
లండన్: ఇంటిటా బోనాలు, ప్రతి ఇంటా బోనాల పేరుతో తెలంగాణ ఎన్నారై ఫోరమ్(టీఎన్ఎఫ్) లండన్లో బోనాల ఉత్సవాలను మంగళవారం ఘనంగా ప్రారంభించింది. కరోనా దృష్ట్యా ఏటా వేలాది మంది కలిసి చేసుకునే పండగను, ఈసారి ఎవరి ఇళ్లలో వారే జరుపుకుంటునట్లు టీఎన్ఎఫ్ ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్ వెల్లడించారు.
ఈ మేరకు టీఎన్ఎఫ్ మహిళా విభాగం కో–ఆర్డినేటర్లు మీనా అంతరి, శౌరీ గౌడ్, వాణి అనసూరి, సాయి లక్ష్మి, దివ్య, శిరీష ఆశ, సవితా జమ్ముల, సీతా లత, అమృత, శ్వేత, జయశ్రీ, శ్రీవాణి సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కరోనా మహమ్మారి నుంచి బయటపడిన తర్వాత ఒడి బియ్యంతో విందు కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.
బోనాల పండగ విశిష్టతపై లండన్ వేదికగా వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని టీఎన్ఎఫ్ ప్రెసిడెంట్ ప్రమోద్ గౌడ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment