మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలంలో నేడు అంకురార్పణ
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో 11 రోజుల పాటు నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం అంకురార్పణ జరగనుంది. ఉదయం 8:10 గంటలకు యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవ క్రతువులు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా మల్లికార్జునస్వామికి విశేష అర్చనలు, భ్రమరాంబాదేవికి ప్రత్యేక పూజలు, స్వామిఅమ్మవార్లకు వాహన సేవలు నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు భేరిపూజ, భేరీతాడనం, సకలదేవతాహ్వానపూర్వక ధ్వజారోహణ, ధ్వజపట ఆవిష్కరణ నిర్వహిస్తారు.
కాగా, బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి 2న భృంగి వాహనసేవ, 3న హంస వాహన సేవ, 4న మయూర వాహన సేవ, 5న రావణ వాహన సేవ, 6న పుష్పపల్లకిసేవ, 7న గజ వాహన సేవ, 8న ప్ర¿ోత్సవం, నందివాహన సేవ, అదే రోజు రాత్రి 10గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిõÙకం, పాగాలంకరణ, కల్యాణోత్సవం నిర్వహిస్తారు. 9న రథోత్సవం, తెప్పోత్సవం, 10న బ్రహ్మోత్సవాలకు పూర్ణాహుతి చేపట్టి సాయంత్రం ధ్వజావరోహణ చేస్తారు. 11న అశ్వ వాహనసేవ, పుషో్పత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవ నిర్వహిస్తారు.
నేడు పట్టు వస్త్రాల సమర్పణ
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం వారిచే స్వామి అమ్మవార్లకు పట్టువ్రస్తాలు సమరి్పస్తారు. అలాగే, 2న ద్వారక తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థానం, 3న విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం, 4న కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానాలు పట్టువస్త్రాలను సమర్పి0చనున్నాయి. 5న రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధులు స్వామిఅమ్మవార్లకు పట్టువ్రస్తాలు సమర్పిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment