అలంపూర్, న్యూస్‌లైన్:: కేరళలోని గ్రామ పాలన ఆదర్శవంతంగా ఉందని పాలమూరు సర్పంచులు అన్నారు. అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో గ్రామ వ్యవస్థపై అవగాహన పొందేందుకు తెలంగాణ రాష్ట్రంలోని ఐదు జిల్లాల నుంచి 53 మంది సర్పంచ్‌ల బృందం కేరళలో పర్యటించింది. ఈ నెల 2న హైదరాబాదు నుంచి బయల్దేరిని సర్పంచ్‌ల బృందం ఐదు రోజుల పర్యటన ముగించుకుని శుక్రవారం తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా వారు అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో పీఠమైన శ్రీ జోగుళాంబ అమ్మవారి క్షేత్రాన్ని సందర్శించారు. పంచాయతీరాజ్ విభాగంలోని హైదరాబాదు రాజేంద్ర నగర్ ఎక్స్‌ట్రా ట్రైనీంగ్ సెంటర్ ద్వారా మహబుబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ, మెదక్, నిజామాబాద్ జిల్లాల నుంచి 53 మంది సర్పంచ్‌ల బృందం కేరళలోని గ్రామ పంచాయతీ పాలనను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అక్కడ కేంద్రం, రాష్ట్రం నుంచి గ్రామ పంచాయతీ వ్యవస్థకు నిధులు నేరుగా వస్తాయని సర్పంచులు చెప్పారు.
గ్రామ పంచాయతీలో రెండు వేల జనాభా మొదలుకుని 30 వే ల జనాభా ఉంటుందన్నారు. క్లస్టర్‌లుగా విభ జించి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి సంబంధించి ఒక్కో విభాగానికి ఓ కమిటీ ఏర్పాటు చేసి సర్పంచ్ చైర్మన్‌గా వ్యవహరిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తు గ్రామ వ్యవస్థను పటిష్టపరుస్తున్నట్లు చెప్పారు. అలాంటి వ్యవస్థను నిర్మిం చుకుంటే గ్రామాల్లో ప్రస్తుతం నెలకొన్న సమస్యలను పరిష్కరించుకోనే అవకాశం ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు.
పాలమూరు సర్పంచులు
అయిజ మండలం మేడికొండ సర్పంచ్ వెంకటేష్, మద్దూరు మండలం సుద్దపల్లి సర్పంచ్ వై. వెంకటేష్‌గౌడ్, కొల్లాపురం మండలం సింగోటం సర్పంచ్ ఈ.వెంకటస్వామి, మద్దూర్ మండలం పల్లెర్ల సర్పం చ్ విజయలక్ష్మి, బాల్‌నగర్ సర్పంచ్ వి. శాంతినాయక్, గట్టు మండలం మిట్టదొడ్డి సర్పంచ్ బి.ఉరుకుందు, ఆత్మకూర్ మండలం గోపన్‌పేట సర్పంచ్ టీ.వెంకటేష్‌లు వెళ్లారు.
సర్పంచ్‌ల బృందం జిల్లాల డీటీఎమ్‌లు కే.క్రిష్ణ, లింగారెడ్డి, బాగయ్య, రామేశ్వర్‌రావులతో కలిసి ముందుగా కేరళలోని ఇన్‌స్ట్యూట్ లోకల్ అడ్మినిస్ట్రేషన్, మాల గ్రామ పంచాయతీ, కొ డాయి గ్రామ పంచాయతీలను సందర్శించడం జరి గింది. అక్కడి గ్రామ పంచాయతీ వ్యవస్థకు దోహదపడుతున్న అంశాలను, వారి విధులు, విధానాలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి వస్తున్న నిధులు, గ్రా మ అభివృద్ధిపై అధ్యాయనం చేశారు. అక్కడి సర్పం చ్, వార్డు సభ్యులు, పంచాతీలు నిర్వహించి విధానాలపై అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. బృందంలోని సర్పంచ్‌లు అక్కడి అనుభుతులను వివరించారు.
కేరళ ‘గ్రామ పాలన’ భేష్
Published Sat, Mar 8 2014 3:56 AM | Last Updated on Sat, Sep 2 2017 4:27 AM
Advertisement
Advertisement