
తాళ్ల సాయంతో తోటి భక్తులను వంక దాటించేందుకు ప్రయత్నిస్తున్న భక్తులు
సాక్షి, మైదుకూరు: వైఎస్సార్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని భైరవకోన క్షేత్రానికి జీపులు, ట్రాక్టర్లలో వెళ్లిన భక్తులు ఆదివారం వర్షాల కారణంగా మోట్లకట్ట వంక వద్ద చిక్కుకుపోయారు. సమాచారం తెలుసుకున్న మైదుకూరు డీఎస్పీ విజయకుమార్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 30 ట్రాక్టర్లు, 2 జీపుల్లో ఉన్నవారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. చీకటిపడి సహాయక చర్యలకు ఆటంకం కలగడంతో మరో 3 జీపులు, 2 ట్రాక్టర్లలో భక్తులు వంక ఆవలవైపు ఉండిపోయారు.