సైకలాజికల్ థ్రిల్లర్ | Interesting Psychological thriller | Sakshi
Sakshi News home page

సైకలాజికల్ థ్రిల్లర్

Published Wed, Jan 7 2015 11:42 PM | Last Updated on Sat, Sep 2 2017 7:21 PM

సైకలాజికల్ థ్రిల్లర్

సైకలాజికల్ థ్రిల్లర్

ఎనిమిదేళ్ల ఆ బాలుడు ఎవరితోనూ సరిగ్గా మాట్లాడడు. తన వయసున్న పిల్లల్లా హుషారుగా ఉండడు. ఉద్యోగస్థులైన ఆ బాలుడి తల్లితండ్రులకు అదేమీ పట్టదు. చివరకు ఇరుగుపొరుగు, స్కూల్ నుంచి ఫిర్యాదులు రావడంతో బోర్డింగ్ స్కూల్‌లో చేర్పిస్తారు. అక్కడ కూడా బాలుడు వింతగా ప్రవర్తిస్తుంటాడు. ఎవరూ చూడనివి చూశానని చెబుతుంటాడు. ఇంతకీ ఆ బాలుడి సమస్య ఏంటి? అతని సమస్యను ఎవరు పరిష్కరించారు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘బుడుగు’. లక్ష్మీ మంచు ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో టైటిల్ రోల్‌ను మాస్టర్ ప్రేమ్ చేశాడు. ఇంద్రజ, శ్రీధర్‌రావు ఇతర కీలక పాత్రలు చేశారు. సుధీర్ సమర్పణలో భాస్కర్, సారికా శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రానికి మన్మోహన్ దర్శకత్వం వహించారు. ఇది సైకలాజికల్ థ్రిల్లర్ అనీ, కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం చేశామని దర్శకుడు తెలిపారు. ఈ వారంలోనే పాటలను విడుదల చేస్తామని నిర్మాతలు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement