Infectious diseases
-
Hyderabad: ఓ వైపు కరోనా.. మరోవైపు అంటువ్యాధులు..
ఓ వైపు కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండగా దీనికి తోడు అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. డెంగీ వ్యాధి జనాలను వణికిస్తున్నది. బస్తీలు, కాలనీలు అన్న తేడా లేకుండా ఈ మహమ్మారి అందరినీ వణికిస్తున్నది. రెండు వారాల నుంచి బంజారాహిల్స్ పరిధిలోని ఆరుగురు డెంగీ బారిన పడ్డారు. హడావుడిగా జీహెచ్ఎంసీ ఎంటమాలజీ సిబ్బంది వచ్చి దోమల నివారణ పిచికారి చేసి వెళ్ళడమే తప్పితే ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న పాపాన పోవడం లేదు. సాక్షి, బంజారాహిల్స్: కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతుండటంతో జనం మరోసారి ఆందోళన చెందుతున్నారు. కరోనా పరీక్షల కోసం బాధితులు ఆస్పత్రుల వద్ద బారులు తీరుతున్నారు. ఇటీవల కొన్ని నెలలుగా ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కరోనా పరీక్షల కోసం బంజారాహిల్స్ రోడ్ నెం. 7లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గత నాలుగైదు రోజుల నుంచి రోజుకు 15 నుంచి 20 మంది వరకు వచ్చి పరీక్షలు నిర్వహించుకుంటున్నారు. ఇందులో అయిదారుగురికి కరోనా నిర్ధారణ అవుతోంది. ► ఒక వైపు కరోనా పరీక్షలు, మరో వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆస్పత్రుల్లో కొనసాగుతున్నది. అయితే బంజారాహిల్స్ రోడ్ నెం 7లోని పీహెచ్సీలో మాత్రమే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ►కేవలం కోవిషీల్డ్, కోర్బివాక్స్ వ్యాక్సిన్ మాత్రమే అందుబాటులో ఉండగా కోవాగ్జిన్ టీకా లేకపోవడంతో గడువు సమీపించి ముగిసిన వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ►బస్తీలు, కాలనీలు అన్న తేడా లేకుండా కరోనాతో బాధపడుతూ పరీక్షల కోసం వస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ►కరోనా జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇది మరింత విజృంభించే అవకాశాలున్నట్లు వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. ఆస్పత్రుల్లో సైతం కరోనా జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఇష్టానుసారంగా ఆస్పత్రులకు రాకపోకలు సాగుతున్నట్లు సిబ్బంది ఆరోపిస్తున్నారు. చదవండి: ఇంటర్లో ఫస్ట్‌క్లాస్ సాధించిన అవిభక్త కవలలు వీణ-వాణి దోమల స్వైర విహారం ► వ్యర్థాలు పడుతుండటంతో మరోవైపు దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. మురుగు నీటి కాల్వలు, వరద నిలిచే ప్రాంతాల్లో దోమలు విజృంభిస్తున్నాయి. దీంతో అంటు వ్యాధులు ప్రబలుతూ బస్తీల్లో ఇంటికొకరు చొప్పున జ్వరపీడితులవుతున్నారు. ► దోమల నివారణకు జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం ఏ మాత్రం కృషి చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ► నామమాత్రంగా దోమల నివారణ పిచికారీ చేస్తున్నారు తప్పితే ఫాగింగ్ మాటే ఎత్తడం లేదు. ► ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలో రెండు నెలల నుంచి దోమల నివారణకు అవగాహన కార్యక్రమాలు తప్పితే క్షేత్ర స్థాయిలో వాటి నిర్మూలనకు ఏ మాత్రం సిబ్బంది పని చేయలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
‘కరోనా’ కథ కంచికి చేరేనా?
‘మానవ మనుగడ పైన వైరస్ క్రిములదే ఆఖరి మాట’ అని ఏనాడో హెచ్చరించాడు లూయీ పాశ్చర్. ప్రపంచవ్యాపితంగా ప్రబలమై ఉన్న 300 రకాల వైరస్ క్రిముల్ని శాస్త్రవేత్తలు ఎప్పుడో కనిపెట్టారు. పెను ఉప్పెన వచ్చి పచ్చని చేలనూ, పంటలనూ ఊడ్చిపెట్టినట్టే, వైరస్ క్రిములూ మానవ జీవితాల్ని నాశనం చేస్తాయని చెబుతూనే ఉన్నారు. అయినా వీటికి పరిష్కారం ఇప్పటిదాకా ఎందుకు దొరకలేదు? ఎందుకంటే, ఈ భయం అధికారాన్ని స్థిరపరచడానికి పనికొస్తుంది. ఇంకాముఖ్యంగా ఫార్మా కంపెనీలకు సిరులు కురిపిస్తుంది. కరోనా సాధారణ ‘ఫ్లూ’ లాంటిదేననీ, దాన్ని నివారించడానికి ‘ఫ్లూ’ సంబంధిత సాధారణ నివారణ చర్యలు సరిపోతాయనీ ఎందరు మొత్తుకున్నా వైద్యరంగాన్ని శాసించడానికి అలవాటుపడిన మందుల కంపెనీల ఒత్తిళ్లకు అమెరికా పాలకులు లొంగిపోయారు. ఆ బాటే ప్రపంచమూ అనుసరిస్తోంది. ‘‘అంటువ్యాధుల, మహమ్మారుల యుగం వెనక బలమైన రాజకీయాల ప్రభావం కూడా ఉంటుంది. ఈ వ్యాధుల నివారణకు రాజ్య వ్యవస్థగానీ, లేదా ప్రభుత్వంగానీ తన పౌరులకు ఏ మేరకు బాధ్యత వహిస్తోంది అన్నది, ఏ మేరకు ప్రజల ప్రతిఘటన ఉందన్నదాన్ని బట్టి తెలిసిపోతుంది. ఎందుకంటే, ఎప్పటి కప్పుడు రానున్న ఎన్నికల తేదీని బట్టి పాలకుల నిర్ణయం ఆధారపడి ఉంటుంది. అలాగే మహమ్మారి రోగాల నివారణకు ప్రజలు ఎంత వరకు శ్రద్ధ వహించాలని ప్రభుత్వం కోరుకుంటోందన్న దానిపై ఆధార పడి కూడా వ్యాధి ఫలితం ఆధారపడి ఉంటుంది. అంటే ఎన్నికల్లో రాజకీయ లబ్ధిపై ఆధారపడి మహమ్మారి వ్యాధిని అదుపు చేయడానికి పాలకులు ప్రయత్నిస్తారన్నమాట.’’ (చిన్మయ్ తుంబే రాసిన ‘ఏజ్ ఆఫ్ పాండెమిక్స్(1817–1920): హౌ దే షేప్డ్ ఇండియా అండ్ ద వరల్డ్’. 2020) దేశంలో ‘కరోనా’ కేసులు, వాటికి అనుబంధంగా ‘చిలవలు పలవలు’గా పుట్టుకొస్తున్న రకరకాల అనుబంధ వ్యాధులు – దేశం లోనూ, ప్రపంచ వ్యాపితంగానూ కోటానుకోట్ల ప్రజలను ఆందోళన పరుస్తున్నప్పటికీ ప్రపంచంలోని పెక్కుమంది పాలకులకు పరి ష్కారం దొరక్కపోవడానికి కారణం ఏమిటి? ప్రభుత్వాల నియం త్రణ వ్యవస్థ లోపమా? లేక, మందుల వ్యాపారులకూ, పాలక వర్గాలకూ మధ్య లాభసాటి బేరసారాల ఫలితమా? ‘కోవిడ్’కు ముందు గత 500 సంవత్సరాల క్రితమే ప్రపంచ వ్యాపితంగా ప్రబలమై ఉన్న 300 రకాల వైరస్ క్రిముల్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. వీటిలో ఎన్నిరకాల అంటువ్యాధులకు మానవ శరీరమే గాక, మానవేతర ప్రకృతిలోని పశుపక్ష్యాదుల శరీరాలు కూడా దోహదం చేస్తూ వచ్చాయో జీవశాస్త్రవేత్తలు పలువురు విపులంగా చర్చించారు. ఆ మాటకొస్తే నూరేళ్ల నాటి స్పానిష్ ఫ్లూ నుంచి నేటి ‘కోవిడ్–19’ మహమ్మారి దాకా నడిచిన మానవ–మానవేతర కల్లోల ప్రపంచాన్ని గురించి మార్క్ హోనిగ్స్బామ్ తన తాజా గ్రంథంలో పూసగుచ్చినట్టు వివరించారు. యుద్ధాల వల్ల, మానవ సంచారం ద్వారా వివిధ ఖండాలలో వ్యాపిస్తూ వచ్చిన రకరకాల వైరస్ల గురించి శాస్త్రవేత్తలు చర్చించారు. కోవిడ్–19 వైరస్‌కు ముందు హెచ్ఐవీ, సార్స్ వైరల్ వ్యాధులు ప్రపంచానికి ముందస్తు హెచ్చరికలు. వాటిని ధృవపరుస్తూ తర్వాత ప్రపంచం మీదికి వచ్చి మానవాళిని కకావికలు చేసినవి ఎబోలా, జైకా, కోవిడ్–19. ఈ పరిణామాన్ని వివరిస్తూ 2016లోనే నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఒక హెచ్చరిక విడుదల చేసింది – ‘‘వైద్య శాస్త్రం అమోఘమైన అసాధారణ పురోగతిని సాధించినప్పటికీ, అంటువ్యాధుల ప్రమాదం గురించి మనం ఉదాసీన వైఖరితో ఉండరాదు. ఎందుకంటే నానాటికీ అంటువ్యాధుల వ్యాప్తి పెరిగి పోతున్నట్టు కన్పిస్తోంది’’. ఈ వ్యాప్తిని గురించి 1880లలోనే తొలిసారిగా ప్రపంచానికి వెల్లడించి, శాస్త్రబద్ధంగా వివరించిన మహ నీయుడు లూయీ పాశ్చర్. ‘‘మానవ మనుగడ పైన వైరస్ క్రిములదే ఆఖరి మాట’’ (ఇటీజ్ ది మైక్రోబ్స్ దట్ విల్ హావ్ ద లాస్ట్ వర్డ్) అని హెచ్చరించాడు పాశ్చర్. అంతటితో ఆగకుండా మానవ జీవితం అంటేనే క్రిమి, క్రిమి అంటేనే జీవితం – పెను ఉప్పెన వచ్చి పచ్చని చేలనూ, పంటలనూ ఊడ్చిపెట్టినట్టే, వైరస్ క్రిములూ మానవ జీవితాల్ని నాశనం చేస్తాయని శాస్త్రవేత్తలు చాలాకాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. అమె రికా యుద్ధోన్మాదుల చర్యల ఫలితంగా ఆఫ్రికా ఖండానికేగాక, యావత్ ప్రపంచానికే మొదటిసారిగా ఎయిడ్స్ మహమ్మారి వ్యాధి పాకిపోయి కోట్లాదిమంది జీవితాలను బుగ్గిపాలు చేసింది. ఇంతకు ముందు వచ్చిన వ్యాక్సిన్లతో ఫార్మా కంపెనీలు సాధారణ వ్యాపారం చేసినా, మానవ జీవితాలతో చెలగాటమాడే స్థితికి చేరుకోలేదు. ఎప్పుడయితే కరోనా–19 బయటపడిందో పరిస్థితి మారిపోయింది. అది సాధారణ ‘ఫ్లూ’ వ్యాధికి సంబంధించినదేగానీ మరొకటి కాదనీ, ఆ రోగ నిరోధానికి ‘ఫ్లూ’ సంబంధిత సాధారణ నివారణ చర్యలు సరిపోతాయనీ అమెరికా వైద్య శాస్త్ర పరిశోధకులూ, ఇతర నిపుణులూ మొత్తుకున్నారు. అయినా అక్కడి వైద్యరంగాన్ని శాసించడానికి అలవాటుపడిన మందుల వ్యాపార కంపెనీల ఒత్తిళ్లకు అమెరికా పాలకులు లొంగిపోయారు. అంతేకాదు, ప్రపంచవ్యాపితంగా అమె రికా ఫార్మా కంపెనీల తాఖీదులకు ‘జీ హుకుం’ అనేట్టు చేశారు. అమెరికా ఉద్దండ వైద్య శాస్త్ర నిపుణులు కోవిడ్–19 వైరస్‌కు సాధారణ ‘ఫ్లూ’కు వాడే మందులు వాడితే చాలునని పదేపదే హెచ్చరించినా అక్కడి ఫార్మా గుత్త కంపెనీలు మాత్రం మానవ రక్తం పీల్చుకోవడానికి అలవాటుపడి ప్రభుత్వం చేతులు కట్టివేశాయి. ఈలోగా ‘ఫ్లూ’ వ్యాధి నివారణకు మనం వాడుకునే ‘ఆరుకోట్ల వయల్స్’ను అమెరికాకు కారుచౌకగా మన పాలకులు ధారాదత్తం చేసి, ఆ వయల్స్ దేశ ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారని మరచిపోరాదు. ఇక అమెరికా విద్యే మనకూ అలవాటయింది. అమెరికా ఫార్మా గుత్త కంపెనీలే ఇక్కడి పాలకులకూ అనుసరణీ యమయ్యాయి. చివరికి దేశీయ కంపెనీలు అనుకున్న భారత్ బయోటెక్ లాంటి సంస్థలు కోవిడ్–19 నిరోధానికి తయారు చేశామని చెప్పిన వ్యాక్సిన్లను విడుదల చేసేముందు ‘మూడు దశల పరీక్షల ఫలితాలను మా ముందు ఉంచం’డని శాస్త్రవేత్తలు కోరినా ఈరోజుదాకా ఆ మూడు పరీక్షల అంతిమ ఫలితాలను కంపెనీ సమ ర్పించకపోవడం వైద్య పరిశోధనా రంగంలో ఒక శాశ్వత మచ్చగా నిలిచిపోయింది. అయినా దేశ పాలకులు ఏ కారణం చేతనో ఆ అసమగ్ర పరిశోధననే అందలమెక్కించి దేశ, విదేశాలకు ఆ కంపెనీ మందుల్నే ఎగుమతి చేస్తున్నారు. ఈ దశలో బయోటెక్ కంపెనీ మోసం చేసిందన్న ఆరోపణపై కొనుగోళ్లు నిల్పివేసి, బ్రెజిల్ ప్రభుత్వం దావాలకు దిగడం మరో అవమానకర ఘట్టం. బయటేమో మన భాగోతం అలా ఉంది. దేశంలోనేమో గుజ రాత్లో కూడా కోవిడ్ మరణాల సంఖ్య తక్కువేమీ లేదు. అయినా ప్రతిపక్షాల ప్రభుత్వాలున్న మూడు దక్షిణాది రాష్ట్రాలు, ఒక ఢిల్లీ (కేజ్రీవాల్) ప్రభుత్వాన్ని మాత్రమే కోవిడ్ విజృంభణ, కోవిడ్ మరణాలు పెరుగుతున్నాయన్న పేరిట కేంద్ర పాలకులు ‘యాగీ’కి దిగడం ఆశ్చర్యకరం! ఏతావాతా ప్రస్తుతం కరోనా ఆధారిత ‘గుంపు చింపుల’న్నీ చిత్రమైన దశకు చేరుకున్నాయి. ఎటూ నిర్ధాణగా తేల్చలేని ‘కోవిడ్–19’ ప్రభావం గురించీ, రోజుకో కొత్త కోవిడ్ వేరియంట్ బయటపడుతోందని ఫార్మా కంపెనీలు చెప్పే మాటలు... వైద్యుల్నేగాదు, ప్రజలనూ తీవ్ర గందరగోళంలోకి నెడుతున్నాయి. ఫలితంగా గొప్పగొప్ప వైద్యులు సహితం నిర్దిష్ట సలహాలు ఇవ్వగల స్థితిలో లేక ‘మాస్కు’లు పెట్టుకుని తిరగమని సలహా ఇవ్వడానికి మించి నిర్దిష్ట దృక్పథానికి ఇప్పటికీ రాలేకపోతున్నారు. ఈ ధోరణి సామాన్య ప్రజలను మింగలేని కక్కలేని పరిస్థితుల్లోకి నెడుతోంది. చివరికి ఈ రకరకాల ‘వేరియంట్లు’ స్వరూప స్వభావాలను కూడా చివరికి వివరించి చెబుతున్నది డాక్టర్లుగానీ, వైద్య నిపుణులు గానీ కాదు. లాభసాటి వ్యాపారంలో ఉన్న బడా ఫార్మా కంపెనీలు, వారి కాంటాక్టులో ఉన్న కొందరు వైద్యులూ, ఏజెంట్లూ మాత్రమేనని అనుమానాలు తీవ్రతరమవుతున్నాయి. ఇంతకూ అసలు ‘కరోనా’, దాని తాలూకూ వేరియంట్ల కథ ‘కంచి’కి ఎప్పుడు చేరుతుంది? వైద్యులు, రోగులు ‘ఇళ్ల’కెప్పుడు చేరతారు?! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు
సాక్షి, అమరావతి: తుపాను ప్రభావిత గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా పంచాయతీరాజ్ శాఖ చర్యలు చేపట్టింది. సర్పంచ్‌లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు తదితరులతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లోని 4,850 మంది పంచాయతీరాజ్ సిబ్బంది ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వీటిపై తగిన సూచనలు చేసేందుకు విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల జెడ్పీ సీఈవోలు, డీపీవోలతో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ సోమవారం టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించేందుకు బ్లీచింగ్ పౌడర్, సోడియం క్లోరైడ్ సిద్ధం చేశామని చెప్పారు. పూర్తిగా క్లోరినేషన్ చేసిన తర్వాతే తాగునీటి సరఫరా చేస్తున్నట్టు వివరించారు. -
ఏపీ: అంటువ్యాధుల జాబితాలో ‘బ్లాక్ ఫంగస్’
సాక్షి, అమరావతి: బ్లాక్ ఫంగస్ (మ్యుకర్ మైకోసిస్) జబ్బును అంటువ్యాధుల పరిధిలోకి చేర్చుతూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ గురువారం ఉత్తర్వులిచ్చారు. ఎపిడెమిక్ డిసీజస్ యాక్ట్ 1897 ప్రకారం దీన్ని ఈ జాబితాలో చేర్చినట్లు పేర్కొన్నారు. కోవిడ్ బారిన పడిన వారు, వ్యాధి నిరోధకత తగ్గిన వారిలోనూ ఇది ఎక్కువగా వస్తోందని, ఏ ఆస్పత్రిలో కేసులు నమోదైనా వెంటనే ప్రభుత్వానికి సమాచారమివ్వాలని స్పష్టం చేశారు. తాజాగా ఏపీ ఎపిడెమిక్ డిసీజెస్ రెగ్యులేషన్ 2021 పరిధిలోకి తెచ్చినట్లు తెలిపారు. బ్లాక్ ఫంగస్ అనుమానితులను తక్షణమే ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేర్చుకుని వైద్యం అందించాలని ఆదేశించారు. చదవండి: AP Budget 2021: ఆరోగ్యశ్రీ పథకానికి రూ.2,258 కోట్లు Ap Budget 2021: సర్వ హితం -
ఆందోళనకరంగా బ్లాక్ ఫంగస్!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా విజృంభణతో ఇప్పటికే తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న ఆరోగ్య వ్యవస్థకు మరో వ్యాధి సవాల్ విసురుతోంది. కరోనా నుంచి కోలుకున్న రోగుల్లో ఎక్కువగా కనపడుతున్న మ్యూకోర్మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) ఇప్పుడు దేశంలో రోజురోజుకీ పెరుగుతోంది. ఉత్తర్‌ప్రదేశ్, ఢిల్లీ, రాజస్తాన్, మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తరాఖండ్, హరియాణాలతో పాటు మరికొన్ని ఇతర రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ బారినపడిన వారిని ఇప్పటికే గుర్తించారు. పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసుల దృష్ట్యా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, రాజస్తాన్, హరియాణా, ఒడిశా రాష్ట్రాలు తమ రాష్ట్రంలో దీనిని అంటువ్యాధుల చట్టం క్రింద గుర్తించదగ్గ వ్యాధిగా ప్రకటించాయి. ఈ వ్యాధికి సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు ఒక అడ్వైజరీని జారీ చేసింది. అనేక రాష్ట్రాల్లో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసుల దృష్ట్యా ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్– 1897 ప్రకారం దీనిని రాష్ట్రంలో గుర్తించదగిన వ్యాధిగా (నోటిఫైయబుల్ డిసీజ్) వర్గీకరించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. కోవిడ్ రోగుల్లో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తోందని, మరణాలను పెంచుతోందని తెలిపింది. ‘మ్యూకోర్మైకోసిస్ రూపంలో కొత్త సవాల్ ఎదురవుతోంది. పలు రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. స్టెరాయిడ్లు ఉపయోగించిన, మధుమేహం నియంత్రణలో లేని కోవిడ్–19 రోగుల్లో ఇది ప్రధానంగా కనిపిస్తోంది‘ ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొంది. అంతేగాక బ్లాక్ ఫంగస్ కేసులను నిర్ధారించిన వెంటనే ఆరోగ్యశాఖకు తప్పనిసరిగా రిపోర్ట్ చేసేలా అన్ని హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలకు సూచించారు. వీటితోపాటు బ్లాక్‌ఫంగస్‌ను గుర్తించేందుకు, చికిత్స చేసేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్ గతంలో విడుదల చేసిన గైడ్‌లైన్స్ తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. రోగనిరోధక శక్తి బలహీనపడితేనే ముప్పు మ్యూకోర్మైసెట్స్గా పిలిచే శీలింధ్రాల (ఫంగస్) కారణంగా బ్లాక్ ఫంగస్ వస్తుంది. మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఈ ఫంగస్ సాధారణంగానే ఉండేదే. మట్టిలో, కుళ్లిపోతున్న ఆకుల్లో, పేడకుప్పల్లో, కుళ్లుతున్న జీవవ్యర్థాల్లో ఇది ఉంటుంది. మామూలు పరిస్థితుల్లో మన రోగనిరోధక శక్తి దీన్ని సమర్థంగా అడ్డుకుంటుంది. అయితే కరోనా సోకిన వారిలో డెక్సామెథాసోన్ లాంటి స్టెరాయిడ్లు వాడటం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అలాగే షుగర్ నియంత్రణలో లేని వారిలో, సుదీర్ఘకాలం ఐసీయూలో ఉన్న కోవిడ్ రోగులకు బ్లాక్ ఫంగస్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఐసీయూలో వెంటిలేటర్ల ద్వారా ఆక్సిజన్ అందించినపుడు తేమ కారణంగా కూడా బ్లాక్ ఫంగస్ సోకే ప్రమాదం ఉంటుంది. నొసటి భాగంలో, ముక్కు, దవడ, కళ్ల భాగంలో ఫంగస్ పేరకుపోయి స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది. కళ్లకు, ఊపిరితిత్తులకు... కొన్నిసార్లు మెదడుకు కూడా ఇది పాకుతుంది. వ్యాధి ముదిరితే ముక్కు పైభాగంలో నల్లబారడం, చూపు మసకబారడం, లేదా రెండుగా కనపడటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గినపుడు రక్తం పడటం జరుగుతుంది. కంటిచూపును కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. మహారాష్ట్రలో ప్రమాద ఘంటికలు దేశంలో అత్యధికంగా కరోనాతో ప్రభావితమైన మహారాష్ట్రలో బ్లాక్ ఫంగస్ ప్రభావం సైతం పెరుగుతోంది. ఇప్పటివరకు సుమారు 1,500 మందిలో బ్లాక్ ఫంగస్‌ను గుర్తించగా అందులో 90 మంది ప్రాణాలు కోల్పోయారని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో తెలిపారు. బ్లాక్ ఫంగస్ నియంత్రణ అనేది ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యాతాంశమని, అందువల్ల చికిత్సలో ఉయోగించే ఔషధాలను సరఫరా చేయాలని ఆయన ప్రధానిని కోరారు. అంతేగాక బ్లాక్ ఫంగస్‌ను గుర్తించిన 1,500 మందిలో సుమారు 500 మంది కోలుకున్నారని, సుమారు 850 మందికి చికిత్స కొనసాగుతోందని రాజేష్ తోపే పేర్కొన్నారు. ► రాజస్తాన్: రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కారణంగా ఇప్పటివరకు 400 మంది కంటిచూపు కోల్పోయారు. కేవలం జైపూర్‌లోనే 148 మందికి సోకింది. జోధ్‌పూర్‌లో 100 కేసులు నమోదయ్యాయి. 30 కేసులు బికనేర్ నుంచి, మిగిలినవి అజ్మీర్, కోటా, ఉదయపూర్ నుండి రావడంతో బ్లాక్ ఫంగస్‌ను అంటువ్యాధుల చట్టం క్రింద గుర్తించదగ్గ వ్యాధిగా రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. ► ఢిల్లీ: దేశ రాజధానిలో బ్లాక్ ఫంగస్ రోగుల సంఖ్య 300 దాటింది. చికిత్సకు వాడే ఆంఫోటెరిసిన్–బి ఇంజక్షన్లకు తీవ్రకొరతను ఎదుర్కొంటోంది. ఢిల్లీ ఎయిమ్స్‌లో గత ఒక్కవారంలోనే 75–80మంది రోగులు చేరారు. వీరిలో 30 మంది పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. దేశ రాజధానిలో బ్లాక్ ఫంగస్ రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మూడు ఆసుపత్రుల్లో బ్లాక్ ఫంగస్ చికిత్సకు ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురువారం ప్రకటించారు. ► మధ్యప్రదేశ్: గత 27 రోజుల్లోనే 239 మంది బ్లాక్ ఫంగస్ రోగులు భోపాల్‌కు చేరుకున్నారు. చికిత్స సమయంలో 10 మంది రోగులు మరణించగా, 174 మంది ఆసుపత్రులలో చేరారు. వీరిలో 129 మంది రోగులకు శస్త్రచికిత్స జరిగింది. అయితే, ప్రభుత్వం భోపాల్‌లో 68 మంది రోగులు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 585 మంది రోగులను గుర్తించారు. ► హరియాణా: రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ రోగులు 316 మంది ఉన్నారు. దీనిని అంటువ్యాధుల చట్టం కింద గుర్తించదగ్గ వ్యాధిగా ప్రకటించిన మొదటి రాష్ట్రం హరియాణా. ► ఛత్తీస్‌గఢ్: రాష్ట్రంలో బ్లాక్‌ఫంగస్ రోగుల సంఖ్య 100కి చేరుకుంది. ఆస్పత్రుల్లో 92 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ఎయిమ్స్‌లో అత్యధికంగా 69 మంది రోగులు ఉండగా, 19 మందికి ఆపరేషన్లు పూర్తయ్యాయి. వెలుగులోకి వైట్ ఫంగస్ బిహార్ రాజధాని పట్నాలో ఇప్పుడు వైట్ ఫంగస్ (కాన్డిడోసిస్) వెలుగులోకి వచ్చింది. బ్లాక్ ఫంగస్ కంటే ప్రమాదకరమైన వైట్ ఫంగస్ సంక్రమించిన నలుగురు రోగులను బిహార్‌లో గుర్తించారు. వైట్ ఫంగస్ ఊపిరితిత్తులతో పాటు, చర్మం, గోర్లు, నోటి లోపలి భాగాలు, కడుపు, మూత్రపిండాలు, జననేంద్రియాలు, మెదడుకు సోకుతుంది. వ్యాధి సోకిన నలుగురిలో కోవిడ్ రోగుల లక్షణాలే కనపడినా పరీక్షల్లో అది వైట్ ఫంగస్‌గా తేలిందని (వీరికి కరోనా లేదు) పాట్నా మెడికల్ కాలేజీ మైక్రోబయాలజీ చీఫ్ డాక్టర్ ఎస్.ఎన్.సింగ్ వెల్లడించారు. ఫంగస్ నిరోధక మందులు వాడితే వీరు కోలుకున్నారని తెలిపారు. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు, దీర్ఘకాలికంగా స్టెరాయిడ్లు వాడుతున్న వారికి దీనివల్ల ముప్పు ఎక్కువని వెల్లడించారు. ఆంఫోటెరిసిన్–బి ఉత్పత్తికి అనుమతులివ్వండి: ఐఎంఏ బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే ఆంఫోటెరిసిన్– బి ఇంజెక్షన్ల ఉత్పత్తికి అర్హత కలిగిన ఫార్మా సంస్థలను అనుమతించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రధాని మోదీని కోరింది. ఈ ఔషధానికి తీవ్ర కొరత ఉందని తెలిపింది. ప్రస్తుతం దేశంలో ఒకే ఒక అమెరికా కంపెనీకి ‘ఆంఫోటెరిసిన్–బి’ని దిగుమతి చేసుకొనే లైసెన్స్ ఉందని ప్రధాని దృష్టికి తీసుకువచ్చింది. గత ఏడాది డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) పలు ఫార్మా కంపెనీలకు ఆంఫోటెరిసిన్– బి ఉత్పత్తికి అనుమతులిచ్చి తర్వాత ఉపసంహరించుకుందని, ఇప్పుడు పరిస్థితి తీవ్రత దృష్ట్యా ప్రధాని వ్యక్తిగతంగా జోక్యం చేసుకొని ఫార్మా కంపెనీలకు తాత్కాలిక అనుమతులిచ్చేలా డీజీసీఐకి సూచించాలని విజ్ఞప్తి చేసింది. -
అంటు రోగాలకు 1.5 కోట్ల మంది బలి
సాక్షి, న్యూఢిల్లీ: అగ్ర దేశం అమెరికాతో సహా ప్రపంచ దేశాలను భయాందోళనలకు గురి చేస్తున్న ప్రాణాంతక కరోనా మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య భారత్‌లో కోటి దాటగా, మృతుల సంఖ్య 1.45 లక్షలు దాటింది. గతంలో ప్రపంచ దేశాలపై, ముఖ్యంగా భారత్‌పై పలు మహామ్మారీలు దాడి చేయగా మరణించిన వారి సంఖ్యను గుర్తు చేసుకుంటే అసలు కరోనా వైరస్‌ను మహమ్మారి అనలేం. 1817 నుంచి 1920 మధ్య కలరా, ప్లేగ్, మశూచి, ఇన్‌ఫ్లూయెంజా (విషపడిశము) విజంభించడంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఏడు కోట్ల మంది మరణించగా, ఒక్క భారత దేశంలో కోటీ యాభై లక్షల మందికి పైగా మరణించారు. (చదవండి: ఫైజర్ వ్యాక్సిన్ తీసుకుంటే అంతేనట!) మలేరియా, టీబీల కూడా భారత్‌లో లక్షలాది మంది మరణించినప్పటికీ అవి మహమ్మారిగా విస్తరించలేదు. నాడు చైనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా సైనోఫోబియాను సష్టించగా, భారత్‌లో విజంభించిన కలరా ప్రపంచ దేశాలను భయపెట్టింది. దాంతో విదేశీయులందరు కొంతకాలం భారత్‌ను, భారతీయులకు దూరం పెట్టారు. అప్పుడు ఈ రెండు అంటు వ్యాధులకు కోల్‌కతా కేంద్రంగా మారింది. హరిద్వార్‌కు వెళ్లే హిందూ యాత్రికులు, మక్కాకు వెళ్లే ముస్లిం యాత్రకుల ద్వారా టీబీ, మలేరియా వ్యాపిస్తుందన్న ప్రచారమూ జరిగింది. ఆ రెండు అంటువ్యాధులను ‘ఆసియాటిక్ డిసీస్’ అని పాశ్చాత్య దేశాలు పిలిచాయి. భారత్‌లో పారిశుద్ధ్య పరిస్థితులను మెరగు పర్చాలంటూ నాటి బ్రిటీష్ పాలకులపై ఒత్తిడి కూడా తెచ్చింది. (చదవండి: వ్యాక్సిన్‌పై వాస్తవాలేంటి?) ప్లేగ్ కారణంగా భారత్‌లో పేదవాళ్లు తీవ్రంగా దెబ్బతిన్నారు. వారి వల్ల వ్యాధి విస్తరిస్తుందన్న దుష్ప్రచారం వల్ల ముంబై, కోల్‌కతాతోపాటు పలు నగరాల్లో పేదలపై దాడులు జరిగాయి. నాటి ముంబై ప్రభుత్వం ఈ దుష్ప్రచారాన్ని నమ్మి 1896లో పేదవారిని మురికి వాడల నుంచి బయటకు రాకుండా కఠిన నిబంధనలు విధించింది. నాడు బీజాపూర్ నగర ప్రజలంతా సాయంద్రం వేళ నగరాన్ని వీడి పొలాలకు వెళ్లే వారని ఓ బ్రిటీష్ డాక్టర్ రాసుకున్నారు. సామూహికంగా ఎలుకల మరణించడంతో ప్లేగ్ వ్యాది పేద ప్రజలకు సోకుతుందని, వారి నుంచి ఇతరులకు విస్తరిస్తుందన్నది నాటి ప్రచారం. నోటీలోని శ్లేష్మం ద్వారానే ఒకరి నుంచి ఒకరికి ప్లేగ్ వస్తోందని ఆధునిక సైన్స్ చెబుతోంది 1918–1920 మధ్యకాలంలో వచ్చిన స్పానిష్ ఫ్లూ వల్ల ప్రపంచవ్యాప్తంగా మతుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఫ్లూ వల్ల రెండు కోట్ల మంది మరణించారు. 1918లో దేశ జనాభాలో 40 శాతం శాతం మందికి ఈ ఫ్లూ సోకిందని, వేలాది మంది మరణించారని గణాంకాలు చెబుతున్నా 1920 నాటికల్లా భారత్‌లో ఈ వ్యాధి బాగా అదుపులోకి వచ్చింది. ఇలాంటి విశేషాలెన్నో తెలసుకోవాలంటే చిన్మయ్ తుంబే రాసిన ‘ది ఏజ్ ఆఫ్ పాండెమిక్స్’ చదవాల్సిందే. -
‘కరోనా’ శాశ్వతంగా ఉండిపోవచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ: ‘కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న, ప్రజలు చిత్తశుద్ధితో భౌతిక దూరం పాటిస్తున్న దేశాల్లో మినహా ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఇప్పటికీ విజంభిస్తోంది. కరోనాను కచ్చితంగా కట్టడి చేసే వ్యాక్సిన్ ఇప్పటికీ ప్రజలకు అందుబాటులో రాకపోవడంతో ప్రజల్లో ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఎలా, ఎప్పుడు తగ్గుతుందనే కలవరం వారిని వెంటాడుతూనే ఉంది. లాక్డౌన్ల వల్ల ప్రయోజనం లేదని, వాటి వల్ల మేలు కన్నా కీడే ఎక్కువని కొంత మంది నిపుణలు వాదిస్తున్నారు. నిత్య జీవన పోరాటంలో భాగంగానే కరోనాను సామాజికంగా ముఖాముఖి ఎదుర్కోవడమే పరిష్కారమని వారు నిపుణులు సూచిస్తున్నారు. ముసలి, ముతక, వ్యాధులతో బాధ పడుతున్నవారిని మాత్రమే ఇళ్లకు పరిమితం చేసి మిగతా వారు సామాజికంగా కరోనా ఎదుర్కోవాలని, తద్వారా ‘హెర్డ్ ఇమ్యునిటీ (సామూహిక రోగ నిరోధక శక్తి) అభివద్ధి చెందుతోందని వారి వాదనలో నిజం లేకపోలేదు. రోగ నిరోధక శక్తి అందరిలో పెరగుతుందన్న గ్యారంటీ లేదు కనుక వ్యాక్సిన్లు కూడా అవసరమే. అవి ప్రజలకు అందుబాటులోకి వచ్చే వరకు చేతులు ముడుచుకొని కూర్చోవడం కుదరదు కనుక సామూహికంగానో, సామాజికంగానో కరోనాతో పోరాడక తప్పదు. (చదవంవడి: కోవిడ్ కట్టడిలో పాక్ బెటర్: రాహుల్) ప్రజల్లో సామూహికంగా రోగ నిరోధక శక్తి పెరగడం లేదా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినంత మాత్రాన కరోనా వైరస్ కనుమరుగవుతుందని చెప్పలేం. ఎన్ని వ్యాక్సిన్లు వచ్చినా, ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెరిగినా నేటికి తట్టు, అమ్మవారు లాంటి బాల్యంలో వచ్చే రోగాలు, వయస్సులో వచ్చే సుఖరోగాలు, దోమల వల్ల వచ్చే మలేరియా లాంటి అంటు రోగాలు, వైరస్ వల్ల వచ్చే ఇన్‌ఫ్లూయెంజాలు ఇప్పటికీ వస్తున్న విషయం తెల్సిందే. వాటిలాగే కరోనా శాశ్వతంగా పోయే అవకాశం లేదు. వాతావరణ పరిస్థితులను బట్టి ఇతర అంటు రోగాల లాగానే కరోనా కూడా ఒక్కొక్కప్పుడు ఒక్కో చోట తక్కువ స్థాయిలోనో, తీవ్ర స్థాయిలోనో విజంభించవచ్చు. వ్యాక్సిన్లు లేదా స్వతహాగా ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెరగడం వల్ల మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది’....నెదర్లాండ్స్‌లోని యుట్రెక్ట్ యూనివర్శిటీ థియారిటికల్ ఎపిడిమియాలోజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తోన్న హాన్స్ ఈస్టర్‌బీక్ వ్యక్తం చేసిన అభిప్రాయాలివి. (చదవండి: చైనా వ్యాక్సిన్ పరీక్ష : సానుకూల ఫలితాలు) -
పునరావాసమే సవాల్!
తిరువనంతపురం/కొచ్చి: వర్షాలు తెరిపివ్వడంతో కేరళలో వరద ఉధృతి తగ్గినా కొత్త సమస్యలు మొదలవుతున్నాయి. లక్షల మంది నిరాశ్రయులకు పునరావాస కేంద్రాల్లో కనీస వసతులు కల్పించడం సవాల్‌గా మారింది. తిండి, నీరు, తాత్కాలిక ఆశ్రయం కల్పించడంతోపాటు అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవడం ప్రభుత్వం, అధికారుల ముందు అతిపెద్ద సమస్యగా నిలిచింది. వరదల కారణంగా మృతుల సంఖ్య 376కు చేరింది. 5,645 పునరావాస కేంద్రాల్లో 7.24 లక్షల మంది నిరాశ్రయులున్నారు. మరోవైపు, పలుప్రాంతాల్లో వరద ఉధృతి తగ్గకపోవడంతో నీటిలో చిక్కుకున్న వారిని కాపాడే కార్యక్రమాలు సాగుతున్నాయని సదరన్ కమాండ్ చీఫ్ ఆఫ్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ డీఆర్ సోనీ పేర్కొన్నారు. డ్రోన్ల ద్వారా ఇంకెవరు చిక్కుకుని ఉన్నారనే విషయం తెలుసుకుని.. ఆయా ప్రాంతాలకు చేరుకుంటున్నామని ఆయన వెల్లడించారు. ‘అందరినీ కాపాడి పూర్తి పునరావాసం కల్పించడంపైనే దృష్టిపెట్టాం’ అని ఆయన తెలిపారు. సహాయక బృందాలకు అవసరమైన కనీస సదుపాయాలు లేకపోవడం ఇబ్బందికరంగా మారిందని ఆయన పేర్కొన్నారు. రెస్క్యూ ఆపరేషన్లు దాదాపుగా ముగిసినట్లేనని వైస్ అడ్మిరల్ గిరీశ్ లుథారా పేర్కొన్నారు. అక్కడక్కడ చిక్కుకుని ఉన్నవారిని గుర్తించామని వారిని కాపాడేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సహాయక చర్యలు ముమ్మరం ఇళ్లపైకప్పుల పైన, మిద్దెల పైన నిలబడి సాయం కోసం అర్థిస్తున్నారు. ఎవరైనా రాకపోతారా.. కాపాడకపోతారా అనే ఆశతో తిండితిప్పల్లేకుండా ఆశగా ఎదురుచూస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని శాటిలైట్ ఫోన్ల ద్వారా చేరుకుంటున్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. మరోవైపు, ఎర్నాకులం జిల్లా పరూర్‌లో ఆదివారం రాత్రి ఆరు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే వీడీ సతీశన్ స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో వరదల్లో చిక్కుకున్న దాదాపు అందరినీ క్షేమంగా పునరావాస కేంద్రాలకు పంపించినట్లు ఆయన వెల్లడించారు. వరద తగ్గిన ప్రాంతాల్లో ఇళ్లలో పేరుకుపోయిన బురద, రాళ్లురప్పలు తొలగించే పనులు కూడా ఊపందుకున్నాయి. ఈ ప్రాంతాల్లో స్వచ్ఛమైన తాగునీటిని అందించడంతోపాటు విద్యుత్ సదుపాయాన్ని పునరుద్ధరిస్తున్నారు. నేవల్ ఎయిర్‌బేస్, కొచ్చి పోర్టు ద్వారా.. కొచ్చి నేవల్ ఎయిర్‌బేస్‌లో వాణిజ్య విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. బెంగళూరునుంచి సరుకులతో వచ్చిన విమానం సోమవారం ఉదయం ఎయిర్‌బేస్‌లో ల్యాండైంది. కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆగస్టు 26వరకు విమానాల రాకపోకలకు అవకాశం లేకపోవడంతో.. కేంద్రంతోపాటు వివిధ రాష్ట్రాలనుంచి సహాయసామాగ్రి కోసం ఈ ఎయిర్‌బేస్‌నే వినియోగించనున్నారు. మరోవైపు, కేరళ పోర్టుకు కూడా వివిధ రాష్ట్రాలనుంచి సముద్రమార్గం ద్వారా సహాయ సామగ్రి రవాణా మొదలైంది. ముంబై నుంచి 800 టన్నుల స్వచ్ఛమైన నీరు, 18 టన్నుల సరుకుతో నేవల్షిప్ ఐఎన్ఎస్ దీపక్ చేరుకుందని కొచ్చి పోర్టు ట్రస్టు అధికారులు తెలిపారు. పోర్టునుంచే పునరావాస కేంద్రాలకు ట్రక్కుల్లో ఈ సామగ్రిని పంపిస్తున్నారు. మరోవైపు, కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మరో భారీ సరుకుల నౌక వల్లార్‌పదం పోర్టుకు చేరుకుంది. మరోవైపు, ముంబై నుంచి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)కు చెందిన భారీ నౌకలో 50వేల మెట్రిక్ టన్నుల ఇంధనం కూడా కొచ్చి పోర్టుకు చేరుకుంది. సహాయక కార్యక్రమాలు, ట్రక్కుల కోసం భారీగా ఇంధనం అవసరమైన నేపథ్యంలో బీపీసీఎల్ ఈ నౌకను పంపించింది. అటు, తిరువనంతపురం, ఎర్నాకులం మధ్య రైలు సేవలను పునరుద్ధరిస్తున్నారు. ట్రయల్‌రన్ తర్వాత సహాయకసామగ్రిని తరలించేందుకు ఈ ట్రాక్ కీలకంగా ఉపయోగపడుతుంది. మరోవైపు, తిరువనంతపురం నుంచి చెన్నై, ముంబై, బెంగళూరు, ఢిల్లీలకు రైలు సేవలు పాక్షికంగా ప్రారంభమయ్యాయి. సాయం అందుతోంది! వరదకోరల్లో చిక్కుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళకు అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రూ.3కోట్లు, అస్సాం ప్రభుత్వం రూ.3కోట్ల సాయం అందిస్తున్నట్లు ప్రకటించాయి. కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ మొత్తాన్ని ఇవ్వనున్నట్లు ఆయా ప్రభుత్వాలు వెల్లడించాయి. అటు, రూ.10 కోట్ల సాయం అందించిన ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం 2,500 టన్నుల బియ్యాన్ని ప్రత్యేక రైల్లో కేరళకు పంపించింది. కేంద్ర ప్రభుత్వం కూడా 100 మెట్రిక్ టన్నుల ధాన్యాలు, 52 మెట్రిక్ టన్నుల అత్యవసర మందులను సోమవారం కేరళకు పంపించింది. దీంతోపాటుగా 2,600 మెగావాట్ల విద్యుత్‌ను అందించేందుకు అంగీకారం తెలిపింది. జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ (ఎన్సీఎమ్సీ) కేరళలో వరద పరిస్థితి, అందుతున్న సాయంపై సమీక్ష నిర్వహించింది. తలచుకుంటేనే భయమేస్తోంది: బాధితులు అటు పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారు కూడా భవిష్యత్తును తలచుకుని భయభ్రాంతులకు గురవుతున్నారు. తిరిగి ఇళ్లకు వెళ్లిన తర్వాత అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తలచుకుంటేనే ఒళ్లుగగుర్పొడుస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ వరదలకు ముందుపరిస్థితి నెలకొనడం ఎలాగనేదే పెద్ద సమస్యంటున్నారు. ‘మళ్లీ ఇళ్లకు వెళ్లాక మా పరిస్థితేంటో అర్థం కావడం లేదు. సర్వం నష్టపోయాం. మా ఇళ్లను కట్టుకునేందుకు తగినంత సాయంకావాలి’ అని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని పునరావాస కేంద్రాల్లోనూ పరిస్థితి ఒకేలా లేదు. చాలాచోట్ల కనీస వసతులు కూడా ఇంకా ఏర్పాటుచేయలేదు. ఎర్నాకులంలోని ఓ కేంద్రంలో ఓ చిన్నారికి తట్టు (చికెన్ పాక్స్) సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో వెంటనే ఆ చిన్నారికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రత్యేక ఏర్పాట్లతో చికిత్సనందిస్తున్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా చల్లేందుకు అవసరమైన బ్లీచింగ్ పౌడర్ కొరత కారణంగా మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. రండి.. కాపాడుకుందాం: కేంద్రం పిలుపు వరదలతో అతలాకుతలమైన కేరళ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలు, బడా కంపెనీలను కేంద్ర ప్రభుత్వం కోరింది. ‘విషాదకరమైన మానవత్వ సంక్షోభం’లో ఉన్న కేరళను ఆదుకునేందుకు తోచినంత సాయం చేయాలని కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు విజ్ఞప్తి చేశారు. సాయం విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేయదలచుకోవడం లేదని.. సహాయం చేయడం, చేసేవారిని కలుపుకుని వెళ్లడమే తమ లక్ష్యమన్నారు. ఇందుకోసం పారిశ్రామికవేత్తలు, సీఐఐ, ఫిక్కీ వంటి వ్యాపార సంస్థలు తదితరులతో అధికారులు మాట్లాడుతున్నారన్నారు. అటు కేరళనుంచి వివిధ ప్రాంతాలకు విమానచార్జీలు పెంచుతున్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై మంత్రి స్పందిస్తూ.. విమానయాన కంపెనీలు మానవతాధృక్పథంతో వ్యవహరించాలన్నారు. అటు, కేరళ సాధారణస్థితికి చేరుకునేందుకు వందలు, వేల సంఖ్యలో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు అవసరమని మరో కేంద్ర మంత్రి కేజే అల్ఫోన్స్ అన్నారు. జాతీయవిపత్తుగా గుర్తించబోం: కేంద్రం న్యూఢిల్లీ: కేరళలో వరద విలయాన్ని తీవ్రమైన విపత్తుగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ‘కేరళలో వరదల తీవ్రత, కొండచరియలు విరిగిపడిన ఘటనలను, జరిగిన అపార నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని తీవ్రమైన ప్రకృతి విపత్తుగా గుర్తించాం’ అని కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ప్రకృతి ప్రకోపాన్ని అరుదైన/తీవ్రమైన విపత్తుగా గుర్తించినపుడు రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయస్థాయిలో సహాయం అందుతుంది. ఎన్డీఆర్ఎఫ్ నిధి నుంచి అదనపు సాయంపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. కేంద్రం, రాష్ట్రాల మధ్య 3:1 నిష్పత్తితో విపత్తు సహాయ నిధి (సీఆర్ఎఫ్)ను ఏర్పాటుచేస్తారు. ఈ నిధిలో డబ్బులు తగ్గినపుడు నేషనల్ కెలామిటీ కంటిన్జెన్సీఫండ్ (100%కేంద్ర నిధులు) నుంచి సాయం అందిస్తారు. తీవ్రమైన విపత్తు ప్రకటించిన ప్రాంతాల్లో బాధితుల రుణాల చెల్లింపులో వెసులుబాటు, కొత్త రుణాలు ఇచ్చే అవకాశాన్ని చూస్తారు. కేరళ వరదలను జాతీయ విపత్తుగా గుర్తించబోమని కేరళ హైకోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం ఈ విషయం తెలిపింది. ‘కేరళ విపత్తు తీవ్రమైనది. జాతీయ విపత్తు నిర్వహణ నిబంధనల ఆధారంగా దీన్ని లెవల్ 3 విపత్తుగా గుర్తించాం. ఎంత పెద్ద విపత్తు ఎదురైనా ఈ నిబంధనల ఆధారంగానే కేటగిరీలు నిర్ణయిస్తాం. కేరళ వరదల విలయాన్ని జాతీయ విపత్తుగా గుర్తించబోవడం లేదు’ అని పేర్కొంది. తగ్గిన కర్ణాటక వరదలు కర్ణాటకలోని కొడగు జిల్లాలో నాలుగురోజులుగా బీభత్సం సృష్టించిన వరద తగ్గుముఖం పట్టింది. జిల్లాలోని అన్ని హోటళ్లు, లాడ్జీల్లో పర్యాటకుల బుకింగ్స్‌ను రద్దుచేసి నిరాశ్రయులకు గదులు కేటాయించారు. వరదలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, సైన్యం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి ఒక్కో కుటుంబానికి రూ.3,800 చొప్పున మధ్యంతర సహాయం అందించనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు. అలువా జిల్లాలో అంటువ్యాధులు సోకకుండా మందుల పంపిణీ కొచ్చి ఆడిటోరియంలో బాధితుల కోసం సహాయ సామగ్రిని సిద్ధం చేస్తున్న వాలంటీర్లు -
పాతర్లపల్లికి జ్వరమొచ్చింది..!
