బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం
సనత్‌నగర్: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం సందర్భంగా నేటి నుంచి మూడు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. కల్యాణం జరిగే 9న, రథోత్సవం నిర్వహించే 10న భక్తులు విశేషంగా తరలిరానున్న నేపథ్యంలో ఈ నెల 8 నుంచి 10 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. వాహనదారులు, ప్రయాణికులు గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సిందిగా సూచించారు. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా ఉన్నాయి.
గ్రీన్‌ల్యాండ్స్, మాతా టెంపుల్, సత్యం థియేటర్ నుంచి ఫతేనగర్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ఎస్‌ఆర్‌నగర్ టి–జంక్షన్ వద్ద మళ్లించి ఎస్‌ఆర్‌నగర్ కమ్యూనిటీ హాల్, అభిలాష టవర్స్, బీకేగూడ ఎక్స్‌రోడ్డు, శ్రీరామ్‌నగర్ క్రాస్‌రోడ్డు, సనత్‌నగర్ మీదుగా ఫతేనగర్ రోడ్డు వైపు అనుమతిస్తారు.
⇒ ఫతేనగర్ ఫ్లైఓవర్ నుంచి బల్కంపేట వైపు వెళ్లే వాహనాలను కొత్త వంతెన వద్ద కట్టమైసమ్మ దేవాలయం, బేగంపేట వైపు మళ్లిస్తారు.
⇒ గ్రీన్‌ల్యాండ్స్–బకుల్ అపార్ట్‌మెంట్స్, ఫుడ్‌వరల్డ్ నుంచి వచ్చే వాహనాలను బల్కంపేట వైపు అనుమతించరు. ఫుడ్‌వరల్డ్ ఎక్స్ రోడ్డులో సోనాబాయి టెంపుల్, సత్యం థియేటర్, మైత్రివనం లేదా ఎస్‌ఆర్‌నగర్ టి–జంక్షన్ వైపు మళ్లిస్తారు.
⇒ బేగంపేట కట్టమైసమ్మ దేవాలయం నుంచి వచ్చే వాహనాలు బల్కంపేట వైపు వెళ్లడానికి అనుమతించరు. ఆ ట్రాఫిక్‌ను గ్రీన్‌ల్యాండ్స్, మాతా ఆలయం, సత్యం థియేటర్, ఎస్‌ఆర్‌నగర్ టి–జంక్షన్ ఎడమ మలుపు నుంచి ఎస్‌ఆర్‌నగర్ కమ్యూనిటీ హాల్ వైపు మళ్లిస్తారు.
⇒ ఎస్‌ఆర్‌నగర్ టి–జంక్షన్ నుంచి ఫతేనగర్ వరకు బైలేన్లతో పాటు లింక్ రోడ్లు మూసివేస్తారు.
వాహనాల పార్కింగ్ ఇలా..
ఎస్‌ఆర్‌నగర్ టి–జంక్షన్ సమీపంలో ఆర్‌అండ్‌బీ కార్యాలయం, ఫుడ్‌వరల్డ్ ఎక్స్‌రోడ్డు సమీపంలోని జీహెచ్‌ఎంసీ గ్రౌండ్, నేచర్‌క్యూర్ హాస్పిటల్ రోడ్డు సైడ్ పార్కింగ్, నేచర్‌క్యూర్ హాస్పిటల్ పార్కింగ్, ఫతేనగర్ రైల్వే వంతెన కింద పార్కింగ్ ప్రాంతాలను గుర్తించారు. భక్తులు తమ వాహనాలను నిరీ్ణత పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే సక్రమంగా పార్కింగ్ చేయాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో, ప్రయాణ సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ 90102 03626కు ఫోన్ చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment