
గడ్డి విత్తనాలకోసం బారులు
అనంతపురం : ప్రభుత్వం ఉచితంగా రైతులకు అందిస్తున్న గడ్డివిత్తనాలకోసం రైతన్నలు మంగళవారం పెద్ద ఎత్తున బారులు తీరారు. స్థానిక వ్యవసాయకార్యాలయ గోడౌన్లో పశువైద్యాధికారి శ్రీనివాసులు అధ్యర్యంలో రైతులకు 10 కేజీల చొప్పున పంపిణీ చేసారు. వీటికోసం రైతులు ఉదయం 6 గంటలకే బారులు తీరారు. మొత్తం 10 కింటాళ్ళ గడ్డివిత్తనాలను 1000 మంది రైతులకు పంపిణీ చేశారు.
(కొత్తచెరువు)