స్టేషన్ మహబూబ్‌నగర్: రంజాన్ పర్వదినానికి మసీదులు, ఈద్గాలు సుందరంగా ముస్తాబయ్యాయి. శుక్రవారం రాత్రి షవ్వాల్ నెలవంక దర్శనమివ్వడంతో ముస్లింలు 29రోజుల పాటు చేపట్టిన ఉపవాసాలను విరమించారు. చంద్రుడు కనిపించడంతో పరస్పరం ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. శనివారం జిల్లావ్యాప్తంగా ఈదుల్ ఫితర్ పండగను జరుపుకుని, మానవకల్యాణం కోసం ప్రత్యేక నమాజులు చేస్తారు.
జిల్లా కేంద్రంలోని జామీయ మసీదు నుంచి ఉదయం 9 గంటలకు ముస్లిం సామూహికంగా గడియారం చౌరస్తా మీదుగా స్థానిక వానగట్టు రహెమానియా ఈద్గా వద్దకు చేరుకుంటారు. అక్కడ10గంటలకు జామియా మసీదు ప్రధాన ఇమామ్ హాఫిజ్ ఇస్మాయిల్ ప్రత్యేక నమాజు ప్రార్థనలు చేయిస్తారు. మదీనా మసీదులో ఉదయం 9.30 గంటలకు, సిరాజుల్ ఉలుమ్‌లో 8 గంట లకు, మునీర్ మసీదులో 9 గంటలకు ప్రత్యేకనమాజు నిర్వహించనున్నారు.
ఖౌమీ ఏకతా కమిటీ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు
ఈద్ ముబారక్ చెప్పడానికి ప్రజాప్రతిని ధులు, అధికారులు ఈద్గా వద్దకు చేరుకుని పట్టణ ఖౌమీ ఏకతా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసే శిబిరంవద్దముస్లింలకు పండ గ శుభాకాంక్షలు తెలుపనున్నారు.
ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, కలెక్టర్ టీకే శ్రీదేవి, మాజీ కేంద్ర మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి, వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి మునిసిపల్ చైర్‌పర్సన్ రాధాఅమర్‌పాటు ఆయా పార్టీల నేతలు పండుగ వేడుకల్లో పాల్గొనున్నారు. ఈద్ నమాజ్ సందర్భంగా ఎలాం టి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుం డా పోలీసు అధికారులు పట్టణంలో ముం దస్తుగా బందోబస్తు ఏర్పాటుచేశారు.
ఈద్గా వద్ద ప్రత్యేక నమాజు
ఈదుల్ ఫితర్ ప్రత్యేకనమాజుకు వేలాది సంఖ్యలో ముస్లింలు వక్ఫ్ రహెమానియా ఈద్గా వద్ద రానుండటంతో ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. టెంట్లు, తాగునీటి తదితర సౌకర్యాలు ఏర్పాట్లు చేశారు. మునిసిపాలిటీ సిబ్బం ది వారం రోజుల నుంచి ఈద్గా వద్ద మరమ్మతులు చేపట్టింది.
ఈద్ ముబారక్
Published Sat, Jul 18 2015 1:11 AM | Last Updated on Thu, Jul 11 2019 6:18 PM
Advertisement