Allampur
-
జోగుళాంబకు బంగారు ముక్కుపోగులు
అలంపూర్ : దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్రంలో ఐదో శక్తిపీఠంగా వెలిసిన జోగుళాంబ అమ్మవారికి భక్తులు శనివారం బంగారు ముక్కుపోగులను బహుకరించారు. జిల్లాలోని వెల్దండ మండలం చదురుపల్లి గ్రామానికి చెందిన చిన్న అంజయ్య, పోలే అంజయ్య ఒక్కొక్కరు 5 గ్రాముల బరువు గల రెండు బంగారు ముక్కుపోగులను అమ్మవారికి బహుకరించారు. వారు బాలబ్రహ్మేశ్వర స్వామి, జోగుళాంబ అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి ఆలయ ఈఓ నరహరి గురురాజకు వాటిని అందజేశారు. వీటి విలువ సుమారు రూ. 26 వేల వరకు ఉండవచ్చని తెలిపారు. -
‘గిరి’.. భక్త ఝరి..
తొలి ఏకాద శి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం మన్యంకొండకు భక్తజనం పోటెత్తారు. లక్ష్మీవేంకటేశ్వరుని దర్శించుకునేందుకు బారులుతీరారు. కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శనం కోసం బారులుతీరారు. లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కురుమూర్తి నామస్మరణతో ఏడుకొండలు మార్మోగాయి తొలి ఏకాదశి పర్వదినాన జిల్లాలోని అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కృష్ణా పరీవాహక ప్రాంతంలోని గద్వాల, అలంపూర్, బీచుపల్లి, నదీఅగ్రహారం, మన్యంకొండ, నల్లమలలోని శైవక్షేత్రాలతోపాటు కడ్తాల మైసిగండి ఆలయాలు జనసంద్రంగా కనిపించాయి. భక్తులు పుణ ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు సత్యనారాయణస్వామి వ్రతాల్లో పాల్గొన్నారు. -
సరిహద్దులో నిఘా
అలంపూర్/అచ్చంపేట, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో సరిహద్దులో నిఘా మ రింత పెరగనుంది. ఈ నేపథ్యంలోనే కొత్త చెక్‌పోస్టులు రాబోతున్నాయి. తెలంగాణ-రాయలసీమకు సరిహద్దుగా ఉన్న అలంపూర్ నియోజకవర్గంలో చెక్‌పోస్టును ఏర్పాటు చేయనున్నారు. మానవపాడు మండలం పుల్లూరు గ్రామం సమీపంలో ఈ చెక్‌పో స్టు ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో అంతర్భాగంగా ఉండేది. ఒకటిగా ఉన్న ఈ రాష్ట్రంలో రాయలసీమ-తెలంగాణ సరిహద్దులో ఎలాంటి చెక్‌పోస్టులు లేవు. జూన్ 2న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకరాష్ట్రాలుగా ఏర్పడబోతున్నాయి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని సీమాంధ్ర సరిహద్దుల్లో 8 చెక్‌పోస్టులు పెట్టాలనే నిర్ణయం జరిగినట్లు సమాచారం. జిల్లాలో రెండుచోట్ల చెక్‌పోస్టులు ఏర్పడబోతుండగా, అందులో అలంపూర్ నియోజకవర్గంలోని పుల్లూరు గ్రామ శివారులోని జాతీయరహదారి టోల్‌ప్లాజాకు సమీపంలో కొత్త చెక్‌పోస్టు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీంతో ఇప్పటి వరకు వాణిజ్య శాఖ చెక్‌పోస్టుగా పేరుగాంచిన పుల్లూరు చెక్‌పోస్టు కొత్త రాష్ట్రానికి సరిహద్దు చెక్‌పోస్టుగా మారనుంది. చెక్‌పోస్టు ఏర్పాటు చేస్తే ఇప్పటి వరకు జాతీయరహదారిపై రయ్.. రయ్...అని దూసుకెళ్లే వాహనాలకు బ్రేక్ పడనుంది. సరిహద్దు గ్రామాలకూ భద్రత ఉండనుంది. ఈగలపెంట వద్ద మరో చెక్‌పోస్టు శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిలోని మహబుబ్‌నగర్-కర్నూల్ జిల్లాల సరిహద్దులో ఉన్న ఈగలపెంట కృష్ణవేణి అతిథిగృహం సమీపంలో చెక్‌పోస్టును ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. జిల్లాలో ఏర్పాటు చేస్తున్న రెండు రాష్ట్రాల చెక్‌పోస్టుల్లో ఇదొకటి. శ్రీశైలం డ్యాం దిగువ భాగంలో రెండు జిల్లాల మధ్య వారదిగా ఉన్న బ్రిడ్జి వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేయాల్సి ఉన్నా డ్యాం పరిసర ప్రాంతంలో వాహనాలను నిలపడం కష్టం కావడంతో ఈగలపెంట వద్ద ఏర్పాటు చేసేం దుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అచ్చంపేట, మన్ననూర్, దోమలపెంటల వద్ద అటవీశాఖ ఆధ్వర్యంలో చెక్‌పోస్టులు కొనసాగుతున్నాయి. రాత్రి 9గంటల తర్వాత అమ్రాబాద్, మద్దిమడుగు పేరుతో వాహన దారులు శ్రీశైలం వెళ్తున్నట్లు గమినించిన అటవీశాఖ అధికారులు ఈ మధ్యే చెరువుకొమ్ము లింగమయ్య వద్ద మరో చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. కొత్తగా రెండు రాష్ట్రాల మధ్య ఏర్పాటయ్యే చెక్‌పోస్టు నిర్వహణ బాధ్యతలు కూడా వారికే అప్పగిస్తున్నట్లు తెలిసింది. అక్కడే టోల్‌గేట్‌ను కూడా ఏర్పాటు చేసే అలోచన ఉన్నట్లు సమాచారం. -
మృత్యు ఒడిలోకి
సరదా..! విషాదం మిగిల్చింది. శుభకార్యం జరిగిన ఇంట్లో అశుభం తాండవించింది. స్నానానికి వెళ్లిన ఇద్దరు బాలికలను,వారిని రక్షించేందుకు యత్నించిన ఓ మహిళను తుంగభద్ర మింగేసింది. తమ పిల్లలు గంగలో మునిగిపోవడంతో తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. తల్లి చనిపోవడంతో ఆమె పిల్లలు దిక్కులేనివారయ్యారు. చూస్తుండగానే క్షణాల్లో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో బంధువులు శోకసంద్రంలో మునిగారు. అలంపూర్, న్యూస్‌లైన్ : ఆ దంపతులకు ఉన్నది ఇద్దరు కుమార్తెలే.. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ జీవిస్తున్నారు.. బాగా చదివించాలనుకున్నా వారి ఆశలు మధ్యలోనే కల్లలయ్యాయి.. అసలే వేసవి సెలవులు..పైగా బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో తమ కూతుళ్లు సరదగా గడుపుతారని తల్లిదండ్రులు పంపించారు.. తుంగభద్ర నది రూపంలో మృత్యువు కబళించడంతో వారి రోదనలు అక్కడివారిని కలిచివేసింది.. వివరాలు.. కర్నూలు నగరంలోని ఎన్టీఆర్బిల్డింగ్ కాలనీలో నివాసముంటున్న అమీన్, ఖాజబీ దంపతులకు కుమార్తెలు షేకున్బీ (11), రజియా (10) ఉన్నారు. వీరు అక్కడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరు, ఐదో తరగతి చదువుతున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ప్రస్తుతం వేసవి సెలవులు ఉండటంతో శుభకార్యం నిమిత్తం మూడు రోజులక్రితం తమ కూతుళ్లను అలంపూర్ పట్టణంలోని కుమ్మరివీధికి చెందిన శాలిమియా ఇంటికి పంపించారు. అలా వచ్చిన వారు ఆదివారం ఉదయం తుంగభద్ర నదిలో స్నానానికి వెళ్లి మృత్యువాత పడటంతో తల్లడిల్లిపోయారు. ఇదే సంఘటనలో వరసకు చిన్నమ్మ అయిన అలంపూర్మండలం తక్కశీలకు చెందిన మహబూబ్‌బీ (27) మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈమెది రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి. దీంతో భర్త ఫకృద్దీన్‌కు తోడుగా కూలిపని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేది. కుమారులు హనీఫ్, మహిబూబ్ ఉన్నారు. తల్లి చనిపోవడంతో వారి రోదనలు మిన్నంటాయి. ఇలా రెండు కుంటుంబాల్లో నది ప్రమాదం తీరని విషాదాన్ని నింపింది. శుభకార్యంతో రెండు రోజులపాటు ఆనందంతో గడిపిన బంధుమిత్రులూ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. -
ధాన్యం..దైన్యం
ఆరుగాలం కష్టించి పండించిన పంటను మార్కెట్లో అమ్ముకోవడానికి అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. కొంటాం..తీసుకురండి అని చెప్పిన మార్క్‌ఫెడ్, నాఫెడ్ అధికారులు తీరా మార్కెట్‌కు పప్పుశనగ ధాన్యాన్ని రైతులు తీసుకువస్తే కనిపించకుండాపోయారు. కొనుగోలు కేంద్రాన్ని ఐదురోజులకే మూసేశారు. సరుకును విక్రయించలేక..ఇంటికి తీసుకురాలేక రైతన్నలు నిద్రహారాలు మాని ఆరురోజులుగా అక్కడే పడిగాపులుకాస్తున్నారు. అలంపూర్, న్యూస్‌లైన్: స్థానిక అలంపూర్ చౌరస్తాలో మార్క్‌ఫైడ్, నా ఫెడ్ సంయుక్త ఆధ్వర్యంలో పప్పుశనగ కొనుగోలు కేం ద్రాన్ని ఏర్పాటుచేశారు. ఐదు రోజులపాటు కొనుగోళ్లు సాగడంతో రైతులకు కాస్త ఊరట లభించింది. కానీ ఆ తరువాత కొన్న సరుకును నిల్వచేసేందుకు గోదాములు అందుబాటులో లేవనే సాకుతో కొనుగోళ్లను నిలిపేశారు. నియోజకవర్గంలో ఈ ఏడాది సుమారు 75వేల ఎకరాల్లో రైతులు పప్పుశనగను సాగుచేశారు. రైతుల విజ్ఞప్తి మేరకు అధికారులు అలంపూర్‌లో మార్క్‌ఫైడ్, నాఫెడ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 4న కేం ద్రాలను ప్రారంభించి.. 8న కొనుగోళ్లను ప్రారంభించారు. మూడులక్షల క్వింటాళ్ల పప్పుశనగ కొ నుగోలు లక్ష్యంగా నిర్ణయించారు. అయితే ఇప్పటివరకు 25వేల క్వింటాళ్ల ధా న్యాన్ని మాత్రమే కొనుగోలు చేయగలిగింది. కానీ త ర్వాత సరుకుకు నిల్వచేయడానికి గోదాములు లేవనే సాకుతో గత వారం రోజులుగా కొనుగోళ్ల ను నిలిపేశారు. ఈ విషయం తెలియని దాదాపు 50 మంది రైతులు తమ సరుకును అలంపూర్ మార్కెట్‌యార్డుకు తీసుకొచ్చి అక్కడే నిల్వ ఉంచారు. కొనుగోళ కు అతీగతి లేక..అన్నదాతలకు కనీస సమాచారం చెప్పేవారు లేక బిక్కుబిక్కుమంటూ ధాన్యం వద్దే కా పలాఉన్నారు. రైతుల పరిస్థితి ఇ లాఉండగా, కొనుగోళ్లు లే కపోవడంతో పనిదొరక డం లేదని హమాలీలు వా పోతున్నారు. ప్రతిరోజు ఇ క్కడికి వచ్చి నిరీక్షించి వె ళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు. దీనికితోడు సరుకులను గోదాంలకు తరలించే లారీలు ఇక్కడే నిలి చిపోయాయి. అధికారు లు రైతుల పరిస్థితి గుర్తించి కొనుగోళ్లను తిరిగి ప్రారంభించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రావడం వెళ్లడంతోనే సరిపోతుంది.. 20 ఎకరాల్లో పండించిన ధాన్యా న్ని ఇక్కడికి తీసుకొచ్చిన. 4వ తేదీ నుం చి రోజు సరుకుల వద్ద పడిగాపులుకాస్తున్నాం. అధికారులు స్పందించి వెంటనే ధాన్యాన్ని కొనాలి. - చంద్రశేఖర్‌రెడ్డి, రైతు, తక్కశీల పట్టించుకోవడం లేదు వారం రోజులుగా సరుకులతో యార్డులోనే ఉన్నాం. కానీ ఏ ఒక్క అధికారి వచ్చి పట్టించుకోవడం లేదు. అసలు సరుకులు కొంటారా..లేదా..అనే విషయం చెప్పడం లేదు. కొనుగోలు కేంద్రాన్ని కేంద్రాన్ని తెరపించి రైతులను ఆదుకోవాలి. - రామచంద్రారెడ్డి, రైతు, పెద్దపోతులపాడు -
