి జాగ్రత్తపడటం ముఖ్యం. బ్లాక్ మెహెందీ వల్ల ఎక్కువ చర్మ సమస్యలు వస్తున్నాయి. ఈ మెహిందీ డిజైన్ ఉన్న చోట చర్మం ఎర్రగా కందిపోయి, పొక్కులు, చీము కనిపిస్తుంటుంది. ప్రకృతి సిద్ధంగా లభించే గోరింటాకును ఉపయోగించడమే శ్రేయస్కరం. శైలజ సూరపనేని కాస్మటిక్ డెర్మటాలజిస్ట్, హైదరాబాద్ -
పరమత సహనం.. బోనం
సంప్రదాయం: ‘‘అమ్మా బెలైల్లినాదో నాయనా... తల్లీ బెలైల్లినాదో నాయనా...’’ ఆషాఢమాసం ఆదివారం భాగ్యనగర లోగిళ్లలో మార్మోగే జనపదం ఇది. ఆషాఢం అంటేనే ఈ మహానగరికి పూనకం వస్తుంది. బోనాలంటే భక్తి భావంతో పొంగి పోవడమే కాదు.. సమష్టి తత్వానికి.. పరమత సహనానికి ప్రతీక. 1908, సెప్టెంబర్ 28 తెల్లవారుజాము 2 గంటలు.. ప్రశాంతంగా సాగిపోతున్న మూసీ నది.. ఉగ్రరూపం దాల్చిన వేళ. మరో నాలుగు గంటలయ్యే సరికి ప్రళయాన్ని తలపించింది. 60 అడుగుల మేర ఉవ్వెత్తున పొంగిన మూసీ.. నగరంపై జల ఖడ్గం ఝళిపించింది. అఫ్జల్‌గంజ్, ముస్లింజంగ్, ఛాదర్‌ఘాట్ వంతెనలు ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయాయి. 15 వేల మంది ప్రాణాలను హరించింది. పరీవాహక ప్రాంతంలోని 80 వేల ఇళ్లను ముంచెత్తింది. చార్మినార్ కట్టడంలో భాగంగా ఉన్న భాగ్యలక్ష్మీ దేవిని పూజిస్తే మూసీ శాంతిస్తుందన్న మాట ఆరో నిజాం చెవిన పడింది. వెంటనే ఆయన అమ్మవారికి రాజప్రాసాదం నుంచి చీర-సారె పంపి ప్రత్యేక పూజలు జరిపించారు. ఆనాటి నుంచి ప్రతిసారీ బోనాల వేడుకకు ఆ అమ్మవారికి చీర-సారె పంపడం ఆనవాయితీగా మారింది. తర్వాతి కాలంలో రజాకార్లు అరాచకం సృష్టించిన రోజుల్లోనూ.., బోనాల వేడుక మత సామరస్యానికి ఆదర్శంగా నిలిచింది. నగర జీవనంతో పెనవేసుకున్న ఈ జనోత్సవానికి నిజాం ప్రభుత్వం కూడా పూర్తిగా సహకరించింది. ప్రతి ఆషాఢం తొలి ఆదివారం గోల్కొండ కోటపై ఉన్న అమ్మవారికి, రెండో ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో, మూడో వారం పాతబస్తీలోని మూసీ ఈవల ప్రాంతం, నాలుగో ఆదివారం మూసీ అవతలి పాతబస్తీలో బోనాలు సమర్పిస్తూ వస్తున్నారు. ఆ ఏనుగే సాక్ష్యం : బోనాల వేడుక పరమత సహనానికి ప్రతీక. నిజాం కాలం నుంచి నేటి వరకు ఈ జన జాతరలో అపశ్రుతులు దొర్లిన సందర్భాలు లేవు. పాతబస్తీలో అమ్మవారి ఘటాలతో నిర్వహించే ఊరేగింపులో పాల్గొన్న వారికి దాహం కోసం ముస్లిం సోదరులు మంచి నీటిని అందించేవారు. నేటికీ చాలా మంది ముస్లింలు అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తున్నారు. బోనాల వేడుకల్లో అక్కన్నమాదన్న దేవాలయం దగ్గర, లష్కర్ ఉజ్జయినీ మహంకాళి ఆలయం దగ్గర సామూహిక ఊరేగింపులో ఏనుగు పాల్గొనటం ఆనవాయితీ. పదిహేనేళ్ల కిందట.. ఏటా ఉత్సవంలో పాల్గొనే ఏనుగును జాతరలో వినియోగించే పరిస్థితి కనిపించలేదు. అనాదిగా వస్తున్న ఆచారం పడిపోతుందని నిర్వాహకులు బాధపడుతున్న సమయంలో.. నిజాం ట్రస్టు నిర్వాహకులు హష్మీ అని పిలుచుకునే తమ ఏనుగును జాతరకు పంపారు. అప్పటి వరకు బీబీకాఆలం ఊరేగింపులో మాత్రమే పాల్గొన్న ఆ ఏనుగు.. అమ్మవారి సేవలో పాల్గొంది. మతాలు వేరైనా భక్తి భావం ఒక్కటే అని చాటిన ఈ సంఘటన మతసామరస్యానికి నిదర్శనం. - గౌరీభట్ల నరసింహమూర్తి -
అమ్మా బెలైల్లినాదో..
- రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బోనాల పండుగ - కిటకిటలాడుతున్న పోచమ్మ మందిరాలు సాక్షి, ముంబై : రాష్ట్రవ్యాప్తంగా పోచమ్మ పండుగలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ప్రాంతాల్లో మాదిరిగానే ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆషాఢ మాసం నుంచి తెలుగువారు ఈ పోచమ్మ పండుగను ఎన్నో యేళ్లుగా జరుపుకుంటున్నారు. కామాటిపురాలో చాలా యేళ్ల కిందటే పోచమ్మ గుడిని నిర్మించి పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం కామాటిపురాతోపాటు వర్లీ, దాదర్, బోరివలి, ఘాట్కోపర్, ఠాణే, భివండీ, షోలాపూర్ తదితర ప్రాంతాల్లో పోచమ్మ గుడులు వెలిశాయి. ఈసారి ఆషాఢ మాసం జూన్ 27వ తేదీన ఆషాఢ అమావాస్యతో ప్రారంభంకాగా జూలై 26వ తేదీన ముగియనుంది. ఈ నేపథ్యంలో అందరికీ సెలవు దినాలైన జూలై 6, 13, 20 తేదీల్లో పెద్ద ఎత్తున పోచమ్మ ఆలయాల్లో భక్తుల రద్దీ కన్పించనుంది. వర్షాకాలంలో వచ్చే కలరా, ప్లేగు, మశూచి వంటి అంటు వ్యాధులు ప్రబలకుండా, ప్రకృతి బీభత్సాలు జరుగకుండా, పాడిపంటలను, తమ పిల్లలను చల్లగా చూడమని పోచమ్మతల్లిని వేడుకుంటూ బోనాల పండుగను నిర్వహిస్తారు. పోచమ్మ పండుగ సందర్భంగా కొందరు పోచమ్మ దేవికి బోనాలు సమర్పించగా, మరికొందరు జంతుబలిని ఇస్తారు. ఆషాఢ మాసంలో పోచమ్మతల్లి పుట్టింటికి వస్తుందని భక్తుల నమ్మకం. అందుకే తమ కూతుళ్లు పుట్టింటికివస్తే ప్రత్యేకంగా చూసుకున్నట్లే ప్రజలందరూ వెళ్లి ఆమెను దర్శించి నైవేద్యం సమర్పించి భక్తిని చాటుకుంటారు. ఉగాది తర్వాత చాలా రోజులకు వచ్చే తెలుగు వారి పండుగ కావడంతో భక్తులు ఎంతో ఉత్సాహంగా వేడుకలు జరుపుకుంటారు. ముంబైలో ఈ పండుగను ఒకే రోజు కాకుండా జ్యేష్ట మాసం ముగిసిన అనంతరం శ్రావణం ప్రవేశించక ముందే వీలున్న రోజుల్లో, సెలవు దినాల్లో బంధుమిత్రులను ఆహ్వానించి ఘనంగా జరుపుకుంటారు. శ్రావణంలో ఉపవాసాలు మొదలవుతాయి కాబట్టి పోచమ్మ ఉత్సవాలు ఈ మాసానికి ముందే ముగుస్తాయి. పోచమ్మ తల్లికి సమర్పించే సామగ్రిలో టెంకాయలు, పసుపు-కుంకుమ, పూలు, ఫలాలు, పాలతోపాటు బెల్లం లేదా పంచదారతో కలిపి వండిన ప్రత్యేకమైన పరమాన్నం ఉంటాయి. వీటిని ఒక పాత్రలో పెట్టి, ప్రమిద వెలిగించి తీసుకొస్తారు. పోచమ్మకు భక్తిశ్రద్ధలతో నైవేద్యం సమర్పిస్తారు. అదేవిధంగా సంప్రదాయంగా వస్తున్న జంతుబలి(కోళ్లు, మేకలు)ని సైతం కొనసాగిస్తున్నారు. బోరివలిలో ఘనంగా ‘బోనాలు’ బోరివలి, న్యూస్‌లైన్: నగరంలో తెలుగు ప్రజలు బోనాల పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. తూర్పుబోరివలిలోని హనుమాన్ నగర్ సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానికులు శుక్రవారం సాయంత్రం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. రాజేంద్రనగర్‌లో కొలువైన పోచమ్మ తల్లికి సంఘం అధ్యక్షుడు కల్లెడ గంగాధర్ నేతృత్వంలో బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలను ఎత్తుకొని పలు వీధుల మీదుగా ఊరేగింపుగా వెళ్లారు. ఎస్పీ రోడ్ నుంచి కార్టన్ రోడ్ నం-2లో నుంచి గావ్‌దేవి మందిరం వరకు బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ అమ్మవారికి మహిళలు నైవేద్యం సమర్పించారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడూతూ.. 1976లో బోనాల పండుగను ముంబైలో ప్రారంభించామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం.. అక్కడి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పండగగా బోనాలను ప్రకటించడంతో ఈ ఏడాది బోనాలను చాలా ఘనంగా నిర్వహించామని గంగాధర్ తెలిపారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు, గాజుల నర్సారెడ్డి, నీరటి భూమన్న, సేకుట పోచవ్వ, భూమల్ల గంగవ్వ, అదరవేని కుంటమల్లు, అవురకొండ నర్సవ్వ, లంబ లింగవ్వ, దేశవేని రవి, ఇడుగునూరి రాాజవ్వ, జయ సుతార్, సాయిల గంగవ్వ, వేగుర్ల లక్ష్మి, అదరవేని పద్మ, పెద్ద పద్మ తదితరులు పాల్గొన్నారు. -
ఆషాఢస్య ప్రథమ దివసే...
కావ్యం/ మేఘసందేశం: మళ్లీ ఆషాఢ మాసం వచ్చింది. ప్రతి మాసానికి దాని ప్రత్యేకతలున్నాయి. ఆషాఢమంటే కర్షకుడు ఏమరుపాటు లేకుండా ఒళ్లు వంచవలసిన కాలం. సన్యాసులకు చాతుర్మాసానికి సన్నాహం చేసుకునే సందర్భం. అత్తాఅల్లుళ్లు ‘ఒకే గడప దాటకూడని వేడుక’ వేళ వివాహ మహోత్సవాలకు విరామం. విరహోత్కంఠ విజృంభించే విషమ సమయం. కాళిదాస మహాకవి మేఘసందేశ కావ్యం కథ ఆషాఢంలో మొదలవుతుంది. ఒకానొక యక్షుడు భార్య మీద నిరంతర ధ్యాసతో తన విధులు నిర్లక్ష్యం చేసి తన ప్రభువైన కుబేరుడి వల్ల శాపం పొందాడు. ఒక సంవత్సరంపాటు అలకానగరం నుంచి బహిష్కృతుడై ఎక్కడో దక్షిణాన దూరంగా పూర్వం సీతాదేవి తన భర్తతో వనవాసం చేస్తూ గడిపిన రామగిరి ఆశ్రమాల ప్రాంతంలో కాలం గడపవలసి వచ్చింది. దుర్భరమైన భార్యావియోగ భారంతో ఎనిమిది నెలలు ఎలాగో గడిపేశాడు. ఇంతలో ఆషాఢం వచ్చి ఆకాశం మేఘావృతమైంది. ఇక యక్షుడు తన విరహ వేదన భరించలేకపోయాడు. తస్మిన్-అద్రౌ, కతిచిత్-అబలా విప్రయుక్తః స కామీ నీత్వా మాసాన్ కనక వలయ భ్రంశ రిక్త ప్రకోష్ఠః ఆషాఢస్య ప్రథమ దివసే మేఘం - అశ్లిష్ట సానుం వప్రక్రీడా పరిణత గజ ప్రేక్షణీయం దదర్శ. ఆ రామగిరి మీద అబలా విప్రయోగాన్ని భరిస్తూ ఆ ప్రేమైక జీవి విరహ తాపం వల్ల కృశించిపోయి, బంగారు చేతి అందె జారిపోవడం వల్ల బోసిపోయిన ముంజేతితో కొన్ని మాసాలు గడిపిన తరువాత, ఆషాఢమాసంలో తొట్ట తొలిరోజున కొండ కొమ్మను పట్టుకుని నిలిచిన మబ్బు కనిపించింది. ఆ మేఘం- వంగి తన దంతాలతో గుట్టలను ఢీకొంటూ ఆడుకుంటున్న ఏనుగులా ఉంది. మేఘాన్ని చూస్తే ఏ పడుచువాడికైనా ప్రేయసి ధ్యాసే మనసు నిండా పరుచుకుంటుంది గదా. ఇక భార్యావిరహంతో తల్లడిల్లుతున్న యక్షుడిమాట చెప్పేదేముంది? పైగా అతగాడికి మరో బెంగ. అక్కడెక్కడో అలకాపురంలో తనలాగే విరహాగ్నితో కాగిపోతున్న తన భార్య మాటేమిటి? ఆమెకు కూడా అక్కడ మేఘాలోకనంతో గుండెగొంతుకలోన కొట్టాడుతుంటుంది కదా! అసలే సుకుమారి. అందులో విరహిణి. ఆపైన ఆషాఢమాసం. రాబోయేవి శ్రావణ, భాద్రపదాలు. అసలు ఆమె ప్రాణమన్నా నిలుపుకో గలుగుతుందా? భయంతో యక్షుడి మనసు కల్లోలమైంది. ఒక వెర్రి ఆలోచన వచ్చింది. ఎదురుగా కనిపిస్తున్న మేఘం ఎలాగూ ఉత్తరంగా ప్రయాణిస్తున్నది. చల్లగా ఆకాశమార్గంలో పోయిపోయి కొద్ది రోజులలో అలకా నగరం చేరుకొంటుంది. తన ప్రియురాలికి ఊరటనిచ్చి ఉసురు నిలిపే సందేశం ఆ ఆషాఢమేఘం ద్వారానే పంపితే? అచేతనమై కేవలం ధూమ, జ్యోతి, సలిల, మరుతాల సమూహమైన మేఘం ఎక్కడా! గ్రహింపూ, కాళ్ళు చేతులూ, వాక్కూ ఉన్న మనుషుల ద్వారా పంపించాల్సిన ప్రేమ సందేశం ఎక్కడా? ఈ రెంటికీ పొంతన లేదేమోనని ఆ ప్రేమార్తుడికి సందేహం కూడా కలగలేదు. అప్పటికప్పుడే కొండమల్లెలు కోసి, వాటితో మేఘుడిని పూజించి, ప్రార్థించాడు. ‘ఓ మేఘుడా! అసంతృప్తులకు నువ్వే శరణు కదా. నా ప్రియురాలికి నా సందేశం చేరవేసి పుణ్యం కట్టుకోవయ్యా మిత్రమా! నువ్వు వెళ్ళాల్సింది అలకానగరం. వెళ్ళవలసిన త్రోవ నేను వివరంగా చెప్తాను. ఎనిమిది నెలలెలాగూ గడిచాయి, మరో నాలుగు నెలల్లో నేను వచ్చేస్తున్నానని