త్వరలో ‘సచివాలయ’ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్‌ | Another Notification For Andhra Pradesh Village Secretariat Jobs | Sakshi
Sakshi News home page

త్వరలో ‘సచివాలయ’ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్‌

Published Mon, Dec 23 2019 4:19 AM | Last Updated on Mon, Dec 23 2019 4:19 AM

Another Notification For Andhra Pradesh Village Secretariat Jobs  - Sakshi

సాక్షి, అమరావతి: మిగిలిపోయిన సచివాలయ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు వీలుగా జిల్లాల్లో పోస్టుల వారీగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలను సేకరిస్తున్నారు. ఏ జిల్లాలో ఏ పోస్టులో ఎన్ని ఉద్యోగాలు భర్తీ కాకుండా మిగిలిపోయాయో సోమవారం సాయంత్రం నాటికి తెలపాలంటూ పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్‌ ఆదివారం అన్ని జిల్లాల కలెక్టర్లకు సమాచారమిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాల వారీగా ఖాళీ పోస్టుల వివరాలను పంపాలని సూచించారు. అనంతరం ఆ వివరాలను సంబంధిత శాఖలకు పంపి నోటిఫికేషన్‌ జారీకి చర్యలు చేపట్టనున్నట్టు పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement