సాక్షి, తణుకు: కరోనా వ్యాప్తి నివారణకు వైద్యులు,పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు అన్నారు.శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి సమయంలో తాను మాత్రం ఎందుకు ఇంట్లో ఉండాలనే ఉద్దేశ్యంతో పోలీసులు,పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పనిచేశానని ఆయన తెలిపారు.
(ఏపీలో 12కు చేరిన కరోనా కేసులు)
ఈ కరోనా వల్ల ధనిక దేశాలు కూడా విలవిలలాడుతున్నాయని.. మనకి ఆ పరిస్థితి రాకుండా చూడాలని ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని.. ఇళ్లకే పరిమితమవ్వాలని సూచించారు. వైద్యులు,పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు.. కరోనా నివారణలో ముఖ్యపాత్ర పోషిస్తున్న వలంటీర్ల వ్యవస్థను ఆయన అభినందించారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని సులభంగా గుర్తించగలుగుతున్నారని కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment