తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకున్న గణపయ్య నిమజ్జనానికి తరలివెళ్లాడు. శనివారం చివరిరోజు భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. దీంతో మంటపాల వద్ద కోలాహలం నెలకొంది.
విఘ్నాలు తొలగించాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు. వరాలు కురిపించాలని వరసిద్ధి వినాయకుడిని వేడుకున్నారు. పాడిపంటలు కలగాలని, పిల్లాపాపలతో సుఖసంతోషాలతో ఉండాలని గౌరీతనయుడిని కోరుకున్నారు. మహబూబ్‌న గర్‌లో స్థానిక గడియారం చౌరస్తా నుంచి అటు పాత గ్రంథాలయం, ఇటు పాత బస్టాండు, రాయిచూర్ రోడ్డు, జడ్చర్ల హైవే తదితర ప్రాంతాలు నిమజ్జనానికి తరలివెళ్లే గణపతి విగ్రహాల ఊరేగింపులతో పులకించిపోయాయి. జిల్లాకేంద్రంలో కలెక్టర్ జీడీ ప్రియదర్శిని, ఎస్పీ డి.నాగేంద్రకుమార్, ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ తదితరులు వినాయకులకు వీడ్కోలు పలికారు. జిల్లాలోని కల్వకుర్తి, షాద్‌నగర్, గద్వాల, అలంపూర్, అచ్చంపేట, మక్తల్‌లో నిమజ్జనోత్సవాలు కన్నులపండువగా జరిగాయి.
బై బై.. గణేశా!
Published Sun, Sep 7 2014 2:56 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 PM
Advertisement