
పాపాలు పెరిగిపోతున్నాయి.. అందుకే వర్షాభావం
లోకంలో పాపాలు పెరిగిపోతున్నాయని, అందుకే వర్షాలు పడటం లేదని జోగిని అనూరాధ చెప్పారు. లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి ఆలయంలో బోనాల పండుగ సందర్భంగా సోమవారం రంగం నిర్వహించారు. అందులో ఆమె మాట్లాడారు.
ఇక మీదట సకాలంలోనే వర్షాలు పడతాయని, తాను అందరికీ అండగా ఉంటానని తెలిపారు. అమ్మవారికి సాకను పెట్టాలని, ఆలయం పెద్దదిగా చేయాలని కోరుకుంటున్నానన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని, పాపాలు మాత్రం పెరిగిపోకుండా చూసుకోవాలని చెప్పారు.