ఇల్లందకుంట (హుజూరాబాద్): అదో మారుమూల గ్రామం. అక్కడ సుమారు 450 కుటుంబాలు, 1,500 మంది జనాభా ఉంటారు. అలాంటి గ్రామంలో ఇప్పుడు 200 మంది తీవ్రమైన విషజ్వరాలతో బాధపడుతున్నారు. 20 రోజులుగా గ్రామాన్ని జ్వరాలు పీడిస్తున్నాయి. జ్వరాల బారిన పడి 15 రోజుల వ్యవధిలోనే నలుగురు మృతిచెందారు. వీరిలో ఒకరు డెంగీ లక్షణాలతో చనిపోయినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారు. మిగిలిన వారంతా వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తమకు కూడా జ్వరాలు ఎక్కడ వస్తాయోనన్న భయంతో అనేకమంది గ్రామస్తులు ఊరునే ఖాళీ చేసి వెళ్లిపోయారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలోని పాతర్లపల్లిలో ఊరుఊరంతా విషజ్వరాలతో అల్లాడుతున్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా పరిశుభ్రత లోపించింది. చెత్తాచెదారం పేరుకుపోయింది. దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. తాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మురికికాలువల్లో దోమల లార్వా పెరిగిపోయింది. దీనికితోడు భారీగా కురుస్తున్న వర్షాలకు జంతు కళేబరాలు కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. ఫలితంగా అంటువ్యాధులు ప్రబలి.. జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 15 రోజుల్లో నలుగురి దుర్మరణం గ్రామంలో కొద్దిరోజులుగా 200 మందికి పైగా తీవ్రమైన విషజ్వరాలతో బాధపడుతున్నారు. పదిహేను రోజుల క్రితం గ్రామానికి చెందిన రామ్ లచ్చమ్మ, కోడారి రాజవీరు, బాలమ్మ చనిపోయారు. తాజాగా అనుమండ్ల లక్ష్మి అనే మహిళకు విçషజ్వరం రావడంతో ఆమెను కరీంనగర్‌లోని చల్మెడ ఆనందరావు ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరిశీలించిన వైద్యులు డెంగీగా నిర్ధారించి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. తీవ్రమైన జ్వరంతో ఆమె ఆదివారం చనిపోయింది. ఈ విషయం తెలియడంతో ఆందోళనకు గురైన గ్రామస్తులు ఉదయం నుంచే వరంగల్, హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రుల బాటపట్టారు. జమ్మికుంటలోని ఏ ప్రైవేట్ ఆసుపత్రిలో చూసినా పాతర్లపల్లికి చెందిన వారే కనిపిస్తున్నారు. కొందరు కరీంనగర్, హన్మకొండలలో ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స చేయించుకుం టున్నారు. వైద్యాధికారులు నామమాత్రంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వెళ్లిపోయారని, మురికికాలువల్లో మందు చల్లి చేతులు దులుపుకొన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ శిరీష ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం గ్రామస్తుల రక్తనమూనాలు సేకరించారు. మంత్రి ఈటల రాజేందర్ ఆరా.. విషజ్వరాలపై ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ ఆరా తీశారు. ఇంత జరుగుతున్నా స్థానిక వైద్యాధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
కేరళకు మరో ముప్పు పొంచి ఉందా?
న్యూఢిల్లీ: భారీ వర్షాలు, వరదలకు అతలాకుతలం అవుతున్న కేరళకు మరో ముప్పు పొంచిఉందా? వరద తాకిడి క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో అక్కడ అంటువ్యాధులు విజృంభించే అవకాశం ఉందా? అంటే వైద్య నిపుణులు అవుననే జవాబిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో ఉన్న మందులు నీళ్లలో కొట్టుకుపోయిన నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలితే నిలువరించడం చాలా కష్టమవుతుందని హెచ్చరిస్తున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే కలరా, డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలి తీవ్ర నష్టం చేకూర్చే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. కేరళ ప్రజలు ఇప్పటికే చికున్‌గన్యా, డెంగ్యూ వాధులతో అల్లాడుతున్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. కాగా తమ రాష్ట్రానికి అత్యవసర మందుల్ని అందించి ఆదుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు, ప్రైవేటు ఆసుపత్రులకు కేరళ లేఖ రాసింది. జ్వరం, డయేరియా మందులు పంపండి కేరళలోని 481 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 137 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 19 డిస్పెన్సరీల్లో మందులు నిండుకున్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి సదానందన్ కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. వీలైనంత త్వరగా జ్వరం, దగ్గు, జలుబు, డయేరియా, హైపర్‌టెన్షన్ వంటి రోగాలకు అవసరమైన మందుల్ని అందించాలని కేంద్ర ఆరోగ్య శాఖ, ప్రైవేటు ఆసుపత్రులకు విజ్ఞప్తి చేశారు. కేరళ ప్రభుత్వ విజ్ఞప్తిపై కేంద్రం వెంటనే స్పందించింది. విజయన్ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేరళకు కావాల్సిన అన్నిరకాల మందుల్ని వైమానిక మార్గం ద్వారా పంపిస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోజ్ ఝలానీ తెలిపారు. అలాగే ప్రజలకు సాయం అందించేందుకు వైద్య బృందాలు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. మరోవైపు కేరళ ప్రభుత్వం పిలుపు మేరకు మెడిట్రినా ఆసుపత్రి సాయం చేసేందుకు ముందుకొచ్చింది. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన మెడికల్ క్యాంపులకు తమ వైద్యులను, మందులతో పంపుతున్నట్లు మెడిట్రినా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఈవో పీఎన్ మంజు తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులకు క్యూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వరదల కారణంగా మందులు దెబ్బతినడంతో వైద్యులు రోగులకు ప్రైవేటు ఆస్పత్రులకు సిఫార్సు చేస్తున్నారు. దీంతో చాలా ప్రైవేటు ఆస్పత్రుల్లో భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. కొచ్చిలోని అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఏఐఎంఎస్) ఔట్ పేషంట్ సేవల్ని నిలిపివేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఈ విషయమై అమృత ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ సంజీవ్ సింగ్ మాట్లాడుతూ..‘వైద్యులు, ఇతర సిబ్బంది ఆసుపత్రికి రాలేకపోతున్నారు. మా ఆసుపత్రి గ్రౌండ్ ఫ్లోర్ వరదనీటితో నిండిపోయింది. ఇప్పుడు ఆసుపత్రిలో 900 మంది రోగులు చికిత్స పొందుతుండగా, వీరిలో 150 మంది ఐసీయూలో ఉన్నారు. ఆసుపత్రిలో విద్యుత్, మంచినీటి సరఫరాను కొనసాగించేందుకు మేమంతా పోరాడుతున్నాం. అదనంగా మరో 300 మందిని ఆసుపత్రిలో చేర్చుకుని చికిత్స అందజేస్తున్నాం. వీరిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది’ అని తెలిపారు. -
అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టండి
అధికారులకు మంత్రి కిమ్మనె సూచన శివమొగ్గ : జిల్లాలో అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు జిల్లా ఇన్చార్జి మంత్రి కిమ్మనె రత్నాకర్ సూచించారు. శుక్రవారం ఆయన స్థానిక జిల్లా పంచాయతీ కార్యాలయంలో ఆరోగ్యశాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... అంటువ్యాధులపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలని అన్నారు. ఇందు కోసం ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఇంటికీ కరపత్రాలను అందజేయాలన్నారు. డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ... నగరంలో కోతుల నుంచి వ్యాపించే అంటువ్యాధులు ఈ ఏడాదిలో 41 కేసులు గుర్తించినట్లు తెలిపారు. గత ఏడాది ఈ తరహా కేసులు 147 నమోదయ్యాయని గుర్తు చేశారు. ఈ వ్యాధిపై ప్రతి గ్రామ పంచాయతీలో చైతన్య ర్యాలీలు నిర్వహిస్తూ వ్యాధిగ్రస్తులకు మందులు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ వ్యాధి కేవలం శివమొగ్గ, చిక్కమగళూరు, ఉత్తర కన్నడ, మంగళూరు, ఉడుపి, చామరాజ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తోందని, దీనిపై పూర్తిస్థాయిలో పరిశోధనలు అవసరమని అన్నారు. -
ఎటుచూసినా మురుగే..
చీమకుర్తి, న్యూస్‌లైన్: ఇంటి ముందే దుర్గంధం వెదజల్లుతూ పారుతున్న మురుగు నీరు.. డ్రైనేజీల్లో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలు.. దోమల గోల.. అంటు రోగాల తంటా.. ప్రతి వీధీ ఇంతే.. ప్రతి రహదారీ అంతే.. ఇదెక్కడో మారుమూల పల్లెలో కనిపించే దృశ్యం కాదు. నగర పంచాయతీగా ఆవిర్భవించి గ్రానైట్ ఖిల్లాగా పేరుగాంచి.. కోట్లాది రూపాయల ఆదాయం సమకూర్చుకొనే చీమకుర్తి పట్టణంలోనిది. ముఖ్యంగా ఎంపీడీఓ కార్యాలయానికి 150 అడుగుల దూరంలో ఉన్న వెంకటేశ్వరనగర్, గాంధీనగర్, రామ్రాజీవ్ నగర్ పరిసరాలు రోగాల ఖండాలుగా మారాయి. పట్టణంలోని ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన మురుగు నీరంతా ఈ కాలనీల్లోకి చేరి.. ఇళ్ల మధ్యే మురుగు చెరువులు, వాగుల్లా రూపుదిద్దుకున్నాయి. డ్రైనేజీలు లేకపోవడంతో చిన్నచిన్న రాళ్లనే కాలువలుగా మలచుకొని వ్యర్థ నీరు వెళ్లేలా స్థానికులే ఏర్పాటు చేసుకున్నారు. అపార నిధులు వస్తున్నా.. గ్రానైట్ సీనరేజీ రూపంలో చీమకుర్తి నగర పంచాయతీకి ఏటా రూ 5 కోట్లకు తగ్గకుండా ఆదాయం వస్తుంది. ఈ లెక్కన 12 సంవత్సరాల్లో కనీసం రూ 60 కోట్ల నిధులు మండల పరిషత్ ద్వారా వివిధ అభివృద్ధి పనులకోసం ఖర్చుచేశారు. అదే విధంగా గత పదేళ్లలో ఇద్దరు ఎమ్మెల్యేలు తమ పాలనా కాలంలో చీమకుర్తి మండలంలో రూ 200 కోట్ల దాకా ఖర్చు పెట్టారు. కానీ ఇప్పటికీ మున్సిపాలిటీలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం శోచనీయమని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం వస్తే వర్షపు నీటితో పాటు అంతకు ముందు పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలన్నీ ఏకంగా ఇళ్లలోకే వచ్చేస్తుంటాయి. వెంకటేశ్వరనగర్ పరిసరాల్లో అయితే కనీసం రాకపోకలు సాగించేందుకు కూడా వీలుండదు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్న ఈ కాలనీలను ఇంతవరకు ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించిన సందర్భాలు లేవంటే ప్రజల పట్ల వారి చిత్తశుద్ధి తేటతెల్లం అవుతోంది. చీమకుర్తి నడిబొడ్డు ప్రాంతం గురించి చీమకుట్టినట్లయినా లేకపోవడం శోచనీయం. ఇలాంటి అపరిశుభ్ర వాతావరణం దెబ్బకు కొత్తకొత్త రోగాలన్నీ చీమకుర్తిని చుట్టుముడుతున్నాయి. ఎన్ని కోట్లు ఖర్చయినా వెంటనే భూగర్భ డ్రేనేజీ వ్యవస్థ రూపొందిస్తేనే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించినట్లవుతుంది. -
వరద తగ్గినా.. వదలని బురద
సాక్షి నెట్వర్క్: పదిహేను రోజుల్లో మూడుసార్లు తీరప్రాంతాలను ముంచెత్తిన గోదావరి వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది. అయితే వరదనీరు తొలగిపోవడంతో మిగిలిన బురదతో బాధితులకు కొత్తకష్టాలు వస్తున్నాయి. ముంపు గ్రామాల్లో పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉంది. దోమలబెడద పెరిగిపోవడంతో అంటువ్యాధులు విజృంభిస్తున్నాయి. ఖమ్మం జిల్లా కూనవరం మండలం టేకులబోరుకు చెందిన తలారి వేదవతి(33) మంగళవారం అతిసారతో మృత్యువాత పడింది. సహాయ శిబిరాల్లోనూ బాధితులు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద మంగళవారం సాయంత్రం గోదావరి నీటిమట్టం 45.5 అడుగులుగా, తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారే జీ వద్ద 16.30 నీటిమట్టం అడుగులకు చేరింది. దీంతో అధికారులు ఇక్కడ మూడవ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. వరద తగ్గుముఖం పట్టినా ఖమ్మం జిల్లా వాజేడు మండలంలోని పలు గ్రామాలతోపాటు, ఉభయగోదావరి జిల్లాల్లోని అనేక లంకగ్రామాలు ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. భద్రాచలం పట్టణంలోని రామాలయం ఎదురుగా ఉన్న విస్తా కాంప్లెక్స్, అన్నదాన సత్రం ఇంకా ముంపులోనే ఉన్నాయి. ఉత్తర ద్వారం వద్ద బురదమయంగా తయారైంది. కోస్తాలో చురుకుగా నైరుతి: తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపిన నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం కోస్తాంధ్రలో చురుకుగా ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉపరితల ఆవరణంగా మారిపోయింది. ఛత్తీస్‌గఢ్ దానిని ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాల్లో 5.7కి.మీ ఎత్తులో ఉపరితల ఆవరణం ఏర్పడింది. దీని కారణంగా రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని కారణంగా పలు జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశాలున్నాయి. ఆంధ్రా తీరంలో పశ్చిమ దిశగా గంటకు 45నుంచి 50కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది.