bonalu festival
-
నల్గొండ జిల్లాలో అంగరంగ వైభవంగా పాతనగర బోనాల ఉత్సవాలు (ఫొటోలు)
-
మహబూబ్‌నగర్ : ఘనంగా పోచమ్మ అమ్మవారి బోనాలు (ఫొటోలు)
-
వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి రంగం ఊరేగింపు (ఫొటోలు)
-
జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో శాకాంబరి ఉత్సవాలు (ఫొటోలు)
-
Bonalu: ఊరి దేవతలు.. ఊరూరా చుట్టాలు
ఎల్లలు దాటి వచ్చి గ్రామదేవతలకు ప్రణమిల్లి..⇒దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి..⇒అనామకుల నుంచి అపర కుబేరుల వరకు..⇒సర్పంచ్ నుంచి ప్రధాని వరకు..⇒భాగ్యనగరంలో గ్రామ దేవతల సేవలో భక్తజనం పునీతం.. గ్రామ దేవత.. గ్రామానికి రక్ష.. పాడి పంటలు, సుఖ సంతోషాలు, సకల సౌభాగ్యాలు కలిగించే కల్పవల్లి. ఆ ఊరి వారి కోర్కెలు తీర్చే ఇలవేల్పు. అమ్మలు గన్న అమ్మకు ఆ గ్రామస్తులు భక్తి ప్రపత్తులతో అమ్మవారి మొక్కులు తీర్చుకుంటారు. ఊరంతా ఏకమై ఏటేటా అమ్మవారికి వివిధ రూపాల్లో ఉత్సవాలు జరుపుతూ ఆశీర్వచనాలు పొందుతుంటారు. ఇది అనాదిగా వస్తున్న భక్తిపూర్వక ఆచారం. గ్రామ ప్రజల అపార విశ్వాసం. అప్పటివరకూ ఒక ఊరు వారు మాత్రమే చవిచూసిన అమ్మవారి ఆశీస్సుల మహిమలు జిల్లా, రాష్ట్ర, దేశ, ఖండాలను పాకి ఇప్పుడు ఆ తల్లికి విశ్వమంతా బంధువులయ్యారు. గాలిమోటారెక్కి మరీ అమ్మవారి మొక్కులు తీర్చుకుని వెళ్తుంటారు. ఔను..ఇది అక్షరాల నిజం. ఒకప్పుడు ఊరి భక్తులు తమ ప్రాంతానికే రక్ష అని భావించగా..ఇప్పుడు విశ్వమే ఊరుగా మారి అమ్మవారి ఆశీస్సుల కోసం క్యూ కడుతున్నారు.గ్రామ దేవతలు అయిన సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ, జూబ్లీహిల్స్ పెద్దమ్మ, బేగంపేట కట్టమైసమ్మ, శివారు ప్రాంతాల్లో భక్తులచే నిత్య పూజలందుకుంటున్న గండిమైసమ్మ, మైసిగండి.. ఇలా ఎందరో గ్రామ దేవతలు మమ్ము కాసే దేవతలుగా భక్తజనం దండాలు పెట్టుకుంటూ మొక్కులు తీర్చుకుంటారు. అమ్మవార్ల ఆలయాలకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వ్యయప్రయాసలకోర్చి వస్తుంటారు. ఆ ఆలయాలు నిత్య కళ్యాణం.. పచ్చతోరణం అన్నట్లు భక్తకోటి దర్శనాలతో విలసిల్లుతున్నాయి. నాడు బెహలూన్ఖాన్.. నేడు బల్కంపేట.. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయం తెలంగాణ ప్రాంతమే కాదు..దేశంలోనే సుప్రసిద్ధ ఆలయం. హైదరాబాద్ నగరం ఏర్పడకముందు ఇది కుగ్రామంగా ఉండేది. రాజాశివరాజ్ బహద్దూర్ అనే సంస్థానాదీశుడి హయాంలో ఈ ప్రాంతాన్ని బహలూన్ఖాన్ గూడగా పిలిచేవారు. కాలక్రమేణా అది కాస్తా బల్కంపేటగా మారి ఇప్పుడు ఎల్లమ్మ అమ్మవారి ఆలయంతో ఆ గ్రామం విశ్వవ్యాప్తమైంది. ఎక్కడెక్కడి నుంచో భక్తులు అమ్మవారి దర్శనార్థం వస్తుంటారు. రథోత్సవ వేళ.. ఇక బోనాలు, కళ్యాణ మహోత్సవాలు, రథోత్సవాల వేళ..‘అమ్మ’ దర్శనం కోసం రెక్కలు కట్టుకుని మరీ విదేశాల నుంచి వచ్చేస్తారు. అంతెందుకు.. ఎక్కడో అమెరికాలో ఉండి కూడా ఆన్లైన్ ద్వారా అమ్మవారికి చీరలు తెప్పించి మరీ ప్రదానం చేస్తుంటారంటే అమ్మవారిపై భక్తిప్రపత్తులు ఏపాటివో అర్థమవుతుంది. అలాగే అమ్మవారి చీరలు వేలం ఎప్పుడెప్పుడా అంటూ వేచిచూస్తూ ఎక్కడో విదేశాల్లో ఉన్నవారు సైతం వాటిని తీసుకునేందుకు పోటీపడుతుంటారు. లష్కర్లో కొలువై..విశ్వమంతా వ్యాపించి.. ఉజ్జయినీలో కలరాతో అల్లాడుతుంటే నగరం నుంచి ఓ మిలటరీ టీమ్ అక్కడి సేవా కార్యక్రమాల్లో పాల్గొంది. ఆనాడు 13 కులాలకు చెందిన వారు టీమ్‌గా అక్కడికి వెళ్లగా తమకెవరికీ ఏమి కాకుండా సురక్షితంగా ఇంటికి చేరునేలా చూడు తల్లీ అంటూ ఉజ్జయినీ అమ్మవారి సూరిటి అప్పయ్య అనే భక్తుడు వేడుకుంటే.. ఆ తల్లి కటాక్షించింది. ఆ భక్తుడు మొక్కుకున్న విధంగా ఆ ఉజ్జయినీ మహంకాళిని లష్కర్లో ప్రతి చాడు. అలా కొలువైన మహంకాళిని కొన్ని దశాబ్దాలుగా కేవలం ఆ ప్రాంతం వారే మొక్కుకుని నిత్య పూజలు చేస్తూ వచ్చారు. రానురాను ఎల్లలు దాటి మరీ భక్తులు దేశ, విదేశాల నుంచి వచ్చి అమ్మవారిని వేడుకుంటున్నారు.అమ్మవారి సేవలో జాతీయ, రాష్ట్ర ప్రముఖులు..ఒకనాడు గ్రామ సర్పంచ్, పెద్దల పర్యవేక్షణలో నిర్వహించే ఉజ్జయినీ జాతరకు చుట్టుపక్కల ఊళ్లకు చెందిన వారు మాత్రమే బండ్లు కొట్టుకొని వచ్చేవారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి వరకూ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. 1982–1987 కాలంలో భారత రాష్ట్రపతి హోదాలో జ్ఞాన్జైల్సింగ్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఇటీవల నగర పర్యటనకు విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమ్మవారి సేవలో పునీతులయ్యారు. అంతకముందు అమిత్ షా, నడ్డా వంటి జాతీయ నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు.నీతా అంబానీ.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ సతీమణి. ఆమె హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ప్రతిసారీ బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకుని ఆశీస్సులు తీసుకోవడం పరిపాటి. ఇక గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దివంగత నేత రోశయ్య బతుకున్నంతకాలం అమ్మవారి సేవలో పునీతులయ్యారు. వీరే కాదు..రాజకీయ, వ్యాపార తదితర రంగాల్లో ఉన్నవారు బల్కంపేట ఎల్లమ్మ అంటే అపార భక్తి విశ్వాసం. పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కేసీఆర్ కుటుంబ సభ్యులు, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, దానం నాగేందర్ ఇలా రాష్ట్రానికి చెందిన వారే కాదు..ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ ఇలా దక్షిణ, ఉత్తర భారతదేశం అని తేడా లేకుండా విభిన్న రాష్ట్రాలకు చెందిన ఎందరో భక్తజనులు అమ్మవారి దర్శనం కోసం వస్తుంటారు.ఊహ తెలిసినప్పటి నుంచి.. ఊహ తెలిసినప్పటి నుంచి మహంకాళి జాతరను చూస్తున్నాను. అప్పట్లో లష్కర్ ప్రాంత ప్రజలే పూజించి మొక్కులు తీర్చుకునేవారు. భక్తులు పెరిగే కొద్ది ఆలయం విశాలంగా మారుతూ వచి్చంది. – సీకే నర్సింగరావు (72), దక్కన్ మానవా సేవా సమితిఎక్కడెక్కడో స్థిరపడ్డవారు కూడా.. బల్కంపేట ఎల్లమ్మ, సికింద్రాబాద్ మహంకాళి అమ్మవార్లు ఆశీస్సులు ఉంటే ఏదైనా సాధించగలమన్న నమ్మకం. ఎక్కడెక్కడో స్థిరపడ్డ వారైనా దర్శనం కోసం వస్తుంటారు. మొక్కులు తీర్చుకుంటారు. –అన్నపూర్ణ, బల్కంపేట ఎల్లమ్మ, సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయాల పూర్వ ఈఓహుండీ ఆదాయం లెక్కించే సమయంలో విదేశీ కరెన్సీ కూడా కనిపిస్తుంటుంది. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా కరెన్సీలు ఎక్కువగా వస్తుంటాయి. ఆలయానికి రాలేని భక్తుల కోసం ఆన్లైన్ హుండీ విధానాన్ని కూడా దేవాదాయ శాఖ తీసుకొచి్చంది. -
Hyderabad: నేటి నుంచి మూడు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
సనత్‌నగర్: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం సందర్భంగా నేటి నుంచి మూడు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. కల్యాణం జరిగే 9న, రథోత్సవం నిర్వహించే 10న భక్తులు విశేషంగా తరలిరానున్న నేపథ్యంలో ఈ నెల 8 నుంచి 10 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. వాహనదారులు, ప్రయాణికులు గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సిందిగా సూచించారు. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా ఉన్నాయి. గ్రీన్‌ల్యాండ్స్, మాతా టెంపుల్, సత్యం థియేటర్ నుంచి ఫతేనగర్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ఎస్ఆర్నగర్ టి–జంక్షన్ వద్ద మళ్లించి ఎస్ఆర్నగర్ కమ్యూనిటీ హాల్, అభిలాష టవర్స్, బీకేగూడ ఎక్స్‌రోడ్డు, శ్రీరామ్‌నగర్ క్రాస్‌రోడ్డు, సనత్‌నగర్ మీదుగా ఫతేనగర్ రోడ్డు వైపు అనుమతిస్తారు. ⇒ ఫతేనగర్ ఫ్లైఓవర్ నుంచి బల్కంపేట వైపు వెళ్లే వాహనాలను కొత్త వంతెన వద్ద కట్టమైసమ్మ దేవాలయం, బేగంపేట వైపు మళ్లిస్తారు. ⇒ గ్రీన్‌ల్యాండ్స్–బకుల్ అపార్ట్మెంట్స్, ఫుడ్‌వరల్డ్ నుంచి వచ్చే వాహనాలను బల్కంపేట వైపు అనుమతించరు. ఫుడ్‌వరల్డ్ ఎక్స్ రోడ్డులో సోనాబాయి టెంపుల్, సత్యం థియేటర్, మైత్రివనం లేదా ఎస్ఆర్నగర్ టి–జంక్షన్ వైపు మళ్లిస్తారు. ⇒ బేగంపేట కట్టమైసమ్మ దేవాలయం నుంచి వచ్చే వాహనాలు బల్కంపేట వైపు వెళ్లడానికి అనుమతించరు. ఆ ట్రాఫిక్‌ను గ్రీన్‌ల్యాండ్స్, మాతా ఆలయం, సత్యం థియేటర్, ఎస్ఆర్నగర్ టి–జంక్షన్ ఎడమ మలుపు నుంచి ఎస్ఆర్నగర్ కమ్యూనిటీ హాల్ వైపు మళ్లిస్తారు. ⇒ ఎస్ఆర్నగర్ టి–జంక్షన్ నుంచి ఫతేనగర్ వరకు బైలేన్లతో పాటు లింక్ రోడ్లు మూసివేస్తారు. వాహనాల పార్కింగ్ ఇలా.. ఎస్ఆర్నగర్ టి–జంక్షన్ సమీపంలో ఆర్అండ్బీ కార్యాలయం, ఫుడ్‌వరల్డ్ ఎక్స్‌రోడ్డు సమీపంలోని జీహెచ్ఎంసీ గ్రౌండ్, నేచర్‌క్యూర్ హాస్పిటల్ రోడ్డు సైడ్ పార్కింగ్, నేచర్‌క్యూర్ హాస్పిటల్ పార్కింగ్, ఫతేనగర్ రైల్వే వంతెన కింద పార్కింగ్ ప్రాంతాలను గుర్తించారు. భక్తులు తమ వాహనాలను నిరీ్ణత పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే సక్రమంగా పార్కింగ్ చేయాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో, ప్రయాణ సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ 90102 03626కు ఫోన్ చేయాలన్నారు. -
భాగ్యనగరంలో బోనాల సందడి.. తొలి బోనం సమర్పణ
సాక్షి, హైదరాబాద్: గోల్కొండలో బోనాల సందడి నెలకొంది. జగదాంబికా అమ్మవారి ఆలయానికి మహిళలు భారీ సంఖ్యలో బోనాలతో వచ్చి.. మొక్కులు చెల్లించుకుంటున్నారు. శివసత్తుల పునకాలతో భాగ్యనగరం మార్మోగుతోంది. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బొనం సమర్పించారు. డప్పు చప్పుళ్లు, పొతురాజుల విన్యాసాలతో ఆ ప్రాంతమంతా మార్మోగుతోంది.తొలిపూజ కావడంతో ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. లంగర్ హౌస్ నుంచి ఊరేగింపుగా వెళ్లి... చోటాబజార్‌లోని పూజారి ఇంట్లో ఉన్న అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు పట్టు వస్త్రాలు సమర్పించారు. నేటి నుంచి ఆగస్టు 4 వరకు గోల్కొండలో బోనాల ఉత్సవాలు కొనసాగనున్నాయి. అనంతరం ఈ నెల 21, 22 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి.. 28, 29 తేదీల్లో లాల్ దర్వాజా బోనాలు జరగనున్నాయి. -
భాగ్యనగరంలో బోనాల సందడి
-
నేటి నుంచి ఆషాడ మాస బోనాలు.. జగదాంబికకు తొలి బోనం
గోల్కొండ: బోనాలకు వేళైంది. గోల్కొండ కోట ముస్తాబైంది. కోటలో కొలువుదీరిన శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారి ఆషాఢమాసం బోనాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గోల్కొండలోని జగదాంబికా అమ్మవారి ఆలయం వద్ద బోనాల సందడి నెలకొంది. మహిళలు పెద్దఎత్తున బోనాలతో అక్కడికి చేరుకున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. డప్పు చప్పుళ్లు, తీన్మార్ దరువులతో ఆ ప్రాంతమంతా మార్మోగుతోంది. పోతరాజుల వీరంగాలు, శివసత్తుల ఆటలతో జాతర శోభ సంతరించుకుంది.మొత్తం తొమ్మిది పూజలు అందుకునే అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం జలమండలి భారీ ఎత్తున తాగునీటి ఏర్పాట్లు చేస్తోంది. జలమండలి డీజీఎం ఖాజా జవహర్ అలీ సిబ్బందితో తాగునీటి ట్యాంకర్లను పెట్టిస్తున్నారు. మరోవైపు ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేకంగా హెల్త్ క్యాంప్‌లు ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైయ్యే అంబులెన్స్‌ను కూడా సిద్ధంగా ఉంచారు. అగ్నిమాపక శాఖ వారు మొబైల్ ఫైర్ ఎస్టింగిషర్‌ను కూడా సిద్ధం చేశారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అమ్మవారి అలంకరణలను పూర్తి చేశారు. పోలీసులు లంగర్‌హౌజ్ నుంచి గోల్కొండ వరకు పికెటింగ్‌లు ఏర్పాటు చేయడంతో పాటు మహిళా పోలీస్ టీమ్‌లను కూడా సిద్ధంగా ఉంచారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరాజు తెలిపారు. సప్త మాతృకలకు.. బంగారు బోనాలు.. చార్మినార్: నగరంలో ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని విజయవాడలోని కనక దుర్గ అమ్మవారికి బోనాలను సమర్పించనున్నారు. ఇందులో భాగంగా మొదటి బంగారు బోనాన్ని గోల్కొండ జగదాంబ అమ్మవారికి సమర్పించనున్నామని భాగ్యనగర్ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ గాజుల అంజయ్య తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటలకు పాతబస్తీ మీరాలంమండి మహంకాళేశ్వర దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బోనంతో గోల్కొండ కోటకు బయలుదేరుతామన్నారు. లంగర్‌హౌజ్ వద్ద ఏర్పాటు చేసే స్వాగత వేదికపై నుంచి మంత్రులు స్వాగతం పలుకుతారని ఆయన తెలిపారు. కమిటీ ఆధ్వర్యంలో సప్త మాతృకలకు సప్త బంగారు బోనాలను నగరంలోని గోల్కొండ, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ తల్లి, జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయం, చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం, లాల్‌దర్వాజా సింహవాహిని దేవాలయం అమ్మవార్లకు బంగారు పాత్రలో సమర్పించనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం గోల్కొండ జగదాంబ అమ్మవారికి, 10న బల్కంపేట ఎల్లమ్మ, 12న, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి, 14న విజయవాడ కనకదుర్గ అమ్మవారికి, 18న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి, 23న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి, 25న లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవార్లకు బంగారు బోనం, పట్టు వ్రస్తాలు, ఒడి బియ్యం సమర్పించనున్నారు. -
రేపట్నుంచే ఆషాడ బోనాల జాతర.. గోల్కొండతో షురూ (ఫొటోలు)
-
విలక్షణం... బంజారాల జీవితం
అనంతపురం కల్చరల్: ‘బంజారా..’ ఈ పేరు వినగానే విభిన్నమైన వేషధారణతో ఉన్న స్త్రీలు, ఆజానుబాహులైన పురుషులు కళ్ల ముందు కనిపిస్తారు. అయితే వీరు అసమాన వీరపరాక్రమాలకు ప్రతీకలైన రాజపుత్రులకు వారసులనే విషయం కొద్దిమందికే తెలుసు. సంచార జాతులుగా జీవిస్తున్న బంజారాలు ఒకనాడు సూర్య, చంద్ర వంశాలకు చెందిన రాజ పుత్రులని చరిత్ర చెబుతోంది. వారి ఆచారాలు, వ్యవహారాలు, వేషధారణలూ విలక్షణంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో తమ సంస్కృతికి అద్దం పట్టే బోనాల పండుగను మంగళవారం శోభాయమానంగా నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి జిల్లాలో బంజారాలు ఇలా... గిరిజన తండాలుః 649 పంచాయతీలుః 242 బంజారాల సంఖ్యః దాదాపు 2 లక్షల మంది (2011 జనాభా లెక్కల ప్రకారం)ఊరికి దూరంగా ఎందుకు? బంజారాలు సాధారణంగా అటవీ ప్రాంతాల్లో, ఊరికి దూరంగా, కొండకోనల్లో జీవిస్తుంటారు. వీరి నివాసాలను ‘తండా’లు అని పిలుస్తారు. అలా ప్రారంభమైన ఊరి బయట నివాసం కాలక్రమంలో స్థిరపడిపోయి తండాలుగా రూపుదిద్దుకున్నాయి. ‘తండా’ అంటే సరుకు నింపిన గోనె సంచుల సమూహమని అర్థం. వీరి ప్రధాన వృత్తి వ్యవసాయమే. వారిలో కొద్ది మంది వ్యాపారాలు చేసుకుంటూ బతికేవారని ‘లంబాడీ’లని, ‘సుగాలీ’లని పిలుస్తుంటారు. ఒకప్పుడు రాథోడ్, చౌహాన్, పవార్, జాదవ్ లాంటి రాజపుత్ర వంశాల పరంపరలోనే నేటికీ వీరు కొనసాగుతున్నారు. తండా ప్రజలు ఓ నాయకుడిని ఎన్నుకొని, ఆయన అదుపు ఆజ్ఞలో నివసిస్తారు. తమ ఆచార వ్యవహారాలను, సంస్కారాలను నియమంగా ఆచరిస్తారు, పాటిస్తారు. కష్టసుఖాల్లో కలిసి జీవిస్తారు. పారదర్శక విలువలకు ప్రాధాన్యతనిస్తూ కొనసాగే తండాల విలక్షణ జీవనం ఇతరులకు ఆదర్శప్రాయం. భిన్నమైన వేషధారణ.. వేలాది మంది ఓ చోట గుంపుగా ఉన్నా... బంజారాలను వారి వస్త్రధారణ చటుక్కున పట్టించేస్తోంది. ఆధునికత పెరిగిన నేటి రోజుల్లోనూ వారు తమ సంప్రదాయ దుస్తులతో విభిన్నంగా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంటారు. ఆభరణాలు, గవ్వలు కలబోసి రూపొందించిన దుస్తులు చాలా బరువుగా ఉంటాయి. వెండి, బంగారు, కంచు ఇత్తడి లోహాలతోపాటు ఏనుగు దంతాలతో చేసిన గాజులు మోచేతి వరకూ ధరిస్తారు. తలపై నుంచి ధరించే వస్త్రం అంచుకు పావలా బిళ్లలు, అద్దాలు కుట్టి ఉంటాయి. కాళ్లకు ధరించే కడియాలు నడుస్తున్నపుడు చేసే వింత శబ్ధాలు కూడా ఎంతో వినసొంపుగా ఉంటాయి. విభిన్న వస్త్రధారణతో పాటు తమకే సొంతమైన పాటలతో వారు చేసే నృత్యం ఎవరినైనా మైమరపిస్తుంది. లిపి లేకున్నా వీరు ఎక్కడ జీవిస్తే ఆ భాషను వంట పట్టించుకుని లంబాడీ పదాలతో అద్భుతైన గీతాలను రచించుకున్నారు. వీటిలో దేశభక్తి ప్రబోధమైవేకాక, కామోద్రేకం కలిగించేవి, ఆధ్యాతి్మకతను పెంచేవి కూడా ఉన్నాయి. ముఖ్యంగా వీరు కష్టజీవులు. కాయకష్టంతో జీవనం సాగించడంలో ఉన్న ఆనందం మరెందేలోనూ లేదని వీరు అంటుంటారు. శతాబ్దాల కిందటే అనంతలో.. ప్రపంచవ్యాప్తంగా సంచారం చేస్తూ అన్ని ప్రాంతాల్లో స్థిరపడినట్లే బంజారాలు ‘ఉమ్మడి అనంత’లోనూ కొన్ని వందల ఏళ్ల కిందటే వేర్వేరు ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. 1978లో అప్పటి ప్రభుత్వం ‘రోటీ కపడా ఔర్ మకాన్’ పథకం కింద ప్రస్తుతమున్న నాయక్నగర్ను ఏర్పాటు చేసి చాలా మందికి పట్టాలిచ్చి ఒకచోటకు చేర్చింది. సంచార జాతులుగా కనపడే వీరు ఆధ్యాతి్మకంగానూ చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా బంజారాలు ఆరాధ్య దైవంగా, కొలుచుకునే గురువుగా భాసిల్లే సేవాలాల్ మహారాజ్ కూడా అనంత వాసి కావడం విశేషం. ఆయన ఆదేశానుసారం వారి ప్రాచీన ఆచారాలను వదలకుండా ఇతర ప్రాంతాలకూ అనంత బంజారాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ఉగాది, దీపావళి, హోళీ పండుగలను విశేషంగా జరుపుకుంటారు. ఆధునిక పోకడలు ఎన్ని ఉన్నా... నేటికీ ఆచారాలను వదలకుండా లంబాడీల సంప్రదాయ పర్వదినాల సందడి నిత్యనూతనంగా సాగుతోంది. అమ్మోరికి బోనాల సమర్పణ.. అనంతపురంలోని నాయక్‌నగర్ ఏర్పడిన తొలి రోజుల్లోనే బంజరాల కులదైవమైన మారెమ్మ ఆలయాన్ని ఏర్పాటైంది. అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించుకుని శతాబ్దాలుగా వస్తున్న ‘«శీతలయాడి ఉత్సవం’ (అమ్మవారికి బోనాలు సమర్పించే జాతర) ఘనంగా నిర్వహించుకుంటూ వస్తున్నారు. తమ ఇష్టదైవాలైన సీతలయాడి, మే రామ భవాని, తుల్జాభవానీ, హింగ్లా భవానీ, కెంకాళి భవానీ, మంత్రాలి భవానీ, ద్వాలంగార్ భవానీ తదితర అమ్మవార్లను ఘనంగా పూజిస్తుంటారు. ఈ బోనాల పండుగకు జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాలలో స్థిరపడిన బంధువులు సైతం తప్పనిసరిగా తరలివస్తారు. సంప్రదాయ దుస్తులు ధరించి నాట్యం చేసే తీరు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో విలక్షణ శైలితో సాగే బోనాల జాతరను ఈ నెల 2న (ఆరుద్రకార్తె, మంగళవారం) అనంతపురంలోని నాయక్‌నగర్‌లో నిర్వహించేందుకు బంజారాలు సిద్ధమయ్యారు. ఎక్కడ ఉన్నా మేము ప్రత్యేకమే ఒకనాడు ప్రపంచమంతటా తిరిగి వ్యాపారాలు సాగించిన చరిత్ర బంజారాలది. ఔరంగజేబు రాకతో బంజారాలు కకావికలమయ్యారు. అలా అంతటా తిరుగుతూ మా పూరీ్వకులు అనంతకూ వలస వచ్చారు. ప్రాంతాలు వేరైనా మా సంప్రదాయాలు, పండుగలు, ఆచార వ్యవహారాలను వదలడం లేదు. మంగళవారం సాగే జాతరకు అందరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నా. – శంకరశివరావు రాథోడ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, అనంతపురంసనాతన ధర్మాన్ని వీడలేదు సుగాలీలు, లంబాడీలని పిలిచే మా జాతి ఒకనాటి రాజపుత్ర వీరుల వంశానికి చెందినదంటే చాలా మంది నమ్మరు. మా ఆచారాలు భిన్నంగానే ఉంటాయి. ప్రాణం పోయినా సనాతన ధర్మాన్ని వీడి ఇతర మతాల వైపు చూడం. శ్రీరాముడు మాకు ఆదర్శ పురుషుడు. అలాగే గ్రామదేవతలైన అమ్మవార్లను పంటలు బాగా పండాలని, వానలు సమృద్దిగా కురవాలని కోరుకుంటూ బోనాలు సమరి్పస్తాం. – శాంతిబాయి, నాయక్‌నగర్, అనంతపురం -
బంగారు బోనం కోసం ఏర్పాట్లు షురూ
చార్మినార్: రానున్న ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని ఏటా మాదిరిగానే సప్త మాతృకలకు సప్త బంగారు బోనం సమర్పించేందుకు భాగ్యనగర్ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా బంగారు పాత్రలోని నైవేద్యాన్ని ఏడు అమ్మవారి ఆలయాలకు తీసుకెళ్లి సమర్పించేందుకు జోగిని నిషా క్రాంతికి సోమవారం మీరాలంమండిలో ఉమ్మడి ఆలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ గాజుల అంజయ్య, చంద్రకళ దంపతులు వాయినాన్ని అందజేశారు. జులై 7న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమరి్పంచే బంగారు బో నంతో బంగారు బోనం కార్యక్రమాలు ప్రారంభమవుతాయని గాజుల అంజయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ మాజీ చైర్మన్ పొటేల్ సదానంద్ యాదవ్, మధుసూదన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
జులై-7 నుంచి తెలంగాణ బోనాలు
-
వెంగళరావునగర్‌లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వీరంగం
హైదరాబాద్: బోనాల వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫోటో పెట్టలేదంటూ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వీరంగం సృష్టించారు.వెంగళరావునగర్‌లో బోనాల వేడుకలు జరుగుతుండగా అక్కడకొచ్చిన ఎమ్మెల్యే గోపీనాథ్ ఫ్లెక్సీలో తన ఫోటో పెట్టలేదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఆ బోనాల వేడుకల్లో భాగమైన సామాన్య వ్యక్తి గణేష్ ఇంటిపై దాడి చేశారు. తన అనుచరులతో కలిసి గణేష్ ఇంట్లోకి చొచ్చుకువెళ్లి దాడికి పాల్పడ్డారు. పోలీసుల సమక్షంలోనే దాడికి పాల్పడగా.. వారు ఏమీ చేయలేక చేతులెత్తేశారు. చదవండి: లాల్‌దర్వాజ బోనాలు: ఆలయం వద్ద చికోటీ ప్రవీణ్ ఓవరాక్షన్! -
విజయవాడ దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం (ఫొటోలు)
-
శాంతియుతంగా పండుగలు జరుపుకోవాలి
మంచిర్యాలక్రైం: శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని మంచిర్యాల ఏసీపీ తిరుపతిరెడ్డి అన్నారు. బక్రీద్, తొలి ఏకాదశి, బోనాల పండుగలు వరుసగా ఉన్నందున అన్ని మతాల పెద్దలతో స్థానిక ఏసీపీ కార్యాలయంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ గోవధపై నిషేధం విధించారని, గోవులను అక్రమంగా రవాణా చేసినా, వధించిన చర్యలు ఉంటాయని తెలిపారు. మతాలకతీతంగా పండుగలు జరుపుకోవాలని, ఏదైనా సమస్య ఉత్పన్నమైతే వెంటనే 100డయల్‌కు సమాచారం అందించాలని సూచించారు. ఈ సమావేశంలో సీఐ రాజు, ఎస్సైలు పాల్గొన్నారు. ప్రశాంత వాతావరణంలో.. బెల్లంపల్లిరూరల్: ప్రజలు పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్య అన్నారు. మంగళవారం సాయంత్రం తాళ్లగురిజాల పోలీసుస్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన శాంతికమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మత సామరస్యం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఈ సమావేశంలో బెల్లంపల్లిరూరల్ సీఐ రాజ్‌కుమార్‌గౌడ్, వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో శంకరయ్య, మతపెద్దలు, తాళ్లగురిజాల, వన్‌టౌన్, టూటౌన్ ఎస్సైలు నరేష్, విక్టర్, రవికుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
Golconda Bonalu Photos: గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలు (ఫొటోలు)
-
హైదరాబాద్ : వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం (ఫొటోలు)
-
వేదామృతం.. గీతామృతం.. ఏదైనా నీరా ప్రియం!
దేవునికి సమర్పించేది నైవేద్యం, కాని దాన్ని తినేది మాత్రం మనిషే. మనుషుల ఆహార అలవాట్లే దేవునికి ఆపాదించబడ్డాయన్నది వాస్తవం. ఆచారాల్లో నిమగ్నం చేయడం వల్ల మనుషులను మంచి కర్మల వైపు మల్లించవచ్చునన్న భావనతో వేదకాలంలో వచ్చిన యజ్ఞయాగాదులు,పశుబలి,సూరాపానం పూర్వ మీమాంస ( prior study ) పద్దతి. దీని కర్త వేద వ్యాసుని శిష్యుడైన జైమిని అంటారు. ఆనాటి సమాజంపైనున్నబౌద్ధమత ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని పూర్వ మీమాంస కూడదని హైందవ పూజా విధానాన్ని 'ఉత్తరమీమాంస' ( posterior study) వైపు అనగా శాఖాహర క్రతువు వైపు, గోవధ నుండి గోసంరక్షణ వైపు మల్లించినవాడు శంకరాచార్యుడు. ఈ దెబ్బతో దైవపూజ యజ్ఞయాగాల్లో జరిగే పశుబలితో పాటు సూరాపానం /కల్లు వంటి మద్యపానాలను కూడా పక్కకు పెట్టినట్లయింది.అయితే గ్రామ దేవతల ఆరాధనలో కల్లు వినియోగం 'కల్లుసాక'గా ఇప్పటికీ విరివిగా జరుగుతున్నదే. ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం కల్లుగీత చెట్ల నుండి తీయబడుతున్న ప్రకృతి సహజమైన పానీయం 'నీరా' వాడకాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో హైదరాబాద్ ట్యాంక్ బండ్ సమీపంలో ప్రారంభించిన ఔట్లెట్లో దాని పేరు 'వేదామృతం 'గా పెట్టడం వివాదాస్పదం అయింది. ► నీర ఎంత మధురమైనదైనా అది మద్య సంబంధమైందే, దానికి 'వేద' పదాన్ని జోడించడం అపచారం అంటూ వాదిస్తున్నారు కొన్ని బ్రాహ్మణ సంఘాలవారు. ► అమృతం రుచి ఎలా ఉంటుందో దేవతలకే తెలుసు, మనుషులకు తెలిసింది మహా రుచికరమైంది, పైగా బోలెడన్ని ఔషద గుణాలున్నది నీరా కావాలంటే కాస్త తాగి చూడండి అంటున్నారు గౌడ సంఘాలవారు. ఈ గొడవలన్నీ దేనికి నీరా చెట్లు గీయడం ద్వారానే కదా లభిస్తున్నది దానికి 'గీతామృతం 'అని పేరు పెట్టుకుంటే సరిపోతుంది కదా!అని నాబోటి వారు సలహా ఇస్తే అందులో కూడా మతాన్ని చూసే మహానుభావులున్నారు అంటూ వారు 'వేద' వాక్కునే వల్లిస్తున్నారు. అయ్యా! ఏ పెరైనా పెట్టుకొండి మాకు కావాల్సింది నీరా,మీరు స్వచ్ఛమైన నీరా అందిస్తే అదే మహాభాగ్యం!అంటున్నారు భాగ్యనగరవాసులు. -వేముల ప్రభాకర్, అమెరికా డల్లాస్ నుంచి -
ఆస్ట్రేలియాలో బోనాల జాతర
-
బోనమెత్తిన గవర్నర్ తమిళిసై
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం రాజ్‌భవన్‌లో ఆషాఢ మాసం బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. తన తలపై బోనం మోస్తూ రాజ్‌భవన్ పరివార్ సభ్యులతో కలిసి ఆమె అధికారిక నివాసం నుంచి రాజ్‌భవన్‌లో ఉన్న నల్లపోచమ్మ ఆలయానికి ఊరేగింపుగా వచ్చారు. అమ్మవారికి బోనం సమర్పించి పూజలు చేశారు. విశాలమైన రాజ్‌భవన్ సముదాయంలో జానపద గీతాల ఆలాపనతో బోనాల ఉత్సవాలను నిర్వహించడంతో అంతటా పండుగ శోభను సంతరించుకుంది. మహంకాళి అమ్మవారి దివ్య ఆశీర్వాదంతో కోవిడ్–19 మహమ్మారి చాలావరకు అదుపులో ఉందని గవర్నర్ వ్యాఖ్యానించారు. ప్రజలంతా సాధారణ జీవితానికి రావడంతో ఈ ఏడాది బోనాల పండుగను జరుపుకునేందుకు ప్రజలు నిర్భయంగా ఆలయాలకు తరలివస్తున్నారని పేర్కొన్నారు. దేశం, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సుఖసంతోషాల కోసం ప్రార్థించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె రాజ్‌భవన్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులందరికీ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ శుభాకాంక్షలు తెలిపారు. -
హైదరాబాద్: రాజ్‌భవన్‌లో ఘనంగా బోనాల వేడుకలు
-
దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్‌లోని ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ తరఫున ఆదివారం బంగారు బోనం సమర్పించనున్నారు. ఈ కమిటీ వారు ప్రతి ఏటా ఆషాడ మాసంలో బెజవాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో వర్షాలు విస్తారంగా కురిసి, పాడి పంటలతో రైతులు, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ గత 13 ఏళ్లుగా అమ్మవారికి బంగారు బోనం సమర్పించే కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని మహంకాళీ బోనాల ఉత్సవ కమిటీ చైర్మన్ రాకేష్ తివారీ పేర్కొన్నారు. ఈ ఏడాది అమ్మవారికి బోనం సమర్పించే కార్యక్రమానికి కమిటీ సభ్యులతో పాటు 500 మందికి పైగా కళాకారులు విజయవాడకు చేరుకున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు బ్రాహ్మణ వీధిలోని జమ్మి చెట్టు వద్ద అమ్మవారికి పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం బంగారు బోనంతో ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి చేరుకుంటారు. మేళతాళాలు, తీన్మార్ డప్పులు, పోతురాజుల విన్యాసాలు, కోలాట, బేతాళ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు, వడిబియ్యంతో పాటు కృష్ణమ్మ తల్లికి పట్టువస్త్రాలు, పసుపు కుంకుమ, గంగతెప్పను సమర్పించనున్నారు. -
ఆషాడ బోనాలకు భాగ్యనగరం సన్నద్ధం
-
హైదరాబాద్‌లో బోనాల జాతర.. తేదీలు ఖరారు..
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 30వ తేదీ నుంచి బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పేలా బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో ఆషాఢ బోనాల నిర్వహణ, ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 30న గోల్కొండ బోనాలు, జూలై 17న సికింద్రాబాద్ బోనాలు, 18న రంగం, జూలై 24న హైదరాబాద్ బోనాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జూలై 25న ఘటాల ఊరేగింపు జరగనుంది. బోనాల నిర్వహణకు ప్రభుత్వం రూ. 15 కోట్లు మంజూరు చేసిందన్నారు. ప్రభుత్వ దేవాలయాలతో పాటు 3 వేల ప్రైవేట్ దేవాలయాలకు కూడా ఆర్థిక సాయం అందిస్తామన్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రహదారుల మరమ్మతులు, శానిటేషన్ విభాగం ఆధ్వర్యంలో పరిసరాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతామన్నారు. సుమారు 26 దేవాలయాల్లో ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు ఆయ న తెలిపారు. పోలీసు బందోబస్తు మధ్య సీసీ కెమెరాలతో శాంతి భద్రతలు పర్యవేక్షిస్తామన్నారు. సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ప్రభుత్వ విప్ ప్రభాకర్‌రావు, విద్యుత్ శాఖ స్పెషల్‌చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, హోం శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రవి గుప్తా, జీఏడీ సెక్రటరీ శేషాద్రి, ఆర్అండ్బీ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ కమి షనర్ అనిల్‌కుమార్, జీహెచ్ంఎసీ కమిషనర్ లోకేష్ కుమార్, జలమండలి ఎండీ దాన కిషోర్, జిల్లా కలెక్టర్ శర్మన్, పోలీస్ కమిషనర్లు సీవీ.ఆనంద్, మహేష్ భగవత్, స్టీఫెన్ రవీంద్ర, కల్చరల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, మహంకాళి దేవాలయం, గోల్కొండ దేవాలయం, ఉమ్మడి దేవాలయాల కమిటీ సభ్యులు, పాల్గొన్నారు. చదవండి: చట్ట పరిధిలో తప్పు చేస్తే ఎదుర్కొనేందుకు సిద్ధం: రఘునందన్ -
కోడిపుంజుకు కమ్మలు కుట్టించి.. మెడలో మందేసి
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలోని కేసముద్రం మండల కేంద్రంలో ముత్యాలమ్మ బోనాల పండుగ సందర్భంగా వెంకటేశ్వర్లు అనే స్థానికుడు బుధవారం కోడిపుంజుకు చెవి కమ్మలు కుట్టించి, కోడిమెడలో మద్యం బాటిల్ వేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నాడు. ఆలయం వద్దకు వచ్చిన భక్తులంతా ఆ భక్తుడి మొక్కును ఆసక్తిగా తిలకించడంతోపాటు ఆ పుంజును చేతుల్లోకి తీసుకుని ఫొటోలు దిగారు. ప్రతి ఏటా అమ్మవారికి ఇలానే మొక్కులు చెల్లిస్తానని ఆయన తెలిపారు. – కేసముద్రం చదవండి: పెళ్లి సందడి షురూ! ముహూర్తాలే ముహూర్తాలు! -
నెత్తిన బోనంతో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి.. ఫోటో హైలైట్స్
సాక్షి, హైదరాబాద్: బోనాలంటే నగరమంతా ఉత్సాహమే.. భాగ్యనగరమంతా సందడిగా బోనమెత్తుతోంది. ఇందుకు గ్రేటర్ హైదరాబాద్‌లోని అమ్మవారి ఆలయాలను సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. 113వ లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఆదివారం బోనాల సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. పలువురు సినీ, టెలివిజన్ తారలు.. ప్రజాప్రతినిధులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ ఫోటోలు మీకోసం పాతబస్తీ లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారు బంగారు బోనంతో జోగిని శ్యామల నెత్తిమీద బోనాలతో మహిళలు అమ్మవారికి బోనం తీసుకొస్తున్న మాజీ మంత్రి గీతారెడ్డి బోనంతో వస్తున్న సింగర్ మధుప్రియ బోనమెత్తిన బిగ్‌బాస్ ఫేం సుజాత బోనాలతో మహిళల సందడి నెత్తిన బోనంతో బయల్దేరిన విజయశాంతి, పక్కన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ బోనమెత్తిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ బోనమెత్తిన హైదరబాద్ ఆడపడుచులు -
Hyderabad Bonalu: భక్తితో బయలెల్లి.. అమ్మవార్లకు ప్రణమిల్లి..
సాక్షి, హైదరాబాద్/చాంద్రాయణగుట్ట /చార్మినార్ : మహానగరం బోనమెత్తింది. ఆదివారం బోనాల జాతర ఉత్సాహంగా సాగింది. పాతబస్తీ లాల్‌దర్వాజ సింహవాహిని, చార్మినార్ భాగ్యలక్ష్మి, మీరాలం మహంకాళి, హరిబౌలి బంగారు మైసమ్మ, శాలిబండ అక్కన్న మాదన్న ఆలయం, ఉప్పుగూడ మహంకాళి, కార్వాన్ దర్బార్ మైసమ్మ, ట్యాంక్‌బండ్ కట్ట మైసమ్మ సహా నగరంలోని పలు ప్రాంతాల్లో కన్నులపండువగా వేడుకలు జరిగాయి. పోతురాజుల విన్యాసాలు, తొట్టెల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి, మహ్మద్ మహమూద్ అలీలు పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు.. లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని మాజీ మంత్రి టి.దేవేందర్ గౌడ్, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ మంత్రి డి.కె.అరుణ, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తదితరులు దర్శించుకున్నారు. వెల్లివిరిసిన ఆధ్యాత్మికత.. సాధారణంగా గోల్కొండ, సికింద్రాబాద్ మహంకాళి బోనాల తర్వాత పాతబస్తీలో ఆషాఢ మాసం బోనాల పండగ జరుగుతుంది. నగర శివార్లలో మాత్రం శ్రావణ మాసంలోనే వేడుకలు నిర్వహిస్తారు. కానీ ఈసారి చాలాచోట్ల ఒకేసారి వేడుకలు జరగడంతో నగరమంతా ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. అమ్మవారిని కీర్తిస్తూ సాగిన భక్తి గీతాలతో మైకులు హోరెత్తాయి. అందంగా అలంకరించిన ఆలయాల వద్ద గుగ్గిలం పరిమళాలు గుబాళించాయి. గతేడాది కోవిడ్ కారణంగా బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోలేకపోయిన నగరవాసులు ఈసారి అన్ని చోట్లా పెద్ద సంఖ్యలో తరలి వచ్చి అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. కరోనా మహమ్మారి నుంచి కాపాడాలని, అందరినీ చల్లగా చూడాలని వేడుకున్నారు. -
బ్రాయిలర్ చికెన్‌తో బోరుకొట్టి.. నాటు కోడి తిందామంటే..!
సాక్షి, హైదరాబాద్: మామూలుగానే ఆదివారం వచ్చిందంటే ఇంట్లో కోడి కూర ఘుమఘుమలు ఉండాల్సిందే.. ముక్కతో ఓ ముద్ద తింటే ఆ మజాయే వేరు.. దానికి తోడు బోనాలు.. ఇల్లంతా సంబురం.. ఇక నాన్‌వెజ్ తప్పకుండా ఉండాల్సిందే.. కరోనా ప్రభావంతో నాటు కోళ్లకు కరువొచ్చింది. ఏ చికెన్ మార్కెట్, చికెన్ సెంటర్‌కు వెళ్లినా నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల నాటుకోళ్లు అందుబాటులో ఉన్నా వాటి ధరలు మాత్రం ఆకాశాన్నంటాయి. బోనాల వేళ నాటు కోళ్లు కోయడం ఆనవాయితీగా వస్తున్నందున ధర ఎక్కువైనా కొనుగోలు చేస్తున్నారు. పెద్ద చికెన్ సెంటర్లలో బ్రాయిలర్, లెయర్ కోళ్లతో పాటు నాటు కోళ్లు విక్రయిస్తారు. కానీ నెల రోజుల నుంచి నాటుకోళ్లు విక్రయించే చికెన్ సెంటర్లలో నాటు కోళ్లు లేవు. చికెన్ సెంటర్ యజమానులను అడిగితే గ్రామాల నుంచి కోళ్లు రావడం లేదు. అయినా అక్కడే నాటు కోళ్ల ధరలు రూ.350–400 వరకు ఉన్నాయి. నగరంలోకి వచ్చాక వాటి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కిలో కోడి రూ.600 వరకు ధర పలుకుతుంది నాటు కోడిలో పోషకాలు ఎక్కువ.. బ్రాయిల్ చికెన్‌తో బోర్‌కొట్టి నాటు కోడి రుచి చూద్దామంటే సులభంగా గ్రేటర్లో దొరకడం లేదు. బోనాలతో దానికి డిమాండ్ ఎక్కువ మరోవైపు ప్రజలు కరోనా నుంచి తప్పించుకునేందుకు రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు నాటు కోళ్లను బాగానే ఆరగిస్తున్నారు. బ్రాయిలర్ చికెన్‌లో అంతగా పోషకాలు ఉండవని, నాటు కోడి అయితే ఎక్కువ పోషకాలు ఉంటాయని గ్రేటర్ వాసులు అధికంగా నాటు కోడి తింటున్నారు. దీంతో విపరీతంగా డిమాండ్ పెరిగి కిలో ధర రూ. 600 వరకు పలుకుతుందని అమీర్‌పేట్ చికెన్ వ్యాపారీ గఫూర్ అంటున్నారు. ఊళ్లలోనే అధిక డిమాండ్ గ్రేటర్ శివారు ప్రాంతాల నుంచే కాకుండా కరీంనగర్, మెదక్, నల్లగొండతో పాటు రాయసీమ తదితర జిల్లాల నుంచి నాటు కోళ్లు దిగుమతి అవుతాయి. కానీ జిల్లాల్లో, గ్రామాల్లో ఊళ్లలో కూడా జనం నాటు కోళ్లను ఎక్కువగానే తింటున్నారు. దీంతో పాటు త్వరలో ప్రారంభం కానున్న జాతర కోసం కూడా కోళ్లను విక్రయించడం లేదని ఎల్బీనగర్ హోల్‌సెల్ కోళ్ల వ్యాపారి కిషోర్ చెప్పారు. -
బోనమెత్తిన షర్మిల
మొయినాబాద్ (చేవెళ్ల): బోనాల పండుగ సందర్భంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అమ్మవారికి బోనం సమర్పించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్దమంగళారంలో ఆదివారం వైఎస్సార్టీపీ నాయకుడు రాజ్‌గోపాల్‌రెడ్డికి చెందిన ఫాంహౌస్‌లో తన చిన్ననాటి స్నేహితురాలు రజిని కుటుంబ సభ్యులతో కలిసి షర్మిల బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్టీపీ ముఖ్యఅధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, నాయకులు ఏపూరి సోమన్న, పిట్ట రాంరెడ్డి, డేవిడ్, అమృతసాగర్, ఇతర నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. -
అమ్మవారికి బోనం సమర్పించేందుకు వస్తున్న భక్తులు
-
లాల్‌దర్వాజ బోనాలు: పాతబస్తీలో సందడి
-
బోనాల పండుగకు ముస్తాబవుతున్న లాల్ దర్వాజ్ సింహవాహిని ఆలయం
-
అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన మంత్రి తలసాని
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. కరోనా ఆంక్షలు ఉన్నా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివస్తున్నారు. ఉదయం నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకోవాలని అధికారుల సూచించారు.కాగా అమ్మవారికి ఆలయ కమిటీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంది. కాగా ఆలయ పరిసరాల్లో 200 సీసీ కెమెరాల తో నిఘా ఏర్పాటు చేసిన అధికారులు 2500 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు. ►ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బోనాల ఏర్పాట్లను సీపీ పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ►కాగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఉత్సవాల సందర్భంగా నేడు, రేపు ఆలయం సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆంక్షలు 25వ తేదీ తెల్లవారు జాము 4 గంటల నుంచి పూజలు పూర్తయ్యే వరకు, మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. -
‘మంగ్లీ చేసింది తప్పే... క్షమిద్దాం’
బోనాలపై సింగర్ మంగ్లీ పాడిన పాట వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. బోనాల పాటలో అభ్యంతరకర పదాలు వాడారంటూ బీజేపీ కార్పొరేటర్లు ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే సామాజిక మాధ్యమాల నుంచి పాటను తొలగించాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. మంగ్లీపై కేసు నమోదు చేయాలని పలువురు బీజేపీ కార్పొరేటర్లు సీపీని కోరారు. దీంతో ఈ పాటపై మంగ్లీ వివరణ ఇచ్చింది. ఈ పాటపై విమర్శలు వచ్చిన రోజేనే మార్చేశామని తెలిపారు. గ్రామదేవతను ఎలా పూజిస్తారో తెలుసుకుని విమర్శిస్తే మంచిదని మంగ్లీ పేర్కొన్నారు. ఇక మంగ్లీ పాటపై సోషల్ మీడియాలోభిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’మంగ్లీ పాటపై డిబేట్ పెట్టింది. ఈ చర్చలో సింగర్ పవన్ కుమార్, సంగీత దర్శకుడు భోలే సావలి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మంగ్లీ పాడిన పాటలో అంత అసభ్యకరమైన పదాలేమి లేవన్నారు. మోతెవరి అంటే గ్రామంలో పెద్ద అనే అర్థంలో సాగుతుందని, ప్రస్తుతం ఆపదం వ్యతిరేక అర్ధంలో వాడుతున్నామని చెప్పారు. విమర్శలు వచ్చిన నేపథ్యంలో లిరిక్స్ కూడా మార్చారని, పెద్దమనసు చేసుకొని మంగ్లీ క్షమించాలని కోరారు. ఇకపై అలాంటి తప్పులు రాకుండా కళాకారులు చూసుకుంటామని చెప్పారు. ఇంకా డిబేట్లో ఏంఏం చర్చించారో వీడియో చూడండి. -
మోతెవరి అంటే అర్థం అదే, తెలుసుకుని మాట్లాడండి: మంగ్లీ
'చెట్టు కింద కూసున్నవమ్మ' పాట యూట్యూబ్‌లో మార్మోగిపోతున్న విషయం తెలిసిందే. అయితే అదే స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. అమ్మవారిని మోతెవరి అంటూ సంబోధించడంతో కొందరు నెటిజన్లు సింగర్ మంగ్లీ మీద భగ్గుమన్నారు. బోనాల పాటలో అభ్యంతరకర పదాలు వాడారంటూ ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ పాటపై మంగ్లీ వివరణ ఇచ్చింది. ప్రఖ్యాత జానపద పాటల రచయిత, గాయకులు పాలమూరి రామస్వామిగారు 25 ఏళ్ల క్రితమే ఈ పాట రాశారని తెలిపింది. గ్రామదేవతలను ఎలా పూజిస్తారో తెలుసుకుంటే మంచిదని హితవు పలికింది. ఈ మేరకు సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టింది. "రచయిత రామస్వామిగారి అభిప్రాయం ప్రకారం.. 'చెట్టుకింద కూసున్నవమ్మ' పాటలో మోతెవరి అంటే గ్రామంలో పెద్ద అనే అర్థంలో సాగుతుంది. ప్రస్తుతం ఆ పదం వ్యతిరేక పదంగా వాడుకలోకి వచ్చిందన్నది వాదన, నిందాస్తుతిలో కోలాటం రూపంలో సాగే ఈ పాటను మాకు తెలిసిన కొంతమంది కళాకారులు, పెద్దల సలహాలు తీసుకుని చిత్రీకరించాం. గ్రామదేవతల ఒగ్గు కథలు, బైండ్లోల్ల కొలువులు ఇలా రకరకాల ఆచారాలున్నాయి. భక్తిలో కూడా మూఢ భక్తి, వైరి భక్తి అని రకరకాలుగా ఉన్నాయి. అందులో భాగంగానే ఈ పాటను రూపొందించాం. నేను పండితుల కుటుంబం నుంచి రాలేదు. చెట్లు పుట్టలను కొలిచే గిరిజన జాతికి చెందిన తండా నుంచి వచ్చిన ఆడబిడ్డను. బతుకమ్మ, బోనాలు పండగల్లాగే మా బంజారాలో తీజ్, శీతలా(సాతి భవాని) పండగల్లో ప్రకృతినే దేవతలుగా పూజిస్తాము. మాకు కష్టం కలిగినా సంతోషం వచ్చినా మేము చెప్పుకునేది నమ్ముకునేది గ్రామదేవతలకే. వారిని మా ఇంట్లో సభ్యులుగా నమ్ముతాము. మేము తినేదే, తాగేదే ఆ దేవతలకు నైవేద్యంగా పెడతాము. నేను సింగర్‌గా అంతో ఇంతో ఎదిగింది కూడా అమ్మవారి కృప, ఆంజనేయ స్వామి దీవెన, మీ అభిమానం, ఆదరణ వల్లే అని నమ్ముతాను. అందుకే నేను పుట్టిన తండాలో మా తాతలనాటి ఆంజనేయ స్వామి విగ్రహానికి గుడి కట్టించి పూజలు చేస్తున్నాము. ఏనాడూ గుడికి వెళ్లనివాళ్లు, బోనం ఎత్తని వాళ్లు కూడా నా జాతి, ప్రాంతం, కులం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమో గమనించాలి. గత నాలుగేళ్లుగా ప్రతి ఏటా లాల్ దర్వాజ అమ్మవారికి బోనం ఎత్తుతున్నాను. గత ఆరు సంవత్సరాలుగా బతుకమ్మ, సమ్మక్క సారక్క, శివరాత్రి, సంక్రాంతి, బోనాలు.. ఏ పండగ వచ్చినా నేను పాటలు చేస్తున్నాను. ఈసారికి శివరాత్రి పాట అత్యంత పవిత్ర స్థలం కాశీకి వెళ్లి మరీ చిత్రీకరించాము. ప్రతి పండగలో నా పాటల ద్వారా మీ ఇంటి భాగస్వామినయ్యాను. మీ ఇంట్లో ఓ ఆడబిడ్డగా కడుపులో పెట్టుకున్నారు. ఇందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నేను ఒక్కరోజులో ఫేమస్ కాలేదు. నా పాటల వెనక పదేళ్ల కష్టం ఉంది. కానీ కొందరు తమ ఇంట్లో తల్లి, చెల్లి ఉందన్న విషయం మరిచి విచక్షణ కోల్పోయి కామెంట్లు చేస్తున్నారు. ఈ పాట నేపథ్యం తెలుసుకోకుండా నిందిస్తున్నారు. గ్రామదేవతలను ఎలా కొలుస్తారు? మైసమ్మ కొలువు పాటలు, నిందాస్తుతి సాహిత్యం గురించి తెలుసుకుని విమర్శలు చేస్తే విజ్ఞతగా ఉండేది. ఈ పోస్టు నా మనసుకు బాధ కలిగించినవారి కోసం, నన్ను అభిమానించేవారి మనసుకు కష్టం కలిగించిన వారి కోసం. ఈ పాటపై విమర్శలు వచ్చిన రోజే పాట మార్చే అవకాశం ఉన్నప్పటికీ పాట కోసం ప్రాణం పెట్టిన వృద్ధ రచయిత రామస్వామి గారిని తక్కువ చేయొద్దనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకోలేకపోయాను. కానీ దీన్ని మరింత వివాదం చేసి ఆయన్ను కూడా కించపరుస్తున్నారని, ఆ పెద్దాయన కుటుంబ సభ్యుల అనుమతితో లిరిక్స్‌లో మార్పులు చేశాం. నన్ను వ్యతిరేకించినవారు, నిందించినవారు అందరూ నా వాళ్లే అనుకుని ఈ నిర్ణయం తీసుకున్నాను" అని మంగ్లీ చెప్పుకొచ్చింది. -
నిరాడంబరంగా "టాక్ లండన్ బోనాల జాతర"
లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ ( టాక్) ఆధ్వర్యంలో ఘనంగా బోనాల జాతర జరిగింది. లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపుతో సంస్కృతి సంప్రదాయాల్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టాక్ అధ్యకక్షులు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ.. ప్రతీఏడు వైభవంగా బోనాల జాతరను నిర్వహిస్తామని, ఈ ఏడాది కరోనా నిబంధల్ని పాటిస్తూ అమ్మవారికి బోనాల సమర్పించినట్లు చెప్పారు. ప్రపంచ దేశాల్ని కరోనా పట్టిపీడిస్తున్న తరుణంలో విపత్తునుంచి ప్రజల్ని సురక్షితంగా ఉంచాలని కోరుకున్నామని ఉపాధ్యక్షురాలు శుష్మణ రెడ్డి అన్నారు. బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతఙ్ఞతలు తెలిపారు. అలాగే ప్రభుత్వాలు కరోనా కట్టడి కోసం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజలందరూ స్వీయ క్రమశిక్షణ పాటించాలని టాక్ సంస్థ ప్రతినిథులు విజ్ఞప్తి చేశారు. ప్రతి సంవత్సరం బోనాల పండగ నాడు బోనం సమర్పించి తొట్టెల ఊరేగింపుతో పాటు అమ్మ వారికి చేసే పూజలు ముఖ్య ఘట్టమని, అయితే కరోనా కారణంగా టాక్ తరపున ముఖ్య నాయకులు సురేష్ బుడుగం - స్వాతి దంపతుల ఇంట్లో సంప్రదాయబద్దంగా అమ్మ వారి పూజ నిర్వహించినట్లు వెల్లడించారు. టాక్ సంస్థ ఆవిర్భావం నుండి ప్రత్యేక శ్రద్ధతో సంస్థను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్సీ కవితకి టాక్ నాయకుడు నవీన్ రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు. ఇండియా నుండి వచ్చిన కుటుంబ సభ్యులు తెలంగాణ సంస్కృతికి లండన్ లో టాక్ చేస్తున్న సేవలను అభినందించారు. బోనాల సంబరాలలో టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షురాలు శుష్మునా రెడ్డి, మల్లారెడ్డి,నవీన్ రెడ్డి,వెంకట్ రెడ్డి,స్వాతి , సుప్రజ,సురేష్ బుడగం, రాకేష్ పటేల్, సత్యపాల్ ,హరిగౌడ్ ,గణేష్, రవి రెటినేని, , రవి పులుసు,మాధవ్ రెడ్డి ,వంశీ వందన్ , భూషణ్, అవినాష్,వంశీ కృష్ణ ,పృథ్వి ,శ్రీ లక్ష్మి, విజిత,క్రాంతి , భరత్ ,వంశీ పొన్నం , చింటూ ,రమ్య , స్వప్న,లాస్య, పూజిత ,బిందు ,మాధవి తదితరులు పాల్గొన్నారు. -
బోనమెత్తిన గోల్కొండ కోట.. భక్తులతో జనసంద్రం..
