దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్రంలో ఐదో శక్తిపీఠంగా వెలిసిన జోగుళాంబ అమ్మవారికి భక్తులు శనివారం బంగారు ముక్కుపోగులను బహుకరించారు.
అలంపూర్ : దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్రంలో ఐదో శక్తిపీఠంగా వెలిసిన జోగుళాంబ అమ్మవారికి భక్తులు శనివారం బంగారు ముక్కుపోగులను బహుకరించారు. జిల్లాలోని వెల్దండ మండలం చదురుపల్లి గ్రామానికి చెందిన చిన్న అంజయ్య, పోలే అంజయ్య ఒక్కొక్కరు 5 గ్రాముల బరువు గల రెండు బంగారు ముక్కుపోగులను అమ్మవారికి బహుకరించారు.
వారు బాలబ్రహ్మేశ్వర స్వామి, జోగుళాంబ అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి ఆలయ ఈఓ నరహరి గురురాజకు వాటిని అందజేశారు. వీటి విలువ సుమారు రూ. 26 వేల వరకు ఉండవచ్చని తెలిపారు.