set conference
-
ట్రెండ్ సెట్ చేస్తా
రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు కలెక్టర్ సిద్ధం ప్రతీ సోమవారం సెట్ కాన్ఫరెన్స్ సిబ్బంది వ్యవహారాలపై సీరియస్ తహశీల్దార్లకు బాధ్యతల నిర్దేశం విశాఖ రూరల్ : రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ సిద్ధమయ్యారు. సిబ్బందిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో శాఖలో సమూల మార్పులు చేయాలని భావిస్తున్నారు. రెవెన్యూ అధికారులు వారంలో చేయాల్సిన విధులను స్వయంగా పురమాయించనున్నారు. భూక్రమణలు, రికార్డుల ట్యాంపరింగ్ల విషయంలో సిబ్బంది పాత్రపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు వీఆర్వో, ఆర్ఐ చేతుల్లో ఉన్న అడంగళ్లు, 1బి రిజిస్టర్లను వెంటనే తహశీల్దార్లకు అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. కోర్టు కేసుల్లో ఉన్న భూవివాదాల వివరాలను ఆన్లైన్లో పొందుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అందుబాటులో తహశీల్దార్లు ఉండాలి తహశీల్దార్లు, ఇతర రెవెన్యూ సిబ్బంది తప్పనిసరిగా మండల కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి సోమవారం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు కలెక్టర్ మండల తహశీల్దార్లతో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు మండల కార్యాలయాల్లో సదుపాయాల్లేకపోవడంతో సెట్ కాన్ఫరెన్స్‌లో తహశీల్దార్లకు సూచనలు, ఆదేశాలు జారీ చేయాలని భావిస్తున్నారు. ప్రధానంగా ఆ వారంలో రెవె న్యూ సిబ్బంది చేపట్టాల్సిన బాధ్యతలను కలెక్టరే నిర్ధేశించనున్నారు. వాటిని వారంలోగా పూర్తి చేసి తరువాత సోమవారం జరిగే సెట్ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌కు వివరించాల్సి ఉంటుంది. ఈ సోమవారం కూడా కలెక్టర్ కొందరు తహశీల్దార్లతో సెట్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. విశాఖ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆనందపురంలో సెట్ సక్రమంగా పని చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పాడేరు రెవెన్యూ డివిజన్ పరిధిలో కూడా సాంకేతికపరంగా కొన్ని ఇబ్బందులున్నట్లు గుర్తించారు. దీంతో వచ్చే వారంలోగా అన్ని సెట్లు సక్రమంగా పనిచేసేలా చూడాలని ఆదేశించారు. రికార్డుల బాధ్యత తహశీల్దార్లదే జిల్లాలోని కొన్ని మండలాల్లో అడంగళ్లు, 1బి రిజిస్టర్లు వీఆర్వో, రెవెన్యూ ఇన్స్పెక్టర్ల చేతిలో ఉన్నాయి. రికార్డుల ట్యాంపరింగ్ విపరీతంగా జరిగినట్లు ఇటీవల నిర్వహించిన భూముల సర్వేలో వెల్లడైంది. పాత అడంగళ్లన్నింటినీ సంబంధిత తహశీల్దార్‌కు వెంటనే అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే వెబ్‌ల్యాండ్‌లో కొత్తవి ప్రింట్ తీసుకోవాలని సూచన లిచ్చారు. అసైన్ భూముల వ్యవహారంలో అనేక అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించడంతో 1బి రిజిస్టర్లు కూడా తహశీల్దార్ల వద్దే ఉండాలని సెట్ కాన్ఫరెన్స్‌లో అధికారులకు స్పష్టం చేశారు. రికార్డుల ట్యాంపరింగ్, ఇప్పటికీ అడంగళ్లు, అసెన్మైంట్ రిజిస్టర్లు వీఆర్వో, ఆర్ఐల వద్ద ఉంటే అందుకు తహశీల్దార్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కోర్టుల్లో 629 భూ వివాదాలు జిల్లాలో ప్రభుత్వ భూముల వివాదాలకు సంబంధించి న్యాయస్థానాల్లో 629 కేసులున్నట్లు అధికారులు గుర్తించారు. వాటిలో ప్రధానమైన కేసులను వేగంగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోడానికి వీలుగా అన్ని కేసుల వివరాలను కంపూటర్లో పొందుపరచాలని కలెక్టర్ నిర్ణయించారు. తద్వారా ఏ కేసు ఏ స్థాయిలో ఉంది, ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయం స్పష్టంగా తెలుస్తుందని ఆయన భావిస్తున్నారు. -
అనుక్షణం అప్రమత్తం
పోలీసులకు ఎస్పీ ఆదేశం మహబూబ్‌నగర్ క్రైం, న్యూస్‌లైన్: ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డి.నాగేంద్రకుమార్ పోలీసులకు ఆదేశించారు. ఎన్నికల బందోబస్తు పర్య వేక్షణలో భాగంగా మంగళవారం జిల్లా పోలీసు అధికారులతో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్, అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో విస్తృతంగా పర్యటించాలని అధికారులకు సూచించారు. నిఘా వ్యవస్థను పటిష్టపర్చుకోవాలని అరాచక శక్తులు, అల్లరిమూకల కదలికలతో పాటు వారి వ్యవహారాల పట్ల కఠినంగా వ్యవహరించాలని చె ప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు ఏర్పాటుచేసిన తనిఖీ కేంద్రాలు, ప్రత్యేక బలగాల పనితీరుపై ఎ స్పీ సంతృప్తి వ్యక్తంచేశారు. మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న సిబ్బందితో నిరంతరం అనుసంధానం కలిగి ఉండాలని చెప్పారు. మద్యాన్ని అరికట్టేందుకు జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక పోలీసు నిఘా ఏర్పాటుచే శామన్నారు. వారం రోజులుగా పోలీసు అధికారులు, సిబ్బంది ఎన్ని కల బందోబస్తులో భాగంగా విశేష కృషిచేస్తున్నారని వారిని ప్రశంసించారు. జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో ఇప్పటి వరకు 936 లెసైన్సుడు తుపాకులను పోలీసులు జప్తుచేసుకు న్నారు. మిగతా కొందరు లెసైన్సుడ్ తుపాకులను హైదరాబాద్‌లో పోలీసులకు స్వాధీనపర్చినట్లు పేర్కొన్నారు. 2097 మందిపై బైండోవర్... ఎన్నికల నిబంధనలను పురస్కరించుకొ నిశాంతి భద్రతల కాపాడే క్రమంలో మా జీ రౌడి షీటర్లను, పోలీసు కేసులు నమోదైన వ్యక్తులపై ముందస్తు చర్యల్లో భా గంగా 206 కేసులను నమోదుచేసి 2097 మందిని బైండోవర్ చేశారు. వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశామన్నారు. 66 క్వింటాళ్ల నల్లబెల్లం స్వాధీనం ఎన్నికల్లో అక్రమ కల్తీసారాను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా 161 కేసులు నమోదుచేసి 25 42 మద్యం సీసాలను, 66 క్వింటాళ్ల నల్లబెల్లంతో పాటు నాటుసారాకు ఉపయోగించే ముడిసరుకులను పెద్ద ఎత్తున స్వాధీనపర్చుకొన్నట్లు వెల్లడించారు. నామినేషన్ల పర్వం ప్రారంభమైన నేపథ్యంలో ఊరేగింపులకు, ర్యాలీ లను అనుమతించరాదన్నారు. ప్రజల సాధారణ జీవనానికి ఇబ్బంది కలిగించే చర్యలను నిలువరించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఎన్నికల నిబంధనలు, ప్రవర్తన నియమావళి, పోలసులు తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి అవగాహన కల్పిం చేందుకు వివరాలతో కూడిన ప్యాకెట్ పుస్తకాలను ముద్రించి పంపిణీ చేయనున్నట్లు పేర్కొ న్నారు. ప్రజల సహకారంతో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు.