నిజజీవిత ఘటనలతో... | Trailer: Lakshmi Manchu's Budugu | Sakshi
Sakshi News home page

నిజజీవిత ఘటనలతో...

Published Thu, Dec 25 2014 11:17 PM | Last Updated on Sat, Sep 2 2017 6:44 PM

నిజజీవిత ఘటనలతో...

నిజజీవిత ఘటనలతో...

లక్ష్మీ మంచు, శ్రీధర్‌రావు, మాస్టర్ ప్రేమ్, బేబీ డాలీ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘బుడుగు’. వాస్తవ సంఘటనల ఆధారంగా మన్మోహన్ రూపొందించిన ఈ చిత్రానికి భాస్కర్, సారికా శ్రీనివాస్ నిర్మాతలు. ఈ చిత్రం ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో ప్రదర్శించారు. సారికా శ్రీనివాస్ మాట్లాడుతూ - ‘‘ఇది చైల్డ్ బేస్డ్ సైకలాజికల్ థ్రిల్లర్. పరిసరాలు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనేది కీలకాంశం. జనవరి మూడో వారంలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఒక సైకియాట్రిస్ట్ ద్వారా తెలిసిన విషయాల ఆధారంగా ఈ  చిత్రం చేశాం.
 
 కథ బాగుందని లక్ష్మి ఒప్పుకున్నారు. ఇంద్రజ అతిథి పాత్ర చేశారు. సాయి కార్తీక్ స్వరపరచిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’’ అని చెప్పారు. ‘‘కథ వినగానే బాగా నచ్చింది. ప్రేమ్‌కీ, డాలీకీ, కుక్కపిల్లకీ మన్మోహన్ ఇచ్చిన శిక్షణ సూపర్. లాస్ ఏంజిల్స్‌లో ఎలా అయితే  షూటింగ్‌కి సన్నాహాలు చేస్తారో.. ఈ చిత్రానికి అలానే చేశాం’’ అని చెప్పారు. ఇంకా చిత్రబృందం మాట్లాడారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వంశీ పులూరి, కెమెరా: సురేశ్ రఘుతు,  సమర్పణ: సుధీర్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement