D.Nagendra kumar
-
బై బై.. గణేశా!
తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకున్న గణపయ్య నిమజ్జనానికి తరలివెళ్లాడు. శనివారం చివరిరోజు భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. దీంతో మంటపాల వద్ద కోలాహలం నెలకొంది. విఘ్నాలు తొలగించాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు. వరాలు కురిపించాలని వరసిద్ధి వినాయకుడిని వేడుకున్నారు. పాడిపంటలు కలగాలని, పిల్లాపాపలతో సుఖసంతోషాలతో ఉండాలని గౌరీతనయుడిని కోరుకున్నారు. మహబూబ్న గర్‌లో స్థానిక గడియారం చౌరస్తా నుంచి అటు పాత గ్రంథాలయం, ఇటు పాత బస్టాండు, రాయిచూర్ రోడ్డు, జడ్చర్ల హైవే తదితర ప్రాంతాలు నిమజ్జనానికి తరలివెళ్లే గణపతి విగ్రహాల ఊరేగింపులతో పులకించిపోయాయి. జిల్లాకేంద్రంలో కలెక్టర్ జీడీ ప్రియదర్శిని, ఎస్పీ డి.నాగేంద్రకుమార్, ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ తదితరులు వినాయకులకు వీడ్కోలు పలికారు. జిల్లాలోని కల్వకుర్తి, షాద్‌నగర్, గద్వాల, అలంపూర్, అచ్చంపేట, మక్తల్‌లో నిమజ్జనోత్సవాలు కన్నులపండువగా జరిగాయి. -
వయో పరిమితి సడలించాలి
గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ : పోస్టల్ ఉద్యోగాల నియామకంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల వయో పరిమితి సడలించాలని ఆలిండియా పోస్టల్ కోస్టల్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘ కార్యదర్శి డి.నాగేంద్రకుమార్ డిమాండ్ చేశారు. సోమవారం ఎస్వీఆర్ పబ్లిక్ స్కూల్లో మచిలీపట్నం పోస్టల్ డివిజన్ ఎస్సీ, ఎస్టీ పోస్టల్ ఎంప్లాయీస్ సమావేశం జరిగింది. సమావేశానికి హాజరయిన ఆయన తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. మిగిలిన కులాలకు పోస్టల్లో 50ఏళ్ల వయో పరిమితి ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల పరిమితి పెంచాలని కోరారు. జాతీయ 7వ వేతన సంఘంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘానికి చెందిన ప్రతినిధిని సభ్యుడిగా స్వీకరించాలని డిమాండ్ చేశారు. ఏటా ఏప్రిల్ 14న జరిగే డాక్టర్ అంబేద్కర్ జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. అనంతరం మచిలీపట్నం పోస్టల్ డివిజన్ ఎస్సీ, ఎస్టీ పోస్టల్ ఎంప్లాయీస్ సంఘం 22వ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా జి.గంగాధరరావు, కార్యదర్శిగా వి.ఆంజనేయప్రసాద్, కోశాధికారిగా టి.రవీంద్రకుమార్ నాయక్‌ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో డివిజన్ ఎస్పీ వై.రామకృష్ణ, ఏఎస్పీ బి.శ్రీనివాసరరావు, సంఘం నేతలు వై.వాసుదేవరావు, దాస్, అర్జున వి.ఎ.ప్రసాద్, విజయ్, సురేష్ తదితర ఉద్యోగులు పాల్గొన్నారు. ‘మైస్టాంప్’ ఆవిష్కరణ..... మచిలీపట్నం పోస్టల్ డివిజన్ పరిధిలో రూరల్ పోస్ట్ ఇన్సూరెన్స్ పథకంలో 2 లక్షల మంది వినియోగదారులున్నారని మచిలీపట్నం పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్ వై.రామకృష్ణ అన్నారు. సోమవారం స్థానిక ఎస్వీఆర్ పబ్లిక్ స్కూల్లో డివిజన్ స్థాయి ఎస్సీ, ఎస్టీ పోస్టల్ ఎంప్లాయీస్ సమావేశానికి హాజరయ్యి ‘మై స్టాంప్’ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ రూరల్ పోస్ట్ ఇన్సూరెన్స్‌లో ప్రీమియం మీద రిబేటులున్నాయని చెప్పారు. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో చేరే వినియోగదారులకు ఎలాంటి ఐటీ ఇబ్బందులుండవన్నారు. రూ.20 వేల నుంచి 20 లక్షల వరకూ పాలసీలు చేసుకోవచ్చని తెలిపారు. రికరింగ్ డిపాజిట్లలో భాగంగా ప్రొటక్స్ సేవింగ్స్ స్కీమ్‌లో అల్పాదాయ వర్గాల వినియోగదారులు చేరుతున్నారని చెప్పారు. రూ.10 నుంచి 50 వరకూ ఈ స్కీమ్‌లో డిపాజిట్ చేసుకోవచ్చన్నారు. ప్రమాద వశాత్తు మృతి చెందితే ఐదేళ్లలో వచ్చే డిపాజిట్‌ను ముందే తీసుకోవచ్చని చెప్పారు. అలాగే వివాహాది శుభకార్యాలు, ప్రారంభోత్సవాలకు మై స్టాంప్ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. రూ.300 చెల్లిస్తే రూ.60 విలువైన 12 పోస్టల్ స్టాంప్‌లను దరఖాస్తు చేసుకున్న నిమిషాల వ్యవధిలోనే అందజేస్తామని తెలిపారు. -
అనుక్షణం అప్రమత్తం
పోలీసులకు ఎస్పీ ఆదేశం మహబూబ్‌నగర్ క్రైం, న్యూస్‌లైన్: ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డి.నాగేంద్రకుమార్ పోలీసులకు ఆదేశించారు. ఎన్నికల బందోబస్తు పర్య వేక్షణలో భాగంగా మంగళవారం జిల్లా పోలీసు అధికారులతో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్, అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో విస్తృతంగా పర్యటించాలని అధికారులకు సూచించారు. నిఘా వ్యవస్థను పటిష్టపర్చుకోవాలని అరాచక శక్తులు, అల్లరిమూకల కదలికలతో పాటు వారి వ్యవహారాల పట్ల కఠినంగా వ్యవహరించాలని చె ప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు ఏర్పాటుచేసిన తనిఖీ కేంద్రాలు, ప్రత్యేక బలగాల పనితీరుపై ఎ స్పీ సంతృప్తి వ్యక్తంచేశారు. మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న సిబ్బందితో నిరంతరం అనుసంధానం కలిగి ఉండాలని చెప్పారు. మద్యాన్ని అరికట్టేందుకు జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక పోలీసు నిఘా ఏర్పాటుచే శామన్నారు. వారం రోజులుగా పోలీసు అధికారులు, సిబ్బంది ఎన్ని కల బందోబస్తులో భాగంగా విశేష కృషిచేస్తున్నారని వారిని ప్రశంసించారు. జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో ఇప్పటి వరకు 936 లెసైన్సుడు తుపాకులను పోలీసులు జప్తుచేసుకు న్నారు. మిగతా కొందరు లెసైన్సుడ్ తుపాకులను హైదరాబాద్‌లో పోలీసులకు స్వాధీనపర్చినట్లు పేర్కొన్నారు. 2097 మందిపై బైండోవర్... ఎన్నికల నిబంధనలను పురస్కరించుకొ నిశాంతి భద్రతల కాపాడే క్రమంలో మా జీ రౌడి షీటర్లను, పోలీసు కేసులు నమోదైన వ్యక్తులపై ముందస్తు చర్యల్లో భా గంగా 206 కేసులను నమోదుచేసి 2097 మందిని బైండోవర్ చేశారు. వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశామన్నారు. 66 క్వింటాళ్ల నల్లబెల్లం స్వాధీనం ఎన్నికల్లో అక్రమ కల్తీసారాను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా 161 కేసులు నమోదుచేసి 25 42 మద్యం సీసాలను, 66 క్వింటాళ్ల నల్లబెల్లంతో పాటు నాటుసారాకు ఉపయోగించే ముడిసరుకులను పెద్ద ఎత్తున స్వాధీనపర్చుకొన్నట్లు వెల్లడించారు. నామినేషన్ల పర్వం ప్రారంభమైన నేపథ్యంలో ఊరేగింపులకు, ర్యాలీ లను అనుమతించరాదన్నారు. ప్రజల సాధారణ జీవనానికి ఇబ్బంది కలిగించే చర్యలను నిలువరించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఎన్నికల నిబంధనలు, ప్రవర్తన నియమావళి, పోలసులు తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి అవగాహన కల్పిం చేందుకు వివరాలతో కూడిన ప్యాకెట్ పుస్తకాలను ముద్రించి పంపిణీ చేయనున్నట్లు పేర్కొ న్నారు. ప్రజల సహకారంతో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు.