sridhar rao
-
సిగ్గు విడిచి.. చిలవలు పలవలు
సింగరాయకొండ/ఒంగోలు టౌన్: ఎక్కడ చిన్న గొడవ జరిగినా అది వైఎస్సార్సీపీకి అంటగట్టడం ఎల్లో బ్యాచ్‌కు అలవాటుగా మారింది. జరిగిన ఘటనపై టీడీపీ నేతలు వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. వెనువెంటనే వారి అనుకూల ఛానల్స్‌లో అసత్య కథనాలు మొదలైపోతాయి. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో జరిగిన కారు దహనం ఘటన దానికి నిదర్శనంగా నిలిచింది. మూలగుంటపాడు పంచాయతీ విద్యానగర్‌లో టీడీపీ నేత చిగురుపాటి శేషగిరిరావు నివాసముంటున్నాడు.శుక్రవారం అర్ధరాత్రి అతని ఇంటి ఆవరణలోని కారుపై కొందరు పెట్రోలు పోసి తగలబెట్టారు. అయితే ఇది పాత కక్షల నేపథ్యంలో జరిగిందని, రాజకీయాలకు సంబంధంలేదని బాధితుడితోపాటు పోలీసులు చెబుతున్నా పచ్చ నేతలు దానికి రాజకీయ రంగు పులిమి శిలవలు పలవలు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఒంగోలులో ఏఎస్పీ (క్రైం) శ్రీధర్‌రావు మీడియాకు వివరించారు. వ్యక్తిగత విద్వేషాలతోనే శేషగిరిరావును భయభ్రాంతులకు గురిచేసేందుకు కారు దహనానికి పాల్పడ్డారని, ఇందులో రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు. అసలు జరిగింది ఇదీ.. సింగరాయకొండ లారీ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న శేషగిరిరావుకు అదే గ్రామానికి చెందిన లాడ్జి యజమాని కనసాని ఈశ్వర్‌రెడ్డికి మధ్య భూ వివాదం ఉంది. ఈశ్వర్‌రెడ్డికి, అశోక్ అనే వ్యక్తికి మధ్య ఒక భూ వివాదానికి సంబంధించి మధ్యవర్తిగా వ్యవహరించిన శేషగిరిరావు అందుకు సంబంధించిన సెటిల్మెంట్ పత్రాలను తన వద్దనే ఉంచుకొన్నాడు. అయితే ఆ పత్రాలను తనకు ఇవ్వవలసిందిగా ఈశ్వర్‌రెడ్డి కొద్ది రోజులుగా అడుగుతున్నా ప్రయోజనం లేకుండా పోయింది. అంతేకాకుండా ఈశ్వర్ రెడ్డి మీద శేషగిరిరావు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు.దీంతో కక్ష పెంచుకున్న ఈశ్వర్ రెడ్డి తన వద్ద పనిచేసే పాలేటి అభిõÙక్ అతడి మిత్రుడైన ఒక మైనర్ సహాయంతో శేషగిరిరావు ఇంటివద్ద ఉన్న కారుపై పెట్రోలు పోసి తగలబెట్టించాడు. శేషగిరిరావు ఫిర్యాదు చేసిన వెంటనే ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ స్పందించారు. ఈ కేసును ఛేదించేందుకు అడిషనల్ ఎస్పీ (క్రైం) శ్రీధర్ రావు, ఒంగోలు డీఎస్పీ కిశోర్ కుమార్ల ఆధ్వర్యంలో 6 టీంలను రంగంలోకి దించారు. అన్నీ కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు శనివారం మధ్యాహ్నం సింగరాయకొండ బైపాస్ వద్ద ఈశ్వర్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. వైఎస్సార్ సీపీపై నింద వేసేందుకు ఒత్తిడి ఇందులో వ్యక్తిగత కక్షలు తప్ప రాజకీయ నేపథ్యం లేదు. అయితే ఈ ఘటనకు వైఎస్సార్సీపీయే కారణం అని ఫిర్యాదు చేయాలంటూ శేషగిరిరావుపై టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చారు. వాస్తవానికి ఈశ్వరరెడ్డి వైఎస్సార్సీపీ నాయకుడు కాదు. ఆయనకు టీడీపీ నాయకులతో సంబంధాలున్నాయి. వాస్తవాలను కప్పిపుచ్చుతూ టీడీపీ, వైఎస్సార్సీపీల మధ్య వివాదంగా చిత్రీకరించాలని చూడడంపై స్థానికులు విస్మయం చెందారు. -
టీవీ 5 సాంబశివరావు చెప్పేవన్నీ అబద్ధాలే!
సాక్షి, హైదరాబాద్: హిందుస్తాన్ పెట్రోలియం లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్)కు, సంధ్య కన్స్ట్రక్షన్కు మధ్య జరిగిన పెట్రోల్ బంక్ ఒప్పందం వివాదంలో టీవీ–5 వైస్ ప్రెసిడెంట్ సాంబశివరావు అసలు వాస్తవాలను దాచి అన్నీ అబద్ధాలే చెబుతున్నారని సంధ్య కన్స్ట్రక్షన్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత సరనాల శ్రీధర్ రావు ఆరోపించారు. స్థలం సాంబశివరావుది కాదు.. పెట్టుబడీ ఆయనది కాదు.. కానీ, పెట్రోల్ బంక్ డీలర్షిప్ మాత్రం ఆయన వాళ్ల పేరు మీద పెట్టుకుని బాగోతం నడిపారని విమర్శించారు. టీవీ–5తో తనకున్న పరిచయాలను వాడి తన కోడలు కొల్లి సౌమ్య పేరు మీద డీలర్షిప్ తీసుకొని అస లు వాస్తవాలను దాస్తూ మీడియా ముందు మాత్రం సాంబశివరావు నంగనాచి కబుర్లు చెబుతున్నాడని శ్రీధర్‌రావు ధ్వజమెత్తారు. మాదాపూర్‌లోని పెట్రోల్ బంక్‌కు సంబంధించి డాక్యుమెంట్లు అన్నీ పక్కాగా ఉంటే హెచ్‌పీసీఎల్ ఎందుకు బంక్‌ను మూసి వేసిందని ప్రశ్నించారు? ఆయనకున్న పోలీసు, రాజకీయ పలుకుబడితో తనకు టుంబ సభ్యులు, వ్యాపారాల గురించి ప్రతికూల వార్తల ను ప్రచారం చేస్తూ పరుపు నష్టాన్ని కలిగిస్తున్నారని ఆరోపించారు. ‘సాక్షి’తో శ్రీధర్‌రావు చెప్పిన వివరాల ప్రకారం.. స్థలం అసలు కథ ఇదీ.. సరనాల శ్రీధర్ భార్య సంధ్యకు శేరిలింగంపల్లిలోని మాదాపూర్ గ్రామంలో సర్వే నంబరు–64లోని హుడా టెక్నో ఎన్‌క్లేవ్‌లో సెక్టార్– 3లోని ప్లాట్ నంబరు–26లో నార్త్ఈస్ట్ దిక్కున 1,200 చదరపు మీటర్ల స్థలం ఉంది. ఇందులో 600 చ.మీ. స్థలాన్ని సంధ్య తన వ్యాపార అవసరాల కోసం ఇతరులకు విక్రయించింది. ఇంకా తన వద్ద 600 చ.మీ. స్థలం ఉంది. 2018లో కొందరు రియల్ ఎస్టేట్ మార్కెట్ మిత్రులతో కలిసి సాంబశివ రావు శ్రీధర్ రావును కలిశాడు. ‘మీది తెనాలే మాది తెనాలే’అంటూ మాట కలిపాడు. 600 చ.మీ. స్థలంలో పెట్రోల్ బంక్ పెడదామని సలహా ఇచ్చాడు. తనకు ఆయిల్ కంపెనీలతో సత్సంబంధాలు ఉన్నాయని, పోలీసు, మున్సిపల్ అనుమతులన్నీ తానే చూసుకుంటానని నమ్మించాడు. 25:75 శాతం వాటాతో సాంబశివరావు, సంధ్య కన్స్ట్రక్షన్తో ఒప్పందం చేసుకున్నాడు. నెలకు రూ.3.15 లక్షలు అద్దె చెల్లించేలా 600 చదరపు మీటర్ల స్థలంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తూ హెచ్‌పీసీఎల్‌కు, సంధ్య కన్స్ట్రక్షన్కు రిజిస్టర్డ్ లీజు డీడ్ జరిగింది. పెట్రోల్ బంక్ ఏర్పాటయింది. అంతా బాగానే నడుస్తున్న క్రమంలో.. పక్కనే ఉన్న మరో 600 చదరపు మీటర్ల స్థలంలో కూడా బంక్‌ను విస్తరిద్దామని సాంబశివరావు సూచించాడు. ఇక్కడే ఫోర్జరీ చేసింది.. దీంతో అప్పటికే ఆమ్మేసిన ఈ స్థలాన్ని 2020 జనవరిలో రూ.కోట్లు వెచ్చించి తిరిగి సంధ్య కన్స్ట్రక్షన్ కొనుగోలు చేసింది. అయితే విస్తరించే ఈ బంక్‌కు నెలకు చెల్లించే అద్దె కేవలం రూ.1.15 లక్షలు మాత్రమేనని తెలిసింది. దీంతో పునరాలోచనలో పడ్డారు. కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన స్థలంలో పెట్రోల్ బంక్‌కు వచ్చే అద్దె రూ.1.15 లక్షలు అనే సరికి వెనక్కి తగ్గారు. కానీ, టీవీ–5 సాంబశివరావు హెచ్పీసీఎల్లో డీజీఎం స్థాయిలో తనకున్న పరిచయాలతో స్థలం యజమానికి తెలియకుండా ఈ రెండో భాగం 600 చదరపు మీటర్ల స్థలాన్ని ఫోర్జరీ సంతకాలతో హెచ్‌పీసీఎల్‌కు లీజుకు ఇచ్చేశాడు. కానీ, మీడియా ముందు మాత్రం తొలుత హెచ్‌పీసీఎల్‌కు, సంధ్య కన్స్ట్రక్షన్కు మధ్య 600 చ.మీ. స్థలంలో జరిగిన పెట్రోల్ బంక్ డాక్యుమెంట్లను మాత్రమే చూపిస్తూ జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. అందర్నీ మేనేజ్ చేసి..: జర్నలిస్ట్ కావడంతో తనకున్న రాజకీయ, పోలీసు పరిచయాలను టీవీ–5 సాంబశివరావు పూర్తిస్థాయిలో వినియోగించుకున్నాడు. వాస్తవానికి ఈ పెట్రోల్‌బంక్ వి స్తరణ చేసిన 600 చదరపు మీటర్ల స్థలానికి యజమానికి, హెచ్‌పీసీఎల్‌కు మధ్య ఎలాంటి రిజిస్టర్డ్ లీజు డీడ్ జరగలే దు. హెచ్పీసీఎల్లో తనకున్న పరిచయాలతో స్థల యజమాని సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ అగ్రిమెంట్‌ను సృష్టించాడు. ఈ ఫోర్జరీ డాక్యుమెంట్లను సమర్పించే స్థానికంగా పోలీసు, మున్సిపల్ అనుమతులను తీసుకున్నాడు. దిక్కులేక ఠాణా మెట్లెక్కి.. స్థల యజమానికి విషయం తెలియడంతో.. తన వాటా 75 శాతంపై సాంబశివరావును నిలదీశారు. రూ.30 లక్షలు ఇస్తే 75 శాతం వాటా డాక్యుమెంటేషన్ ప్రక్రియ మొదలుపెడతానని మెలిక పెట్టడంతో చేసేదేం లేక చెక్ రూపంలో రూ.30 లక్షలు సాంబశివరావుకు చెల్లించారు. ఏళ్లు గడిచినా బంక్ డీలర్షిప్ తమ పేరు మీద బదలాయించకపోయే సరికి దిక్కు తోచని స్థితిలో ఈ ఏడాది జనవరి 31న స్థల యజమాని శ్రీధర్‌రావు మాదాపూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హెచ్‌పీసీఎల్ ఏం అంటోంది? ఈ వ్యవహారంపై అంతర్గత విచారణ చేపట్టిన హెచ్‌పీసీఎల్.. పెట్రోల్ బంక్ విస్తరణ సమయంలో సమర్పించిన డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించకుండా నిర్ణయం తీసుకున్నట్లు స్వయంగా ఇంధన సంస్థే వెల్లడించింది. అందుకే విస్తరించిన 600 చదరపు మీటర్ల స్థలాన్ని పాక్షికంగా సీజ్ చేశామని, న్యాయబద్ధంగా ఒప్పందం చేస్తే నెలకు రూ.1.57 లక్షలు అద్దె చొప్పున 2020 నుంచి పరిహారాన్ని చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కారు కొట్టేసిన సాంబశివరావు సంధ్య కన్స్ట్రక్షన్ అండ్ ఎస్టేట్స్ ప్రై.లి. (గతంలో సంధ్య హోటల్స్ ప్రై.లి.) 2019 సెప్టెంబర్ 13న మాదాపూర్‌లోని యాక్సిస్ బ్యాంక్ కరెంట్ ఖాతా నంబరు: 910020004191308 నుంచి 039927 డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ)ను తీసుకుంది. వరుణ్ మోటార్స్ ప్రై.లి. పేరు మీద మారుతీ స్విప్ట్ కారు కోనుగోలు చేసేందుకు ఈ డీడీను తీసుకుంది. అయితే యాజమాన్యం కోరిన మోడల్ కారు డెలివరీలో జాప్యం జరిగింది. ఈక్రమంలో టీవీ–5 సాంబశివరావు ఎంటరయ్యాడు. తనకున్న పరిచయాలతో త్వరగా కారు డెలివరీ అయ్యేలా చేస్తానని నమ్మించి డీడీని తీసుకున్నాడు. ఎన్ని రోజులైనా ఎలాంటి స్పందన లేదు. గట్టిగా ప్రశ్నిస్తే కొత్త అప్‌గ్రేడ్ మోడల్ వస్తోందని, పాత కారు ధరకే అప్‌గ్రేడ్ మోడల్ ఇప్పిస్తానని నమ్మించాడు. దీంతో అతని మాయమాటలు నమ్మి కొంతకాలం వేచిచూశారు. అ యినా నెలలు గడుస్తున్నా కారు డెలివరీ మాత్రం కాలే దు. డీడీ కూడా తిరిగి ఇవ్వలేదు. దీంతో డీడీ ఇవ్వమని మరోసారి అడిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయనీ, తనకు రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు బాగా తెలుసని బెదిరించడం మొదలుపెట్టాడు. తీరా అసలు విషయం ఏంటంటే.. ఆ డీడీని ఉపయోగించుకొని సాంబశివరావు తన వ్యక్తిగత అవసరాల కోసం కారును కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈమేరకు మాదాపూర్ పోలీసు స్టేషన్లో బాధితుడు శ్రీధర్ రావు పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. డీడీ, బ్యాంక్ స్టేట్మెంట్ కాపీలను పోలీసులకు అందజేశారు. -
సంధ్య హోటల్స్ ఎండీ శ్రీధర్‌రావుకు నోటీసు
సాక్షి,హైదరాబాద్: రియల్ఎస్టేట్ మోసాలతోపాటు భూ కబ్జాలకు పాల్పడిన సంధ్య హోటల్స్, కన్వెన్షన్ ఎండీ సరనాల శ్రీధర్‌రావుకు నార్సింగి పోలీసులు 41 సీఆర్పీ నోటీసు జారీ చేశారు. గతంలో రాయదుర్గం, గచ్చిబౌలి పోలీస్స్టేషన్లలో అతనిపై ఫిర్యాదులు అందడంతో కేసులు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోనూ ఓ భూకబ్జా వ్యవహారంపై కేసు నమోదు అయ్యింది. సదరు కేసులో నార్సింగి పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా ఈనెల 22 వరకు అతడిని అరెస్టు చేయవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు వేచి చూసిన నార్సింగి పోలీసులు శుక్రవారం జూబ్లీహిల్స్ నందగిరిహిల్స్‌లోని అతని నివాసానికి వెళ్లారు. అతను ఇంట్లో లేకపోవటంతో 41సీఆర్పీ నోటీసును ఇంటికి అతికించి వచ్చినట్లు నార్సింగి సీఐ శివకుమార్ పేర్కొన్నారు. అతనిపై కేసులు నమోదైన నేపథ్యంలో విచారణకు సహకరించకుండా బెంగుళూరులో తలదాచుకున్నట్లు నగర పోలీసులు గుర్తించారు. దీంతో శ్రీధరరావు కోసం బెంగళూరుకు సైబరాబాద్ పోలీసులు స్పెషల్ టీం ని పంపించారు. చదవండి: రాత్రి భోజనం చేసి పడుకున్నాడు.. ఉదయం లేచి చూసేసరికి.. -
మసాజ్ చేయమని కత్తితో బెదిరించి అసహజ లైంగిక దాడికి పాల్పడ్డాడు..
సాక్షి, హైదరాబాద్: భవన నిర్మాణాలు చేస్తానని చెప్పి వినియోగదారులను మోసం చేసిన కేసుల్లో నిందితుడిగా ఉన్న సంధ్య కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సరనాల శ్రీధర్‌రావుపై అసహజ లైంగికదాడి కేసు నమోదయ్యింది. శ్రీధర్‌రావు తనపై అత్యంత క్రూరంగా లైంగిక దాడికి పాల్పడినట్టు ఆయన జిమ్ ట్రైనర్, వ్యక్తిగత సహాయకుడు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సనత్‌నగర్ పోలీసులు శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సనత్‌నగర్‌కు చెందిన సీహెచ్ చౌదరి (పూర్తి పేరు రాయడం లేదు).. స్థానిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మసాజ్ చేయమని, కత్తితో బెదిరించి.. నందగిరి హిల్స్‌లో ఉంటున్న శ్రీధర్‌రావు దగ్గర చౌదరి జిమ్ ట్రైనర్, వ్యక్తిగత సహాయకుడు, బాడీగార్డుగా పని చేస్తున్నాడు. అక్టోబర్ 10వ తేదీ రాత్రి ఇద్దరూ బయటకు వెళ్లి 1.30 ప్రాంతంలో తిరిగి వచ్చారు. కాసేపటి తర్వాత సెకండ్ ఫ్లోర్‌లోని తన బెడ్ రూమ్‌కు రమ్మని చౌదరికి చెప్పిన శ్రీధర్‌రావు.. వెన్నునొప్పిగా ఉందంటూ మసాజ్ చేయమని అడిగాడు. దీంతో చౌదరి కొంతసేపు మసాజ్ చేశాడు. ఆ సమయంలో శ్రీధర్‌రావు కొన్ని పిల్స్ వేసుకోవడం గమనించాడు. ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే చౌదరిని శ్రీధర్‌రావు బలవంతంగా దగ్గరకు లాక్కోవడం ప్రారంభించాడు. చౌదరి నెట్టివేసేందుకు ప్రయత్నించడంతో కత్తితో బెదిరించాడు. చౌదరి నిరాకరించడంతో కత్తితో చొక్కా సహా బట్టలన్నీ చింపేశాడు. ఎంత బతిమిలాడినా వినలేదు..: తాను వద్దంటూ వారిస్తున్నా, ఎంత బతిమిలాడినా వినిపించుకోకుండా శ్రీధర్‌రావు తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని చౌదరి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో ఆరోపించాడు. రెండు గంటల పాటు నరకం అనుభవించానని, విపరీతమైన రక్తస్రావం జరిగిందని తెలిపాడు. ఈ విషయం బయటకు చెíపితే చంపేస్తానని శ్రీధర్‌రావు బెదిరించినట్లు పేర్కొన్నాడు. తాను ఇన్నాళ్లూ భయపడ్డానని, ఇప్పుడతని మోసాలు బయటకు రావడంతో ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేస్తున్నానని చౌదరి పోలీసులకు తెలిపాడు. చౌదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీధర్‌రావుపై సనత్‌నగర్ పోలీసులు.. అసహజ లైంగిక దాడి, బెదిరింపులకు సంబంధించి ఈ నెల 18న ఎఫ్ఐఆర్ (814/2021) నమోదు చేశారు. కాగా, చీటింగ్ కేసులో గురువారం అరెస్టయిన శ్రీధర్‌రావుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అరెస్టు వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని రాయదుర్గం ఇన్స్పెక్టర్ను ఆదేశించారు. -
అక్రమాల పుట్ట.. మోసాల చిట్టా
సాక్షి, హైదరాబాద్: మోసాల చిట్టా బహిర్గతమవుతోంది. ఎంతోమందిని బెదిరింపులకు గురి చేసి.. ప్రాపర్టీలను కాజేసి.. అవినీతికి పాల్పడిన విషయాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. చీటింగ్ కేసులో సంధ్య కన్వెన్షన్ ఎండీ సరనాల శ్రీధర్ రావును గురువారం రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం వివరాలు... ►రాయదుర్గం పాన్ మక్తాలోని సంధ్య టెక్నో–1 లోని తొమ్మిదో అంతస్తులో రోవన్ కంపెనీ అసో సియేట్స్ ఎల్ఎల్పీ పేరిట 1,185 చదరపు అడుగుల కమర్షియల్ ప్రాపర్టీని రూ.60,39,500కు 2018లో కొనుగోలు చేశారు. రోవన్ కంపెనీ అసోసియేట్స్ డైరెక్టర్ చైతన్య కృష్ణమూర్తి మరో 12 మందికి గత మార్చిలో రిజిస్ట్రేషన్ చేశారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వచ్చిందని తెలియడంతో ఆఫీస్ ఏర్పాటు క్రమంలో పూజ చేసేందుకు వెళ్లగా పనులు పూర్తి కాలేదు. ఇదేమిటని సంధ్య కన్స్ట్రక్షన్స్ ఎండీ శ్రీధర్‌రావును అడగ్గా.. రెండు నెలలు ఆగండి పూర్తి చేసి ఇస్తానని నమ్మబలికి కాలయాపన చేశారు. ►ఈ నేపథ్యంలో ఒకరోజు చైతన్య కృష్ణను తన ఆఫీస్‌కు పిలిచి తన ఆస్తులను ఇన్‌కంట్యాక్స్ అధికారులు అటాచ్ చేశారని రెండేళ్ల వరకు ఏమీ చేయలేనని శ్రీధర్‌రావు చెప్పాడు. ఆఫీస్ కోసం ప్రాపర్టీ ఇవ్వాల్సిందేనని అడగ్గా.. మీ ఇష్టం ఉన్న చోట చెప్పుకోండని బెదిరించాడు. ►అదే అంతస్తులో 90 శాతం స్పేస్‌ను కొనుగోలు చేసిన ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ సంస్థ యజమాని ప్రవీణ్‌కుమార్, శ్రీధర్ రావు రోవన్ కంపెనీ అసొసియేట్స్‌కు అమ్మిన స్పేస్‌కు ఉన్న గోడలను పూర్తిగా కూల్చివేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు బుధ వారం రాత్రి రిమాండ్‌కు తరలించారు. శ్రీధర్ రావు వద్ద ఎస్పీఏ తీసుకొని బెదిరింపులకు పాల్పడిన సృజన్‌సేన్, ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.ప్రవీణ్ కుమార్‌లను అరెస్ట్ చేయాల్సి ఉంది. రెండోసారి అరెస్టు.. ఐటీ కంపెనీ ఏర్పాటు కోసం సంధ్య టెక్నో–1లో ప్రాపర్టీ కొనుగోలు చేసి మోసపోయిన శ్రీనివాస్ హోసమానే ఫిర్యాదుతో ఈ నెల 10న రాయదుర్గం పోలీసులు శ్రీధర్ రావును అరెస్ట్ చేశారు. బెయిల్‌పై ఆయన బయటికి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో రాయదుర్గం పోలీసులు శ్రీధర్‌రావును రెండుసార్లు అరెస్ట్ చేసినట్లయ్యింది. ఇన్‌కంట్యాక్స్ అధికారులు ఆస్తులను అటాచ్ చేశారని చెబుతూ రెండేళ్ల వరకు రిపేర్ చేయలేనని చెప్పినట్లు బాధితుడు రోవన్ కంపెనీ అసోసియేట్స్ డైరెక్టర్ చైతన్య కృష్ణ మూర్తి తెలిపారు.. ఇచ్చిన డబ్బు వాపస్ తీసుకోవాలని బెదిరించారని ఆయన పేర్కొన్నారు. మూడో మోసం.. మరో ఎఫ్ఐఆర్ నమోదు ►రాయదుర్గం పాన్ మక్తాలోని సంధ్య టెక్నో– 1 లో మోసాలు ఒక్కటోక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే ఇద్దరు బాధితులు చేసిన ఫిర్యాదుతో శ్రీధర్ రావును అరెస్ట్ చేశారు. ►తాజాగా అల్వాల్‌కు చెందిన ఓ డాక్టర్ తన భార్య స్నేహశ్రీ పేరిట 2363 చ.అడుగుల ప్రాపర్టీని రూ.88.61 లక్షలకు కొనుగోలు చేశారు. రిజిస్ట్రే షన్ చేసిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ అందజేశారు. తీరా అక్కడికి వెళ్లి చూడగా ఎలాంటి ఎమినిటీస్ ప్రొవైడ్ చేయలేదు. ఇదేంటని అడిగితే మరో రూ.40 లక్షలు చెల్లిస్తే పనులు పూర్తి చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డారు. స్నేహశ్రీ రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. స్నేహశ్రీ సోదరి సైతం ఇదే తరహలో మోసపోయారని త్వరలోనే ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. గచ్చిబౌలి పీఎస్‌లో మూడు కేసులు ►గచ్చిబౌలిలోని డీఎల్ఎఫ్ ఎస్ఈజెడ్ పక్కన సంధ్య కన్వెన్షన్‌ను ఆనుకొని ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేఅవుట్లో న్యూ బోయినపల్లికి చెందిన దేవరాజ్ 708 చ.అ విస్తీర్ణం కలిగిన ప్లాట్ నంబర్ 84ను మూడు దశాబ్దాల క్రితం కొనుగోలు చేశారు. ప్రస్తుతం చదరపు గజం ధర రూ.లక్షన్నరకుపైనే ఉంటుంది. అందులో ఓ గది కూడా ఉంది. ఆ ప్లాట్‌ను ఆనుకొని 150 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ప్లాట్‌ను సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు కొనుగోలు చేశారు. పక్కప్లాట్‌లో బండరాళ్లు, మట్టి పోయడంతో బాధితుడు వెళ్లి అడగ్గా.. నీ ప్లాట్ ఎక్కడుందో సర్వే చేసి తీసుకో అని బెదిరించినట్లు బాధితుడు గచ్చిబౌ లి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ►ఇదే తరçహాలో గచ్చిబౌలిలోని పలువురు ప్లాట్ల యజమానులను కట్టడి చేసి లేఅవుట్లో సగానికి పైగా ప్లాట్లను తక్కువ ధరకు కొన్నట్లు తెలుస్తోంది. మిగిలిన ప్లాట్లు గుర్తు పట్టని రీతిలో లేఅవుట్లో బండరాళ్లు మట్టితో నింపి, కొన్ని చోట్ల అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టినట్లు సమాచారం. సరుకులు తీసుకెళ్లి డబ్బులు ఇవ్వలేదని కుషీచంద్, ఎర్త్‌వర్క్ చేయించుకొని రూ.3 కోట్లు ఇవ్వలేదని పి.విజయ్ ఫిర్యాదుతో పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. మొత్తం.. 14 ఎఫ్ఐఆర్లు.. శ్రీధర్ రావుపై ఇప్పటి వరకు 14 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు తెలుస్తోంది. రాయదుర్గం పీఎస్‌లో మూడు, గచ్చిబౌలి పీఎస్‌లో మూడు, హైదరాబాద్ సీసీఎస్‌లో రెండు, జూబ్లీహిల్స్‌లో రెండు, నార్సింగి పీఎస్‌లో రెండు, మియాపూర్, మలక్‌పేట్ పీఎస్‌లో ఒక్కో ఎఫ్ఐఆర్ నమోదయినట్లు సమాచారం. శ్రీధర్‌రావు మోసాలకు గురైన బాధితులు వస్తే కేసులు నమోదు చేస్తామని గచ్చిబౌలి పోలీసులు స్పష్టం చేస్తున్నారు. -
రూ.2 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత
చిత్తూరు పోలీసులు 2 కోట్లు విలువ చేసే ఎర్రచందనాన్ని బుధవారం తమిళనాడు రాష్ట్రం పొండూరులో స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలు గురువారం ఏఆర్ గ్రౌండ్లో రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు, ఎస్పీ జయలక్ష్మీ విలేకర్ల సమావేశంలో తెలిపారు. ఆగస్టు 19వ తేదీన చంద్రగిరి పరిధిలో రాంమోహన్, అతని అనుచరులు జగన్నాధం, బాలన్‌ను ఎర్రచందనం అక్రమరవాణాకు పాల్పడుతూ ఉండగా అదుపులోకి తీసుకున్నామని వివరించారు. . పోలీసుల దాడుల్లో ముగ్గరు మాత్రమే పట్టుబడ్డారని... మిగతా.. 13 మంది పరారైయ్యారని చెప్పారు. వీరిని విచారించగా పారిపోయిన వారిలో ప్రధాన స్మగ్లర్ కిరుబాకరాన్ అలియాస్ కిరుబా, అలియాస్ కిరుబాను తెలిసిందని చెప్పారు. వీరిని ఆగస్టు 23వ తేదీన అరెస్ట్ చేశామన్నారు. కిరుబాకరన్ తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లా పెరంబదూర్ తాలూకా పొండూరు గ్రామంలో ఆటోమేటిక్ కారిడార్‌లో ఓ గోడౌన్లో మరో స్మగ్లర్ అయిన సెల్వరాజ్ ఇతనికి సంబంధించిన దుంగలను దాచి ఉన్నట్లు విచారణలో తేలిందని చెప్పారు. ఈ సమాచారం మేరకు బుధవారం గోడౌన్ పై దాడులు నిర్వహించి 2 కోట్ల రూపాయలు విలువ చేసే 395 దుంగలు స్వాధీనం చేసుకున్నామన్నారు. దీని బరువు సుమారు 9,586 కేజీలు (9.5) టన్నులు ఉంటుందన్నారు. వీరి వద్ద నుండి ఎర్రచందనం దుంగలతో పాటు ఈచర్ లారీ, 2 వెయిట్ మిషన్లు, 2 రంపాలు స్వాధీనం చేసుకుని గోడౌన్‌ను సీజ్ చేశామన్నారు. 2014 జూలై నుంచి 1393 కేసులు నమోదు 2014 జూలై నుంచి ఇప్పటి వరకు 1393 కేసులను రాయలసీమలో నమోదు చేసినట్లు రాయలసీమ రేంజ్ ఐజీ శ్రీధర్‌రావు తెలిపారు. ఇందులో 6,924 మందిని అరెస్ట్ చేశామన్నారు. వీరిలో ఏపీకి చెందిన వారు 3,221 మంది ఉండగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 3,703 మంది ఉన్నామన్నారు. ఇప్పటి వరకు 22,108 ఎర్రచందనం దుంగలు, 1016 వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. -
మావోయిస్టు నేత లొంగుబాటు
మావోయిస్టు కీలక నేత ఒకరు రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావుసమక్షంలో కర్నూలులో లొంగిపోయాడు. ఐజీ తెలిపిన వివరాలివీ.. వైఎస్సార్ జిల్లా గడ్డవారిపల్లె గ్రామానికి చెందిన గజ్జల కృష్ణారెడ్డి అలియాస్ రమణారెడ్డి మావోయిస్టు పార్టీ రాయలసీమ కమిటీ క్రియాశీలక సభ్యుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈయన కడప జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేశారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడైన ఈయన ఎమర్జెన్సీ సమయంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్‌లో పనిచేశారు. ఆ సంఘంలో అనేక కీలక బాధ్యతలను చేపట్టారు. ఈయన తండ్రి చెన్నారెడ్డి కూడా కమ్యూనిస్టు నాయకుడే. అనంతరం ఉపాధ్యాయ వృత్తిని వదిలి తీవ్రవాదం వైపు మొగ్గుచూపారు. విజయనగరం, విశాఖపట్టణం, గుంటూరు, కడప, కర్నూలు జిల్లాల్లో చేపట్టిన అనేక ప్రజా ఉద్యమాల్లో పాలుపంచుకున్నారు. ఆరోగ్యం సహకరించకపోవటంతో ఆయన లొంగుబాట పట్టారు. ఈయనపై వివిధ నేరాల కింద పది కేసులున్నాయి. ప్రభుత్వం రూ.4 లక్షల రివార్డును ప్రకటించింది. ఈ సొమ్మును ఆయనకు ఇస్తామని ఐజీ తెలిపారు. గురువారం తక్షణ సాయంగా రూ.10 వేలు అందజేశారు. -
సైకలాజికల్ థ్రిల్లర్
ఎనిమిదేళ్ల ఆ బాలుడు ఎవరితోనూ సరిగ్గా మాట్లాడడు. తన వయసున్న పిల్లల్లా హుషారుగా ఉండడు. ఉద్యోగస్థులైన ఆ బాలుడి తల్లితండ్రులకు అదేమీ పట్టదు. చివరకు ఇరుగుపొరుగు, స్కూల్ నుంచి ఫిర్యాదులు రావడంతో బోర్డింగ్ స్కూల్లో చేర్పిస్తారు. అక్కడ కూడా బాలుడు వింతగా ప్రవర్తిస్తుంటాడు. ఎవరూ చూడనివి చూశానని చెబుతుంటాడు. ఇంతకీ ఆ బాలుడి సమస్య ఏంటి? అతని సమస్యను ఎవరు పరిష్కరించారు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘బుడుగు’. లక్ష్మీ మంచు ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో టైటిల్ రోల్‌ను మాస్టర్ ప్రేమ్ చేశాడు. ఇంద్రజ, శ్రీధర్‌రావు ఇతర కీలక పాత్రలు చేశారు. సుధీర్ సమర్పణలో భాస్కర్, సారికా శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రానికి మన్మోహన్ దర్శకత్వం వహించారు. ఇది సైకలాజికల్ థ్రిల్లర్ అనీ, కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం చేశామని దర్శకుడు తెలిపారు. ఈ వారంలోనే పాటలను విడుదల చేస్తామని నిర్మాతలు చెప్పారు. -
నిజజీవిత ఘటనలతో...
లక్ష్మీ మంచు, శ్రీధర్‌రావు, మాస్టర్ ప్రేమ్, బేబీ డాలీ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘బుడుగు’. వాస్తవ సంఘటనల ఆధారంగా మన్మోహన్ రూపొందించిన ఈ చిత్రానికి భాస్కర్, సారికా శ్రీనివాస్ నిర్మాతలు. ఈ చిత్రం ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో ప్రదర్శించారు. సారికా శ్రీనివాస్ మాట్లాడుతూ - ‘‘ఇది చైల్డ్ బేస్డ్ సైకలాజికల్ థ్రిల్లర్. పరిసరాలు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనేది కీలకాంశం. జనవరి మూడో వారంలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఒక సైకియాట్రిస్ట్ ద్వారా తెలిసిన విషయాల ఆధారంగా ఈ చిత్రం చేశాం. కథ బాగుందని లక్ష్మి ఒప్పుకున్నారు. ఇంద్రజ అతిథి పాత్ర చేశారు. సాయి కార్తీక్ స్వరపరచిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’’ అని చెప్పారు. ‘‘కథ వినగానే బాగా నచ్చింది. ప్రేమ్‌కీ, డాలీకీ, కుక్కపిల్లకీ మన్మోహన్ ఇచ్చిన శిక్షణ సూపర్. లాస్ ఏంజిల్స్‌లో ఎలా అయితే షూటింగ్‌కి సన్నాహాలు చేస్తారో.. ఈ చిత్రానికి అలానే చేశాం’’ అని చెప్పారు. ఇంకా చిత్రబృందం మాట్లాడారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వంశీ పులూరి, కెమెరా: సురేశ్ రఘుతు, సమర్పణ: సుధీర్. -
బుడుగు మూవీ స్టిల్స్
-
ప్రతిష్టాత్మకంగా‘పైకా’ పోటీలు
మహబూబ్‌నగర్ క్రీడలు, న్యూస్‌లైన్: జిల్లా కేంద్రంలో జనవరి 7 నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్న ‘పైకా’ జాతీయ క్రీడలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని కలెక్టర్ గిరిజాశంకర్ చెప్పారు. అథ్లెటిక్స్, వాలీబాల్ పోటీలను జిల్లా స్టేడియంలో, తైక్వాండో పోటీలను టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహిస్తామన్నారు. మంగళవారం జిల్లా స్టేడియంలో ఈ పోటీల ఏర్పాట్లను పరిశీలించారు. నూతన ట్రాక్ పనులు త్వరగా పూర్తి చేయాలని డీఎస్డీఓ శ్రీధర్‌రావును ఆదేశించారు. స్టేజీ నిర్మాణం, మార్చ్ఫాస్ట్, వాలీబాల్ కోర్టులను పరిశీలించారు. వాలీబాల్ కోర్టుల చుట్టూ బారికేడ్లు ఏర్పాట్లు చేయాలన్నారు. పోటీలకు 1400 మంది క్రీడాకారులు హాజ రవుతారని, వారికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. వీటి ప్రారంభోత్సవానికి బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌తో పాటు క్రీడాకారులు పీఎస్ సింధు, శోభ, పీవీ రమణ హాజరవుతారన్నారు. పోటీల్లో జరిగే రోజుల్లో వలంటీర్లను వినియోగించుకోవాలని నెహ్రూ యువకేంద్రం అధికారులను ఆదేశించారు. క్రీడాకారులకు పోటీల వివరాల బుక్‌లెట్‌ను అందజేయాలన్నారు. కార్యక్రమంలో ఏజేసీ రా జారాం, ట్రెయినీ కలెక్టర్ విజయరామరా జు, జెడ్పీ సీఈఓ రవీందర్, ఆర్డీఓ హనుమంతురావు, లయన్ నటరాజ్ పాల్గొన్నారు. -
జాతీయస్థాయిలో రాణించాలి
అచ్చంపేట, న్యూస్‌లైన్: విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడల్లో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని డీఎస్డీఓ శ్రీధర్‌రావు పేర్కొన్నారు. అచ్చంపేట ఎన్టీఆర్ మి నీ స్టేడియంలో గురువారం స్వామి వివేకనంద గ్రామీణ 6వ అండర్-16 అథ్లెటిక్స్ పైకాకు జిల్లా జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని, విద్యార్థులు క్రీడల పట్ల మక్కు వ కనబర్చాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణతో క్రీడల్లో రాణించాలన్నారు. జనవరి 7నుంచి 10 వరకు జిల్లా కేంద్రంలో స్వామి వివేకనంద జాతీయస్థాయి పైకా అథ్లెటిక్, వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అచ్చంపేట సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాస్థాయి క్రీడలను స్థానిక స్టేడియంలో నిర్వహిం చాలని, అందుకు తనవంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్, ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, స్టేడియం కోచ్ శ్రీనువాస్ యాదవ్, పీడీలు, పీఈటీలు నాగేష్, వసంత్, తదితరులు పాల్గొన్నారు.