ధాన్యం..దైన్యం | formers feeling difficulties to sale seeds | Sakshi
Sakshi News home page

ధాన్యం..దైన్యం

Published Sun, Mar 23 2014 4:28 AM | Last Updated on Sat, Sep 2 2017 5:01 AM

formers feeling difficulties to sale seeds

ఆరుగాలం కష్టించి పండించిన పంటను మార్కెట్‌లో అమ్ముకోవడానికి అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. కొంటాం..తీసుకురండి అని చెప్పిన మార్క్‌ఫెడ్, నాఫెడ్ అధికారులు తీరా మార్కెట్‌కు పప్పుశనగ ధాన్యాన్ని రైతులు తీసుకువస్తే కనిపించకుండాపోయారు. కొనుగోలు కేంద్రాన్ని ఐదురోజులకే మూసేశారు. సరుకును విక్రయించలేక..ఇంటికి తీసుకురాలేక రైతన్నలు నిద్రహారాలు మాని ఆరురోజులుగా అక్కడే పడిగాపులుకాస్తున్నారు.  
 
 అలంపూర్, న్యూస్‌లైన్: స్థానిక అలంపూర్ చౌరస్తాలో మార్క్‌ఫైడ్, నా ఫెడ్ సంయుక్త ఆధ్వర్యంలో పప్పుశనగ కొనుగోలు కేం ద్రాన్ని ఏర్పాటుచేశారు. ఐదు రోజులపాటు కొనుగోళ్లు సాగడంతో రైతులకు కాస్త ఊరట లభించింది. కానీ ఆ తరువాత కొన్న సరుకును నిల్వచేసేందుకు గోదాములు అందుబాటులో లేవనే సాకుతో కొనుగోళ్లను నిలిపేశారు. నియోజకవర్గంలో ఈ ఏడాది సుమారు 75వేల ఎకరాల్లో రైతులు పప్పుశనగను సాగుచేశారు. రైతుల విజ్ఞప్తి మేరకు అధికారులు అలంపూర్‌లో మార్క్‌ఫైడ్, నాఫెడ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 4న కేం ద్రాలను ప్రారంభించి.. 8న కొనుగోళ్లను ప్రారంభించారు.
 
 మూడులక్షల క్వింటాళ్ల పప్పుశనగ కొ నుగోలు లక్ష్యంగా నిర్ణయించారు. అయితే ఇప్పటివరకు 25వేల క్వింటాళ్ల ధా న్యాన్ని మాత్రమే కొనుగోలు చేయగలిగింది.
 
 కానీ త ర్వాత సరుకుకు నిల్వచేయడానికి గోదాములు లేవనే సాకుతో గత వారం రోజులుగా కొనుగోళ్ల ను నిలిపేశారు. ఈ విషయం తెలియని దాదాపు 50 మంది రైతులు తమ సరుకును అలంపూర్ మార్కెట్‌యార్డుకు తీసుకొచ్చి అక్కడే నిల్వ ఉంచారు. కొనుగోళ కు అతీగతి లేక..అన్నదాతలకు కనీస సమాచారం చెప్పేవారు లేక బిక్కుబిక్కుమంటూ ధాన్యం వద్దే కా పలాఉన్నారు.
 
  రైతుల పరిస్థితి ఇ లాఉండగా, కొనుగోళ్లు లే కపోవడంతో పనిదొరక డం లేదని హమాలీలు వా పోతున్నారు. ప్రతిరోజు ఇ క్కడికి వచ్చి నిరీక్షించి వె ళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు. దీనికితోడు సరుకులను గోదాంలకు తరలించే లారీలు ఇక్కడే నిలి చిపోయాయి. అధికారు లు రైతుల పరిస్థితి గుర్తించి కొనుగోళ్లను తిరిగి ప్రారంభించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
 
 రావడం వెళ్లడంతోనే
 సరిపోతుంది..
 20 ఎకరాల్లో పండించిన ధాన్యా న్ని ఇక్కడికి తీసుకొచ్చిన. 4వ తేదీ నుం చి రోజు సరుకుల వద్ద పడిగాపులుకాస్తున్నాం. అధికారులు స్పందించి వెంటనే ధాన్యాన్ని కొనాలి.          
 - చంద్రశేఖర్‌రెడ్డి,
    రైతు, తక్కశీల
 
 పట్టించుకోవడం లేదు
 వారం రోజులుగా సరుకులతో యార్డులోనే ఉన్నాం. కానీ ఏ ఒక్క అధికారి వచ్చి పట్టించుకోవడం లేదు. అసలు సరుకులు కొంటారా..లేదా..అనే విషయం చెప్పడం లేదు. కొనుగోలు కేంద్రాన్ని కేంద్రాన్ని తెరపించి రైతులను ఆదుకోవాలి.
 - రామచంద్రారెడ్డి,
 రైతు, పెద్దపోతులపాడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement