పోలీసులకు ఎస్పీ ఆదేశం
మహబూబ్‌నగర్ క్రైం, న్యూస్‌లైన్: ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డి.నాగేంద్రకుమార్ పోలీసులకు ఆదేశించారు. ఎన్నికల బందోబస్తు పర్య వేక్షణలో భాగంగా మంగళవారం జిల్లా పోలీసు అధికారులతో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్, అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో విస్తృతంగా పర్యటించాలని అధికారులకు సూచించారు. నిఘా వ్యవస్థను పటిష్టపర్చుకోవాలని అరాచక శక్తులు, అల్లరిమూకల కదలికలతో పాటు వారి వ్యవహారాల పట్ల కఠినంగా వ్యవహరించాలని చె ప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు ఏర్పాటుచేసిన తనిఖీ కేంద్రాలు, ప్రత్యేక బలగాల పనితీరుపై ఎ స్పీ సంతృప్తి వ్యక్తంచేశారు.
మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న సిబ్బందితో నిరంతరం అనుసంధానం కలిగి ఉండాలని చెప్పారు. మద్యాన్ని అరికట్టేందుకు జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక పోలీసు నిఘా ఏర్పాటుచే శామన్నారు. వారం రోజులుగా పోలీసు అధికారులు, సిబ్బంది ఎన్ని కల బందోబస్తులో భాగంగా విశేష కృషిచేస్తున్నారని వారిని ప్రశంసించారు. జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఇప్పటి వరకు 936 లెసైన్సుడు తుపాకులను పోలీసులు జప్తుచేసుకు న్నారు. మిగతా కొందరు లెసైన్సుడ్ తుపాకులను హైదరాబాద్‌లో పోలీసులకు స్వాధీనపర్చినట్లు పేర్కొన్నారు.
2097 మందిపై బైండోవర్...
ఎన్నికల నిబంధనలను పురస్కరించుకొ నిశాంతి భద్రతల కాపాడే క్రమంలో మా జీ రౌడి షీటర్లను, పోలీసు కేసులు నమోదైన వ్యక్తులపై ముందస్తు చర్యల్లో భా గంగా 206 కేసులను నమోదుచేసి 2097 మందిని బైండోవర్ చేశారు. వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశామన్నారు.
66 క్వింటాళ్ల నల్లబెల్లం స్వాధీనం
ఎన్నికల్లో అక్రమ కల్తీసారాను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా 161 కేసులు నమోదుచేసి 25 42 మద్యం సీసాలను, 66 క్వింటాళ్ల నల్లబెల్లంతో పాటు నాటుసారాకు ఉపయోగించే ముడిసరుకులను పెద్ద ఎత్తున స్వాధీనపర్చుకొన్నట్లు వెల్లడించారు. నామినేషన్ల పర్వం ప్రారంభమైన నేపథ్యంలో ఊరేగింపులకు, ర్యాలీ లను అనుమతించరాదన్నారు.
ప్రజల సాధారణ జీవనానికి ఇబ్బంది కలిగించే చర్యలను నిలువరించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఎన్నికల నిబంధనలు, ప్రవర్తన నియమావళి, పోలసులు తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి అవగాహన కల్పిం చేందుకు వివరాలతో కూడిన ప్యాకెట్ పుస్తకాలను ముద్రించి పంపిణీ చేయనున్నట్లు పేర్కొ న్నారు. ప్రజల సహకారంతో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు.
అనుక్షణం అప్రమత్తం
Published Wed, Mar 12 2014 3:44 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement