ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలో ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో ((ITCX) జరగనుంది. 2025 ఫిబ్రవరి 17 -19 తేదీల మధ్య అంతర్జాతీయ దేవాలయాల సదస్సు మరియు ప్రదర్శన (ఐటీసీఎక్స్) ఉంటుందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఆలయ నిర్వాహకులు, ప్రతినిధులు జనవరి 31, 2025లోపు ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. ఒక్కో ఆలయానికి ఇద్దరు ప్రతినిధులకు వసతి కూడా ఉంటుంది. అదనపు ట్రస్టీలు నామమాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
111 మంది నిపుణులైన వక్తలతో సెమినార్లు, ఇంటరాక్టివ్ వర్క్‌షాప్‌లు, ప్రత్యేక మాస్టర్‌క్లాస్‌లు, ప్రెజెంటేషన్‌లు, వర్క్‌షాప్‌లు , మాస్టర్‌క్లాస్‌లు - ఆలయ చర్చలు ఉంటాయి. ఈ సమావేశాలకు 58కి పైగా దేశాల నుండి హిందూ,సిక్కు, బౌద్ధ, జైన మత సంస్థల నుండి కీలక ప్రతినిధులు పాల్గొననున్నారు. మూడు రోజుల స్మారక కార్యక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా 1581కి పైగా ప్రతిష్టాత్మక దేవాలయాల ప్రముఖులు సమావేశమవుతారు.
టెంపుల్ కనెక్ట్ వ్యవస్థాపకుడు గిరేష్ కులకర్ణి నేతృత్వంలో జరుగుతున్న ఈ మైలురాయి కార్యక్రమానికి ప్రసాద్ లాడ్ (ఐటీసీఎక్స్ 2025 చైర్మన్,మహారాష్ట్ర శాసన మండలి సభ్యుడు) సహ-నాయకత్వం వహిస్తున్నారు "ఇన్క్రెడిబుల్ ఇండియా" కార్యక్రమం కింద భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖసహకారంతో ఆలయాల కుంభమేళా నిర్వహిస్తున్నామని గిరేష్ కులకర్ణి ఒక ప్రకటనలో తెలిపారు. తొలి ఎడిషన్ 2023లో వారణాసిలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment