నిమిషం లేటైతే ఇంటికే..
కరీంనగర్‌ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్)ను ఆదివారం నిర్వహించడానికి జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లావ్యాప్తంగా 28,117 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. వీరికోసం జిల్లాకేంద్రంలో 107 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పేపర్-1 పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో కె.లింగయ్య తెలిపారు.
గుర్తుంచుకోండి..
అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు.
పరీక్ష ముగిసేంత వరకు సెంటర్ నుంచి బయటికి వెళ్లరాదు. అభ్యర్థులు, ఇన్విజిలేటర్లు సెల్‌ఫోన్లు లోనికి తెచ్చుకోరాదు.
కాలిక్యులెటర్లు, మహిళల హ్యాండ్ బ్యాగులను లోనికి తీసుకెళ్లేందుకు అమతించరు. పరీక్షలో బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే వాడాలి.