అచ్చంపేట, న్యూస్‌లైన్: విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడల్లో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని డీఎస్‌డీఓ శ్రీధర్‌రావు పేర్కొన్నారు. అచ్చంపేట ఎన్‌టీఆర్ మి నీ స్టేడియంలో గురువారం స్వామి వివేకనంద గ్రామీణ 6వ అండర్-16 అథ్లెటిక్స్ పైకాకు జిల్లా జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని, విద్యార్థులు క్రీడల పట్ల మక్కు వ కనబర్చాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణతో క్రీడల్లో రాణించాలన్నారు.
జనవరి 7నుంచి 10 వరకు జిల్లా కేంద్రంలో స్వామి వివేకనంద జాతీయస్థాయి పైకా అథ్లెటిక్, వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అచ్చంపేట సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాస్థాయి క్రీడలను స్థానిక స్టేడియంలో నిర్వహిం చాలని, అందుకు తనవంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్, ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, స్టేడియం కోచ్ శ్రీనువాస్ యాదవ్, పీడీలు, పీఈటీలు నాగేష్, వసంత్, తదితరులు పాల్గొన్నారు.
జాతీయస్థాయిలో రాణించాలి
Published Fri, Dec 13 2013 3:25 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM
Advertisement