నా భార్యకు చెప్పు. నేనూ తన కోసం తపిస్తున్నానని చెప్పు. కంటికి కునుకు లేక కలలో కూడా ఆమెను దర్శించలేక పోతున్నానని చిత్తరువు కూడా కానరాక అలమటిస్తున్నానని చెప్పు. విరహతప్తమైన నా శరీరంతో అంతే తప్తమైన ఆమె శరీరాన్నీ నా అశ్రువులతో ఆమె అశ్రువులనూ నా నిట్టూర్పులతో ఆమె నిట్టూర్పులనూ కలపటం ప్రస్తుతం మనసు ద్వారా సాధ్యం! ఏం చేస్తాం యిది విధి! అయినా దిగులు పడవద్దని నా మాటగా చెప్పు. భాగ్య చక్ర భ్రమణంలో కింది దశ తరవాత పైదశ వచ్చి తీరుతుంది. మళ్ళీ మనం గువ్వల జంటలా కాలం గడిపే మంచిరోజులు వస్తాయని గుర్తు చెయ్యి!’ అని వేడుకొంటాడు. ఆషాఢంలో యక్షుడి విరహవేదన పాఠకుడి చేత కంటతడి పెట్టిస్తే కాళిదాస కవి పదాల పోహళింపూ, శయ్యా సౌందర్యం, వర్ణనా చమత్కృతీ శ్రావణ మేఘాలలా రసానంద బాష్పవర్షమే కురిపిస్తాయి. అందుకే ఆషాఢం వచ్చిందన్నా, ఆషాఢమేఘం కానవచ్చిందన్నా ఆ మేఘాల నడిమధ్యలో కవికుల గురువు ‘కశ్చిత్ కాంతా విరహ గురుణా స్వాధికారత్ ప్రమత్తః....’ అంటూ కమనీయమైన కావ్యగానం చేస్తూ కళ్ళముందు నిలుస్తాడు. ఆ మబ్బుకు ఆ వైపు రామగిరి అడవులలో ఒంటరిగా, దీనంగా నిలిచిన యక్షుడూ, ఈ వైపు చంద్రిక కోసం చాతక పక్షిలా అలకాపురంలో అమాయకంగా ఎదురుచూస్తున్న అన్నుల మిన్నా మనోగోచరమౌతారు. - ఎం. మారుతి శాస్త్రి -
నందును ఇంట్లోకి రానివ్వని గీతామాధురి
ప్రేమపక్షులు నందు.. గీతామాధురి ఇప్పుడు కలిసి ఉండట్లేదా? తాను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న నందును ఇప్పుడు గాయని గీతామాధురి అసలు ఇంట్లోకి రానివ్వడం లేదా? అవునట. ఈ విషయాన్ని స్వయంగా గీతామాధురే తన ఫేస్బుక్ పేజీ ద్వారా తెలిపింది. 'ఇంట్లోకి నాట్ ఎలోవ్డ్' అంటూ తన స్టేటస్ అప్డేట్ చేసింది. ఖంగారు పడకండి.. వాళ్లిద్దరు ఏమీ విడిపోలేదు, ఇద్దరి మధ్య ఎలాంటి జగడాలు కూడా జరగలేదు. (చదవండి: నందుతో గీతామాధురి నిశ్చితార్థం) అయితే.. ఇప్పుడు ఉన్నది ఆషాఢ మాసం కాబట్టి, ఆ వంక పెట్టి పుట్టింటికి వెళ్లిన గీతా మాధురి.. ఎటూ ఆషాఢ మాసంలో అల్లుడు అత్తగారిని చూడకూడదు, ఆ ఇంటి గడప తొక్కకూడదు కాబట్టి ఆషాఢం అల్లుడిని ఇంట్లోకి రానిచ్చేది లేదని ఆట పట్టిస్తోంది. అందుకే గీతామాధురి పుట్టింట్లోకి నందు వెళ్లలేకపోతున్నాడు. దాదాపు మూడున్నరేళ్ల పాటు ప్రేమించుకున్న నందు, గీతామాధురి ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. ఆటోనగర్ సూర్య సినిమాలో అతడి నటనను సమంత కూడా ట్విట్టర్ వేదికగా చాలా మెచ్చుకుంది. -
బోనభాగ్యం.. ఇక నుంచి అధికారిక సంబరం
* తెలంగాణ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవం * ఇక నుంచి అధికారిక సంబరం * ‘అమ్మా బెలైల్లినాదో నాయనా.. తల్లీ బయలెల్లినాదో నాయనా..’ ఏటా ఆషాఢ మాసంలో ఈ గానం భాగ్యనగరాన్ని పులకింపజేస్తుంది. ఆధ్యాత్మికతలో ఓలలాడిస్తుంది. నాలుగు శతాబ్దాల పైచిలుకు నగరంలో అన్ని వర్గాల ప్రజలు, విభిన్న సంస్కృతులను ఐక్యం చేసే మహోన్నత చారిత్రక, సామూహిక ఉత్సవం బోనాల పండుగ. జాతీయ ఖ్యాతి గడించిన విశిష్ట వేడుక. ఆషాఢంలోని తొలి ఆదివారం లేదా గురువారం ప్రారంభమయ్యే పండుగను నెల రోజులు నిర్వహిస్తారు. రాష్ర్టప్రభుత్వం అధికారిక ఉత్సవంగా ప్రకటించిన నేపథ్యంలో ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. నేడు గోల్కొండ కోటలో బోనాలకు శ్రీకారం. వచ్చే నెల 27 వరకు కోటపై తొమ్మిది రకాల పూజలు నిర్వహిస్తారు. ఇవే రోజుల్లో పాతబస్తీ లాల్‌దర్వాజ బోనాలు, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి వేడుకలూ ప్రారంభమవుతాయి. నగరమంతటా సంబరాలు అంబరాన్నంటుతాయి. ఈ సందర్భంగా ‘సిటీ ప్లస్’ ప్రత్యేక కథనం.. గోల్కొండ రాజధానిగా పాలించిన కుతుబ్‌షాహీల కాలంలోనే బోనాలకు శ్రీకారం చుట్టారు. అబుల్ హసన్ తానీషా కొలువులో మంత్రులుగా పనిచేసిన అక్కన్న, మాదన్నల సలహాతో తానీషా తన కోటపైన శ్రీ జగదాంబిక, మహంకాళి అమ్మవార్ల ఆలయాన్ని కట్టి ఉత్సవాలు ప్రారంభించాడు. తరువాత అధికారంలోకి వచ్చిన అసఫ్జాహీలు వాటిని కొనసాగించారు. ఇది ఆనవాయితీగా మారింది. కోటపై ఉన్న అమ్మవారిని గోల్కొండ ఛోటాబజార్‌లోని ఆలయ పూజారి ఇంటికి తీసుకెళ్లి ముస్తాబు చేసి భారీ ఊరేగింపుతో తిరిగి కోటపైన ప్రతిష్టిస్తారు. నవాబు పూజతో శాంతించిన మూసీ 1908 సెప్టెంబర్‌లో మూసీ వరదల కారణంగా చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి వరద నీరొచ్చింది. వరదలో అప్పటికే వేలాది మంది చనిపోయారు. నాటి హైదరాబాద్ రాష్ట్ర ప్రధాన మంత్రి రాజా కిషన్ పర్షాద్ లాల్‌దర్వాజా అమ్మవారి మహత్యాన్ని నిజాం నవాబుకు వివరించారు. ఆలయంలో పూజలు చేస్తే అమ్మవారు శాంతించి వరదలు తగ్గుముఖం పడతాయన్నారు. దీంతో నవాబు ఒక బంగారు చాటలో కుంకుమ, పసుపు, మేలిమి ముత్యాలు తీసుకొని పూజలు చేశారు. అలా ఈ ఆలయంలో బోనాల వేడుకలు ప్రారంభమయ్యాయి. 1968లో కంచి కామకోటి పీఠాధిపతి చంద్ర శేఖరేంద్ర సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని నెలకొల్పారు. 2008 ఏప్రిల్‌లో అప్పటి కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వర్ణ శిఖరం, వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆరోగ్యమంత్రం బోనాల వేడుకల్లో ప్రతీ ఘట్టం ఆరోగ్య పరిరక్షణతో ముడిపడిందే. తొలకరి వర్షాలతో పాటే వాతావరణం పూర్తిగా మారిపోతుంది. దీంతో రకరకాల వ్యాధులు ప్రబలుతాయి. నీటి కాలుష్యం వల్ల కలరా వంటి అంటువ్యాధులు వ్యాపిస్తాయి. అలాంటి కలుషిత వాతావరణాన్ని శుభ్రం చేసే అద్భుతమైన ప్రక్రియ బోనాల పండుగలో ఉంది. ఇంటిని, చుట్టుపక్కల వాతావరణాన్ని శుభ్రం చేసుకొని పసుపు, గుగ్గిలం, మైసాక్షి వంటి వాటిని పొగ వే యడం వల్ల వ్యాధికారక క్రిములు నశిస్తాయి. ఇక వేపచెట్టు గొప్పతనం అందరికీ తెలిసిందే. వేపాకు ముద్దను ఒంటికి పట్టించి స్నానం చేస్తే చర్మవ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది. తట్టు, ఆటలమ్మ వంటి వ్యాధులకు వేప దివ్య ఔషధం. బోనాల పండుగ రోజు వేప కొమ్మలతో బోనాలను అలంకరించినా, గుమ్మానికి, దర్వాజలకు వాటిని వేలాడదీసినా స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. ఇక బోనం. కొత్త కుండలో పసుపుతో కలిపి అన్నం వండడం కూడా ఆరోగ్య పరిరక్షణలో భాగమే. ఈ వేడుకల్లో ఆరోగ్యభాగ్యం కూడా ఇమిడి ఉందని నగరానికి చెందిన ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు అభిప్రాయపడ్డారు. వరాల వల్లి.. ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు జూలై 13, 14వ తేదీల్లో జరుగుతాయి. ఈ వేడుకలకు రెండు శతాబ్దాల చరిత్ర ఉంది. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో 1813లో కలరా సోకింది. వేలాది మంది మృత్యువాత పడ్డారు. ఇది అక్కడ మిలటరీ విధులు నిర్వహిస్తున్న సికింద్రాబాద్‌కు చెందిన సూరటి అప్పయ్యను కలచి వేసింది. వెంటనే ఆయన ఉజ్జయినీ మహంకాళిని... కలరాను తగ్గించమనీ, అలా చేస్తే తన స్వస్థలంలో ఆలయం నిర్మిస్తామని వేడుకున్నారు. కలరా అదుపులోకి వచ్చింది. దీంతో అప్పయ్య సహచరుల సాయంతో 1815లో సికింద్రాబాద్‌లో కర్ర విగ్రహాన్ని ప్రతిష్టించి ‘ఉజ్జయినీ మహంకాళి’గా నామకరణం చేశారు. 1864లో ప్రస్తుతం ఉన్న అమ్మవారి విగ్రహాన్ని అప్పయ్యే చేయించి, ఆలయ నిర్మాణాన్ని కూడా పూర్తి చేశారు. 1953 నుంచి దేవాదాయ శాఖ వేడుకలు నిర్వహిస్తోంది. చల్లని చూపుల... శీతల్‌మాత పిల్లా పాపలను ఆయురారోగ్యాలతో చల్లంగా చూసే అమ్మవారు శీతల మాత. సుల్తాన్‌షాహీలో వెలసిన ఈ అమ్మవారిని భక్తులు శీతల్ మాతగా... సిత్లా మాతగా కొలుస్తున్నారు. వందేళ్ల కిందట నిజాంల పాలన లో ఆర్థిక లావాదేవీలు చూసే అధికారిగా ఉన్న శాలిబండ దేవ్డీ నివాసి రాజా కిషన్ పర్షాద్ ఈ దేవాలయాన్ని సుల్తాన్‌షాహిలో నిర్మించారు. పిల్లలకు మశూచి, ఆటలమ్మ (చికెన్‌పాక్స్)లు వచ్చినప్పుడు అమ్మవారికి సాక పెట్టి పూజించేవారు. 1976లో ఆలయ కమిటీ ఏర్పడిన అనంతరం శ్రీ జగదాంబ దేవాలయంగా నామకరణం చేశారు. మీరాలంమండి అమ్మ నిజాం కాలంలో గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతీరోజు రైతులు కూరగాయలు,ధాన్యం ఎడ్ల బండ్లపై మీరాలం మండికి తీసుకువచ్చిన రైతులు తమ ఎడ్ల బండ్లను ‘బండిఖానా’ లో నిలిపేవారు. ఇక్కడే ఒక రావిమొక్కను నాటి దాని వద్ద అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటుచేసి పూజలు చేశారు. 1960లో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన చేసినప్పటి నుంచి ఆషాఢ మాసం మూడో బుధవారం రోజు బోనాల పండుగ జరుగుతుంది. ఐదు తరాలుగా.. అమ్మవారికి బోనాలు సమర్పించిన తర్వాత జరిగే రెండో ప్రధాన ఘట్టం రంగం. ఇందు లో ఏటా స్వర్ణలత చెప్పే ‘భవిష్యవాణి’కి ఎంతో ప్రాముఖ్యత. ఆ వివరాలు ఆమె వూటల్లోనే... వూ అమ్మపేరు ఎరుపుల ఇస్తారమ్మ. నాన్న నరసింహ. అక్క స్వరూప. తమ్ముడు దినేష్. నాతో కలిపి అమ్మ నాన్నలకు ముగ్గురు పిల్లలం. ప్రస్తుతం మారేడుపల్లిలో ఉంటున్నాం. మా ఇంట్లో ఆడపిల్ల పుట్టగానే అమ్మవారికి అంకితం చేసే ఆచారం అనాదిగా వస్తోంది. అక్క స్వరూపను, నన్ను ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి అంకితం చేశారు. బడికి వెళ్లినా పెద్దగా చదువుకోలేదు. అక్క స్వరూప చనిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర రంగంలో భవిష్యవాణి వినిపించే బాధ్యత తీసుకున్నా. అక్కన్న,మాదన్నలు కొలిచిన తల్లి హరిబౌలిలోని అక్కన్న మాదన్నల మహంకాళి దేవాలయం హిందూ ముస్లింల ఐక్యతకు చిహ్నం. పాతబస్తీలోని ఈ ఆలయం లోని అమ్మవారికి భక్తులు 17వ శతాబ్దం నుంచి పూజలు నిర్వహిస్తున్నారు. గోల్కొండ రాజు తానీషా వద్ద కీలక హోదాల్లో పనిచేసిన అక్కన్న, మాదన్నలిరువురు అన్నదమ్ములు. వారు విధినిర్వహణలో భాగంగా రోజూ కోటకు వెళ్లే ముందు ఇక్కడ పూజలు నిర్వహించే వారు. 1948లో జరిగిన సైనిక చర్య తరువాత అప్పటి ఆర్యసమాజ్ ఈ ఆలయాన్ని గుర్తించింది. కోటకు రక్షణగా.. మైసవ్ము శాలిబండ హరిబౌలిలోని శ్రీ బంగారు మైసవ్ము దేవాలయుం పాతబస్తీ భక్తుల పాలిట కొంగుబంగారం. నిజాం పరిపాలనలో ప్రధాని కిషన్ పర్షాద్ దేవిడీలోనే శ్రీ బంగారు మైసమ్మ ఆలయం వెలసింది. కోట రక్షణ గోడకు ఎడమ వైపున అమ్మవారి దేవాలయం ఉంటే అన్ని విధాల కలిసొస్తుందనే నమ్మకంతో నిజాం కాలంలో ఇక్కడ అమ్మవారి దేవాలయం ఏర్పాటు చేశారు. హనుమంతు ఉరఫ్ పోతరాజు..! అతను అమ్మవారికి అంగరక్షకుడు. గ్రామదేవతల తోబుట్టువు. వారికి కావలి. ఇదీ పోతరాజు పరిచయం. అదంతా కథల్లోనే.. కానీ పాతబస్తీ ప్రజలకు ఎనిమిది దశాబ్దాలుగా తెలిసిన పోతరాజు మాత్రం హనుమంతే. నిలువెత్తు విగ్రహం, చక్కని శరీర సౌష్ఠవం.. కోర మీసాలు, జులపాల జుత్తు.. పెద్ద కళ్లు. భీతి గొలిపే రూపం.. మెడలో నిమ్మకాయల హారం. ఒంటినిండా పసుపు.. నుదుటిన పొడవాటి కుంకుం బొట్టు. చేతిలో కొరడా.. కాళ్లకు గజ్జెలు. బోనాల ఊరేగింపులో అగ్రభాగాన ఉండి ఎగిరి గెంతులేస్తూ, నృత్యం చేస్తూ జనాన్ని అదిలిస్తూ, బెదిరిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ ‘పోతరాజు’ చెప్పే వివరాలు ఆయన మాటల్లోనే... మూసీనదికి వరదలొచ్చినప్పుడు పుట్టిన్నట.. మాయమ్మ చెప్పింది. ఆ వరదలు ఊర్ని ముంచెత్తుతా ఉంటే నన్నెత్తుకొని గంగబాయి గుట్ట మీదకు పరుగెత్తిందట. ఒక చింతచెట్టెక్కి ప్రాణాలు దక్కించింది. నా పుట్టుక గురించి నాకు తెలిసింది ఇంతే. మాయమ్మ పేరు నర్సమ్మ. నాయిన రామన్న. చిన్నప్పటి నుంచి ధూల్‌పేట్‌లోనే. మా పెద్దనాయిన నర్సింహ్మ. చెట్టుమీదికెక్కి సిగాలు ఊగేవాడు. మా పెద్దనాయిన నీడ నాకు (దేవత ఆవహించింది) పడింది. అప్పుడు నాకు పదిహేనేళ్లు. మస్తు బలంగా ఉండేవాణ్ణి. గోకుల్ప్రసాద్ అనే పూజారి నాతో తొలిసారి పోతరాజు వేషం వేయించిండు. ఇప్పటి వరకు ఆ ఆచారాన్ని తప్పలేదు. పురాణాపూల్, మంగల్హాట్, ధూల్‌పేట, గౌలిగూడ, గోడీ కీ కబర్, జిన్సీ చౌరాయి.పాతబస్తీలో ఎక్కడ బోనాల పండుగైనా పరుగెత్తుకొని పోయిన. అప్పట్లో యాటను (మేకపోతును) గావు (గొంతు కొరికేయడం) పట్టేవాణ్ణి.అమ్మవారి పండుగొచ్చిందంటే నాకు నిమిషం తీరిక ఉండేది కాదు. పూరానాపూల్‌లో మహంకాళమ్మ గుడి కట్టించిన. యాదగిరిగుట్ట నుంచి గాంధీ బొమ్మ తెప్పించి ఇక్కడ పెట్టించింది కూడా నేనే. ఎన్నెన్నో అపురూప ఘట్టాలు మహంకాళి జాతరలో అనేక అపురూపమైన ఘట్టాలుంటాయి. ఈ నెల 29వ తేదీన ఘటాల ఎదుర్కోలుతో వేడుకలు ప్రారంభమవుతాయి. జాతర సందర్భంగా సికింద్రాబాద్ జనసంద్రాన్ని తలపిస్తుంది. పుట్టింటి నుంచి వచ్చే అమ్మవారికి ఘటం తో స్వాగతం పలుకుతూ తోడ్కొని వచ్చేదే ఘటోత్సవం. ఆలయం నుంచి పసుపు, కుంకుమ,పూలను తీసుకెళ్లి కర్బలమైదాన్లో ఘటాన్ని అలంకరిస్తారు. వెదురు దబ్బల మధ్యలో రాగి చెంబు ఉంచి, అమ్మవారి వెండి విగ్రహాన్ని పెడతారు. అలా ఊరి పొలిమేర నుంచి బయలుదేరిన తల్లి భక్తజనం నడుమ ఆలయానికి విచ్చేస్తుంది. 9 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ భక్తులకు దర్శనమిస్తుంది. బోనాల చివరి రోజు జరిగే అంబారీ ఊరేగింపుతో తల్లిని సాగనంపుతారు. కుస్తీలకూ పోయేవాణ్ని... ఆ రోజుల్లో లాల్ పహిల్వాన్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న. కుస్తీపోటీలకు పోయేవాణ్ని. గద్వాల్ మహారాణి దగ్గర కూడా పోటీలల్ల పాల్గొన్నం. బతికినన్ని రోజులు బాగానే బతికిన. నవాబులకు కూడా క్షవరాలు చేసిన. ‘సర్కార్ క్యా హై’ అంటే చాలు చేతికి ఎంతొస్తే అంత డబ్బు ఇచ్చే వాళ్లు. నాకు ఇద్దరు భార్యలు కమలమ్మ, యాదమ్మ. కమలమ్మ చనిపోయింది. ఇద్దరికీ కలిపి 15 మంది పిల్లలు. వారిని నేనూ, యాదమ్మ సాది పెంచి పెద్ద జేసినం. చాలా కష్టపడ్డం. కడుపు మాడ్చుకొని బతికినం. కానీ ఏం లాభం. అంతా చెట్టుకొకలు, పుట్టకొకలు పోయిండ్రు.హైదరాబాద్‌ల ఎవ్వరు ఎక్కడ ఉంటండ్రో తెల్వదు. నా పెద్దకొడుక్కే 75 ఏళ్లు ఉంటది. ఎంతమంది పిల్లలు ఉంటే మాత్రం ఏమైంది. నా బతుకు నేనే బతకుతున్నా. పిల్లలకు మంత్రం వేయమని నా దగ్గరకొస్తరు. పైసో,ఫలమో ఇస్తరు. ఆ డబ్బులతోనే బతుకుతున్న...’ అని ముగించాడు హనుమంతు. ఉజ్జయినీ మహంకాళి రంగం చెప్పడానికి ముందుగా పెళ్లి (మాంగల్యధారణ) జరగాల్సి ఉంది. అందరికీ జరిగే పెళ్లిలాగే నాకూ జరిగినా పెళ్లి కొడుకు ఉండడు. ఖడ్గంతో నాకు మాంగల్యధారణ చేయించి ఆ తంతు పూర్తి చేశారు. నాటి నుంచి నా జీవితం అమ్మవారికే అంకితమైంది. అలా పదహారేళ్లుగా భవిష్యవాణి వినిపిస్తున్నా. ఆదివారం బోనాలు సమర్పించడం పూర్తికాగానే సోమవారం రంగం ఏర్పాట్లుంటారుు. ఆ రోజు తెల్లవారు జామునే లేచి స్నానం చేసి దుస్తులు ధరించి ఆలయానికి వస్తా. రోజంతా ఉపవాసమే. ముఖానికి పసుపు రాసుకుంటా.మహంకాళి ఎదురుగా ఉండే మాతంగేశ్వరీ ఎదురుగా పచ్చి కుండపై నన్ను నిలబెడతారు.అప్పుడు అమ్మవారు నన్ను ఆవహిస్తారు. అటు తర్వాత ఏం జరిగిం దనేది నాకు గుర్తుండదు. టీవీల్లో చూసి అసలు నేనేనా ఇదంతా చెప్పిందనిపిస్తుంది. అవ్మువారి సేవకు అంకితమైన నాకు కుటుంబం, పిల్లలు వంటి ఆలోచనలు ఉండవు. ఆలయం నుంచి కొన్నేళ్లుగా నెలకు రూ.3వేలు వస్తున్నాయి. నా జీవనం కోసం కుట్టు పనిచేస్తుంటా. ప్రతి శుక్ర, మంగళవారాల్లో అమ్మవారి దేవాలయానికి వచ్చి ముత్తయిదువులకు పసుపు కుంకుమ అందిస్తుంటా. తొలుత మా పూర్వీకురాలు జోగమ్మ భవిష్యవాణి వినిపించేది. అటు తర్వాత బాలమ్మ, పోచమ్మ, మా నాన్నమ్మ బాగమ్మ, మా అక్క స్వరూపరాణి దాన్ని కొనసాగించారు. ఐదు తరాల నుంచి మేవుు తల్లిసేవలో కొనసాగుతున్నాం. - దార్ల వెంకటేశ్వరరావు