girija shankar
-
రైతులకు రూ.700 కోట్లు జమ
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 5,000కు పైగా ఆర్బీకేల ద్వారా రబీ ధాన్యం కొనుగోళ్లు చేపట్టినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజా శంకర్ గురువారం తెలిపారు. ఈ సీజన్లో 37 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా ఇప్పటివరకు 1,35,640 మంది రైతుల నుంచి 17.20 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం విక్రయించి 21 రోజులు దాటిన రైతులందరికీ కలిపి మొత్తంగా రూ.700 కోట్లు జమ చేసినట్లు వివరించారు. -
ప్రభుత్వ ఔట్లెట్లలో లక్ష లీటర్ల నూనె విక్రయం
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు వంట నూనెల ధరలను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. రైతుబజార్లు, మున్సిపల్ మార్కెట్లలో విజయ బ్రాండ్ ఔట్లెట్ల పేరుతో చేపట్టిన విక్రయాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 12నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ ఔట్లెట్లలో 1,01,165 లీటర్ల వంట నూనెను విక్రయించడం విశేషం. ఇందులో రైతుబజార్లలో 70,580 లీటర్లు, మున్సిపల్ మార్కెట్లలో 30,585 లీటర్ల అమ్మకాలు జరిగాయి. మరోవైపు డిమాండ్‌కు అనుగుణంగా మున్సిపల్ కార్పొరేషన్లు, 2వేల జనాభాపైడిన పంచాయతీల్లోనూ స్వయం సహాయక సంఘాల ద్వారా విజయ నూనె విక్రయానికి సన్నాహాలు చేస్తున్నారు. విస్తృతంగా తనిఖీ.. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో వంట నూనెల ధరలు భారీగా పెరగడంతో పాటు దిగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. ఈ క్రమంలో వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి డిమాండ్‌ను సొమ్ము చేసుకోకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం నియమించిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఇప్పటి వరకు తనిఖీల్లో నిత్యావసరాల చట్టం ప్రకారం (6ఏ) 76 కేసులు నమోదు చేసి 22.59 లక్షల లీటర్ల నూనెను సీజ్ చేసింది. వీటిల్లో కేసులు పరిష్కరించిన వాటిని మార్కెట్లోకి విడుదల చేయడంతో పాటు మిగిలిన వాటిని ప్రభుత్వ నూనె కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. మరోవైపు మార్కెట్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా సన్‌ఫ్లవర్ స్థానంలో సోయాబీన్, రైస్‌బ్రాన్ నూనె అమ్మకాలను చేపట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రైవేటు ఔట్లెట్లలో ప్రభుత్వ ధరలకే.. అంతర్జాతీయంగా నూనెల ధరల సెగ నుంచి సామాన్యులు, మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వం ఊరట కల్పిస్తోంది. ఆయిల్ రిఫైనరీస్, ఉత్పత్తి, సరఫరాదారులు, చాంబర్ ఆఫ్ కామర్స్‌తో సమావేశాలు నిర్వహించి తక్కువ ధరలకు నూనెలు విక్రయించేలా ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే వంట నూనెల ధరలు చాలా వరకు అదుపులోకి రావడంతో పాటు ఎక్కడా కూడా కృత్రిమ కొరత తలెత్తలేదు. హోల్‌సేల్ విక్రేతల సాయంతో 256 రిటైల్ ఔట్లెట్స్ ద్వారా సుమారు 11.20లక్షల లీటర్ల వంట నూనెను ఎమ్మార్పీ కంటే తక్కువ రేట్లకే అందించడం గమనార్హం. విజయ ఆయిల్స్‌కు మంచి ఆదరణ వంట నూనెల భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు ప్రభుత్వం విజయ ఆయిల్ పేరుతో విక్రయాలు చేపట్టింది. మార్కెట్ ధరలతో పోలిస్తే విజయ ఆయిల్స్ ధరలు తక్కువగా ఉండడంతో మంచి ఆదరణ లభిస్తోంది. విక్రయాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నిల్వలను సిద్ధం చేసుకుంటున్నాం. – చవల బాబురావు, ఏపీ ఆయిల్‌ఫెడ్ ఎండీ ప్రత్యామ్నాయాలను ప్రోత్సహిస్తాం.. ఇటీవల అంతర్జాతీయ పరిణామాలు వంట నూనెల ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఈ క్రమంలో మన దగ్గర నిల్వలను సక్రమంగా వినియోగించుకుంటూనే విదేశాల నుంచి దిగుమతయ్యే నూనెల స్థానంలో ప్రత్యామ్నాయాలను ప్రోత్సహిస్తున్నాం. ఎప్పటికప్పుడు మార్కెట్ ధరలను సమీక్షిస్తూ అవసరానికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నాం – గిరిజా శంకర్, పౌరసరఫరాలశాఖ కమిషనర్ -
ఆ బియ్యం.. ఆరోగ్యానికి అభయం
సాక్షి, అమరావతి: చిన్నారులు, మహిళల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విశాఖ, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేయాలని నిర్ణయించింది. రెండేళ్ల క్రితం విజయనగరం జిల్లాలో చేపట్టిన పైలెట్ ప్రాజెక్టు సత్ఫలితాలనిస్తోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఐదో నివేదిక ప్రకారం రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య విజయనగరం జిల్లాలో తాజాగా 78.7 నుంచి 66.7 శాతానికి తగ్గింది, మహిళల్లో రక్తహీనత 75.7 నుంచి 64.6 శాతానికి తగ్గడం గమనార్హం. సరైన పోషకాలు అందక సాధారణం కంటే తక్కువ బరువు ఉన్న మహిళల శాతం 25.8 నుంచి 16.9 శాతానికి తగ్గింది. ఆర్థిక భారం పడినా.. ఆరోగ్యకర సమాజాన్ని కాంక్షిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫోర్టిఫికేషన్ బియ్యాన్ని అందుబాటులోకి తెచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత కార్డులకు(ఎన్ఎఫ్ఎస్ఏ) మాత్రమే ఈ రకమైన బియ్యాన్ని సరఫరా చేస్తుండగా మిగిలిన కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చుతో అందచేస్తోంది. ఎన్ఎఫ్ఎన్ఏలో కూడా కేంద్రం 75 శాతం కార్డులకు మాత్రమే అందిస్తోంది. మూడు జిల్లాల్లో ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా చేసేందుకు రాష్ట్రంపై నెలకు సుమారు రూ.1.70 కోట్లకుపైగా అదనపు భారం పడనుండగా ఏడాదికి రూ. 20.40 కోట్లు అదనంగా ఖర్చు కానుంది. విశాఖపట్నం, కడప జిల్లాల్లో రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య అధికంగా ఉన్నందున మొదటి దశలో అక్కడ ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సరఫరా చేయనున్నారు. ఈ సీజన్లో 27 లక్షల టన్నుల లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా గతేడాది జూన్ నుంచి మధ్యాహ్నం భోజన పథకం, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు విటమిన్లతో కూడిన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అందిస్తున్నారు. ఫలితంగా చాలా వరకు రక్తహీనత సమస్యలు తగ్గాయి. గత సీజన్లో (ఖరీఫ్, రబీ) 2.4 లక్షల టన్నుల ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సేకరించారు. ప్రస్తుత సీజన్లో 27 లక్షల టన్నుల సేకరణ లక్ష్యంగా నిర్ణయించారు. విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని మిల్లుల్లో ఫోర్టిఫైడ్ రైస్‌ను తయారు చేస్తున్నారు. ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్ అంటే? బియ్యపు నూకలను పిండిగా చేసి ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్–బి 12 లాంటి కీలక సూక్ష్మ పోషకాలను జోడించి నీళ్లు పోసి ముద్దగా చేస్తారు. ఈ ముద్దను యంత్రంలో వేసి ఎక్స్ట్రాషన్ పద్ధతి ద్వారా బియ్యపు గింజలను తయారు చేస్తారు. ఈ కృత్రిమ బియ్యాన్ని ఆరబెట్టి ప్యాకింగ్ చేస్తారు. వీటినే ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్ అంటారు. ఇవి ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. కిలో ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్ సేకరణకు ప్రభుత్వం రూ.75 చొప్పున ఖర్చు చేస్తోంది. వంద కిలోల సాధారణ బియ్యంలో ఒక కేజీ ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్‌ను కలిపి పంపిణీ చేస్తారు. ఈ బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటే చిన్నారుల్లో మెదడు, వెన్నెముక పెరుగుదలతో పాటు మహిళలకు రక్తంలో హిమోగ్లోబిన్ శాతం మెరుగుపడుతుంది. నాడీ వ్యవస్థ పనితీరు బాగుంటుంది. రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ సంస్థ టెండర్లు నిర్వహించి ఇతర రాష్ట్రాల నుంచి ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్‌ను కొనుగోలు చేస్తోంది. దశలవారీగా అన్ని జిల్లాల్లో.. రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులు, మహిళలకు ఫోర్టిఫైడ్ బియ్యం మంచి పోషకాలను అందిస్తుంది. ఇందులో విటమిన్ బి –12, ఐరన్, ఫోలిక్ యాసిడ్ లాంటి సూక్ష్మ పోషకాలు ఉంటాయి. విజయనగరంలో చేపట్టిన పైలెట్ ప్రాజెక్టు మంచి ఫలితాలను ఇచ్చింది. దశలవారీగా అన్ని జిల్లాల్లో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని రేషన్ డిపోల ద్వారా ప్రజలకు అందించేందుకు చర్యలు చేపడుతున్నాం. – గిరిజా శంకర్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ పోషకాలతో కూడిన ఆహారం పోషకాహార లోపాన్ని నివారించేందుకు ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. కడప, విశాఖపట్నం జిల్లాల్లో వీటిని పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. చౌక బియ్యం ద్వారా సమకూరే పోషకాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఆరోగ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో త్వరలో విజయనగరం జిల్లాలో సర్వే నిర్వహిస్తాం. – వీరపాండియన్, పౌరసరఫరాల కార్పొరేషన్ ఎండీ -
రైతులకు రూ.1,153 కోట్లు చెల్లించాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా ధాన్యం సేకరణ చురుగ్గా సాగుతోందని పౌర సరఫరాల శాఖ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు. ఇప్పటివరకు 17లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు ఆయన చెప్పారు. సచివాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు 76,158 మంది రైతులకు రూ.1,153 కోట్ల చెల్లింపులు చేశామన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లోనే నగదు జమ చేస్తున్నామన్నారు. ఇ–కేవైసీ, బ్యాంకు ఖాతాలో సమస్యలు ఉంటే కొంత జాప్యం జరుగుతోందని చెప్పారు. ప్రభుత్వం రైతులకు మద్దతుగా నిలుస్తుంటే కొన్ని పత్రికలు ధాన్యం విక్రయించిన రైతులకు నగదు రావట్లేదంటూ అసత్య కథనాలు ప్రచురిస్తున్నాయన్నారు. వారిపై ప్రభుత్వం న్యాయపరంగా చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ ఖరీఫ్‌లో 50 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా.. ప్రస్తుతం 4,837 ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని, ఏప్రిల్ నాటికి లక్ష్యాన్ని పూర్తిచేస్తామని కమిషనర్ చెప్పారు. ఫోర్టిఫైడ్ బియ్యం మరో రెండు జిల్లాల్లో.. ఐరన్, ఫోలిక్ యాసిడ్, బి–12 విటమిన్ వంటి సూక్ష్మపోషకాలతో కూడిన ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీని దేశంలోనే తొలిసారిగా గతేడాది విజయనగరంలో ప్రారంభించినట్లు గిరిజాశంకర్ తెలిపారు. కొత్తగా విశాఖపట్నం, వైఎస్సార్ కడపలో కూడా ఈ బియ్యాన్ని అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. జనవరి 18 నుంచి రెండు నెలల (డిసెంబర్, జనవరి) ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తామన్నారు. 1902, 155215 నంబర్లతో కమాండ్ కంట్రోల్ రూమ్ ధాన్యం కొనుగోలులో సమస్యల పరిష్కారానికి రాష్ట్రస్థాయిలో 1902, 155215 నంబర్లతో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేసినట్లు పౌర సరఫరాల శాఖ ఎండీ వీరపాండియన్ తెలిపారు. పొలం వద్దే ధాన్యం కొనుగోలు చేసేలా మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టినట్లు ఆయన వివరించారు. ఆర్బీకేల్లో చేసే ఐదు రకాల టెస్టులను ఐఓటీ ఆధారంగా రియల్ టైమ్‌లో చేసేందుకు ఒక స్టార్టప్ కంపెనీ సహకారంతో కృష్ణాజిల్లాలో పైలట్ ప్రాజక్టుగా చేపట్టామన్నారు. త్వరలోనే దీనిని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తామన్నారు. ప్రభుత్వ గోదాముల్లోకి రీసైకిల్డ్ బియ్యం రాకుండా గుర్తించేందుకు వీలుగా ఏజ్ టెస్టింగ్ విధానాన్ని తీసుకొస్తున్నట్లు వీరపాండియన్ తెలిపారు. -
రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు: గిరిజా శంకర్
సాక్షి, అమరావతి: రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 50 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. చదవండి: ఆర్జీవీతో భేటీ.. మంత్రి పేర్ని నాని ఏం చెప్పారంటే.. ‘‘ఇప్పటి వరకు 17 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. రోజుకి 50 వేల నుండి లక్ష మెట్రిక్ టన్నులను కొంటున్నాం. రైతులకు 21 రోజుల్లో ధాన్యం డబ్బులు ఇస్తున్నాం రూ.1,153 కోట్లు రైతులకు డబ్బులు చెల్లించాం. మిల్లర్ల ప్రమేయం లేకుండా ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేస్తున్నాం. ఈ సారి నూరు శాతం ఈ క్రాప్ చేశాం. అక్రమాలకు ఆస్కారం లేకుండా ఈ క్రాప్ డేటాని వినియోగిస్తున్నాం. ప్రతి రైతు ఖాతాని ఆధార్‌కి అనుసంధానం చేశాం. దళారులు లేకుండా నేరుగా రైతు ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం. 80 శాతం మందికి డబ్బులు ఇవ్వడం లేదనడం అవాస్తవం. 21 రోజులు పూర్తయిన వారికి డబ్బులు ఇస్తున్నాం. తప్పుడు వార్తలు రాసిన పత్రికలకు లీగల్ నోటీసులు ఇస్తున్నాం. పోర్టిఫైడ్ బియ్యం ఎక్కువ ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. అందుకు అవసరమైన యంత్రాలను మిల్లులలో ఏర్పాటు చేస్తున్నాం. కడప, విశాఖపట్నంలో పోర్టిఫైడ్ రైస్ ఇవ్వాలని నిర్ణయించామని గిరిజా శంకర్ వెల్లడించారు. -
11 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు
కరప: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు పౌరసరఫరాలశాఖ కమిషనర్ గిరిజాశంకర్ చెప్పారు. ఆయన గురువారం తూర్పుగోదావరి జిల్లా కరప, పాతర్లగడ్డ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుకు మద్దతు ధర అందించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రైతుభరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయిస్తున్నారని చెప్పారు. రంగుమారిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది తుపాన్లు, భారీవర్షాల కారణంగా రాష్ట్రంలో 2.48 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని, 7.50 లక్షల టన్నుల ధాన్యం తడిసిపోయిందని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలోనే 1.30 లక్షల టన్నుల ధాన్యం తడిసిపోయిందన్నారు. రైతులను ఆదుకునేందుకు రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని తెలిపారు. మిల్లర్లు, కమీషన్ వ్యాపారులకు అమ్ముకోకుండా.. ఆర్బీకే సిబ్బంది కళ్లాల్లోకి వెళ్లి ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. రబీ సీజన్లో రైతులు బొండాలు (ఎంటీయూ 3626) రకం సాగుచేయవద్దని, వాటిని కొనుగోలుచేయబోమని చెప్పారు. రబీలో 40 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కిలో రూపాయి బియ్యం పథకంలో 18 లక్షల టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తోందని చెప్పారు. మధ్యాహ్న భోజన పథకం, హాస్టళ్లు, ఇతర సంస్థలకు మరో 4 లక్షల టన్నుల బియ్యం వినియోగిస్తున్నట్లు తెలిపారు. మొత్తం మీద రాష్ట్రంలో 22 లక్షల టన్నుల బియ్యం వినియోగిస్తున్నట్టు ఆయన చెప్పారు. -
ఆర్బీకేలే ధాన్యం సేకరణ కేంద్రాలు
సాక్షి, అమరావతి: ఈసారి ఆర్బీకేలు కేంద్రంగా నూరుశాతం కనీస మద్దతు ధరకు రైతుల నుంచి ధాన్యం సేకరించాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఈ ప్రక్రియలో పౌర సరఫరాల సంస్థతో పాటు మార్క్‌ఫెడ్‌ను కూడా భాగస్వామిని చేసింది. గ్రేడ్ ‘ఏ‘ రకం ధాన్యాన్ని క్వింటాల్ రూ.1,960, సాధారణ రకం క్వింటాల్ రూ.1,940లకు కొనుగోలు చేయనున్నారు. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేస్తూ పౌరసరఫరాల శాఖ కార్యదర్శి గిరిజా శంకర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సేకరణ లక్ష్యం 50 లక్షల టన్నులు.. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 39.35 లక్షల ఎకరాల్లో వరి సాగవగా కనీసం 80 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో 50 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కనీస మద్దతు ధరకు సేకరించాలని ప్రభుత్వం నిర్దేశించింది. గత ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో రూ.8,868 కోట్లతో 47.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించిన ప్రభుత్వం ఈసారి పలు సంస్కరణలు తీసుకొచ్చింది. ఇలా అయితేనే .. ► తొలిసారి ఆర్బీకేలు వేదికగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఈ–క్రాప్‌తో పాటు రైతుల ఈకేవైసీ (వేలిముద్రలు) ప్రామాణికం ► వరి సాగవుతున్న ప్రాంతాల్లో 6,884 ఆర్బీకేల్లో సేకరణ కేంద్రాలు ► మధ్యవర్తుల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు తొలిసారి వికేంద్రీకృత విధానం అమలు ► ధాన్యం సేకరణ, మిల్లింగ్, పంపిణీకి సంబంధించి ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో ఏపీ మార్క్‌ఫెడ్, మిగిలిన పది జిల్లాల్లో పౌరసరఫరాల సంస్థకు బాధ్యతలు ► గతంలో మాదిరిగా ప్రత్యేక పోర్టల్‌లో రైతులు వివరాలను నమోదు చేసుకోనవసరం లేదు. ► ఆర్బీకేల్లో ఉండే టెక్నికల్ సిబ్బంది కూపన్ ద్వారా ఎప్పుడు తీసుకురావాలో తెలియజేస్తారు. ► కేంద్రం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యం ఉండేలా సిద్ధం చేసుకోవాలి. తేమ శాతం 17 శాతానికి మించి ఉండకూడదు. ► రైతులు విక్రయించిన ధాన్యం, వాటి విలువ తదితర వివరాలతో రసీదు తీసుకోవాలి. ► రైతులకు 21 రోజుల్లో వారి ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తారు. ► ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లలో అమ్మదలచిన రైతులు సైతం తమ పంట వివరాలను ఆర్బీకేలో తప్పనిసరిగా నమోదు చేయాలి. ► రోజువారీ పర్యవేక్షణకు జిల్లా జాయింట్ కలెక్టర్ (రైతు భరోసా–రెవెన్యూ) చైర్మన్‌గా జిల్లా స్థాయిలో సేకరణ కమిటీ ఏర్పాటు. కమిటీలో మార్కెటింగ్, సహకార, పౌరసరఫరాలు, రవాణా, డీఆర్డీఏ, ఐటీడీఎలతో పాటు వేర్‌హౌసింగ్ ఏజెన్సీలు (సీడబ్ల్యూసీ, ఎస్‌డబ్ల్యూసీ), ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీలు (ఎఫ్‌సీఐ, ఏపీఎస్సీఎస్సీఎల్), సబ్– కలెక్టర్లు / ఆర్డీవోలు సభ్యులు. కస్టమ్ మిల్లింగ్‌పై నిరంతర నిఘా ఆర్బీకేల వద్ద సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ సామర్థ్యం ప్రకారం కస్టమ్ మిల్లింగ్, సీఎంఆర్ డెలివరీ కోసం రైస్ మిల్లులకు కేటాయిస్తారు. ఇందుకోసం 1:1 నిష్పత్తిలో బ్యాంకు గ్యారెంటీ సమర్పించి రైసుమిల్లులు సంబంధిత ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీతో ఎంవోయూ పొందుతారు. కస్టమ్ మిల్లింగ్ కార్యకలాపాల ప్రక్రియను జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు. కస్టమ్ మిల్లింగ్ చేయడంలో కానీ, నిర్ణీత గడువులోగా బట్వాడా చేయడంలో కానీ విఫలమైన రైస్ మిల్లర్లను బ్లాక్‌లిస్ట్ పెట్టడంతో పాటు తీవ్రతను బట్టి క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. -
అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు
సాక్షి, అమరావతి: తుపాను ప్రభావిత గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా పంచాయతీరాజ్ శాఖ చర్యలు చేపట్టింది. సర్పంచ్‌లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు తదితరులతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లోని 4,850 మంది పంచాయతీరాజ్ సిబ్బంది ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వీటిపై తగిన సూచనలు చేసేందుకు విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల జెడ్పీ సీఈవోలు, డీపీవోలతో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ సోమవారం టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించేందుకు బ్లీచింగ్ పౌడర్, సోడియం క్లోరైడ్ సిద్ధం చేశామని చెప్పారు. పూర్తిగా క్లోరినేషన్ చేసిన తర్వాతే తాగునీటి సరఫరా చేస్తున్నట్టు వివరించారు. -
సర్వేకు అదనంగా డ్రోన్లు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు– భూ రక్ష కార్యక్రమంలో భాగంగా గ్రామ కంఠాల్లో ఇళ్లు, ఇతర ఖాళీ స్థలాలకు కొత్తగా ఆస్తి సర్టిఫికెట్ల జారీకి సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో డ్రోన్ల ద్వారా సర్వే కొనసాగుతోంది. రాష్ట్రంలో ఆరు డ్రోన్లు అందుబాటులో ఉండగా, తాజాగా జిల్లాకొకటి చొప్పున మొత్తం 13 డ్రోన్లను కేంద్రం సమిత్వ పథకంలో భాగంగా సమకూర్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జాయింట్ సెక్రటరీ అలోక్ ప్రేమ్ నగరతో పాటు సర్వే ఆఫ్ ఇండియా మాజీ చీఫ్, ప్రస్తుత కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ అడ్వయిజర్ కల్నల్ గిరీష్ బుధవారం రాష్ట్రంలో పర్యటించారు. కృష్ణా జిల్లాలో పలు గ్రామాల్లో జరుగుతున్న సర్వే ప్రక్రియను పరిశీలించారు. అనంతరం తాడేపల్లిలోని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. అక్టోబర్ 2 నాటికి దాదాపు 2,500 గ్రామాల్లో డ్రోన్ల ద్వారా సర్వే పూర్తి చేసి మ్యాప్‌లను రాష్ట్రానికి అందజేసేందుకు చర్యలు చేపడతామని కేంద్ర అధికారులు హామీ ఇచ్చారు. గ్రామాల్లో డ్రోన్ల ద్వారా సర్వే సమయంలో చెట్లు వంటివి అడ్డం వచ్చినప్పుడు, ఇంటి సరిహద్దుల మధ్య విస్తీర్ణాన్ని నిర్ధారించడంలో ఏర్పడుతున్న ఇబ్బందులను పలు జిల్లాల కలెక్టర్లు సర్వే ఆఫ్ ఇండియా ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించారు. ఆ సమయంలో అనుసరించాల్సిన వ్యూహాలను సర్వే ఆఫ్ ఇండియా ప్రతినిధులు వివరించారు. సీసీఎల్ఏ నీరబ్‌కుమార్ ప్రసాద్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్, సర్వే ఆఫ్ ఇండియా ప్రాంతీయ డైరెక్టర్ మాలిక్, వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష కార్యక్రమం ఓఎస్డీ ఏకే నాయక్, వర్చువల్ విధానంలో పలు జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. -
మా దందా ఇంతే.. అడ్డొస్తే అంతే!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/కాశీబుగ్గ: ప్రభుత్వ ఉద్యోగాల పేరిట వందలాది నిరుద్యోగుల నుంచి సుమారు రూ.75 కోట్లు వసూలు చేసి.. నకిలీ అపాయింట్మెంట్ లేఖలిచ్చి మోసగిస్తున్న సుధాకర్ ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. స్మార్ట్ విలేజ్, రూర్బన్ పేరుతో ఎటువంటి ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని, ఎవరికీ ఎటువంటి ప్రాజెక్టు ఇవ్వలేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ స్పష్టంగా పేర్కొన్నప్పటికీ.. సుధాకర్ మాత్రం దర్జా వెలగబోస్తున్నాడు. అపాయింట్మెంట్ లేఖలు తీసుకున్న వారెవరూ ఆందోళన చెందొద్దని, ఉద్యోగం విషయమై నెలాఖరులోగా స్పష్టత ఇస్తానని డబ్బులు కట్టిన నిరుద్యోగ యువతను జూమ్ సమావేశాల ద్వారా మభ్యపెడుతున్నాడు. ఐదు జిల్లాల్లో సాగుతున్న ఈ నకిలీ బాగోతాన్ని బయటపెట్టిన ‘సాక్షి’ విలేకరులతోపాటు అతడి గుట్టురట్టు చేస్తున్న వారిని చంపుతానంటూ సుధాకర్ బెదిరింపులకు దిగుతున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులతో మాట్లాడించిన వీడియోలు విడుదల చేయగా.. దీనిపై సోమవారం జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్‌కు ‘సాక్షి’ విలేకరులు ఫిర్యాదు చేశారు. వాస్తవాలు నిగ్గు తేల్చాలని కోరారు. కూర్చుంటే జీతమిస్తానంటూ.. సుధాకర్ ప్రతి మండలంలో చిన్న గదిని అద్దెకు తీసుకుని, తనకు డబ్బులిచ్చిన నిరుద్యోగులను అందులో ఉంచుతున్నాడు. వారెవరికీ ఎలాంటి విధులు అప్పగించలేదు. ‘ఆఫీసుకు ఉదయం వచ్చి సాయంత్రం వెళ్లిపోతే చాలు. కొన్నాళ్ల దాటాక బాధ్యతలు అప్పగిస్తాను. అప్పటివరకు మీకు జీతం ఇచ్చేస్తా’ అంటూ నమ్మబలుకుతున్నాడు. ఈ మొత్తం వ్యవహారంపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితం అవుతుండటంతో అతడికి డబ్బు చెల్లించిన వారు ‘సాక్షి’ ప్రతినిధికి ఫోన్ చేసి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. సాక్షి కథనాలపై సుధాకర్‌ను ఫోన్లో సంప్రదిస్తుంటే.. ‘కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉండండి. నెలాఖరులోగా క్లారిటీ ఇస్తాను. మీరిచ్చిన డబ్బుకు ఢోకా లేదు’ అని చెప్పుకొస్తున్నాడని కొందరు నిరుద్యోగులు ‘సాక్షి’కి చెప్పారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బాధితులూ.. ఫిర్యాదు చేయండి నిరుద్యోగులెవరూ ఎవరికీ డబ్బులు కట్టి మోసపోవద్దని కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి యువతకు హితవు పలికారు. సోమవారం కాశీబుగ్గలో విలేకరులతో మాట్లాడుతూ.. ఉద్యోగాల పేరిట మోసపోయిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. పోస్టుకు రూ.5 లక్షలు గ్రామీణ ప్రాంతాలోని ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు స్మార్ట్ విలేజ్, రూర్బన్ మిషన్ పేరిట కేంద్ర ప్రభుత్వం ఓ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అందులో ఎగ్జిక్యూటివ్, క్లస్టర్ అసిస్టెంట్ ఉద్యోగాలిప్పిస్తానంటూ సుధాకర్ తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన సుమారు 1,500 మంది నిరుద్యోగుల నుంచి రూ.5 లక్షల చొప్పున రూ.75 కోట్లు వసూలు చేశాడు. వారందరికీ స్మార్ట్ విలేజ్, రూర్బన్ పేరిట నకిలీ అపాయింట్మెంట్లు ఇచ్చి మోసగించాడు. నిజానికి రాష్ట్రంలో ఎక్కడా స్మార్ట్ విలేజ్, రూర్బన్ మిషన్ పేరిట అటు కేంద్ర ప్రభుత్వం గానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ ఎటువంటి నియామకాలు చేపట్టలేదు. వాటికింద ఏ సంస్థకూ ఎలాంటి ప్రాజెక్టు కూడా ఇవ్వలేదు. కానీ.. ఆ పేరుతో సుధాకర్ అనే వ్యక్తి ఇంకా నకిలీ అపాయింట్మెంట్లు జారీ చేస్తూనే ఉన్నారు. -
ఉపాధిలో నంబర్ వన్ ఏపీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలు తీరును కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్–జూన్ నెలల మధ్య దేశవ్యాప్తంగా పథకం అమలు తీరుపై కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ నాగేంద్రనాథ్ సిన్హా బుధవారం అన్ని రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించారు. విజయవాడ నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, ఉపాధి హామీ పథకం డైరెక్టర్ చినతాతయ్య తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం అమలులో నాలుగు సూచీలలో దేశంలో మన రాష్ట్రమే మొదటి స్థానంలో నిలవగా.. మిగిలిన ఇతర సూచీలలోనూ రాష్ట్రం మొదటి ఐదు స్థానాల్లో నిలిచింది. దీంతో కేంద్ర కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. మూడు నెలల్లో దేశంలోనే అత్యధికంగా 17.29 కోట్ల పని దినాల పాటు పేదలకు పనులు కల్పించడం.. పనులు పారదర్శకంగా జరిగాయా లేదా అన్న దానిపై సోషల్ ఆడిట్ నిర్వహించడంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం ఎంతో ముందు ఉందని అధికారులు వెల్లడించారు. పని చేపట్టే ప్రాంతాలను అన్లైన్ జియో ట్యాగింగ్‌లో గుర్తించే జీఐఎస్ ప్రణాళికల రూపకల్పనలోను, సీఎఫ్‌పీ సూచీలోను రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. చేపట్టిన పనులలో 96 శాతం పూర్తి చేస్తుండటంపై కేంద్ర కార్యదర్శి రాష్ట్రాన్ని అభినందించారు. ‘వ్యవసాయ’ పనులే 70 శాతం రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లోనే 70 శాతం పనులు చేపడుతుండటంపై కేంద్రం అభినందించింది. పథకం అమలుకు దేశం మొత్తం మీద ఖర్చు చేస్తున్న వ్యయంలో 60 శాతం ఈ రంగంలో పనులు వెచ్చిస్తుండగా.. రాష్ట్రంలో 70 శాతం ఖర్చు పెట్టింది. -
కోర్టు ముగిసే వరకు నిలబడండి!
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్, ఐఎఫ్ఎస్ అధికారి, అప్పటి ఉద్యానవన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరికి హైకోర్టు తొమ్మిది రోజుల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించింది. అయితే వారిద్దరూ క్షమాపణ కోరడంతో పాటు కోర్టు ఉత్తర్వుల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తామని చెప్పడం, వారి వయస్సును, ప్రస్తుత కరోనా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని తీర్పును సవరించింది. జరిమానాను అలానే ఉంచి, పనివేళలు ముగిసేంత వరకు కోర్టులోనే నిలబడి ఉండాలని వారిని ఆదేశించింది. జరిమానా చెల్లించడంలో విఫలమైతే మూడు రోజుల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. కేసు ఇదీ.. విలేజ్ హార్టీకల్చర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఉద్యానవన శాఖ 2020 జనవరి 10న నోటిఫికేషన్ జారీ చేసింది. అదే నెలలో సవరణ నోటిఫికేషన్ జారీ చేసి గతంలో నిర్ధేశించిన పలు అర్హతలను తొలగించింది. దీనిని సవాలు చేస్తూ ఎస్.కృష్ణ, మరో 35 మంది అభ్యర్థులు గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు, సవరణ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. పోస్టుల భర్తీలో పిటిషనర్లకు అవకాశం కల్పించాలంటూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. వాటిని ఎత్తివేయాలంటూ ప్రభుత్వం అనుబంధ పిటిషన్ వేసింది. దానిని హైకోర్టు తోసిపుచ్చింది. తర్వాత హైకోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడంతో అభ్యర్థులు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్.. అధికారులు ఉద్ధేశపూర్వకంగానే కోర్టు ఆదేశాలను అమలు చేయలేదని తేల్చారు. మంగళవారం ఈ పిటిషన్ మరోసారి విచారణకు వచ్చింది. 9 నెలల జాప్యం ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. కోర్టు ఆదేశాల అమలులో 9 నెలల జాప్యం ఉందన్నారు. వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిస్తేనే కోర్టు ఆదేశాలను అమలు చేసే ఇలాంటి అధికారుల పట్ల కనికరం చూపాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అలా చేస్తే తప్పుడు సంకేతం పంపినట్లు అవుతుందని తెలిపారు. కోర్టు ఆదేశాల ఉద్ధేశపూర్వక ఉల్లంఘనకు వీరికి శిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మరో కోర్టు ధిక్కార కేసులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మంగళవారం హైకోర్టు ముందు హాజరయ్యారు. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తానని, కొంత గడువునివ్వాలని ఆయన కోరడంతో న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ అందుకు అనుమతినిచ్చారు. -
ఉన్నతాధికారులకు మరో అవకాశం
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో ఇద్దరు ఉన్నతాధికారులకు న్యాయస్థానం మరో అవకాశం ఇచ్చింది. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్, ఐఎఫ్ఎస్ అధికారి, అప్పటి ఉద్యానవన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరికి నెల రోజుల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించిన హైకోర్టు.. న్యాయస్థానం ఆదేశాల అమలుకు మరో అవకాశం ఇవ్వాలని ఇద్దరు అధికారులు అభ్యర్థించడంతో సానుకూలంగా స్పందించి జైలు శిక్ష, జరిమానా ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. కోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు రెండు వారాలు గడువు ఇస్తూ న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏం జరిగిందంటే.. విలేజ్ హార్టీకల్చర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఉద్యానవన శాఖ 2020 జనవరి 10న నోటిఫికేషన్ జారీ చేసింది. అనంతరం అదే నెలలో సవరణ నోటిఫికేషన్ జారీ చేసి గతంలో నిర్దేశించిన పలు అర్హతలను తొలగించింది. దీన్ని సవాలు చేస్తూ ఎస్.కృష్ణ, మరో 35 మంది అభ్యర్థులు గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. సవరణ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. పోస్టుల భర్తీలో పిటిషనర్లకు అవకాశం కల్పించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మ«ధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడంతో అభ్యర్థులు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఉద్దేశపూర్వకంగానే అధికారులు కోర్టు ఆదేశాలను అమలు చేయలేదని తేల్చారు. కోర్టు ఆదేశాల మేరకు గిరిజా శంకర్, చిరంజీవి చౌదరి మంగళవారం న్యాయస్థానం ఎదుట హాజరు కాగా నెల రోజులు జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ ఇద్దరు అధికారుల తరఫున హాజరై కోర్టు ఆదేశాలను అమలు చేస్తామని నివేదించారు. ఇందుకు రెండు వారాల గడువు కావాలని కోరారు. సుమన్ అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందించిన న్యాయమూర్తి అధికారులకు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటూ విచారణను వాయిదా వేశారు. హెచ్ఆర్సీలో సదుపాయాలపై వివరాలివ్వండి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ)కి కార్యాలయం, సిబ్బంది, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ హెచ్ఆర్సీ కార్యాలయం హైదరాబాద్‌లో ఎందుకు ఉంది? అది ఏపీ భూ భాగం నుంచి ఎందుకు పనిచేయడం లేదో కూడా చెప్పాలంది. తదుపరి విచారణను జూలై 5కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. హెచ్ఆర్సీ చైర్మన్, సభ్యులను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఆర్సీ పనిచేసేందుకు వీలుగా కార్యాలయం, సిబ్బంది, సౌకర్యాలను ఏర్పాటు చేయలేదని, దీంతో ఫిర్యాదు తీసుకుని విచారించడం సాధ్యం కావడంలేదంటూ ఏపీ పౌర హక్కుల సంఘం సంయుక్త కార్యదర్శి మల్లేశ్వరరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. -
బీడు భూములకు జలకళ
సాక్షి, అమరావతి/కర్నూలు (అగ్రికల్చర్): వైఎస్సార్ జలకళ పథకం అమలుతో రాష్ట్రంలోని బీడు, మెట్ట భూముల్లో జల సిరులు వెల్లివిరుస్తున్నాయి. 2020 సెప్టెంబర్ 28న రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించగా.. 6 నెలల వ్యవధిలోనే కొత్తగా 20 వేల ఎకరాలకు నీటి సౌకర్యం కలిగింది. ఇప్పటివరకు 4,223 వ్యవసాయ బోర్ల తవ్వకాలు పూర్తయ్యాయి. నెల రోజుల క్రితం వరకు గ్రామాల్లో వ్యవసాయ భూముల్లో ఏదో ఒక పంట ఉండటంతో పనులు కాస్త మందకొడిగా సాగినా.. ఇప్పుడు నిత్యం 50 నుంచి 70 వరకు బోర్ల తవ్వకాలు కొనసాగుతున్నాయి. రానున్న రోజుల్లో వీటి తవ్వకాల్లో మరింత వేగం పుంజుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులకు భారం లేకుండా.. వైఎస్సార్ జలకళ పథకం అమల్లోకి రాకముందు బోర్లు వేయించుకుని, విద్యుత్ కనెక్షన్ తీసుకొని, మోటారు బిగించుకోవడం అనేది చిన్న, సన్నకారు రైతులకు తలకు మించిన భారంగా ఉండేది. బోరు వేసినా నీళ్లు పడకపోతే.. ఇంకో బోరు వేయడం.. అదీ ఫలించకపోతే మరో బోరు వేయడం వల్ల వేలాది మంది అప్పుల ఊబిలో కూరుకుపోయారు. వైఎస్సార్ జలకళ పథకం అమల్లోకి వచ్చాక అలాంటి ఇబ్బందులకు, నష్టాలకు చెక్ పడింది. బోరు తవ్వకంతో పాటు పంపుసెట్ ఏర్పాటు వంటివి కూడా ప్రభుత్వం ఉచితంగానే అందజేస్తోంది. తవ్వకం పూర్తయిన చోట విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం, మోటార్లు బిగించడంపై గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. 82 నియోజకవర్గాల్లో వేగంగా.. ప్రాజెక్టుల ద్వారా సాగునీటి వసతి తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ పథకానికి రైతుల నుంచి విశేష స్పందన వస్తోంది. 82 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పదికి మించి బోర్ల తవ్వకాలు ఇప్పటికే పూర్తయ్యాయి. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గ పరిధిలో 253 బోర్ల తవ్వకాలు పూర్తవగా.. కర్నూలు జిల్లా బనగానపల్లె, ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గాల్లో 200 చొప్పున బోర్ల తవ్వకాలు జరిగాయి. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 1,191 బోర్ల తవ్వకాలు పూర్తయ్యాయి. నాలుగేళ్లలో రెండు లక్షల బోర్లు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా వచ్చే నాలుగేళ్లలో రెండు లక్షల వ్యవసాయ బోర్ల తవ్వకం లక్ష్యంగా నిర్ణయించారు. వీఆర్వో స్థాయిలోనే 93,812 దరఖాస్తుల పరిశీలనను పూర్తి చేసి.. వాటిని ఆమోదించారు. వాటిలో జియాలజిస్ట్ సర్వే పూర్తయిన 7,892 బోర్ల తవ్వకానికి ఇప్పటికే అన్నిరకాల అనుమతులు మంజూరయ్యాయి. వాల్టా చట్టానికి మార్పులు వాల్టా చట్టం నిబంధనల కారణంగా ఈ పథకం ద్వారా రైతులకు ఉచితంగా బోర్లు తవ్వకానికి ఆటంకాలు ఎదురు కావడంతో నిపుణుల అభిప్రాయాలకు అనుగుణంగా వాల్టా చట్టాన్ని సవరించేందుకు చర్యలు చేపట్టాం. ఈ వేసవిలో ఎక్కువ సంఖ్యలో బోర్ల తవ్వకానికి చర్యలు చేపట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. బోరు తవ్వకానికి ముందే లబ్ధిదారుని భూమిని జియాలజిస్ట్ ద్వారా సర్వే చేయించిన అనంతరమే తవ్వకం ప్రారంభిస్తుండటంతో 81 శాతం బోరు తవ్వకాలు సక్సెస్ అవుతున్నట్టు క్షేత్ర స్థాయి నుంచి నివేదికలు అందుతున్నాయి. – గిరిజా శంకర్, కమిషనర్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ వైఎస్సార్ జలకళ ఆనందం నింపింది మాకు 4.50 ఎకరాల మెట్ట భూమి ఉంది. ఆర్థిక పరిస్థితి బాగుండక బోరు వేయించలేకపోయాను. మా కోరికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీర్చారు. ఎలాంటి రికమండేషన్లు లేకుండానే గత నెలలో బోరు వేశారు. నీరు సమృద్ధిగా పడింది. వైఎస్సార్ జలకళ మా కుటుంబంలో ఆనందాన్ని నింపింది. – కె.లక్ష్మయ్య, ఇందిరేశ్వరం, ఆత్మకూరు మండలం, కర్నూలు జిల్లా -
విజయవాడ లో జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల పోలింగ్
-
నేడే తొలి సం'గ్రామం'
సాక్షి, అమరావతి: పార్టీ రహిత పంచాయతీ సమరంలో బ్యాలెట్ పేపర్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయనగరం మినహా మిగిలిన 12 జిల్లాల పరిధిలో జరగనున్న నేపథ్యంలో 2,723 సర్పంచి, 20,157 వార్డు సభ్యుల పదవులకు మంగళవారం ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ ముగిసిన వెంటనే అక్కడే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. తొలిసారిగా పంచాయతీ ఎన్నికలలోనూ ‘నోటా’గుర్తు ప్రవేశపెట్టారు. అయితే ఓట్ల లెక్కింపు సమయంలో నోటా గుర్తుకు వచ్చిన ఓట్లను పరిగణలోకి తీసుకోకుండా పోటీలో ఉన్న అభ్యర్థులలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు గెలుపొందినట్లు ప్రకటిస్తారు. కాగా బ్యాలెట్ పేపరులో అభ్యర్థుల గుర్తులు మారడంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు గ్రామాల్లో చివరి నిమిషంలో వార్డు సభ్యుల ఎన్నికలు మాత్రం ఆగిపోయాయి. ఇక్కడ సర్పంచ్ ఎన్నికలు యథాతథంగా జరగనున్నాయి. 525 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం.. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఏర్పాట్లన్నింటినీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అప్పగించారని, అందుకనుగుణంగా అంతా సిద్ధం చేసినట్లు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తొలివిడతలో 3,249 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్లు జారీ చేయగా 525 చోట్ల సర్పంచి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు చెప్పారు. నెల్లూరు జిల్లా వెలిచెర్ల గ్రామంలో సర్పంచి పదవికి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో మిగిలిన 2,723 చోట్ల సర్పంచి పదవులకు ఎన్నికలు జరుగుతున్నట్లు వివరించారు. ఆయా చోట్ల మొత్తం 7,506 మంది పోటీలో ఉన్నట్లు చెప్పారు. మొత్తం 32,502 వార్డు సభ్యుల పదవులకు ఈ విడతలో ఎన్నికలు జరుగుతుండగా 12,185 స్థానాలు ఏకగ్రీవమయ్యాయని, మరో 160 చోట్ల ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో మిగిలిన 20,157 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ద్వివేదీ తెలిపారు. వార్డు పదవులకు 43,601 మంది పోటీలో ఉన్నట్లు వివరించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నుంచి పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులను తీసుకెళ్తున్న సిబ్బంది అత్యంత సమస్యాత్మక కేంద్రాలు 3,594.. తొలివిడతలో 29,732 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు జరగనుండగా 3,594 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకంగా, మరో 3,458 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ ఎన్నికల కోసం 48,449 బ్యాలెట్ బాక్స్‌లను వినియోగిస్తుండగా 18,608 పెద్దవి , 8,503 మధ్య రకం, 21,338 చిన్న బ్యాలెట్ బాక్స్‌లను ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు తరలించినట్లు వివరించారు. పోలింగ్ విధులకు 83,736 మందిని, జోనల్, రూట్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లుగా 4,681 మందిని ఎన్నికల విధుల్లో వినియోగిస్తున్నట్లు చెప్పారు. కరోనా పాజిటివ్ వ్యక్తులకు చివరి గంట సేపు అవకాశం.. కోవిడ్ నిబంధనల ప్రకారం పోలింగ్ సిబ్బందికి మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లు, గ్లౌజులను కేంద్రాల వారీగా సిద్ధం చేసినట్లు ద్వివేది తెలిపారు. కరోనా పాజిటివ్ వ్యక్తుల కోసం పీపీఈ కిట్లు ఏర్పాటు చేశామని, పోలింగ్ చివరిలో గంట (2.30 నుంచి 3.30 గంటల మధ్య) పాటు వారు ఓటు వేసేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ విధుల్లో పాల్గొనే మహిళా సిబ్బందికి ప్రత్యేకంగా వసతుల కల్పనకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఓట్ల లెక్కింపుపై 52,285 మందికి శిక్షణ.. పోలింగ్ ముగిసిన అనంతరం ఆ కేంద్రాల వద్దే ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు 14,535 మంది సూపర్వైజర్లు, 37,750 ఇతర సిబ్బందికి కౌంటింగ్ అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు ద్వివేది తెలిపారు. పోలింగ్ ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించేందుకు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో జిల్లాకొకరు చొప్పున ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. ఓటర్లంతా హక్కు వినియోగించుకోవాలి.. ఎన్నికల సరళిని ప్రత్యక్షంగా ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు కమిషనర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ స్టేషన్ల వద్ద పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోనున్నట్లు చెప్పారు. మొదటి దశ పోలింగ్ జరిగే గ్రామ పంచాయతీల్లో ఓటర్లంతా ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞఫ్తి చేశారు. కరోనా జాగ్రత్తలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో చర్చించిన తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తెచ్చి చర్యలు చేపట్టినట్లు ద్వివేదీ విలేకరులకు తెలిపారు. రెండు గ్రామాల్లో వార్డు ఎన్నికలు నిలిపివేత: గిరిజా శంకర్ బ్యాలెట్ పేపరులో అభ్యర్థుల గుర్తులు మారడంతో పశ్చిమ గోదావరి జిల్లా బొప్పనపల్లి, వడ్డేగూడెంలో వార్డు సభ్యుల ఎన్నికలు నిలిచిపోయాయని, ఆ గ్రామాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే సమయంలో నిర్వహిస్తామని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. ఎన్నికల సందర్భంగా క్యూలైన్లో ఉండే ఓటర్లను ధర్మల్ స్క్రీనింగ్‌తో పరీక్షించిన అనంతరం పోలింగ్ కేంద్రాలలోకి అనుమతించనున్నట్లు తెలిపారు. టీడీపీ బరితెగింపుపై కమిషన్‌కు ఫిర్యాదు – ఎస్ఈసీ తక్షణమే స్పందించాలి: లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరింపులు, సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ పత్రాల ఉపసంహరణ లాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ తక్షణమే స్పందించి టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలపై సోమవారం ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్యే కుంభా రవి, అంకమరెడ్డి నారాయణమూర్తి, మనోహర్‌రెడ్డి, ఎన్.పద్మజ తదితరులు ఆయన వెంట ఉన్నారు. పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయడంతోపాటు నామినేషన్ల సందర్భంగా పార్టీ జెండాలు, కరపత్రాలు, డబ్బులను గ్రామాల్లో పంచుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్నారని అప్పిరెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల టీడీపీ నేతలు మద్యం, డబ్బులను పంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నా నిమ్మగడ్డ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఉరవకొండ, పొన్నూరు, కుప్పంలో టీడీపీ డబ్బు పంపిణీ అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజవర్గం, గుంటూరు జిల్లా పొన్నూరు, చిత్తూరు జిల్లా కుప్పంలోని గ్రామాలలో టీడీపీ శ్రేణులు డబ్బులు పంచుతూ అక్రమాలకు పాల్పడుతున్నాయని అప్పిరెడ్డి చెప్పారు. ప్రొద్దుటూరులో ప్రత్యర్థి అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి దౌర్జన్యం చేసి గాయపరిచారన్నారు. 45 ఏళ్లుగా వరదరాజులరెడ్డి స్వగ్రామమైన కామనూరులో పంచాయతీ ఎన్నికలలో పోటీ లేకుండా వారి బంధువులు, అనుచరులు బెదిరించి ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వస్తున్నారన్నారు. ప్రస్తుతం కామనూరు పంచాయతీ బీసీలకు రిజర్వ్ కావడంతో వైఎస్సార్సీపీ అభిమాని షేక్ కరీమూన్ నామినేషన్ వేశారన్నారు. నామినేషన్ విత్‌డ్రా చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సోదరులు రాఘవరెడ్డి, భార్గవరెడ్డి, హనుమంతరెడ్డిలు తీవ్రంగా ఒత్తిడి చేశారని తెలిపారు. ఆమెకు మద్దతుగా నిలిచిన వైఎస్సార్సీపీ నేత బాలవరదరాజులరెడ్డి ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్డారని చెప్పారు. తక్షణమే ఎస్ఈసీ జోక్యం చేసుకొని షేక్ కరీమూన్‌కు రక్షణ కల్పించి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. వరదరాజులరెడ్డితో పాటు ఆయన సోదరులను తక్షణమే ఆరెస్ట్ చేయాలన్నారు. కళ్యాణదుర్గంలో అప్రజాస్వామికంగా ఏకగ్రీవం అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం కొండాపూరం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి లక్ష్మీదేవిని టీడీపీ నాయకులు చౌలం మల్లిఖార్జున, డాక్టర్ ఉన్నం మారుతీ చౌదరి, అనిల్ చౌదరి, పవన్ చౌదరి, ముత్యాలరెడ్డిలు బెదిరించి బలవంతంగా నామినేషన్ ఉపసంహరించుకునేలా చేశారని చెప్పారు. దీంతో టీడీపీ బలపరిచిన త్రివేణి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైందన్నారు. ఈ అప్రజాస్వామిక ఎన్నికను రద్దు చేసి లక్ష్మీదేవి అభ్యర్థిత్వాన్ని పునరుద్ధరించి తిరిగి ఎన్నికలు నిర్వహించాలన్నారు. పాడేరు ఏజన్సీలో పోలింగ్ సమయం మార్చాలి.. విశాఖపట్నం జిల్లా పాడేరు డివిజన్లో ఈనెల 17న తేదీన ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరపాలని తొలుత ఎస్ఈసీ నిర్ణయించారని చెప్పారు. కానీ ఇప్పుడు ఉదయం 6.30 నుండి మధ్యాహ్నం 1.30 వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుందని ప్రకటించారని, ఇది పర్వత ప్రాంతం కావడంతో ఓటర్లు కాలి నడకన కి.మీ దూరం ప్రయాణం చేసి పోలింగ్ స్టేషన్‌కి చేరుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. తొలుత ప్రకటించిన ప్రకారం పాత సమయాన్నే కొనసాగించాలని కోరారు. తొలి దశకు పటిష్ట బందోబస్తు తొలి విడతలో భాగంగా మంగళవారం పోలింగ్ జరగనున్న గ్రామాల్లో పోలీస్ విభాగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో రాష్ట్రస్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా ఫ్లైయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి బాడీవోర్న్ కెమెరాలు, డ్రోన్లు, కాల్ సెంటర్, డయల్ 100 వంటి వాటిని వినియోగిస్తున్నారు. అలాగే సోమవారం ఏజెన్సీ ప్రాంతాలకు చేరిన పోలీసు బలగాలు గ్రామాల్లో తిరిగి.. ఓటు వేసేందుకు రావాలని ప్రజలకు అవగాహన కల్పించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టింగ్‌లు, తప్పుడు ప్రచారాలు చేసే వారిపైనా ప్రత్యేక నిఘా పెట్టారు. కాగా, 2013లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించినప్పటి నుంచి తొలిదశ పోలింగ్ ముందు రోజు వరకు 87 కేసులు నమోదైతే.. ఈసారి 44 కేసులే నమోదయ్యాయి. ఇక పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యానికి.. పోలీసులు, ఎస్ఈబీ సిబ్బంది సరిహద్దుల్లో చెక్ పెడుతున్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని డీజీపీ సవాంగ్ విజ్ఞప్తి చేశారు. -
నేటి రాత్రికే గ్రామాలకు..
సాక్షి, అమరావతి: తొలి విడత పంచాయతీ ఎన్నికలు ఈ నెల 9వతేదీన జరగనున్న నేపథ్యంలో పోలింగ్ సిబ్బంది ఎన్నికల సామగ్రితో సహా ముందు రోజు రాత్రికే ఆయా గ్రామాలకు చేరుకునేలా జిల్లా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్ ఆదివారం సాయంత్రం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బ్యాలెట్ పేపర్లు, స్వస్తిక్ మార్క్, రబ్బర్ స్టాంప్‌లు, ఇండెలిబుల్ ఇంకు తదితర సామాగ్రిని సిబ్బంది సోమవారం మధ్యాహ్నం కల్లా తీసుకుని ఆయా పోలింగ్ బూత్‌లకు చేరుకోవాలని, రిటర్నింగ్ అధికారులు, పీవోలు పోలింగ్ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని ద్వివేది పేర్కొన్నారు. ఆయా రూట్లలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద బ్యారికేడ్లతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, ఓట్ల లెక్కింపు రాత్రంతా జరిగే పక్షంలో తగినన్ని లైట్లను సిద్ధం చేసుకోవాలని కమిషనర్ గిరిజా శంకర్ సూచించారు. సిబ్బందికి భోజనం తదితర సదుపాయాలను కల్పించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా నిఘా.. వెబ్ కాస్టింగ్ ద్వారా అన్ని కేంద్రాలపై నిఘా వేయాలని, కంట్రోల్ రూం ద్వారా వెబ్‌కాస్టింగ్‌ను నిరంతరం పర్యవేక్షించాలని గిరిజా శంకర్ సూచించారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే రికార్డు చేసిన డేటాను వినియోగించుకునేందుకు నిక్షిప్తం చేయాలన్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకోవాలని, మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలన్నారు. వీటి కొనుగోళ్లకు అవసరమైన నిధులను ఎంపీడీవోలకు పంపాలని జిల్లా అధికారులను కమిషనర్ ఆదేశించారు. అవసరమైతే నాలుగో దశలో విధులు కేటాయించిన ఎంపీడీవోలను కూడా మొదటి దశకు వినియోగించుకోవాలని కమిషనర్ సూచించారు. -
ఈసీ సెన్సూర్ ఆర్డర్‌ని తిప్పి పంపిన ప్రభుత్వం
సాక్షి, విజయవాడ : ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సెన్సూర్ ఆర్డర్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిప్పి పంపింది. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్‌లపై ఎన్నికల కమిషనర్ సెన్సూర్ ఆర్డర్‌కు బుధవారం ఆదేశాలు జారీ చేయగా ఎస్ఈసీకి ఆ అధికారం లేదని ప్రభుత్వం తిప్పి పంపింది. అధికారుల వివరణ లేకుండా ప్రొసీడింగ్స్‌ను జారీ చేయలేరన్న ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా చర్యలు తీసుకునే అధికారం లేదని తెలిపింది. అసలు అధికారుల వివరణ కూడా పెనాల్టీ ఎలా సిఫార్సు చేస్తారని ప్రశ్నించింది. ఇద్దరు సీనియర్ అధికారులపై చర్యలు తీసుకోవడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. చదవండి: ఆ ఇద్దరి బదిలీకి ఎస్ఈసీ ‘నో’ కాగా పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్లను బదిలీ చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అడ్డు చెప్పిన విషయం తెలిసిందే. కీలకంగా వ్యవహరించాల్సిన ఈ ఇద్దరినీ ఎన్నికల ప్రక్రియ మధ్యలో బదిలీ చేయడంవల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని ఆయన మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ రాశారు. వారి బదిలీ ప్రతిపాదనను తిరస్కరించిన నిమ్మగడ్డ.. ఆ ఇద్దరిపై ‘సెన్సూర్’ పేరిట క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ మంగళవారం వేరుగా ఆదేశాలు జారీచేశారు. గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితా తయారీలో వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, విధి నిర్వహణలో వారు విఫలమైనట్లుగా వారి సర్వీసు రికార్డులో నమోదు చేయాలన్నారు. సెన్సూర్ కింద క్రమశిక్షణ చర్యలంటే ఒక ఏడాదిపాటు పదోన్నతులకు అవకాశం ఉండదని అర్ధం చేసుకోవాలని అధికార వర్గాలు చెప్పాయి. -
ఆ ఇద్దరి బదిలీకి ఎస్ఈసీ ‘నో’
సాక్షి, అమరావతి: పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్లను బదిలీ చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అడ్డు చెప్పారు. కీలకంగా వ్యవహరించాల్సిన ఈ ఇద్దరినీ ఎన్నికల ప్రక్రియ మధ్యలో బదిలీ చేయడంవల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని ఆయన మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ రాశారు. వారి బదిలీ ప్రతిపాదనను తిరస్కరించిన నిమ్మగడ్డ.. ఆ ఇద్దరిపై ‘సెన్సూర్’ పేరిట క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ మంగళవారం వేరుగా ఆదేశాలు జారీచేశారు. గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితా తయారీలో వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. అంతేకాక.. విధి నిర్వహణలో వారు విఫలమైనట్లుగా వారి సర్వీసు రికార్డులో నమోదు చేయాలన్నారు. సెన్సూర్ కింద క్రమశిక్షణ చర్యలంటే ఒక ఏడాదిపాటు పదోన్నతులకు అవకాశం ఉండదని అర్ధం చేసుకోవాలని అధికార వర్గాలు చెప్పాయి. ప్యానెల్ పేర్లు తిరస్కరణ: మరోవైపు.. ఎన్నికల కమిషనర్ కోరిన మేరకు గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లుగా కొత్త వారిని నియమించేందుకు వీలుగా ముగ్గురేసి అధికారులను ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్యానల్‌ను కూడా నిమ్మగడ్డ తిరస్కరించారు. ఈ విషయాన్ని సీఎస్‌కు రాసిన లేఖలో ఆయన తెలిపారు. విజిలెన్స్ కేసుల్లేని వారి పేర్లనే సూచించాలన్నారు. అప్పటివరకు వారి బాధ్యతలను ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్–1కు అప్పగించాలని నిమ్మగడ్డ ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ ఇద్దరు కలెక్టర్లు జీఏడీకి..: గుంటూరు కలెక్టరు శామ్యూల్ ఆనంద్, చిత్తూరు జిల్లా కలెక్టరు నారాయణ్ భరత్‌గుప్తాలతో పాటు తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్‌రెడ్డిలను జీఏడీకి సరెండర్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మంగళవారం మూడు వేర్వేరు ఉత్తర్వులు జారీచేశారు. తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకు.. గుంటూరు జిల్లా జేసీ దినేష్‌కుమార్‌ను గుంటూరు జిల్లా కలెక్టరుగానూ, చిత్తూరు జిల్లా జేసీ మార్కండేయులను చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో నియమిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్‌కు తిరుపతి అర్బన్ ఎస్పీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. -
గోపాలకృష్ణ, గిరిజాశంకర్‌ల బదిలీ!
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సూచన మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజా శంకర్లను బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, గుంటూరు, చిత్తూరు కలెక్టర్లను, తిరుపతి పట్టణ ఎస్పీని బదిలీ చేయడంతో పాటు కొత్తవారి నియామకం నిమిత్తం మూడేసి పేర్లతో ప్యానల్ పంపాల్సిందిగా ఎస్ఈసీ కోరినందున ఈ మేరకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, వీరిలో ఎస్ఈసీ సూచించిన వారిని ఆ విధుల్లో నియమించాలని కూడా నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. -
నివర్ తుపాను: ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
సాక్షి, విజయవాడ: నివర్ తుపాను ప్రభావిత జిల్లాల్లో తక్షణ చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం. గిరిజా శ౦కర్ ఆదేశించారు. గురువారం ఆయన జిల్లాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అవసరమైన తాగునీరు, పారిశుద్ద్యం పనులు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైన చోట్ల ఆహారం, వాటర్ ఫ్యాకెట్లు తక్షణమే సరాఫరా చేయాలన్నారు. ఓహెచ్ఎస్, చేతి పంపులు శుభ్రం చేయించాలని సూచించారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి 24 గంటలు పర్యవేక్షించాలన్నారు. ప్రాణనష్టం, ఆస్తి నష్టం నివేదికలను ఎప్పటికప్పుడు తయారు చేసి పంపాలని గిరిజా శ౦కర్ ఆదేశించారు. (చదవండి: తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష) నివర్ తుపాను రాగల ఆరు గంటల్లో తీవ్ర వాయు గుండం.. ఆ తదుపరి ఆరు గంటల్లో వాయుగుండంగా బలహీన పడనుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంది. తుపాన్ ప్రభావంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గంటకు 45-65 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, వైఎస్సార్ కడప జిల్లాల్లో విస్తారంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అతి తీవ్ర భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. ప్రభావిత ప్రాంత ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. నదులు, వాగులు దాటే ప్రయత్నం చేయరాదని, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. (చదవండి: నివర్ తుపాన్: ఏపీలో వర్ష బీభత్సం..) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా శోభారాజు
సాక్షి, అమరావతి/ తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా పద్మశ్రీ డాక్టర్ శోభారాజును నియమిస్తూ దేవదాయ శాఖ కార్యదర్శి గిరిజాశంకర్ బుధవారం ఉత్తర్వులిచ్చారు. గతేడాది టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, బోర్డు సభ్యులు శోభారాజును ఎంపికచేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ పదవిలో ఆమె రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు సంగీత కళాకారిణిగా అన్నమయ్య పాటలకు ప్రాచుర్యాన్ని తీసుకురావడంలో ఆమె కృషి ఎనలేనిది. -
పరీక్షలన్నీ పూర్తయ్యాకే ‘కీ’
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకోసం ఆదివారం నుంచి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో మొత్తం వారంపాటు జరిగే ఈ పరీక్షలన్నీ పూర్తయ్యాకే అన్నిటికీ కలిపి ఒకేసారి ‘కీ’ విడుదల చేసే వీలుందని అధికార వర్గాలు వెల్లడించాయి. 19 కేటగిరీలలో పారదర్శకంగా 16,208 ఉద్యోగాల భర్తీకి చేపట్టిన ఈ పరీక్షలు పకడ్బందీ ఏర్పాట్ల మధ్య తొలిరోజు ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 26 వరకు రోజుకు రెండేసి చొప్పున పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. మొదటిరోజు జరిగిన పరీక్షలకు 6,81,664 మంది దరఖాస్తు చేసుకోగా 5,06,386 మంది హాజరయ్యారు. రాత పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు. పోటాపోటీగా... ► ఆదివారం ఉదయం జరిగిన పరీక్షలో ఒక్కో ఉద్యోగానికి 332 మంది చొప్పున రాతపరీక్షల్లో పోటీపడగా సాయంత్రం జరిగిన పరీక్షల్లో ఒక్కో ఉద్యోగానికి 147 మంది చొప్పున పోటీపడ్డారు. ► 1,025 పోస్టులకు ఆదివారం ఉదయం జరిగిన పరీక్షలకు 4,56,997 మంది దరఖాస్తు చేసుకోగా 4,08,687 మంది హాల్‌టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. వీరిలో 3,40,386 మంది రాతపరీక్షలకు హాజరయ్యారు. 2,221 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. ► సాయంత్రం పరీక్షలకు 2,24,667 మంది దరఖాస్తు చేసుకోగా, 2,02,998 మంది హాల్‌టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. వీరిలో 1,65,922 మంది 1,059 కేంద్రాల్లో పరీక్షకు హాజరయ్యారు. వారికి ఐసోలేషన్ గదుల్లో పరీక్షలు.. ► తొలిరోజు 634 మంది కరోనా అనుమానిత లక్షణాలున్న అభ్యర్థులు హాజరవగా.. వీరికి ప్రత్యేకంగా ఐసోలేషన్ గదుల్లో పరీక్ష నిర్వహించారు. ► పరీక్ష కేంద్రాల వద్ద కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పీపీఈ కిట్లు ధరించిన సిబ్బంది థర్మల్ స్క్రీనింగ్ అనంతరం అభ్యర్థులను లోపలకు అనుమతించారు. పరీక్ష ప్రారంభానికి ముందు, తర్వాత సోడియం హైపో క్లోరైట్‌తో పూర్తి స్థాయిలో శానిటైజ్ చేశారు. ► పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్లు పరీక్షల నిర్వహణను పర్యవేక్షించారు. ► రాతపరీక్షలు ముగియగానే అన్నిచోట్ల నుంచి జవాబు పత్రాలను గుంటూరు సమీపంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూంకు తరలించారు. పకడ్బందీగా పరీక్షలు: పెద్దిరెడ్డి యూనివర్సిటీ క్యాంపస్: సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి చేపట్టిన రాత పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్టు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా తిరుపతి ఎస్వీయూ క్యాంపస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని మంత్రి తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్‌ను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ సంఖ్యలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు నియంత్రణ చర్యలు పక్కాగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. -
హాల్ టిక్కెట్లను వెంటనే డౌన్లోడ్ చేసుకోండి
సాక్షి, అమరావతి: సచివాలయ ఉద్యోగ రాత పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న 10.56 లక్షల మంది అభ్యర్ధులలో మంగళవారం నాటికి 6.99 లక్షల మంది తమ హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకున్నారని పరీక్షల నిర్వహణకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు పేర్కొన్నారు. మిగిలిన 3.57 లక్షల మంది తమ హాల్ టిక్కెట్లను వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. వెయిటేజీ కోసం 20వ తేదీలోగా ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి. ప్రస్తుతం కాంట్రాక్టు లేదంటే ఔట్సోర్సింగ్ పద్దతిలో పనిచేస్తూ సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారు వెయిటేజీ మార్కుల కోసం తమ శాఖాధిపతుల నుంచి తీసుకున్న ధ్రువీకరణ పత్రాలను çఈ నెల 20వ తేదీలోగా గ్రామ వార్డు సచివాలయ వెబ్ సైట్ అప్లోడ్ చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
14 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా..
సాక్షి, విజయవాడ: ఉపాధి హామీ పనుల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్‌వన్‌గా నిలిచిందని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 14 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా పని కల్పించామని, కరోనా కష్టకాలంలో అత్యధికంగా ఉపాధి కల్పించగలిగామని ఆయన వెల్లడించారు. (కాంట్రాక్ట్ ఉద్యోగులపై సీఎం జగన్ సమీక్ష) ‘‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టార్గెట్ మేరకు 57 లక్షల మంది కూలీలకు పని కల్పించాం. జూన్ ఒక్క నెలలోనే అత్యధికంగా 8 కోట్ల పని దినాలు కల్పించాం. కరోనా కాలంలో పని కల్పించి రూ.4 వేల కోట్ల వేతనాలు చెల్లించామని’’ ఆయన పేర్కొన్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, నాడు - నేడు పాఠశాలల పనులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆస్తుల నిర్మాణంలోనూ దేశంలోనే ఏపీని నంబర్‌వన్ స్థానంలో నిలిపామని, పారదర్శకంగా వేతనాల చెల్లింపుల్లోనూ అందరికంటే ముందజలో ఉన్నామని గిరిజా శంకర్ వెల్లడించారు. (‘గిరిజనులకు మెరుగైన వైద్యమే లక్ష్యం’) -
సచివాలయాల పోస్టుల రాత పరీక్షలకు ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి రాతపరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. జూలై చివరి వారంలో పరీక్షలు ప్రారంభించడానికి కసరత్తు ప్రారంభమైంది. 19 రకాల పోస్టులకు సంబంధించి గ్రామ సచివాలయాల్లో 14,062, వార్డు సచివాలయాల్లో 2,146 పోస్టుల భర్తీకి ఈ ఏడాది జనవరిలో పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం విదితమే. ఫిబ్రవరి ఏడో తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించగా, మొత్తం 11.06 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆయా పోస్టుల భర్తీకి 14 రకాల పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ► రాత పరీక్షల నిర్వహణపై పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ ఆధ్వర్వంలో ఇటీవల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ► కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు కూడా జూలైలోనే జరగనున్నాయి. ఈ సమాచారంతో సచివాలయ పరీక్షలకు హాజరయ్యే వారికి ఇతర పరీక్షల షెడ్యూళ్లతో ఇబ్బంది కలగకుండా తుది తేదీలను ప్రకటించాలని నిర్ణయించారు. ► 14 రకాల పరీక్షలను జూలై చివరిలో ప్రారంభించి 8 రోజులలో పూర్తి చేయాలని భావిస్తున్నారు. ► పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–5, మహిళా పోలీసు, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ పోస్టులకు కలిపి కేటగిరి –1లో నిర్వహించే పరీక్షకు 4,56,997 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాత పరీక్షలు ప్రారంభించే తొలిరోజునే ఈ పరీక్షను నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు. -
కోవిడ్ యుద్ధానికి రెడీ!
సాక్షి, అమరావతి : కరోనా అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వోద్యోగులతో కలిసి పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు సిబ్బందిని సిద్ధం చేస్తోంది. ఇందుకోసం మెడికల్, నర్సింగ్ విద్యార్థులతో పాటు ప్రైవేట్ వైద్యులు, రిటైర్డు ఉద్యోగులు మేము సైతం అంటూ పెద్దఎత్తున ముందుకొస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 8 వేల మంది ఇందుకు దరఖాస్తు చేసుకున్నట్లు కోవిడ్ రాష్ట్ర కమాండ్ కంట్రోలు సెంటర్లో ఈ విభాగం పర్యవేక్షిస్తున్న పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. ప్రభుత్వం ఈ ప్రకటన జారీచేసిన రెండు రోజుల వ్యవధిలోనే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని రెండు వేల మంది వైద్య విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ కొనసాగుతుందని ఆయన తెలిపారు. మరోవైపు.. ఎంపికైన మెడికల్ విద్యార్థులకు క్వారంటైన్ కేంద్రాల్లో ప్రాథమిక సేవలందించేలా శిక్షణను ప్రారంభించింది. ఇందులో భాగంగా.. ► 292 మంది పీజీ మెడికల్ విద్యార్థులు, జూనియర్ డాక్టర్లకు శుక్రవారం ప్రభుత్వం ఆన్లైన్లోనే శిక్షణ నిర్వహించింది. రోజూ కొంతమందికి చొప్పున ఇది కొనసాగనుంది. ► దరఖాస్తు చేసుకున్న వారి నుంచి ఆసక్తి ధృవీకరణ పత్రం తీసుకున్న అనంతరమే ఆయా రంగాల వైద్య నిపుణుల ఆధ్వర్యంలో శిక్షణ ఉంటుంది. ► శిక్షణనిచ్చే ముందు నిపుణులు కొన్ని ప్రశ్నల ద్వారా అభ్యర్థుల సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. అనంతరమే ఎంపిక చేస్తారు. మానసిక సంసిద్ధతను కూడా పరిశీలిస్తారు. ► నర్సింగ్ విద్యార్థులకు ఆ రంగానికి సంబంధించిన నిపుణులతో శిక్షణ ఇస్తారు. ► యునిసెఫ్–కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ–ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిపుణులతో కలిసి దరఖాస్తులు, ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ► రాష్ట్రంలో అదనపు వైద్య సిబ్బంది అవసరమైన పక్షంలో.. వీరి సేవలను ప్రభుత్వం వినియోగించుకుంటుంది. -
కోవిడ్ వలంటీర్ల నియామకానికి దరఖాస్తులు
సాక్షి, అమరావతి : కోవిడ్–19 వ్యాధిని సమర్థంగా అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వలంటీర్ల నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర కోవిడ్ ప్రత్యేకాధికారి ఎం.గిరిజాశంకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంకా ప్రకటనలో ఏముందంటే.. ► వివిధ ఆస్పత్రుల్లో అదనంగా అవసరమయ్యే వైద్య నిపుణులు, పారా మెడికల్ సిబ్బందిని సమకూర్చేందుకు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం సహకారంతో కోవిడ్ వారియర్స్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ► 13 జిల్లాల్లోని 271 మెడికల్ కళాశాలలు/డెంటల్/యునాని/ఆయుర్వేద/నర్సింగ్ కళాశాలలు, ఇతర వైద్య అనుబంధ కోర్సులు చదివే విద్యార్థులు కోవిడ్ వలంటీర్లుగా నమోదు చేసుకోవచ్చు. ► ఆసక్తి ఉన్న వైద్యులు, ప్రత్యేక వైద్య నిపుణులు, నైపుణ్యం కల్గిన నర్సులు, పారా మెడికల్ సిబ్బంది తదితరులు కూడా కోవిడ్ వారియర్స్‌గా పని చేసేందుకు ముందుకు రావాలి. వీరి సేవలను ఆస్పత్రుల్లో, క్వారంటైన్ సెంటర్లలో వినియోగించుకుంటాం. ► వలంటీర్లుగా పనిచేసినవారికి భవిష్యత్తులో ప్రభుత్వం చేపట్టే రిక్రూట్మెంట్లలో ప్రాధాన్యం ఇస్తాం. ► వలంటీర్ల సేవలను వారు ఎంపిక చేసుకున్న జిల్లాల్లోనే వినియోగించుకుంటాం. ఆసక్తి కల్గినవారు health.ap.gov. in/CVPASSAPP/Covid/ Volunteerjobs వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలి. -
ఏకగ్రీవమైతే భారీ నజరానా!
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో సర్పంచ్‌లతోపాటు వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికైతే ఆ గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలు అందించనుంది. ఇలా ఏకగ్రీవాలు జరిగే చోట.. గ్రామ జనాభా ఆధారంగా రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఇవ్వనుంది. ఇందుకు సంబంధించిన ప్రతి పాదనలను పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ ఇప్పటికే ప్రభుత్వానికి పంపారు. ఒకటి, రెండు రోజుల్లో దీనికి సంబంధించిన జీవో వెలువడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. గ్రామ పంచాయతీల ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులతో సంబంధం లేకుండా పార్టీ రహితంగా జరుగుతాయన్న విషయం తెలిసిందే. గ్రామ పంచాయతీ ఎన్నికలకు మాత్రమే ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాలను అందజేస్తోంది. గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా ఉండి గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. గ్రామాలకు ఏడాది కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వివిధ గ్రాంట్లు అందు తున్నాయి. వీటితోపాటు పంచా యతీలు స్థానికంగా పన్నుల రూపంలో వసూలు చేసుకునే మొత్తానికి సమానంగా ఏకగ్రీవ మయ్యే గ్రామాలకు ప్రభుత్వం నిధులు అందజేసే అవకాశం ఉందని అంటున్నారు. -
ఈ నెలలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
సాక్షి, అమరావతి : హైకోర్టు తీర్పు అనంతర పరిణామాలను బేరీజు వేసుకుని, ఈ నెలలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ప్రయత్నాలు మొదలయ్యాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం వెంటనే ఎన్నికల నిర్వహణను చేపట్టేలా.. రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ సోమవారం సాయంత్రం నుంచి కసరత్తు చేస్తోంది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ఖరారు చేసేందుకు హైకోర్టు 30 రోజులు గడువు ఇచ్చినప్పటికీ, ఒకటెండ్రు రోజుల్లోనే ఆ ప్రక్రియ పూర్తి చేసి.. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అందజేయాలని అధికారులు భావిస్తున్నారు. 2018 ఆగస్టు నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు జరపని కారణంగా కేంద్రం నుంచి రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు రూ.3,710 కోట్లు.. నగర, మున్సిపాలిటీలకు మరో రూ.1,400 కోట్ల మేర నిధులు నిలిచిపోయాయి. దీంతో మార్చి నెలాఖరులోగా ఆ నిధులను విడుదల చేసేలా ఎన్నికల నిర్వహణకు ఉన్న అవకాశాలపై పంచాయతీరాజ్ అధికారులతో సీఎంవో అధికారులు చర్చించారు. అంతకుముందు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ జెడ్పీ సీఈవోలు, డీపీవోలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి బ్యాలెట్ పేపర్ల ముద్రణ, రిజర్వేషన్ల ఖరారుపై చర్చించారు. కాగా, రిజర్వేషన్లు ఖరారు కాగానే రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి.. ఆ వెంటనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. -
ఉగాది లోపే ‘స్థానిక’ సమరం!
సాక్షి, అమరావతి: పంచాయతీరాజ్ ఎన్నికలపై హైకోర్టు తీర్పు సానుకూలంగా వెలువడే పక్షంలో ఉగాది లోపే రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఒక దశకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, ఓటింగ్, లెక్కింపు అన్నీ పండుగ లోపే పూర్తి చేయటంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్‌కుమార్ దీనిపై చర్చించేందుకు శుక్రవారం పోలీసు, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. శాంతి భద్రతల అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యదర్శి ఎస్.రామసుందర్‌రెడ్డి ఇందులో పాల్గొన్నారు. ఆగిన నిధులు రూ.5,000 కోట్లకుపైనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనందువల్ల 2018 ఆగస్టు తర్వాత రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే 14వ ఆర్థిక సంఘం నిధుల విడుదల నిలిచిపోయిన విషయం తెలిసిందే. గ్రామ పంచాయతీలకు రూ.3,710 కోట్లు ఆగిపోగా మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు రూ.1,400 కోట్లు దాకా నిధులు నిలిచిపోయాయి. మార్చి నెలాఖరుతో 14వ ఆర్థిక సంఘం ఐదేళ్ల గడువు ముగుస్తున్నందువల్ల ఆ నిధులను కేంద్రం నుంచి తెచ్చేందుకు వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఐదారు నెలలుగా అన్ని చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలను మొత్తం మూడు దశల్లో నిర్వహించాలని యోచిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్‌కుమార్ గతంలోనే ప్రకటించారు. నేడు లేదా సోమవారం తీర్పు వెలువడే అవకాశం స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల వ్యవహారంపై టీడీపీ సానుభూతిపరులు కోర్టుకు వెళ్లడంతో ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. హైకోర్టు తన తీర్పును శనివారం లేదంటే సోమవారం వెలువరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. తీర్పు అనుకూలతను బట్టి మార్చి నెలాఖరులోగా ఎన్నికలు జరిపి కేంద్రం నుంచి నిధులు తేవాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా కేంద్ర నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉగాదిలోపే ఒక దశ ఎన్నికల ప్రక్రియ ముగించేలా కసరత్తు చేస్తోంది. పరీక్షల మధ్య సెలవు తేదీల్లో.. ఇంటర్, పదో తరగతి పరీక్షలు మార్చిలో మొదలై ఏప్రిల్ మధ్య వరకు జరగనున్నాయి. విద్యార్ధులకు ఇబ్బందులు లేకుండా పరీక్షలకు మధ్య ఎక్కువ సెలవులు ఉన్న తేదీల్లో పోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ యోచిస్తోంది. అందుకనుగుణంగా పోలీసు భద్రత కల్పించడంపై శుక్రవారం జరిగిన సమావేశంలో చర్చించారు. అవసరమైతే పొరుగు రాష్ట్రాల నుంచి అదనపు బలగాలు తెప్పించే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ సూచించారు. దీనిపై రెండు రోజుల్లో పోలీసు శాఖ తరఫున రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిక అందజేస్తామని శాంతిభద్రతల విభాగపు అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు. ఒకవేళ రిజర్వేషన్ల శాతాన్ని తగ్గిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించిన పక్షంలో అందుకనుగుణంగా ఇప్పటికే ఖరారు చేసిన రిజర్వేషన్లలో మార్పులు చేర్పులు ఎంత వేగంగా చేయగలరనే అంశాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పంచాయతీరాజ్ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. -
స్థానిక సంస్థలకు మరిన్ని అధికారాలు
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీలతో పాటు మండల, జిల్లా పరిషత్‌లకు మరిన్ని అధికారాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో అమలవుతున్న 1994 నాటి పంచాయతీరాజ్ చట్టం స్థానంలో కొత్త పంచాయతీరాజ్ చట్టం రూపకల్పన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ నేతృత్వంలో.. తూర్పు గోదావరి జిల్లాలోని పంచాయతీరాజ్ శాఖ శిక్షణా కేంద్రం ప్రిన్సిపాల్ ఆనంద్‌తో పాటు మరో ముగ్గురు అధికారుల బృందం కొత్త చట్టం ముసాయిదా తయారీ పనిలో ఉంది. ఈ బృందం వివిధ జిల్లాల్లో పనిచేసే పంచాయతీరాజ్ శాఖ సీనియర్ అధికారులతో కలిసి ఈ నెల 22, 23, 24 తేదీల్లో ముసాయిదా చట్టం రూపకల్పనపై కమిషనర్ కార్యాలయంలో వర్క్‌షాప్ నిర్వహించింది. 15–20 రోజులలో కొత్త చట్టం ముసాయిదా నివేదికను తయారు చేసి, ప్రభుత్వానికి అందజేయనున్నట్టు బృందంలోని ఒక సభ్యుడు ‘సాక్షి’కి వివరించారు. -
14,061 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ సచివాలయాల్లో 14,061 ఉద్యోగాల భర్తీకి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హులైన అభ్యర్థులు శనివారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 31వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తులకు తుది గడువు అని అధికారులు చెప్పారు. గత ఏడాది ఆగస్టు–సెప్టెంబరులో దాదాపు 1.34 లక్షల సచివాలయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఆ నోటిఫికేషన్లలో పోస్టుల వారీగా పేర్కొన్న విద్యార్హతలే ఇప్పుడు కూడా వర్తిస్తాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే సర్వీసులో ఉన్న అభ్యర్థులకు కొన్ని ఉద్యోగాల విషయంలో 10 శాతం మార్కుల వెయిటేజీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల్లో పోస్టుల భర్తీకి రాత పరీక్షను మార్చి తర్వాత నిర్వహించే అవకాశం ఉందన్నారు. నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టుల సంఖ్య పెరిగే వీలుందన్నారు. దరఖాస్తులు చేసుకోవాల్సిన వెబ్సైట్లు: gramasachivalayam.ap.gov.in,vsws.ap.gov.in,wardsachivalayam.ap.gov.in వార్డు సచివాలయాల్లో 2,146 పోస్టులు రాష్ట్రంలో పట్టణాలు, నగరపాలక సంస్థల పరిధిలో వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. వార్డు సచివాలయాల్లో మొత్తం 2,146 ఉద్యోగాల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. శనివారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 31. రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా రిజర్వేషన్ నిబంధనల మేరకు పోస్టులను భర్తీ చేస్తారు. పూర్తి సమాచారం గ్రామ, వార్డు సచివాలయాల వెబ్సైట్ల ద్వారా తెలుసుకోవచ్చని పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్ విజయ్‌కుమార్ చెప్పారు. దరఖాస్తుకు వెబ్సైట్లు: wardsachivalayam.ap.gov.in, gramasachivalayam.ap.gov.in -
బీసీలకు 4.. ఎస్సీలకు 2
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మండల, జిల్లాపరిషత్ ఎన్నికలకు సంబంధించి జిల్లాపరిషత్ చైర్మన్ పదవుల రిజర్వేషన్లను పంచాయతీ రాజ్ శాఖ శుక్రవారం ఖరారు చేసింది. ఈ మేరకు 13 జిల్లాల జెడ్పీ చైర్మన్ పదవుల రిజర్వేషన్ల వివరాలతో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ ప్రకారం.. నాలుగు జిల్లా పరిషత్ (జెడ్పీ) చైర్మన్ పదవులు బీసీలకు, రెండు ఎస్సీలకు, ఒకటి ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. మిగిలిన 6జెడ్పీ చైర్మన్ పదవులను జనరల్(అన్‌రిజర్వ్)కు కేటాయించారు. కాగా మొత్తం 13 జిల్లా పరిషత్‌లకుగాను ఆయా కేటగిరీల వారీగా 6 మహిళలకు రిజర్వు అయ్యాయి. 73వ రాజ్యాంగ సవరణ తర్వాత 1994లో ఏపీ పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి రాగా, అందులో పేర్కొన్న నిబంధనల మేరకు ఇప్పటి వరకు నాలుగు విడతలపాటు ‘స్థానిక’ ఎన్నికలు జరిగాయి. ఈ 4 విడతల ఎన్నికల్లోనూ నిబంధనల ప్రకారం రొటేషన్ పద్ధతిన జెడ్పీ చైర్మన్ పదవుల రిజర్వేషన్లను పంచాయతీరాజ్ శాఖ ఖరారు చేస్తూ వస్తోంది. అదే రొటేషన్ క్రమంలో ప్రస్తుతం ఐదో విడత ఎన్నికలకోసం ఆయా కేటగిరీల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ పదవుల రిజర్వేషన్లకు సంబంధించి జిల్లాలవారీగా ఆయా జిల్లాల కలెక్టర్లు గురువారం గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేయడం తెలిసిందే. సర్పంచ్ రిజర్వేషన్ల ఖరారుపై వీడియో కాన్ఫరెన్స్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లను సైతం ఖరారు చేసే కసరత్తు ప్రారంభమైంది. ఇందులో భాగంగా జిల్లా, మండల అధికారులకు సూచనలు చేసేందుకు పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్‌తో కలసి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లో ఎక్కడికక్కడ ఆయా జిల్లాల జెడ్పీ చైర్మన్లు, డీపీవోలు, ఆర్డీవోలు, ఎంపీడీవోలు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13,057 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ పదవులతోపాటు వాటి పరిధిలో ఉండే 1,33,726 వార్డు సభ్యుల పదవుల రిజర్వేషన్లు ఖరారు చేసే ప్రక్రియను శని, ఆదివారాల్లోగా పూర్తి చేసి నోటిఫికేషన్ జారీ చేయాలని ఈ సందర్భంగా అధికారులను గోపాలకృష్ణ ద్వివేది ఆదేశించారు. -
త్వరలో ‘సచివాలయ’ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: మిగిలిపోయిన సచివాలయ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు వీలుగా జిల్లాల్లో పోస్టుల వారీగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలను సేకరిస్తున్నారు. ఏ జిల్లాలో ఏ పోస్టులో ఎన్ని ఉద్యోగాలు భర్తీ కాకుండా మిగిలిపోయాయో సోమవారం సాయంత్రం నాటికి తెలపాలంటూ పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ ఆదివారం అన్ని జిల్లాల కలెక్టర్లకు సమాచారమిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాల వారీగా ఖాళీ పోస్టుల వివరాలను పంపాలని సూచించారు. అనంతరం ఆ వివరాలను సంబంధిత శాఖలకు పంపి నోటిఫికేషన్ జారీకి చర్యలు చేపట్టనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ అధికారులు వివరించారు. -
‘ఇళ్లస్థలాల’ భూముల అభివృద్ధికి ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: పేదల ఇళ్ల స్థలాల కోసం గుర్తించిన భూముల్లో అన్ని మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నడుం బిగించింది. వచ్చే ఉగాది నాటికి దాదాపు 25 లక్షల మంది పేదలకు ఇళ్లస్థలాల పంపిణీకి అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా భూములు గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇళ్ల స్థలాల కోసం గుర్తించిన భూముల్లో ముళ్ల పొదల తొలగింపు, భూమి చదును చేయడం, అంతర్గత రోడ్ల నిర్మాణం, లింకు రోడ్లు నిర్మాణాన్ని ఉపాధి హామీ పథకంలో చేపట్టేందుకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇళ్ల స్థలాల కోసం కేటాయింపు చేసినట్లు నిర్ణయం తీసుకున్నాకే ఆయా స్థలాల్లో పనులు చేపట్టాలని పేర్కొన్నారు. 800 మీటర్ల అంతర్గత రోడ్లు ఇళ్ల స్థలాలకు కేటాయించిన స్థలంలో ‘ఉపాధి’ నిధులతో ఏయే పనులు చేపట్టవచ్చో స్పష్టంగా పేర్కొంటూ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ ఉత్తర్వులిచ్చారు. ఎకరా విస్తీర్ణంలో గరిష్టంగా నాలుగు వేల క్యూబిక్ మీటర్ల పరిమాణం మేర భూమి చదునుకు అనుమతించారు. ఎకరా స్థలంలో గరిష్టంగా 800 మీటర్ల పొడవున అంతర్గత రోడ్ల నిర్మాణానికీ.. ఇళ్ల స్థలానికి కేటాయించిన స్థలం నుంచి దగ్గరగా ఉండే రోడ్డుకు కలుపుతూ గరిష్టంగా 5 కి.మీ పొడవున గ్రావెల్ రోడ్డు నిరి్మంచవచ్చని పేర్కొన్నారు. రూ. 5 లక్షల లోపు పనులకు పంచాయతీరాజ్ లేదా సాంఘిక సంక్షేమ శాఖ ఇంజనీరు విభాగాల్లో పనిచేసే డీఈఈ.. రూ. 40 లక్షల వరకు పనులను ఈఈలు.. రూ. 2 కోట్ల వరకు పనులను జిల్లా ఎస్ఈలు, అంతకు మించి విలువ చేసే పనులను ఈఎన్సీ కార్యాలయంలోని సీఈలకు అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చారు. 12,291 ఎకరాల్లో పనులకు ప్రతిపాదనలు ఇళ్ల స్థలాల కోసం మొత్తం 12,291 ఎకరాల్లో రూ. 803 కోట్లతో నాలుగు రకాల అభివృద్ధి పనులకు ప్రతిపాదనల్ని జిల్లా అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు. ఇందులో 2,702 ఎకరాల్లో పనులు చేపట్టేందుకు అనుమతుల జారీ చేసే ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన పనులకు సంబంధించి అనుమతుల జారీ ప్రక్రియ జిల్లాల్లో వేగంగా కొనసాగుతున్నట్లు అధికారులు వివరించారు. -
‘స్పందన’ సమస్యలకు అధిక ప్రాధాన్యం
సాక్షి, అమరావతి బ్యూరో: ‘స్పందన’లో వస్తున్న సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యమివ్వాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అధికారులకు సూచించారు. ప్రజా హృదయ స్పందనను మానవీయ కోణంలో పరిశీలించి సంతృప్త స్థాయిలో పరిష్కారం చూపాలన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్పందన అర్జీల పరిష్కారంపై కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన జిల్లా, పురపాలక, మండల స్థాయి అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో శుక్రవారం ఆయన మాట్లాడారు. జనవరి నుంచి అన్ని గ్రామ, వార్డు సచివాలయాలు పూర్తి స్థాయిలో పనిచేస్తాయని, వాటిలో స్పందన కౌంటర్లు నిర్వహిస్తారని తెలిపారు. ఇకపై స్పందనలో వచ్చే అర్జీల పరిష్కార తీరుపై సోషల్ ఆడిట్ నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారన్నారు. పెన్షన్, రేషన్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ కార్డులను జనవరి నుంచి అందజేయడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోందన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్ మాట్లాడుతూ స్పందనలో అర్జీలను చిరునవ్వుతో స్వీకరిస్తే సగం సమస్య పరిష్కరించినట్టేనన్నారు. ప్రజలకు సుపరిపాలన అందించడమే సీఎం లక్ష్యమని, అందుకనుగుణంగా అధికారులు వ్యవహరించాలని సూచించారు. రాష్ట్రంలో 53 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని, జనవరి నాటికి మరో 7 లక్షల మందికి ఇస్తామన్నారు. పట్టణ పాలన కమిషనర్ విజయకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాసేవలో అంకితభావంతో నిష్పక్షపాతంగా పనిచేయాలన్నారు. సదస్సులో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు ఇంతియాజ్, ముత్యాలరాజు, విజయవాడ నగరపాలకసంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, పౌరసరఫరాల శాఖ సీఈవో అరుణ్‌బాబు, సెర్ప్ సీఈవో రాజబాబు, తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రతి నియోజకవర్గానికి రూ.10 కోట్లు ఇవ్వాలి’
సాక్షి, అమరావతి : ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. తాడేపల్లిలో పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) పీడీల సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్‌తోపాటు13 జిల్లాల డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనుల గురించి చర్చించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలని, గతేడాది కంటే కనీసం 20 శాతం అధికంగా పనిచేయాలని సూచించారు. ప్రగతిపై ప్రతి నెల ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ల ఆధ్వర్యంలో సమీక్షలు నిర్వహించాలని, ప్రతి నియోజకవర్గానికి రూ.10 కోట్లు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం(నరేగ) కింద ఇవ్వాలని కలెక్టర్లకు మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. డ్రైనేజీ, మురుగునీటి శుద్ది వంటి కార్యక్రమాలు చేపట్టి, ప్రాధాన్యత క్రమంలో గ్రామస్థాయిలో ప్రతిపాదిత పనులు చేయాలని ఆయన పేర్కొన్నారు. గ్రామ సచివాలయాలు, అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీలు, స్కూళ్లలో వసతులపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పినట్లు ''నాడు-నేడు'' అనే విధంగా స్కూళ్లను ఆధునీకరించాలని అన్నారు. 40 వేలకు పైగా వున్న పాఠశాలలకు ప్రహారీ, మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని అంతర్గత రహదారులు, హార్టీకల్చర్, మత్య్స పెంపకం వంటివి ప్రోత్సహించాలని సూచించారు. 11వేలకు పైగా వున్న గ్రామ సచివాలయాలకు ఉపాధి హామీని వర్తింపజేయాలని... అవసరైన చోట్ల కొత్త భవనాలు నిర్మించాలని.. ప్రస్తుతం ఉన్న వాటికి అదనపు గదుల నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. కేంద్రం నుంచి నిధులు మరింత రావాలంటే, నరేగ పురోగతిలో ముందుండాలని మంత్రి సూచించారు. అదే విధంగా ఫీల్డ్ అసిస్టెంట్లపై ఫిర్యాదులు వస్తే వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని.. అలాగే మొక్కల సంరక్షణ, ప్లాంటేషన్లపై దృష్టి సారించాలని, ట్రీగార్డుల కోసం అన్ని జిల్లాల నుంచి కొటేషన్లు తెప్పించుకుని తక్కువ రేటును నిర్ణయించాలని అన్నారు. చిత్తూరు జిల్లాలో కూలీలు వలసలు వెళ్లకుండా చూడాలని ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరి సేవ పథకం కింద గ్రామ సచివాలయాలు నిర్మించాలని, వెంటనే వాటికి టెండర్లు పిలవాలని సూచించారు. 'ఉద్దానం' వంటి ప్రాంతంలో వెంటనే నరేగ కింద ప్లాంటేషన్ చేపట్టాలని, ప్రభుత్వం అందించే పక్కా గృహాలకు 90 రోజుల ఉపాధి పని దినాలను సద్వినియోగం చేయాలని పేర్కొన్నారు. నరేగ కింద ఎంపీలు ప్రతిపాదించే పనులకు ఎంపీ నిధులు కూడా తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. -
పండుగలా గ్రామ సచివాలయాల ప్రారంభోత్సవం
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టనున్న గ్రామ సచివాలయాల వ్యవస్థను అక్టోబర్ 2వ తేదీన ప్రతి గ్రామంలో ప్రజలందరి భాగస్వామ్యంతో పండుగ వాతావరణంలో ప్రారంభించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 11,158 గ్రామ సచివాలయలను ఏర్పాటు చేస్తుండగా.. అక్టోబరు 2న ప్రతి మండలంలో కనీసం ఒక గ్రామంలోని సచివాలయంలో ఇంటర్నెట్తో కూడిన కంప్యూటర్లు తదితర అన్ని మౌలిక వసతులు కల్పించి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ప్రతి గ్రామ సచివాలయంలోనూ నవరత్న హామీలతో కూడిన బోర్డులను ఉంచాలని చెప్పారు. ఎమ్మెల్యేను తప్పక ఆహ్వానించాలి అసెంబ్లీ నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో సచివాలయం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేను తప్పక ఆహ్వానించాలని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ సూచించారు. ప్రొటోకాల్ ప్రకారం ఇతర ప్రజా ప్రతినిధులను ఆహ్వానించే బాధ్యతలను మండల ఎంపీడీవోలకు అప్పగించాలన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో పని చేసేందుకు కొత్తగా ఎంపికైన గ్రామ సచివాలయ ఉద్యోగులు, ఆ మండల పరిధిలోని వలంటీర్లందరూ మండలానికి ఒక గ్రామంలో జరిగే సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సచివాలయ వ్యవస్థను లాంఛనంగా ప్రారంభించనున్న సందర్భంగా ఆయన ప్రసంగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల వీక్షించేలా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి సందేశం కాపీని మండల ఈవోపీఆర్డీ అక్కడి ప్రజలకు చదివి వినిపించాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ తెలిసేలా బ్యానర్లు, కళా జాతాల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వార్డు సచివాలయాల నుంచే పౌర సేవలు పురపాలక శాఖ కమిషనర్ జె.విజయ్‌కుమార్ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలలో అక్టోబర్ 2 నుంచి వార్డు సచివాలయాల ద్వారానే పౌర సేవలు అందిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ జె.విజయ్‌కుమార్ తెలిపారు. వార్డు సచివాలయ ఉద్యోగులుగా ఎంపికైన వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ఈనెల 30న నియామక ఉత్తర్వులు అందిస్తారని తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వార్డు సచివాలయాల ద్వారా పౌర సేవలను 72 గంటల్లో అందిస్తామన్నారు. ప్రస్తుతం వార్డు సచివాలయాల్లో 10 సేవలను ప్రారంభిస్తామన్నారు. తరువాత ఆ సేవలను దశల వారీగా పెంచుతామన్నారు. ఒక్కో వార్డు సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉంటారన్నారు. వారిలో పరిపాలన కార్యదర్శి ‘స్పందన’ కార్యక్రమంతో పాటు ఇతర సేవలను పర్యవేక్షిస్తారని చెప్పారు. -
ర్యాంకులతోపాటు మొత్తం మెరిట్ లిస్ట్‌లు..
సాక్షి, అమరావతి : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకాలకు ఎంపికైన వారి మెరిట్ లిస్ట్‌లను రూపొందించినట్లు పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ వెల్లడించారు. ఈ జాబితాను అత్యంత పారదర్శకంగా రూపొందించామని, మొత్తం 13 జిల్లాల్లో ఎంపిక అయిన అభ్యర్థుల మెరిట్ లిస్ట్‌ను వెబ్సైట్లో పెట్టినట్లు తెలిపారు. ఎంపికైన అభ్యుర్థులు ర్యాంకుతోపాటు మొత్తం మెరిట్ లిస్ట్‌ను చూసుకోవచ్చని, వీటిని అన్ని కేటగిరి ఉద్యోగాలకు సిద్ధం చేశామని గిరిజా శంకర్ అన్నారు. -
ఆన్లైన్లో సచివాలయ ఉద్యోగుల మెరిట్ లిస్ట్
సాక్షి, అమరావతి: జిల్లాల వారీగా సచివాలయ ఉద్యోగుల మెరిట్ జాబితాను ఆన్లైన్లో ఉంచినట్టు పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్ వెల్లడించారు. రాష్ట్ర విధానాన్ని అనుసరించి ఎంపికైన అభ్యర్థుల మెరిట్ లిస్ట్‌ను రూపొందించినట్టు ఆయన సోమవారం తెలిపారు. మెరిట్ లిస్ట్‌లోని అభ్యర్థులకు ఎస్సెమ్మెస్‌ల ద్వారా ఈ విషయాన్ని తెలియజేసినట్టు పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు ఆన్లైన్లో కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. వెరిఫికేషన్‌కు వచ్చేటప్పుడు కాల్‌లెటర్లు తీసుకొని రావాలని అభ్యర్థులకు గిరిజా శంకర్ సూచించారు. కలెక్టర్లు కూడా మెరిట్ లిస్ట్‌ను నోటిసు బోర్డులో అంటించాలని సూచించినట్టు తెలిపారు. రాత పరీక్షల ఫలితాల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 1,26,728 ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఏ అభ్యర్థి ఏ రోజు, ఏ ప్రాంతంలో వెరిఫికేషన్‌కు హాజరు కావాలన్నది అభ్యర్థికి పంపే సమాచారంలోనే ఉంటుందని అధికారులు చెప్తున్నారు. వివిధ కారణాలతో నిర్ణీత సమయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకాని వారికి మరో అవకాశం ఇవ్వనున్నారు. అక్టోబరు 2వ తేదీ లోపే ఈ కార్యక్రమం పూర్తి చేయాలని జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. అక్టోబరు 14 నుంచి రెండో విడత శిక్షణ ఎంపికైన వారందరికీ 29వ తేదీలోగా నియామక పత్రాలు అందజేసి, మొదటి విడతలో రెండు రోజులు ప్రాథమిక శిక్షణ ఇవ్వనున్నారు. అక్టోబర్ 2న విధుల్లో చేరిన అనంతరం.. అక్టోబరు 14 నుంచి నవంబరు 15 తేదీల మధ్య ఉద్యోగులకు దశల వారీగా రెండో విడత శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ఈ నెల 26వ తేదీ నుంచి మాస్టర్ ట్రైనర్స్‌కు శిక్షణ కార్యక్రమం జరుగుతుందని పంచాయతీరాజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. సచివాలయ ఉద్యోగ నియామకాల్లో 33 శాతం పోస్టులు మహిళలకు దక్కేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ ఆధారంగా ప్రతిభ మేరకు మహిళలకు అన్ని కేటగిరీల్లోనూ నిర్ణీత సంఖ్యలో మహిళలకు పోస్టులు రాని పరిస్థితుల్లో వారికి ప్రత్యేకంగా మూడో వంతు పోస్టులు వచ్చేలా అవకాశం కల్పిస్తారు. వెరిఫికేషన్ సమయంలో అభ్యర్థులు అధికారులకు చూపాల్సిన సర్టిఫికెట్ల వివరాలు.. అభ్యర్థి ఆన్లైన్లో దరఖాస్తు చేసిన అనంతరం వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న పత్రం. ఎస్ఎస్సీ సర్టిఫికెట్ లేదా అధికారుల నుంచి తీసుకున్న పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం. ఒరిజనల్ సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు. నాలుగో తరగతి నుంచి పదో తరగతి మధ్య ఎక్కడ చదివారన్న వివరాలతో స్టడీ సర్టిఫికెట్లు. స్కూలు, కాలేజీల్లో చదవకుండా డైరెక్ట్ డిగ్రీ వంటి కోర్సులు చేసిన వారి నివాస ధ్రువీకరణ పత్రం. రాష్ట్ర విభజన సమయంలో ప్రభుత్వ నోటిఫికేషన్ మేరకు తెలంగాణ ప్రాంతం నుంచి ఏపీకి స్థానికత మార్చుకున్నప్పుడు సంబంధిత అధికారులు జారీ చేసిన సర్టిఫికెట్. చెవిటి, మూగ వైకల్యంతో ప్రత్యేక స్కూళ్లలో చదువుకున్న వారు.. వారి తల్లిదండ్రుల నివాసిత ధ్రువీకరణ పత్రం. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రం. బీసీ అభ్యర్థులు తాజాగా తహసీల్దార్ జారీ చేసిన నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్. దివ్యాంగ అభ్యర్థులు సదరం క్యాంపుల ద్వారా పొందిన మెడికల్ సర్టిఫికెట్. ఎక్స్ సర్వీస్‌మెన్, ఎన్సీసీ, క్రీడల కోటా అభ్యర్థుల సంబంధిత సర్టిఫికెట్లు. ప్రస్తుతం ఆయా ఉద్యోగాల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తూ వెయిటేజీ పొంది.. ఈ నియామక ప్రక్రియలో ఎంపికైన వారు తమ శాఖాధిపతి నుంచి పొందిన ఇన్ సర్వీసు సర్టిఫికెట్. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని సెల్ఫ్ సర్టిఫైడ్ కాపీ. దీనికి సంబంధించిన నిర్ణీత ఫార్మాట్‌ను వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాలి. -
జిల్లాలకు ‘సచివాలయ’ మెరిట్ జాబితా
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూలు లేని కారణంగా ఉద్యోగానికి అర్హత సాధించిన వారికే జిల్లా సెలక్షన్ కమిటీలు కాల్ లెటర్లు పంపుతాయని పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. జిల్లాల వారీగా రాతపరీక్షల మెరిట్ జాబితాలు శుక్రవారం ఉదయానికి కల్లా ఆయా జిల్లాలకు చేరవేయనున్నట్టు వెల్లడించారు. మెరిట్ జాబితా ఆధారంగా జిల్లా సెలక్షన్ కమిటీ.. ఆ జిల్లాలో భర్తీ చేసే ఉద్యోగాలు, కేటగిరీల వారీగా రిజర్వేషన్ పోస్టుల సంఖ్యను షార్ట్ లిస్ట్ చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. శనివారం కల్లా జిల్లాల్లో షార్ట్ లిస్టు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని, అది పూర్తయిన వెంటనే ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. షార్ట్ లిస్టులో పేరు ఉన్న అభ్యర్థులు వారి కాల్‌లెటర్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయా అభ్యర్థులకు జిల్లా సెలక్షన్ కమిటీలు మెయిల్ ద్వారా కూడా సమాచారం ఇస్తారని, అంతేగాక ఆయా పోస్టులకు సంబంధించి జిల్లా కార్యాలయాల్లోనూ ఎంపికైన వారి జాబితా ఉంచనున్నామని చెప్పారు. ఆ కార్యాలయాల నుంచి నేరుగా కాల్ లెటర్లు పొందే వెసులుబాటు కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. కాల్‌లెటర్లు అందిన వారు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు ఆన్లైన్లో అప్లోడ్ చేయడంతో పాటు 23వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఆయా జిల్లాల్లో నిర్వహించే సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియకు హాజరు అయ్యి తమ ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలు అధికారులకు చూపించాల్సి ఉంటుందన్నారు. ఇక కాల్ లెటర్లు వచ్చిన వారు ఎటువంటి క్రిమినల్ కేసులు లేనివారై ఉండాలి. (చదవండి: ‘సచివాలయ’ పరీక్షల ఫలితాల్లోనూ రికార్డ్) -
సీఎం జగన్ ఇచ్చిన స్వేచ్ఛతోనే అది సాధ్యమైంది
సాక్షి, అమరావతి : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షలు ఎలాంటి వివాదాలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం అన్నారు. ఆరు రోజుల పాటు సాగిన ఈ పరీక్షలకు మొత్తం 89.83 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు వెల్లడించారు. నిరుద్యోగ సమస్యను తగ్గించడంతో పాటు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అర్హులైన పేదలకు అందించాలని, ప్రభుత్వ సేవల్లో జాప్యం జరగరాదనే సదుద్దేశంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో పనిచేసేందుకు అవసరమైన ఉద్యోగుల నియామకానికి ఈ నెల ఒకటో తేదీ నుంచి 8వ తేదీ వరకు (2, 5 తేదీల్లో ప్రభుత్వ సెలవులు) ఆరు రోజుల పాటు పరీక్షలు నిర్వహించారు. (చదవండి : సచివాలయ పరీక్షల నిర్వహణపై సర్వత్రా ప్రశంసలు) పరీక్షలు ప్రశాంతంగా ముగిసిన సందర్భంగా అజేయకల్లం సోమవారం మీడియాతో మాట్లాడారు. ఏపీలో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ చేపట్టామన్నారు. ఎలాంటి వివాదాలకు తావులేకుండా ఒకే సారి లక్షా 34వేల ఉద్యోగాలు భర్తీ చేయడం రికార్డ్ అన్నారు. గత 20 ఏళ్లలో ఏడాదికి 1000 ఉద్యోగాలు కూడా భర్తీ చేసిన దాఖలాలు లేవన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన స్వేచ్ఛ.. రాజకీయ జోక్యం లేకుండా చర్యలు తీసుకోవడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. రాజకీయ జోక్యం లేకుంటే అధికారుల పనితీరు అద్భుతంగా ఉంటుందనడానికి ఈ ఉద్యోగ నియామక ప్రక్రియే నిదర్శనమన్నారు. 20లోగా ఫలితాలు : గిరిజా శంకర్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షలు మొత్తంగా 89.83శాతం అభ్యర్థులు హాజరయ్యారని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ వెల్లడించారు. పరీక్షలకు ఎటువంటి ఇబ్బది లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. సచివాలయ ఉద్యోగ పరీక్షలకు 21.69లక్షల దరఖాస్తులు వచ్చాయని, మొత్తంగా 19.49 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారన్నారు. అభ్యర్థుల రవాణ సౌకర్యం కోసం 6వేల బస్సులను ఉపయోగించామన్నారు. జవాబు పత్రాలను స్ట్రాంగ్‌రూంలలో భద్రపరిచామని, జిల్లా కేంద్రాలలో ఓఎమ్మార్ షీట్ల స్కానింగ్ చేపడతామన్నారు. ఈ నెల 20 లోపు ఫలితాలను వెల్లడిస్తామని గిరిజా శంకర్ పేర్కొన్నారు. అందరి సహకారంతోనే ఇంత పెద్ద టాస్క్ పూర్తి చేశాం : విజయ్‌కుమార్ అందరి సహకారం వల్లే సచివాల పరీక్షలను ప్రశాంతంగా ముగిశాయని మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్‌కుమార్ అన్నారు. తమపై నమ్మకంలో ప్రభుత్వం అప్పజెప్పిన పనిని సమర్ధవంతంగా నిర్వహించామన్నారు. పరీక్షల నిర్వహణ విషయంలో ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు. 25శాతం టఫ్ ప్రశ్నలు ఉన్నాయి : ద్వివేది ఏపీపీఎస్సీ ప్రమాణాలను పాటించి సచివాల ఉద్యోగాల పరీక్షలను నిర్వహించామని పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. ప్రశ్నాపత్రం 25శాతం టఫ్‌గా ఉందన్నారు. అత్యంత వేగంగా ప్రశ్నాపత్రాల స్కానింగ్ చేపట్టామని, ఈనెల 20లోపు ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. జిల్లాలవారిగా మెరిట్ లిస్ట్ ప్రకటిస్తామని తెలిపారు. సచివాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, 1500 చోట్ల సచివాలయ భవనాలను నిర్మిస్తామని ద్వివేది పేర్కొన్నారు. -
సచివాలయ పరీక్షల నిర్వహణపై సర్వత్రా ప్రశంసలు
సాక్షి, అమరావతి : ప్రతిపక్షాల ప్రచారం నమ్మి ‘సచివాలయ’ ఉద్యోగాలంటే ఏవేవో అనుమానాలు వ్యక్తం చేసిన అభ్యర్థులు సైతం రాత పరీక్షల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని చూసి శభాష్ అంటున్నారు. ఒక రాష్ట్రంలో 1,34,524 ఉద్యోగాలకు ఏకంగా 19,49,218 మంది హాజరవ్వడం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా పరీక్షలు నిర్వహించడం రాష్ట్రంలోనే కాదు దేశ చరిత్రలోనే రికార్డు అని అధికారులు, ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆదివారంతో ఉద్యోగాల రాత పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. ఈ నెల 1వ తేదీ నుంచి 8వ తేదీ మధ్య ఆరు రోజుల పాటు జరిగిన పరీక్షలకు ఏకంగా 90 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రశ్నాపత్రం రూపకల్పన, పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లు సివిల్స్ రాతపరీక్షలు నిర్వహించే యూపీఎస్సీ స్థాయిలో ఉన్నాయని అటు పరీక్ష రాసిన అభ్యర్థులు, ఇటు మేధావులు ప్రశంసలు కురిపిస్తున్నారు. లక్షన్నర ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎగతాళి చేశారు.. రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశంలోని మరే రాష్ట్ర చరిత్రలో లేని విధంగా ఒకే విడత 1,34,524 ఉద్యోగాలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం జూలై నెలలో నోటిఫికేషన్లు జారీ చేసింది. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు కలిపి 1,26,728 ఉద్యోగాలకు, విద్యుత్ సంస్థలు మరో 7,796 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. స్వాతంత్య్రం వచ్చాక గత 72 ఏళ్లలో జరిగిన నియామకాల ద్వారా రాష్ట్రంలో ఇప్పుడున్న మొత్తం ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 4.61 లక్షలుగా ఉంది. ఆ సంఖ్యలో దాదాపు మూడో వంతు ప్రభుత్వ ఉద్యోగాలను ఒకే విడతలో భర్తీ చేసేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున వైఎస్ జగన్ లక్షన్నర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేస్తే.. అవన్నీ వాళ్ల పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకుంటారులే అంటూ ప్రతిపక్ష నాయకులు విమర్శించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేసేందుకు 1,26,728 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేస్తే 21,69,589 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రతిపక్షాలు చేసే ప్రచారం నమ్మి దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరు ఈ ఉద్యోగాలు మెరిట్ ఆధారంగా జరగుతాయా లేదా అని అనుమానం వ్యక్తం చేశారు. అలా అనుమానం వ్యక్తం చేసిన వారు సైతం రాత పరీక్షలు ముగిశాక ప్రభుత్వ చిత్తశుద్ధిని కొనియాడుతున్నారు. అతి తక్కువ సమయంలో నిర్వహణ రాష్ట్రంలో ఇదివరకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడ్డాక భర్తీ ప్రక్రియ పూర్తవ్వడానికి ఏడాదో, రెండేళ్లో, కొన్ని సార్లు మూడు నాలుగేళ్లు పట్టిన ఉదంతాలున్నాయి. కానీ ‘సచివాలయ’ ఉద్యోగ నియామకాల ప్రక్రియ అంతా రెండున్నర నెలల్లోనే ముగియనుంది. 1,26,728 ఉద్యోగాలకు జూలై 26న నోటిఫికేషన్ విడుదల అయింది. సెప్టెంబర్ 8వ తేదీ నాటికి అన్ని ఉద్యోగాలకు రాత పరీక్షలు మగిశాయి. జవాబు పత్రాల స్కానింగ్ ప్రక్రియ కూడా ఇప్పటికే చాలా వరకు పూర్తయినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అక్టోబర్ 2వ తేదీ నాటికి నోటిఫికేషన్లో పేర్కొన్న మేరకు ఉద్యోగ నియామకాల పత్రాలు అందజేసి, వారు విధుల్లో కూడా చేరిపోతారని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం 125 రోజుల్లో.. నోటిఫికేషన్ జారీ చేశాక కేవలం 65 – 70 రోజుల్లో ఉద్యోగ నియామక ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని అధికారులు కంకణం కట్టుకొని పని చేస్తున్నారు. యూపీఎస్సీ పరీక్షల స్థాయిలో ఏర్పాట్లు ఉద్యోగ నియామక ప్రక్రియలో కీలకమైన రాత పరీక్షల నిర్వహణ కూడా జాతీయ స్థాయి పోటీ పరీక్షలను నిర్వహించే యూపీఎస్సీ స్థాయికి ఏ మాత్రం తక్కువగా లేదని పరీక్ష రాసిన అభ్యర్థులు చెబుతున్నారు. ఒకేసారి దరఖాస్తు చేసుకున్న 21.69 లక్షల మంది అభ్యర్థులకు సాధ్యమైనంత మేర అతి తక్కువ దూరంలో పరీక్షా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నెల 1వ తేదీ ఉదయం జరిగిన రాత పరీక్షకు ఒక్కదానికే 12.54 లక్షల మంది దరఖాస్తు చేసుకోవడంతో రాష్ట్రంలోని మారు మూల మండల కేంద్రాల్లో సైతం కేంద్రాలను ఏర్పాటు చేసింది. 4,465 కేంద్రాల్లో పరీక్షలు జరపడంతో ఆ పరీక్షకు ఏకంగా 92.77 శాతం మంది హాజరయ్యారు. పరీక్షా కేంద్రంలో ప్రతి 24 మంది అభ్యర్థులకు ఒక గది కేటాయించారు. సమగ్ర పర్యవేక్షణకు ఒక పరీక్షా కేంద్రంలో పది గదులు మించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రంలో అభ్యర్థులు మంచి నీటి పేరుతో తమ సీటు నుంచి కదలకుండా కూర్చున్న చోటుకే అందజేసేలా ముందుస్తు ఏర్పాటు చేశారు. మెటీరియల్ తరలింపులో పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాలకు వెళ్లే అభ్యర్థులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకండా పట్టణాల్లో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పరీక్షా కేంద్రాల పరిధిలో వంద మీటర్ల పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లు ముందస్తుగా మూసి వేశారు. ఏర్పాట్ల విషయంలో ప్రతి చోటా యూపీఎస్సీ ప్రమాణాలను పాటించినట్టు అభ్యర్థులు చెబుతున్నారు. పొరపాట్లకు తావేలేదు ప్రశ్నాపత్రాలు లీకు చేస్తారని ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉండే వారు కొందరు సోషల్ మీడియాలో పనిగట్టుకొని ప్రచారం చేశారు. ఆరు రోజుల పాటు 5,314 పరీక్షా కేంద్రాల్లో.. తొలిరోజు మూరుమూల మండల కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినా ప్రశ్నాపత్రాల భద్రత విషయంలో ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. మూరు మూల ప్రాంతంలో ఉండే పరీక్షా కేంద్రానికి చేరాల్సిన ప్రశ్నాపత్రాలను ఒక్క రోజు ముందు దానికి దగ్గరలోని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ రూం నుంచి వాటిని పర్యవేక్షించారు. ప్రభుత్వం ముందస్తుగా తీసుకున్న జాగత్రలతో ఆరు రోజుల పాటు ఎక్కడా చిన్న పొరపాటు చోటు చేసుకోలేదు. ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ ఉన్న ఏపీపీఎస్సీ ద్వారా జరిగే పరీక్షలో ప్రశ్నాపత్రాల్లో పెద్ద ఎత్తున తప్పులు దొర్లడం అనేది పోటీ పరీక్ష రాసే అనుభవం ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. ఏపీపీఎస్సీ ద్వారా కాకుండా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించినప్పటికీ, ప్రశ్నాపత్రాల రూపకల్పన సైతం అభ్యర్థులను మెప్పించింది. ప్రశ్నపత్రాలలో నామమాత్రపు పొరపాట్లు కూడా జరగలేదని అభ్యర్థులు చెబుతున్నారు. పరీక్ష జరిగిన రోజు ప్రాథమిక ‘కీ’ని అధికారికంగా విడుదల చేశారు. నాలుగు రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం తుది ‘కీ’ విడుదల చేశారు. ఇంత పకడ్బందీ ప్రణాళిక ఇటీవల కాలంలో ఏ పోటీ పరీక్షలలోనూ చూడలేదని అభ్యర్థులు వ్యాఖ్యానించారు. ఇంటర్వ్యూ రద్దుతో దళారులకూ చెక్ పకడ్బందీ పరీక్ష నిర్వహణే కాదు.. పారదర్శకంగా ఈ ప్రక్రియ ఉండాలని అధికారులు అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఉద్యోగ నియామక ప్రక్రియలో దళారుల వ్యవస్థకు ఆస్కారం లేకుండా ఉండేందుకు ఇంటర్వ్యూ అన్నది లేకుండా ఉండాలని, కేవలం రాత పరీక్షల్లో అభ్యర్థులకు వచ్చే మార్కుల ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. పారదర్శకతగా పరీక్షలు నిర్వహిస్తూనే.. పోటీ పడుతున్న అభ్యర్థులు దళారులను నమ్మవద్దని ప్రభుత్వం విస్త్ర్తతంగా ప్రచారం చేసింది. ప్రభుత్వానికి అందిన ఫిర్యాదుల మేరకు కొన్ని జిల్లాల్లో దళారులపై కేసులు నమోదు చేయడం గమనార్హం. అధికారుల పాత్ర కీలకం.. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల ప్రత్యేక వ్యవస్థ ఉన్న ఏపీపీఎస్సీనే ఒకే విడతలో 1,26,728 ఉద్యోగాలను నిర్ణీత సమయంలో ఎప్పుడూ భర్తీ చేయలేదు. ఈ పరిస్థితుల్లో జిల్లా సెలక్షన్ కమిటీల ద్వారా ఉద్యోగ భర్తీ ప్రక్రియను చేపట్టారు. ఈ పోస్టుల భర్తీని చాలా పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గట్టి పట్టుదలతో ఎప్పటికప్పుడు మంత్రులకు, సంబంధిత అధికారులకు సూచనలతో పాటు ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీఎంవో కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్, మున్సిపల్ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, మున్సిపల్ కమిషనర్ విజయకుమార్‌లు ఒక జట్టుగా ఏర్పడి సంబంధిత అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ ఈ నియామక ప్రక్రియలో కీలకమై పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించారు. పరీక్షల రాష్ట్ర కమిటీ కన్వీనర్‌గా గిరిజా శంకర్ ప్రతి అంశం దగ్గర ఉండి పర్యవేక్షించారు. దీంతో పాటు జిల్లా కలెక్టరు, ఎస్పీలు, జిల్లా అధికార యంత్రాంగం, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ శాఖ సిబ్బంది పరీక్షల నిర్వహణలో చిత్తశుద్ధితో పని చేశారు. చరిత్రాత్మకం మొత్తం 19 రకాల ఉద్యోగాలకు 21.69 లక్షల మంది పరీక్షలు రాశారు. తప్పన్నదానికి తావులేకుండా పరీక్షలు నిర్వహించాం. ఇదొ చరిత్రాత్మక ఘటన. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయి నియామకాలు, ఇన్ని లక్షల మందికి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం జరగలేదు. పక్కా ప్రణాళికతో సమర్థవంతంగా పరీక్షలు నిర్వహించిన పంచాయతీరాజ్ కమిషనర్, రాష్ట్ర స్థాయి సిబ్బంది, జిల్లా కలెక్టర్లు, సిబ్బందికి అభినందనలు. – గోపాలకృష్ణ ద్వివేది, పరీక్ష నిర్వహణ కమిటీ చైర్మన్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి. అందరికీ అభినందనలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఉద్యోగ నియామకాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆ మేరకు ఆయన అధికారులందరినీ అప్రమత్తం చేశారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా అందరం పనిచేశాం. ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనల మేరకు జిల్లాల్లో పరీక్షల నిర్వహణను విజయవంతం చేసిన జిల్లా కలెక్టర్లు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర, జిల్లా స్థాయి సిబ్బందికి అభినందనలు. – గిరిజా శంకర్, పంచాయతీరాజ్ కమిషనర్, రాష్ట్ర స్థాయి పరీక్షల కమిటీ కన్వీనర్ సీఎం అరుదైన అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికార యంత్రాంగానికి అరుదైన అవకాశం ఇచ్చారు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పారదర్శకంగా, ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించి ప్రభుత్వం çపట్ల తమ చిత్తశుద్ధిని ప్రదర్శించింది. జిల్లా కలెక్టర్లు, అధికారులు పరీక్షల నిర్వహణకు రేయింబవళ్లు పనిచేశారు. గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహించిన దాఖలాలు లేవు. చిన్నపాటి విమర్శలకు తావులేకుండా పరీక్షలు నిర్వహించేందుకు సహకరించిన అన్ని వర్గాల వారికి కృతజ్ఞతలు. – విజయకుమార్, మున్సిపల్ శాఖ కమిషనర్, డైరెక్టర్ -
‘సచివాలయ’ పరీక్షలకు 92.77 శాతం హాజరు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలు తొలిరోజు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రశాంతంగా మొదలయ్యాయి. 92.77 శాతం మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఉదయం పరీక్షకు 12,53,974 మంది హాజరు కావాల్సి ఉండగా, 11,62,164 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షకు 2,95,980 మంది హాజరు కావాల్సి ఉండగా, 2,72,420 మంది హాజరయ్యారు. మొత్తం 1,26,728 ఉద్యోగాలకు 21.69 లక్షల మంది పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఆరు రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. తొలిరోజు 92.77 శాతం హాజరు నమోదు కావడం అంటే నియామక ప్రక్రియ పూర్తిస్థాయిలో విజయవంతమైనట్టేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కర్నూలు జిల్లా పాములపాడు మండలం వేంపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పత్తికొండ జెడ్పీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాల్లో ఓఎంఆర్ షీట్లు తారుమారయ్యాయి. వేంపెంట అభ్యర్థులకు పత్తికొండ అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు, పత్తికొండ అభ్యర్థులకు వేంపెంట అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు వచ్చాయి. ఈ పొరపాటును గుర్తించిన అధికారులు వెంటనే అదనపు ఓఎంఆర్ షీట్లను సమకూర్చారు. రెండు కేంద్రాల్లో పరీక్ష ఆలస్యంగా ప్రారంభం కావడంతో అభ్యర్థులకు అదనంగా ఒక గంట సమయం కేటాయించారు. ఈ ఒక్క సంఘటన మినహా తొలిరోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. అధికారుల ప్రత్యేక చర్యలు మండల కేంద్రాల్లో సైతం పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం హాజరు శాతం అత్యధికంగా నమోదు కావడానికి కారణమని అధికారులు పేర్కొంటున్నారు. ఆదివారం పరీక్షలకు హజరు కావాల్సిన అభ్యర్థుల్లో 16 వేల మంది శనివారం సాయంత్రం వరకు హాల్‌టిక్కెట్ డౌన్లోడ్ చేసుకోలేదు. అధికారులు వారికి ప్రత్యేకంగా మెసేజ్‌లు పంపారు, వాయిస్ కాల్స్ చేశారు. ఇలాంటి ప్రత్యేక చర్యలతో హాజరు శాతం పెరిగిందని అంటున్నారు. ప్రాథమిక ‘కీ’ విడుదల తొలిరోజు జరిగిన రాత పరీక్షల ప్రాథమిక ‘కీ’ని పరీక్షల నిర్వహణ కమిటీ చైర్మన్, కన్వీనర్లు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. దీనిపై మూడు రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ప్రతి పరీక్ష జరిగిన తేదీకి ఐదు రోజుల అనంతరం తుది ‘కీ’ని విడుదల చేస్తారు. 23–25 తేదీల మధ్య మెరిట్ జాబితాలు రాత పరీక్షల జవాబు పత్రాలైన ఓఎమ్మార్ షీట్లను అన్ని జిల్లాల నుంచి నాగార్జున యూనివర్సిటీకి తరలించే ప్రక్రియ మొదలైంది. ఈ నెల 3వ తేదీ నుంచి ఓఎమ్మార్ షీట్ల స్కానింగ్ ప్రక్రియ మొదలవుతుందని గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. రోజుకు 4 లక్షల షీట్ల స్కానింగ్ పూర్తవుతుందన్నారు. అన్ని పరీక్షల ఓఎమ్మార్ షీట్లను రెండు విడతల పాటు స్కానింగ్ చేసే ప్రక్రియ 15 రోజుల్లో పూర్తి చేస్తామని గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ వెల్లడించారు. ఈ నెల 23–25 తేదీల మధ్య ఉద్యోగాల వారీగా రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల మెరిట్ జాబితాలను ప్రకటించే అవకాశం ఉందన్నారు. గుండెపోటుతో అభ్యర్థి మృతి గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్ష రాస్తూ గుండెపోటుతో ఓ అభ్యర్థి మృతి చెందాడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణానికి చెందిన గుడాల నరేష్ (30) పూలపల్లి శ్రీగౌతమి స్కూల్లో పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష ప్రారంభమైన అనంతరం నరేష్‌కు గుండెలో నొప్పి రావడంతో విధుల్లో ఉన్న ఏఎన్ఎం పరీక్షించిన అనంతరం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం భీమవరం వర్మ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్య సేవలు పొందుతూ మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో గుడాల నరేష్ మరణించాడు. పరీక్ష కోసం వచ్చి బిడ్డకు జన్మనిచ్చింది సచివాలయం ఉద్యోగ పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థిని పరీక్ష రాయకుండానే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం బురదగాలి కొత్తపాళేనికి చెందిన ఎర్రబోతు సుప్రియ గూడూరులో గ్రామ సచివాలయ పరీక్ష రాసేందుకు వచ్చింది. నిండుగర్భిణి కావడంతో పరీక్ష సమయానికి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. వెంటనే గూడూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టినందుకు సంతోషపడాలో, పరీక్ష రాయలేనందుకు బాధపడాలో అర్థం కావడం లేదని సుప్రియ పేర్కొంది. పరీక్షకు తండ్రి, కుమార్తె, కుమారుడు హాజరు గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షకు తండ్రి, కుమార్తె, కుమారుడు హాజరయ్యారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం చంద్రంపేట గ్రామానికి చెందిన చోళ్ల మోహనరావు, ఆయన కుమార్తె ఇందిర, కుమారుడు నరేష్కుమార్ గ్రామ సచివాలయం ఉద్యోగానికి పరీక్ష రాశారు. మోహన్‌రావు శ్రీనివాస కళాశాల, ఇందిర నారాయణ కళాశాల, నరేష్కుమార్ ఆర్కే జూనియర్ కాలేజీలో పరీక్షకు హాజరయ్యారు. శ్రీకాకుళం జిల్లా పలాస జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సచివాలయ పరీక్షకు ఓ రిమాండ్ ఖైదీ హాజరయ్యాడు. తొలిరోజు విజయవంతం పటిష్టమైన ప్రణాళిక, జిల్లా కలెక్టర్లు, సిబ్బంది సహకారం, సమన్వయం వల్లే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలు విజయవంతంగా మొదలయ్యాయని పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పరీక్షల తీరును, ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద సంఖ్యలో ఏ ప్రభుత్వ శాఖ పరీక్షలు నిర్వహించలేదన్నారు. పరీక్ష కేంద్రాలను అభ్యర్థులకు అందుబాటులో ఏర్పాటు చేయడం వల్ల హాజరు శాతం పెరిగిందన్నారు. అభ్యర్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్‌లు ఏర్పాటు చేసిందని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీస్ శాఖ సహకరించిందని చెప్పారు. పరీక్షల నిర్వహణలో లోపాలు తలెత్తకుండా జిల్లా కలెక్టర్లకు సహకారం అందించేందుకు ఒక్కొక్క ప్రత్యేక అధికారిని జిల్లాలకు ముందుగానే పంపినట్టు వివరించారు. వారు పరీక్షల ఏర్పాట్లలో కలెక్టర్లకు పూర్తిగా సహకరించారని, తాము రూపొందించిన ప్రత్యేక బుక్లెట్ ఆధారంగా ఏర్పాట్లు చేసుకున్నారని చెప్పారు. వచ్చే ఐదు రోజుల్లో నిర్వహించే పరీక్షలకు జిల్లా కేంద్రాలు, పట్టణాల్లోనే పరీక్షా కేంద్రాలు ఉండటం వల్ల అభ్యర్థులు సులువుగా చేరుకోవచ్చన్నారు. గ్రామ సచివాలయాల్లో భర్తీ చేయనున్న పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టులన్నీ భర్తీ అయ్యే అవకాశాలు లేవని చెప్పారు. మొత్తం 9,886 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తే 6,265 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. మిగిలిన పోస్టుల్ని భర్తీ చేసే బాధ్యతను ప్రభుత్వం ఆ శాఖకు అప్పగించే అవకాశాలున్నాయని చెప్పారు. కాగా, విజయవాడలోని పలు కేంద్రాలను పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. మున్సిపల్ శాఖ కమిషనర్ విజయకుమార్ గుంటూరు, నెల్లూరులోని పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. అభ్యర్థుల కోసం 1,945 ఆర్టీసీ బస్సులు సచివాలయ పోస్టుల రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఏపీఎస్ ఆర్టీసీ పెద్ద ఎత్తున రవాణా సౌకర్యం ఏర్పాటుచేసినట్లు సంస్థ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. తొలి రోజు ఆదివారం పరీక్షకు హాజరైన అభ్యర్థుల కోసం వారి సమీప జిల్లా కేంద్రాలకు రాష్ట్రవ్యాప్తంగా 1945 బస్సులను నడిపింది. ఈ సందర్భంగా సంస్థ ప్రధాన బస్స్టేషన్లలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటుచేసింది. పరీక్ష సామగ్రిని జిల్లా కేంద్రాలకు తరలించేందుకు, పరీక్ష కేంద్రాలకు అవసరమైన ఏర్పాట్ల నిమిత్తం సుమారు 16 గూడ్స్ ట్రాన్స్‌పోర్టు వాహనాలను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈ నెల 8వ తేదీ వరకు జరగనున్న రాత పరీక్షలకు అభ్యర్థుల రద్దీని బట్టి ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని అధికారవర్గాలు తెలిపాయి. 470 స్పెషల్ సర్వీసులు వినాయకచవితి వరుస సెలవుల తర్వాత తిరుగు ప్రయాణం అయ్యే ప్రయాణికుల కోసం ఆర్టీసీ సోమవారం సాయంత్రం 470 స్పెషల్ సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్టు ఆపరేషన్స్ విభాగం పేర్కొంది. అవసరానికి అనుగుణంగా రద్దీ ఉన్న మార్గాల్లో నడిపేందుకు విజయవాడ పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో మరో 109 బస్సు సర్వీసులను అందుబాటులో ఉంచామని తెలిపింది. ఈ నెల 4వ తేదీన కూడా అవసరమైన మేరకు స్పెషల్ బస్సులు నడపనున్నట్టు పేర్కొంది. -
సెల్ఫోన్లు,ఎలక్రానిక్ వస్తువులు తీసుకురావద్దు
-
‘సచివాలయ’ పరీక్షలకు ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం అన్ని బస్, రైల్వే స్టేషన్లలో హెల్ప్ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు పరీక్షల నిర్వహణ కన్వీనర్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ చెప్పారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పరీక్ష కేంద్రం చిరునామా వంటి విషయాల్లో హెల్ప్‌డెస్క్ సిబ్బంది సహాయకారిగా ఉంటారన్నారు. సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి సెపె్టంబర్ 1నుంచి 8వ తేదీ వరకు పోస్టుల వారీగా రాత పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో 1,26,728 ఉద్యోగాలకు దాదాపు 21.69 లక్షల మంది పోటీ పడుతున్నందున పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలూ తీసుకున్నట్టు వివరించారు. తొలిరోజు ఉదయం 36,449 ఉద్యోగాలకు పరీక్ష నిర్వహిస్తుండగా.. 12,54,034 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని చెప్పారు. ఆ రోజు మధ్యాహ్నం తర్వాత 11,158 పోస్టులకు పరీక్ష నిర్వహిస్తుండగా.. 2,95,907 మంది హాజరు కావాల్సి ఉందని చెప్పారు. తొలి రోజు పరీక్షలకు మూడింట రెండొంతుల మంది అభ్యర్థులు హాజరవుతారన్నారు. ఇందుకోసం మండల కేంద్రాలు, పట్టణాల్లో 4,478 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్లకు జతపరిచి ఉన్న నియమ నిబంధనలను పరీక్ష కేంద్రానికి వచ్చే ముందే సరిచూసుకుని రావాలని కోరారు. వారికి కేటాయించిన పరీక్ష కేంద్రాన్ని ఒకరోజు ముందే చూసుకోవడం.. రాత పరీక్ష మొదలయ్యే సమయానికి గంట ముందుగానే కేంద్రానికి చేరుకోవడం మంచిదని తెలిపారు. పరీక్షల నిర్వహణలో పోలీసు శాఖ సేవలను పెద్దఎత్తున ఉపయోగించుకుంటున్నట్టు చెప్పారు. హెల్ప్ డెస్క్‌లలో పెద్ద సంఖ్యలో వలంటీర్లను, 1,22,554 మంది సిబ్బందిని వినియోగిస్తున్నామని చెప్పారు. 1,835 వాహనాలను కూడా ఉపయోగించుకుంటున్నట్టు చెప్పారు. ప్రతి జిల్లాలో 500 బస్సులు ఒకే రోజు దాదాపు 15 లక్షల మంది రాత పరీక్షలకు హాజరవుతున్న నేపథ్యంలో.. ప్రతి జిల్లాలో 500 బస్సులను పరీక్షా కేంద్రాలకు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు అంగీకరించారని కన్వీనర్ తెలిపారు. మండలాల వారీగా ఏ కేంద్రంలో ఎంత మంది రాతపరీక్షకు హాజరవుతారన్న వివరాలను ఆర్టీసీకి అందజేశామన్నారు. ఆటోల ద్వారా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నా.. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని పట్టణాల్లో ఆటో యూనియన్లకు ఆ పట్టణంలో పరీక్ష జరిగే కేంద్రాల వివరాలు కూడా ముందుగా తెలియజేసినట్టు చెప్పారు. దివ్యాంగులకు 1,588 మంది సహాయకులు పరీక్షలకు హాజరయ్యే దివ్యాంగులకు సహాయకులుగా 1,588 మందిని అనుమతించనున్నట్టు చెప్పారు. సహాయం కావాలని కోరిన దివ్యాంగులకు ప్రభుత్వం ఈ ఏర్పాటు చేసిందని, ప్రభుత్వం ఎంపిక చేసిన ఇంటర్ విద్యార్థులను మాత్రమే సహాయకులుగా అనుమతిస్తారని వివరించారు. 8 రోజులు జరిగే పరీక్షలకు 32,839 మంది దివ్యాంగులు హాజరవుతారని పేర్కొన్నారు. పట్టణాల్లో ట్రాఫిక్ నియంత్రణ అభ్యర్థులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా అన్ని పట్టణాల్లో ఆదివారం ఉదయం 7 నుంచి 10 గంటల వరకు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర డీజీపీని కోరినట్టు తెలిపారు. పరీక్ష కేంద్రాలున్న ప్రాంతంలో ట్రాఫిక్‌ను మళ్లించడం.. అవసరం ఉన్నచోట ఊరి బయట వాహనాలు నిలుపుదల వంటి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. పరీక్షా కేంద్రం చుట్టుపక్కల వంద మీటర్ల వరకు 144 సెక్షన్ అమలు చేస్తారని, ఆ ప్రాంతంలో ఉండే జిరాక్స్ సెంటర్లు మూసివేస్తారని చెప్పారు. రాతపరీక్ష పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాల్లో ప్రశ్నాపత్రాలతో పాటు పరీక్షా సామగ్రిని ఉంచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసినట్టు వివరించారు. - అభ్యర్థుల హాల్ టికెట్‌పై ఫొటో అస్పష్టంగా ఉన్నా.. కనిపించకుండా చిన్నదిగా ఉన్నా.. అసలు ఫొటోనే ముద్రించకున్నా.. ఫొటో ఉన్నప్పటికీ అభ్యర్థి సంతకం లేకపోయినా.. సదరు అభ్యర్థులు గుర్తింపు కార్డుతో పాటు అదనంగా మూడు పాస్‌పార్ట్ ఫొటోలను తప్పనిసరిగా పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలి. ఆ ఫొటోలపై గెజిటెడ్ అధికారి సంతకం చేయించాలి. లేదంటే పరీక్షకు అనుమతించరు. - పరీక్ష రాసే సమయంలో అభ్యర్థి ఏదైనా అవసరానికి ఓఎమ్మార్ షీట్‌పై వైట్నర్ లేదా ఏదైనా మార్కర్ వంటివి వాడితే ఏకంగా అనర్హులే అవుతారు. పరీక్ష హాల్లోకి బాల్ పాయింట్ పెన్ మినహా వైట్నర్, మార్కర్ వంటివి తీసుకొచ్చినట్టు గుర్తించినా వారిని అనర్హులుగా ప్రకటిస్తారు. - అభ్యర్థులకు ఇచ్చే ఒరిజనల్ ఓఎమ్మార్ షీట్‌తో పాటు నకలు ఓఎమ్మార్ కూడా ఉంటుంది. వీటి మధ్యలో కార్బన్ పేపర్ ఉంటుంది. పరీక్ష ముగిసిన తరువాత అభ్యర్థులు ఒరిజనల్ షీట్ ఇన్విజిలేటర్‌కు ఇచ్చి.. నకలును ఇంటికి తీసుకెళ్లవచ్చు. - సమయం పూర్తయ్యే వరకు అభ్యర్థులు పరీక్షా కేంద్రాన్ని విడిచి వెళ్లడానికి అనుమతించరు. ఎవరైనా అభ్యర్థి నిర్ధేశిత సమయానికంటే ముందుగా పరీక్ష కేంద్రాన్ని విడిచి వెళితే అనర్హులవుతారు. - జెల్ పెన్ లేదా ఏ ఇతర రాత వస్తువులతో ఓఎంఆర్ షీట్‌పై ఏదైనా రాసినా జవాబు పత్రం చెల్లదు. -
నేటి నుంచి ‘సచివాలయ’ రాత పరీక్షల హాల్ టికెట్లు
సాక్షి, అమరావతి: ‘సచివాలయ’ ఉద్యోగాల రాత పరీక్షలకు సంబంధించి శనివారం నుంచి హాల్ టికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న ఆన్లైన్ వెబ్ పోర్టర్లలోనే హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ శుక్రవారం సూచించారు. శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆన్లైన్ హాల్ టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపారు. 1,26,728 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు మొత్తం 12.69 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి సెప్టెంబర్ 1, 3, 4, 6, 7, 8 తేదీల్లో ఉదయం, సాయంత్రం.. రెండు పూటలా రాతపరీక్షలు జరుగుతాయి. -
‘ఓఎంఆర్ షీట్ తీసుకెళ్తే కఠిన చర్యలు’
సాక్షి, విజయవాడ : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణకు సన్నద్ధం కావాలని అధికారులకు రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ పిలుపునిచ్చారు. పరీక్షల నిర్వహణపై విజయవాడలో నిర్వహించిన వర్క్‌షాపును కలెక్టర్ ఇంతియాజ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గిరిజా శంకర్ మాట్లాడుతూ... చరిత్రలో మొట్టమొదటిసారి పెద్ద ఎత్తున జరుగుతున్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. సెప్టెంబర్ ఒకటో తేదీన 4 ,478 సెంటర్లలో జరిగే పరీక్షలకు పదిహేను లక్షల యాభై ఎనిమిది వేల మంది హాజరు కానున్నారని తెలిపారు. ఇక క్రమశిక్షణ నిబద్దతతో పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ అధికారులకు సూచించారు. పరీక్షా సమయం పూర్తయ్యే వరకు ఏ అభ్యర్థిని కూడా బయటకు పంపరాదని పేర్కొన్నారు. పరీక్ష రాసే అభ్యర్థి ఓఎంఆర్ షీట్‌ను బయటకు తీసుకెళితే క్రిమినల్ కేసు పెడతామని హెచ్చరించారు. -
నేడు విధుల్లోకి వలంటీర్లు
సాక్షి, అమరావతి: పూజ్య బాపూజీ కన్న కలలను సాకారం చేసే దిశగా రాష్ట్రంలో విప్లవాత్మక మార్పునకు గురువారం పునాది పడనుంది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేసే ‘వలంటీర్ల’ వ్యవస్థను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్ జగన్ గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. కేవలం 45 రోజుల వ్యవధిలో వివాదాలకు తావు లేకుండా గ్రామ, పట్టణ వార్డుల్లో 2,66,796 మంది వలంటీర్ల నియామక ప్రక్రియను ప్రభుత్వం దిగ్విజయంగా పూర్తి చేసింది. గ్రామీణ ప్రాంతంలో ప్రతి 50 ఇళ్లకు. గిరిజన ప్రాంతాల్లో ప్రతి 35 ఇళ్లకు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 50–100 ఇళ్లకు ఒకరు చొప్పున వలంటీర్లను నియమించింది. వీరంతా గురువారం విధుల్లో చేరనున్నారు. విజయవాడలో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లంతా వీక్షించేలా ప్రతి మండల కేంద్రంలో ప్రత్యేకంగా ఎల్సీడీలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. గ్రామ, వార్డుల వారీగా నియమితులైన వలంటీర్లు మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయాల వద్ద, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాల వద్ద తొలిరోజు సమావేశమవుతారు. మండల కేంద్రాల్లో జరిగే ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ముఖ్యఅతిథులుగా హాజరవుతారు. విజయవాడలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన 1,500 మంది వలంటీర్లు పాల్గొంటారని, వారితో సీఎం ముఖాముఖి మాట్లాడుతారని మున్సిపల్ శాఖ కమిషనర్ విజయకుమార్ తెలిపారు. సగం మంది మహిళలే.. వలంటీర్ల నియామకంలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 2.66 లక్షల మంది వలంటీర్లలో 1.33 లక్షల పోస్టులు మహిళలకే దక్కాయి. రిజర్వేషన్ల నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఎంపిక చేశారు. విధుల్లో చేరగానే బేస్‌లైన్ సర్వే గ్రామీణ ప్రాంతాల్లో 1,93,421 మంది, పట్టణ ప్రాంతాల్లో 73,375 మంది వలంటీర్లు విధుల్లో చేరనున్నారు. వలంటీర్లు బాధ్యతలు చేపట్టగానే వారి ద్వారా ప్రతి కుటుంబం వివరాలను సేకరించాలని, ఈ మేరకు బేస్‌లైన్ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కుటుంబం వారీగా ప్రతి సభ్యుడి సమగ్ర వివరాలను తెలుసుకునేలా 13 పేజీల సర్వే ప్రొఫార్మాను సిద్ధం చేసి, ఇప్పటికే జిల్లాలకు పంపినట్టు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. -
సచివాలయ ఉద్యోగ పరీక్షలకు తేదీల ఖరారు
సాక్షి, అమరావతి : కనీవినీ ఎరుగని రీతిలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒకేసారి 1,26,728 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాతపరీక్షలను సెప్టెంబర్ 1 నుంచి 8 మధ్య నిర్వహించనున్నట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్ వెల్లడించారు. 1, 3, 4, 6, 7, 8 తేదీల్లో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేర్వేరు ఉద్యోగాలకు విడివిడిగా రాతపరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్, మున్సిపల్ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ విజయకుమార్‌లు మంగళవారం ఉమ్మడిగా విలేకరుల సమావేశం నిర్వహించి రాతపరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 1,26,728 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేయగా.. 21,69,719 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి మొత్తం 14 రకాల రాత పరీక్షలు నిర్వహిస్తుండగా.. 10 రాత పరీక్షలకు తెలుగు, ఇంగ్లీష్ ప్రశ్నపత్రాలు ఉంటాయని పేర్కొన్నారు. కాగా, ఈనెల 22 నుంచి హాల్ టికెట్లను అన్లైన్లో ఉంచుతున్నామని, అభ్యర్థులు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. -
పథకాల లబ్ధిదారుల గుర్తింపునకు 26 నుంచి సర్వే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎంతమందికి ఇళ్ల పట్టాలు అవసరం అన్నదానిపై గ్రామ, వార్డు వలంటీర్లు ఈ నెల 26 నుంచి రాష్ట్రమంతటా సర్వే చేయనున్నారు. అలాగే, వైఎస్సార్ చేయూత పథకంలో వివిధ కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక సహాయానికి అర్హత ఉన్న 45–60 ఏళ్ల మధ్యనున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలను గుర్తించడం.. రైతు భరోసా, అమ్మఒడి, వైఎస్సార్ ఆసరా ద్వారా లబ్ధిపొందే వారి వివరాలపై ఈ సర్వే నిర్వహిస్తారు. ఒకొక్క వలంటీరు తనకు కేటాయించిన 50 ఇళ్లలో రోజుకు ఏడు నుంచి పది ఇళ్ల చొప్పున ఐదు రోజుల పాటు ఇది ఉంటుంది. కాగా, ఆగస్టు 15న వలంటీర్లు విధులలో చేరిన తర్వాత అక్టోబరు 2న గ్రామ సచివాలయాలు ఏర్పాటయ్యే వరకు 45 రోజుల పాటు వారు ఏఏ కార్యక్రమాలు నిర్వహించాలన్న దానిపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్ సోమవారం జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేశారు. 15న సీఎం చేతుల మీదుగా శ్రీకారం ఇదిలా ఉంటే.. వలంటీర్ల వ్యవస్థను ఆగస్టు 15న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడ నుంచి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఎంపికైన వలంటీర్లు అదేరోజు వారివారి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. సీఎం కార్యక్రమాన్ని అన్ని మండల కేంద్రాలలో వీరు వీక్షించేందుకు అన్నిచోట్ల ఎల్సీడీలు ఏర్పాటు చేయాలని జెడ్పీ సీఈవోలను ఆదేశించారు. 16–25 తేదీల మధ్య డేటా సేకరణ వలంటీర్లు విధుల్లో చేరిన వెంటనే తమకు కేటాయించిన 50 ఇళ్ల పరిధిలోని వ్యక్తుల సమగ్ర సమాచారంతో పాటు ఆ కుటుంబ ఆర్థిక, సామాజిక పరిస్థితి వంటి అన్ని అంశాలపై డేటా సేకరించాలని గిరిజాశంకర్ ఆదేశించారు. ఆగస్టు 16వ తేదీ నుంచి 25వ తేదీ మధ్య రోజుకు పది కుటుంబాల చొప్పున ఈ సమాచారం నిర్ణీత ఫార్మాట్లో సేకరించాల్సి ఉంటుంది. మరోవైపు.. సెప్టెంబరు 1వ తేదీ నుంచి వలంటీర్ల ద్వారా ఇంటికే రేషన్ బియ్యం ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని తొలుత శ్రీకాకుళం జిల్లాలో ఆరంభించనున్నారు. పెన్షన్ల పంపిణీపై కూడా వీరు సెప్టెంబరు 1న జరిగే పంపిణీ కార్యక్రమంలో ఆయా సిబ్బంది ద్వారా అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. కొత్త పింఛన్, రేషన్ కార్డు లబ్ధిదారుల ఎంపికపై శిక్షణ కొత్తగా పింఛన్లు, రేషన్‌కార్డుల లబ్ధిదారుల ఎంపికలో వలంటీర్లకు అవసరమయ్యే శిక్షణను వచ్చే నెల 11 నుంచి 15 తేదీల మధ్య అన్ని మండల కేంద్రాల్లో ఇవ్వాలని గిరిజా శంకర్ అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 2న గ్రామ సచివాలయాల ఏర్పాటు తర్వాత వలంటీర్లు ప్రతీరోజు ‘స్పందన’ కార్యక్రమం నిర్వహించాలన్నారు. అలాగే, ప్రజల నుంచి అందే వినతులను 72 గంటలలో పరిష్కరించేలా చేయడం.. పింఛన్ల పంపిణీ, కొత్తవి మంజూరుకు అర్హులను గుర్తించడం.. అక్టోబరు 15న రైతు భరోసా కార్యక్రమాన్ని వలంటీర్లే నిర్వహించాల్సి ఉందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఇతర రాష్ట్రాల్లో మాయావతికి బలం ఎంత?
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలకు ఉమ్మడిగా పోటీ చేస్తున్న సమాజ్‌వాది, బహుజన సమాజ్ పార్టీలు ఉత్తరఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఉమ్మడిగానే పోటీ చేస్తామని ఇటీవల ప్రకటించాయి. ఇక బీహార్ రాష్ట్రంలో 40 స్థానాలకు పోటీ చేయాలని తమ పార్టీ నాయకురాలు మాయవతి ఆదేశించినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లాల్జీ మేధ్కర్ వెల్లడించారు. మొత్తం లోక్‌సభలో 543 సీట్లు ఉండగా, ఈ మూడు రాష్ట్రాల్లో కలిపి 74 లోక్‌సభ సీట్లున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఉమ్మడిగా, బిహార్‌లో విడిగా బీఎస్పీ పోటీ చేసినట్లయితే ఎవరికి విజయావకాశాలు ఎక్కువ ఉంటాయి? ఈ పార్టీలు మాత్రమే ఉమ్మడిగా పోటీ చేసినట్లయితే పాలకపక్ష బీజేపీ వ్యతిరేక ఓటు చీలిపోయి ఆ పార్టీకే మేలు జరుగుతుందని కొంత మంది రాజకీయ పరిశీలకులు భావిస్తుండగా, అసలు ఈ పార్టీల ప్రభావం ఆయా రాష్ట్రాలో పెద్దగా ఉండదని మరికొంత మంది పరిశీలకులు అంచనా వేస్తున్నారు. వీటిలో ఏది నిజమో తేల్చాలంటే అంతకుముందు ఎన్నికల్లో ఆయా పార్టీలకు వచ్చిన ఓట్ల శాతాన్ని బేరీజు వేయాల్సి ఉంటుంది. మధ్యప్రదేశ్‌లో.. మధ్యప్రదేశ్ అసెంబ్లీకి గతేడాదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 227 సీట్లలో రెండు సీట్లను మాత్రమే బీఎస్పీ గెలుచుకుంది. 5.01 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే గత పదేళ్ల కాలంతో పోలిస్తే పార్టీ బలం బాగా తగ్గుతూ వచ్చింది. 1991 సార్వత్రిక ఎన్నికల్లో రేవా లోక్‌సభ సీటుకు పోటీ చేసిన బీఎస్పీ తొలి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత 1996 ఎన్నికల్లో ఈ సీటును నిలబెట్టుకున్న ఈ పార్టీ మళ్లీ 2009 ఎన్నికల్లో మరోసారి గెలుచుకున్నది. మధ్యప్రదేశ్‌లోని వింధ్యా ప్రాంతంలో పార్టీకి గత మూడు దశాబ్దాలుగా ప్రజాదరణ ఉన్నప్పటికీ దాన్ని బీఎస్పీ ఎన్నికల విజయంగా మార్చుకోలేక పోయింది. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ పార్టీకి 5.85 శాతం ఓట్లు రాగా, అది 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 3.85 శాతం ఓట్లకు పడిపోయింది. ఈ సారి రాష్ట్రంలోని 29 లోక్‌సభ సీట్లకుగాను 26 సీట్లకు పోటీ చేయాలని బీఎస్పీ భావిస్తోంది. మిగతా మూడు సీట్లను సమాజ్‌వాది పార్టీకి వదిలేయాలని అనుకుంటున్నది. ఈ రెండు పార్టీల ప్రభావం రెండు, మూడు సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందని భోపాల్‌కు చెందిన రాజకీయ వ్యాఖ్యాత గిరిజా శంకర్ అభిప్రాయపడ్డారు. ఈ రాష్ట్రంలో ఈ పార్టీలతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం మూర్ఖత్వం అవుతుందని ఆయన అన్నారు. ఎస్పీ, బీఎస్పీ కలిసి పోటీ చేస్తున్న యూపీలో కాంగ్రెస్ పార్టీకి ఎలాగైతే అవకాశం లేదో, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు ఈ రెండు పార్టీలకు అవకాశం ఉండదని చెప్పారు. చత్తీస్‌గఢ్‌లో కూడా ఈ రెండు పార్టీలకు విజయావకాశాలు లేవని ఆయన అభిప్రాయపడ్డారు. మధ్యప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ పార్టీలతోని కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్నట్లయితే కాంగ్రెస్ పడాల్సిన ఓట్లు కూడా బీజేపీకి పడతాయని, ‘సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్’ కోఆర్డినేటర్ వైఎస్ సిసోడియా అభిప్రాయపడ్డారు. ఉత్తరాఖండ్‌లో.. ఉత్తరాఖండ్‌లోని ఐదు లోక్‌సభ సీట్లకుగాను హరిద్వార్, నైనిటాల్ నియోజక వర్గాల్లో బీఎస్పీకి గతంలో మంచి ప్రభావం ఉండింది. ఈ పార్టీకి 2009 సార్వత్రిక ఎన్నికల్లో 15.2 శాతం ఓట్లు రాగా, అది 2014 ఎన్నికల నాటికి 4.78 శాతానికి పడిపోయింది. 2007లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ ఈ రాష్ట్రంలో ఎనిమిది సీట్లు గెలుచుకోగా, 2012లో జరిగిన ఎన్నికల్లో కేవలం మూడు సీట్లకు పరిమితం అయింది. ఇక 2017లో జరిగిన ఎన్నికల్లో ఒక్క సీటును కూడా గెలుచుకోలేక పోయింది. బిహార్‌లో.. బిహార్ లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ ఒక్క సీటును కూడా ఏనాడు గెల్చుకోలేదు. 2009 సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ పార్టీకి బక్సర్, సాసరమ్, గోపాల్‌గంజ్ నియోజక వర్గాల్లో ప్రభావం కాస్తా ఉండింది. కనుక ఆ ఎన్నికల్లో ఈ పార్టీకి 4.4 శాతం ఓట్లు రాగా ఆ తర్వాత ఐదేళ్లకు అది కాస్త 2.17 శాతానికి పడిపోయింది. 2005 నుంచి బీహార్ రాష్ట్రంలో ఒక్క అసెంబ్లీ సీటును కూడా బీఎస్పీ గెలుచుకోలేదు. అలాంటి రాష్ట్రంలో మొత్తం 40 సీట్లకు పోటీ చేస్తామని బీఎస్పీ ప్రకటించడం పట్ల రాజకీయ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. బీహార్‌లో కమ్యూనిస్టు పార్టీల ప్రభావం బాగా పడిపోవడంతో వాటి స్థానంలో దళితులను ఆకర్షించవచ్చని బీఎస్పీ భావిస్తు ఉండవచ్చని ఆ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మహా కూటమిలో బీఎస్పీ చేరినట్లయితే మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో కొన్ని సీట్లను దక్కించుకునే అవకాశం ఉంటుంది. -
కొత్త కలెక్టర్.. గిరిజాశంకరా.. యువరాజా?
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఐఏఎస్‌ల విభజన లో సిద్ధార్థ్‌జైన్‌ను కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేటాయించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ బాధ్యతల నుంచి నేడో రేపో సిద్ధార్థ్‌జైన్ రిలీవ్ కానున్నారు. ఆయన స్థానంలో కలెక్టర్‌గా ఎవరిని నియమిస్తారన్నది చర్చనీ యాంశంగా మారింది. గతంలో జిల్లాలో మదనపల్లె సబ్ కలెక్టర్‌గా పనిచేసిన గిరిజాశంకర్, తిరుమల జేఈవోగా పనిచేసిన ఎం.యువరాజు పేర్లను కలెక్టర్‌గా నియమించడానికి ప్రభుత్వం పరిశీలిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు గిరిజాశంకర్‌నే కలెక్టర్‌గా నియమించే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఐఏఎస్‌ల విభజన అనివార్యమైంది. కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌ను ప్రత్యూష కమిటీ తెలంగాణకు కేటాయిస్తూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఇది పసిగట్టిన సిద్ధార్థ్‌జైన్ తనను ఆంధ్రప్రదేశ్ కేడర్‌కే కేటాయించేలా చూడాలని సీఎం చంద్రబాబును పలు సందర్భాల్లో కోరా రు. చంద్రబాబు మనసు గెలుచుకునేందుకు టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు అధికారవర్గాల నుంచే వ్యక్తమవుతున్నాయి. ఆర్నెల్లలో ఆయన పనితీరే అందుకు తార్కాణమని రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు చెబుతున్నాయి. సిద్ధార్థ్‌జైన్‌ను ఆంధ్రప్రదేశ్‌కే కేటాయించేలా చంద్రబాబు చేసిన సూచనను కేంద్రం ఖాతరు చేయలేదు. తెలంగాణకే కేటాయిస్తున్నట్లు కేంద్రం తెగేసి చెప్పడంతో సిద్ధార్థ్‌జైన్ జిల్లా కలెక్టర్‌గా రిలీవ్ కాక తప్పని పరిస్థితి నెలకొంది. సిద్ధార్థ్‌జైన్‌ను తెలంగాణకు కేటాయించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌గా ఎవరిని నియమిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. 2001 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన గిరిజాశంకర్ గతంలో మదనపల్లె సబ్‌కలెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. గిరిజాశంకర్‌ను కేంద్రం మన రాష్ట్రానికి కేటాయించింది. సమర్థుడైన అధికారిగా పేరున్న గిరిజాశంకర్‌ను జిల్లా కలెక్టర్‌గా నియమించాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. తిరుమల జేఈవోగా పనిచేసి.. ప్రస్తుతం విశాఖపట్నం కలెక్టర్‌గా పనిచేస్తున్న ఎన్.యువరాజు పేరు జిల్లా కలెక్టర్‌గా తెరపైకి వచ్చింది. హుద్‌హుద్ తుఫాను సహాయక చర్యల్లో ఎం.యువరాజు సమర్థవంతంగా పనిచేశారనే అభిప్రాయంతో ఉన్న సీఎం చంద్రబాబు.. జిల్లా కలెక్టర్‌గా ఆయనను నియమించే దిశగా ఆలోచిస్తున్నారనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. గతంలో జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన 2004 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన కె.ప్రద్యుమ్న పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. జిల్లా పరిస్థితులపై సమగ్రంగా అవగాహన ఉన్న గిరిజాశంకర్‌నే కలెక్టర్‌గా నియమించే అవకాశం ఉందని అధికారవర్గాలు వెల్లడించాయి. జిల్లా కలెక్టర్‌గా ఎవరిని నియమిస్తారన్నది ఒకట్రెండు రోజుల్లో తేలనుంది. -
జిల్లా కలెక్టర్‌గా గిరిజాశంకర్
సిద్ధార్థ్‌జైన్ తెలంగాణకు కేటాయింపు నేడో రేపో ఉత్తర్వులు జారీ సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లా కలెక్టర్‌గా ఎం.గిరిజాశంకర్‌ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ర్టం మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన్ను కమలనాథన్ కమిటీ ఏపీకి, చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తోన్న సిద్ధార్థ్‌జైన్‌ను తెలంగాణకు కేటాయించిన విషయం విదితమే. ఐఏఎస్‌ల విభజన పూర్తయిన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లోనూ ఐఏఎస్‌ల మార్పుల చేర్పులకు ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్‌గా ఎం.గిరిజాశంకర్‌ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2001 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన మదనపల్లె సబ్ కలెక్టర్‌గా పనిచేశారు. విశాఖపట్నం, కడప జిల్లాల్లో జాయింట్ కలెక్టర్‌గా ఆయన పనిచేశారు. జూలై 6, 2012 నుంచి మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ నేడో రేపో ఉత్తర్వులు వెలువడనున్నాయని అధికారవర్గాలు వెల్లడించాయి. -
మెరుగైన సేవలందిస్తా
మహబూబ్‌నగర్ టౌన్: జిల్లా ప్రజలకు 24గంటలు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలను అందిస్తానని జిల్లా నూతన కలెక్టర్ జీడి ప్రియదర్శిని వెల్లడించారు. గురువారం కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత మీడియాతో మాట్లాడారు. ముందుగా పెద్ద జిల్లా అయిన మహబూబ్‌నగర్‌కు కలెక్టర్‌గా రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇక జిల్లా ప్రజలు ఏవిధమైన పాలనను కోరుకొంటున్నారో అలా అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఇంతవరకు కలెక్టర్‌గా పనిచేసిన గిరిజాశంకర్ తన బ్యాచ్మెటని, ఆయన జిల్లాకు అందించిన సేవలను ఆదర్శంగా తీసుకొని రాణిస్తానని చెప్పారు. వారం రోజుల్లో జిల్లాపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకొని మెరుగైన పాలనను అందించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ విషయంలో అధికారులు, సిబ్బంది అందరి సహకారాన్ని తీసుకొంటానని చెప్పారు. బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ ప్రియదర్శిని జిల్లా కలెక్టర్‌గా జీడీ ప్రియదర్శిని గురువారం ఉదయం 11.43గంటలకు బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ నుంచి బదిలీపై వెళ్తున్న కలెక్టర్ గిరిజాశంకర్ ఆమెకు బాధ్యతలు అప్పగించారు. అనంతరం జిల్లాస్థాయి అధికారులను ప్రియదర్శినికి పరిచయం చేసి వెళ్లిపోయారు. కొత్త కలెక్టర్ ప్రియదర్శిని రాకకుముందు బదిలీ అయిన కలెక్టర్ గిరిజాశంకర్ తన చాంబర్లో అధికారులతో వివిధ అంశాలపై చర్చించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని జేసీ, అడిషనల్ జేసీ, డీఆర్‌ఓలకు విజ్ఞప్తి చేశారు. మనం ఎన్నాళ్లు ఉన్నామన్నది కాకుండా ఉన్నన్నాళ్లు ఏం చేశామన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని చెప్పారు. ఈ లోపు కొత్త కలెక్టర్ ప్రియదర్శిని రావడంతో ఆమెకు బాధ్యతలు అప్పగించారు. అనంతరం వేరే వాహనంలో బంగ్లాకు వెళ్లారు. కలెక్టర్ ప్రొఫైల్: 2002 బ్యాచ్‌కు చెందిన జీడీ ప్రియదర్శిని ముందుగా విపత్తుల శాఖ సహాయ కమిషనర్‌గా పనిచేశారు. అనంతరం హౌసింగ్ శాఖ కార్యదర్శిగా, సీసీఎల్ఏ కమిషనర్‌గా పనిచేస్తోన్న సమయంలో 2008లో ఐఏఎస్‌గా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఆ తరువాత వెంటనే నల్లగొండ జిల్లాకు జేసీగా వెళ్లిన యేడాదికే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్‌కు నార్త్‌జోన్ సహాయ కమిషనర్‌గా మూడున్నర ఏళ్లు పనిచేశారు. అక్కడి నుంచి గతేడాది అక్టోబర్ 30న అపార్డ్‌కు డెరైక్టర్‌గా వెళ్లారు. 8నెలల ఆతరువాత మహబూబ్‌నగర్ జిల్లాకు కలెక్టర్‌గా బదిలీపై వచ్చారు. శుభాకాంక్షల వెల్లువ.. నూతన కలెక్టర్‌గా బాధ్యత్యలు చేపట్టిన ప్రియదర్శినికి జిల్లా అధికారులతోపాటు, సిబ్బంది నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ముందుగా జేసీ ఎల్.శర్మన్ పూలబోకే ఇచ్చి శుభాకాంక్షలు తెలుపగా, ఆ తరువాత ఏజేసీ, డీఆర్వో, జెడ్పీ సీఈఓ, డీఆర్డీఏ పీడీలు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో నేతలంతా కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలుపగా, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది బారులు దేరడంతో అంతా సందడివాతావరణం నెలకొంది. -
‘మన ఊరు.. మన ప్రణాళిక’తో గ్రామాల అభివృద్ధి
కోయిల్‌కొండ: వచ్చే ఐదేళ్లలో ప్రణాళిక బద్ధంగా గ్రామాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు చేపట్టేందుకే ‘మన ఊరు -మన ప్రణాళిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లాకలెక్టర్ గిరిజాశంకర్ తెలిపారు శుక్రవారం. స్థానిక మండల కార్యాలయంలో నిర్వహించిన మన మండల-మన ప్రణాళిక కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి హాజరయ్యూరు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మూడు నెలలకోసారి నిర్వహించే మండల సమావేశంలో వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశుధ్యం, హరితవనం, అభివృద్ధి పనులపై ప్రణాళికలు రూపొందించాలన్నారు. రైతులు పండించే పంటలకు కావలసిన విత్తనాలను వారే అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు అవసరమైతే పాలెం పరిశోధన కేంద్రం నుంచి నిపుణులను పంపి సూచనలు, సలహాలు ఇప్పిస్తామన్నారు. మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం చేయూలన్నారు. అగష్టు15లోగా లక్ష్యాన్ని పూర్తి చేసిన సర్పంచులకు అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లాలో 4.50లక్షల మరుగుదొడ్లకు ప్రతిపాదనలు పంపగా ఇందులో2.25 లక్షలు మంజూరయ్యూయని, అందులో 40వేలు మాత్రమే పూర్తి కావడం జరిగిందన్నారు. నిర్మాణాలు త్వరగతిన పూర్తి చేసేందుకు సర్పంచులు చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా డంపింగ్ యూర్డుల నిర్మాణానికి నిధులు మంజూైరె నట్లు తెలిపారు. మహిళాసంఘాలు పాడిపరిశ్రమపై ఆసక్తి చూపాలన్నారు. కోయిల్‌సాగర్ నుంచి మండలానికి సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గొండ్యాల వాగు ద్వారా మండలంలోని ఏడు పెద్ద చెరువులకు నీరు అందించేందుకు సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. సివిల్ ఆసుపత్రికి అత్యాధునిక భవనం స్థానిక సివిల్ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా మార్చేందుకు నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే అత్యాధునిక భవనాన్ని నిర్మించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ్ర కలెక్టర్ గిరిజాశంకర్ తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డితో కలిసి ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్బంగా భవన నిర్మాణంపై స్థానికుల సూచనలు ,సలహాలు స్వీకరించారు. ఆసుపత్రి చుట్టూ మరికొంత స్థలాన్ని సేకరించి రెండస్థుల భవనాన్ని నిర్మిస్తామన్నారు. అనంతరం బీసీ హాస్టల్‌ను సందర్శించి అక్కడ ఉన్న పాత పోలీస్‌స్టేషన్ తొలగించాలని అధికారులను ఆదేశించారు. రూ.43లక్షలతో నిర్మించిన మంచినీటి ట్యాంకును ప్రారంభించారు. నీటి సరఫరాకు పెద్ద వాగులో సంపు ఏర్పాటు చే యూలని గ్రామసర్పంచ్ మంజూల, మాజీ ఎం పీపీ వై.మహేందర్‌గౌడ్ కలెక్టర్‌ను కోరారు. కా ర్యక్రమాల్లో స్పెషల్ ఆఫీసర్ జయచంద్ర, ఎం పీపీ బోయిని స్వప్నరవి, వైఎస్ ఎంపీపీ శారద, ఎంపీడిఓ భాగ్యలక్ష్మీ, తహశీల్దార్ ప్రేమ్‌రాజ్, ఆర్‌డబ్ల్యుఎస్ డిఈ పుల్లారెడ్డి, ఏఈ సమీర్‌ఉల్లాఖాన్, క్లస్టర్ ఆఫీసర్ డాక్టర్ హరిశ్చంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సోదరభావంతో మెలగాలి
కులమతాలకతీతంగా అందరూ సోదరభావంతో మెలగాలని కలెక్టర్ గిరిజా శంకర్ ఆకాంక్షించారు. పండుగలను మతసామరస్యానికి ప్రతీకలని అన్నారు. అన్ని పండుగలను కలిసిమెలిసి జరుపుకోవడం అభినందనీయమని.. ఇకముందు కూడా ఇదే సంప్రదాయాన్ని కొనసాగించాలని కోరారు. బుధవారం జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యూరు. స్టేషన్ మహబూబ్‌నగర్: కులమతాలకతీతంగా అందరూ సోదరభావంతో మెలగాలని జిల్లా కలెక్టర్ గిరిజాశంకర్ అన్నారు. బుధవారం స్థానిక రోజ్ గార్డెన్ ఫంక్షన్హాల్లో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఏర్పాటు చేసిన ఇఫ్తారు విందుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యూరు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పండుగలను జరుపుకుని, మతసామరస్యానికి ప్రతీకగా నిలవాలన్నారు. జిల్లాలో అన్ని పండుగలను కలిసిమెలిసి జరుపుకోవడం అభినందనీయమని, ఇకముందు కూడా ఇదే సంప్రదాయాన్ని కొనసాగించాలన్నారు. రంజాన్‌నెలలో ముస్లింలు ఎంతో నిష్టగా ఉసవాసాలు ఉంటారని వారికి ఇఫ్తార్ విందు ఇవ్వడం అబినందనీయమన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ 400 ఏళ్లుగా తెలంగాణలో హిందూ, ముస్లింలు కలిసిమెలిసి జీవిస్తున్నారన్నారు. ఆంధ్రపాలనలో తెలంగాణ అన్నిరంగాల్లో వెనుకబడిపోయిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని, మైనార్టీల అభివృద్ధికి బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ల అమలు చేస్తామన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో వారికి తగిన ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మజీదుల మరమ్మతులకు రూ.30వేల చొప్పున చెక్‌లను అందజేశారు. అనంతరం కలెక్టర్, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే తదితరులను ముస్లిం ప్రముఖులు శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ భాస్కర్, జాయింట్ కలెక్టర్ శర్మన్, డీఆర్ఓ రాంకిషన్, మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమ ర్, డీఎండబ్యూఓ శీరిష, మైనార్టీ కార్పొరేషన్ ఈడీ కరీముల్లా, ముస్లిం ప్రముఖులు ఎంఎ.హాది, ఇంతియాజ్, మోసీన్‌ఖాన్, తఖీ హుస్సేన్, ఖుద్దూస్‌బేగ్, అల్తాఫ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్జీఎఫ్ ప్రణాళిక రెడీ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి (బీఆర్జీఎఫ్) కింద 2014-15 ఆర్థిక సంవత్సరానికి రూ.38.50 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ గిరిజాశంకర్ వెల్లడించారు. కలెక్టర్ చాంబర్లో బుధవారం జరిగిన జిల్లా ప్రణాళిక సంఘం సమావేశం జరిగింది. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ జనాభాతో పాటు గ్రామీణ, పట్టణ జనాభాను ప్రాతిపదికగా తీసుకుని ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. తాగునీరు, అంతర్గత రోడ్లు, పాఠశాల భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,కమ్యూనిటీ హాళ్లు తదితరాలకు ప్రణాళికలో ప్రాధాన్యమిచ్చామన్నారు. గ్రామ పంచాయతీలతో పాటు కొత్తగా ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యుల నుంచి కూడా బీఆర్జీఎఫ్ ప్రతిపాదనలు స్వీకరించామన్నారు. స్థానిక సంస్థల నుంచి అందిన ప్రతిపాదనలను పరిశీలించి ప్రణాళిక ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ ప్రకటించారు. 2013-14లో రూ.42కోట్లతో బీఆర్జీఎఫ్ ప్రణాళిక సిద్ధం చేయగా, రూ.17 కోట్లు మాత్రమే విడుదలైనట్లు ప్రకటించారు. వివిధ పథకాల కింద మంజూరై నిధుల లేమితో అర్ధంతరంగా పనులు నిలిచిన చోట బీఆర్జీఎఫ్ నిధులు వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. చాలాచోట్ల కాంపౌండ్ వాల్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు వస్తున్నా, అత్యవసరమున్న చోటే మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ గిరిజాశంకర్ వెల్లడించారు. తాగునీటి బోర్లువేసే అవకాశంపై నిలదీసిన సభ్యులు బీఆర్జీఎఫ్ నిధుల నుంచి తాగునీటి బోర్లు వేసే అవకాశం లేకపోవడంపై పలువురు సభ్యులు అధికారులను ప్రశ్నించారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉన్న ప్రతిపాదనలు మాత్రమే ప్రణాళికలో చేర్చాలని ఎమ్మెల్యేలు కలెక్టర్‌కు సూచించారు. అయితే, గ్రామ, మండల స్థాయి నుంచి ఇప్పటికే ప్రతిపాదనలు తీసుకున్నందున కొత్తగా ఇప్పుడు తాము సమీక్షించేదేముందని సభ్యులు ప్రశ్నించారు. దీంతో అధికారులు మాట్లాడుతూ ఎమ్మెల్యేలు కూడా మండలానికి రూ.5లక్షల చొప్పున పనులను నిబంధనల మేరకు ప్రతిపాదించే అవకాశముందని చెప్పారు. సమావేశంలో మాజీ మంత్రులు డీకే అరుణ, చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, అంజయ్య యాదవ్, గువ్వల బాలరాజు, రాజేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, సంపత్‌కుమార్, మర్రి జనార్దన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, వంశీచంద్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘తీర్పు’ ఇచ్చేశాం..!
‘సార్వత్రిక’ సమరం ముగిసింది. స్వల్ప ఘటనలు మినహా జిల్లాలో శాంతిభద్రతలు ఎక్కడా అదుపు తప్పలేదు. పటిష్ట ప్రణాళికతో జిల్లా కలెక్టర్ గిరిజాశంకర్, ఎస్పీ నాగేంద్రకుమార్ వ్యవహరించి ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తీర్పు ఇచ్చేందుకు అవకాశం కల్పించారు. ఈవీఎంల మొరాయింపు ఈ ఎన్నికల్లో అతి పెద్ద సమస్యగా మారింది. దీనితో కొన్నిచోట్ల పోలింగు ఆలస్యంగా ప్రారంభమైంది.అయితే అధికారుల కృషి మేరకు పోలింగు పెరగడం విశేషం. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: సాధారణ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు బుధవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో చెదురుమదురు ఘటనలు మాత్రమే అక్కడక్కడ నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 74.34శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా కల్వకుర్తిలో 83.87 శాతం, అత్యల్పం కొడంగల్‌లో 65.61 శాతం ఓట్లు పోలయ్యాయి. షాద్‌నగర్, గద్వాల నియోజకవర్గాల్లోనూ 80శాతంకు పైగా పోలింగ్ నమోదైంది. 3268 పోలింగ్ బూత్‌లకు గాను 75 చోట్ల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు మొరాయించడంతో పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. అత్యధికంగా జడ్చర్ల, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో పదేసి బూత్‌లలో ఈవీఎంలు పనిచేయక పోవడంతో ప్రత్యామ్నాయ ఈవీఎంలను ఏర్పాటు చేశారు. 84శాతం మేర పోలింగ్ నమోదవుతుందని అధికారులు అంచనా వేసినా 74.34శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లు స్వస్థలాలకు రాకపోవడం వల్లే పోలింగ్ శాతం ఆశించిన మేర నమోదు కాలేదని పోలింగ్ సరళి వెల్లడించింది. ఏప్రిల్ మొదటి వారంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 73.02శాతం, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 78.25శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం. 2009 ఎన్నికల్లో 69శాతం మాత్రమే ఓట్లు పోల్ కాగా, ప్రస్తుతం 5.34శాతం మేర పోలింగ్ పెరిగింది. హైదరాబాద్ నుంచి అభ్యర్థులు సమకూర్చిన బస్సులు, మినీ వ్యాన్లతో పాటు ద్విచక్ర వాహనాలపై ఓటర్లు సొంత ప్రాంతాలకు రావడంతో గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపించింది. నక్సల్ ప్రభావిత ప్రాంతాలైన కొల్లాపూర్, అచ్చంపేటలో సాయంత్రం ఐదు గంటలకే పోలింగ్ ముగిసింది. మిగతా నియోజకవర్గాల్లో ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగడంతో గడువు ముగిసిన తర్వాత ఎక్కడా ఓటర్లు బారులు తీరి కనిపించలేదు. ఎండ తీవ్రత మూలంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకే 52.05శాతం ఓటర్లు ఓటు వేసి వెళ్లారు. పోలీసులు లాఠీలకు పని... పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఇరువర్గాలు ఘర్షణలకు దిగడంతో స్వల్ప ఉద్రిక్తతలు తలెత్తాయి. పోలీసులు సకాలంలో జోక్యం చేసుకుని లాఠీలు ఝలిపించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘర్షణలకు సంబంధించి ఎనిమిది ఘటనలు చోటు చేసుకోగా, గద్వాల నియోజకవర్గం మల్దకల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మిగతా ఘటనలపై విచారణ తర్వాత కేసు నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు. గద్వాల కోటలోని పోలింగ్ స్టేషన్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గాలు ఘర్షణకు దిగాయి. అభ్యర్థులు డీకే అరుణ (కాంగ్రెస్), కృష్ణమోహన్‌రెడ్డి (టీఆర్ఎస్) కూడా అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితి అదుపు చేశారు. కొడంగల్‌లోనూ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ, టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ అభ్యర్థి రేవంత్‌రెడ్డి సమక్షంలోనే గొడవ జరగడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఆత్మకూరు మండలం గోపన్‌పేటలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురికి గాయాలయ్యాయి. కొల్లాపూర్‌లో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య జరిగిన ఘర్షణల్లో కాంగ్రెస్ నాయకుడు గాయపడ్డాడు. ధన్వాడ మండలం మరికల్లో పోలీసులు లాఠీ ఝలిపించడంతో ఓ గర్భిణికి దెబ్బలు తగలడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూలు మండలం నాగనూలులో పోలీసుల వైఖరిని నిరసిస్తూ గ్రామస్తులు పోలీసు జీపును అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఫరూఖ్‌నగర్ మండలం విట్యాలలో మతి స్థిమితం లేని వ్యక్తితో ఓటు వేయించారని ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారికి పాముకాటు కేశంపేట మండలం దేవునిగుట్ట తండాలో ఎన్నికల అధికారి ఊషయ్య మంగళవారం రాత్రి పాముకాటుకు గురయ్యారు. అపస్మారక స్థితికి చేరుకున్న ఊషయ్యను తొలుత షాద్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి, ఆ తర్వాత అపోలో ఆసుపత్రికి తరలించారు. బాలానగర్ మండలం దోన్లెపల్లి మధిర గ్రామం చొక్కంపేటకు చెందిన 300కు పైగా ఓటర్లు మధ్యాహ్నం వరకు పోలింగ్ బహిష్కరించారు. తమ గ్రామంలో పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేస్తేనే ఓటు వేస్తామంటూ నిరసనకు దిగారు. చివరకు మధ్యాహ్నం గ్రామానికి చేరుకున్న రెవెన్యూ అధికారులు వచ్చే ఎన్నికల్లో స్థానికంగా పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో పోలింగ్‌లో పాల్గొన్నారు. -
‘స్థానిక’ రిజర్వేషన్లు ఓకే
నిన్నటి ఉత్కంఠకు శనివారం తెరపడింది. ‘స్థానిక’ సమరానికి సై అంటూ అధికార యంత్రాంగం రిజర్వేషన్లను ఖరారు చేశారు. కలెక్టర్ గిరిజాశంకర్ అధికారికంగా ప్రకటించారు. జిల్లాలోని ఎంపీటీసీ, జడ్పీటీసీలకు గాను 50శాతం స్థానాలను ఆడపడుచులు దక్కించుకొన్నారు. ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎన్నికలతో రాజకీయ పక్షాలు బెంబేలెత్తుతున్నాయి. అధికారులూ...విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : మండల, జిల్లా పరిషత్‌ల నాలుగో విడత సాధారణ ఎన్నికల రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. జిల్లా పరిషత్, మండల ప్రజా పరిషత్, మండల ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా రిజర్వేషన్ల జాబితా రూపొందించారు.వాటి వివరాలతో కూడిన గెజిట్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గిరిజా శంకర్ శనివారం విడుదల చేశారు. తొలిసారిగా అన్ని స్థాయిల్లోనూ మహిళలకు 50శాతం స్థానాలు కేటాయించారు. ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా 50శాతం పదవులు వారికి దక్కాయి. ఇకపై మండల, జిల్లా పరిషత్‌లలో సగం స్థానాల్లో ప్రాతినిధ్యం వహిస్తారు. రొటేషన్ పద్దతిలో రిజర్వేషన్లు ఖరారు చేయడంతో కొత్త ముఖాలకు స్థానిక సంస్థల్లో అవకాశం దక్కనుంది. మండల పరిషత్ అధ్యక్ష పదవులను రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని లెక్కించారు. తదనుగుణంగా జిల్లా లో ఆయా కేటగిరీల వారీగా మండల పరిషత్ స్థానాలను రిజర్వు చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (ఎంపీటీసీ) పునర్వ్యవస్థీకరించారు. దీంతో గతంలో 870గా ఉన్న ఎంపీటీసీ స్థానాల సంఖ్య ప్రస్తుతం 982కు చేరింది. జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షుల సంఖ్య మాత్రం గతంలో మాదిరిగా 64 వంతున ఉంటాయి. రేపు షెడ్యూలు విడుదల? స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికార యంత్రా ంగం ఉరుకులు పెడుతోంది. సోమవారం ఎన్నికల షెడ్యూలు వెలువడుతుందనే సమాచారంతో అధికార యంత్రాంగం కునుకు లేకుండా ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో తలమునకలైంది. అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు జాబితా ఆధారంగా ఎంపీటీసీల వారీగా శనివారం ఓటరు జాబితాను సిద్దం చేశారు. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా ఓటరు జాబితాను సోమవారం ప్రచురిస్తారు. 12వ తేదీన పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రకటిస్తారు. మార్చి 19 నుంచి నామినేషన్లు స్వీకరించి, ఏప్రిల్ ఆరో తేదీ ఆదివారం ఎన్నికలు నిర్వహించే అవకాశముంది. రాజకీయ పక్షాలు ఉక్కిరి బిక్కిరి కేవలం నెలా 20 రోజుల వ్యవధిలో మున్సిపల్, జిల్లా, మండల పరిషత్, సాధారణ ఎన్నికలు జరగనుండటంతో రాజకీయ పక్షాలు, నాయకులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు తమ రాజకీయ భవిష్యత్‌పై ప్రభావం చూపుతాయని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక భారం ఓ వైపు, అభ్యర్థుల ఎంపిక కసరత్తు మరోవైపు పార్టీలకు సవాలు విసురుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ చిహ్నం కీలకం కావడంతో ఔత్సాహికులు బీ ఫారాల కోసం సొంత పార్టీపై ఒత్తిడి తేనున్నారు. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో తలమునకలైన పార్టీలు, నేతలకు జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు సవాలుగా మారాయి. -
మద్యం మహమ్మారిని తరిమికొడదాం
ఖిల్లాఘనపురం, న్యూస్‌లైన్: గ్రామాల్లోని మహిళలు, యువకు లు, ఎక్సైజ్ అధికారులతో కలిసి మద్యం మహమ్మారిని తరిమికొడదామని ఎన్ఫోర్స్మెంట్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ అశోక్‌కుమార్ అన్నారు. నాలుగు రోజు లుగా ఖిల్లాఘనపురం మండలం ఉప్పరిపల్లిలో నాటుసారా, మద్యం బెల్టుషాపులను తొలగించాలని నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఫిర్యాదుల దినోత్సవం సం దర్భంగా మహబూబ్‌నగర్‌లో కలెక్టర్ గిరిజాశంకర్‌ను కలిసి విన్నవించారు. ఆయన ఆదేశాల మేరకు మంగళవారం గ్రామంలో ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మహిళలతో కలిసి దాడులు నిర్వహించారు. అనంతరం గ్రామపంచా యతీ వద్ద సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పలు అంశాలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. గ్రామంలో కొందరు వ్యక్తులు నాటుసారా, మద్యం బెల్టు షాపులను యథేచ్ఛ గా నిర్వహిస్తున్నారన్నారు. తాగేందుకు డబ్బులు లేని సమయంలో తమ భర్తలు ఇంట్లో ఉన్న సామగ్రి సైతం అమ్ముకుం టున్నారని వాపోయారు. ఒకవైపు తా ము నిరసన కార్యక్రమాలు చేపడుతుం టే మరోవైపు రాత్రివేళ తమ భర్తలకు మద్యం తాగించి ఇంటికి పంపడంతో గొడవ పెట్టుకుని తీవ్రంగా కొడుతున్నారన్నారు. సోమవారం రాత్రి ఊషన్న ఫుల్‌గా తాగి భార్యాపిల్లలను కొట్టడంతో వారు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మద్యం అమ్మకుండా తగు చర్యలు తీసుకోవాల ని కోరారు. దీనికి ఏసీ బదులిస్తూ మహిళల్లో చైతన్యం రావడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఇక నుంచి గ్రామంలో ఎవరైనా నాటుసారా, మద్యం విక్రయిస్తున్నట్లు తెలిస్తే తమకు ఫోనోలో సమాచారమివ్వాలన్నారు. అనంతరం ఎస్ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామంలో రాత్రివేళ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. తాగి ఎవరైనా గొడవ చేస్తే వెంట నే సమాచారమివ్వాలని సూచించారు. కార్యక్రమంలో గద్వాల ఎక్సైజ్ సూపరింటెండెంట్ జనార్దన్‌రెడ్డి, అసిస్టెంట్ సూపరింటెండెంట్ జానయ్య, సీఐ నారాయణ, ఎస్ఐలు రాములు, సాయన్న, మైమూద్‌ఖాన్ పాల్గొన్నారు. మహిళా సంఘాల సభ్యులతో కమిటీ మద్యం మహమ్మారిని అరికట్టేందుకు గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. అధ్యక్షురాలిగా సత్యమ్మ, ఉపాధ్యక్షురాలిగా సాయమ్మ, ప్రధాన కార్యదర్శిగా అలి వేల, కార్యదర్శులుగా వెంకటమ్మ, సుక్కమ్మను ఎన్నుకున్నారు. -
పోలియోను తరిమికొడదాం
మహబూబ్‌నగర్ వైద్యవిభాగం, న్యూస్‌లైన్: జిల్లా నుంచి పోలియోను తరిమికొట్టాలని, రెండే రెండు పోలియో చుక్కలు వేయించి, చిన్న పిల్లలు వారి కాళ్లపై వారు నిలబడేలా చేద్దామని కలెక్టర్ గిరిజాశంకర్ పిలుపునిచ్చారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆది వారం ఆయన జిల్లాకేంద్రంలోని పాతపాలమూరు. రామయ్యబౌళి ఆరోగ్య కేంద్రాల్లో పిల్లలకు చుక్కల మందు వేసి, పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు పోలియో బారిన పడకుండా తప్పనిసరిగా చుక్కల మందు వేయించేందుకు తల్లిదండ్రులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ఈ విడత పోలియో కార్యక్రమం సందర్భంగా జిల్లాలో 4.96 లక్షల మంది చిన్నారులకు చుక్కల మందు వేసేందుకు 3057 కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు ఇతర ప్రయాణ పాంతాల్లో కూడా చిన్నారులకు పోలియో చుక్కలు వేసేం దుకు అదనపు కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ వెల్లడించారు. కార్యక్రమంలో ఏజేసీ పి.రాజారాం, డీఎంహెచ్ఓ డాక్టర్ రుక్మిణమ్మ, డీఐఓ రంగాపూర్, సహాయ మున్సిపల్ కమిషనర్ వెంకన్న, జిల్లా మాస్ మీడియా అధికారి బాలజీ, రామాంజనేయులు, రవిశంకర్, డా.రఫిక్, ఏజో కొమ్ములయ్య, రెడ్ క్రాస్ ఉపాధ్యక్షుడు లయన్ నటరాజ్, సత్తూర్ రాములుగౌడ్, డా.రజిని,తదితరులు పాల్గొన్నారు. పల్స్ పోలియోను ఉద్యమంలా చేపట్టాలి గద్వాల టౌన్: ఐదేళ్లలోపున్న ప్రతి చిన్నారికి రెండు పోలియో చుక్కలు వేయాలని, ఉద్యమంలో ఈ ప్రక్రియను చేపట్టాలని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి డీకే అరుణ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక దూద్ దవాఖాన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రా న్ని మంత్రి డీకే అరుణ సందర్శించి, చిన్నారులకు పోలియో చుక్కలను వేశా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ ఐదేళ్లలోపు పిల్లలందరికీ చుక్కలు మందు తప్పనిసరిగా వేయిం చాలని సూచించారు. పోలియోపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సిన బాధ్య త ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి, నాయకులు బీఎస్ కేశవ్, బం డల వెంకట్రాములు, రామంజనేయు లు, తదితరులు పాల్గొన్నారు. -
ప్రణాళికలు రూపొందించాలి
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, న్యూస్‌లైన్: గ్రామ పంచాయతీ ఐదేళ్ల పాలనలో సమగ్రాభివృద్ధి కార్యక్రమాలపై ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ గిరిజాశంకర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక జెడ్పీ సమావేశమందిరంలో గ్రామ వార్షిక ప్రణాళికపై మండల అధికారులతో వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని వనరులపై దృష్టి పెట్టి ఆదాయ మార్గాలను ఎంచుకుని గ్రామాభివృద్ధి ఎలా సాధ్యమవుతుందనే దానిపై ముందుగా అధికారులు సమీక్షించుకోవాలని సూచించారు. వైద్య, ఆరోగ్యం, అంగన్వాడీ, విద్యుత్, పంటల సేద్యం, పాఠశాలల నిర్వహణ, పశు సంపద, గ్రామ జనాభా, పశుగ్రాసం, ఉపాధి కూలీల సంఖ్య, స్మశాన వాటిక, రక్షిత మంచినీటి, రోడ్లు, మురుగుకాల్వల పరిస్థితిని సమీక్షించుకోవాలన్నారు. గ్రామ పరిపాలన సౌలభ్యం కోసం అన్ని విభాగాల్లో కమిటీలు వేయాలని, అందులో సర్పంచ్, వీఆర్ఓ, కార్యదర్శి, యువకులు, ప్రజలను గ్రామభివృద్ధి కమిటీలో ఉంచాలన్నారు. ఈ కమిటీకి చైర్మన్‌గా సర్పంచ్ వ్యవహరిస్తారని చెప్పారు. ఇందుకోసం ప్రజలు భాగస్వామ్యంతో సర్పంచ్, కార్యదర్శులు, వీఆర్ఓలు గ్రామసభలను ఏర్పాటు చేసి, ఈ నెల 27లోగా ప్రణాళికలను రూపొందించాలన్నారు. దీనిని జిల్లావ్యాప్తంగా అమలు చేసేందుకు మార్చి 31లోగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. పంచాయతీకి ప్రభుత్వం నుంచి అందిన గ్రాంట్లను మొత్తం లెక్కలోకి తీసుకుని అంచనాలు తయారు చేయాలన్నారు. పంచాయతీల ఆదాయం పెంచుకునేందుకు ఇంటి పన్ను, ప్రచార పన్ను, అమ్మకం పన్ను, పరిశ్రమలు, సెల్‌ఫోన్ టవర్లు, నీటి పన్నులు సకాలంలో వసూళ్లు చేసి గ్రామాభివృద్ధికి కృషి చేయాలన్నారు. పాలమూరు పారిశుధ్య పక్షోత్సవాల్లో విశిష్ట సేవలందించిన పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర శాఖ అధికారులను గుర్తించి,గణతంత్య్ర దినోత్సవంలో అవార్డు అందిస్తామన్నారు. సమావేశంలో డీపీఓ రవీందర్, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఈ కృపాకర్, డీఎల్పీఓలు, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు పాల్గొన్నారు. -
ప్రతిష్టాత్మకంగా‘పైకా’ పోటీలు
మహబూబ్‌నగర్ క్రీడలు, న్యూస్‌లైన్: జిల్లా కేంద్రంలో జనవరి 7 నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్న ‘పైకా’ జాతీయ క్రీడలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని కలెక్టర్ గిరిజాశంకర్ చెప్పారు. అథ్లెటిక్స్, వాలీబాల్ పోటీలను జిల్లా స్టేడియంలో, తైక్వాండో పోటీలను టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహిస్తామన్నారు. మంగళవారం జిల్లా స్టేడియంలో ఈ పోటీల ఏర్పాట్లను పరిశీలించారు. నూతన ట్రాక్ పనులు త్వరగా పూర్తి చేయాలని డీఎస్డీఓ శ్రీధర్‌రావును ఆదేశించారు. స్టేజీ నిర్మాణం, మార్చ్ఫాస్ట్, వాలీబాల్ కోర్టులను పరిశీలించారు. వాలీబాల్ కోర్టుల చుట్టూ బారికేడ్లు ఏర్పాట్లు చేయాలన్నారు. పోటీలకు 1400 మంది క్రీడాకారులు హాజ రవుతారని, వారికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. వీటి ప్రారంభోత్సవానికి బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌తో పాటు క్రీడాకారులు పీఎస్ సింధు, శోభ, పీవీ రమణ హాజరవుతారన్నారు. పోటీల్లో జరిగే రోజుల్లో వలంటీర్లను వినియోగించుకోవాలని నెహ్రూ యువకేంద్రం అధికారులను ఆదేశించారు. క్రీడాకారులకు పోటీల వివరాల బుక్‌లెట్‌ను అందజేయాలన్నారు. కార్యక్రమంలో ఏజేసీ రా జారాం, ట్రెయినీ కలెక్టర్ విజయరామరా జు, జెడ్పీ సీఈఓ రవీందర్, ఆర్డీఓ హనుమంతురావు, లయన్ నటరాజ్ పాల్గొన్నారు. -
వాడిగా... వేడిగా
జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: దాదాపు పదినెలల అనంతరం జరిగిన జిల్లా విజిలెన్స్ మానటరింగ్ కమిటీ సమావే శం శనివారం హాట్ హాట్‌గా సాగింది. నాగర్‌కర్నూల్ ఎంపీ మందజగన్నాధం, జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్‌ల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. సమావేశం ప్రారంభంలోనే హన్వా డ మండలంలోని వేపూర్ గ్రామానికి చెందిన దళిత మహిళ చెన్నమ్మను హత్య చేసి ఏడాది అవుతున్నా నేటికి నిందితులను ఎందుకు గు ర్తించలేదని, పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైందని ఎంపీ మందజగన్నాధం అనడం తో ఒక్కసారిగా ఆగ్రహంతో ఎస్పీ తాము మనుషులమేనని దేవుళ్లం కాదనీ పట్టుకుంటామని జిల్లాలో ఇప్పటి వరకు 249 కేసులు చేశామని అంటుండగా ఎంపీ మధ్యలో అడ్డుపడ్డారు. దీనితో ఎస్పీ తాను మాట్లాడిన తర్వాత మాట్లాడండని ఆవేశంగా అనడంతో ఎంపీ ఆగిపోయారు. ఎంపీ మాట్లాడుతూ తాను ప్రజాప్రతినిధినని అంత తేలిగ్గా దేవుళ్లమని సమాధానం చెప్పడం సమంజసమా అనిప్రశ్నించారు. గత 19 ఏళ్లుగా ఎంపీగా ఉన్న అంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం ఎంతవరకు న్యాయమని అంటుండగా ఎస్పీ కలగజేసుకొనే ప్రయత్నం చేశారు. దీనితో ‘మీరు మాట్లాడేటప్పుడు నేను అడ్డుతగులలేదు’. అని ఎంపీ అంటూ దళితుల కేసులు పరిష్కరించకుంటే ఈ సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ప్రతిసారి కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం ఎందుకని తమను సమావేశాలకు పిలవద్దని ఎంపీ అనగా సభకు అధ్యక్షత వహించిన కలెక్టర్ గిరిజాశంకర్ కలుగజేసుకొని సర్దిచెప్పడంతో వారి మాటల యుద్ధానికి తెరపడింది. -
నిర్వాసితులందరికీ పునరావాసం
ఆలూరు(గట్టు), న్యూస్‌లైన్: ఆలూరు నిర్వాసితులందరికీ పునరావాసం కల్పిస్తామని కలెక్టర్ గిరిజా శంకర్ తెలిపారు. మంగళవారం సాయంత్రం జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్, జేసీ ఎల్. శర్మణ్.. ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో ఆలూరు పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా ధరూరు మండలం ర్యాలంపాడు గ్రామం దగ్గర నిర్మించిన రిజర్వాయర్‌లో ఆలూరు గ్రామం ముంపునకు గురి కానున్నది. ఆలూరు గ్రామస్తులకు బింగిదొడ్డి తండా దగ్గర 139 ఎకరాల్లో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ పునరావాస కేంద్రాన్ని కలెక్టర్ బృందం సందర్శించి గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. పునరావాస కేంద్రంలో విద్యుత్, తాగు నీటి సౌకర్యం లేదని తెలిపారు. దేవాలయాలు, మసీదు, చర్చి నిర్మాణాలను చేపట్టాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. పొలాలకు దారులను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇసుక తరలింపునకు పోలీసుల అడ్డంకులున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మంచినీటి ట్యాంకును మరో రెండు నెలల్లో అందుబాటులోకి తెస్తామన్నారు. పొలాలకు వెళ్లే దారుల గుర్తించాలని సర్వే అధికారులను ఆదేశించారు. ఇసుక తరలింపునకు తహశీల్దార్‌తో అనుమతి పొందవచ్చునని తెలిపారు. పాఠశాల కోసం విశాలమైన స్థలాన్ని గుర్తించి , నిర్మాణాలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జనవరి 31వ తేదీ తర్వాత రిజర్వాయర్‌ను పూర్తి స్థాయిలో నీటితో నింపుతామని, గ్రామస్తులు ఆలోపు పునరావాస కేంద్రంలో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకొవాలని విజ్ఞప్తి చేశారు. గద్వాల ఆర్డీఓ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఆలూరు పునరావాస కేంద్రంలో 1466 ప్లాట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇళ్ల నిర్మాణం కోసం ప్రతి కుటుంబానికి ఉపాధి ద్వారా 240 రోజుల పని దినాలను కల్పిస్తామని వివరించారు. గట్టు తహశీల్దార్ సైదులు ఎంఈఓ రాంగోపాల్, హౌసింగ్, పీఆర్ ఏఈలు పాల్గొన్నారు. శ్రీరంగాపూర్లో ఆర్అండ్ఆర్ సెంటర్ శ్రీరంగాపూర్(పెబ్బేరు): రంగసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఊట నీటితో దెబ్బతింటున్న శ్రీరంగాపూర్ గ్రామంలో ఆర్అండ్ఆర్ సెంటర్ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని కలెక్టర్ గిరిజాశంకర్ తెలిపారు. జిల్లాలో పునరావాస కేంద్రాలను పరిశీలించేందుకు చేపట్టిన కలెక్టర్ బస్సు యాత్ర మంగళవారం పెబ్బేరు మండలం శ్రీరంగాపూర్, నాగరాల గ్రామాల్లో కొనసాగింది. శ్రీరంగాపురం వాసులు తమ గ్రామంలోని వీధులను కలెక్టర్‌కు చూపించారు. రంగసముద్రం ఊట నీటితో తమ గ్రామానికి ఎప్పటికైనా ముప్పు తప్పదని, పునరావాసం కల్పించాలని కోరారు. దీనికి స్పందించిన కలెక్టర్.. అధికారుల నివేదికల ప్రకారం ఆర్అండ్ఆర్ సెంటర్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని హామీనిచ్చారు. రంగనాయకస్వామి దేవాలయం వద్ద రెస్టారెంట్, షాపింగ్ కాంప్లెక్స్, రంగసముద్రం రిజర్వాయర్‌లో బోటింగ్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కాటేజీలను నిర్మించి పర్యాటక పరంగా అభివృద్ధి చేస్తామన్నారు, దేవాలయం వద్ద నిర్మించే దుకాణలను ముంపు బాధితులకు లీజుకు ఇస్తామని చెప్పారు. అనంతరం నాగరాల గ్రామంలో నిర్మిస్తున్న మూడు పునారావాస కేంద్రాలను పరిశీలించారు. రంగ సముద్రం రిజర్వాయర్ నిర్మాణం పనులు చివరిదశలో ఉన్నాయని గ్రామస్తులు వెంటనే తమ గ్రామాన్ని ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్లాలన్నారు. ఒకటో కేంద్రంలో మినహా మిగిలిన రెండు కేంద్రాలలో విద్య, విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు తదితర సదుపాయాలు కల్పించలేదని గ్రామస్తులు కలెక్టర్‌కు వివరించారు. పూర్తి సదుపాయాలు కల్పిస్తే ఖచ్చితంగా గ్రామాన్ని ఖాళీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్ట్‌ల ఇంజనీర్ ప్రకాష్, బీమా ఎస్ఈ రమణమూర్తి, ఈఈ ప్రేమ్ కుమార్, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్ఈ కృపాకర్ రెడ్డి, విద్యుత్ శాఖా ఎస్ఈ సదాశివ రెడ్డి, గృహనిర్మాణ పీడీ రవిందర్ రెడ్డి, ఎస్డీసీ రజియాభేగం, వనపర్తి ఆర్డీఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
కాలుష్యరహిత ఉత్పత్తులను కనిపెట్టాలి
దేవరకద్ర రూరల్, న్యూస్‌లైన్: ఇంజనీరింగ్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి అంతర్జాతీయ సాంకేతిక సదస్సులు ఎంతో దోహదపడతాయని కలెక్టర్ గిరిజాశంకర్ అన్నారు. అలాగే ఇంజనీరింగ్ విద్యార్థులకు మంచి ఆలోచనా ధోరణి కలగడానికి ఇవి చాలా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. దేవరకద్ర మండలంలోని స్విట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం రెండు రోజుల అంతర్జాతీయ సాంకేతిక సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా కళాశాలలోని సెమినార్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఇంజనీరింగ్ ఉత్పత్తులతో ప్రకృతికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయన్నారు. అందుకే కన్నుతో కెమెరా, చాపతో పడవ, పక్షిని చూసి విమానాన్ని కనిపెట్టినట్లు చెప్పారు. సమాజంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందన్నా రు. ప్రస్తుతం జరుగుతున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు విద్యనభ్యసిం చాలన్నారు. అలాంటి మార్పులలోని కీలకాంశాలను విద్యార్థుల వద్ద బోధకులు ప్రస్తావించడం వల్ల అవి వారిలో నూతనమైన ఆలోచనలను రేకెత్తించడానికి వీలుంటుందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ఇంజనీరింగ్ టెక్నాలజీని ఉపయోగించి కాలుష్యరహిత ఉత్పత్తులను కనుగొనడానికి ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రయత్నించాలన్నారు. అలాగే మానవాళికి సమకూర్చే విధంగా వైద్య, విద్యారంగాల్లో విప్లవాత్మకమైన మార్పులను తీసుకోవడానికి కావలసిన పరికరాలను కనుగొనే మేధస్సును అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఓ లక్ష్యంతో ముందుకు వెళితే విద్యార్థులకు తప్పక విజయం వరిస్తుందన్నారు. జోర్డాన్ అల్బల్కా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ అదనన్ అల్రాబీయా, సింగరేణి బొగ్గు గనుల ఎస్ఈ డాక్టర్ ఉజ్వల్ కుమార్ బెహరా, జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ఎంవీ రమణారావు, ఖరగ్‌పూర్ ఐఐటీ ప్రొఫెసర్ డాక్టర్ ప్రదీప్కుమార్రే మాట్లాడుతూ ఎప్పుడు కూడా ఇంజనీరింగ్ విద్యార్థులు నిరాశకు గురికావద్దన్నారు. సాంకేతిక రంగంలో జరుగుతున్న పలు మార్పులను తెలియజేయడంతో పా టు పరిశోధనాపరంగా జరుగుతున్న ఉన్నతిని విద్యార్థులు పరస్పరం అవగాహన పరుచుకోవడానికి ఇలాంటి సదస్సులు ఉపయోగపడతాయన్నారు. ఈ సదస్సుల వల్ల వివిధ దేశాలకు చెందిన సాంకేతిక నిపుణులు పర్యటించి విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు అందజేయడానికి వీలుంటుందన్నారు. ప్రస్తుత తరుణంలో భారతదేశానికి సాంకేతిక విద్యను పెం పొందించడం ఎంతో అవసరని చెప్పారు. ఇప్పటి ఆర్థికవ్యవస్థను పటిష్ట పరచాలంటే పారిశ్రామిక రంగాన్ని, సాంకేతిక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఇంజనీరింగ్ విద్య చాలా అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పేపర్ ప్రజంటేషన్ సీడీని ఆవిష్కరించారు. మొదటిసారిగా కళాశాలకు వచ్చిన వివిధ దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలకు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కోయంబత్తూర్ హిందూస్తాన్ కళాశాల కోఆర్డినేటర్ డాక్టర్ ఏవీ సెంథిల్‌కుమార్, స్విట్స్ ప్రిన్సిపల్ జి.తిరుపతిరెడ్డి, కళాశాల అధ్యక్షుడు కె.సంపత్‌కుమార్, ఉపాధ్యక్షుడు పి,శ్రీరామ్‌రెడ్డి, కరస్పాండెంట్ శ్రీనివాసరావు, కార్యదర్శి సూర్యనారాయణ, కోశాధికారి నర్సింహ్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
గ్రామీణ సమస్యలపై అవగాహన పెంచుకోవాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు, ప్రజల స్థితి గతులపై క్షుణ్ణుంగా అధ్యయనం చెయ్యాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ ట్రైనీ ఐఏఎస్‌లకు సూచించారు. గ్రామీణ సమస్యలపై ఆధ్యయనం చేసేందుకు జిల్లాకు వచ్చిన 28మంది ట్రైనీ ఐఏఎస్ అదికారులు సోమవారం కలెక్టర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత సమస్యలను గుర్తించినప్పుడే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. దేశభివృద్ధికి గ్రామాలు అతి ముఖ్యమైనవైనందున వాటి పురోభివృద్ధికి కృషిచెయ్యాలన్నారు. దీంతోపాటు, ఆర్థిక, సామాజిక, బౌగోళిక అంశాలపై పట్టు సాధించాలన్నారు. జిల్లాతో మెజార్టీ ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నట్లు తెలిపారు. సాగునీటి సౌక ర్యం కల్పించేం దు కు జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన నాలుగు ఎత్తిపోతల పథకాలు నిర్మాణ దశలో ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో వలసలు ఎక్కువగా ఉంటాయని, ఈ ప్రభావం విద్య, ఆరోగ్య రంగాలపై కనిపిస్తుందన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా వలసలను కొంత వరకు నియంత్రించగలిగామని, పూర్తిస్థాయిలో ఆరికట్టేందుకు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలి పారు. మాతా, శిశు మరణాల రేటు ఎక్కువగా ఉందని, చిన్న వయస్సు లో ఆడపిల్లలకు పెళ్లిళ్లు చెయ్యడం, పౌష్టికాహార లోపం, బాలికల ఆరోగ్య సమస్యలు ఇందుకు కారణమన్నారు.జిల్లాలో బాలిక విద్యను ప్రోత్సహించేందుకు రెసిడెన్షియల్, నాన్ రెసిరెన్షియల్స్తోపాటు, రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా వసతి గృహాలను ఏర్పాటు చేసిన ట్లు తెలిపారు. అంతకుముందు ట్రైనీ కలెక్టర్ విజయరామరాజు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా జిల్లాలో వ్యవసాయం, పశు సంపద, పరిశ్రమలు, విద్య, వైద్యం, ఆరోగ్యం, రవాణా, సమాచార, పర్యాటక తది తర అంశాలపై వివరించారు. 7రోజుల పాటు 102అంశాలపై ఆధ్యయనం..... దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ట్రైనీ ఐఏఎస్‌లు ఎంపిక చేసిన గ్రామాల్లో 7రోజులపాటు 102అంశాలపై అధ్యయనం చెయ్యనున్నారు. వీరు నలుగురు చొప్పున ఏడు బృందాలుగా గ్రామాల్లో స్థితి గతులపై అధ్యయనం చేస్తారు. నాగర్‌కర్నూల్ డివిజ న్ పరిధిలోని అక్కారం, ఉప్పునుంతల, పెద్దకొత్తపల్లి, గద్వాల్ డివిజన్ పరిధిలో గట్టు, రాయవరం, మల్దకల్, సద్దలోనిపల్లి, అలంపూర్, బీమవరం, గద్వాలలో పర్యటించనున్నారు. 88వ ఫౌండేషన్ కోర్సుకు చెందిన వీరు ఐఏఎస్‌కు ఎంపికై డా.మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థ లో మూడున్నర నెలలపాటు శిక్షణ పొం దేందుకు రాష్ట్రానికి రాగా, ఆధ్యాయనం నిమిత్తం జిల్లాకు వచ్చారు. ఎంసిహెచ్ఆర్డికి చెందిన శ్రీనివాస్ వీరికి సమన్వయకర్త గా వ్యవహరించనున్నారు. కార్యక్రమంలో డిఆర్డిఏ పీడి చంద్రశేఖర్ రెడ్డి, ఎపిఎంఐపి పిడి విద్యాశంకర్తోపాటు, శిక్షణ ఐఏఎస్‌లు తదితరులు పాల్గొన్నారు. -
కోలుకోలేని దెబ్బ
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: ఇటీవల వారం రోజుల పాటు కురిసిన వర్షాలు పాలమూరు జిల్లా రైతాంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. వేలాది ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. పశువులు, పాకలు, బోరుమోటార్లు వరదలో కొట్టుకుపోయాయి. కాగా, తుఫాను వల్ల జరిగిన నష్టం అంచనా లెక్కలను జిల్లా అధికార యంత్రాంగం ఆగమేఘాల మీద తయారుచేసింది. ముఖ్యంగా అచ్చంపేట నియోజకవర్గంలో భారీనష్టం జరిగింది. వర్షాలకు సంభవించిన నష్టాన్ని చూసేందుకు ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిసింది. అధికారికంగా సమాచారం రాకపోయినా ముఖ్యమంత్రి పర్యటన ఉండొచ్చనే సంకేతాలు జిల్లా అధికారులకు రావడంతో కలెక్టర్ గిరిజాశంకర్ ఏర్పాట్లు పరిశీలించేందుకు సోమవారం అచ్చంపేటకు వెళ్లారు. ఇదిలాఉండగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్ననాటినుంచి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గళమెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో జిల్లాలో పర్యటిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని ఇటు జిల్లా అధికార యంత్రాంగం, అటు అధికార కాంగ్రెస్‌పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. నష్టం లెక్కలు తేల్చిన అధికారులు ఇదిలాఉండగా వారం రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలకు * 579.97కోట్ల నష్టం సంభవించినట్లు అధికారులు ప్రాథమికంగా లెక్కలు తేల్చారు. 54 మండలాల్లోని 853 గ్రామాల్లో తుఫాను బీభత్సం సృష్టించింది. రోడ్లు భవనాలశాఖకు చెందిన సుమారు 60 కి.మీ మేర రోడ్లు, మూడు బ్రిడ్జిలు దెబ్బతినడంతో *51.62 కోట్ల నష్టం జరిగిందని గుర్తించారు. అదేవిధంగా పంచాయతీరాజ్‌శాఖకు చెందిన 658 కి.మీ మేర దాదాపు 170 రోడ్లు పాడైపోవడంతో *316.75 కోట్లు, మునిసిపాలిటీ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు తెగిపోవడం వల్ల మరో *3.20కోట్ల నష్టం సంభవించినట్లు తేల్చారు. వీటితో పాటు ఆర్డబ్ల్యూఎస్ పథకాలు, ఏపీసీపీడీసీఎల్లకు చెందిన ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు విరిగిపోవడం వల్ల రూ.1.58 కోట్లు, మైనర్ ఇరిగేషన్‌శాఖకు చెందిన *34.91 కోట్ల విలువ చేసే 551 పనులు దెబ్బతిన్నట్లు గుర్తించారు. 68వేల ఎకరాల్లో పంటనష్టం అంతేకాకుండా 66,330 ఎకరాల్లో పత్తి, వరి పంటలు పూర్తిగా నేలకొరగడంతో రైతులకు *150.75 కోట్ల నష్టం జరిగింది. అలాగే మరో 1700 ఎక రాల్లో టమాట, ఉల్లి, మిరప, బొప్పాయి తదితర పంటలకు *3.73 కోట్లు నష్టపోయారు. అలాగే 165 గొర్రెలు, ఎద్దులు మృతిచెందడంతో మరో *39 లక్షలు, జిల్లావ్యాప్తంగా 6771 ఇళ్లు పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా దెబ్బతినడంతో దాదాపు *17.64 కోట్ల నష్టం సంభవించింది. వరదల కారణంగా జిల్లాలో ఆరుగురు మృత్యువాతపడినట్లు గుర్తించారు. ఈ మేరకు ఆయాశాఖల అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపారు. -
భూ అభివృద్ధి పనులు భేష్
అచ్చంపేట/ఉప్పునుంతల, న్యూస్‌లైన్: జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన భూ అభివృద్ధి పనులు, తోటల పెం పకం చాలా బాగున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి కార్యదర్శి ఎల్సీ గోయల్ పేర్కొన్నారు. శుక్రవారం ఉప్పునుంతల పొలాన్ చెరువు వెనుక ఈజీఎస్‌లో చేపట్టిన భూ అభివృద్ధి పనులు, అచ్చంపేట మండలం లింగోటం వద్ద ఏర్పాటు చేసి న మామిడి తోట, డ్రిప్‌లను పరిశీలించి, రైతులను పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇందిరమ్మ పచ్చతోరణం కింద కేఎల్ఐ కాలువ వెంట మొక్క లు నాటుకున్న రైతులకు ఆయన చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎల్సీ గోయల్ మాట్లాడుతూ అధికారులతో సమీక్షలు నిర్వహించడంతో పాటు క్షేత్రస్థాయిలో అభివృద్ధిని పరిశీలించడానికి ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. పనులు చేపట్టి సాగులోకి తెచ్చిన రైతుల భూము ల్లో ఇందిర జలప్రభ ద్వారా బోర్లు వేయిం చి నీటి వసతిని కల్పించాలని కలెక్టర్ గిరిజాశంకర్, డ్వామా పీడీ వెంకటరమణారెడ్డిలకు సూచించారు. గ్రామంలో 250 ఎకరాల్లో భూ అభివృద్ధి పనులు చే పట్టి సాగులోకి తెచ్చిన పొలాల్లో మిగిలి పోయిన పనులను పూర్తి చేసి రైతుల పం టలను సాగుచేసుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఉపాధి హామీలో ప్రస్తు తం ఉన్న వందరోజుల పని దినాలు సరి పోవడం లేదని, 200 రోజుల పని కల్పిం చి 15 రోజులకొక్కసారి కూలి డబ్బులు చెల్లించాలని సమాఖ్య ప్రతినిధులు కార్యదర్శిని కోరారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ కార్యదర్శి మాట్లాడుతూ కూలీలు ఆదాయం వచ్చే ఇతర వనరులు ఎంచుకుని ముందుకు వెళ్లాలని సూచించా రు. ఈజీఎస్ పనులు లేని సమయంలో సిమెంటు ఇటుకల తయారీ, సిమెంటు మిక్చర్ మిల్లర్ వంటి వాటితో ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉందని, సమాఖ్యలు ముందుకు వస్తే వాటిని ఇచ్చే ఆలోచన చేస్తామన్నారు. అనంతరం పనుల కల్పన, పేఆర్డర్ జనరేట్, ఆన్లైన్, మస్టర్ ఫీడింగ్ తదిర అంశాలను గోయల్ స్వయంగా పరిశీలించారు. పోస్టాఫీస్ ద్వా రా బయోమెట్రిక్ విధానంలో కూలీలకు డబ్బుల పంపిణీ విధానాన్ని పర్యవేక్షించి, కొంతమంది కూలీలకు స్వయంగా డబ్బు లు పంపిణీ చేశారు. గోయల్ ప్రసంగాన్ని కలెక్టర్ గిరిజాశంకర్ తెలుగులోకి అనువాదం చేశారు. కార్యక్రమంలో ఏపీ గ్రామీణాభివృద్ధి కమిషనర్ శశిభూషణ్‌కుమార్, సెర్ప్ సీఈఓ రాజశేఖర్, రూరల డెవలప్మెంట్ అడిషనల్ కమిషనర్ ఏవీవీఎస్ ప్ర సాద్, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీడీలు మల్లికార్జునస్వామి, సుబ్బారావు, ఆర్డీఓ కీమ్యానాయక్ పాల్గొన్నారు. -
పదకొండైనా తీరలేదు!
మహబూబ్‌నగర్ రూరల్, న్యూస్‌లైన్: ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది సమయపాలనపై కలెక్టర్ గిరిజాశంకర్ దృష్టి సారించారు. ఇందులో భాగంగా ముందుగా పరిశ్రమల కార్యాలయాన్ని తనిఖీ చేయాల్సిందిగా అదనపు జేసీ డాక్టర్ రాజారాంను ఆదేశించారు. దీంతో శుక్రవారం ఉదయం 10.30 ఏజేసీ పరిశ్రమల కార్యాలయానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఇద్దరు అటెండర్లు మాత్రమే ఉన్నారు. మిగతా అధికారులు, సిబ్బంది ఎవరూ కనిపించకపోవడంతో ఆయన ఆశ్చర్యపోయారు. అనంతరం ఏజేసీ జనరల్ మేనేజర్ చాంబర్లో కూర్చొని, సిబ్బంది రాకపై దృష్టిపెట్టాలని తన సీసీ మురళీని ఆదేశించారు. కాసేపటికి జూనియర్ అసిస్టెంట్ వినయతమ్మ, టైపిస్టు వెంకటేశ్వర్లు కార్యాలయానికి వచ్చారు. వారితో సమయం వేయించి, రిజిస్టర్లో సంతకాలు పెట్టించారు. ఆ తర్వాత ఏ అధికారి కానీ, సిబ్బంది కానీ రాకపోవడంతో ఆయన ఉదయం 11.30 గంటల వరకు కార్యాలయంలోనే వేచి ఉన్నారు. జనరల్ మేనేజర్‌తో పాటు ముగ్గురు ఏడీలు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విధులకు హాజరుకాలేదు. దీంతో ఏజేసీ ఏడీకి ఫోన్ చేసి ఎక్కడికి వెళ్లారంటూ ప్రశ్నించగా, తాను ఆఫీస్ పని మీద ఫీల్డ్‌కు వచ్చానని చెప్పారు. ఏ విషయంలో ఫీల్డ్‌కు వెళ్లారని ఏజేసీ తిరిగి ప్రశ్నించడంతో అటువైపు నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. దీంతో ఆగ్రహించిన ఆయన విధులకు ఆలస్యంగా వస్తే సహించేది లేదని హెచ్చరించారు. కలెక్టర్‌కు నివేదిక... పరిశ్రమల శాఖలో పనిచేసే సిబ్బంది సకాలంలో ఎవరూ విధులకు హాజరు కాని విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని ఏజేసీ పేర్కొన్నారు. అలాగే ఆలస్యంగా హాజరైన వారందరికీ చార్జీమెమోలు జారీచేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇక పై వారానికో కార్యాలయాన్ని తనిఖీ చేసి అధికారులు, సిబ్బంది హాజరుపై కలెక్టర్‌కు నివేదిస్తానని చెప్పారు. పరేషాన్లో సిబ్బంది... ఆకస్మిక తనిఖీలో భాగంగా ముందుగా ఏజే సీ పరిశ్రమ శాఖ కార్యాలయాన్నే ముందుగా తనిఖీ చేయడంతో కార్యాలయ అధికారులు, సిబ్బంది షాక్‌కు గురయ్యారు. తాము ఎప్పుడు కార్యాలయానికి వచ్చినా అడిగే వారే లేరనుకుంటే... ఏజేసీ తనిఖీతో తమ బండారం బయటపడిందనే పరేషాన్లో ఉన్నారు. పైగా ఈ విషయం కలెక్టర్ దృష్టికి కూడా వెళుతుండటంతో ఏంచేయాలో వారు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.