సాక్షి, అమరావతి : కోవిడ్–19 వ్యాధిని సమర్థంగా అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వలంటీర్ల నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర కోవిడ్ ప్రత్యేకాధికారి ఎం.గిరిజాశంకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంకా ప్రకటనలో ఏముందంటే..
► వివిధ ఆస్పత్రుల్లో అదనంగా అవసరమయ్యే వైద్య నిపుణులు, పారా మెడికల్ సిబ్బందిని సమకూర్చేందుకు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం సహకారంతో కోవిడ్ వారియర్స్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
► 13 జిల్లాల్లోని 271 మెడికల్ కళాశాలలు/డెంటల్/యునాని/ఆయుర్వేద/నర్సింగ్ కళాశాలలు, ఇతర వైద్య అనుబంధ కోర్సులు చదివే విద్యార్థులు కోవిడ్ వలంటీర్లుగా నమోదు చేసుకోవచ్చు.
► ఆసక్తి ఉన్న వైద్యులు, ప్రత్యేక వైద్య నిపుణులు, నైపుణ్యం కల్గిన నర్సులు, పారా మెడికల్ సిబ్బంది తదితరులు కూడా కోవిడ్ వారియర్స్‌గా పని చేసేందుకు ముందుకు రావాలి. వీరి సేవలను ఆస్పత్రుల్లో, క్వారంటైన్ సెంటర్లలో వినియోగించుకుంటాం.
► వలంటీర్లుగా పనిచేసినవారికి భవిష్యత్తులో ప్రభుత్వం చేపట్టే రిక్రూట్‌మెంట్‌లలో ప్రాధాన్యం ఇస్తాం.
► వలంటీర్ల సేవలను వారు ఎంపిక చేసుకున్న జిల్లాల్లోనే వినియోగించుకుంటాం. ఆసక్తి కల్గినవారు health.ap.gov. in/CVPASSAPP/Covid/ Volunteerjobs వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి.
కోవిడ్ వలంటీర్ల నియామకానికి దరఖాస్తులు
Published Thu, Apr 9 2020 5:53 AM | Last Updated on Thu, Apr 9 2020 5:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment