వాడిగా... వేడిగా | After almost ten months of the session of the Committee of Vigilance | Sakshi
Sakshi News home page

వాడిగా... వేడిగా

Published Sun, Dec 29 2013 4:30 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 AM

After almost ten months of the session of the Committee of Vigilance

జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: దాదాపు పదినెలల అనంతరం జరిగిన జిల్లా విజిలెన్స్ మానటరింగ్ కమిటీ సమావే శం శనివారం హాట్ హాట్‌గా సాగింది. నాగర్‌కర్నూల్ ఎంపీ మందజగన్నాధం, జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్‌ల మధ్య వాగ్వాదానికి దారి తీసింది.  సమావేశం ప్రారంభంలోనే హన్వా డ మండలంలోని వేపూర్ గ్రామానికి చెందిన   దళిత మహిళ చెన్నమ్మను  హత్య చేసి  ఏడాది అవుతున్నా నేటికి నిందితులను  ఎందుకు గు ర్తించలేదని, పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైందని  ఎంపీ మందజగన్నాధం అనడం తో ఒక్కసారిగా ఆగ్రహంతో  ఎస్పీ తాము మనుషులమేనని దేవుళ్లం కాదనీ పట్టుకుంటామని జిల్లాలో ఇప్పటి వరకు 249 కేసులు చేశామని అంటుండగా ఎంపీ మధ్యలో అడ్డుపడ్డారు.
 
 దీనితో ఎస్పీ తాను  మాట్లాడిన తర్వాత మాట్లాడండని  ఆవేశంగా అనడంతో ఎంపీ ఆగిపోయారు. ఎంపీ మాట్లాడుతూ  తాను ప్రజాప్రతినిధినని అంత తేలిగ్గా దేవుళ్లమని సమాధానం చెప్పడం  సమంజసమా అనిప్రశ్నించారు. గత 19 ఏళ్లుగా ఎంపీగా ఉన్న అంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం  ఎంతవరకు న్యాయమని అంటుండగా ఎస్పీ కలగజేసుకొనే  ప్రయత్నం చేశారు. దీనితో ‘మీరు మాట్లాడేటప్పుడు నేను అడ్డుతగులలేదు’. అని ఎంపీ అంటూ  దళితుల కేసులు పరిష్కరించకుంటే ఈ సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ప్రతిసారి కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం ఎందుకని తమను సమావేశాలకు పిలవద్దని ఎంపీ అనగా సభకు అధ్యక్షత వహించిన కలెక్టర్ గిరిజాశంకర్ కలుగజేసుకొని సర్దిచెప్పడంతో వారి మాటల యుద్ధానికి తెరపడింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement