![Earthquake in Telangana: 3 magnitude earthquake strikes Mahbubnagar](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/7/Mahabubnagar_Earthquake.jpg.webp?itok=RCal1W4v)
మహబూబ్‌నగర్, సాక్షి: తెలంగాణలో మరోసారి భూమి కంపించింది. ఈసారి మహబూబ్ నగర్‌లో స్వల్పస్థాయిలో భూమి కంపించిందని, రిక్టర్ స్కేల్‌పై 3 తీవ్రతతో నమోదైందని అధికారులు వెల్లడించారు.
శనివారం మధ్యాహ్నాం 1గం.22ని. ప్రాంతంలో దాసరిపల్లి పరిధిలో భూమి కంపించింది. కృష్ణా పరివాహక ప్రాంతంలో.. జూరాల ప్రాజెక్టు ఎగువన, దిగువన భూమి కంపించింది.
తాజాగా.. ములుగు కేంద్రంగా 5.3 తీవ్రతతో భూమి కంపించిన సంగతి తెలిసిందే. ఈ ప్రభావం గోదావరి తీర ప్రాంతం వెంట.. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కనిపించింది. అలాగే హైదరాబాద్‌తో పాటు ఏపీలోని కొన్ని చోట్ల కూడా కొన్నిసెకన్లపాటు భూమి కంపించడం గమనార్హం.
![మహబూబ్ నగర్ లో మరోసారి భూప్రకంపనలు](https://www.sakshi.com/s3fs-public/inline-images/mt_0.jpg)
ఇదీ చదవండి: తెలంగాణను వణికించిన భూకంపం!
Comments
Please login to add a commentAdd a comment