జిల్లా కేంద్రంలోని ఆదివారం బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు, పిల్లలు ఉదయం నుంచే బోనాలను సిద్ధం చేశారు. దుర్గామాతకు ప్రతి రూపంగా భావించే గ్రామ దేవతలకు బోనాలతో పాటు కోళ్లు, గొర్రెలు, మేకలను బలిచ్చి నైవేద్యంగా సమర్పించారు. కుర్వినిశెట్టి కాలనీ, రవీంద్రనగర్, కుమ్మరివాడి, బండ్లగేరి, వీరభద్రకాలనీలకు చెందిన మహిళలు సామూహికంగా బోనాలతో తోటమైసమ్మ గుడికి చేరుకున్నారు. పలువురు శివసత్తులు పూనకం నిండారు.
అంతకుముందు ఆలయంలో స్వస్తిపుణ్యహవాచనం, లక్షాధారణం, అఖండ ప్రజ్వలనం, ధ్వజాపతాక ఆరోహణ, పంచాభృతసహిత నవరస అభిషేకం, గౌరిదేవీ అష్టోత్తరం, లలితాసహస్రనామాలతో సామూహిక కుంకుమార్చన చేసిన అనంతరం అమ్మవారికి ఒడిబియ్యం నింపారు.
బోనమెత్తిన పాలమూరు
Published Mon, Jul 14 2014 3:26 AM | Last Updated on Sat, Sep 29 2018 5:55 PM
Advertisement