సాక్షి, గోల్కొండ/చార్మినార్/రాంగోపాల్‌పేట్: గోల్కొండ కోట బోనమెత్తింది. భక్తులతో జనసంద్రమైంది. ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలకు ఆదివారం అంగరంగ వైభవంగా అంకురార్పణ జరిగింది. శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవార్లకు బోనాలు సమరి్పంచేందుకు భక్తులు కోట దారిపట్టారు. లంగర్‌హౌస్ చౌరస్తా వద్ద మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డిలు అమ్మవారి తొట్టెలకు స్వాగతం పలికారు. కోటలోని జగదాంబిక అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువ్రస్తాలు సమరి్పంచారు. బోనాల జాతరకు వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలను పాటించాలని మంత్రి తలసాని సూచించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకువస్తున్న మంత్రులు తలసాని, ఇంద్రకరణ్‌రెడ్డి, బంగారు బోనంతో జోగిని నిశాక్రాంతి ఆకట్టుకున్న ఊరేగింపు.. పోతరాజుల విన్యాసాలు, తెలంగాణ జానపద నృత్యాలతో లంగర్‌హౌస్ నుంచి ఫతే దర్వాజ మీదుగా కోట వరకు జరిగిన ఊరేగింపు అందరినీ ఆకట్టుకుంది. భారీ దేవతా విగ్రహాలు, డప్పు, డోలుపై యువకుల నృత్యాలతో ముందుకు సాగిన ఊరేగింపు ఫతే దర్వాజ వద్ద స్థానిక ముస్లింలు స్వాగతం పలికారు. ఊరేగింపు కోట చౌరస్తా వరకు సాగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగర కొత్వాల్ అంజనీ కుమార్ పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బంగారు బోనం సమర్పణ.. భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో భక్తులు గోల్కొండకు తరలివెళ్లి జగదాంబ అమ్మవారికి బంగారు బోనంతో పాటు పట్టు వ్రస్తాలు సమరి్పంచారు. లంగర్‌హౌజ్ చౌరస్తా వద్ద బంగారు బోనానికి మంత్రులు దీపం వెలిగించి పూజలు నిర్వహించారు. ఘటాల ఎదుర్కోలు షురూ.. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో తొలి ఘట్టమైన ఘటాల ఎదుర్కోలుకు అంకురార్పణ చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఘటాల ఎదుర్కోలు కోసం ఊరి పొలిమేరకు వెళ్తున్న అమ్మవారి ఆభరణాలు, ఘట సామగ్రి, పూలు, పసుపు, కుంకుమలకు పూజలు చేశారు. అనంతరం ఘటాన్ని ముస్తాబు చేసేందుకు కర్బలా మైదాన్‌కు తీసుకెళ్లారు. కోట కళకళ భక్తులతో గోల్కొండ కోట కళకళలాడింది. ఆషాఢమాసం బోనాల ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తుల కోలాహలం.. పోతురాజుల సందడితో జాతరలో సందడినెలకొంది. శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవార్లకు బోనం సమర్పించి ప్రత్యేకపూజలు చేశారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. సీపీ అంజనీకుమార్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తెలంగాణ ప్రజలకు చిరంజీవి శుభాకాంక్షలు
భాగ్యనగరంలో ఆషాఢమాసం బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ జగదాంబిక మహాంకాళి అమ్మవారి తొట్టెల ఊరేగింపుతో బోనాల సందడి మొదలైంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘బోనాలపండుగ ప్రారంభం సందర్భంగా ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు.తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలు.వర్షాలు బాగా కురవాలని,పాడిపంటలు వృద్ధి చెందాలని,అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఆషాఢ మాసం అంతా జరిగే ఈ ఉత్సవాలను అందరూ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను’అని చిరంజీవి ట్వీట్ చేశారు. చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రధారులు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్.. ఇటీవల తిరిగి ప్రారంభమైంది. ఓ పదిహేను రోజులు షూటింగ్ జరిపితే ‘ఆచార్య’ చిత్రీకరణ పూర్తవుతుందట. ఈ ఫైనల్ షెడ్యూ ల్లో కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు ఓ పాటను కూడా చిత్రీకరించనున్నారని తెలిసింది. -
బోనాల శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బోనాల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించడం ద్వారా ప్రజలు ఈ ఉత్సవాలను ప్రారంభిస్తారని, మహంకాళి కృపతో త్వరలోనే కరోనా మహమ్మారి అంతం అవుతుందని అభిలషించారు. కాగా, బోనాల సందర్భంగా గవర్నర్ రాజ్‌భవన్‌లో ప్రత్యేక పూజలు చేశారు. -
డిప్యూటీ స్పీకర్ తీరుపై నెటిజన్ల విమర్శలు
-
భవిష్యవాణి
-
సింగపూర్‌లో బోనాల ఉత్సవాలు
సింగపూర్: సింగపూర్‌లోని అరసకేసరి శివన్ ఆలయంలో బోనాల పండుగను తెలంగాణ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కోవిడ్–19 వల్ల సింగపూర్‌లోని తెలంగాణ ప్రజల తరఫున తాము బోనాలు ఉత్సవాలను నిర్వహించామని తెలంగాణ ఫ్రెండ్స్ సంస్థ పేర్కొంది. కరోనా నుంచి ప్రపంచం తొందరగా బయట పడాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దేవుడిని ప్రార్థించినట్లు తెలిపింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మర్రి వెంకట రమణా రెడ్డి, వీరమల్ల క్రిష్ణ ప్రసాద్, బైర్నేని రావు రంజిత్ కుమార్, విక్రమ్ పటేల్ చిట్లా, అల్లాల మురళి మోహన్ రెడ్డి, మాచాడి రవీందర్ రావు, యసరవేని విజయ కుమార్, యెల్లా రామ్ రెడ్డి, కలకుంత శ్రీనివాస్ రెడ్డి, గాడిపల్లి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. -
అమ్మవారే కరోనాను తరిమి కొట్టాలి..
రాంగోపాల్‌పేట్: ఎటు చూసినా భక్త జన సందోహం, అమ్మవారికి బోనం సమర్పించేందుకు బారులు తీరే భక్త జనం, ఫలహార బండ్ల ఊరేగింపులు, తొట్టెల సమర్పణలకు వచ్చే యువత తీన్మార్ స్టెప్పులు...శివసత్తుల పూనకాలు....అమ్మవారికి మొక్కులు తీర్చుకోవాలని ఆశతో ఎంతో దూరం నుంచి వచ్చే భక్తులు.. ఇదీ ఏటా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర సందర్భంగా కనిపించే కమనీయ దృశ్యం...ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు, విమర్శలు, ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రశంసలు కురిపించే ప్రజాప్రతినిధులు...అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే వీవీఐపీలు, వీఐపీలతో కొనసాగే సందడి. అయితే ఈ ఏడాది ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి అమ్మవారిని దర్శించుకోవాలని, బోనం సమర్పించి మొక్కులు తీర్చుకోవాలని ఆశతో ఎదురు చూస్తున్న భక్తులకు నిరాశే మిగిల్చింది. అమ్మవారి జాతర ప్రారంభమైనప్పటి నుంచి చరిత్రలో మొదటి సారిగా భక్తులు లేకుండానే బోనాల జాతర మొదలైంది. లక్షలాది మంది భక్తులు వచ్చే ఈ జన జాతర ఈ ఏడాది జనం లేని జాతరగా చరిత్రలో నిలిచిపోనుంది. లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహంకాళి దేవాలయం చుట్టు ఎక్కడ భక్తుల జాడ కనిపించ లేదు. ఎటు చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. అయితే అధికారులు అమ్మవారికి భక్తుల బోనం లేకున్నా సంప్రదాయాల్లో ఎలాంటి లోటు లేకుండా, శాస్త్రోక్తంగా బోనాల ఉత్సవాలను నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా పూజలు... మంత్రి ఇంటి నుంచి తొలి బోనం కోవిడ్ నిబంధనల మధ్య సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతర సంప్రదాయాలతో వైభవంగా జరిగింది. ఆదివారం ఉదయం 4.05 నిమిషాలకు మహాహారతితో మహంకాళి అమ్మవారికి పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంత్రి తలసాని కుటుంబ సభ్యులు బోనాన్ని దేవాలయం బయటి వరకు తెచ్చి ఆలయ ఈవో మనోహర్‌రెడ్డికి అప్పగించారు. మహాహారతి అనంతరం ఆలయ అధికారులు అమ్మవారికి బోనం సమర్పించారు. ఆలయ ఈవో గుత్తా మనోహర్‌రెడ్డి అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే ఆలయ సిబ్బంది అమ్మవారికి 7 బోనాలను సమర్పించారు. ఉదయం 4.45 నిమిషాలకు వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 8గంటలకు ఆర్యసమాజ్, దక్కన్ మానవ సేవా సమితి ఆధ్వర్యంలో లోక కల్యాణం కోసం హోమం చేశారు. కనిపించని భక్త జనం కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఏడాది బోనాల జాతరలో భక్తులకు అనుమతి ఇవ్వలేదు. అమ్మవారికి జరిగే పూజలన్నీ మాత్రం యధావిధిగా ఆలయ అధికారులు నిర్వహించారు. ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులు రాకుండా చూశారు. ఈ విషయం తెలియని కొందరు భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు, బోనాలు సమర్పించేందుకు వచ్చి నిరాశగా వెనుదిరిగారు. అమ్మవారే కరోనాను తరిమి కొట్టాలి: మంత్రి తలసాని ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వ్యాధిని మహంకాళి అమ్మవారే తరిమికొట్టాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఆదివారం మహంకాళి బోనాల జాతర సందర్భంగా ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కలరా వ్యాధిని తరిమికొట్టడంతో 1815లో అప్పయ్యదొర మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీ నుంచి అమ్మవారిని తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్టించారన్నారు. నాడు కలరా వ్యాధిని తరిమికొట్టిన అమ్మవారే నేడు కరోనాను కూడా దేశం నుంచి పారదోలాలని ప్రార్థించారు. అయితే ఈ ఏడాది ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జాతరకు భక్తులను అనుమతించడం లేదని ఇందుకు వారు క్షమించాలని కోరారు. ప్రభుత్వ సూచనలను భక్తులు, స్థానిక ప్రజలు పాటిస్తూ ఇంట్లోనే బోనాల ఉత్సవాలు జరుపుకున్నారని వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నేడు 9.30 గంటలకు రంగం ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరలో మరో ప్రధాన ఘట్టం రంగం. అవివాహిత మహిళ అమ్మవారికి ఎదురుగా ఉండే మాతంగేశ్వరీ అమ్మవారి ముందు పచ్చి కుండపై నిలబడి భవిష్యవాణి వినిపిస్తారు. అమ్మవారు ఆమెను ఆవహించగా ఆమె నోటి నుంచి వచ్చే ప్రతి మాట అమ్మవారే పలుకుతున్నట్లుగా భక్తుల నమ్మకం. సోమవారం ఉదయం 9.30 గంటలకు భవిష్యవాణి ఉంటుంది. ప్రస్తుతం కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తుండటం, భక్తుల బోనాలు లేకుండానే జాతర జరుగడంతో అమ్మవారి నుంచి ఎలాంటి వాక్కులు వినవలసి వస్తుందోనని భక్తులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అనంతరం అమ్మవారి సాగనంపే నిర్వహిస్తారు. దీంతో బోనాల జాతర ముగుస్తుంది. దూరం నుంచి దండం అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ రాంగోపాల్‌పేట్ పాత పోలీస్ స్టేషన్ వద్దకు రాగానే పోలీసులు కోవిడ్ నిబంధనల నేపథ్యంలో భక్తులను అనుమతించడం లేదని చెప్పడంతో ఆయన అక్కడి నుంచే అమ్మవారికి దండం పెట్టుకుని వెనుదిరిగి వెళ్లారు. -
పెద్దమ్మ తల్లికి నేడు బంగారు బోనం
చార్మినార్: భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 11–30 గంటలకు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి అమ్మవారికి బంగారు పాత్రలో బోనం సమర్పించనున్నామని కమిటీ అధ్యక్షుడు జె.మధుసూదన్‌గౌడ్ తెలిపారు. ఈసారి జరిగే ఆషాఢమాసం బోనాల జాతర ఉత్సవాల సందర్భంగా కమిటీ ఆధ్వర్యంలో ఏడు దేవాలయాల అమ్మవార్లకు ఏడు బంగారు బోనాలను సమర్పిస్తున్నామన్నారు. సప్త మాతృకల సప్త బంగారు బోనం పేరుతో గోల్కోండ, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, పెద్దమ్మ దేవాలయం, బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి, విజయవాడ కనకదుర్గమ్మ తల్లి, చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం, లాల్‌దర్వాజా సింహవాహిణి దేవాలయం అమ్మవార్లకు బంగారు పాత్రలో బోనాన్ని సమర్పించడానికి కార్యాచరణను రూపొందించామన్నారు. ఇప్పటికే గోల్కొండ జగదాంబ అమ్మవారికి, బల్కంపేట ఎల్లమ్మ తల్లి, విజయవాడ కనక దుర్గమ్మ తల్లి, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళీ అమ్మవారికి బంగారు పాత్రలో బోనానంతో పాటు పట్టు వస్త్రాలను సమర్పించామన్నారు. గురువారం ఉదయం 9.30 గంటలకు ఉప్పుగూడ మహాంకాళి దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం బంగారు పాత్రలో బోనాన్ని తీసుకెళ్లి పెద్దమ్మ తల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలతో పాటు సమర్పించనున్నామన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా భౌతిక దూరం పాటిçస్తూ పరిమిత సంఖ్యలో దేవాలయానికి వెళుతున్నట్లు ఆయన తెలిపారు. -
లండన్‌లో బోనాలు ప్రారంభం
లండన్: ఇంటిటా బోనాలు, ప్రతి ఇంటా బోనాల పేరుతో తెలంగాణ ఎన్నారై ఫోరమ్(టీఎన్ఎఫ్) లండన్‌లో బోనాల ఉత్సవాలను మంగళవారం ఘనంగా ప్రారంభించింది. కరోనా దృష్ట్యా ఏటా వేలాది మంది కలిసి చేసుకునే పండగను, ఈసారి ఎవరి ఇళ్లలో వారే జరుపుకుంటునట్లు టీఎన్ఎఫ్ ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్ వెల్లడించారు. ఈ మేరకు టీఎన్ఎఫ్ మహిళా విభాగం కో–ఆర్డినేటర్లు మీనా అంతరి, శౌరీ గౌడ్, వాణి అనసూరి, సాయి లక్ష్మి, దివ్య, శిరీష ఆశ, సవితా జమ్ముల, సీతా లత, అమృత, శ్వేత, జయశ్రీ, శ్రీవాణి సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కరోనా మహమ్మారి నుంచి బయటపడిన తర్వాత ఒడి బియ్యంతో విందు కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. బోనాల పండగ విశిష్టతపై లండన్ వేదికగా వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని టీఎన్ఎఫ్ ప్రెసిడెంట్ ప్రమోద్ గౌడ్ పేర్కొన్నారు. -
బోనం.. తగ్గని ప్రాభవం
చార్మినార్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా జరిగే ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలపై ఈసారి కరోనా ప్రభావం పడింది. కరోనా వైరస్ నుంచి తమను తాము కాపాడుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బోనాలను ఇళ్లకే పరిమితం చేయాలని ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఆషాఢ మాసంలోని నెల రోజుల పాటు రోజుకో కుటుంబం అమ్మవారికి బోనాలు సమర్పిస్తామంటూ భాగ్యనగర్ శ్రీ మహాంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. భౌతిక దూరం పాటిస్తూ గుంపులు, గుంపులుగా కాకుండా ఒక్కొక్కరు ఆయా బస్తీల్లోని అమ్మవారికి బోనాలను సమర్పిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి వినతి పత్రం అందజేసారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. బోనాల జాతర ఉత్సవాల సందర్బంగా పాతబస్తీలో నిర్వహించే అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు రోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా గత మూడేళ్లుగా బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకుని ఆర్ధిక సహాయంతో పాటు అవసరమైన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఉత్సవాల ఏర్పాట్లు భారీ ఎత్తున చేస్తోంది. నెల రోజుల పాటు రోజు వారీ బోనాలకు సిద్ధం పాతబస్తీలో నెల రోజుల పాటు రోజు వారీ బోనాల సమర్పణకు స్థానిక ఉత్సవాల నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో రోజు ఒక్కో కుటుంబం చొప్పున అమ్మవారికి బోనాలు సమర్పించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు దేవాలయాల కమిటీ ప్రతినిధులు సమావేశాలు నిర్వహించి స్థానిక మహిళా భక్తుల అభిప్రాయాలను సేకరించారు. మహిళా భక్తుల సూచనలు, సలహాల మేరకు ఆషాఢ మాసం ప్రారంభంæ రోజు నుంచి ముగిసే రోజు వరకు రోజు వారి బోనాలు సమర్పిస్తామంటూ చెబుతున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమవుతున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి తాము అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని అమ్మవారికి బోనాలను సమర్పిస్తామంటున్నారు. పాతబస్తీలో ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటిలో 25 ప్రధాన దేవాలయాలున్నాయి. ఈ దేవాలయాల్లో ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా కన్నుల పండువగా జరుగుతాయి. అయితే ఈసారి కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఎలాంటి హంగు,ఆర్బాటాలు లేకుండా సాదాసీదాగా బోనాల జాతర ఉత్సవాలు కొనసాగనున్నాయి. జాతర వివరాలు... ♦ ఈ నెల 25న గోల్కొండ జగదాంబ అమ్మవారికి మొదటి బోనం సమర్పణతో ఈసారి ఆషాడ బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. జూలై 12న సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమాలుంటాయి. ♦ అదే రోజు పాతబస్తీలోని వివిధ అమ్మవారి దేవాలయాల ఘటస్థాపన కొనసాగుతుంది. ♦ జూలై 19న, నగరంలోని అన్ని ప్రాంతాలతో పాటు చారిత్రాత్మకమైన పాతబస్తీలో బోనాల సమర్పణ ఉంటుంది. మరుసటి రోజు అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు కార్యక్రమాలు జరగాల్సి ఉంది. అయితే 19,20వ తేదీల్లో ఎలాంటి బోనాల సమర్పణ కార్యక్రమాలను నిర్వహించ రాదని ప్రభుత్వం సూచించడంతో ఆయా రోజుల్లో కేవలం పూజారులే పూజా కార్యక్రమాలను నిర్వహించడానికి సిద్ధమవు తున్నారు. నెలంతా బోనం సమర్పిస్తాం గుంపులు గుంపులుగా కాకుండా భౌతిక దూరం పాటిస్తూ నెల రోజుల పాటు ఒక్కోరోజు ఒక్కో కుటుంబం వారిగా అమ్మవారికి బోనాలు సమర్పిస్తామని ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరాం. అంటువ్యాధులు(గత్తర్) సోకకుండా నివారణ కోరుతూ తెలంగాణలో నిర్వహించే ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలను ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే నిర్వహిస్తాం...కానీ, పూర్తిగా ఇళ్లకే పరిమితం చేయడం సరైంది కాదనే విషయాన్ని ప్రభుత్వానికి వివరించాం. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహిస్తాం. – జె.మధుసూదన్ గౌడ్, ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి అధ్యక్షులు ఒక్కొ కుటుంబం చొప్పున బోనం నిరాడంబరంగా సమర్పిస్తాం రోజుకు ఒక్కో కుటుంబం చొప్పున నెల రోజుల పాటు అమ్మవారికి బోనాలు సమర్పిస్తామని..ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణఃగా బోనాలను సమర్పిస్తామని ప్రభుత్వాన్ని కోరాం. ఒక్కొక్కరు బోనంను తలపై పెట్టుకుని నిరాడంబరంగా ఆయా బస్తీలోని మహంకాళి దేవాలయానికి వెళ్లి అమ్మవార్లకు బోనం సమర్పిస్తారు.– గాజుల అంజయ్య, మీరాలంమండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయం కమిటి చైర్మన్ -
వందేళ్ల చరిత్రలో.. భక్తులు లేకుండా తొలిసారి
సాక్షి, సిటీబ్యూరో: ఆషాఢ బోనాలకు..ఈ యేడు కోవిడ్ రక్కసి అడ్డుపడుతోంది. గడిచిన వందేళ్లలో గతమెన్నడూ లేని రీతిలో సాధారణ భక్తులు కాకుండా అధికారులు, పూజారులతో కూడిన పదకొండ మంది సభ్యుల బృందం నగరంలో అమ్మవార్లకు బోనాలు సమర్పించేందుకు రంగం సిద్ధమవుతోంది. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంతో షురువయ్యే బోనాలసందడి గోల్కొండ, సికింద్రాబాద్ మహంకాళి, లాల్దార్వాజ సింహవాహిని ఉత్సవాలతో ఉధృతమవుతుంది. లక్షలాది మంది భక్తులు స్వయంగా సమర్పించే ఘట్టంతో నగరంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇక నగరంలో బోనాలు ముగియగానే శివార్లలోకూడా భారీగా మొదలవుతుంది. బోనాలకు నెల రోజుల ముందే నగరంలో సందడి మొదలు కావాల్సి ఉన్నా.. ఇంకా ఆ దిశగా ఏర్పాట్లు ఏవీ ప్రారంభమే కాలేదు. ఈనెల 23న ఎల్లమ్మ కళ్యాణం, 25న గోల్కొండ జగదాంబిక, జులై 12న ఉజ్జయిని మహంకాళి, 19న లాల్ దర్వాజ సింహవాహినికి బోనాలు సమర్పించాల్సి ఉంది. నెల రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో సుమారు 30 లక్షల మంది భక్తులు పాల్గొంటారు. ఆయా ఆలయాలకు రూ.10 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. పోతురాజులు, శివసత్తుల్లేకుండానే.. బోనాల ఉత్సవంలో పోతురాజులు ఆటలు, శివసత్తుల పూనకాలు ప్రత్యేకాకర్షణగా నిలుస్తాయి. ఈ యేడు డప్పులు, డ్యాన్సులు, పోతురాజులు, శివసత్తులు, పలహారం బండ్లను సైతం అనుమతించే అవకాశం లేదు. కేవలం ఆలయాన్ని బట్టి 11 నుండి 25 మంది వరకు అనుమతించి పూజారుల ఆధ్వర్యంలోనే బోనాలు సమర్పించే దిశగా అధికార యంత్రాంగం ఓ నిర్ణయాకి వచ్చింది. అయితే ప్రస్తుతం నగరంలో నెలకొన్న పరిస్థితులను వివరించి ఆలయ కమిటీలు, భక్తుల ఆమోదం తీసుకునే దిశగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ శనివారం బల్కంపేట దేవాలయానికి సంబంధించి, ఈనెల 10న నగరంలోని అన్ని దేవాలయాల కమిటీలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. -
బోనాల పండగొస్తోంది..
చార్మినార్: ఆషాఢ మాసం బోనాల జాతర రానున్నది. ఈసారి వచ్చేనెలలో జరగనున్న బోనాల పండగకు కరోనా ఎఫెక్ట్ తగలనుంది. తెలంగాణలోనే అత్యంత వైభవంగా నిర్వహించే ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల్లో పాతబస్తీకి ఎంతో ప్రాధాన్యత ఉంది. తెలంగాణ ఏర్పడిన అనంతరం బోనాల జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండగగా ప్రకటించి తగిన ఏర్పాట్లు చేస్తోంది. పాతబస్తీ వీధుల్లో నిర్వహించే అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు రోజు ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. నగరంలోని భక్తులే కాకుండా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి తరలివస్తారు. ఈ ఘటాల ఊరేగింపులో కళాకారుల నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈసారి ఇవేవీ ఉండకపోవచ్చునని నిర్వాహకులు భావిస్తున్నారు. ఎందుకంటే... కళాకారుల నృత్య ప్రదర్శనల కోసం రెండు నెలలు ముందుగానే ఆర్డర్లు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతున్నందున ఎవరు కూడా ఇప్పటి వరకు కళాకారులకు ఆర్డర్లు ఇవ్వలేదు. దీంతో ఈసారి కళాకారుల నృత్య ప్రదర్శనలు ఉండవని అంటున్నారు. కోవిడ్ వైరస్ ప్రభావంతో... ఈసారి ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా నిరాడంబరంగా అమ్మవారి ఘటాల ఊరేగింపు నిర్వహించడానికి ఉత్సవాల నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. వచ్చే నెల వరకు కూడా కోవిడ్–19 వైరస్ ప్రభావం తగ్గకపోతే.. ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా ఉత్సవాలను నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేస్తామంటున్నారు. ఒకవేళ లాక్డౌన్ సడలిస్తే.. గుంపులుగా కాకుండా భౌతిక దూరం పాటిస్తూ బ్యాండ్, మేళాలు, కళాకారుల నృత్యాలు, డీజేలు లేకుండా ఆయా ప్రాంతాల్లోని ఆలయాల్లో అమ్మవార్లకు బోనాలను సమర్పించడానికి సిద్ధమవుతున్నారు. నాలుగైదు రోజులుగా శ్రీ భాగ్యనగర్ బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో సన్నాహాక సమావేశాలు జరుగుతున్నాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి ఆయన సలహాలు, సూచనల మేరకు కార్యాచరణను రూపొందించుకుంటామంటున్నారు. జూన్ 25న గోల్కొండ అమ్మవారి బోనంతో ఉత్సవాలు ప్రారంభం జూన్ 25వ తేదీన గోల్కొండ జగదాంబ అమ్మవారి బోనంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. జూలై 5న విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లికి, 12న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి... అదే రోజు పాతబస్తీలో అమ్మవారి ఘటస్థాపన ఊరేగింపు, 19న పాతబస్తీతో పాటు నగరంలోని అన్ని ప్రాంతాల్లో బోనాల ఉత్సవాలు జరుగనున్నాయి. ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడిగా జే.మధుసూదన్ గౌడ్ శ్రీ భాగ్యనగర్ బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ నూతన అధ్యక్షుడిగా జే.మధుసూదన్ గౌడ్ నియమితులయ్యారు. ఈ ఏడాది జరిగే బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని ఆయన నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మీరాలంమండిలో జరిగిన సర్వసభ్య సమావేశంలో గతేడాది బాధ్యతలు నిర్వహించిన పొటేల్ శ్రీనివాస్ యాదవ్ నుంచి ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఉప్పుగూడ మహంకాళి దేవాలయం కమిటీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. కార్యక్రమంలో ఊరేగింపు కమిటీ ప్రతినిధులు గాజుల అంజయ్య, రాకేశ్ తివారి, తిరుపతి నర్సింగ్ రావు, మల్లేష్ గౌడ్, ఆలే భాస్కర్ రాజ్, పొటేల్ సదానంద్ యాదవ్, ప్యారసాని వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ సంస్కృతి, ఎంతో ఇష్టం
చిలకలగూడ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలంటే తనకెంతో ఇష్టమని బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ అన్నారు. ఆదివారం రాత్రి ఆయన చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ కృష్ణ, స్థానిక కార్పొరేటర్ సామల హేమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏటా జరిగే బోనాల జాతరను ఎంతో ఆస్వాదిస్తానని, జాతరలో కలియతిరగడం తనకెంతో సరదా అని పేర్కొన్నారు. బోనాల జాతరలో కలియతిరిగి సెల్ఫీలు దిగిన ఆయన ఫలహారం బళ్లు, తొట్టెల ఊరేగింపులో పాల్గొని సందడి చేశారు. స్థానిక కార్పోరేటర్ సామల హేమతోపాటు పలువురు భక్తులతో సెల్ఫీలు దిగారు. కార్యక్రమంలో బ్రిటీష్ ఎంబసీ అధికారులు ఖాజామొయినుద్థీన్, ప్రవల్లిక, బీజేపీ నాయకులు, ఫ్యామిలీ ఫ్రెండ్ అరుణ, సీతాఫల్మండి కార్పొరేటర్ సామల హేమ, టీఆర్ఎస్ నాయకుడు త్రినేత్రగౌడ్ పాల్గొన్నారు. -
భాగ్యనగరంలో బోనాల సందడి
-
కోటకు బయలెల్లి..
-
రజనీ 132
చార్మినార్: నగరంలో జీఓ నంబర్ 132 మళ్లీ తెరపైకి వచ్చింది. బోనాల ఉత్సవాల్లో రజనీ అనే ఏనుగు పాల్గొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. సోమవారం సచివాలయంలోని సి– బ్లాక్‌లో బోనాల జాతర ఉత్సవాలపై జరిగిన ఉన్నతస్థాయి అధికారులు, ఉత్సవాల నిర్వాహకుల సమీక్ష సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకువచ్చింది. సర్కారు ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలని భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీతో పాటు అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం కమిటీ ప్రతినిధులు కోరారు.నగరంలో జరిగే బోనాల జాతర ఉత్సవాలతో పాటు మొహర్రం సంతాప దినాల సందర్భంగా రజనీ అనే ఏనుగునువినియోగించడం ఆనవాయితీగా వస్తుందన్న విషయాన్ని మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్,ఇంద్రకరణ్ రెడ్డిలకు అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయ కమిటీ అధ్యక్షుడు జి.నిరంజన్ వివరించారు. అమ్మవారి ఘటాలఊరేగింపులో ఆనవాయితీ.. బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా కార్వాన్‌లోని దర్బార్ మైసమ్మ అమ్మవారి ఘటం ఊరేగింపు, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి దేవాలయం అమ్మవారి ఘటం ఊరేగింపులతో పాటు పాతనగరంలో అత్యంత వైభవంగా జరిగే అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపులో జూపార్కుకు చెందిన రజనీని ప్రతి ఏటా వినియోగిస్తున్నారు. ఎన్నో దశాబ్దాలుగా బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఊరేగింపులో అంబారీని వినియోగించడం ఆనవాయితీగా వస్తోంది. బోనాల జాతర ఉత్సవాలతో పాటు పదో మొహర్రం సందర్భంగా జూపార్కుకు చెందిన రజనీని వినియోగిçస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోనాల జాతర ఉత్సవాలను స్టేట్ ఫెస్టివల్‌గా ప్రకటించినందున ఈ విషయంలో సంబంధిత ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని తిరిగి హైకోర్టును ఆశ్రయించి బోనాల జాతర ఉత్సవాల్లో ఏనుగు పాల్గొనే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఏమిటీ జీఓ 132.. సెంట్రల్ జూ అథారిటీ విజ్ఞప్తి మేరకు మతపరమైన ఊరేగింపుల్లో రజనీ పాల్గొనరాదని 2009 డిసెంబర్ 22న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జీఓ 132ను జారీ చేసింది. దీని ప్రకారం మతపరమైన ఊరేగింపుల్లో ఏనుగులు పాల్గొనడానికి అవకాశాలు లేకుండాపోయాయి. అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం కమిటీ ప్రతినిధులతో పాటు ఇతర స్వచ్ఛంద సంస్థలు ఎన్నో ఫిర్యాదులు, చర్చలు, సంప్రదింపుల అనంతరం ఏటా బోనాల జాతర ఉత్సవాలతో పాటు మొహర్రం సంతాప దినాల్లో రజనీ ఏనుగు పాల్గొంటోంది. అప్పటి నుంచి జీఓ 132 కొనసాగుతున్నప్పటికీ.. ఏయేటికాయేడు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జీఓ 132ను రిలాక్స్ చేస్తూ మెమోలు జారీ చేయడంతో మతపరమైన ఊరేగింపుల్లో జూపార్కుకు చెందిన ఏనుగు పాల్గొంటూ వస్తోంది. పాతబస్తీకి చెందిన ఓ ఉత్సవాల నిర్వాహకుడు తమకు ఏనుగును ఇవ్వడం లేదని పేర్కొంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఏ ఉత్సవాల్లో రజనీని వినియోగించరాదంటూ హైకోర్టు మార్చి 18న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో రజనీ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈసారి జరిగే బోనాల జాతర ఉత్సవాల్లో రజనీ పాల్గొనేలా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని అమ్మవారి భక్తులు కోరుతున్నారు. చర్యలు చేపట్టాలి.. రానున్న బోనాల ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ఎన్నో దశాబ్దాలుగా బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఊరేగింపులో అంబారీని వినియోగించడం ఆనవాయితీగా వస్తోంది. సంబంధిత ఉన్నతాధికారులు హైకోర్టును ఆశ్రయించి బోనాల జాతర ఉత్సవాల్లో రజనీ ఏనుగు పాల్గొనేలా చర్యలు చేపట్టాలి. – జి.నిరంజన్, అక్కన్న మాదన్న దేవాలయ చైర్మన్ -
ఘనంగా బోనాల ఉత్సవాలు
సాక్షి, హైదరాబాద్: ఆషాఢ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఈ మేరకు బోనాల పండగ ఏర్పాట్లపై సోమవారం సచివాలయంలో హోంమంత్రి మహమూద్ అలీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో కలసి సమీక్షించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. బోనాల నిర్వహణకు ప్రభుత్వం రూ.15 కోట్లు, వివిధ పనుల కోసం జీహెచ్ఎంసీ ద్వారా రూ.22 కోట్లు కేటాయించనుందని తెలిపారు. జూలై 4న గోల్కొండ, 21న సికింద్రాబాద్, 28న పాతబస్తీలో బోనాల ఉత్సవాలు ఉంటాయని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ వాటర్ వర్క్స్ 3 లక్షల తాగునీటి ప్యాకెట్లను ఏర్పాట్లు చేసిందని, ఆర్ అండ్ బీ ద్వారా దేవాలయాల వద్ద బారికేడింగ్, విద్యుత్‌కు అంతరాయం లేకుండా అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. సాంస్కృతిక శాఖ సహకారంతో దేవాలయాల వద్ద సాంస్కృతిక, భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. బోనాల నేపథ్యంలో భక్తుల కోసం అదనంగా మెట్రో ట్రిప్‌లు తిరిగేలా చూడాలన్నారు. ఉత్సవాలకు అవసరమైన ఏనుగును చూడాల్సిందిగా అటవీ శాఖకు సూచించారు. హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. ఉత్సవాల నిర్వహణకు అన్ని పనులను ముందుగానే పూర్తి చేయాలన్నారు. ఈసారి మరింత మెరుగ్గా.. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. బోనాల ఉత్సవాలకు గతంలో కంటే మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. 26 దేవాలయాలకు పట్టు వస్త్రాలను పంపుతామన్నారు. పురోహితులను, ప్రసాదాల పంపిణీకి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, రాజాసింగ్, ముఠాగోపాల్, మాగంటి గోపీనాథ్, జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా, ఇన్చార్జీ కమిషనర్, లా అండ్ ఆర్డర్ డీజీ జితేందర్, జీహెచ్ఎంసీ కమిషనర్, ఎండీ వాటర్ వర్క్స్ దానకిషోర్, ఎండోమెంట్స్ కమిషనర్ అనీల్ కుమార్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ట్రాన్స్ కో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
బహిష్కరణ కలకలం !
నేలకొండపల్లి ఖమ్మం : సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంత లు తొక్కుతున్న ఈ రోజుల్లోనూ గ్రామాల్లో సాం ఘిక దురాచారాలు కొనసాగుతున్నాయి. పెత్తం దారీ పోకడలతో చేయని తప్పుకు ఓ కుటుంబాన్ని బహిష్కరిస్తున్నామంటూ కొందరు ‘పెద్దలు’ తీర్పు చెప్పారు. ఈ విషయాన్ని గ్రామం లో టమ కా వేయించారు. దీంతో మనస్తాపానికి గురైన బాధిత కుటుంబసభ్యులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, వారి బంధువులు అడ్డుకున్నారు. కలకలం రేపిన ఈ ఘటన నేలకొండపల్లి మండలం అమ్మగూడెంలో చోటుచేసుకుంది. బాధితులు, స్థానికుల కథనం ప్రకారం.. అమ్మగూడెం గ్రామం లో ఆదివారం ముత్యాలమ్మకు బోనాలు చెల్లించా రు. ఈ విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. తమకు తెలియకుండా బోనం ఎలా చెల్లిస్తావంటూ గండు మాధవరావు కుటుంబంతో అదే సామాజిక వర్గానికి చెందిన కొందరు ఘర్షణకు దిగారు. ఈ వివాదం ముదరకముందే సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలతో చర్చించి శాంతింపజేశారు. టమకాతో అవమానం.. ముత్యాలమ్మ జాతర సందర్భంగా గ్రామ కట్టుబాట్లను ఉల్లంఘించారని, దీంతో మాధవరావు కుటుంబాన్ని సాంఘికంగా బహిష్కరిస్తున్నామంటూ కొందరు పెద్దలు గ్రామంలో సోమవారం ఉదయం టమకా వేయించారు. వారి ఇంటికి ఏడాది పాటు ఎవరూ వెళ్లవద్దని, ఆ ఇంట్లో జరిగే ఏ కార్యక్రమానికీ హాజరు కావద్దని, దీన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అయితే రాజకీయ స్వార్థంతో, కక్షపూరితంగా వ్యవహరించి ఇలా చేశారని, తమ వెంట 40 కుటుంబాలు ఉన్నాయని, రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని మాధవరావు తనయుడు సతీష్ ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాక, ఇది అవమానంగా భావించి.. కుటుంబసభ్యులంతా ఆత్మహత్య చేసుకుంటామంటూ బయటకు వెళ్లడంతో బంధువులు అడ్డుకున్నారు. ఓ కుటుంబంపై ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం ఏంటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దుర్మార్గమైన చర్య అని ఆందోళన వ్యక్తం చేశారు. ఏడుగురిపై పోలీసులకు ఫిర్యాదు.. సాంఘిక బహిష్కరణ విషయంపై బాధితులు గండు మాధవరావు, సతీష్ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గ్రామానికి చెందిన ఏడుగుగురిపై ఫిర్యాదు చేశారు. అయితే విచారణ నిర్వహించిన తర్వాత వాసంశెట్టి సత్యనారాయణ, వి.నర్సయ్య, వి.వేణు, వి.రామారావు అనే నలుగురిపై కేసు నమోదు చేశామని ఎస్సై సుమన్ తెలిపారు. స్వార్థంతో బహిష్కరణ వేటు ముత్యాలమ్మ జాతర అంతా సాఫీగా జరిగినా రాజకీయంగా ఎదుర్కోలేక మా కుటుంబాన్ని టార్గెట్ చేసి బహిష్కరించారు. అడపాల రామారావు, బెల్లం రామారావు స్వార్థంతోనే మమ్మల్ని అవమానించారు. సమాజంలో మేమెలా బతకాలి. – గండు సతీష్ న్యాయం చేయకుంటే ఆమరణ నిరాహార దీక్ష గ్రామంలో కొంత మంది కావాలనే మా కుటుంబంపై కక్ష కట్టి వెలివేస్తున్నట్లు టమకా వేయించారు. వారందరిపై కేసు నమోదు చేయకపోతే ఆమరణ నిరహార దీక్ష చేస్తాం. మేము ఏం తప్పు చేశామని వెలివేస్తారు. మమ్మల్ని బహిష్కరించిన వారిపై చర్య తీసుకుని మాకు న్యాయం చేయాలి. – గండు మాధవరావు -
హౌస్టన్‌లో ఘనంగా బోనాలు
హౌస్టన్ : తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ హౌస్టన్ (టాగ్) ఆధ్వర్యంలో ప్రవాసులు బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా బోనాలను హౌస్టన్‌లో అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. ఈ ఏడాది బోనాల వేడుకను స్థానిక సాయి బాబా జలరం మందిర్‌లో అట్టహాసంగా జరిపారు. ఈ వేడుకలో దాదాపు ఆరు వందల మంది భక్తులు పాల్గొన్నారు. పోతురాజు నృత్యాలతో కార్యక్రమం అంతా కోలాహలంగా మారింది. పద్మ కొత్తకొండ అమ్మవారి బోనాలను అందంగా అలంకరించారు. స్థానిక బిర్యానీ పాట్ యజమాని శ్రీధర్ కాంచనకుంట్ల అక్కడికి విచ్చేసిన భక్తులకు ప్రసాదాన్ని అందజేశారు. టాగ్ అధ్యక్షులు విజయ్ దేవిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వీరేందర్ వచ్చిన భక్తులందరికి ధన్యవాదాలు తెలిపారు. టెక్సాస్ డెమోక్రాట్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీనివాస్ కులకర్ణి పాల్గొని భక్తులకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు. -
జాతరో.. జాతర..
-
జోరుగా ‘బెల్టు’ దందా
నవాబుపేట : గ్రామాల్లో ప్రజలకు తాగునీరు దొరకడం లేదు గానీ మద్యం మాత్రం పుస్కలంగా దొరుకుతోంది. నవాబుపేట మండల పరిధిలోని గ్రామాల్లో బెల్టుషాపుల దందా జోరుగా కొనసాగుతుంది. అమ్మకాలు నిలిపివేయాలని అధికారులకు ఆయా గ్రామాల ప్రజలు పలుమార్లు విన్నవించినా.. పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లోని కిరాణం షాపులు బెల్టు షాపులగా దర్శనమిస్తున్నాయి. మండల పరిధిలోని గంగ్యాడ, గుబ్బడిపత్తేపూర్, ఎల్లకొండ, అక్నాపూర్, మమ్మదాన్‌పల్లి, కొజ్జవనంపల్లి, కడ్చర్ల, మూలమాడ, చిట్టిగిద్ద రైల్వేస్టేషన్, మైతాప్‌ఖాన్‌గూడ తదితర గ్రామాల్లోని కిరాణం షాపుల్లో మద్యం విరివిగా దొరుకుతుంది. కొంత మంది షాపుల్లో కాకుండా ఇరుగుపొరుగు ఇళ్లలో మద్యం పెట్టి అడిగిన వారికి తీసుకొచ్చి అమ్ముకుంటున్నారు. తూతూ మంత్రంగా తనిఖీలు ముఖ్యంగా గంగ్యాడలో 8 కిరాణం షాపులు ఉండగా అందులో 7 దుకాణాల్లో మద్యం విచ్చలవిడిగా దొరుకుతుంది. నిత్యం రూ. 50 వేల వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అలాగే మెతాప్ఖాన్గూడ గ్రామంలో సైతం అదే పరిస్థితి. ఇటీవల గ్రామంలో పోలీసులు కార్టన్ సెర్చ్ చేయగా భారీగా మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. ఎక్సైజ్ అధికారులు, పోలీసులు తూతూ మంత్రంగా తనిఖీలు చేసి వదిలేస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. దాన్ని ఆసరాగా చేసుకున్న బెల్టు షాపుల యజమానులు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలకు పాల్పడుతున్నారు. బోనాల పండుగకు భారీగా మద్యం నిల్వ నవాబుపేట మండలంలో సోమవారం బోనాల పండుగ నేపథ్యంలో బెల్టు షాపుల యజమానులు భారీగా మద్యాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నట్లు సమాచారం. మద్యాన్ని ఎమ్మార్పీ రేట్లకు కాకుండా క్వాటర్‌పై రూ. 30 అదనంగా అమ్ముకుంటున్నారు. అధిక రేట్లు అని నిలదీస్తే మావద్ద మద్యం లేదని పంపిస్తారు. దీంతో చేసేదేమీ లేక వారు అమ్మిన ధరలకే కొనుగోలు చేస్తున్నారు. అమ్మకాలు అడ్డుకునేవారే లేరు సర్పంచ్‌గా గెలువగానే గ్రామస్తుల అభిప్రాయంతో మద్యం అమ్మరాదని తీర్మానం చేశాం. అయినా ఎవరూ పట్టించుకోలేదు. అధికారులకు తెలిపినా నామమాత్రపు తనిఖీలు చేసి వెళ్లిపోయారు. అధికారుల అండతో ఇష్టం వచ్చినట్లు మద్యాన్ని అమ్ముతున్నారు. అక్రమ మద్యం అమ్మకాలను ఆపే వారే లేరు. – గోవిందమ్మ, గంగ్యాడ మాజీ సర్పంచ్ అధికారుల నిర్లక్ష్యంతోనే.. గ్రామంలో మద్యం విచ్చలవిడిగా దొరుకుతోంది. పలుమార్లు నేనే స్వయం గా ఎక్సైజ్ అధికారులకు ఫోన్ చేసి చెప్పినా పట్టించుకోలేదు. బెల్టుషాపులు నడుస్తున్నాయని తెలిసి కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికారుల కనుసన్నల్లోనే బెల్టుషాపులు నడుస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించాలి. – గోపాల్‌గౌడ్ అక్నాపూర్, మాజీ సర్పంచ్ చర్యలు తీసుకుంటాం నవాబుపేట మండలంలోని పలు గ్రామాల్లో అక్రమంగా మద్యం అమ్ముతున్నట్లు మాకు సమాచారం అందింది. ఇది వరకు దాడులు చేసి పలువురిపై కేసులు కూడా నమోదు చేశాం. మళ్లీ దాడులు చేస్తాం. క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – ఎస్ఐ నాగేష్, నవాబుపేట -
గుడిసెవాసులపై కార్పొరేటర్ దాడి
కరీమాబాద్ వరంగల్ : మైసమ్మ బోనాలకు తనను పిలువలేదనే కోపంతో ఓ కార్పొరేటర్ అనుచరులతో వచ్చి గుడిసెవాసులపై దాడి చేసిన సంఘటన బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికులు బత్తిని సతీష్, నర్సింహా, వెంకటేష్, మార్కం డేయ, వనజ, పద్మ, ధనలక్ష్మి, రాణి, మోడీ, సంజు, నాగరాజుతోపాటు పోలీసులు కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. నగరంలోని 23వ డివిజన్ నున్నా నారాయణ నగర్లో కాలనీవాసులు మైసమ్మ బోనాలు చేసుకున్నారు. బోనాల పండుగకు తనను పిలువలేదనే కోపంతో అర్ధరాత్రి కార్పొరేటర్ కత్తెరశాల వేణుగోపాల్, అనుచరులు 20 మంది కత్తులు, కర్రలు పట్టుకుని వచ్చి మహిళలను దూషించారు. దాడికి పాల్పడి గాయపరిచారు. వీధిలైట్లు బంద్ చేయించి, మద్యం తెప్పించుకుని తాగుతూ నానా బీభత్సం సృష్టించారని కాలనీలవాసులు తెలిపారు. ఇందులో కత్తి వెంకటేష్, నాగరాజు, మార్కండేయులు తీవ్రంగా గాయపడినట్లు వివరించారు. 100 డయల్ చేయగా పోలీసులు వచ్చి తమను కాపాడినట్లు పేర్కొన్నారు. కాగా తమపై దాడి చేసి, మహిళలను దూషించిన, గాయపరిచిన కార్పొరేటర్ కత్తెరశాల వేణుగోపాల్, అతడి అనుచరులపై మిల్స్‌కాలనీ సీఐ నందిరామ్‌కు కాలనీవాసులు గురువారం ఫిర్యాదు చేశారు. ఈ విషయమై సీఐ మాట్లాడుతూ బాధిత కాలనీ వాసులు, కార్పొరేటర్ ఇరువర్గాలు ఫిర్యాదు చేశారని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
బోనాలకు రజనీ రెడీ
చార్మినార్: బోనాల జాతర ఉత్సవాల్లో పాల్గొనడానికి రజనీ సిద్ధంగా ఉంది. ఉత్సవాల్లో రజనీ (ఏనుగు)కి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతి ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాల సందర్భంగా అంబారిపై అమ్మవారి ఊరేగింపును కన్నుల పండువగా నిర్వహిస్తారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంతో నెహ్రూ జంతు ప్రదర్శన శాలలో మావటీలు శిక్షణనిస్తున్నారు. నగరంలోని మూడు ప్రతిష్టాత్మకమైన అమ్మవారి దేవాలయాల ఆధ్వర్యంలో నిర్వహించే బోనాల జాతర ఊరేగింపులో రజినీ పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. దాదాపు 10 ఏళ్లకు పైగా ఎలాంటి అదురు బెదురు లేకుండా అత్యంత ఉత్సాహాంగా బోనాల జాతర ఉత్సవాల్లో రజనీ పాల్గొంటోంది. 30న ఊరేగింపు ఈ నెల 30న (సోమవారం) సికింద్రాబాద్ ఉజ్జాయినీ మహాంకాళి దేవాలయం అమ్మవారి జాతర ఊరేగింపులో రజనీ పాల్గొంటుంది. ఆగస్టు 5వ తేదీనా బోనాల సమర్పణ రోజు కార్వాన్‌లోని సబ్జిమండి నల్లపోచమ్మ మహాంకాళి దేవాలయం ఉత్సవాల సందర్భగా నిర్వహించే బోనాల జాతరలో రజనీ ఊరేగింపులో ఉంటుంది. 5న శ్రీ అక్కన్న మాదన్న మహాంకాళి దేవాలయం అమ్మవారి ఘటాల ఊరేగింపు ఉత్సవాల్లో పాల్గొననుంది. ఆరు దశాబ్దాలుగా అంబారీపై అక్కన్న మాదన్న అమ్మవారి ఘటం ఊరేగింపు కొనసాగుతూ వస్తోందని దేవాలయం కమిటి అ«ధ్యక్షులు జి.నిరంజన్ తెలిపారు. -
జనసంద్రమైంన గోల్కొండ కోట
-
గోల్కొండలో వైభవంగా ప్రారంభమైన బోనాలు
-
బోనమెత్తుదాం రండి
ఆషాఢ బోనాలకు గ్రేటర్ సిద్ధమయింది. ఆదివారం నుంచి గోల్కొండ జగదాంబికా అమ్మవారి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 29, 30 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాలు జరుగుతాయి. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సాక్షి, సిటీబ్యూరో: ఆషాఢమాసం... ఆధ్మాత్మిక ఆదివారం. ఆబాలగోపాలాన్ని పులకింపజేసే అద్భుత క్షణాలు... నాలుగు శతాబ్దాల మహోన్నత చారిత్రక ఈ వేడుక. విభిన్న వర్గాలను, భిన్న సంస్కృతులను ఏకం చేసే మహోన్నత సాంస్కృతిక, సామూహిక ఉత్సవం బోనాల పండుగ. ఆదివారం గోల్కొండ జగదాంబిక బోనాలతో ఆరంభమయ్యే వేడుకలకు నగరం సర్వం సన్నద్ధమైంది. అదేరోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఘటోత్సవం ప్రారంభం కానుంది. ఈ నెల 29, 30 తేదీల్లో మహంకాళి బోనాలు, రంగం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెలంగాణ అధికారిక పండుగ అయిన బోనాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. ఆ తరువాత లాల్‌దర్వాజ సింహవాహిని బోనాల వేడుక జరుగనుంది. ఈ వేడుకలతో పాటే నగరంలోని వివిధ ప్రాంతాల్లో బోనాల పండుగ జరుగనుంది. అన్ని ప్రధాన ఆలయాల్లో ఉత్సవాల కోసం నిర్వాహకులు ఏర్పాట్లు చేపట్టారు. సికింద్రాబాద్ మహంకాళి ఆలయాన్ని అందంగా అలంకరిస్తున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు బోనాల ఉత్సవాల దృష్ట్యా గోల్కొండ కోటలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. మొదటి రోజు సుమారు లక్షన్నర మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. మరోవైపు జగదాంబిక ఆలయ మార్గాలను విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు. శుక్రవారం స్థానిక మహిళలు మెట్ల పూజలు చేశారు. ఆలయానికి వెళ్లే అన్ని మెట్లను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అందంగా అలంకరించారు. ఆలయం వద్ద భక్తులు బోనాలు సమర్పించేందుకు అనుగుణంగా వాటర్‌ప్రూఫ్ షెడ్లను ఏర్పాటు చేశారు. రామదాసు బందీఖానా, నగీనాబాగ్, తదితర ప్రాంతాల్లోనూ భక్తుల కోసం అదనంగా వాటర్ ప్రూఫ్ షెడ్లను ఏర్పాటు చేశారు. బోనాల ఉత్సవానికి సర్వం సన్నద్ధమైన గోల్కొండ కోటను రంగురంగుల విద్యుద్దీపాలతో అందమైన వెలుగుల కొండలా తీర్చిదిద్దారు. అధికార లాంఛనాలతో ఉత్సవాలు... డప్పు దరువులు, హోరెత్తించే పాటల పరవళ్లు, పోతరాజు నృత్య ప్రదర్శనల నడుమ ఆదివారం ఉదయం గోల్కొండ బోనాల పండుగ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు లంగర్‌హౌస్ వద్ద తొట్లె ఊరేగింపు మొదలవుతుంది. ఇక్కడ ఏర్పాటు చేసే స్వాగత వేదికపై రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి తదితరులు హాజరై అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, అధికార లాంఛనాలు, అలాగే సాక సమర్పిస్తారు. దీంతో అట్టహాసంగా వేడుకలు ప్రారంభమవుతాయి. భారీ ఊరేగింపుతో తొట్టెల ప్రదర్శన ముందుకు సాగుతుంది. ఊరేగింపు చోటా బజార్‌కు చేరుకున్న తరువాత అనంతాచారి ఇంటి నుంచి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను తీసుకొని బయలుదేరుతారు. అక్కడి నుంచి తొట్టెలు, రథం, అమ్మవార్ల విగ్రహాలు ప్రదర్శనగా బయలుదేరుతాయి. నిజాం కాలం నుంచి బోనం సమర్పిస్తున్న పటేలమ్మ బోనం ఈ ప్రదర్శనలో కలుస్తుంది. అంతా కలిసి జగదాంబిక ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో జగదాంబిక, మహంకాళి అమ్మవార్లను ప్రతిష్టించడంతో ఆ రోజు వేడుక ముగుస్తుంది. 15వ తేదీ నుంచి వచ్చేనెల 12వ తేదీ వరకు ప్రతి ఆది, గురు వారాల్లో 9 ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 22వ తేదీ ఆదివారం భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. ఆ ఒక్క రోజు 3 లక్షల మందికి పైగా భక్తులు రానున్నట్లు అంచనా.. బోనాలు.... శక్తి స్వరూపినైన అమ్మవారికి భక్తులు భక్తిశ్రద్ధలతో తాము తయారు చేసిన ప్రసాదాన్ని సమర్పించడమే బోనం. స్త్రీలు తల స్నానం చేసి నూతన వస్త్రాలతో ఒక పాత్రకు పసుపును పూసి దానికి వేపాకు కొమ్మలతో పసుపు నీటిని తీసుకుని వచ్చి అమ్మవారికి సాకను సమర్పిస్తారు. మేళతాళాలు, డప్పుల దరువులతో అమ్మవారికి సాకను సమర్పిస్తారు. 163 ఏళ్లుగా ఉజ్జయిని అమ్మవారి సేవలో... మారేడుపల్లి: ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు మారేడుపల్లి ఓ ప్రత్యేకత చాటుకుంటోంది. ఘటం అలంకరణ నుంచి జాతర ముగింపు, అమ్మవారిని సాగనంపే వరకు మారేడుపల్లికి చెందిన కుమ్మరి రత్నయ్య కుటుంబ సభ్యులు వంశపారంపర్యంగా అమ్మవారికి సేవలు అందిస్తున్నారు. కీలక ఘట్టమైన రంగం (భవిష్యవాణి)కి పచ్చికుండను తరతరాలుగా ఈ కుటుంబ సభ్యులే అందజేస్తున్నారు. అమ్మవారికి మొదటి సేవ కుమ్మరి కులస్తులు చేయాల్సి ఉంటుంది. 163 ఏళ్ల క్రితం ఉజ్జయినీ నుంచి అమ్మవారిని తీసుకువచ్చి మహంకాళి ఆలయంలో ప్రతిష్ఠించినప్పుడు కుమ్మరి వారిచే పూజ నిర్వహించాల్సి ఉండగా ఆ కులానికి పెద్దమనిషిగా ఉన్న డిఫెన్స్ కాంట్రాక్టర్ సికింద్రాబాద్‌కు చెందిన కుమ్మరి రత్నయ్యకు అవకాశం లభించింది. అనంతరం తరతరాలుగా అతడి కుటుంబ సభ్యులకే అమ్మవారి సేవ చేసుకునే భాగ్యం లభించింది. ప్రస్తుతం అలంకరణ కార్యక్రమాన్ని వెస్ట్ మారేడుపల్లికి చెందిన కుమ్మరి రత్నయ్య కుటుంబ సభ్యులైన కుమ్మరి బిజ్జవరపు వినోద్ నిర్వహిస్తారు. పచ్చికుండకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఈనెల 30న జరిగే రంగం కార్యక్రమానికి భాజాభజంత్రీలతో అర్ధరాత్రి మహంకాళి ఆలయానికి చేరుకుంటారు. -
బోనం.. బొనాంజా
సాక్షి, హైదరాబాద్ : బోనాల పండగ...కాదు కాదు ‘కార్పొరేటర్ల పండగ’ మళ్లీ వచ్చింది. ఏటా మాదిరిగానే బోనాలకు ముందుగా నగరంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసింది. ఇంకేముంది కార్పొరేటర్లకు పండగే మరి. ఎందుకంటే బోనాల పనులకు సంబంధించి పెత్తనమంతా వారిదే. గత సంవత్సరం కంటే ఈ ఏడాది ప్రభుత్వం రూ.5 కోట్లు అదనంగా నిధులు మంజూరు చేసింది. బోనాల ఉత్సవాన్ని తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల కనుగుణంగా ఉత్సాహంగా నిర్వహించేందుకు ఈ నిధులు ఇచ్చారు. అయితే ఏటా పండుగ పేరిట ఇలా విడుదలవుతున్న నిధుల్లో చాలా వరకు కార్పొరేటర్ల ఖాతాల్లోకే మళ్లుతున్నాయన్న ఆరోపణలున్నాయి. పండుగ సందర్భంగా ఆలయాలకు వెళ్లే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు ఆలయాలకు దారితీసే మార్గాలను, రహదారులను తీర్చిదిద్దడం.. ఆలయాలకు సున్నాలు, రంగులు వేయడం, అవసరమైన ప్రాంతాల్లో షాబాద్ ఫ్లోరింగ్‌లు, విద్యుత్ దీపాల ఏర్పాటు వంటి పనులు చేయాలి. కానీ.. వీటిల్లో చాలా వరకు చేయకుండానే చేసినట్లు చూపుతూ నిధులు దారి మళ్లిస్తుండటం పరిపాటిగా మారింది. వాస్తవానికి ఆలయాల పరిసరాల్లో మాత్రమే ఈ పండగ పనులు చేయాల్సి ఉండగా, ఎక్కడ పడితే అక్కడ ఈ పనులను చేసినట్లు చూపుతున్నారు. అంతే కాదు.. పండుగలు మొదలయ్యేనాటికే పనులు పూర్తికావాల్సి ఉండగా, పండగలు ముగిశాక సంవత్సరమైనా పనులు పూర్తి కావడం లేదు. మరుసటి సంవత్సరం మళ్లీ పండుగ పేరిట నిధులు మంజూరవుతాయి కాబట్టి..పాత పనుల్ని ఎవరూ పట్టించుకోరు. ఆ బిల్లుల చెల్లింపులు మాత్రం జరిగిపోతాయి. అవి కార్పొరేటర్ల జేబుల్లోకి చేరతాయి. కార్పొరేటర్లు, స్థానిక అధికారులు పరస్పర సహకారంతో ఎవరి శక్తిమేరకు వారు ప్రయోజనం పొందుతున్నారన్న ఆరోపణలున్నాయి. గత సంవత్సరం బోనాల కోసం రూ.10 కోట్లు మంజూరు కాగా, ఆ నిధుల్లో ఇప్పటి వరకు ఇంకా రూ.2 కోట్లు ఖర్చు కాలేదు. అవలా ఉండగానే తాజాగా మళ్లీ రూ.15 కోట్లు మంజూరయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తూతూమంత్రంగా.. పండుగ పేరిట చేసే పనులు తూతూమంత్రంగానే చేస్తారు. మూణ్నాళ్ల ముచ్చట కోసం చేసే పనులే కావడంతో నాణ్యత గురించి పట్టించుకునేవారుండరు. రోడ్ల పేరిట ఖర్చు చూపినప్పటికీ.. ఎప్పటి కప్పుడు రోడ్ల మరమ్మతుల పేరిట నిర్వహణ ఖర్చుల నుంచి వెచ్చిస్తూనే ఉంటారు. బోనాల పేరిట ప్రత్యేకంగా నిధులు చూపడం తప్ప చాలా పనులు సాధారణ నిర్వహణ కిందే జరిగిపోతుంటాయి. వాటిని కూడా వీటిల్లో కలిపేస్తారు. పండుగల ఏర్పాట్ల పనులు జోన్లు, సర్కిళ్ల వారీగా జరుగుతాయి కాబట్టి పూర్తయిన పనుల వివరాలు ఎప్పటికప్పుడు ప్రధాన కార్యాలయానికి చేరవు. ఓవైపు ప్రతిపాదనలు.. మరోవైపు పనులు వచ్చే ఆదివారం నుంచి బోనాల సందడి ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని డివిజన్లలో ఇప్పటికే పనులు ప్రారంభం కాగా, కొన్ని డివిజన్లలో ఇంకా ప్రతిపాదనలే సిద్ధం కాలేదు. పండుగ పనుల ప్రతిపాదనల అధికారం కార్పొరేటర్లకే అప్పగించారు. స్థానిక కాలనీ సంఘాలు, ఎన్జీఓలు తదితరులతో కలిసి ప్రతిపాదనలు రూపొందించాల్సిందిగా మేయర్ సూచించారు. కానీ.. వారితో సమావేశాలు మొక్కుబడి తంతే. కొన్ని డివిజన్లలో అవీ జరగవు. కార్పొరేటర్ ఏది చెబితే అదే పని. స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయంతో పనిచేసే వారు కొందరు కాగా, అది కూడా పట్టించుకోని వారు మరికొందరు. మొత్తానికి బోనాల పండుగ నిధుల్లో కార్పొరేటర్లదే పెత్తనం కావడంతో ప్రజలకంటే వారికే పెద్ద పండగ. రూ. 2 కోట్ల పనులు రద్దు చేశాం వివిధ పండుగల పేరిట మంజూరైన నిధులు ఏడాదంతా ఖర్చు చేసే పద్ధతికి స్వస్తి పలికాం. ఏ పండుగకు మంజూరైన నిధులు ఆ పండుగకే వెచ్చించేందుకు తగిన చర్యలు తీసుకున్నాం. గత సంవత్సరం బోనాల పండుగ ఏర్పాట్లకు మంజూరైన నిధుల్లో దాదాపు రూ. 2 కోట్ల పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. దాంతో ఆ పనుల్నే రద్దు చేశాం. గతంలో మాదిరిగా వాటిని ఎప్పుడైనా ఖర్చు చేసే అవకాశం లేకుండా తగుచర్యలు తీసుకున్నాం. అవినీతి అక్రమాలకు తావు లేకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. – జియాఉద్దీన్, చీఫ్ ఇంజినీర్ (జీహెచ్ఎంసీ) ఈసారి బోనాల పండుగకు సంబంధించి ఇప్పటికి కొన్ని ప్రతిపాదనలే రాగా, చాలా ప్రాంతాల్లో ప్రతిపాదనలే సిద్ధం కాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రారంభమైన పనుల్ని కూడా బోనాల పండుగ పద్దులో చేర్చే అవకాశాలున్నాయి 2018–నిధుల మంజూరు.. పనుల పురోగతి..(రూ.లక్షల్లో) జోన్ల వారీగా.. జోన్ మంజూరు టెండరుదశలో పనుల పురోగతి ఎల్బీనగర్ 119.00 84.95 00.00 చార్మినార్ 841.77 207.06 56.42 ఖైరతాబాద్ 293.45 107.30 16.00 శేరిలింగంపల్లి 55.83 4.30 00.00 కూకట్పల్లి 39.00 11.17 00.00 సికింద్రాబాద్ 187.41 121.43 9.98 మొత్తం 1536.46 536.21 82.40 గత సంవత్సరం (2017) నిధుల మంజూరు.. పూర్తయిన పనులకు వెచ్చించిన నిధులు రూ. లక్షల్లో ఇలా.. జోన్ మంజూరు పూర్తయిన పనులు ఎల్బీనగర్ 164.89 38.78 చార్మినార్ 535.65 418.50 ఖైరతాబాద్ 139.22 90.28 శేరిలింగంపల్లి 38.76 34.81 కూకట్పల్లి 29.62 29.62 సికింద్రాబాద్ 257.27 231.98 మొత్తం 1165.41 843.97 గత సంవత్సరానికి సంబంధించిన పనుల్లో దాదాపు రూ. 17 లక్షల పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరో రూ.1.05 కోట్ల పనులు ఇంతవరకు అసలు ప్రారంభమే కాలేదు. -
ఈసారి బంగారు బోనం..పట్టువస్త్రం
చార్మినార్: బోనాలు.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటే గొప్ప పండుగ.. ఏపీ, ఢిల్లీతోపాటు అమెరికాలో కూడా వైభవంగా నిర్వహిస్తారు. ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వం బోనాలకు రూ.15కోట్లు విడుదల చేసింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత నాలుగేళ్లుగా ఉత్సవాలను కనీవినీ ఎరుగని విధంగా వేడుకలు జరుపుతున్నారు. ఈసారి బోనాల జాతర వివరాలిలా... ⇔ ఈసారి ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలు ఈ నెల 15 న గోల్కొండ అమ్మ వారి బోనాలతో ప్రారంభమవుతున్నాయి. ⇔ ఈ నెల 16,17,18లలో లాల్‌దర్వాజ సింహావాహినీ దేవాలయం కమిటి ఆధ్వర్యంలో డిల్లీలో అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాలు సమర్పించనున్నారు. ⇔ డిల్లీలో జరిగే బోనాల జాతర ఉత్సవాలకు పలువురు కేంద్ర,రాష్ట్ర మంత్రులతో పాటు అధికార,అనధికార ప్రముఖులు పాల్గొంటారు. ⇔ జూలై 22న విజయవాడ కనక దుర్గా అమ్మవారికి ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో బోనాల సమర్పణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ⇔ విజయవాడ బ్రహ్మణ వీధి నుంచి శ్రీ కనకదుర్గమ్మ దేవాలయం వరకు భజాభజంత్రీలతో, కళా బృందాల నృత్య ప్రదర్శనలతో బోనాల జాతర ఊరేగింపు నిర్వహించనున్నారు. ⇔ బోనంతో పాటు పట్టు వస్త్రాలు, కృష్ణానదిలో గంగా తెప్ప తదితర పూజ కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. ⇔ ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ విజయవాడ శ్రీ కనక దుర్గమ్మ వారికి బంగారు పాత్రలో బోనం సమర్పించనున్నారు. ⇔ జూలై 29వ తేదీన సికింద్రా బాద్‌లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర. ⇔ అదే రోజే పాతబస్తీలో అమ్మవారి ఘట స్థాపన సామూహిక ఊరేగింపు. ⇔ శాలిబండలోని కాశీ విశ్వనాథ దేవాలయం నుంచి ఊరేగింపు బయలుదేరుతుంది. ⇔ ఆగస్టు 5వ తేదీన హైదరాబాద్ నగరంతో పాటు పాతబస్తీలో బోనాల జాతర ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ⇔ అమ్మవారికి బోనాల సమర్పణ అనంతరం 6వ తేదీన పాతబస్తీలో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు కొనసాగుతుంది. బంగారు బోనం..పట్టువస్త్రం ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి ఆధ్వర్యంలో ఈసారి సప్త మాతృకలకు సప్త బంగారు బోనం సమర్పించనున్నారు. ఈ నెల 15వ తేదీన గోల్కోండ అమ్మవారికి కమిటీ తరపున బంగారు బోనం, పట్టువస్త్రా లు సమర్పించనున్నారు. అలాగే 17వ తేదీన బల్కంపేట అమ్మవారికి, 20వ తేదీన పెద్దమ్మ గుడి అమ్మవారికి, 24న సికింద్రాబాద్ ఉబ్జయిని మహంకాళి అమ్మవారికి, 26న చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారికి, 31న లాల్‌దర్వాజా సింహవాహిణి అమ్మవారికి, ఆగస్టు 5న మీరాలంమండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయంలో అమ్మవారికి బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాలు సమర్పించ నున్నారు. -
గోల్కొండ కోట బోనాలు
గోల్కొండ : గోల్కొండ కోట బోనాలను అత్యంత వైభవంగా నిర్వహించి తెలంగాణ పండుగల గొప్పదనాన్ని చాటుతామని రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ నెల 15 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు జరిగే శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవార్ల బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై శనివారం గోల్కొండలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతి«ధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గోల్కొండ కోటలో అమలవుతున్న ప్లాస్టిక్ నిషేదానికి మరింత చేయూతనిచ్చేందుకు కోటకు వచ్చే భక్తులకు తాగునీరు, మట్టి గ్లాసులు, మట్టి చెంబులలో అందిస్తామని ఆయన తెలిపారు. భక్తులు చేసుకునే వంటలకు ప్రత్యేక స్థలం కేటాయించాలని, రోడ్లకు ప్యాచ్‌వర్క్‌లు నిర్వహించాలని, డ్రైనేజీ, త్రాగునీటి పైప్లైన్లకు మరమ్మత్తులు నిర్వహించి వీధి లైట్ల నిర్వహణను సరి చేయాలని అధికారులను ఆదేశించారు. మొదటి బోనం రోజున లంగర్‌హౌస్ నుంచి ప్రారంభమయ్యే ఊరేగింపులో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారని, ఆ రోజు లంగర్‌హౌస్ నుంచి కోటకు వరకు 550 ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చే యాలన్నారు. బల్దియా కమిషనర్ డాక్టర్ జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ... ప్లాస్టిక్ రహిత హైదరాబాద్ ఏర్పాటులో పాల్గొన్న స్వచ్ఛ బోనాలు– స్వచ్ఛ గోల్కొండ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు, ఈ కార్యక్రమం అంతర్జాతీయ ప్లాస్టిక్ నిషేదిత కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్నామన్నారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ భారతి హోలికేరి, జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీవత్సకోట, పర్యాటకశాఖ ఎండి మనోహర్ తదితరులు పాల్గొన్నార -
జులై 15 నుంచి బోనాల ఉత్సవాలు ప్రారంభం
-
నేటి నుంచే గోల్కొండ బోనాలు
-
సచివాలయంలో వైభవంగా బోనాలు
-
సచివాలయంలో వైభవంగా బోనాలు
రెండు రాష్ట్రాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో బోనాల పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సచివాలయం రెండు రాష్ట్రాల ఉద్యోగుల కోలాహలంతో కళకళలాడింది. ప్రాంగణంలోని నల్ల పోచమ్మ ఆలయంలో ఉద్యోగులు బోనాలు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఉన్నతాధికారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లింగరాజు పాణిగ్రాహి ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఉద్యోగులు పోచమ్మ ఆలయం వరకు బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. ఏపీ ఉద్యోగులు అమరావతికి వెళ్లిపోతున్న నేపథ్యంలో తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి.. ఏపీ ఉద్యోగులకు ఘనంగా వీడ్కోలు పలికింది. ఏపీ ఉద్యోగుల సంఘం నాయకులను, ఉద్యోగులను ఇదే వేదికపై సన్మానించారు. ఉద్యోగరీత్యా ఇన్నేళ్లు ఒకేచోట పని చేసి ఇప్పుడు విడిపోవడం బాధగా ఉందన్నారు. తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఈ సమ్మేళనం జరిగింది. జీఏడీ కార్యదర్శులు అదర్ సిన్హా, వెంకటేశ్వరరావు, ఏపీ నుంచి పాణిగ్రాహి, ప్రేమ్‌చంద్రారెడ్డి పాల్గొన్నారు. రిటైరయ్యాక ఇక్కడే ఉంటాం హైదరాబాద్‌లోనే తమకు ఇళ్ల స్థలాలు కేటాయించారని, ఉద్యోగ విరమణ తర్వాత ఇక్కడే సెటిలవుతామని కొందరు ఏపీ ఉద్యోగులు చెప్పారు. ప్రాంతాలు విడిపోయినా అన్నాదమ్ముళ్లుగా కలసి ఉందామన్నారు. 2 రాష్ట్రాలు అభివృద్ధిలో మొదటి స్థానాల్లో ఉండాలని ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో మంచి వాతావరణం ఉంటుందని, ఎక్కడి నుంచి వచ్చినవారైనా ఈ ప్రాంతాన్ని తమ సొంత ప్రాంతంగా భావిస్తారని లింగరాజు పాణిగ్రహి అభిప్రాయపడ్డారు. అనంతరం ఇరు రాష్ట్రాల ఉద్యోగులు కలసి సామూహిక భోజనాలు చేశారు. ఏటా బోనాలకు ఆహ్వానిస్తాం ప్రతి ఏటా ప్రాంతాలకతీతంగా బోనాల పండగను నిర్వహించుకునే వారమని, రెండు రాష్ట్రాల ఉద్యోగులు విడిపోయినందున వచ్చే ఏడాది ఏపీకి వెళ్లి ఉద్యోగులను ఆహ్వానిస్తామని, బోనాల పండగను నిర్వహించుకుంటామని నరేందర్‌రావు చెప్పారు. -
తెలంగాణ భవన్లో బోనాల పండుగ
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర అధికార పండుగ.. బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల పండగను ఆలయ కమిటీ సభ్యులు రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. శనివారం తొలి రోజు అమ్మవారి ఘట స్థాపనతో బోనాల పండగ వైభవంగా ప్రారంభమైంది. ఢిల్లీ పురవీధుల్లో అమ్మవారి ఊరేగింపు చూ సేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలంగాణ భవన్ సమీపంలోని అమ్మవారి గుడి నుంచి ప్రారంభమైన ఊరేగింపు డప్పు చప్పుళ్లు, కళాకారుల నృత్యాల మధ్య ఉత్సాహంగా ముందుకు సాగింది. అనంతరం తెలంగాణ భవన్లో అమ్మవారి ఘట స్థాపన చేశారు. ఆలయ కమిటీ సలహాదారు మహేశ్ గౌడ్ మాట్లాడుతూ రెండో రోజు అమ్మవారికి బంగారు, వెండి బోనాల సమర్పణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. లాల్‌దర్వాజ మహంకాళి ఆలయ కమిటీ చైర్మన్ సి.రాజ్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఢిల్లీలో రెండు రోజుల పాటు సాగుతున్న ఈ సంబరాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు వెంకటేశ్ పాల్గొన్నారు. -
గతేడాదికన్నా ఘనంగా బోనాలు
♦ అధికారులకు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఆదేశం ♦ పండుగ ఏర్పాట్లపై మంత్రి తలసానితో కలసి సమీక్ష సాక్షి, హైదరాబాద్: గంగా జమునా తెహజీబ్‌కు ప్రతీకగా హైదరాబాద్‌లో జరుపుకునే బోనాలు పండుగను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అధికారులను ఆదేశించారు. గతేడాదికన్నా ఘనంగా ఏర్పాట్లు ఉండాలన్నారు. పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలసి గురువారం సచివాలయంలో బోనాల ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. రాష్ట్ర పండుగైన బోనాల పండుగ సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని తలసాని పేర్కొన్నారు. జూలై 17న బోనాలు హైదరాబాద్‌లో ప్రారంభమవుతాయని, దీనికి సంబంధించి హోం, ఎక్సైజ్ శాఖ మంత్రుల ఆధ్వర్యంలో మరో సమావేశం నిర్వహిస్తామన్నారు. జూలై 24, 25 తేదీల్లో సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళి దేవస్థానంలో జరిగే బోనాల పండుగకు ఇప్పట్నుంచే ఏర్పాట్లు ప్రారంభించాలన్నారు. సీనియర్ అధికారులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకోవాలని, అన్ని శాఖల అధికారులు క్షేత్ర పర్యటనలు చేసి అవసరమైన పనులను గుర్తించి వెంటనే చేపట్టాలని మహమూద్ అలీ, తలసాని ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభమవుతున్నందున దేవాలయాల పరిసరాల్లో మొబైల్ టాయిలెట్లు, రోడ్లకు మరమ్మతులు, విద్యుత్ అలంకరణలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, బందోబస్తు, బారికేడ్ల ఏర్పాటు, మంచినీరు, నిరంతర విద్యుత్ సరఫరా, ప్రత్యేక బస్సుల ఏర్పాటు, హోర్డింగ్‌లు, సినిమా థియేటర్లలో ప్రకటనల ద్వారా ప్రచారం, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు తదితర అంశాలపై వారు ఆదేశాలు జారీ చేశారు. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో జూలై 5న కల్యాణోత్సవానికి భారీగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని, దీనికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలన్నారు. దేవాలయాలవారీగా కమిటీలు వేసుకొని పండుగను విజయవంతంగా నిర్వహించుకోవాలన్నారు. సమావేశంలో రహదారులు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి, జలమండలి ఎండీ దానకిషోర్, సమాచార, పౌరసంబధాలశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఆర్థికశాఖ కార్యదర్శి శివశంకర్, హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, పోలీసు అధికారులు శ్రీనివాస్, సుమతి, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ హరిచందన, అగ్నిమాపకశాఖ అదనపు డెరైక్టర్ లక్ష్మీప్రసాద్ పాల్గొన్నారు. -
పాపాలు పెరిగిపోతున్నాయి.. అందుకే వర్షాభావం
లోకంలో పాపాలు పెరిగిపోతున్నాయని, అందుకే వర్షాలు పడటం లేదని జోగిని అనూరాధ చెప్పారు. లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి ఆలయంలో బోనాల పండుగ సందర్భంగా సోమవారం రంగం నిర్వహించారు. అందులో ఆమె మాట్లాడారు. ఇక మీదట సకాలంలోనే వర్షాలు పడతాయని, తాను అందరికీ అండగా ఉంటానని తెలిపారు. అమ్మవారికి సాకను పెట్టాలని, ఆలయం పెద్దదిగా చేయాలని కోరుకుంటున్నానన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని, పాపాలు మాత్రం పెరిగిపోకుండా చూసుకోవాలని చెప్పారు. -
బోనమెత్తిన భాగ్యనగరం
-
బోనాలకు 10 కోట్లు
-
బోనాలకు 10 కోట్లు
* ప్రభుత్వం తరఫున వైభవంగా ఏర్పాట్లు * హోంమంత్రి అధ్వర్యంలో మంత్రుల కమిటీ * అధికారులు, మంత్రులతో సీఎం సమీక్ష సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పండుగైన బోనాల ఉత్సవాన్ని జంటనగరాల్లో ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఉత్సవ ఏర్పాట్ల కోసం రూ.10 కోట్లు కేటాయించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.5 కోట్లు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మరో రూ.5 కోట్లు వెచ్చించనుంది. బోనాల పండుగ ఏర్పాట్లపై సోమవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బోనాల పండుగను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. తగిన ఏర్పాట్లు చేసేందుకు దేవాదాయ శాఖ ద్వారా రూ.5 కోట్లు, జీహెచ్ఎంసీ ద్వారా రూ.5 కోట్లు విడుదల చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. నిధులు వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ కార్యదర్శి ప్రదీప్ చంద్రను ఆదేశించారు. బోనాల ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అధ్యక్షతన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి, పద్మారావుతో మంత్రుల కమిటీని ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. మంత్రుల కమిటీ జీహెచ్ఎంసీతో సమన్వయం చేసుకుని బోనాలు ఘనంగా నిర్వహించాలని దేవాదాయ శాఖ కమిషనర్ శివశంకర్‌ను సీఎం ఆదేశించారు. బోనాలు జరిగే అన్ని దేవాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని, రహదారులు శుభ్రంగా ఉండేలా చూడాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. సమీక్షలో మంత్రులు నాయిని, తలసాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రతి నియోజకవర్గానికి రూ.20 లక్షలు బోనాల ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను పాతబస్తీలోని ఒక్కో ఆలయానికి రూ. 3 లక్షలు, పాతబస్తీ మినహా మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక్కో నియోజకవర్గానికి రూ.20 లక్షల చొప్పున కేటాయించామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వెల్లడించారు. ఈ నిధులను ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు, దేవాదాయ, మున్సిపల్ అధికారులతో ఏర్పాటైన కమిటీ ఆధ్వర్యంలో ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. హోంమంత్రి నాయిని అధ్యక్షతన సోమవారం సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు పద్మారావు గౌడ్, తలసాని శ్రీనివాస యాదవ్, నగరానికి చెందిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం నాయిని విలేకరులతో మాట్లాడుతూ.. జంటనగరాల్లో బోనాల పండుగను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ముఖ్యంగా ప్రధాన కూడళ్లు, దేవాలయ ప్రాంగణాల్లో భారీగా విద్యుత్ దీపాల అలకంరణ చేయనున్నట్లు తెలిపారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్లను ఆదేశించినట్లు చెప్పారు. రాజకీయాలకతీతంగా అందరం కలసి పనిచేయాలని నిర్ణయించామన్నారు. జాతీయ స్థాయిలో బోనాలకు ప్రచారం కల్పిస్తాం బోనాల విశిష్టత, ప్రాశస్త్యాన్ని జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించడమే ఉద్దేశంగా ఢిల్లీలో బోనాల పండుగ నిర్వహించనున్నట్టు లాల్ దర్వాజ సింహవాహిని మహాంకాళి (హైదరాబాద్) ఆలయ కమిటీ చైర్మన్ మాణిక్ ప్రభు గౌడ్, సలహా బోర్డు చైర్మన్ ముఖేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో సోమవారం విలేకరుల సమావేశంలో బోనాల ఉత్సవాల నిర్వహణ వివరాలు వెల్లడించారు. తెలంగాణ భవన్లో మంగళవారం సాయంత్రం మహాంకాళి విగ్రహ ప్రతిష్ట చేయనున్నామన్నారు. పోతురాజు, ఘటం, బంగారు, వెండి బోనాల కార్యక్రమం ఉంటుందన్నారు. భవిష్యత్‌లో తానా మహాసభల్లో బోనాల పండుగ నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేశారు. నేడు బల్కంపేట ఎల్లమ్మ గుడికి సీఎం దంపతులు బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు జరిగే కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు హాజరుకానున్నారు. మంత్రి తలసాని అధ్వర్యంలో పలువురు వేద పండితులు, పురోహితులు సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలసి కల్యాణోత్సవానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు బాలకృష్ణశర్మ అధ్వర్యంలో ముఖ్యమంత్రికి ఆశీర్వాదం ఇచ్చారు. -
సింహవాహినికి ‘బంగారు బోనం’
రాష్ట్రప్రభుత్వం తరఫున సమర్పించిన సీఎం కేసీఆర్ పాతనగరంలో వైభవంగా రాష్ట్ర పండుగ సాక్షి, హైదరాబాద్ : అక్కడ భక్తి పరవళ్లు తొక్కింది. లయబద్ధమైన డప్పుల దరువులకు పోతురాజులు అడుగులు కదిపారు. అమ్మ కళను ఆవహించుకున్న శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. అంబరాన్నంటిన సంబరాల మధ్యన ఫలహార బండ్ల ఊరేగింపు సాగింది. బోనాలు పట్టిన మహిళలు అమ్మవారికి తొట్టెలను సమర్పించి పులకితులయ్యారు. ఇదీ ఆదివారం పాతనగరంలో కన్నుల పండువగా సాగిన రాష్ట్రపండగ బోనాల జాతర తీరు. మహానగరిలో కుగ్రామ వాతావరణం ఆవిష్కృతమైన ఘట్టం. ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉదయం 11.50 గంటలకు సతీసమేతంగా విచ్చేసి లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు.సీఎంకు ఆలయ కమిటీ నిర్వాహకులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అంతకు ముందు హరిబౌలిలోని అక్కన్న, మాదన్న దేవాలయంలోనూ కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. మీరాలంమండిలోని మహంకాళి దేవాలయంలో హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. బోనాలను రాష్ట్ర పర్వదినంగా గుర్తించడంతో నగరంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ అధికారులు అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించే ఆనవాయితీకి శ్రీకారం చుట్టారు. పవిత్ర పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతా:సీఎం కేసీఆర్ లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయాన్ని విస్తరించి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జాతర నిర్వహించుకునే అమ్మవారి ఆలయం చాలా చిన్నదిగా ఉండడం బాధాకరమన్నారు.క్షేత్రంగా విస్తరణకు అవసరమైనస్థలాన్ని సేకరిస్తామన్నారు. బోనం సమర్పించిన అనంతరం ఆయన అక్కడ జరిగిన సభలో ప్రసంగించారు. గతేడాది అమ్మవారి ఆలయానికి రమ్మని ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారని.. ఆ సమయంలో తాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని మొక్కుకున్నానని కేసీఆర్ అన్నారు. అమ్మవారి దయతో రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో బంగారు బోనాన్ని సమర్పించి మొక్కు తీర్చుకున్నానన్నారు. రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురిసి పంటలు సస్యశ్యామలంగా పండేలా దీవించాలని తల్లిని మొక్కుకున్నానన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కేసీఆర్‌తో పాటు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిలకు అమ్మవారి ఫొటోలను జ్ఞాపికలుగా అందజేశారు. కిటకిటలాడిన సింహవాహిని ఆలయం తెల్లవారు జామునుంచేమహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి లాల్‌దర్వాజ అమ్మవారికి బోనం సమర్పించడానికి క్యూ కట్టారు. భక్తుల రద్దీతో పరిసర రోడ్లన్నీ కళకళలాడాయి. పాతబస్తీలోని మీరాలం మండి మహంకాళి దేవాలయం, ఉప్పుగూడ, సుల్తాన్షాహి, గౌలిపురా, మురాద్‌మహాల్, అక్కన్నమాదన్నల మహంకాళి దేవాలయం, బేలా ముత్యాలమ్మ, హరిబౌలి, రాంబక్షిబండ ,మేకలబండ, తదితర ప్రాంతాల్లోని అమ్మవార్ల ఆలయాలు భక్తులతో కిక్కిరిసాయి. దక్షిణ మండలం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి స్వయంగా శాంతి భద్రతలను పర్యవేక్షించారు. ప్రముఖుల సందర్శన సీఎంతో పాటు శాసన సభ స్పీకర్ మధుసూధనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ తదితరులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అదే విధంగా నిజామాబాద్ ఎంపీ కవిత, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, సీఎల్పీ నేత జానారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, చింతల రాంచంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రకాష్‌గౌడ్, గీతారెడ్డి, తదితరులు దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. బోనానికి అరకిలో బంగారం లాల్ దర్వాజ మహంకాళికి సీఎం చేతులు మీదుగా సమర్పించిన బంగారు బోనం తయారీకి అరకిలో బంగారాన్ని వినియోగించారు. దాతల సాయంతో శివ అనే భక్తుడు ఈ బోనాన్ని రూపొందించాడు. ఊరేగింపుగా.. ‘నేత’ విలక్షణ శైలిలో మైసమ్మకు చీర సమర్పించిన పద్మశాలీ భక్తులు హైదరాబాద్ : వారు భక్తిని విలక్షణంగా చాటుకున్నారు. హైదరాబాద్ నగరంలోని కార్వాన్ దర్బార్ మైసమ్మ తల్లికి స్థానిక పద్మశాలీ భక్తులు తమ నేత నిపుణతను ప్రదర్శిస్తూ పట్టు చీరను సమర్పించారు. అందర్నీ ఆకట్టుకున్న ఈ ప్రదర్శన ఆదివారం జరిగింది. కార్వాన్‌లోని మార్కండేయ భవన్‌నుంచి కొందరు పద్మశాలీ వర్గానికి చెందిన భక్తులు మగ్గంపై నేతపని చేస్తూనే ఊరేగింపుగా వచ్చారు. తొలుత వారు మార్కండేయ భవన్లో ఉదయం తొమ్మిది గంటలకు నేతను ప్రారంభించి రెండు గంటల వరకూ ఏకధాటిగా సాగించారు. అనంతరం మూడుగంటలకు నేత ఊరేగింపును ప్రారంభిస్తూ నాలుగు గంటలకు ఆలయం వద్దకు చేరుకునే సరికి అల్లిక పూర్తిచేసి అమ్మవారికి పట్టుచీరను భక్తి ప్రపత్తులతో అందించి పులకితులయ్యారు. -
21న ‘బోనాల’ సెలవు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లాలో ఆదివారం ఆషాఢ బోనాలు జరుగనున్న నేపథ్యంలో వివిధ ప్రభుత్వ విభాగాలకు సోమవారం సెలవు ఇచ్చేందుకు సర్కార్ సుముఖత వ్యక్తం చేసింది. జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగమంతా ఆదివారం ఉత్సవ ఏరాట్లలో నిమగ్నమైనందున సోమవారం సెలవు ఇవ్వాలని కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా ప్రభుత్వానికి లేఖ రాశారు. కలెక్టర్ లేఖకు స్పందించిన సర్కారు హైదరాబాద్ జిల్లాలో సోమవారం సెలవుకు అంగీకరించింది. అయితే ఏఏ ప్రభుత్వ విభాగాలకు సెలవు ఇవ్వాలనే విషయంపై కలెక్టర్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 21న సెలవు విషయమై శనివారం అధికారికకంగా ప్రకటన వెలువడే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. -
ఉజ్జయినీ మాత బోనాల జాతర
-
వైభోగ బోనం
* కన్నుల పండువగా లష్కర్ సంబురాలు * అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబు * భక్తి పారవశ్యాన ఊగిన శివసత్తులు * తల్లి దర్శనానికి ప్రముఖుల తాకిడి * భక్తి పారవశ్యాన ఊగిన శివసత్తులు * ఆకట్టుకున్న పోతరాజుల విన్యాసాలు * కన్నుల పండువగా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి సంబురాలు * అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: డప్పుల దరువులు....పోతరాజుల వీరంగాలు....శివసత్తుల పూనకాలు....అమ్మాబయలెల్లినాదో తల్లీ బయలెల్లినాదో... అంటూ మహంకాళి అమ్మవారిపై అచంచల భక్తివిశ్వాసాలతో ఊగిపోయిన భక్తులు...ఘనంగా బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్న మహిళలు, దర్శించుకున్న అశేష భక్తజనవాహిని,డీజేల హోరులో ఉర్రూతలూగిన యువత. తెలంగాణ రాష్ట్ర పండుగ వేళ సికింద్రాబాద్ ఉజ్జయినీ మాత బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది. జగజ్జననిని దర్శించుకునేందుకు తెల్లవారు జాము నుంచే భక్తులు బారులు తీరారు. సికింద్రాబాద్‌లోని అన్ని ప్రధాన రహదారులు,వీధులు కిటకిటలాడాయి. ఉదయం 4 గంటలకు అభిషేకాలు, మహా హారతితో తల్లికి విశేష పూజలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ , మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డిలు తొలి పూజలో పాల్గొన్నారు. వారితో పాటు ఆలయ ఈవో అశోక్‌కుమార్, ఫౌండర్ ట్రస్టీ సురిటీ కృష్ణలు ఉన్నారు. జంటనగరాలతో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వేలాదిగా తరలి వచ్చిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పట్టువస్త్రాలు సమర్పించిన కేసీఆర్ రాష్ట్ర పండుగగా గుర్తించిన ఈ ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సతీ సమేతంగా మధ్యాహ్నం 1.30 గంటలకు అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలను సమర్పించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉదయం 10 గంటలకు దర్శించుకున్నారు. బోనాలు, సాక సమర్పించే భక్తులతో పాటు , శివసత్తుల పూనకాలు, ఫలహార బండ్ల, తొట్టెల సమర్పణల ఊరేగింపులతో ఆదివారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు సికింద్రాబాద్ పరిసరాల్లో కోలాహలం నెలకొంది. వీఐపీల తాకిడి ఆలయంలోకి వెళ్లేందుకు పలువురు ప్రయత్నించడంతో భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. ప్రముఖుల రాకపోకలతో క్యూలైన్లో ఉన్న వారు అమ్మవారి దర్శనంకోసం రెండు గంటలకు పైగా ఉండాల్సి వచ్చింది. అమ్మ ఆశీర్వాదంతో అభివృద్ధి: హోం మంత్రి మహంకాళి అమ్మవారి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. ఇందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడాలని మొక్కుకున్నానని చెప్పారు. ఈ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకూ, భక్తులకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున పోలీసులను నియమించామని చెప్పారు. ప్రముఖుల పూజలు ఆలయాన్ని దర్శించుకున్న పలువురు నేతలకు స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి టీ పద్మారావులు కలసి అమ్మవారికి పూజలు చేశారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీలు బండారు దత్తాత్రేయ, కె.కేశవరావు, కవిత, మల్లారెడ్డి, నంది ఎల్లయ్య, బీబీ పటేల్, సుజనా చౌదరి, గరికపాటి మోహన్‌రావు, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, వివేకానందగౌడ్, ఎర్రబెల్లి దయాకర్, జీ సాయన్న, గీతారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, డిప్యూటీ మేయర్ జి.రాజ్‌కుమార్ అమ్మవారిని దర్శించుకున్నారు. మాజీ ఎంపీలు అంజన్‌కుమార్‌యాదవ్, అల్లాడి రాజ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కృష్ణయాదవ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, విమలక్క ప్రత్యేక పూజలు చేశారు. నగర పోలీస్ కమిషనర్ ఎం. మహేందర్‌రెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి, ఐపీఎస్ అధికారులు జితేందర్, శివప్రసాద్, మల్లారెడ్డి తదితరులు అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. రాష్ట్ర ప్రజలను చల్లగా చూడాలి: కేసీఆర్ తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలందరినీ అమ్మవారు చల్లగా చూడాలని తాను మొక్కుకున్నానని సీఎం కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. మహంకాళి అమ్మదయ వల్ల ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. వర్షాలు పడి ప్రజలంతా పాడి పంటలతో, సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. బోనాలను రాష్ట్ర ఉత్సవాలుగా ప్రకటించామని ప్రస్తుతం ఎలా ఉన్నా వచ్చే వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. సయోధ్య చెదరకూడదని : చంద్రబాబు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు ప్రజల మధ్య సయోధ్య చెదరకుండా వారు కలసిమెలసి జీవించేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. వానలు కురిసి రైతుల ఇబ్బందులు తొలగిపోవాలని మొక్కుకున్నట్లు తెలిపారు. అలాగే బాబు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన శ్రీగురు రేణు దత్తాత్రేయస్వామి పాదపూజలో పాల్గొని, భగవాన్ రామదూత స్వామి ఆశీస్సులు అందుకున్నారు.