manjunatham
-
భార్య ప్రాణాలు తీసుకున్న మర్నాడే భర్త బలవన్మరణం
అనంతపురం: భార్య ఆత్మహత్య చేసుకున్న 24 గంటలు గడవకనే భర్త కూడా భర్త కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు.. సోమవారం సాయంత్రం చిన్నపొడమల గ్రామానికి చెందిన రమాదేవి (24) తాడిపత్రి సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. భార్య ఆత్మహత్యకు పాల్పడిన కొన్ని గంటలకే భర్త మంజునాథ (25) మంగళవారం తెల్లవారుజామున తాడిపత్రి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై పడుకుని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనలో మొండెం నుంచి తల వేరైంది. ఎడమ చెయ్యి మణికట్టు వరకు తెగింది. పెళ్లైన ఐదున్నర నెలల్లోనే దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అన్యోన్యంగా ఉండే ఇద్దరూ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో అర్థం కావడంలేదని గ్రామస్తులు అన్నారు. అయితే రమాదేవి ఆత్మహత్య అనంతరం అత్తింటి వారి అదనపు కట్నపు వేధింపులే కారణమంటూ రైల్వే పోలీసులకు మృతురాలి తల్లిదండ్రులు లక్ష్మీదేవి, రామాంజినేయులు ఫిర్యాదు చేశారు. కొన్ని గంటలకే మంజునాథ్ కూడా ఆత్మహత్య చేసుకోవడంతో అత్త, మామ వేధింపులు తాళలేక తమ ఒక్కగానొక్క కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ రైల్వే పోలీసులకు మృతుడి తల్లిదండ్రులు ఓబుళమ్మ, బాల కుళ్లాయప్ప ఫిర్యాదు చేశారు. పరస్పర ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు జీఆర్పీ సీఐ నగేష్ తెలిపారు. -
వాడిగా... వేడిగా
జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: దాదాపు పదినెలల అనంతరం జరిగిన జిల్లా విజిలెన్స్ మానటరింగ్ కమిటీ సమావే శం శనివారం హాట్ హాట్‌గా సాగింది. నాగర్‌కర్నూల్ ఎంపీ మందజగన్నాధం, జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్‌ల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. సమావేశం ప్రారంభంలోనే హన్వా డ మండలంలోని వేపూర్ గ్రామానికి చెందిన దళిత మహిళ చెన్నమ్మను హత్య చేసి ఏడాది అవుతున్నా నేటికి నిందితులను ఎందుకు గు ర్తించలేదని, పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైందని ఎంపీ మందజగన్నాధం అనడం తో ఒక్కసారిగా ఆగ్రహంతో ఎస్పీ తాము మనుషులమేనని దేవుళ్లం కాదనీ పట్టుకుంటామని జిల్లాలో ఇప్పటి వరకు 249 కేసులు చేశామని అంటుండగా ఎంపీ మధ్యలో అడ్డుపడ్డారు. దీనితో ఎస్పీ తాను మాట్లాడిన తర్వాత మాట్లాడండని ఆవేశంగా అనడంతో ఎంపీ ఆగిపోయారు. ఎంపీ మాట్లాడుతూ తాను ప్రజాప్రతినిధినని అంత తేలిగ్గా దేవుళ్లమని సమాధానం చెప్పడం సమంజసమా అనిప్రశ్నించారు. గత 19 ఏళ్లుగా ఎంపీగా ఉన్న అంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం ఎంతవరకు న్యాయమని అంటుండగా ఎస్పీ కలగజేసుకొనే ప్రయత్నం చేశారు. దీనితో ‘మీరు మాట్లాడేటప్పుడు నేను అడ్డుతగులలేదు’. అని ఎంపీ అంటూ దళితుల కేసులు పరిష్కరించకుంటే ఈ సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ప్రతిసారి కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం ఎందుకని తమను సమావేశాలకు పిలవద్దని ఎంపీ అనగా సభకు అధ్యక్షత వహించిన కలెక్టర్ గిరిజాశంకర్ కలుగజేసుకొని సర్దిచెప్పడంతో వారి మాటల యుద్ధానికి తెరపడింది.