ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: తుపాను ప్రభావిత గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా పంచాయతీరాజ్ శాఖ చర్యలు చేపట్టింది. సర్పంచ్‌లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు తదితరులతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లోని 4,850 మంది పంచాయతీరాజ్ సిబ్బంది ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
వీటిపై తగిన సూచనలు చేసేందుకు విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల జెడ్పీ సీఈవోలు, డీపీవోలతో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ సోమవారం టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించేందుకు బ్లీచింగ్ పౌడర్, సోడియం క్లోరైడ్ సిద్ధం చేశామని చెప్పారు. పూర్తిగా క్లోరినేషన్ చేసిన తర్వాతే తాగునీటి సరఫరా చేస్తున్నట్టు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment