చిత్తూరు పోలీసులు 2 కోట్లు విలువ చేసే ఎర్రచందనాన్ని బుధవారం తమిళనాడు రాష్ట్రం పొండూరులో స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలు గురువారం ఏఆర్ గ్రౌండ్‌లో రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు, ఎస్పీ జయలక్ష్మీ విలేకర్ల సమావేశంలో తెలిపారు. ఆగస్టు 19వ తేదీన చంద్రగిరి పరిధిలో రాంమోహన్, అతని అనుచరులు జగన్నాధం, బాలన్‌ను ఎర్రచందనం అక్రమరవాణాకు పాల్పడుతూ ఉండగా అదుపులోకి తీసుకున్నామని వివరించారు. . పోలీసుల దాడుల్లో ముగ్గరు మాత్రమే పట్టుబడ్డారని... మిగతా.. 13 మంది పరారైయ్యారని చెప్పారు.
వీరిని విచారించగా పారిపోయిన వారిలో ప్రధాన స్మగ్లర్ కిరుబాకరాన్ అలియాస్ కిరుబా, అలియాస్ కిరుబాను తెలిసిందని చెప్పారు. వీరిని ఆగస్టు 23వ తేదీన అరెస్ట్ చేశామన్నారు. కిరుబాకరన్ తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లా పెరంబదూర్ తాలూకా పొండూరు గ్రామంలో ఆటోమేటిక్ కారిడార్‌లో ఓ గోడౌన్‌లో మరో స్మగ్లర్ అయిన సెల్వరాజ్ ఇతనికి సంబంధించిన దుంగలను దాచి ఉన్నట్లు విచారణలో తేలిందని చెప్పారు. ఈ సమాచారం మేరకు బుధవారం గోడౌన్ పై దాడులు నిర్వహించి 2 కోట్ల రూపాయలు విలువ చేసే 395 దుంగలు స్వాధీనం చేసుకున్నామన్నారు. దీని బరువు సుమారు 9,586 కేజీలు (9.5) టన్నులు ఉంటుందన్నారు. వీరి వద్ద నుండి ఎర్రచందనం దుంగలతో పాటు ఈచర్ లారీ, 2 వెయిట్ మిషన్లు, 2 రంపాలు స్వాధీనం చేసుకుని గోడౌన్‌ను సీజ్ చేశామన్నారు.
2014 జూలై నుంచి 1393 కేసులు నమోదు
2014 జూలై నుంచి ఇప్పటి వరకు 1393 కేసులను రాయలసీమలో నమోదు చేసినట్లు రాయలసీమ రేంజ్ ఐజీ శ్రీధర్‌రావు తెలిపారు. ఇందులో 6,924 మందిని అరెస్ట్ చేశామన్నారు. వీరిలో ఏపీకి చెందిన వారు 3,221 మంది ఉండగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 3,703 మంది ఉన్నామన్నారు. ఇప్పటి వరకు 22,108 ఎర్రచందనం దుంగలు, 1016 వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.