‘గిరి’.. భక్త ఝరి..
తొలి ఏకాద శి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం మన్యంకొండకు భక్తజనం పోటెత్తారు. లక్ష్మీవేంకటేశ్వరుని దర్శించుకునేందుకు బారులుతీరారు. కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శనం కోసం బారులుతీరారు. లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కురుమూర్తి నామస్మరణతో ఏడుకొండలు మార్మోగాయి
తొలి ఏకాదశి పర్వదినాన జిల్లాలోని అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కృష్ణా పరీవాహక ప్రాంతంలోని గద్వాల, అలంపూర్, బీచుపల్లి, నదీఅగ్రహారం, మన్యంకొండ, నల్లమలలోని శైవక్షేత్రాలతోపాటు కడ్తాల మైసిగండి ఆలయాలు జనసంద్రంగా కనిపించాయి. భక్తులు పుణ ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు సత్యనారాయణస్వామి వ్రతాల్లో పాల్గొన్నారు.