District Centre
-
ఈద్ ముబారక్
స్టేషన్ మహబూబ్‌నగర్: రంజాన్ పర్వదినానికి మసీదులు, ఈద్గాలు సుందరంగా ముస్తాబయ్యాయి. శుక్రవారం రాత్రి షవ్వాల్ నెలవంక దర్శనమివ్వడంతో ముస్లింలు 29రోజుల పాటు చేపట్టిన ఉపవాసాలను విరమించారు. చంద్రుడు కనిపించడంతో పరస్పరం ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. శనివారం జిల్లావ్యాప్తంగా ఈదుల్ ఫితర్ పండగను జరుపుకుని, మానవకల్యాణం కోసం ప్రత్యేక నమాజులు చేస్తారు. జిల్లా కేంద్రంలోని జామీయ మసీదు నుంచి ఉదయం 9 గంటలకు ముస్లిం సామూహికంగా గడియారం చౌరస్తా మీదుగా స్థానిక వానగట్టు రహెమానియా ఈద్గా వద్దకు చేరుకుంటారు. అక్కడ10గంటలకు జామియా మసీదు ప్రధాన ఇమామ్ హాఫిజ్ ఇస్మాయిల్ ప్రత్యేక నమాజు ప్రార్థనలు చేయిస్తారు. మదీనా మసీదులో ఉదయం 9.30 గంటలకు, సిరాజుల్ ఉలుమ్లో 8 గంట లకు, మునీర్ మసీదులో 9 గంటలకు ప్రత్యేకనమాజు నిర్వహించనున్నారు. ఖౌమీ ఏకతా కమిటీ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు ఈద్ ముబారక్ చెప్పడానికి ప్రజాప్రతిని ధులు, అధికారులు ఈద్గా వద్దకు చేరుకుని పట్టణ ఖౌమీ ఏకతా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసే శిబిరంవద్దముస్లింలకు పండ గ శుభాకాంక్షలు తెలుపనున్నారు. ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, కలెక్టర్ టీకే శ్రీదేవి, మాజీ కేంద్ర మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి, వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి మునిసిపల్ చైర్పర్సన్ రాధాఅమర్పాటు ఆయా పార్టీల నేతలు పండుగ వేడుకల్లో పాల్గొనున్నారు. ఈద్ నమాజ్ సందర్భంగా ఎలాం టి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుం డా పోలీసు అధికారులు పట్టణంలో ముం దస్తుగా బందోబస్తు ఏర్పాటుచేశారు. ఈద్గా వద్ద ప్రత్యేక నమాజు ఈదుల్ ఫితర్ ప్రత్యేకనమాజుకు వేలాది సంఖ్యలో ముస్లింలు వక్ఫ్ రహెమానియా ఈద్గా వద్ద రానుండటంతో ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. టెంట్లు, తాగునీటి తదితర సౌకర్యాలు ఏర్పాట్లు చేశారు. మునిసిపాలిటీ సిబ్బం ది వారం రోజుల నుంచి ఈద్గా వద్ద మరమ్మతులు చేపట్టింది. -
కోర్టులకు విశాల భవనాలు
పాలమూరు: జిల్లా కేంద్రంలోని కోర్టు సముదాయాలకు సరిపడా భవనాలు లేవని, విస్తీర్ణస్థలంలో భవనాల ఏర్పాటుకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని హైకోర్టు జడ్జి రామలింగేశ్వర్రావు పేర్కొన్నారు. శనివారం జ్యుడిషియల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చిన ఆయన ముందుగా జిల్లాలోని మన్యంకొండ దేవస్థానానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం జిల్లాకోర్టు న్యాయమూర్తి రామలింగేశ్వర్రావు ముందుగా కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. కోర్టు పరిసరాలను, భవన సముదాయాలను ఆయన పరిశీలించారు. ఆ తర్వాత బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయవాదుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో వివిధ కోర్టులు ఉన్నాయని, వాటిని చిన్నస్థలంలోనే ఒక్కోచోట ఒక కోర్టును నిర్వహించడం వల్ల కక్షిదారులు, న్యాయవాదులకు ఇబ్బందిగా ఉంటుందన్నారు. అన్ని సముదాయాలు విస్తీర్ణస్థలంలో ఒకేచోట ఉండటం వల్ల అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు. తగిన స్థలాన్ని ఎంపిక చేయగలిగితే అన్నికోర్టుల భవన సముదాయాలను ఒకేచోట నిర్మించే విధంగా తాను కృషిచేస్తానన్నారు. న్యాయవాదులను ఉద్ధేశించి మాట్లాడుతూ కేసుల సత్వర పరిష్కారానికి కృషిచేయాలని, కక్షిదారులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి శివనాగిరెడ్డి, బార్అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో హైకోర్టు జడ్జి రామలింగేశ్వర్రావు సన్మానించారు. వివిధ కోర్టులకు చెందిన న్యాయమూర్తులతో నిర్వహించిన జ్యుడిషియల్ కాన్ఫరెన్స్‌లో హైకోర్టు జడ్జి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కేసుల సత్వర పరిష్కారం, ఇతర అంశాలపై ఈ సదస్సులో చర్చించారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి శివనాగిరెడ్డి, మొదటి అదనపు జిల్లా జడ్జి హరికృష్ణ భూపతి, జూనియర్ సివిల్ బి.శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు. -
అక్రమార్కులకు కళ్లెం!
పాలమూరు: ఇసుక తరలింపు ఇక ఈజీ కాదు.. అక్రమంగా కొల్లగొట్టేవారిపై క్రిమినల్ చర్యలు తీసుకోకపోవడంతో పాటు వాహనాన్ని జప్తు చేయనున్నారు. సీజ్చేసిన ఇసుకను జిల్లా కేంద్రంలోని డిపో ద్వారా అవసరమున్న వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వ నిర్మాణాలకు సరఫరా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే అనుమతుల పేర విచ్చలవిడిగా జరిగే అక్రమ రవాణాను ఎవరు అడ్డుకోవాలన్న దానిపై సందిగ్ధం నెలకొంది. ఇసుకాసురులపై ఏపీఎండీసీ, మైనింగ్‌శాఖల అధికారులు ఏ మాత్రం దృష్టిసారించడం లేదు. మైనింగ్ మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీగా వ్యవహరించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన అదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత తెలివిగా నీరుగారుస్తోంది. జిల్లా అధికార యంత్రాంగానికి రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ)ను అనుసంధానం చేసి చేతులు దులుపుకున్న ప్రభుత్వం అక్రమ రవాణాకు అధికారికంగా గేట్లేత్తేసింది. ప్రభుత్వ నిర్మాణాలు, ప్రాజెక్టులతో పాటు ప్రైవేటు నిర్మాణాలకు సైతం ఇసుక అవసరమన్న సాకుతో ఏపీఎండీసీ ద్వారా ఇసుకను తోడేందుకు అనుమతించాలని నిర్ణయించింది. ఇసుక విక్రయాలపై ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పాలసీ అమలుకు ముందు.. ఆయా ప్రాంతాల్లో అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుకను రెవెన్యూ, పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ మొత్తం ఇసుకను ఒక చోట చేర్చి అక్కడి నుంచి అవసరమైన వారికి ఇసుకను విక్రయించేందుకు జిల్లా అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. జిల్లాలో విజృంభిస్తున్న ఇసుక మాఫీయా ఈ అవకాశాన్ని వినియోగించుకుని పక్కదారి పట్టించే ప్రయత్నంలో పడ్డారు. సర్కారు కొత్త నిర్ణయంతో ఇసుక విక్రయం పక్కదారి పడుతుందని పలువురు భావిస్తున్నారు. ప్రభుత్వ డిపో ద్వారా ఇసుక సరఫరా: కలెక్టర్ అక్రమ రవాణా, అక్రమ తవ్వకాల్లో జప్తుచేసిన ఇసుకను జిల్లా కేంద్రంలోని డిపో ద్వారా అవసరమున్న వ్యక్తులు, సంస్థలకు, ప్రభుత్వ నిర్మాణ కార్యక్రమాలకు సరఫరా చేయాలని విధాన నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్ టీకే శ్రీదేవి వెల్లడించారు. అన్ని మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. మొదట దరఖాస్తు చేసుకున్న వారికి మొదటిగా కేటాయింపు పద్ధతిలో ఒక క్యూబిక్ మీటరును రూ.750 చొప్పున విక్రయిస్తారని, పెద్దమందడి, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఇసుకను మొదటగా ప్రభుత్వమే జిల్లా కేంద్రానికి సమీపంలోని నిర్మితి కేంద్రానికి తరలించనున్నట్లు తెలిపారు. ఒక దరఖాస్తుపై 50 క్యూబిక్ మీటర్ల ఇసుక కేటాయిస్తారని, ఆ ఇసుకను తీసుకున్న తర్వాత ఇంకా అవసరమైతే మళ్లీ 50 క్యూబిక్ మీటర్లకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తుదారుని అవసరాన్ని నిర్ధారించుకున్న తర్వాతే ఏడీ మైన్స్, జియాలజీ విభాగాలు ఇసుక కే0టాయింపు చేస్తాయన్నారు. కేటాయించిన ఇసుక లబ్ధిదారుడికి నిర్మిత కేంద్రం వద్ద అప్పగిస్తారని కలెక్టర్ వెల్లడించారు. అక్కడి నుంచి నిర్మాణ ప్రాంతానికి దరఖాస్తు దారుడు అతని స్వంత ఖర్చులతో రవాణా చేసుకోవాల్సి ఉంటుందన్నారు. అక్రమరవాణా చేస్తే.. ఇసుక అక్రమ రవాణాకు, అక్రమ వినియోగానికి తరలిస్తే అట్టి ఇసుకను, అందుకు వినియోగించిన వాహనాన్ని రెండింటిని కూడా జప్తు చేసి బహిరంగ వేలంలో విక్రయిస్తామని కలెక్టర్ హెచ్చరించారు. అంతేకాకుండా వాహనం డ్రైవర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. కేటాయించిన ఇసుక రవాణాను అన్ని పనిదినాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రవాణాకు అనుమతిస్తారు. కనుక ఇసుక అవసరం ఉన్నవారు సమీప మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. -
వనపర్తిని తీర్చిదిద్దుతా
జిల్లా కేంద్రం తరువాత పెద్ద మున్సిపాలిటీ వనపర్తి. ఈ పట్టణంలో లక్ష జనాభా ఉంది. దీనికి చారిత్రక పట్టణంగా కూడా పేరుంది. స్వాతంత్య్రానికి పూర్వం నుంచే వనపర్తి తన ప్రాధాన్యతను ఎప్పటికప్పుడు చాటుకుంటోంది. త్వరలో జరగనున్న జిల్లా కేంద్రాల పునర్విభజనలో ఈ పట్టణాన్ని జిల్లాకేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఇంతటి ప్రాధాన్యం కలిగిన పట్టణంలో సమస్యలు కూడా అంతేస్థాయిలో ఉన్నాయి. పట్టణంలో నెలకొన్న సమస్యలు తెలుసుకునేందుకు వనపర్తి మున్సిపల్ చైర్మన్ పలుస రమేష్ ‘సాక్షి’ రిపోర్టర్‌గా మారారు. పలు వార్డుల్లో తిరిగి ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకున్నారు. ఎన్.భువనేశ్వరి, కౌన్సిలర్ : గాంధీచౌక్ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. రోడ్లు పూర్తిగా ఆక్రమణకు గురవుతున్నాయి. ద్విచక్ర వాహనాలు కూడా రోడ్ల వెంట వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయి. కూరగాయల వ్యాపారులకు, చిరు వ్యాపారులకు ప్రత్యేకంగా విశాలంగా ఉండే విధంగా మార్కెట్ ఏర్పాటు చేయాలి. రమేష్‌గౌడ్: తప్పకుండా చేస్తామమ్మ. ఇప్పుడు కూరగాయల మార్కెట్ ఉన్నా అది వ్యాపారులకు సరిపోవడం లేదు. దానిని షరాబ్ బజారు (బంగారు మార్కెట్)కు కేటాయించి. కూరగాయలకు వేరేచోట మార్కెట్ కేటాయించాలన్న ఆలోచన ఉంది. కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటాం. రమేష్‌గౌడ్: మీది ఏ ఊరు చెప్పండమ్మా.. ఎన్నాళ్లుగా కూరాగాయలు అమ్ముతున్నారు? కృష్ణమ్మ కూరగాయల రైతు: మాది ఖిల్లాఘణపురం మండలం జంగమయ్యపల్లి గ్రామం. కూరగాయలు పండిస్తాం. ఆకు కూరలు, కూరగాయలు వనపర్తి గాంధీచౌక్‌కు తెచ్చి ఇక్కడ రోడ్డుపై పె ట్టుకుని అమ్ముకుంటాం. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. పందులు, పశు వులు కూరగాయలు తింటుంటాయి. రోడ్డుపై వెళ్లే వాహనాలు స్థలం లేక కూరగాయలు తొక్కి వెళ్తుంటాయి. ఇలా మాకు చాలా నష్టం వస్తోంది. కూరగాయల రైతుల కోసం మాకు రైతు బజారు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. రమేష్‌గౌడ్: తప్పకుండా ఆలోచిస్తాం. వనపర్తిలో కందకం స్థలం వృథాగా ఉంది. దాదాపు కిలోమీటరు మేర ఉన్న కందకాన్ని పూడిస్తే రైతు బజారు, కూరగాయల మార్కెట్‌కు స్థలం సరిపోతుంది. ఆ దిశగా ఆలోచిస్తాం. జగదీష్ : మున్సిపల్ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. వాటిని పరిరక్షించండి. వనపర్తిలో చిల్డ్రన్ పార్కు కోసం పాత బజారులో ఏర్పాటు చేసిన స్థలం వృథాగా ఉంది. ఇక్కడ మున్సిపల్ కాంప్లెక్స్ నిర్మిస్తే బాగుంటుంది. రమేష్‌గౌడ్: మున్సిపల్ స్థలాలు ఆక్రమించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తాం. ప్రజలు తమ దృష్టికి వచ్చిన కబ్జాలను లిఖిత పూర్వకంగా పిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం, చిల్డ్రన్ పార్కు స్థలాన్ని అభివృద్ధి చేసే అంశంపై కౌన్సిల్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. నగేష్ : వనపర్తిలో సంతకు స్థలం లేక ఇబ్బందిగా ఉంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలు సంతపై ఆధారపడి తమ లావాదేవీలు నిర్వహిస్తుంటారు. దానిని పునరుద్ధరించాలి. రమేష్‌గౌడ్: వనపర్తి సంతకు స్థలాన్ని కేటాయిస్తాం. కందకంలో సంతకు స్థలం కేటాయించేలా చర్యలు తీసుకుంటా. అనురాధ:వనపర్తిలో రోడ్లు విస్తరించాలి. రోడ్లు చిన్నగా ఉన్నందుకు పార్కింగ్ లేక వ్యాపారాలు పడిపోయాయి. పాతబజారు, గాంధీచౌక్లతో వ్యాపారులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. రమేష్‌గౌడ్: వనపర్తి రోడ్ల విస్తరణ అంశం పరిశీలనలో ఉంది. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే చిన్నారెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డిలు విస్తరణ విషయంలో సానుకూలంగా స్పందిం చారు. మున్సిపాలిటీ ఇందుకు తీర్మానాన్ని కూడా సేసింది. త్వరలో ఈ పనులు మొదలవుతాయి. చంద్రశేఖర్: వనపర్తిలో రామన్‌పాడు నీళ్లు సరిగా అందడం లేదు. వేసవి వస్తే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది కదా. రమేష్‌గౌడ్: పట్టణంలో ప్రతి ఇంటికీ రోజూ కృష్ణాజలాలు అందింస్తాం. ఇం దుకు రామన్‌పాడ్ తాగునీటి పథకాలకు కొత్త మోటార్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డిని కోరాం. అంచనాలు పంపాలని చెప్పారు. కొత్త మోటార్లు ఏర్పాటు చేసి ప్రతి రోజు కృష్ణా జలాలు వనపర్తివాసులకు అందిస్తాం. పోచ రవీందర్‌రెడ్డి : ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో వ్యర్థాలు విచక్షణా రహితంగా పారబోయడం వల్ల రోగాలు ప్రబలుతున్నాయి. దీనిని ఖాళీ చేయించండి. రమేష్‌గౌడ్: సుమారు నాలుగు ఎకరాల ఈ స్థలం కోర్టు వివాదంలో ఉన్నందున కంపచెట్లు మొలిచాయి. దీంతో పందులు, దోమలు పెరిగాయి. దీనివల్ల ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే. ఈ విషయంపై కౌన్సిల్లో మాట్లాడి చదును చేయిస్తాం. లేదా స్థలం సొంత దారులకు నోటీసులు జారీచేసి శుభ్రం చేయిస్తాం. రమేష్‌గౌడ్ ఇచ్చిన హామీలు వనపర్తి ప్రజలు వేసవిలో తాగు నీటిఎద్దడి ఎదుర్కోకుండా రామన్‌పాడ్ తాగునీటి పథకాలకు కొత్త మోటార్లు బిగిస్తాం. వనపర్తిలో కూరగాయల మార్కెట్‌కు విశాలమైన స్థలాన్ని కేటాయిస్తాం. రైతుల కోసం ప్రత్యేకంగా రైతుబజారు,పూల రైతులకు పూల బజారులకు స్థలాలు కేటాయిస్తాం. రోడ్ల విస్తరణకు అన్ని పార్టీల మద్దతు తీసుకుని త్వరలో ఈ తంతును పూర్తి చేస్తాం. వనపర్తిలో అవసరం అయిన ప్రాంతాలలో పార్కింగ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా చూస్తాం. మున్సిపల్ స్థలాలలను పరిరక్షిస్తాం. అక్రమ కట్టడాలు, అనుమతి లేని నిర్మాణాలపై ఉక్కు పాదం మోపుతాం. కబ్జాలపై ఫిర్యాదులు చేస్తే తక్షణం స్పందిస్తాం.క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తాం. -
ఐసీడీఎస్‌లో ఏసీబీ తనిఖీలు
క్రైం (కడప అర్బన్) : జిల్లా కేంద్రంలోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ కార్యాలయంలో బుధవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఐలు పార్థసారథి రెడ్డి, చంద్రశేఖర్, సుధాకర్ రెడ్డి తమ సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి మాట్లాడుతూ ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్ట్ అధికారిణిగా లీలావతి 2011 డిసెంబర్ 7 నుంచి, ఈ ఏడాది నవంబర్ 27 వరకు పనిచేశారన్నారు. ఆమె హయాంలో అంగన్వాడీ వర్కర్ల నియామకంలోనూ, 30 మంది కంప్యూటర్ ఆపరేటర్ల నియామకంలోనూ, బదిలీలల్లోనూ లక్షలాది రూపాయలు లంచంగా వసూలు చేశారని, పోషకాహారం కొనుగోలులోనూ అవకతవకలు జరిగాయంటూ తమ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లిందన్నారు. వారి ఉత్తర్వుల మేరకు తనిఖీలు చేపట్టామన్నారు. అంగన్వాడీ వర్కర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఆహారం సరఫరా చేసిన ఏజెన్సీలను వరుసగా పిలిపించి విచారిస్తున్నామన్నారు. సంబంధిత రికార్డులను సీజ్ చేసి, నివేదికను తమ ఉన్నతాధికారులకు త్వరలో పంపిస్తామన్నారు. -
బై బై.. గణేశా!
తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకున్న గణపయ్య నిమజ్జనానికి తరలివెళ్లాడు. శనివారం చివరిరోజు భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. దీంతో మంటపాల వద్ద కోలాహలం నెలకొంది. విఘ్నాలు తొలగించాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు. వరాలు కురిపించాలని వరసిద్ధి వినాయకుడిని వేడుకున్నారు. పాడిపంటలు కలగాలని, పిల్లాపాపలతో సుఖసంతోషాలతో ఉండాలని గౌరీతనయుడిని కోరుకున్నారు. మహబూబ్న గర్‌లో స్థానిక గడియారం చౌరస్తా నుంచి అటు పాత గ్రంథాలయం, ఇటు పాత బస్టాండు, రాయిచూర్ రోడ్డు, జడ్చర్ల హైవే తదితర ప్రాంతాలు నిమజ్జనానికి తరలివెళ్లే గణపతి విగ్రహాల ఊరేగింపులతో పులకించిపోయాయి. జిల్లాకేంద్రంలో కలెక్టర్ జీడీ ప్రియదర్శిని, ఎస్పీ డి.నాగేంద్రకుమార్, ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ తదితరులు వినాయకులకు వీడ్కోలు పలికారు. జిల్లాలోని కల్వకుర్తి, షాద్‌నగర్, గద్వాల, అలంపూర్, అచ్చంపేట, మక్తల్‌లో నిమజ్జనోత్సవాలు కన్నులపండువగా జరిగాయి. -
నవ్విపోదురుగాక!
‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు..’ అన్న చందంగా తయారైంది జిల్లా విద్యాశాఖ పరిస్థితి. అందుకే ఎవరేమనుకున్నా ఫర్వాలేదన్నట్టుగా వ్యవహరించింది. పాఠశాలలో తప్పతాగి.. పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన ఉపాధ్యాయులను పట్టుమని పాతిక రోజులు గడవకముందే.. తిరిగి విధుల్లోకి తీసుకుంది. విద్యాశాఖ అధికారి కె.లింగయ్య శనివారం వారికి పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వడంతో ఉపాధ్యాయ లోకం నివ్వెరపోయింది. సాక్షి, కరీంనగర్ : ఆగస్టు 11.. జిల్లా కేంద్రంలోని ముకరంపుర ధన్గర్‌వాడీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఎని మిది మంది పాఠశాలలోనే తప్పతాగారు. పాఠశాలను పానశాలగా మార్చి పోలీ సులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. విద్యాశాఖపై ఒత్తిడి రావడంతో చేసేదిలేక వారిని సస్పెండ్ చేసింది. తీరా 25 రోజులు కూడా గడవకముందే.. వారిని యథాస్థానంలో నియమిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి లింగయ్య రీ పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చేశారు. గురుపూజోత్సవం వరకు వేచి ఉండి.. మరుసటి రోజే ఆర్డర్లు ఇచ్చిన డీఈవో నిర్ణయం తో ఉపాధ్యాయ లోకమంతా నివ్వెరపోయింది. గురుపూజోత్సవానికి ముందే ఆర్డర్లు ఇస్తే వేడుకల్లో ఉపాధ్యాయులు నిలదీస్తారనే ఉద్దేశంతోనే ఈ కొద్దిరోజులు కూడా ఆపేశారని, లేకుంటే వారికి ఎప్పుడో ఆర్డర్లు వచ్చేవి కావచ్చని అనుమానిస్తున్నారు. కనీసం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లకుండా వారికి ఎలా పోస్టింగ్ ఇస్తారని సొంత శాఖలోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మద్యం తాగు తూ పట్టుబడిన ఉపాధ్యాయుల వివరాలను విద్యాశాఖ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వారికి పోస్టింగ్ ఇచ్చే నిర్ణయం తీసుకుంటే బాగుండని అదే శాఖ లో పని చేస్తున్న ఓ అధికారి అభిప్రాయపడ్డారు. ఆ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టకపోవడం.. శాఖాపరమైన చర్యలు తీసుకోకుండా అనతికాలంలోనే మళ్లీ పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీఏ నిబంధనల ప్రకారం.. పాఠశాలల్లో తప్పుడు పనులు చేసిన ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తే పూర్థిస్థాయిలో విచారణ జరపాలి. ఇందుకు ఆర్నెల్ల సమయం తీసుకోవాలి. ఆలోపు విచారణ జరిపి ఎప్పుడైనా పోస్టింగ్ ఇవ్వవచ్చు. కానీ.. తప్పు చేసి సస్పెండ్‌కు గురైన ఎంతోమందికి నెల, రెండు నెలల్లోపే రీ పోస్టింగ్ ఆర్డర్లు అందుతున్నాయి. గత నెల సస్పెండ్ అయిన ఎనిమిది మందికి ఇంత తొందరగా పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వాల్సిన అంత అవసరం ఇప్పుడు ఏం వచ్చింది..? ప్రజాప్రతినిధుల ఒత్తిడితోనే ఈ నిర్ణయం తీసుకున్నారా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విద్యాశాఖతోపాటు వృత్తి పరువు, ప్రతిష్టకు మచ్చ తెచ్చిన సదరు ఉపాధ్యాయులకు, డీఈవోకు ఉన్న సాన్నిహిత్యమూ దీనికి కారణమని, అందుకే నెల గడవక ముందే వారికి రీ పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చారనే చర్చ జోరుగా సాగుతోంది. విద్యాశాఖ తీసుకుంటు న్న ఇలాంటి నిర్ణయాలు పాఠశాలల్లో గుట్టుచప్పుడు కాకుండా తప్పుడు పనులు చేస్తున్న.. చే సే ఆలోచన ఉన్న ఉపాధ్యాయులను మరింత ప్రోత్సహిస్తున్నట్టు ఉన్నాయి. దారి తప్పిన గురువులపై కఠినంగా వ్యవహరించి.. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు జరగకుండా అడ్డుకోవాలని ఉపాధ్యాయ సంఘ నేతలు, తల్లిదండ్రులు కోరుతున్నారు. సస్పెండ్ అయిన ఉపాధ్యాయులకు రీపోస్టింగ్ ఇవ్వడంపై డీఈవోను కె.లింగయ్యను వివరణ కోరగా.. సీసీఏ నిబంధనల మేరకే వారికి పోస్టింగ్ ఇచ్చామని, సస్పెండ్ చేసిన తర్వాత ఆర్నెల్లలోపు ఎప్పుడైనా పోస్టింగ్ ఇచ్చే అధికారం తనకుంద ని, పేర్కొన్నారు. విధుల్లో చేరిన తర్వాత వారిపై శాఖపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. -
నీరుగారుస్తారా.. నీళ్లిప్పిస్తారా..!
కర్నూలు రూరల్: వరుణుడి కరుణ కొంతే... ప్రభుత్వ చేయూత అంతంతే.. ఈ ఏడాది ఖరీఫ్ సాగు రెండు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. ఈ నేపథ్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న నీటిపారుదల సలహా మండలి సమావేశంపై అన్నదాతలు ఆశలు పెట్టుకున్నారు. గతంలో మాదిరి కాకుండా ఈ సారి తీర్మానాలను కచ్చితంగా అమలు చేయాలని, నీటి వాటాను రాబట్టేందుకు కృషి చేయాలని కోరుతున్నారు. అయితే వర్షాలు లేవనే సాకుతో వరి సాగుకు నీరు ఇవ్వలేమని, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలనే సూచన ఇచ్చేందుకు అధికార పార్టీ నాయకులు సమాయత్తమవుతున్నారు. ఈ విషయమై ప్రతిపక్ష నాయకులు చర్చకు పట్టుబడితే తప్పించుకునేందుకు వ్యూహం రచించారు. కేవలం అజెండాపై మాత్రమే చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి చేసినట్లు సమాచారం. కాల్వల కింద సాగు ఇలా.. తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ), కర్నూలు-కడప కాలువ, ఎస్సార్బీసీ, తెలుగు గంగ, ఆలూరు బ్రాంచ్ కాలువల కింద జిల్లాలో మొత్తం 4,99,837 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించారు. వీటికి అదనంగా గత ఏడాది హంద్రీనీవా కింద 18 వేల ఎకరాల్లో పంటలు వేసుకున్నారు. తుంగభద్ర దిగువ కాలువ కింద 16 మండలాల్లో 192 గ్రామాల పరిధిలో 43519 ఎకరాల ఖరీఫ్ ఆయకట్టు ఉంది. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం నుంచి ఈ కాలువకు వచ్చే నీరు దారిమళ్లుతోంది. ఏటా జల చౌర్యాన్ని అడ్డుకోలేకపోతున్నారు. ఉత్తర కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలోకి 62 వేల క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. మరో ఐదు రోజుల్లో జలాశయం పూర్తిగా నిండే అవకాశాలున్నాయి. ఇదిలా ఉండగా ఎల్లెల్సీకి ఈ నెల 24వ తేదీనే 690 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ ఏడాదైనా ఎల్లెల్సీ నీటి వాటా 24 టీఎంసీలు రాబట్టేందుకు పాలకులు, అధికారులు కృషి చేయాల్సి ఉంది. నీటి తరలింపును అడ్డుకోవాలి.. కర్నూలు-కడప కాలువ కింద కర్నూలు జిల్లాలో 1,73,627 ఎకరాలు, వైఎస్సార్ కడప జిల్లాలో 92001 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఏడాది ఈ కాలువకు ఏ మేరకు నీళ్లు ఇస్తారనే అంశంపై ప్రకటన చేయాల్సి ఉంది. కేసీకి కేటాయించిన నీటిని అనంతపురం జిల్లాకు తరలిస్తే ఆయకట్టుకు చుక్కనీరు కూడ ఇచ్చే ప్రసక్తే లేదని అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత ఏడాది అనంతపురం జిల్లాకు 3 టీఎంసీల నీరు తరలిపోవడంతో వరి పంట దిగుబడులు తగ్గాయి. దీంతోపాటు రబీకి నీరు లేక పొలాలు బీడుపడ్డాయి. శ్రీశైలంలో కనీస నీటిమట్టాన్ని పెంచాలి.. శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను తాగు, సాగు నీటి అవసరాలకు ఉపయోగించుకునేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యూలేటర్‌ను నిర్మించారు. పోతిరెడ్డిపాడు ద్వారా బనకచెర్ల క్రాస్ రెగ్యులెటర్ కాంప్లెక్స్ నుంచి తెలుగు గంగ, ఎస్సార్బీసీ, హంద్రీనీవా కాల్వలకు నీరందుతోంది. శ్రీశైలంలో 854 అడుగుల కనీస నీటిమట్టాన్ని ఉంచాలని రాయలసీమ రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం కనీస నీటి మట్టాన్ని 788 అడుగులుగా నిర్ణయించింది. దీంతో తెలుగు గంగ కింద 1,03,700 ఎకరాలు, ఎస్సార్బీసీ పరిధిలో 1,44,317 ఎకరాల్లో, హంద్రీనీవా కింద 20 వేల ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. ఈ విషయంపై ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సి ఉంది. -
జెడ్పీ స్థలానికే ఎసరు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ఇరవై ఏళ్ల కిందట అతను జెడ్పీలో అటెండర్.. పక్కా ఇంటి కోసం ఆయనకు 180 చదరపు గజాల జాగాను ప్రభుత్వం కేటాయించింది. అప్పటి ప్రజాప్రతినిధుల సిఫారసుతో జెడ్పీకి చెందిన స్థలంలోనే పట్టా ఇచ్చింది. ఆయన వారసులు తమకు అసైన్ చేసిన స్థలం చుట్టూ ఉన్నదంతా కబ్జా చేశారు. జిల్లా కేంద్రం నడి బొడ్డున జెడ్పీ క్వార్టర్స్ కాలనీలో 21 గుంటల స్థలానికి ఎసరు పెట్టారు. గోదాంగడ్డ సమీపంలోని ఈ ప్రాంతంలో ఇప్పుడు ఒక్కో గుంట దాదాపు రూ.20 లక్షలు ధర పలుకుతోంది. అంటే అన్యాక్రాంతమైన స్థలం విలువ రూ.4 కోట్ల పైచిలుకు. ఇంత విలువైన స్థలాన్ని సొంతం చేసుకునేందుకు.. రియల్ వ్యాపారులు పంజా విసిరారు. మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ జెడ్పీ చైర్మన్‌గా ఉన్న సమయంలో తెరపైకి వచ్చిన ఈ కబ్జా వ్యవహారం ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశమైంది. ఇటీవలే కబ్జాదారులు ఈ స్థలాన్ని గుట్టుగా ఆంధ్రా బిల్డర్లకు కట్టబెట్టి బహుళ అంతస్థుల భవనం నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ దందా వెనుక ఎవరెవరు ఉన్నారు.. కొత్త పాలకవర్గం కొలువు దీరిన నేపథ్యంలో జిల్లా పరిషత్ స్థలాన్ని కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఉత్కంఠ రేపుతోంది. 1981లో జెడ్పీ క్వార్టర్స్ కాంపౌండ్‌లో ఉన్న 982 సర్వే నెంబర్లోని జెడ్పీ స్థలంలో 180 చదరపు గజాలు (దాదాపు గుంటన్నర) అందులో పనిచేసే అటెండర్‌కు అసైన్ చేశారు. కారుణ్య నియామకాల కింద ఉద్యోగం పొందిన ఆయన వారసుడితో పాటు మరో ఇద్దరు సోదరులు ఈ స్థలంపై కన్నేశారు. చుట్టూరా ఉన్న 21 గుంటల స్థలాన్ని తమ అధీనం చేసుకున్నారు. సుద్దాల దేవయ్య జెడ్పీ చైర్మన్‌గా ఉన్న కాలంలో ఆయన కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందనే ఆరోపణలున్నాయి. ఆరేళ్ల కిందట ఈ కబ్జా స్థలం చుట్టూ కాంపౌండ్‌వాల్ నిర్మించే ప్రయత్నం జరిగింది. అప్పటి జెడ్పీ చైర్మన్ ఆరెపల్లి మోహన్ సూచన మేరకు అప్రమత్తమైన జెడ్పీ అధికారులు... అక్రమ నిర్మాణాలు చేపుడుతున్నారంటూ కూల్చివేశారు. గుంటన్నర భూమిని సాకుగా చూపించి.. అదనంగా 19.5 గుంటలు ఆక్రమించుకున్నట్లుగా గుర్తించారు. కబ్జాకు గురైన భూమిని తిరిగి తమ స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ.. అప్పటి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, మరోవైపు రాజకీయ నేతల ఒత్తిళ్లతో ఈ ఫైలు ముందుకు కదల్లేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇటీవల కొత్త ప్రభుత్వం, జెడ్పీకి కొత్త పాలకవర్గం రావటంతో కబ్జాదారులు మళ్లీ తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తమ చేతికి మట్టి అంటకుండా ప్రైవేటు బిల్డర్లకు స్థలాన్ని అప్పగించి.. తమవంతుగా వాటాను చేజిక్కించుకునే పనిలో పడ్డారు. జిల్లా పరిషత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు తమ ఆస్తులను కాపాడుకుంటారా...? కళ్లముందు కనిపిస్తున్న కబ్జాకోరుల లీలలకు ఊ కొడతారా...? వేచిచూడాల్సిందే. -
అలరించిన వెంకన్న ఆటాపాట
మహబూబ్‌నగర్ అర్బన్: ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న తన ఆటాపాటతో అలరించారు. తన పాటలో పల్లె కన్నీరు పెడుతున్న తీరు, పాలమూరు వలసగోసను చూపారు. పాలకుల నిర్లక్ష్యపు వైఖరిని ఎండగట్టారు. నవ తెలంగాణ నిర్మాణానికి ఏం కావాలో తెలియజేశారు. పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని గాయత్రీ ఫంక్షన్హాల్లో ‘గోరటి వెంకన్న కవిత్వంతో ఒక రోజు’ అనే సాహితీ సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ మట్లాడుతూ.. ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిన తెలంగాణ రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమానికి ప్రజాకవి గోరటి వెంకన్న పాటనే బాట వేసిందన్నారు. ‘స్థానికత.. గోరటి ఎంకన్న కవిత్వం’ అనే అంశంపై ప్రధాన ప్రసంగం చేసిన ఆయన మనుషులే కాకుండా సమస్త ప్రాణికోటి స్వేచ్ఛగా ఉండాలని పరితపించిన కవి, గాయకుల్లో వెంకన్న ప్రథముడని అన్నారు. ఆయన పాట, మాట, ఆట తెలంగాణ కదనరంగానికి ఊతమిచ్చిందన్నారు. ప ల్లెసీమలు, వాగులు, వంపులు, చెరువులు, చెట్లు, పక్షలు తదితర ప్రకృతి సంపద వైభవాన్ని చాటి చెబుతూనే వాటి పట్ల పాలకుల విధ్వంసకర చర్యలను ఎత్తిచూపిందన్నారు. సాంస్కృతిక ఉద్యమాల ద్వారానే తెలంగాణ రాష్ట్రం వచ్చినా ఇప్పటికీ ప్రజాస్వామ్యం శేషప్రశ్నగానే మిగిలిందన్నారు. నూతన తెలంగాణ ఏర్పాటు పట్ల వెంకన్న రూపొందించిన కార్యాచరణను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందిస్తానని చెప్పారు. పోలవరం బాధితుల కోసం గళం విప్పాలి ‘ప్రపంచీకరణ, ప్రజారాజకీయాలు-ఎంకన్న కవిత్వం’ అనే అంశంపై ప్రసంగించిన వరవరరావు మాట్లాడుతూ.. మూడు లక్షల మంది ఆదివాసీలను పోలవరం ప్రాజెక్టులో ముంచి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరికోసమో అర్థం కావడం లేదన్నారు. పోలవరం బాధితులు, పాలస్తీనా ప్రజల కోసం గళం విప్పాలని ఆయన వెంకన్నను కోరారు. ప్రొఫెసర్ రంగనాథాచార్యులు తన ప్రారంభోపన్యాసంలో వెంకన్న రచనలు, వాటి ప్రత్యేకతను విశ్లేషించారు. సంపాదకులు కె.శ్రీనివాస్, ప్రముఖ సాహితీవేత్తలు శిలాలోలిత, అంబటి సురేంద్రరాజు, బండి నారాయణస్వామి, ఆర్టిస్ట్ మోహన్, ఖాదర్ మొహియోద్దీన్, సీతారాం తదితరులు వెంకన్న కవిత్వంలోని వివిధ అంశాలను వివరించారు. కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, ప్రతినిధులు ఎక్బాల్, వెంకటేశ్వర్లు, కొండన్న తదితరులు పాల్గొన్నారు. -
బోనమెత్తిన పాలమూరు
జిల్లా కేంద్రంలోని ఆదివారం బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు, పిల్లలు ఉదయం నుంచే బోనాలను సిద్ధం చేశారు. దుర్గామాతకు ప్రతి రూపంగా భావించే గ్రామ దేవతలకు బోనాలతో పాటు కోళ్లు, గొర్రెలు, మేకలను బలిచ్చి నైవేద్యంగా సమర్పించారు. కుర్వినిశెట్టి కాలనీ, రవీంద్రనగర్, కుమ్మరివాడి, బండ్లగేరి, వీరభద్రకాలనీలకు చెందిన మహిళలు సామూహికంగా బోనాలతో తోటమైసమ్మ గుడికి చేరుకున్నారు. పలువురు శివసత్తులు పూనకం నిండారు. అంతకుముందు ఆలయంలో స్వస్తిపుణ్యహవాచనం, లక్షాధారణం, అఖండ ప్రజ్వలనం, ధ్వజాపతాక ఆరోహణ, పంచాభృతసహిత నవరస అభిషేకం, గౌరిదేవీ అష్టోత్తరం, లలితాసహస్రనామాలతో సామూహిక కుంకుమార్చన చేసిన అనంతరం అమ్మవారికి ఒడిబియ్యం నింపారు. -
ప్రైవేట్ ఆస్పత్రిలో శిశువు మృతి
మహబూబ్‌నగర్ క్రైం : జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో ఓ 20 రోజుల శిశువు చికిత్స పొందుతూ మృతి చెందింది. దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బాధితులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే... 20 రోజుల కిత్రం నవాబుపేట మండలం ఫత్తేపూర్‌కు చెందిన మల్లేశ్వరిని కాన్పు కోసం మహబూబ్‌నగర్ పట్టణంలోని సుసృత ప్రజా వైద్యశాలకు భర్త కాశీమయ్యగౌడ్ తీసుకురాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటకే ఆమె కు ఇద్దరు అడపిల్లలున్నారు. దీంతో భార్యాభర్తలతో పాటు బంధువుల సంతోషానికి అవధులులేవు. అయితే మరుసటి రోజు శిశువుకు నిమోనియా వచ్చిందంటూ వైద్యులు చెప్పి మూడురోజుల పాటు చికిత్సలు అందించారు. చివరకు పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో శిశువును నవోదయ ఆస్పత్రికి తరలించారు. శిశువుకు ప్రతిరోజూ రూ.13 వేల చొప్పున చెల్లించి ప్రత్యేక గదిలో ఉంచి వైద్య చికిత్సలు చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే శని వారం ఉదయం తెల్లవారుజామున బాధితులను లేపి మిగతా రూ.30 వేలు చెల్లించాలని నిర్వాహకులు ఒత్తిడి తె చ్చారు. అనుమానం రావడంతో తమ బిడ్డను చూయిస్తేనే డబ్బులు కడతామని చెప్పడంతో శిశువు రాత్రి చనిపోయిందని వారిని సిబ్బంది బయటకు గెంటి వేశారు. ఉదయం విషయం తెలుసుకున్న గ్రామస్తులు, బంధువు లు ఆస్పత్రికి చేరుకుని ఆందోళన చేపట్టారు. శిశువు చనిపోయిన విషయం దాచి రోజు చికిత్సలు చేస్తున్నట్లు నటించి డబ్బులు కట్టించుకున్నారని ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందాడన్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి బాధితులను సముదాయించారు. చివరకు ఆస్పత్రి నిర్వాహాకులతో చర్చించి బాధితులు చెల్లించిన రూ.1.6 లక్షలతో పాటు మరో రూ.20 వేలు అదనంగా ఇ ప్పించి సమస్యను పరిష్కరించి గొడవ సద్దుమణిగించారు.దీంతోవారు మృతశిశువును ఇంటికి తీసుకెళ్లారు. -
విమానాశ్రయానికి కసరత్తు
- జిల్లాలో 1,591 ఎకరాల భూమి గుర్తింపు - ప్రభుత్వానికి నివేదించనున్న జిల్లా యంత్రాంగం - నేడు సీఎం కేసీఆర్ సమీక్షలో చర్చ కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు మొదలైంది. విమానాశ్రయం ఏర్పాటుకు కావాల్సిన భూమిని గుర్తించిన అధికార యంత్రాంగం అదే పనిగా ముందుకు సాగడంతో ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై జిల్లా ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఆదిలాబాద్ పట్టణానికి దగ్గరగా ఉన్న ఖానాపూర్, అనుకుంట, కచ్కంటి, తంతోలి గ్రామాల శివార్లలోని 1,591.45 ఎకరాల స్థలం గుర్తించారు. విమానాశ్రయం ఏర్పాటులో ప్రభుత్వ భూమి కంటే వ్యవసాయ భూమి అధికంగా ఉండడంతో భూములు కోల్పోనున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. అనుకుంట, కచ్కంటి, తంతోలి, ఖానాపూర్ శివారు ప్రాంతాల్లోని ప్రభుత్వ భూమితోపాటు వ్యవసాయ భూమిని గుర్తించగా, కచ్కంటి గ్రామ శివారులోని సర్వే నంబర్లలో ప్రభుత్వ భూమి లేదు. విమానాశ్రయ ఏర్పాటుకు జిల్లా కేంద్రంలో గుర్తించిన స్థలం వివరాల జాబితాను అధికార యంత్రాంగం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లనుంది. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వస్తే గుర్తించిన భూమిని సేకరించవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. భూమి గుర్తింపు ఇలా.. జిల్లా కేంద్రంలో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వ భూమితోపాటు వ్యవసాయ భూమి 1,591.45 ఎకరాలు అధికారులు గుర్తించారు. ఇందులో ప్రభుత్వ భూమి 89.44 ఎకరాలు ఉండగా, వ్యవసాయ భూమి 1,502.01 ఎకరాల ఉంది. అయితే ఖానాపూర్ శివారులోని 29, 68 సర్వే నంబర్లలో 50.20 ఎకరాలు, అనుకుంట గ్రామ శివారులోని 106 సర్వే నంబర్లో 34.04 ఎకరాలు, తంతోలి గ్రామ శివారులోని 44 సర్వే నంబర్లో 5.20 ఎకరాలు, ఖానాపూర్ గ్రామ శివారులోని 9,10,11,20,29,30,31,42 నుంచి 64 సర్వే నంబర్లలోని 431.36 ఎకరాల వ్యవసాయ భూమి, అనుకుంట గ్రామ శివారులోని 1,3 నుంచి 14,75 నుంచి 91 వరకు ఉన్న సర్వే నంబర్లలోని 501.34 ఎకరాల వ్యవసాయ భూమి, కచ్కంటి గ్రామ శివారులోని 37 నుంచి 51 సర్వే నంబర్లలోని 313.24 ఎకరాల వ్యవసాయ భూమి, తంతోలి గ్రామ శివారులోని 34,35, 42 నుంచి 55 సర్వే నంబర్లలో ఉన్న 256.07 ఎకరాల వ్యవసాయ భూమిని అధికారులు గుర్తించారు. ఖానాపూర్, అనుకుంట, కచ్కంటి, తంతోలి నాలుగు గ్రామాల్లో భూములు గుర్తించగా, కచ్కంటి గ్రామ శివారులో గుర్తించిన సర్వే నంబర్లలో మాత్రం ప్రభుత్వ భూమి లేదు. ఆందోళనలో రైతులు.. నేడు సీఎంతో సమీక్ష.. జిల్లా కేంద్రంలో విమానాశ్రయం ఏర్పాటు విషయమై ప్రజల్లో ఆనందం కన్పిస్తున్నా ఏర్పాటులో వ్యవసాయ భూములు కోల్పోయే రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఏర్పాటుకు సుమారు 1,591 ఎకరాల్లో అవసరం కావడంతో పంట భూములు కోల్పోవాల్సి వస్తుంది. తంతోలి, అనుకుంట, కచ్కంటి గ్రామాల రైతులు సుమారు 1,100 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. అయితే ఏర్పాటుకు గుర్తించినంత మాత్రాన భూమి కోల్పోయినట్లు కాదని, అవసరమైతే గుర్తించిన భూమిని సేకరించవచ్చని సంబంధిత అధికారులు చెబుతున్నారు. కాగా, హైదరాబాద్‌లోని మావన వనరుల అభివృద్ధి శిక్షణ కేంద్రంలో సోమవారం జిల్లాల సంయుక్త కలెక్టర్లు, అధికారులతో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరగనుంది. సమావేశంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అంశమైన మొదటగా విమానాశ్రయంపై చర్చించనున్నారు. విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమయ్యే స్థలం గుర్తింపు, భూమి సేకరణకు అనువైన మార్గదర్శకాలు తదితర వాటిపై సీఎంతో చర్చించనున్నారు. -
జలం.. గరళం
జలం మాటున గరళం గొంతులో దిగుతోంది. రక్షితనీరు కరువై ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. కలుషిత నీటితో డయేరియా, టైపాయిడ్, కలరా, కామెర్లు వంటి వ్యాధుల బారినపడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో విషజ్వరాలు, డయేరియా విశ్వరూపం చూపుతున్నాయి. ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. వర్షాకాలంలో ఈ వ్యాధులు మరింత ప్రబలే {పమాదముంది. సాక్షి, కరీంనగర్ : జిల్లాలో కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లు, కోరుట్ల, మెట్పల్లి, సిరిసిల్ల, జగిత్యాల మున్సిపాలి టీలు, వేములవాడ, పెద్దపల్లి, హుస్నాబాద్, హుజూరాబాద్, జమ్మికుంట నగర పంచాయతీలు, 1207 గ్రామ పంచాయతీలున్నాయి. జిల్లాకేంద్రం మొదలు మారుమూల పల్లె వరకు అన్ని చోట్లా తాగునీటిలో ఫ్లోరిన్ అధికంగా ఉంది. సాధారణంగా నీటిలో 0.5 నుంచి 1.5మిల్లీగ్రాముల ఫ్లోరిన్ ఉండాలి. కానీ, 700కు పైగా గ్రామా ల్లో ఫ్లోరిన్ 2మి.గ్రా.పైనఉంది. వాటిలో 200 ఆవాస ప్రాంతాల్లో ఫ్లోరిన్ 3 మి.గ్రా శాతం పైనే ఉంది. కరీంనగర్ శివారు ప్రాంతంలో ఉన్న జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం, బైపాస్ వద్ద ఎల్లమ్మగుడి, విద్యానగర్‌లోని పోలీస్ శిక్షణ కాలేజీ ప్రాంతాల్లో ఫ్లోరిన్ ఎక్కువగా ఉంది. బెజ్జంకి మండలం కాసిం పేట, గుండ్లపల్లి, జంగపల్లి, దాచారం, పోతా రం, భీమదేవరపల్లి మండలం మల్లారం, మాణిక్యాపూర్, రంగయ్యపల్లి, బోయిన్పల్లి మండలం గుండ్రపల్లి, వరదవెల్లి, కొత్తపేట, అనంతపల్లి, చందుర్తి మండలం కిష్టంపేట, ఎనగల్, చిగురుమామిడి మండలం సీతారాంపూర్, చిగురుమామిడి, లంబాడపల్లి, ధర్మారంలో పత్తిపాక, ఎల్కతుర్తిలో తిమ్మాపూర్, ఎల్కతుర్తి, ఇల్లంతకుంటలో తిప్పాపూర్, రహీంఖాన్‌పేట, వల్లంపట్ల, ముస్కానిపేట, గొల్లపల్లి, అనంతారం, వంతడ్పుల, గంభీరావుపేటలో దమ్మన్నపేట, సముద్రాలలింగాపూర్, గంగాధర లో ఉప్పరమల్యాల, నాగిరెడ్డిపూర్, వెంకటయ్యపల్లి, గొల్లపల్లి మండలం గుంజపడుగు, హుస్నాబాద్‌లో అక్కనపేట, జిల్లెలగడ్డ, గుడాటిపల్లి తది తర గ్రామాల్లో ఫ్లోరిన్ శాతం 3మి.గ్రా పైనే ఉంది. నెరవేరని లక్ష్యం జిల్లాలో ఏడు వందలకు పైగా గ్రామాల్లో.. ప్రజలు స్వచ్ఛమైన తాగునీటికి నోచుకోవడం లేదని అధికారిక లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. తాగునీటి నాణ్యత రోజురోజుకు లోపిస్తోంది. జిల్లా కేంద్రంలో ఉన్న ఏకైక నీటి నాణ్యత పర్యవేక్షణ ప్రయోగశాల పేరుకే పరిమితమైంది. ఈ ప్రయోగశాలలో ఇద్దరే ఉద్యోగులు ఉన్నారు. ఒకరు జూనియర్ అసిస్టెంట్ ప్రకాశ్, ఇంకొకరు శాంపిల్ టేకర్ (నమూనాలు సేకరించే వ్యక్తి). వీరిద్దరే జిల్లా అంతటా తిరగాలి. గ్రామాల్లో ఉన్న బావులు, ఓవర్‌హెడ్ ట్యాంకులు, నల్లాలు, బోర్‌వెల్స్ (చేతిపంపులు), చెరువుల నుంచి నీటి నమూనాలు సేకరించాలి. వాటిని జిల్లా కేంద్రానికి తీసుకొచ్చి నాణ్యత పరీక్షించాలి. ప్రతి నెల 60 బ్యాక్టీరియా, 30 కెమికల్ పరీక్షలు నిర్వహించాలనే లక్ష్యం ఉండగా.. సిబ్బంది లేకపోవడంతో రెండు కలిపి 40కి మించడం లేదు. వీరు ఏ ప్రాంతానికి వెళ్లినా ఇక్కడ కార్యాలయానికి తాళమే. ప్రభుత్వం నుంచి వచ్చే నివేదికలపై ఎప్పటికప్పుడు స్పందించాల్సి ఉంటుంది. ఆఫీసు పనితోపాటు రిపోర్టుల కోసం ప్రకాశ్ కార్యాలయానికే పరిమితమయ్యారు. నీటి నమూనా సేకరించే వ్యక్తి నెలంతా తిరిగి పరీ క్షలు నిర్వహించలేకపోతున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలు, ఆస్పత్రులు, ఇతర కార్యాల యాలు నీటిని ఈ ప్రయోగశాలకు తీసుకొచ్చి నాణ్యత పరీక్షలు నిర్వహించుకుంటున్నాయి. వర్షాకాలం కావడంతో కలుషితనీటితో ఇంకా వ్యాధులు ప్రబలే ప్రమాదముంది. సిబ్బంది కొరత : ప్రకాశ్, నీటినాణ్యత పర్యవేక్షణ ప్రయోగశాల సగానికిపైగా గ్రామాల్లో రక్షితనీరు అందడం లేదు. ఆయా గ్రామాల ప్రజలకు ఎన్నోసార్లు చెప్పాం... అయినా వారు అదే నీరు తాగుతున్నారు. నీటినాణ్యత పరీక్ష నిర్వహించే సిబ్బం ది కొరత ఉండడంతోనే ఆశించిన విధంగా పరీక్షలు చేయలేకపోతున్నాం. మరో శాంపిల్ టేకర్, టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, క్లర్క్, కంప్యూటర్ ఆపరేటర్ అవసరమున్నారు. సరిపడా సిబ్బంది ఉంటే.. జిల్లావ్యాప్తంగా నీటి నాణ్యత పరీక్షలు చేసే వీలుంది. -
నిందితుల ఆటకట్టు
వారికి మనుషుల ప్రాణాలంటే లెక్కలేదు.. వెండి ఆభరణాలను అపహరించేందుకు కూలి పనిచేసే మహిళలను లక్ష్యంగా చేసుకున్న ఓ కిరాతకుడు కేవలం మూడు నెలల్లోనే ఏడుగురి హత్య చేసి పోలీసులను ముచ్చెమటలు పెట్టించాడు.. పక్కా పథకం ప్రకారం ఎవరికీ అంతుబట్టని విధంగా హత్యలకు పాల్పడ్డాడు.. ఇతడిని చివరకు పోలీసులు అతి చాకచక్యంగా వల వేసి పట్టుకున్నారు.. ఈ మానవ మృగం చేసిన అకృత్యాలను బట్టబయలు చేశారు.. మరో సంఘటనలో ఓ మహిళ కుదువపెట్టిన తమ ఇంటిని విడిపించుకోవడానికి ఏకంగా ముగ్గురిని హత్య చేసింది.. ఎట్టకేలకు ఆమె ఆటకట్టించారు పోలీసులు.. అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ నాగేంద్రకుమార్, అడిషనల్ ఎస్పీ ప్రకాశ్‌రావుతో కలిసి విలేకరుల సమావేశంలో ఈ కేసుల వివరాలను వెల్లడించారు. - మహబూబ్‌నగర్ క్రైం మహబూబ్‌నగర్ మండలం కోడూరుకు చెందిన 22ఏళ్ల వడ్డె రాజు ఆటో నడుపుకొంటూ జీవించేవాడు. కొన్ని నెలలక్రితం ఆర్థిక ఇబ్బందులతో హైదరాబాద్ నగరానికి వెళ్లి కొన్ని రోజుల పాటు సెక్యూరిటీ గార్డుగా పని చేశాడు. అదే సమయంలో అక్కడి పద్మతో వివాహేతర సంబంధం ఏర్పరచుకుని తిరిగి స్వగ్రామానికి తీసుకొచ్చాడు. అయితే తల్లిదండ్రులు వారిని ఇంట్లో ఉంచుకునేందుకు నిరాకరించడంతో జిల్లా కేంద్రంలోని టీడీగుట్ట ప్రాంతంలో అద్దె ఇంట్లో నివాసం ఉండసాగారు. కొన్ని రోజుల పాటు తన సోదరుడి కి చెందిన ఆటోను నడిపాడు. తిరిగి అతను వాహనం తీసుకెళ్లడంతో రాజుకు మళ్లీ ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో అతడికి దొంగతనం చేయాలనే ఆలోచ న వచ్చింది. దానిని అప్పటికప్పుడే అమలు చేసేందుకు పక్కా ప్రణాళికలు మొదలు పెట్టాడు. ఇందులో భాగంగానే కూలి పనులకు వచ్చే మహిళలను టార్గెట్ చేసుకున్నాడు. దీనికి జిల్లా కేంద్రంలోని తిరుమల థియేటర్‌ను ఎంచుకున్నాడు. కూలి పని కోసం అక్కడికి ప్రతిరోజూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మహిళలను పరిశీలించేవాడు. వారి కాళ్లకు వెండి ఆభరణాలు ఉంటేచాలు నమ్మించి ఆటోలో నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి వారికి మాయమాటలు మద్యం తాగించి బండరాయితో మోది దారుణంగా హత్య చేస్తాడు. ఒంటిపై ఉన్న వెండి ఆభరణాలను దొంగలిచి, మృతదే హాన్ని అడవుల్లో పారవేస్తాడు. ఇలా మూడు నెలల్లోనే ఏడుగురిని హత్య చేశాడు. మొదటగా గత మార్చి 22న హ న్వాడ మండలం వేపూర్‌కు చెందిన దంతపల్లి నర్సమ్మ (35) ను జిల్లా కేంద్రంలోని తిరుమల టాకీస్ వద నుంచి పని ఉందని నిందితుడు రాజు జీపులో ఎక్కించుకుని కోడూర్ శివారులోకి తీసుకెళ్లి హత్య చేసి రెండు వెండి కడియాలను దొంగిలించాడు. 23న మహబూబ్‌నగర్ మండలం వెంకటాపూర్‌కు చెందిన డోకూర్ వెంకటమ్మ (40) ను జిల్లా కేంద్రంలోని అదే టాకీస్ ప్రాంతం నుంచి ఆర్టీసీ బస్సులో మన్యంకొండకు తీసుకెళ్లాడు. అక్కడి గుట్టల్లో మద్యం తాపి రాయితో మోది చంపి నగలను దోచుకున్నాడు. ఏప్రిల్ 27వ తేదీ మధ్యాహ్నం దొడ్డలోనిపల్లికి చెందిన మంజలి శాంతమ్మ (43) ను తన ఆటోలో ఎక్కించుకుని అప్పాయిపల్లి శివారులోని గుట్టలోకి తీసుకెళ్లి చంపి వెండి కడియాలను అపహరించాడు. మే1న జైనల్లీపూర్‌కు చెందిన బియ్యన్ని ఎల్లమ్మ (35) ను బండమీదపల్లి శివారులోని రెడ్డి సేవా సమితి బిల్డింగ్ వెనక ఉన్న గుట్టల ప్రాంతంలోకి తీసుకెళ్లి చంపేశాడు. 18న ఓ గుర్తుతెలియని మహిళను ధర్మాపూర్ సమీపంలోని మదీనా బీఈడీ కళాశాల వెనక వైపునకు తీసుకెళ్లి హత్య చేశాడు. జూన్ 6న నవాబుపేట మండలం చౌడాపూర్కు చెందిన చెన్నమ్మ (35) కూలి పనులకు జిల్లా కేంద్రంలోని పాత బస్టాండు వద్దకు వచ్చింది. ఇదే అదనుగా భావించిన నిందితుడు బైక్‌పై భూత్పూర్ మండలం పాత మొల్గర శివారులోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి కల్లు తాగించి.. హత్య చేసి వెండి నగలను దొంగిలించాడు. 20న హ న్వాడ మండలం కొత్తపేటకు చెందిన పారుపల్లి యాదమ్మ (42) ను నవాబుపేట మండలం కాకర్లపహాడ్ శివారులోని పర్వతాపూర్ మైసమ్మ అడవుల్లోకి తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడు. మరో మహిళపై హత్యాయత్నం : గత ఏప్రిల్ 15న హన్వాడ మండలంలోని కొనగట్టుపల్లికి చెందిన గూడెం అలివేలును ఆటోలో ఎక్కించుకుని జమిస్తాపూర్ శివారులోకి తీసుకెళ్లి బండరాయితో మోదాడు. చనిపోయిందని భావిం చిన రాజు అమె కాళ్ల పట్టీలు, కడియాలను తస్కరించాడు. అనంతరం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని బుధవారం రిమాండ్‌కు తరలిచారు. కేసును ఛేదించిన డీఎస్పీ మల్లికార్జున్, రూరల్ సీఐ లక్ష్మీనారాయణ, ఎస్ఐ గాంధీనాయక్, ఏఎస్ఐ రమేష్‌రెడ్డిని ఎస్పీ అభినందిం రూ.25 వేల క్యాష్ రివార్డును అందజేశారు. నిందితుల వద్ద 320 తులాల వెండి ఆభరణలు ఆటో, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
‘రింగ్’ రింగా..!
అర్థబలం, అంగబలం.. ప్రజాప్రతినిధుల కొండంత అండతో కొందరు వ్యాపారులు మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డారు. ఎక్సైజ్‌శాఖ కొత్త మద్యం పాలసీలోనూ పాత సిండికేట్ కింగ్లే సరికొత్త వ్యూహంతో పాగా వేసేందుకు పావులు కదిపారు. తమకు అనుకూలురు, ఆర్థికంగా పరిపుష్టిగల వారిని చేరదీసి.. రంగంలోకి దించి బంపర్ ఆఫర్ ఇచ్చేశారు..! తమ శక్తియుక్తులను ఉపయోగించి సింగిల్‌టెండర్ పడేలా యత్నించి సఫలమయ్యారు. సోమవారం నిర్వహించే లక్కీ డ్రాలో అదృష్టవంతులెవరో తేలనుంది. ఆ 14 షాపులు వశమయ్యేదెవరికో వెల్లడి కానుంది. మహబూబ్‌నగర్ క్రైం: మద్యం టెండర్ల ప్రక్రియ ముగిసింది. అదృష్టవంతుల జాబితాను మా త్ర మే ప్రకటించనుంది. నేడు(సోమవారం) లక్కీ డ్రా ప్రక్రియకు జిల్లాకేంద్రంలోని అంబేద్క ర్ క ళాభవన్ వేదికకానుంది. మొత్తం 194 మ ద్యం దుకాణాలకు భారీసంఖ్యలో టెండర్లు దా ఖల య్యాయి. కొన్నిప్రాంతాల్లో వ్యాపారులు రింగ్ అయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లా లో మూడు ఎక్సైజ్ ఎస్హెచ్ఓ పరిధిలోని మహబూబ్‌నగర్, గద్వాల, నాగర్‌కర్నూల్‌లో మద్యం దుకాణాలకు టెండరుదారులు పోటీపడ్డారు. గతేడాది 1288 దరఖాస్తులు రాగా, ఈ సారి 2028 వచ్చాయి. దీంతో గతేడాది కంటే 40 శా తం పెరిగాయి. టెండర్లలో సిండికేట్ల హవా కొ నసాగింది. ధరావత్తు రూ.25వేలు భరిస్తే షాపు నిర్ధిష్ట ధరలో 10 శాతం సొమ్మును డిపాజిట్ సిండికేట్ కంపెనీ భరించే విధంగా ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. అంతేకాకుండా వ్యాపారంలో 10 శాతం వాటా ఇస్తామని హామీ ఇస్తున్నారు. బొంరాస్‌పేట, దోమలపెంట, మన్ననూర్, గ ట్టు, ఖిల్లాఘనపూర్‌లో రెండు, పెద్దమందడి, అ మరచింత, తుంకిమెట్లలోని మద్యం దుకాణాలను సింగిల్ టెండర్ల దాఖలుదారులు దక్కిం చుకున్నా రు. జిల్లాలో అత్యధిక శాతం షాద్నగ ర్ డివిజన్ పరిధిలోని 21 మద్యం దుకాణాలకు భారీసంఖ్యలో 256 టెండర్లు వేశారు. అత్యల్పంగా వనపర్తి పరిధిలోని 8 షాపులకు 38 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అలాగే జిల్లా కేం ద్రంలోని నాలుగు దుకాణాలతో పాటు వివిధ ప్రాంతాల్లో 9 వైన్స్‌షాపులకు సింగిల్ దరాఖాస్తు మాత్రమే వచ్చింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని టెండర్‌దారులు వేసిన షాపులు వారికి హస్తగతమైనట్లే.. 194 మద్యం దుకాణాలకు ఎక్సైజ్ అధికారులు టెండర్లు ఆహ్వానించారు. టెండర్ల దరఖాస్తు ఫీజును రూ.25వేలుగా నిర్ణయించారు. ఈ మొత్తం వైన్స్‌షాపులకు 2028 టెండర్లు వ చ్చాయి. దీన్నివల్ల ప్రభుత్వానికి రూ.5.70కోట్ల ఆదాయం సమకూరిందని డిప్యూటీ ఎక్సైజ్‌కమిషనర్ గోపాలకృష్ణ తెలిపారు. శ్లాబ్ విధానంలో ఇలా.. జిల్లాలో మూడు శ్లాబ్ విధానంలో లెసైన్స్ ఫీజులను నిర్ణయించారు. 10వేల జనభా ఉన్న చోట రూ.32.50లక్షలుగా నిర్ణయించారు. ఈ కేటాగిరిలో మహబూబ్‌నగర్ యూనిట్ పరిధిలోని షాదనగర్, జడ్చర్ల, కొడంగల్‌లో 25 దుకాణాలకు 324 దరఖాస్తులొచ్చాయి. 10 వేల నుంచి 50వేల జనాభా ఉన్న చోట రూ.34 లక్షలుగా నిర్ణయించారు. ఈ విభాగంలో 18 మద్యం దుకాణాలకు 125 టెండర్లు దాఖలయ్యాయి. 50 వేల నుంచి 3 లక్షల జనభా కలిగి ఉన్న ప్రాంతంలో 25 దుకాణాలకు 219 దరాఖాస్తులు వచ్చాయి. డివిజన్ల వారీగా.. గద్వాల డివిజన్ పరిధిలోని.. గద్వాల యూనిట్ పరిధిలోని గద్వాల, నారాయణపేట, వనపర్తి, కొత్తకోట, అలంపూర్, ఆత్మకూర్‌లో రూ.32.50 లక్షలుగా నిర్ణయించిన ప్రాంతంలో 21 దుకాణాలకు 271 టెండర్లు వచ్చాయి. రూ.34లక్షల కేటాగిరిలో 34 మద్యం దుకాణాలకు 320 దరఖాస్తులొచ్చాయి. రూ.42లక్షల లెసైన్స్‌ఫీజు నిర్ణాయించిన వాటిలో 13 దుకాణాలకు 92 దరఖాస్తులు వచ్చాయి. నాగర్‌కర్నూల్ డివిజన్.. రూ.32.50లక్షల ఫీజు నిర్ణయించిన ప్రాంతాల్లో 27 దుకాణాలకు 252 దరఖాస్తులు రాగా, 34 లక్షలుగా నిర్ధేశించినచోట 34 వైన్స్‌షాపులకు 326 టెండర్లు దాఖలయ్యాయి. నేడు లక్కీడిప్‌కు ఏర్పాట్లు ఇదివరకే టెండర్ల దాఖలు ప్రక్రియ ముగియడంతో నేడు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్‌లో లక్కీడిప్ తీసేందుకు సంబంధిత ఎక్సైజ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. టెండర్ వేసిన వారినే లోపలికి అనుతించనున్నారు. హాల్లో మూడు ప్రత్యేకటెండర్ పెట్టెలను ఏర్పాటుచేసి ఏ డివిజన్ వారికి సంబంధించిన టెండర్లను అక్కడే తీసేవిధంగా చర్యలు చేపట్టారు. డ్రాలో విజేతలను కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ ఆధ్వర్యంలో ప్రకటిస్తారు. ముందుగా సింగిల్‌టెండర్ వేసినవారికి దుకాణాలను కేటాయిస్తారు. ఒక వ్యక్తికి ఒకే షాప్ కేటాయించనున్నారు. -
‘పరీక్ష’ పరుగు
మహబూబ్‌నగర్ విద్యావిభాగం/ షాద్‌నగర్/వనవర్తి/ జడ్చర్ల/ గద్వాల : జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన డీ-సెట్ 2014 (డైట్‌సెట్) ప్రవేశపరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లాకేంద్రంలో 114 కేంద్రాల్లో, షాద్‌నగర్‌లో 13, జడ్చర్లలో 12, గద్వాలలో 19, వనపర్తిలో 22 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. తెలుగు మీడియంలో 41,942 మంది, ఉర్దూ మీడియంలో 1195 మంది మొత్తంగా 43,037 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావల్సి ఉండగా తెలుగుమీడియంలో 39,145 మంది, ఉర్దూమీడియంలో 1,131 మంది మొత్తం 40,276 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. 2,889 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 10.30 గంటలకు పరీక్ష ప్రారంభం అవ్వగా కొందరు తెల్లవారుజామునే కేంద్రాలకు చేరుకున్నారు. దూరప్రాంతాలవారు ఒకరోజు ముందుగా చేరుకోగా ట్రాఫిక్ అంతరాయం, ఇతర కారణాలతో ఆలస్యంగా వచ్చిన వారు ఎంత వేడుకున్నా అధికారులు వారిని అనుమతించలేదు. కేంద్రాల వారీగా వివరాలను పరిశీలిస్తే.. జిల్లాకేంద్రంలో 27,360 మంది అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 25,975 మంది హాజరవ్వగా 1385 మంది గైర్హాజరయ్యారు. అలాగే జడ్చర్లలో 2880మంది విద్యార్థులకు 2715మంది పరీక్షలు రాయగా 165మంది గైర్హాజర య్యారు. ఎంఈఓ కృష్ణయ్య కేంద్రాలను సందర్శించారు. వనపర్తిలో 22 కేంద్రాలను ఏర్పాటు చేయగా ఒక్కొక్క కేంద్రంలో 240 మంది చొప్పున మొత్తం 5117 మంది అభ్యర్థులకు గాను 4786 మంది హాజరు కాగా 331 మంది గైర్హాజరయ్యారు. రాష్ట్ర పరిశీలకులు గోవిందరాజులు పరీక్షలు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా షాద్‌నగర్‌లో 3120మందికి 2859 అభ్యర్థులు హాజరవ్వగా 261మంది గైర్హాజరయ్యారు. నల్గొండజిల్లా డిప్యూటీ డీఈఓ రాంరెడ్డి పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించారు. గద్వాలలో 4560 అభ్యర్థులకు, 4022 మంది హాజరయ్యారు. ఇదిలావుండగా వనపర్తి పట్టణంలో నలుగురు అంధులు సహాయకుల సహకారంతో పరీక్షలు రాశారు. జిల్లా కేంద్రంలోని పలు పరీక్షా కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రమోహన్ తనిఖీ చేశారు. రాష్ట్ర పరిశీలకుడు రవికాంత్‌రావు జిల్లాలోని పలు కేంద్రాలను పర్యవేక్షించారు. అన్ని కేంద్రాల్లోనూ భారీ బందోబస్తు మధ్య పరీక్షలు జరిగాయి. -
7 గంటలకు ఎసరు
ఖరీఫ్‌కు ప్రారంభంలోనే జిల్లాలో ఎడాపెడా విద్యుత్‌కోతలు మొదలయ్యాయి. వ్యవసాయానికి ఏడుగంటలపాటు త్రీఫేజ్ కరెంట్‌ను సరఫరా చేయాల్సిన అధికారులు గంట తగ్గించారు. వర్షాలు కురియకపోవడంతో జలవిద్యుదుత్పత్తి నిలిచిపోయిందన్న కారణంతో విద్యుత్తుశాఖ కోతలకు శ్రీకారం చుట్టింది. దీంతో క రిగేట్లను సిద్ధంచేసుకుని.. నాట్ల వేసేందుకు పూనుకుంటున్న రైతన్నలు దిక్కుతోచనిస్థితిలో పడ్డారు. పాలమూరు: ట్రాన్స్‌కో అధికారులు కరెంట్కోతలను పకడ్బందీగా అమలుచేస్తున్నారు. జిల్లా కేంద్రంలో గృహావసరాలకోసం రోజులో గంటపాటు విద్యుత్తు కోత విధిస్తున్నట్లు చెబుతున్నా.. అంతకు రెట్టింపు సమయం విద్యుత్‌కోతను అమలుచేస్తున్నారు. పట్టణాలు, మండల కేంద్రాలు, విద్యుత్ ఉపకేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో ఉదయం ఓ గంట, సాయంత్రం మరో గంట మొత్తం రెండుగంటల పాటు విద్యుత్తు సరఫరా నిలిపేస్తున్నారు. వీటిపరిధిలో నాలుగు గంటలకు పైగా అప్రకటిత విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. గ్రామీణప్రాంతాల్లో ఈ కోతల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఎప్పుడు కరెంట్ ఉంటుందో.. ఎప్పుడు తీస్తారో తెలియని అయోమయ పరిస్థితిలో జనం ఇబ్బంది పడాల్సి వస్తోంది. జిల్లా, పట్టణ, మండల, విద్యుత్తు ఉపకేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ఈ అధికారిక కోతలకు అదనంగా అప్రకటిత కోతలు విధిస్తున్నారు. ఖరీఫ్నాట్లకు సమాయత్తం జిల్లాలో మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్, ‘పేట’ డివిజన్ల పరిధిలో రైతులు ఖరీఫ్ వరినాట్లకు సిద్ధమయ్యారు. తుకాలు పోసుకుని నాట్లకు రెడీ అవుతున్నారు. ఎరువులను సమకూర్చుకుంటున్నారు. వేసవి ఎండల తీవ్రతకు కరెంట్ కోతలు తోడవడంతో రైతులకు దిక్కుతోచనిపరిస్థితి ఎదురవుతోంది. కరిగెట్లకు వట్టిపారిపోవడంతో మళ్లీ తడిపేందుకు రైతులను కరెంట్‌కోతలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఏడు గంటలపాటు నిరంతర విద్యుత్‌ను సరఫరా చేయాల్సి ఉండగా.. అందులో గంట సమయాన్ని తగ్గించి, అదీ రెండు విడతలుగా అందిస్తున్నారు. వ్యవసాయ రంగానికి ఇచ్చే విద్యుత్‌ను ‘ఏ’, ‘బీ’, ‘సీ’ గ్రూపులుగా విభజించి సరఫరా చేస్తున్నారు. ‘ఏ’ గ్రూప్‌లో ఉదయం 4 నుంచి 8గంటల వరకు, రాత్రి 10 నుంచి 12 గంటల వరకు, ‘బీ’ గ్రూప్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అర్ధరాత్రి 12 నుంచి 2 గంటల వరకు, ‘సీ’ గ్రూప్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, రాత్రి 1 నుంచి ఉదయం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా చేయనున్నారు. వర్షాలు కురియకపోవడంతో రైతులు ఇప్పటివరకు వ్యవసాయభూముల్లో విత్తనాలు వేసుకోలేదు. దీంతో, తమకు ప్రస్తుతం విద్యుత్ అవసరంలేదని, పంటలు వేసుకున్న తర్వాత ఏడుగంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను అదీ పగటిపూట ఇవ్వాలని అధికారులను కోరుతున్నారు. జిల్లాలో అధికారిక కోతలను విధించినప్పటికీ.. అప్రకటిత విద్యుత్ కోతలను నిలువరించి, ఉష్ణతాపం నుంచి ఆదుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. -
నేటి నుంచి పాలిటెక్నిక్ కౌన్సెలింగ్
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశానికి పాలిసెట్-2014 కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం ప్రారంభం కానుంది. ఇందుకోసం జిల్లా కేంద్రంలో రెండు హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పాలిసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా సోమవారం నుంచి ఈనెల 16వ తేదీ వరకు విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. తొలిరోజు ఒకటి నుంచి 20 వేల ర్యాంకు వరకూ సర్టిఫికెట్ల పరిశీలన జరుగనుంది. పాలిసెట్ ర్యాంకర్లు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఎక్కడైనా హాజరు కావచ్చు. శారీరక వికలాంగులు, వినికిడి లోపం కలవారు, ఎన్సీసీ, స్పోర్ట్స్, ఆంగ్లో ఇండియన్ వంటి ప్రత్యేక విభాగాలకు చెందిన విద్యార్థులు హైదరాబాద్‌లోని సాంకేతిక విద్యాభవన్‌లో జరిగే సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలి. పాలిసెట్-2014 సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ కౌన్సిలింగ్‌కు గుంటూరు నగరంలో గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల, నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎస్టీ కేటగిరీ విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు గుజ్జనగుండ్లలోని పాలిటెక్నిక్ కళాశాలలో ర్యాంకుల వారీగా ఆయా తేదీల్లో హాజరు కావాల్సి ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియను ఆయా హెల్ప్‌లైన్ కేంద్రాల వారీగా కో-ఆర్డినేటర్లు జీఎంసీ కేశవరావు (గుజ్జనగుండ్ల), ఎ.అరోజిరాణి (నల్లపాడు) పర్యవేక్షించనున్నారు. తీసుకురావాల్సిన ధ్రువపత్రాలు పాలిసెట్ సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యే విద్యార్థులు తమవెంట హాల్ టికెట్, ర్యాంకు కార్డు, 10వ తరగతి మార్కుల జాబితా, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ స్టడీ సర్టిఫికెట్లు, టీసీ, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు ఒరిజినల్, జిరాక్స్ కాపీలను వెంట తీసుకురావాలి. సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యే విద్యార్థుల్లో ఓసీ, బీసీ అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.300, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు ఠీఠీఠీ.ఞౌడఛ్ఛ్టి2014.జీఛి.జీ వెబ్సైట్లో సందర్శించాలి. ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల పరిశీలన జరిగే తేదీలు గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో.. 9వ తేదీన 01 నుంచి 10,000 లోపు ర్యాంకుల వారు హాజరు కావాలి. 10న 20,001 నుంచి 30,000, 11న 40,001 నుంచి 50,000, 12న 60,001 నుంచి 70,000, 13న 80,001 నుంచి 92,000, 14న 1,05.001 నుంచి 1,17,000, 15న 1,30,001 నుంచి 1,42,000, 16న 1,55,001 నుంచి 1,62,000 ర్యాంకు గల విద్యార్థులు హాజరు కావాలి. నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటె క్నిక్ కళాశాలలో... 9వ తేదీన 10,001 నుంచి 20,000, 10న 30,001 నుంచి 40,000, 11న 50,001 నుంచి 60,000, 12న 70,001 నుంచి 80,000, 13న 92,001 నుంచి 1,05,000, 14న 1,17,001 నుంచి 1,30,000, 15న 1,42,001 నుంచి 1,55,000, 16న 1,62,001 ఆపై చివరి ర్యాంకు వరకు గల విద్యార్థులు హాజరుకావాలి. వెబ్ కౌన్సిలింగ్ జరిగే తేదీలు.. సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన విద్యార్థులు ఈనెల 12వ తేదీ నుంచి17వ తేదీ వరకు కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఉద్దేశించిన వెబ్ కౌన్సెలింగ్‌లో హాజరుకావాల్సి ఉంది. ఇందుకు హెల్ప్‌లైన్ కేంద్రాలతో పాటు ఇంటర్నెట్ సెంటర్లలో హాజరుకావచ్చు. 12,13 తేదీల్లో ఒకటి నుంచి 50 వేల ర్యాంకు, 14,15 తేదీల్లో 50,001 నుంచి 1,20,000 వరకు, 16,17 తేదీల్లో 1,20,001 నుంచి ఆపై చివరి ర్యాంకు వరకు గల విద్యార్థులు హాజరవ్వాలి. -
బదిలీలకు రంగం సిద్ధం!
జిల్లా పోలీస్‌శాఖలో కొంతకాలంగా ఎదురుచూస్తున్న బదిలీలకు రంగం సిద్ధమైంది. దీంతో పోస్టింగ్‌ల కోసం అధికారులు నేతల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. తమకు నచ్చిన స్టేషన్లో అవకాశం కోరుతూ పైరవీలు మొదలుపెట్టారు. రాజధాని స్థారుులో తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జిల్లాలో వివిధ పోలీస్స్టేషన్లలో పనిచేస్తున్న 180 మందికిపైగా కానిస్టేబుళ్ల ఉద్యోగకాలం పూర్తకావడంతో వారికి బదిలీలు తప్పనిసరైంది. ఇప్పటికే బదిలీలకు అవకాశమున్న వారు తమకు నచ్చిన మూడు పోలీస్స్టేషన్లు ఎంపిక చేసుకుని దరఖాస్తు చేసుకోవాలని ఉన్నతాధికారులు సూచించినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం కానిస్టేబుళ్లు ర్యాండమ్‌గా గ్రామీణ పోలీస్స్టేషన్లు, నగర పోలీస్స్టేషన్లలో పనిచేయాలి. ఎక్కువగా రూరల్ ప్రాంతాలు, నక్సల్స్ ప్రభావితప్రాంతాల్లో పనిచేసిన వారికి నగరాల్లో పనిచేసే అవకాశముంది. అయితే కొన్నేళ్లుగా జరుగుతున్న బదిలీల్లో రూరల్‌లో పని చేసేవారు మరో రూరల్ ప్రాంతానికి బదిలీలు జరుగుతుండగా.. నగరాల్లో పనిచేస్తున్న వారు ఇక్కడే పాతుకుపోతున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న వారు ఇక్కడే కానిస్టేబుల్‌గా చేరి ఇక్కడే ఏఎస్సైలుగా పదోన్నతి పొందిన వారూ ఉన్నారు. సుమారు 15 ఏళ్లుగా ఒక పోలీస్‌స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు మారుతూ జిల్లా కేంద్రంలోనే పాతుకుపోతున్నారు. వీరు స్టేషన్లలో కీలకంగా మారి నాయకులు, అధికారులకు అన్ని పనులు చక్కబెడుతున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో వారిపై ఎన్ని ఆరోపణలు వచ్చినా బదిలీలు చేయకుండా అక్కడే ఉంచడం.. బదిలీ చేసినా అటాచ్డ్ పేరుతో మళ్లీ నగరానికి చేరడం పరిపాటిగా మారింది. తీరు మారని అధికారులు.. ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా అధికారుల బదిలీలు జరిగాయి. అయితే గతంలో మాదిరిగా మార్పిడి విధానంలో కాకుండా జంబ్లింగ్ పద్ధతిలో బదిలీలు చేశారు. జిల్లా నుంచి ఇతర జిల్లాలకు బదిలీ అయిన పలువురు అధికారులు మళ్లీ జిల్లాకు రావడానికి వారికి ఉన్న పరిచయాలతో నేతల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. గతంలో పలువురు నాయకులు, అధికారులు పైరవీలకు పెద్దపీట వేసి సమర్థులైన పలువురు అధికారులను లూప్‌లైన్ పోస్టింగ్‌లకు పంపించారనే ఆరోపణలున్నాయి. ఏడాది క్రితం పలువురు ఎస్సైల బదిలీలు జరిగాయి. వీరిలో చాలామంది వీఆర్, అప్రాధాన్యత పోస్టులు, వెయిటింగ్లో ఉన్నారు. ఇక ప్రస్తుతం బదిలీలకు రంగం సిద్ధం చేశారని తెలుసుకున్న పలువురు అధికారులు నాయకులతో అనుకున్న స్థానానికి బదిలీ చేయించుకునేందుకు యత్నిస్తున ్నట్లు తెలిసింది. తాజాగా కొత్తగా ప్రభుత్వం ఏర్పాటుచేయడంతో గతంలో పని చేసినట్లుగా పైరవీలకు పలువురు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పలువురు అధికారులు పనితీరు కంటే నాయకుల ప్రసన్నం చేసుకోవడానికే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పోస్టు కోసం పోటాపోటీ.. కరీంనగర్ సబ్‌డివిజన్‌లో ఉన్న ఓ పోలీస్‌స్టేషన్ పోస్టింగ్ కోసం 8మంది ప్రయత్నాలు చేస్తుండగా.. ఇదే డివిజన్లోని మరో పోలీస్‌స్టేషన్‌కు 12మంది వరకు పోటీ పడుతున్నారని ప్రచారం జరుగుతోంది. సీఐల పోస్టింగ్ కోసమైతే ఇతర జిల్లాలో పనిచేస్తున్న వారితోపాటు జిల్లాలోని పలువురు సీఐలు రాజధాని స్థాయిలో పైరవీలు ప్రారంభించారు. గతంలోనూ ఇదే విధంగా పైరవీలకు పెద్దపీట వేయడంతో పలువురు సమర్థవంతమైన అధికారులు విధిలేని పరిస్థితుల్లో నేతల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పైరవీలకు పెద్దపీట వేయకుండా పనితీరుకు పెద్దపీట వేయాలని ప్రజలు కోరుతున్నారు. నివేదికలు సిద్ధం పలువురు నాయకులు కొత్తగా ఎన్నిక కావడం.. కొత్తరాష్ట్రం కావడంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు సేవచేయాలంటే పలువురు సమర్థులైన అధికారులు అవసరం. దీంతో పలువురు నాయకులు అధికారులకు సంబంధించి సమాచారంతో నివేదికలు సిద్ధం చేస్తున్నారని సమాచారం. దీని ఆధారంగా బదిలీలు చేయాలని కోరుతున్నారని తెలిసింది. ఉన్నతాధికారులు కూడా... ప్రస్తుతం జిల్లాలో పని చేస్తున్న పలువురు ఉన్నతాధికారుల బదిలీలు కూడా జరగవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఓఎస్డీ సుబ్బారాయుడు ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు వెళ్లిపోతుండగా.. మరో ఇద్దరు ఉన్నతాధికారులతోపాటు ముగ్గురు డీఎస్పీలు ఆంధ్రప్రదేశ్ క్యాడర్ వెళ్లే అవకాశాలున్నాయని సమాచారం. అయితే వీటికి సంబంధించి స్పష్టత మరో పదిరోజుల్లో వెలువడే అవకాశాలున్నాయని తెలిసింది. దీంతో కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకూ పెద్ద ఎత్తు బదిలీలు జరుగుతాయనే ప్రచారం ఉంది. -
ఏమవుతుందో..!
ప్రొద్దుటూరు టౌన్, న్యూస్‌లైన్: ఆమ్వే సీఈఓ అరెస్టుతో జిల్లాలో కుప్పలు తెప్పలుగా ఉన్న ఏజెంట్లు ఉలిక్కి పడ్డారు. ఎక్కడ తమ పేర్లు బయట పడి అరెస్టు చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. కర్నూలు జిల్లా పోలీసులు ఆమ్వే సీఈఓ విలియంను బుధవారం అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచగా 14 రోజుల రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. విలియంను కడప కేంద్ర కారాగారానికి తరలించారు. దీంతో జిల్లాలోని ఆమ్వే ఏజెంట్లలో ఆందోళన మొదలైంది. జిల్లా కేంద్రంలో ఆమ్వే కార్యాలయం ఉండటం, తిరుపతిలో ఆమ్వే స్టోర్ రూమ్ ఉండటంతో వివిధ హోదాల్లో ఉద్యోగాల్లో ఉన్న వారితోపాటు పోలీసు శాఖలోని చాలా మంది సిబ్బంది ఆమ్వేలో చేరారు. తిరుపతి, కడప, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల తదితర ప్రాంతాల్లో ఆమ్వే ఏజెంట్లు సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు తిరుపతి, అనంతపురం తదితర ప్రాంతాల నుంచి గోల్డ్, సిల్వర్ స్టేజీలలో ఉన్న ఏజెంట్లు వస్తుంటారు. ఆమ్వేలో చేరడంతోపాటు మరికొందరిని చేర్పిస్తే కమీషన్ల రూపంలో డబ్బులు వస్తాయని పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో చాలా మంది నిరుద్యోగులు ఇందులో చేరారు. మొదట్లో రూ.5వేలు చెల్లించి మరో ముగ్గురిని చేర్పిస్తే కొంత కమీషన్ రూపంలో వచ్చేది. దీని తర్వాత ఆమ్వే ప్రొడక్ట్స్ ఇన్ని పాయింట్లకు కొనుగోలు చేయాలన్న నిబంధన కూడా ఉండేది. ఈ విధంగా చేస్తూ పోతే సిల్వర్, గోల్డ్, ప్లాటినం తదితర స్టేజిలు మారుతూ పోతే నెలకు రూ.30వేల నుంచి రూ.లక్ష వరకు సంబంధిత స్టేజీలలో ఉన్న ఏజెంట్ల అకౌంట్లలో జమ అయ్యేవి. ఈ విధంగా జిల్లాలో వందలాది మంది ఆమ్వేలో ఏజెంట్లుగా మారారు. వీరికి ఆమ్వే బిజినెస్ ఓనర్ కార్డులు కూడా ఆమ్వే సంస్థ నుంచి ఏజెంట్లకు అందాయి. ఈ కార్డులను తీసుకెళితే ఆమ్వే స్టోర్ రూమ్‌లలో వారి ఏడీఏ నెంబర్ ఆధారంగా డిస్కౌంట్ అందిస్తారు. ఈ విధంగా చేరిన వారిలో చాలా మంది ప్రతి నెల ఆమ్వే ప్రొడక్ట్స్ తీసుకుని అమ్ముకోలేక మధ్యలోనే వదలి డబ్బులు పోగొట్టుకున్నారు. ఎస్పీ హెచ్చరించినా కొనసాగుతున్న వ్యాపారం ఆమ్వేలో చేరవద్దని చైన్లింకింగ్ స్కీంలపై కేసులు నమోదు చేస్తున్నామని జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ స్వయంగా ప్రకటించినా జిల్లాలో వ్యాపారం కొనసాగుతోంది. ఈ వ్యాపారం చేస్తున్నవారిలో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్న వారి సతీమణులే ఎక్కువగా ఉన్నారు. అన్ని శాఖల్లో కూడా ఆమ్వే ఏజెంట్లు కుప్పలుతెప్పలుగా ఉన్నారు. వీరందరూ ఇప్పుడు వ్యాపారాన్ని కొనసాగించాలా వద్దా అన్న సందిగ్దంలో ఉన్నారు. -
లెక్కింపు..తీరిదీ..!
కలెక్టరేట్, న్యూస్‌లైన్: అందరు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపును ఈనెల 16వ తేదీ ఉదయం 8గంటలకు జిల్లా కేంద్రంలోని జేపిఎన్‌సి కళశాలలో చేపట్టనున్నారు. ఇందుకుగాను మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల లెక్కింపు కేంద్రాల వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బ్యారికేడ్లను నిర్మించారు. ఈ సారి లెక్కింపు పక్రియ అంతటిని ఆన్లైన్లో పరిశీలించేలా ప్రతీ టేబుల్‌కు ఆన్లైన్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఇక మినిట్ టూ మినిట్‌ను అభ్యర్థులకు ఏజెంట్లను తెలియజేస్తూ, పక్రియ అంతటిని రికార్డు చేయనున్నారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లు... పోస్టల్ బ్యాలెట్లను లెక్కించేందుకు ఏడు టేబుళ్లను ఏర్పాటు చేశారు. తొలుత వీటిని లెక్కిం చాక ఈవీఎంల ద్వారా గణన ప్రారంభమవుతుంది. ఇది 7రౌండ్లలో చేపడ్తారు. ఇందుకు సంబంధించి నియమించిన ప్రత్యేక సిబ్బందికి గురువారం మధ్యాహ్నం స్థానిక రెవెన్యూ సమావేశ మందిరంలో శిక్షణ నిర్వహించారు. ఫలితాలు ఆలస్యమయ్యేనా... గతంలో మాదిరి కాకుండా ఈమారు లెక్కింపు ప్రక్రియను 14టేబుళ్ల నుంచి 7టేబుళ్లకు కుదించడంతో ఫలితాల వెల్లడి అలస్యం కానుంది. ఈ సారి అసెంబ్లీ నియోజకవర్గాలకు 7, పార్లమెంట్‌కు 7టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రకారం ప్రతీ నియోజకవర్గానికీ 34నుంచి 36రౌండ్లు రానున్నాయి. ప్రతీ రౌండ్‌ను 15 నిముషాల్లో పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రకారం 6గంటల తరువాతే తుది ఫలితాలు వెల్లడవుతాయి. గతంలో అయితే 14టేబుళ్లు ఉండడంతో మూడు గంటల్లో ఫలితాలు వెల్లడయ్యేవి. ఈ విషయంపై ఇటీవల నిర్వహించిన రాజకీయ పార్టీ నేతల సమావేశంలో నేతలంతా అభ్యంతరాల్ని వ్యక్తం చేసినా ఎన్నికల కమిషన్ ఆదేశాలంటూ అధికారులు సర్ది చెప్పారు. లెక్కింపు వేళలను దృష్టిలో ఉంచుకొని అక్కడకు అభ్యర్థులు, ఏజెంట్లతోపాటు, ఇతర సిబ్బంది అందరికి అధికారులు టిఫిన్, బోజన సదుపాయాలను కల్పించనున్నారు. సిబ్బంది కేటాయింపు ఇలా.. ప్రతీ టేబుల్‌కు కౌంటింగ్ సూపర్‌వైజర్‌తోపాటు, ఇద్దరు అసిస్టెంట్ సూపర్వైజర్లు, మైక్రో అబ్జర్వర్, ఈవీఎంల ప్రత్యేక ఇంజనీర్లు (ఈసిఐఎల్)కు చెందిన వారితోపాటు, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, ఇలా మొత్తం 250మందికి పైగా నియమించారు. వీరికి ఇటీవలే శిక్షణ పూర్తిచేశారు. ఎప్పటికప్పుడు నివేదికలు.. ప్రతీ రౌండ్లో చేపట్టిన లెక్కింపు వివరాలను అభ్యర్థులకు, పాల్గొన్న ఏజెంట్లకు అందించ నున్నారు. దీనికోసం జిరాక్స్ మిషన్లు, కంప్యూటర్లను సిద్దం చేశారు. కౌంటింగ్‌కు సహ కరించండి ఈనెల 16న చేపట్టే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ రాజకీయ పార్టీల నేతలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం తన చాంబర్లో అన్ని రాజకీయ పార్టీల నేతలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను పక డ్బందీగా చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు, నేర చరిత్ర కలిగిన వారు కౌంటింగ్ ఏజెంట్లుగా లేకుండా చూసుకోవాలన్నారు. ఉదయం ఏడు గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు ఏజెంట్లు చేరుకోవాలని, సమయానికి స్ట్రాంగ్ రూంల్లోంచి ఈవీఎంలను బందోబస్తు మధ్య లెక్కింపు కేంద్రాలకు తరలిస్తామన్నారు. లెక్కింపు సమయంలో ముందుగా పోలైన ఓట్లను తనిఖీ చేసుకోవాలన్నారు. సిబ్బందికి అన్ని విధాలుగా అవగాహనలు కల్పించామని, ఏజెంట్లకు కూడా పూర్తిగా అవగాహన కల్పించి కౌంటింగ్‌కు పంపించాలని సూచించారు. ఈసీ ఆదేశాల మేరకు కౌంటింగ్‌కు ఏడు టేబుళ్లను ఏర్పాటు చేశామని, 30 రౌండ్లలో లెక్కింపు ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. కౌంటింగ్ పూర్తయ్యేవరకు ఏజెంట్లు బయటకు వెళ్లేది లేదన్నారు. కార్యక్రమంలో జేసీ ఎల్.శర్మణ్, ట్రైనీ కలెక్టర్ విజయరామరాజు, డీఆర్వో రాంకిషన్, అన్ని రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు. -
కాసులిస్తేనే కాన్పు..!
జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో ప్యాకేజీల దోపిడీ జరుగుతోంది. కాన్పుకింత... డ్రెస్సింగ్‌కు ఇంత... అంటూ ధరల పట్టికలాగా ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. ఇవ్వనివారి పట్ల మానవత్వం మరిచిపోయి హీనంగా ప్రవర్తిస్తున్నారు. ప్రసవం కోసం వచ్చే గర్భిణులు ఆస్పత్రిలో అడుగుపెట్టినప్పటినుంచి తిరిగి వెళ్లేవరకూ అడుగడుగునా చేయి తడపాల్సిందే. కరీంనగర్ హెల్త్, న్యూస్‌లైన్ : జిల్లాకేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో వైద్యసేవలు మృగ్యమయ్యాయి. గర్భిణులు, బాలింత పట్ల పాశవికంగా ప్రవర్తిస్తున్నారు. సేవకింత అంటూ డిమాండ్ చేస్తున్నారు. వారడిగినంతా ఇవ్వలేదో... ఇక అంతే సంగతులు. కనీసం పక్కకు కూడా జరపరు. ఏ పనిచేస్తే ఎంతెంత వసూలు చేయాలో డ్యూటీ డాక్టర్లు, సిబ్బంది ధరలు నిర్ణయిస్తున్నారు. గర్భిణీ ఆస్పత్రిలో చేరగానే వివరాలు ఆరా తీస్తూ ఆయాలు మెల్లగా మాటలు కలుపుతారు. మీరు కాస్త చూసుకుంటామంటే(చేయి తడుపుతామంటే) చెప్పండి నేనే అన్నీ దగ్గరుండి చూసుకుంటానంటూ నమ్మబలుకుతారు. వచ్చినవారు ఓకే అంటే ఈ విషయం డాక్టరమ్మ చెవిలో చేరుతుంది. ముందుగా వైద్యులకు రూ.2 వేలు, నర్సులకు రూ.వెయ్యి, ఆయాలకు రూ.500... ఇలా ప్యాకేజీ వసూలు చేస్తున్నారు. ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోయినా దురుసుగా మాట్లాడుతున్నారు. తాము లేనివారమని, అంత ఇవ్వలేమని అంటే... వారి పని అంతే సంగతులు. ‘అట్లాంటోళ్లు ఇక్కడికెందుకు వచ్చిండ్రు... మా పానాలు తీయడానికి’ అంటూ సూటిపోటి మాటలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యురాలు వచ్చాక అన్నీ చూసుకుంటుందని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఆపరేషన్ అయ్యాక... పక్క జరిపినా... దుస్తులు మార్చినా రూ.100 సమర్పించుకోవాల్సిందే. ఇవ్వని పేషెంట్ల వైపు వారు రానే రారు. కాసులిస్తేనే కాన్పు ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలనే ఉద్దేశంతో గత కలెక్టర్ స్మితా సబర్వాల్ అమ్మలాలన పథకం ప్రవేశపెట్టారు. గర్భిణులను ఆయా ప్రాంతాల వైద్య ఆరోగ్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు ఇక్కడికి తీసుకువస్తున్నారు. ప్రతీరోజు కనీసం పదికి తగ్గకుండా ఆస్పత్రిలో కాన్పులు జరుగుతున్నాయి. నెలలో 300కు పైగా ప్రసవాలు జరుగుతున్నాయి. వీరు వసూలు చేస్తున్న ప్యాకేజీల ప్రకారం ఒక్కో డాక్టర్ నెలకు రూ.6 లక్షలు, నర్సులు నెలకు రూ.30 వేలు రోగుల నుంచి దోపిడీ చేస్తున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా... సిబ్బంది పేర్లతో సహా చెబుతున్నా అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. డబ్బులు ఇవ్వనివారి పట్ల సిబ్బంది ఘోరంగా వ్యవహరిస్తున్నారు. ఆపరేషన్ సమయంలో ఇబ్బందులు పెట్టడం... ఇష్టానుసారంగా కుట్లు వేస్తూ గర్భిణుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఆపరేషన్ అనంతరం వేసే కుట్లు చూస్తే ఇది వైద్యమేనా? అనే అనుమానం కలుగుతుంది. గతంలో ఓ మహిళకు సంచి కుట్టినట్టు కుట్లు వేయడంతో ఇన్ఫెక్షన్ సోకి ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. బంధువులు ఆందోళనకు దిగితే మళ్లీ కుట్లు వేసి పంపించారు. 20 రోజుల క్రితం ఇలాంటి ఘటనే మరోటి జరిగింది. ఓ మహిళకు కుట్లు వేసి వారం రోజులయినా వార్డులో పట్టించుకోకుండా వదిలేశారు. కనీసం డ్రెస్సింగ్ కూడా చేయలేదు. ఇష్టానుసారంగా కుట్లు విప్పడంతో అవి పికిలిపోయి బాధితురాలు నరకం అనుభవించింది. రోగి బంధువులు బతిమిలాడినా పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగారు. చివరకు మళ్లీ కుట్లు వేశారు. మరికొందరికి కుట్లు ఎండిపోయి నయం కాకముందే ఇష్టానుసారంగా కుట్లు విప్పడం(కుట్టు లాగడం)తో పికిలిపోయి బాధితులు నరకం చూస్తున్నారు. వైద్యసేవలు అందించి కాపాడాలని బాధితులు, బంధువులు గంటల తరబడి కాళ్లావేళ్లా పడి బతిమిలాడితే విసుక్కుంటూ మళ్లీ థియేటర్‌కు తీసుకెళ్లి కుట్లు వేస్తున్నారు. ఇలా నిత్యం గర్భిణులకు, బాలింతలకు వైద్య సిబ్బంది నరకం చూపిస్తున్నారు. -
నమో తెలంగాణ
భారత విజయ ర్యాలీ పేరిట జరిగిన బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ సభ ‘కమల’ దళంలో కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఈ సభకు తెలుగుదేశం శ్రేణులూ కలిసికట్టుగా హాజరైనా ‘ఐక్యత’ అన్ని దశల్లో కనిపించలేదు. బీజేపీ పరంగా సభను తమ భుజాలపైనే మోసుకొని ఆ నేతలు నడిపించారు. అనుకున్న మేర జన సమీకరణ కూడా జరగడంతో ఆ పార్టీ కేడరు ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. ఇదే జోష్‌లో ప్రచార పర్వాన్ని పూర్తిచేస్తే తమకు మంచి ఫలితాలొస్తాయని లెక్కలు వేస్తున్నారు. పాలమూరు జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీకళాశాల మైదానంలో మంగళవారం సాయంత్రం నిర్వహించి న భారత విజయ ర్యాలీ, ఎన్డీయేసభ సక్సెస్ అయ్యింది. భారతీయ జనతాపార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడితో కలిసి మొదటిసారిగా పాలమూరుకు వచ్చారు. రాష్ట్ర విభజనలో బీజేపీ పాత్రను వివరిస్తూనే ఆంక్షలతో కూడిన తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌పై తన ప్రసంగంలో విమర్శలు గుప్పించారు. అనంతరం రాష్ట్ర, జిల్లా సమస్యలను ప్రస్తావించా రు. పాలమూరు వలసలను నిలుపుతానని, రైతుల కన్నీళ్లు తూడుస్తానని, నీటి సమస్యకు శాశ్వతపరిష్కారం చూపుతానని మోడీ హామీనిచ్చారు. కేసీఆర్‌వి మోసపూరిత మాటలు ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్ దిట్ట. ఆయనవన్నీ మోసపూరిత మాటలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తొలి ముఖ్యమంత్రిని ద ళితుడినే చేస్తానని చె ప్పి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలేదు. స్వార్థం కోసం అర చేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్నారు. తెలంగాణ వికాసం టీఆర్ఎస్తో సాధ్యం కానిపని. కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలు. బీజేపీ ప్రభంజనంలో కొట్టుకపోతుంది. - మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి నాగం జనార్ధన్‌రెడ్డి బీజేపీతోనే పారదర్శక పాలన పారదర్శక, అవినీతి మరకలు లేని ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. కాం గ్రెస్, టీఆర్ఎస్ పార్టీలను తరిమికొట్టాలి. టీఆర్ఎస్కు ఓటేస్తే కాంగ్రెస్‌కు ఓటేసినట్లే. దోపిడీ చేయడానికి ఆ పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నారుు. ఈ విషయాన్ని ప్రజలందరు గ్రహించి తిప్పి కొట్టా లి. వలసల నివారణ, కార్మికుల బతుకులు మారాలంటే, 10 లక్షల ఎకరాల సాగునీరు రావాలన్నా, నిరుద్యోగ సమస్య తీరాలన్నా బీజేపీని అధికారంలోకి తేవాలి. - మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ హయూంలో అవినీతి, అశాంతి కాంగ్రెస్హయాంలో అవినీతి అక్రమాలు పెరిగి పోయూరుు. ధరలు ఆకాశాన్నంటా రుు. అశాంతితో దేశ ప్రజలందరు ఇబ్బం దులను ఎదుర్కొంన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పీడ ఈ ఎన్నికలతో విరగడవ్వాలి. జిల్లాలో ఎత్తిపోతల పథకాలు పూర్తరుు రైతులు సంతోషంగా ఉండాలంటే ఎన్డీయే అధికారంలోకి రావాలి. దేశంలో నరేంద్రమోడీ హవాడ నడుస్తోంది. ఆయన నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్లను ఓడించి బుద్ధి చెప్పాలి. - కల్వకుర్తి అసెంబ్లీ టి. ఆచారి -
టీఆర్ఎస్తోనే తెలంగాణ అభివృద్ధి
చంద్రశేఖర్‌కాలనీ,న్యూస్‌లైన్: టీఆర్ఎస్తోనే తెలంగాణ రాష్ట్ర వికాసం సాధ్యపడుతుందని నిజామాబాద్ లోక్‌సభ టీఆర్ఎస్ అభ్యర్థిని కల్వకుంట్ల కవి త అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. జిల్లా కేం ద్రంలోని కంఠేశ్వర్ న్యూ హౌసింగ్‌బోర్డులో గల ఆమె నివాసంలో మంగళవా రం వేల్పూర్ మండలం వాడి,కుకునూ ర్, వెంకటాపూర్, అంక్సాపూర్ గ్రామ సర్పంచులతోపాటు పలువురు గ్రామస్తులు టీఆర్ఎస్లో చేరారు. అనంతరం ఆమె మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సా దన కోసం టీఆర్ఎస్ పార్టీ చేసిన పో రాట ఫలితంగా, వందలాది మంది యువకులు, విద్యార్థుల ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నా రు. గత పాలకుల వివక్షతో తెలంగాణ అన్నిరంగాల్లో వెనుకబడిందన్నారు. అ భివృద్ధిలో వెనుకబడిన తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు పాటుపడిన పార్టీ అభ్యర్థులను గెలిపించి బం గారు తెలంగాణను నిర్మించుకుందామన్నారు.