మహిళలు..మహారాణులు
అలంపూర్, న్యూస్‌లైన్: రిజర్వేషన్లతో అన్ని సామాజిక వర్గాలకు రాజకీయ లబ్ధి చేకూరుతోంది. ఈ సారి మహిళలకు రాజకీయాల్లో సగం రిజర్వేషన్లు కల్పిం చిన విషయం తెలిసిందే. దీంతో అలంపూర్ ని యోజకవర్గంలో మహిళా మణుల ప్రాముఖ్యత పెరిగింది. కేటాయించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో అతివలకే అధిక ప్రాధాన్యం ద క్కింది. అలంపూర్, ఇటిక్యాల, వడ్డేపల్లి, మానవపాడు, అయిజ మండలాల్లో 79 ఎంపీటీసీ స్థానా లు ఉన్నాయి. వీరిలో జనరల్ మహిళలకు13, బీసీ మహిళకు16, ఎస్సీ మహిళకు11 స్థానాలకు మొత్తంగా మహిళలకు 40 ఎంపీటీసీ స్థానాలు కేటాయించారు. అలంపూర్ మండలంలో 13 ఎంపీటీసీలకు ఏడు, అయిజ మండలంలో16కు 8, ఇటిక్యాల మండలంలోని 15 స్థానాలకు ఏడు, మానవపాడు మండలంలోని 15 స్థానాలకు 8, వడ్డేపల్లి మండలంలోని 20 స్థానాలకు 10 స్థానాల్లో మహిళలు పోటీచేసి ఆ స్థానాల్లో ఎంపికకానున్నారు. ఇక జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లోనూ మహిళలకే అధికస్థానాలు దక్కాయి. ఐదు జెడ్పీటీసీ స్థానాల్లో ముగ్గురు మహిళలు, ఎంపీపీ స్థానాల్లో ముగ్గురు మహిళ ప్రతినిధులు ప్రాతినిథ్యం వహించనున్నారు. ఆయా స్థానాల్లో 83 మంది పోటీకి సిద్ధపడుతుండగా వారిలో 40 మంది పురుషులు, 43 మంది మహిళలే ఉన్నారు. ఈ లెక్కన ఈసారి ఎన్నికల తర్వాత ఆయా స్థానాలనుంచి 46 మంది మహిళలు ప్రజాప్రతినిధులుగా ప్రజాపాలనలో కొలువుదీరనున్నారు. ఇదిలా ఉండగా దేశంలోని అష్టాదశ శక్తిపీఠాల్లోని ఐదోశక్తి పీఠంగా విరాజిల్లుతున్న జోగుళాంబ అమ్మవారి ఐదోశక్తి పీఠక్షేత్రంలో ఇటీవల కొలువుదీరిన నూతన ఆలయ పాలక మండలికి తొలిసారిగా మహిళా చైర్మన్‌గా లక్ష్మిదేవమ్మకు అవకాశం దక్కింది. అంతేకాకుండా ధర్మకర్తల సభ్యులుగా 10 మందిని ఎంపికచేస్తే..వారిలో ఆరుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. జోగుళాంబ క్షేత్రంగా కీర్తిగడించిన అలంపూర్ ప్రాంతంలో మహిళల ప్రాధాన్యం పెరగడంతో మహిళాలోకం ఆనందం వ్యక్తం చేస్తోంది. -
కేరళ ‘గ్రామ పాలన’ భేష్
అలంపూర్, న్యూస్‌లైన్:: కేరళలోని గ్రామ పాలన ఆదర్శవంతంగా ఉందని పాలమూరు సర్పంచులు అన్నారు. అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో గ్రామ వ్యవస్థపై అవగాహన పొందేందుకు తెలంగాణ రాష్ట్రంలోని ఐదు జిల్లాల నుంచి 53 మంది సర్పంచ్ల బృందం కేరళలో పర్యటించింది. ఈ నెల 2న హైదరాబాదు నుంచి బయల్దేరిని సర్పంచ్ల బృందం ఐదు రోజుల పర్యటన ముగించుకుని శుక్రవారం తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో పీఠమైన శ్రీ జోగుళాంబ అమ్మవారి క్షేత్రాన్ని సందర్శించారు. పంచాయతీరాజ్ విభాగంలోని హైదరాబాదు రాజేంద్ర నగర్ ఎక్స్ట్రా ట్రైనీంగ్ సెంటర్ ద్వారా మహబుబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ, మెదక్, నిజామాబాద్ జిల్లాల నుంచి 53 మంది సర్పంచ్ల బృందం కేరళలోని గ్రామ పంచాయతీ పాలనను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అక్కడ కేంద్రం, రాష్ట్రం నుంచి గ్రామ పంచాయతీ వ్యవస్థకు నిధులు నేరుగా వస్తాయని సర్పంచులు చెప్పారు. గ్రామ పంచాయతీలో రెండు వేల జనాభా మొదలుకుని 30 వే ల జనాభా ఉంటుందన్నారు. క్లస్టర్లుగా విభ జించి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి సంబంధించి ఒక్కో విభాగానికి ఓ కమిటీ ఏర్పాటు చేసి సర్పంచ్ చైర్మన్‌గా వ్యవహరిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తు గ్రామ వ్యవస్థను పటిష్టపరుస్తున్నట్లు చెప్పారు. అలాంటి వ్యవస్థను నిర్మిం చుకుంటే గ్రామాల్లో ప్రస్తుతం నెలకొన్న సమస్యలను పరిష్కరించుకోనే అవకాశం ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. పాలమూరు సర్పంచులు అయిజ మండలం మేడికొండ సర్పంచ్ వెంకటేష్, మద్దూరు మండలం సుద్దపల్లి సర్పంచ్ వై. వెంకటేష్‌గౌడ్, కొల్లాపురం మండలం సింగోటం సర్పంచ్ ఈ.వెంకటస్వామి, మద్దూర్ మండలం పల్లెర్ల సర్పం చ్ విజయలక్ష్మి, బాల్నగర్ సర్పంచ్ వి. శాంతినాయక్, గట్టు మండలం మిట్టదొడ్డి సర్పంచ్ బి.ఉరుకుందు, ఆత్మకూర్ మండలం గోపన్‌పేట సర్పంచ్ టీ.వెంకటేష్‌లు వెళ్లారు. సర్పంచ్ల బృందం జిల్లాల డీటీఎమ్‌లు కే.క్రిష్ణ, లింగారెడ్డి, బాగయ్య, రామేశ్వర్‌రావులతో కలిసి ముందుగా కేరళలోని ఇన్స్ట్యూట్ లోకల్ అడ్మినిస్ట్రేషన్, మాల గ్రామ పంచాయతీ, కొ డాయి గ్రామ పంచాయతీలను సందర్శించడం జరి గింది. అక్కడి గ్రామ పంచాయతీ వ్యవస్థకు దోహదపడుతున్న అంశాలను, వారి విధులు, విధానాలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి వస్తున్న నిధులు, గ్రా మ అభివృద్ధిపై అధ్యాయనం చేశారు. అక్కడి సర్పం చ్, వార్డు సభ్యులు, పంచాతీలు నిర్వహించి విధానాలపై అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. బృందంలోని సర్పంచ్‌లు అక్కడి అనుభుతులను వివరించారు. -
రుద్రాయ.. భక్త ప్రియాయ
శివుడు...సృష్టి స్థితి లయకారుడు. ఆది భిక్షువు. జ్ఞానచక్షువు. ప్రణవనాద స్వరూపుడు. అభిషేక ప్రియుడు.భోళా శంకరుడు. అడిగినంతనే వరాలిచ్చు నీలకంఠుడు. అన్నింటికీ మించి అతి నిరాడంబురుడు. అందుకే ఎవరైనా ముందుగా మొక్కేది శివయ్యకే. ప్రణమిల్లేది శుభంకరుడైన శంకరునికే. ఇలా శివరాత్రి వేళ జిల్లా అంతటా భక్తులు ఓంకారం జపించారు. పంచాక్షరి పఠించారు. తన్మయత్వంతో ఊగిపోయారు. ప్రళయ భయంకరుడు ప్రసన్నుడు కావాలని వేడుకున్నారు. ఢమరుకాలు మోగించారు. తాండవ మాడారు. శివం...సత్యం అంటూ మురిసి పోయారు. నమో...బాలబ్రహ్మేశ్వరాయా! అలంపూర్, న్యూస్‌లైన్: ‘బ్రహ్మశోయం సవిశ్వేసః సాకాసి హేమలాపురీ’ అంటూ భక్తులు బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ధ్యాన శ్లోకాన్ని స్మరిస్తూ దర్శించుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు అలంపూర్ ఆలయాలను దర్శించుకున్నారు. పుష్కరఘాట్‌లో పుణ్యస్నానాలు ఆచరించి, నదీయతల్లికి దీపాలు వదులుతూ గంగపూజలు చేశారు. బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో ఏకవార రుద్రాభిషేకాలు, రుద్రహోమాలు, భేరీ పూజలు, ఆవాహిత దేవతా పూజలు, అష్టదిక్పాలకులకు బలిహరణ, విశేష సమర్పణ, చతుషష్టి పూజలు, రాత్రి 9:30 నుంచి యామపూజలు నిర్వహించారు. 24 ఆలయాల సముదాయమైనపాపనాశేశ్వర స్వామి, సంఘమేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు కొనసాగాయి. జ్యోతిర్లింగార్చనలు, బిల్వాష్టకాలు, రుద్ర, నమక, చమకాలతో శివుడిని ప్రార్థించారు. భక్తులు ఉపవాస దీక్షలు చేస్తు పంచామృతాలతో అభిషేకించారు. -
జోగుళాంబాయ నమః
అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటై వెలసిన అలంపూర్ జోగుళాంబకు ఘటాభిషేకం మంగళవారం కన్నులవ పండువగా జరిగింది. విశేష పూజలందుకున్న అమ్మవారు భక్తులను కరుణించి నిజరూప దర్శనమిచ్చారు. బ్రహ్మాత్సవాల్లో భాగంగా జోగుళాంబకు, బాలబ్రహ్మేశ్వరునితో వైభవోపేతంగా కళ్యాణం నిర్వహించారు. అధిక సంఖ్యలో వచ్చిన జనం పులకితులయ్యారు. అంతా జై జోగుళాంబా అంటూ ఆలయ ప్రాంగణాన్ని హోరెత్తించారు. అలంపూర్, న్యూస్‌లైన్ : వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగం గా భక్తులకు జోగుళాంబ అమ్మవారి నిజరూప దర్శన భాగ్యం మంగళవారం లభించింది. అశేష భక్త జనావళి చేత అమ్మ విశేష పూజలందుకుంది. భక్తులు తమ శిరస్సులపై కలశాలతో వచ్చి ఆమె ను అభిషేకించారు. అర్చక స్వాములు వేద మంత్రోచ్ఛారణల మధ్య పంచామృతాలతో పూజలు చేశారు. అమ్మవారి ఆ లయంలో జనవరి 31వ తేదీ నుంచి ఐ దు రోజుల పాటు 9వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. అందులో భాగంగా ఉత్సవాల చివరి రోజు పూర్ణాహుతి ,సహస్ర కలశ, పంచామృత , కనకాభిషేకాలు నిర్వహించారు. స్వామివారి, అమ్మవారి కళ్యాణోత్సవ ఘట్టం, ధ్వజ అవరోహణతో కార్యక్రమాలు పరిసమాప్తి చెందాయి. ఆగమ శాస్త్ర రీత్యా... సహస్ర కలశాలకు అధికారికంగా ఆల య ఈవో గురురాజ చేత అర్చక స్వా ములు ఆగమ సాంప్రదాయ రీతిలో పూజలు చేయించారు. నవ ఔషధులతో అర్చించారు. కలశాలకు హారతులు ఇ చ్చి అభిషేకం కోసం వాటిని మంగళవాయిద్యాలతో గర్భాలయానికి చేర్చారు. దీంతో అర్చక స్వాములు కవాట బంధ నం (గర్భాలయ తలుపులు మూసి)తో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం భక్తులకు జోగుళాంబ నిజ రూప దర్శనం ఇచ్చింది. వారు పులకితులై జై జోగుళాంబా అంటూ జయధ్వానం చేశారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు, రక రకాల పూల మాల లతో, నిమ్మకాయాల దండలు, స్వర్ణాభరణాలు అలంకరించారు. ఆలయ అర్చక స్వాములు అమ్మవారికి దశ విధహార తులు సమర్పించారు. -
గుట్టలు..గుటకలు
అవి చూసేందుకు గుట్టలే. తాజాగా దాని విలువ పెరిగింది. ప్రభుత్వ భూమైనా స్థానికులు కొందరు సాగుచేస్తుండడంతో వారికి పట్టాలిచ్చారు. మరి కొంతమందికి ఇప్పుడు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన పలుకుబడి దార్లు తమ బినామీలను రంగంలోకి దించి దాన్ని కాజేయాలని చూస్తున్నారు. ఇదీ అలంపూర్ మండలం ర్యాలంపాడు గ్రామానికి చెందిన వందెకరాల భూమి కథ. అలంపూర్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ స్థలాలపై బినామీల కన్నుపడింది. నియోజకవర్గ నేత అనుచరులు అధికారులను మచ్చిక చేసుకొని బినామీ పేర్లతో భూమిని స్వాహా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక అధికారి సైతం సొంత లాభం ఆర్జిస్తూ.. బినామీలకు పూర్తి స్థాయి అండదండలు అందిస్తూ...అర్హులకు మొండి చేయి చూపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న పొలాలకు పట్టా వస్తుందని అశించిన నిరుపేదలు ఈ విషయం తెలిసి అందోళన చెందుతున్నారు. బినామీల చేతికి అందుతున్న తమ పొలాలను దక్కించుకోవడానికి జిల్లా ఉన్నత అధికారుల చూట్టు చక్కర్లు కొడుతున్నారు. అలంపూర్ మండల పరిధిలోని ర్యాలంపాడు గ్రామం జిల్లాకు సరిహద్దులో ఉంది. అంతేకాక తుంగభద్ర నదికి అవతలి వైపున ఉన్న మూడు గ్రామాల్లో ఇదొకటి. గ్రామంలో ప్రభుత్వానికి చెందిన మూడు సర్వే నెంబర్లలో సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులోని కొంత భాగాన్ని దశాబ్దాలుగా కొన్ని నిరుపేద కుటుంబాలు బంజరు భూమిని వ్యవసాయ యోగ్యంగా మార్చుకొని సాగు చేస్తున్నారు. వీరిలో కొంత మందికి పట్టాలు రాగా మరి కొంత మందికి ఇవ్వాల్సి ఉంది. వారి జాబితా సిద్దమవుతోంది. ఈ విషయం తెలుసుకున్న బినామీలు ఒక అధికారిని దారిలోకి తెచ్చుకొని అర్హులైన నిరుపేదలకు దక్కాల్సిన ప్రభుత్వ భూమిని కాజేసే ప్రణాళిక వేసినట్లు భోగట్టా. ఈ మేరకు ఎకరాకు కొంత మొత్తం ముట్టజెప్పుకొని పట్టాల పంపిణీ జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకునేందుకు పూర్తి స్థాయి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు బహిరంగ ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిమాండ్ రావడంతోనే : తుంగభద్ర నది అవతలి పొలాలకు గతంలో పెద్దగా డిమాండ్ ఉండేది కాదు. అయితే అలంపూర్-ర్యాలంపాడు గ్రామాల మధ్య ఉన్న తుంగభద్ర నదిపై బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. ఈ పనులు మరో ఏడాదిలో పూర్తయి రాకపోకలు సాగే అవకాశం ఉంది. దీంతో ఈ ప్రాంతంలోని పొలాల ధరలకు రెక్కలు వస్తున్నాయి. ప్రభుత్వ స్థలాలు సైతం రోడ్డుకు అతిసమీపంలో ఉండటంతో భవిష్యత్తులో వాటికి మంచి ధర వస్తుందని బినామీలు అందిన కాడికి వాటిని కాజేసే యత్నం చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై ర్యాలంపాడు గ్రామస్తులు గతంలోనే ఓసారి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లా అధికారులు స్పందించి అర్హులకు న్యాయం జరిగే విధంగా చూడాలిన కోరుతున్నారు. తహశీల్దార్ ఏమన్నారంటే... ప్రభుత్వ భూ పంపిణీకి స్థలాన్ని పరిశీలించమని చెప్పడంతో ర్యాలంపాడు, ఉట్కూరు గ్రామ శివారుల్లో ఉన్న వ్యవసాయ యోగ్యమైన పొలాలను గుర్తించాం. అర్హుల పేర్లు గుర్తిస్తున్నాం. ఇంకా జాబితా పూర్తి స్థాయిలో ఎంపిక చేయలేదు. సిద్దం చేసిన అనంతరం అసైన్డు కమిటీలో చర్చించి అర్హుల జాబితాను ప్రకటిస్తాం. అనఅర్హులకు అస్కారం లేకుండా జాగ్రత్తలు తీసకుంటాం. -
గుడారాలే ఆవాసం
అలంపూర్, న్యూస్‌లైన్: వరద బాధితులపై ప్రభుత్వం కనికరం చూపడం లేదు. పునరావాసం కల్పించడంలో పాలకులు పూర్తిగా విఫలయమ్యారు. జల ప్రళయంలో ఇళ్లను కోల్పోయిన వారు గుడారాల్లోనే మగ్గాల్సి వస్తోంది. నాలుగేళ్లుగా అలంపూర్ నియోజకవర్గంలో నిర్వాసితులను పట్టించుకునే వారు కరువయ్యారు. భారీ వర్షాలతో 2009 అక్టోబర్ 2వ తేదీన తుంగభద్ర నదికి వరదలు వచ్చి భారీ నష్టం వాటిల్లింది. వరదల్లో సర్వస్వం కోల్పోయిన అలంపూర్ బాధితులకు స్థానిక ప్రభుత్వ అతిథి గృహం సమీపంలో 43 ఎకరాల స్థలం కొనుగోలు చేసి ప్లాట్లుగా మలిచారు. నిర్వాసితులకు పట్టాలైతే ఇచ్చారు...కానీ ప్లాట్లు మాత్రం కేటాయించలేదు. అలాగే మద్దూరు గ్రామంలోని నివాస గృహాలు తుంగభద్ర నీటి ప్రవాహంలో కొట్టుకపోయి మొండి గోడలు మిగిలాయి. అయినా నిర్వాసితులకు పునరావాసం కోసం కనీసం స్థల సేకరణ ఎటూ తేలకుండాపోయింది. రాజోలిలోని ఇళ్లు పేకమేడలా కుప్పకులిన పునరావస గృహాల నిర్మాణం పూర్తి కా లేదు. గూడు కోల్పోయిన నిర్వాసితులు గుడారాల్లో చ లికి వణుకుతు...వానకు తడుస్తూ..ఎండకు ఎండుతు దుర్భరమైన జీవనం గడుపుతున్నారు. ముళ్ల పొదల్లో ప్లాట్లు : అలంపూర్ ప్రభుత్వ అతిథి గృహం వెనక భాగంలో ని ర్వాసితులకు 43 ఎకరాలు సేకరించారు. రెండేళ్ల త ర్వాత స్థలాన్ని సేకరిస్తే మరో ఏడాదిపాటు మరునపడేసి 913 ప్లాట్లుగా వేశారు. స్థానిక ఎన్నికల ముందు లబ్ధి పొందడానికి వీలుగా అధికార పార్టీ నాయకులు కొంత మంది నిర్వాసితులకు పట్టాలిచ్చారు. కానీ పట్టాలిచ్చి ఏడాది కావస్తున్నా వారికి ప్లాట్లు కేటాయిం చలేదు. ఆ ప్రాంతంలో ముళ్ల పొదాలు మొలిచాయి. గతంలో జాబితాకు అనువుగా మిగిలిన 450 మందికి ప్లాట్లు కేటాయించడానికి అదనంగా మరో 20 ఎకరా ల స్థలాన్ని సేకరించడానికి అధికారులు నిర్ణయిం చారు. కానీ స్థల సేకరణ కేవలం సర్వేలకే పరిమితమైంది. దీంతో వరదల్లో గూడు కోల్పోయిన నిర్వాసితులు గుడారాల్లోనే దుర్భరమైన జీవనం గడుపుతున్నారు. అటకెక్కిన స్థల సేకరణ : మానవపాడు మండలంలో తుంగభద్ర నదీ తీరంలో ఉన్న మద్దూరు గ్రామం వరద ముంపుకు గురైంది. నాలుగేళ్లుగా అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకోవడంలో స్థల సేకరణ ఇప్పటికి పూర్తికాలేదు. జిల్లా అధికారులు హడావుడి చేస్తే గ్రామానికి చుట్టపు చూపుగా వెళ్లడం, స్థలాన్ని పరిశీలించి రావడంతోనే సరిపోతుంది. 500 కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలో కనీసం ఎకరం పొలాన్ని ఇప్పటికి కొనుగోలు చేయలేదు. దీంతో నాలుగేళ్లుగా పునరావాసం కోసం ఎదురు చూడటంతోనే కాలం గడిచిపోతుంది. వరదల్లో సర్వం కోల్పోయిన గ్రామస్తులు కొందరు నిలువ నీడలేక వలసపోయారు. నిర్మాణానికి మోక్షం లేదు.. వడ్డేపల్లి మండలం రాజోలి గ్రామంలో నిర్వాసితులకు పునరావాసం కింద 212 ఎకరాల స్థలాన్ని సేకరించారు. 3048 మందికి ఇళ్ల నిర్మాణం చేపట్టడానికి శ్రీకారం చూట్టారు. అందులో ఇప్పటికి 2025 ఇళ్ల నిర్మాణం పనులు చేపట్టగా దాదపు 1500 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారు. 525 ఇళ్ల నిర్మాణం ఇప్పటికి ప్రారంభమే కాలేదు. వరద ప్రభావిత గ్రామమైన తూర్పుగార్లపాడులో 260 మందికి ఇళ్ల నిర్మాణ పనులు మొదలు పెట్టారు. పనులు ఆర్థాంతరంగా నిలిచిపోవడంతో నిర్వాసితులకు ఇబ్బందులు తప్పడం లేదు.