
సాక్షి, అమరావతి: ‘సచివాలయ’ ఉద్యోగాల రాత పరీక్షలకు సంబంధించి శనివారం నుంచి హాల్ టికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న ఆన్‌లైన్ వెబ్ పోర్టర్లలోనే హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ శుక్రవారం సూచించారు.
శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆన్‌లైన్ హాల్ టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపారు. 1,26,728 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు మొత్తం 12.69 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి సెప్టెంబర్ 1, 3, 4, 6, 7, 8 తేదీల్లో ఉదయం, సాయంత్రం.. రెండు పూటలా రాతపరీక్షలు జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment