సాక్షి, హైదరాబాద్: హిందుస్తాన్ పెట్రోలియం లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్)కు, సంధ్య కన్‌స్ట్రక్షన్‌కు మధ్య జరిగిన పెట్రోల్ బంక్ ఒప్పందం వివాదంలో టీవీ–5 వైస్ ప్రెసిడెంట్ సాంబశివరావు అసలు వాస్తవాలను దాచి అన్నీ అబద్ధాలే చెబుతున్నారని సంధ్య కన్‌స్ట్రక్షన్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత సరనాల శ్రీధర్ రావు ఆరోపించారు. స్థలం సాంబశివరావుది కాదు.. పెట్టుబడీ ఆయనది కాదు.. కానీ, పెట్రోల్ బంక్ డీలర్‌షిప్ మాత్రం ఆయన వాళ్ల పేరు మీద పెట్టుకుని బాగోతం నడిపారని విమర్శించారు.
టీవీ–5తో తనకున్న పరిచయాలను వాడి తన కోడలు కొల్లి సౌమ్య పేరు మీద డీలర్‌షిప్ తీసుకొని అస లు వాస్తవాలను దాస్తూ మీడియా ముందు మాత్రం సాంబశివరావు నంగనాచి కబుర్లు చెబుతున్నాడని శ్రీధర్‌రావు ధ్వజమెత్తారు. మాదాపూర్‌లోని పెట్రోల్ బంక్‌కు సంబంధించి డాక్యుమెంట్లు అన్నీ పక్కాగా ఉంటే హెచ్‌పీసీఎల్ ఎందుకు బంక్‌ను మూసి వేసిందని ప్రశ్నించారు? ఆయనకున్న పోలీసు, రాజకీయ పలుకుబడితో తనకు టుంబ సభ్యులు, వ్యాపారాల గురించి ప్రతికూల వార్తల ను ప్రచారం చేస్తూ పరుపు నష్టాన్ని కలిగిస్తున్నారని ఆరోపించారు. ‘సాక్షి’తో శ్రీధర్‌రావు చెప్పిన వివరాల ప్రకారం..
స్థలం అసలు కథ ఇదీ..
సరనాల శ్రీధర్ భార్య సంధ్యకు శేరిలింగంపల్లిలోని మాదాపూర్ గ్రామంలో సర్వే నంబరు–64లోని హుడా టెక్నో ఎన్‌క్లేవ్‌లో సెక్టార్– 3లోని ప్లాట్ నంబరు–26లో నార్త్‌ఈస్ట్ దిక్కున 1,200 చదరపు మీటర్ల స్థలం ఉంది. ఇందులో 600 చ.మీ. స్థలాన్ని సంధ్య తన వ్యాపార అవసరాల కోసం ఇతరులకు విక్రయించింది. ఇంకా తన వద్ద 600 చ.మీ. స్థలం ఉంది. 2018లో కొందరు రియల్ ఎస్టేట్ మార్కెట్ మిత్రులతో కలిసి సాంబశివ రావు శ్రీధర్ రావును కలిశాడు. ‘మీది తెనాలే మాది తెనాలే’అంటూ మాట కలిపాడు. 600 చ.మీ. స్థలంలో పెట్రోల్ బంక్ పెడదామని సలహా ఇచ్చాడు.
తనకు ఆయిల్ కంపెనీలతో సత్సంబంధాలు ఉన్నాయని, పోలీసు, మున్సిపల్ అనుమతులన్నీ తానే చూసుకుంటానని నమ్మించాడు. 25:75 శాతం వాటాతో సాంబశివరావు, సంధ్య కన్‌స్ట్రక్షన్‌తో ఒప్పందం చేసుకున్నాడు. నెలకు రూ.3.15 లక్షలు అద్దె చెల్లించేలా 600 చదరపు మీటర్ల స్థలంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తూ హెచ్‌పీసీఎల్‌కు, సంధ్య కన్‌స్ట్రక్షన్‌కు రిజిస్టర్డ్ లీజు డీడ్ జరిగింది. పెట్రోల్ బంక్ ఏర్పాటయింది. అంతా బాగానే నడుస్తున్న క్రమంలో.. పక్కనే ఉన్న మరో 600 చదరపు మీటర్ల స్థలంలో కూడా బంక్‌ను విస్తరిద్దామని సాంబశివరావు సూచించాడు.
ఇక్కడే ఫోర్జరీ చేసింది..
దీంతో అప్పటికే ఆమ్మేసిన ఈ స్థలాన్ని 2020 జనవరిలో రూ.కోట్లు వెచ్చించి తిరిగి సంధ్య కన్‌స్ట్రక్షన్ కొనుగోలు చేసింది. అయితే విస్తరించే ఈ బంక్‌కు నెలకు చెల్లించే అద్దె కేవలం రూ.1.15 లక్షలు మాత్రమేనని తెలిసింది. దీంతో పునరాలోచనలో పడ్డారు. కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన స్థలంలో పెట్రోల్ బంక్‌కు వచ్చే అద్దె రూ.1.15 లక్షలు అనే సరికి వెనక్కి తగ్గారు.
కానీ, టీవీ–5 సాంబశివరావు హెచ్‌పీసీఎల్‌లో డీజీఎం స్థాయిలో తనకున్న పరిచయాలతో స్థలం యజమానికి తెలియకుండా ఈ రెండో భాగం 600 చదరపు మీటర్ల స్థలాన్ని ఫోర్జరీ సంతకాలతో హెచ్‌పీసీఎల్‌కు లీజుకు ఇచ్చేశాడు. కానీ, మీడియా ముందు మాత్రం తొలుత హెచ్‌పీసీఎల్‌కు, సంధ్య కన్‌స్ట్రక్షన్‌కు మధ్య 600 చ.మీ. స్థలంలో జరిగిన పెట్రోల్ బంక్ డాక్యుమెంట్లను మాత్రమే చూపిస్తూ జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు.
అందర్నీ మేనేజ్ చేసి..: జర్నలిస్ట్ కావడంతో తనకున్న రాజకీయ, పోలీసు పరిచయాలను టీవీ–5 సాంబశివరావు పూర్తిస్థాయిలో వినియోగించుకున్నాడు. వాస్తవానికి ఈ పెట్రోల్‌బంక్ వి స్తరణ చేసిన 600 చదరపు మీటర్ల స్థలానికి యజమానికి, హెచ్‌పీసీఎల్‌కు మధ్య ఎలాంటి రిజిస్టర్డ్ లీజు డీడ్ జరగలే దు. హెచ్‌పీసీఎల్‌లో తనకున్న పరిచయాలతో స్థల యజమాని సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ అగ్రిమెంట్‌ను సృష్టించాడు. ఈ ఫోర్జరీ డాక్యుమెంట్లను సమర్పించే స్థానికంగా పోలీసు, మున్సిపల్ అనుమతులను తీసుకున్నాడు.
దిక్కులేక ఠాణా మెట్లెక్కి..
స్థల యజమానికి విషయం తెలియడంతో.. తన వాటా 75 శాతంపై సాంబశివరావును నిలదీశారు. రూ.30 లక్షలు ఇస్తే 75 శాతం వాటా డాక్యుమెంటేషన్ ప్రక్రియ మొదలుపెడతానని మెలిక పెట్టడంతో చేసేదేం లేక చెక్ రూపంలో రూ.30 లక్షలు సాంబశివరావుకు చెల్లించారు. ఏళ్లు గడిచినా బంక్ డీలర్‌షిప్ తమ పేరు మీద బదలాయించకపోయే సరికి దిక్కు తోచని స్థితిలో ఈ ఏడాది జనవరి 31న స్థల యజమాని శ్రీధర్‌రావు మాదాపూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
హెచ్‌పీసీఎల్ ఏం అంటోంది?
ఈ వ్యవహారంపై అంతర్గత విచారణ చేపట్టిన హెచ్‌పీసీఎల్.. పెట్రోల్ బంక్ విస్తరణ సమయంలో సమర్పించిన డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించకుండా నిర్ణయం తీసుకున్నట్లు స్వయంగా ఇంధన సంస్థే వెల్లడించింది. అందుకే విస్తరించిన 600 చదరపు మీటర్ల స్థలాన్ని పాక్షికంగా సీజ్ చేశామని, న్యాయబద్ధంగా ఒప్పందం చేస్తే నెలకు రూ.1.57 లక్షలు అద్దె చొప్పున 2020 నుంచి పరిహారాన్ని చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది.
కారు కొట్టేసిన సాంబశివరావు
సంధ్య కన్‌స్ట్రక్షన్ అండ్ ఎస్టేట్స్ ప్రై.లి. (గతంలో సంధ్య హోటల్స్ ప్రై.లి.) 2019 సెప్టెంబర్ 13న మాదాపూర్‌లోని యాక్సిస్ బ్యాంక్ కరెంట్ ఖాతా నంబరు: 910020004191308 నుంచి 039927 డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ)ను తీసుకుంది. వరుణ్ మోటార్స్ ప్రై.లి. పేరు మీద మారుతీ స్విప్ట్ కారు కోనుగోలు చేసేందుకు ఈ డీడీను తీసుకుంది. అయితే యాజమాన్యం కోరిన మోడల్ కారు డెలివరీలో జాప్యం జరిగింది. ఈక్రమంలో టీవీ–5 సాంబశివరావు ఎంటరయ్యాడు. తనకున్న పరిచయాలతో త్వరగా కారు డెలివరీ అయ్యేలా చేస్తానని నమ్మించి డీడీని తీసుకున్నాడు.
ఎన్ని రోజులైనా ఎలాంటి స్పందన లేదు. గట్టిగా ప్రశ్నిస్తే కొత్త అప్‌గ్రేడ్ మోడల్ వస్తోందని, పాత కారు ధరకే అప్‌గ్రేడ్ మోడల్ ఇప్పిస్తానని నమ్మించాడు. దీంతో అతని మాయమాటలు నమ్మి కొంతకాలం వేచిచూశారు. అ యినా నెలలు గడుస్తున్నా కారు డెలివరీ మాత్రం కాలే దు. డీడీ కూడా తిరిగి ఇవ్వలేదు. దీంతో డీడీ ఇవ్వమని మరోసారి అడిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయనీ, తనకు రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు బాగా తెలుసని బెదిరించడం మొదలుపెట్టాడు. తీరా అసలు విషయం ఏంటంటే.. ఆ డీడీని ఉపయోగించుకొని సాంబశివరావు తన వ్యక్తిగత అవసరాల కోసం కారును కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈమేరకు మాదాపూర్ పోలీసు స్టేషన్‌లో బాధితుడు శ్రీధర్ రావు పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. డీడీ, బ్యాంక్ స్టేట్‌మెంట్ కాపీలను పోలీసులకు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment