మహబూబ్‌నగర్ క్రీడలు, న్యూస్‌లైన్: జిల్లా కేంద్రంలో జనవరి 7 నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్న ‘పైకా’ జాతీయ క్రీడలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని కలెక్టర్ గిరిజాశంకర్ చెప్పారు. అథ్లెటిక్స్, వాలీబాల్ పోటీలను జిల్లా స్టేడియంలో, తైక్వాండో పోటీలను టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహిస్తామన్నారు. మంగళవారం జిల్లా స్టేడియంలో ఈ పోటీల ఏర్పాట్లను పరిశీలించారు. నూతన ట్రాక్ పనులు త్వరగా పూర్తి చేయాలని డీఎస్‌డీఓ శ్రీధర్‌రావును ఆదేశించారు.
స్టేజీ నిర్మాణం, మార్చ్‌ఫాస్ట్, వాలీబాల్ కోర్టులను పరిశీలించారు. వాలీబాల్ కోర్టుల చుట్టూ బారికేడ్లు ఏర్పాట్లు చేయాలన్నారు. పోటీలకు 1400 మంది క్రీడాకారులు హాజ రవుతారని, వారికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. వీటి ప్రారంభోత్సవానికి బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌తో పాటు క్రీడాకారులు పీఎస్ సింధు, శోభ, పీవీ రమణ హాజరవుతారన్నారు. పోటీల్లో జరిగే రోజుల్లో వలంటీర్లను వినియోగించుకోవాలని నెహ్రూ యువకేంద్రం అధికారులను ఆదేశించారు. క్రీడాకారులకు పోటీల వివరాల బుక్‌లెట్‌ను అందజేయాలన్నారు. కార్యక్రమంలో ఏజేసీ రా జారాం, ట్రెయినీ కలెక్టర్ విజయరామరా జు, జెడ్పీ సీఈఓ రవీందర్, ఆర్‌డీఓ హనుమంతురావు, లయన్ నటరాజ్ పాల్గొన్నారు.
ప్రతిష్టాత్మకంగా‘పైకా’ పోటీలు
Published Wed, Jan 1 2014 4:59 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement