విజయం | Achievement in pica sports comipition in mahabubnagar district | Sakshi
Sakshi News home page

విజయం

Published Sat, Jan 11 2014 3:47 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM

Achievement in pica sports comipition in mahabubnagar district

వారంతా గ్రామీణ నేపథ్యం ఉన్న క్రీడాకారులు... సొంతూరులో క్రీడా వసతులు లేకున్నా పీఈటీలు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సత్తా చాటుతున్నారు. ఇష్టమైన క్రీడాంశంలో రాణించాలన్న వారి తపన జాతీయస్థాయికి తీసుకెళ్లింది. జిల్లాకేంద్రంలో జరిగిన జాతీయ స్థాయి ‘పైకా’ పోటీల్లో అండర్-16 రాష్ట్ర జట్టు తక్కువ సమయంలో సరైన ప్రణాళిక, క్రమశిక్షణతో ఆడి హేమాహేమీ జట్లను మట్టికరిపించి చాంపియన్‌గా నిలిచింది. మ్యాచ్‌లు ముగిసిన వెంటనే ఎప్పటికప్పుడు తప్పులను సరిచేసుకుంటూ కోచ్ సలహాలు, సూచలనలతో స్ఫూర్తిదాయకమైన ఆటతీరును కనబరిచారు. జట్టులో నాలుగురు మొదటిసారి జాతీయస్థాయి టోర్నీలో ఆడారు. స్వర్ణం పతకం సాధించడంలో కీలకంగా ఉన్న ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం...           
 - న్యూస్‌లైన్, మహబూబ్‌నగర్  
 
 సెంటర్‌బ్లాకర్ గా తీరుగులేని నరేష్
 విజయనగరంకు చెందిన నరేష్ రాష్ట్ర జట్టులో సెంటర్ బ్లాకర్‌గా రాణించాడు. కొన్నిసార్లు జట్టు ఓటమి పరిస్థితుల్లో ఉన్నసమయంలోఒంటిచేత్తో గెలిపించాడు. ఆరు సార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. గతేడాది దాలి యా(మధ్యప్రదేశ్)లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో తొలిసారి రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ‘మా నాన్న గాంధీ వ్యవసాయ కూలీగా పని చేస్తున్నాడని, ఆర్థికంగా లేకున్నా ఆయ న ప్రోత్సాహంతోనే ఈ స్థాయిలో రాణిస్తున్నాను’ అని నరే ష్ పేర్కొన్నాడు.
 
 బ్లాకర్‌గా కరీముల్లా నైపుణ్యం  
 వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన కరీముల్లా ఈ టోర్నీలో బ్లాకర్‌గా విశేషమైన నైపుణ్యం ప్రదర్శించారు. హర్యానాతో జరిగిన సెమీఫైనల్లో గాయపడినా, ఫైనల్‌కు కోలుకున్నాడు.ఉత్తరప్రదేశ్‌తో జరిగి న తుది సమరం లో ప్రత్యర్థుల షాట్‌లను బ్లాక్ చేస్తూ అబ్బురపరిచా డు. ఇదివరకు నాలుగుసార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో పా ల్గొన్న ఆయన తొలిసారి జాతీయస్థాయిలో ఆడుతున్నాడు. ‘రెండేళ్లుగా జట్టు కు వాలీబాల్ నేర్చుకుంటున్నాని, మానాన్న కాశీం కూడావాలీబాల్ ప్లేయర్ కా వడంతో నాకు ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నారు’ అని క రీముల్లా చెబుతున్నాడు.
 
 అటా‘కింగ్’అనిల్   
 విజయనగరం జిల్లాకు చెందిన అనిల్ అటాకర్‌గా అద్భుతాలు చేశాడు.సెమీస్, ఫైనల్లో అటాకర్‌గా జట్టుకు విలువైన పాయింట్లు సాధించాడు. చూడముచ్చటైన షాట్లతో ఫైనల్‌లో అందరినీ ఆకట్టుకున్నాడు. తొలిసారిగా జాతీయస్థాయి టోర్నీలో ఆడుతున్నాడు. ‘మా నాన్న రవి కూలీపని చేస్తారని, అయినా నాకు ఆటల్లో ఎంతో ప్రోత్సహిస్తున్నారు. జాతీయస్థాయిలో రాణించేందుకు ఇంకా కృషి చేస్తా’నని అనిల్ అంటున్నాడు.
 
 సెకండ్ ఫాసెస్ట్ రన్నర్
  మహబూబ్‌నగర్ క్రీడలు, న్యూస్‌లైన్: పైకా అథ్లెటిక్ క్రీడల్లో ముఖ్యమైన బాలుర100మీటర్ల స్ప్రింట్‌లో ఖమ్మం జిల్లాఎల్లందుకు చెందిన అయ్యప్ప ప్రసాద్ రెండో స్థానంలో నిలిచి,రజతం సొంతం చేసుకున్నాడు.11.13 సె కండ్లలో లక్ష్యాన్ని చేరి, టోర్నీలో సెకండ్ ఫాస్టెస్ట్ రన్నర్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా ఆయన న్యూస్‌లైన్‌తో మాట్లాడుతూ ‘నేను 100, 200 మీట ర్ల స్ప్రింట్‌లో పాల్గొంటా. 2011లో యూపీలో, 2012లో తమిళనాడు, కేర ళ, గతేడాది బెంగళూర్‌లో జరిగిన అథ్లెటిక్స్ మీట్‌లో పాల్గొన్నాను. పదిసార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని, పతకాలు గెలిచాను. కోచ్ ఎండీ గౌస్ శిక్షణ ఇస్తున్నారు. భవిష్యత్తులో ఇంటర్నేషనల్ 100 మీటర్ల స్ప్రింట్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించడమే తన చిరకాల కోరిక’ అని చెబుతున్నాడు.
 
 మెరిసిన ప్రియాంక  
 బాలికల వాలీబాల్‌లో ఆంప్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచినా... జట్టులో ప్రియాంక మాత్రం అద్భుతంగా ఆడింది. కృష్టాజిల్లా పెందూర్తికి చెందిన ప్రియాంక తన ఆటతీరుతో కోచ్‌లను సైతం ఆశ్చర్చపరిచింది. లీగ్, క్వార్టర్స్‌లో ఒంటిచేత్తో జట్టుకు విజయాలు అందించింది. అటాకర్, బ్లాకర్‌గా, సెంటర్ బ్లాకర్‌గా కోర్టులో అన్ని వైపులా తిరుగుతూ ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టింది. అయితే కీలకమైన సెమీఫైనల్లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆమె గాయపడటం రాష్ట్ర జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. నెట్‌వద్ద ప్రియాంక బ్లాకింగ్ చేస్తున్నప్పుడు గుజరాత్ క్రీడాకారిణి కాలుతో తొక్కడంతో తీవ్రంగా గాయపడింది. గాయం ఉన్నా మూడోస్థానం కోసం కేరళతో జరిగిన మ్యాచ్‌లోనూ బరిలోకి దిగింది. తొలిరెండు సెట్లలో బాగా ఆడినప్పటికీ, మరోసారి గాయపడటంతో జట్టు మ్యాచ్‌ను కోల్పోవాల్సి వచ్చింది. ప్రియాంక 2010లో బళ్లారి (కర్ణాటక), 2011లో కరీంనగర్, 2012లో కేరళ, గుజరాత్‌లలో జరిగిన వాలీబాల్ జాతీయ పోటీల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది. ఇప్పటివరకు 16సార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. రైస్‌మిల్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న తండ్రి, కోచ్ రమాదేవి శిక్షణలో తాను ఈ స్థాయికి చేరినట్లు ప్రియాంక చెబుతోంది.
 
 నడిపిస్తున్న నాయకుడు
 ‘పైకా’ వాలీబాల్‌లో రాష్ట్ర జట్టు చాంపియన్‌గా నిలవడంలో కెప్టెన్ వంశీ (ప్రకాశం జిల్లా) కీలకపాత్ర వహించాడు. జట్టును సమన్వయంతో ముందుకు తీసుకువెళుతూ టోర్నీలో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. కోర్టులో అటు అటాకింగ్, బ్లాకర్‌గా విశేషంగా రాణించాడు. అండర్-12 నుంచి పలు నేషనల్ గేమ్స్‌లో అత్యుత్తమ ప్రతిభ చూపాడు. గతేడాది కరీంనగర్‌లో జరిగిన సబ్‌జూనియర్ జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 2011లో కేరళ, 2010 కడ్వ(మధ్యప్రదేశ్), 2009 భోపాల్(మధ్యప్రదేశ్) జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం కాకినాడ శాప్ వాలీబాల్ అకాడమీలో చదువుతున్నాడు. రాష్ట్ర జట్టు కోచ్ సురేష్‌కుమార్ శిక్షణతో రాటుదేలాడు.  భవిష్యత్తులో భారతజట్టుకు ఎంపికయ్యేందుకు తీవ్రంగా శ్రమిస్తానని వంశీ చెబుతున్నాడు.
 
  తక్కువ సమయంలో... సరైన శిక్షణ
 విజయవాడలో ఈనెల 1 నుంచి 3 వరకు రాష్ట్ర పైకా వాలీబాల్ పోటీలు జరిగాయి. జట్టును ఎంపిక చేసిన తర్వాత మూడు రోజులే ఉన్నప్పటికీ ఈ నెల 5 నుంచి రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ స్టేడియంలో ఆటగాళ్లకు సరైన ప్రణాళికతో శిక్షణ అందించాను. కోర్టులో ఎవరు ఏస్థానానికి సరిపోతాడో ముందుగానే విభజించి శిక్షణ ప్రారంభించాను. మూడు రోజుల్లో వారిలోని లోపాలను సరిచేశా. ఈ టోర్నీలో ఉత్తరాది రాష్ట్రాల జట్లే వాలీబాల్ గెలుస్తారనే భావన చాలా మందిలో ఉండేది.

 లీగ్‌మ్యాచ్‌ల నుంచి క్రీడాకారులను సమన్వయం పరిచాను. ప్రశాంతంగా, ఎలాంటి ఒత్తడి లేకుండా ఆడాలని వారిని పదే పదే చెప్పాను. ఆ విధానమే చాంపియన్‌గా నిలిపింది. శ్రీధర్ బ్లాకర్‌గా, నరేష్ అటాకర్‌గా, సురేష్ సెట్టర్‌గా విశేషంగా రాణించారు. నైపుణ్యంగల శిక్షణ తీసుకుంటే జట్టులో చాలామంది అంతర్జాతీయస్థాయికి ఎదిగే అవకాశం ఉంది.
 - సురేష్‌కుమార్, రాష్ట్ర బాలుర వాలీబాల్ కోచ్
 
 ఆలౌరౌండర్ శ్రీధర్
 రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌కు చెందిన శ్రీధర్ కోర్టులో ఆల్‌రౌండర్‌గా రాణించాడు. జట్టులో అత్యంత కీలక ఆటగాడిగా ఉన్నాడు. కోర్టులో అన్ని స్థానాల్లో ఉంటూ పాయింట్లు సాధించాడు. ఇప్పటి వరకు రెండుసార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న శ్రీధర్ తొలిసారిగా జాతీయస్థాయి పోటీల్లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఫైనల్లో శ్రీధర్ అద్భుత ఆటతీరుతో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాడు.  
 
 పొట్టివాడు గట్టివాడే...
 రాష్ట్ర వాలీబాల్ జట్టులో ఎత్తు తక్కువగాఉన్న సురేష్ సెట్టర్‌గా విశేషంగా రాణించాడు. జట్టు విజయంలో ప్రధాన పాత్ర అని చెప్పవచ్చు. కోర్టులో ఎక్కడ ఉన్నా రెండో బాల్‌ను అందుకుని తన సహచరులకు లిఫ్ట్ ఇచ్చాడు. జాతీయస్థాయి టోర్నీలో పా ల్గొనడం ఇదే తొలిసారి. సురేష్ తండ్రి మనోహన్‌రావు లారీడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబసభ్యులు ప్రోత్సాహం తో పాటు కోచ్ సురేష్‌కుమార్ శిక్షణతో ఈ స్థాయికి ఎదిగినట్లు సురేష్ తెలిపాడు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement