అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటై వెలసిన అలంపూర్ జోగుళాంబకు ఘటాభిషేకం మంగళవారం కన్నులవ పండువగా జరిగింది. విశేష పూజలందుకున్న అమ్మవారు భక్తులను కరుణించి నిజరూప దర్శనమిచ్చారు. బ్రహ్మాత్సవాల్లో భాగంగా జోగుళాంబకు, బాలబ్రహ్మేశ్వరునితో వైభవోపేతంగా కళ్యాణం నిర్వహించారు. అధిక సంఖ్యలో వచ్చిన జనం పులకితులయ్యారు. అంతా జై జోగుళాంబా అంటూ ఆలయ ప్రాంగణాన్ని హోరెత్తించారు.
అలంపూర్, న్యూస్‌లైన్ : వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగం గా భక్తులకు జోగుళాంబ అమ్మవారి నిజరూప దర్శన భాగ్యం మంగళవారం లభించింది. అశేష భక్త జనావళి చేత అమ్మ విశేష పూజలందుకుంది.
భక్తులు తమ శిరస్సులపై కలశాలతో వచ్చి ఆమె ను అభిషేకించారు. అర్చక స్వాములు వేద మంత్రోచ్ఛారణల మధ్య పంచామృతాలతో పూజలు చేశారు. అమ్మవారి ఆ లయంలో జనవరి 31వ తేదీ నుంచి ఐ దు రోజుల పాటు 9వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. అందులో భాగంగా ఉత్సవాల చివరి రోజు పూర్ణాహుతి ,సహస్ర కలశ, పంచామృత , కనకాభిషేకాలు నిర్వహించారు. స్వామివారి, అమ్మవారి కళ్యాణోత్సవ ఘట్టం, ధ్వజ అవరోహణతో కార్యక్రమాలు పరిసమాప్తి చెందాయి.
ఆగమ శాస్త్ర రీత్యా...
సహస్ర కలశాలకు అధికారికంగా ఆల య ఈవో గురురాజ చేత అర్చక స్వా ములు ఆగమ సాంప్రదాయ రీతిలో పూజలు చేయించారు. నవ ఔషధులతో అర్చించారు. కలశాలకు హారతులు ఇ చ్చి అభిషేకం కోసం వాటిని మంగళవాయిద్యాలతో గర్భాలయానికి చేర్చారు. దీంతో అర్చక స్వాములు కవాట బంధ నం (గర్భాలయ తలుపులు మూసి)తో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం భక్తులకు జోగుళాంబ నిజ రూప దర్శనం ఇచ్చింది. వారు పులకితులై జై జోగుళాంబా అంటూ జయధ్వానం చేశారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు, రక రకాల పూల మాల లతో, నిమ్మకాయాల దండలు, స్వర్ణాభరణాలు అలంకరించారు. ఆలయ అర్చక స్వాములు అమ్మవారికి దశ విధహార తులు సమర్పించారు.
జోగుళాంబాయ నమః
Published Wed, Feb 5 2014 3:49 AM | Last Updated on Sat, Sep 2 2017 3:20 AM
Advertisement
Advertisement