
ఉగాది, రంజాన్ వచ్చేస్తున్నాయి. వారాంతం, వెంటనే పండుగల కారణంగా బ్యాంకులకు వరుస సెలవులు లభిస్తున్నాయి. రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాలు కాకుండా.. ప్రత్యేకంగా పండుగలను దృష్టిలో ఉంచుకుని కూడా బ్యాంకులకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవులు అందిస్తుంది.
మార్చి 28న జుమాత్-ఉల్-విదా కారణంగా జమ్మూకశ్మీర్‌లో బ్యాంకులకు సెలవు, ఆ తరువాత 30న ఉగాది సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. 31వ తేదీ రంజాన్ సందర్బంగా కూడా బ్యాంకులకు సెలవు.
ఆర్ధిక సంవత్సరం చివరి రోజు (మార్చి 31)
రంజాన్ మార్చి 31న వచ్చింది. సాధారణంగా ఆ రోజు బ్యాంకులకు సెలవు. కానీ ఆర్ధిక సంవత్సరం చివరి రోజు కాబట్టి బ్యాంకులు పనిచేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడికావాల్సి ఉంది.
మొత్తం మీద 28వ తేదీ నుంచి 31 వరకు మూడు రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయని తెలుస్తోంది. బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్‌లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి.
(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్‌లో ఏవైనా అప్‌డేట్‌లు లేదా రివిజన్‌ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది).