
చార్మినార్: రానున్న ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని ఏటా మాదిరిగానే సప్త మాతృకలకు సప్త బంగారు బోనం సమర్పించేందుకు భాగ్యనగర్ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా బంగారు పాత్రలోని నైవేద్యాన్ని ఏడు అమ్మవారి ఆలయాలకు తీసుకెళ్లి సమర్పించేందుకు జోగిని నిషా క్రాంతికి సోమవారం మీరాలంమండిలో ఉమ్మడి ఆలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ గాజుల అంజయ్య, చంద్రకళ దంపతులు వాయినాన్ని అందజేశారు. జులై 7న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమరి్పంచే బంగారు బో నంతో బంగారు బోనం కార్యక్రమాలు ప్రారంభమవుతాయని గాజుల అంజయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ మాజీ చైర్మన్ పొటేల్ సదానంద్ యాదవ్, మధుసూదన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment