అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టండి | Minister Kimmane reference to the officers | Sakshi
Sakshi News home page

అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టండి

Published Sat, Sep 5 2015 3:53 AM | Last Updated on Sun, Sep 3 2017 8:44 AM

అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టండి

అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టండి

అధికారులకు మంత్రి కిమ్మనె సూచన

 శివమొగ్గ : జిల్లాలో అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి కిమ్మనె రత్నాకర్ సూచించారు. శుక్రవారం ఆయన స్థానిక జిల్లా పంచాయతీ కార్యాలయంలో ఆరోగ్యశాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... అంటువ్యాధులపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలని అన్నారు. ఇందు కోసం ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఇంటికీ కరపత్రాలను అందజేయాలన్నారు. డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ... నగరంలో కోతుల నుంచి వ్యాపించే అంటువ్యాధులు ఈ ఏడాదిలో 41 కేసులు గుర్తించినట్లు తెలిపారు.

గత ఏడాది ఈ తరహా కేసులు 147 నమోదయ్యాయని గుర్తు చేశారు. ఈ వ్యాధిపై ప్రతి గ్రామ పంచాయతీలో చైతన్య ర్యాలీలు నిర్వహిస్తూ వ్యాధిగ్రస్తులకు మందులు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ వ్యాధి కేవలం శివమొగ్గ, చిక్కమగళూరు, ఉత్తర కన్నడ, మంగళూరు, ఉడుపి, చామరాజ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తోందని, దీనిపై పూర్తిస్థాయిలో పరిశోధనలు అవసరమని అన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement